రాయలసీమలో కన్నా కోస్తాలోనే నేరాలు ఎక్కువా!

రాయలసీమ ను ఉద్దేశించి, పులివెందుల ను లక్యంగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. నేరాలు ఎక్కువగా జరుగుతున్నది కోస్తా ప్రాంతంలో అయితే రాయలసీమను అవమానించే విధంగా చంద్రబాబు మాట్లాడతారా అంటూ రాయలసీమ ప్రముఖులు విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి సమితి వ్యవస్థాపకుడు, విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి ఎ. హనుమంతరెడ్డి దీనిపై తీవ్రంగా స్పందించారు.

కాపుల నేత రంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతిలో దీక్ష చేస్తుండగా బస్సులో వచ్చి హతమార్చిన సంస్కృతి ఎవరిదని విజయవాడలో 1988 లో జరిగిన ఘటన గురించి ప్రశ్నించారు.అదే రంగా అన్న రాధాని మోసగించి చంపిన సంస్కృతి ఎవరిదని నిలదీశారు. అదే ఎత్తుగడ ముద్రగడ పద్మనాభం పై కూడా ప్రయోగించారన్న అనుమానం కలుగుతోంది. అది సాధ్యం కాక , రాయలసీమ ప్రజలపై నిందలు మోపుతున్నారా అని హనుమంతరెడ్డి ద్వజమెత్తారు. కారంచేడు వంటి హింసాత్మక ఘటనలు ఎవరి సంస్కృతి, అలాగే ఆస్తి కోసం చిన్నారి వైష్ణవిని చంపిన సంస్కృతి ఎవరిదని ఆయన అన్నారు. శ్రీలక్ష్మి వంటి ఎందరో అమాయక స్త్రీలను చంపిన సంస్కతి ఎవరిదో ప్రజలకు తెలియనది కాదన్నారు.

2014లో రేప్ కేసుల్లో కృష్ణా జిల్లాలో 144, పశ్చిమ గోదావరిలో 139, తూర్పు గోదావరి జిల్లాలో 77, గుంటూరు జిల్లాలో 87 నమోదు అయితే తరచు సీఎం బాబు ప్రస్తావించే పులివెందుల ఉన్న కడప జిల్లాలో 29, కర్నూల్‌లో 31, అనంతపురంలో 35, చిత్తూరులో 49 కేసులు నమోదు అయ్యాయని హనుమంతరెడ్డి లెక్కల చిట్టా విప్పారు.క్రైమ్ రేట్ ఒక లక్ష జనాభాకు గుంటూరులో 620, కష్ణాలో 623, పులివెందుల ఉన్న కడపలో 182 నమోదుఅయిందని అన్నారు.

ఇదే ప్రకారం రాయలసీమ ప్రజలను అవమానిస్తే ప్రత్యేక రాస్ట్రం కోసం యువత ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం కోసం ఏది బడితే అది మాట్లాడితే ఎంత ప్రమాదమో అర్దం చేసుకోవాలి. ఒక ప్రాంత మనోభావాలను దెబ్బతినేలా పాలకులు మట్లాడడం వల్ల హనుమంతరెడ్డి వంటివారు లెక్కల చిట్టా విప్పారనుకోవాలి.

http://kommineni.info/articles/dailyarticles/content_20160213_8.php?p=1455346727826

15 Comments

Filed under Uncategorized

ఆపరేషన్ ఆకర్ష్!

ఆపరేషన్ ఆకర్ష్!
హైదరాబాద్: తెలంగాణలో పోయిన పరువును కాపాడుకునేందుకు ఆంధ్రాలో ఆపరేషన్ ఆకర్ష్‌కు టిడిపి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు సరికదా బెడిసి కొట్టాయి. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిడిపి చిత్తుగా ఓడిపోవడం, ఎమ్మెల్యేలు వరుసపెట్టి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నివ్వెర పోతున్నారు. దీంతో కొంత మంది మంత్రులు రంగంలోకి దిగి కొంత మంది వైకాపా ఎమ్మెల్యేలకు ఎరవేసి పార్టీలోకి తెస్తే ఆధిపత్యం నిలబెట్టుకున్నట్లవుతుందని, ఆంధ్రాలో టిడిపి బలంగా ఉందనే సంకేతాలు ఇచ్చినట్లవుతుందని భావించారు. కాని ఈ ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.

http://andhrabhoomi.net/content/state-937

టిఆర్ఎస్ లో టిడిఎల్పి విలీనం-ఎర్రబెల్లి లేఖ
మూడు రోజుల క్రితం చెప్పినట్లే జరిగింది. టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు లేఖరాసే అవకాశం ఉందని ఈ వెబ్ సైట్ లో పేర్కొన్నట్లే సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు స్పీకర్ మదుసూదనాచారికి ఒక లేఖ రాస్తూ టిఆర్ఎస్ లో విలీనం అవడానికి పది మంది ఎమ్మెల్యేలు అంగీకరించారని తెలిపారు.గురువారం నాడు టిఆర్ఎస్ కార్యాలయంలో సమావేశం అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 4వ నిబంధన ప్రకారం తమ విలీనానికి అనుమతి ఇవ్వాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. శాసనసభలోనూ తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని లేఖలో కోరారు. ఈ లేఖపై తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు, సాయన్న, ప్రకాశ్ గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవం కృష్ణారావు, కేవీ వివేకానంద గౌడ్, ధర్మారెడ్డి, రాజేందర్ రెడ్డి సంతకాలు చేశారు.దీంతో తెలంగాణ శాసనసభ లో టిడిపి పక్షం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.అయితే రేవంత్ నాయకత్వంలోని వారు మరో లేఖ రాసి దీనిపై వివాదపడాలి.లేదా ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని కోరవచ్చు.

http://kommineni.info/articles/dailyarticles/content_20160212_22.php?p=1455259924495

6 Comments

Filed under Uncategorized

TDP faces defections after poll rout

Among the remaining nine TDP MLAs, T Prakash Goud (Rajendranagar), Arekapudi Gandhi (Serilingampalli), and Sandra Venkataveeraiah (Sattupalli) are said to have been in talks with the TRS leaders and sources said it was just a matter of time before the switch sides.

Even the names of senior leaders including Erraballi Dayakar Rao, TDP floor leader in the legislative assembly, and the party working president A Revanth Reddy are doing rounds as potential defectors. While Dayakar Rao said to have been interested in joining the TRS, Revanth Reddy is reportedly cozying up to the Congress.The sources said the TDP MLA from Narayanpet might follow Revanth Reddy in case the latter joins the Congress.

http://timesofindia.indiatimes.com/city/hyderabad/TDP-faces-defections-after-poll-rout/articleshow/50924504.cms

21 Comments

Filed under Uncategorized

బెడిసికొట్టిన అంచనాలు

-మంత్రుల్లో మొదలైన చర్చ
-ఓటర్లను నిలబెట్టుకోలేకపోతే కష్టమే
-హైదరాబాద్‌ ఫలితాలే ఉదాహరణ
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి

రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ అన్నీ సవ్యంగానే ఉన్నాయనే ఆలోచనతో ముందుకెళుతున్న అధికారపార్టీ నాయకత్వానికి కాపు ఉద్యమం, హైదరాబాద్‌ ఎన్నికలపై అంచనాలు బెడిసికొట్టాయి. అతి అంచనాలు ప్రచారంతో ఏడాదిన్నరగా ప్రజలకు దూరమయ్యామనే భావన నాయ కత్వంలోనూ, సాక్షాత్తూ మంత్రుల్లోనూ వ్యక్తమవుతోంది. క్యాబినెట్‌ సమావేశాల్లోనే ఈ విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నా మంత్రులను నోరెత్తనీయ కుండా చేయడం ద్వారా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. కాపు ఉద్యమ నేపథ్యంలో మంత్రుల్లోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇదే తరుణంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బిజెపితో జట్టుకట్టినా చావు దెబ్బతిని టిడిపి ఒక్క సీటుకే పరిమితమైంది. నిరంతరం హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని ప్రచారం చేసుకుంటున్నా సీట్లు ఎందుకు రాలేదో ఆత్మావలోకనం చేసుకోవాల్సి ఉంటుందని మంత్రులు సూచిస్తున్నారు. కాపు ఉద్యమ విషయంలోనూ ఆ సామాజిక వర్గం మంత్రులను చులకనగా మాట్లాడారనే భావన వ్యక్తమవుతోంది. మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ఒక్కరే ముద్రగడపై ఎదురుదాడికి దిగుతున్నారు. మిగిలిన వారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నారాయణ ఓట్ల రాజకీయం నుండి రాలేదు కాబట్టి, క్షేత్ర వ్యవహారం తెలియదని ఓ మంత్రి సిఎం క్యాంపు కార్యాలయం వద్ద విశ్లేషించారు. ఇదే రీతిలో ముందుకు పోతే ఓటర్లను నిలబెట్టుకోవడం కష్టమని క్యాబినెట్‌ సమావేశం నుండి బయటకు రాగానే మరో సీనియర్‌ మంత్రి అభిప్రాయపడ్డారు. ‘అంతా మీ చేతుల్లోనే ఉందంటూ’ మీడియా ప్రతినిధులతో అంటూ ఆయన బయటకెళ్లిపోయారు. ఇంతవరకు రాష్ట్రాన్ని మీడియా ప్రచారంతోనే నడుపుకొస్తున్నారని, నియోజకవర్గాల్లో ప్రజలకు ఇవేమీ పట్టవని ఆయన వ్యాఖ్యానించారు. ‘ నియోజకవర్గానికి కోటి రూపాయలు కూడా కచ్చితంగా ఇవ్వలేని పరిస్థితులుంటే ఇక పెట్టుబడులొస్తాయని ప్రజలకు చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు’ అని ఆయన పెదవి విరిచారు. క్రమంగా మంత్రుల్లో పెరుగుతున్న అసహనానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తాయి. మరోవైపు లోకేష్‌కు నేరుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా కట్టబెట్టిన తరువాత, ఆయన తొలిసారి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎక్కడా జనాన్ని ఆకర్షించలేకపోయారని, అపరిపక్వమైన వ్యాఖ్యలు విమర్శలతో టిఆర్‌ఎస్‌కు ఊతమిచ్చినట్లయిందని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే మీడియా లైజనింగ్‌ అధికారులను పెట్టి చేతులు కాల్చుకున్న ‘చినబాబు’ గ్రేటర్‌లోనూ సరైన వ్యూహరచన చేయలేకపోయారని విమర్శిస్తున్నారు. నగరంలో పలువురు టిడిపి నాయకులూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం లేకుండా పదవులు కట్టబెడితే ఇదే పరిస్థితి దాపురిస్తుందని మంత్రులు ఆవేదన చెందుతున్నారు. సభ్యత్వం గొప్పగా చేయించారని చెప్పుకున్న నాయకత్వం ఇప్పుడేం సమాధానం చెబుతుందని విజయవాడలో ఓ సీనియర్‌ నాయకుడు ప్రశ్నించారు.

కొంపముంచిన అతి అంచనాలు
పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు అతి అంచనాలే కొంప ముంచాయని, అన్నీ తానై వ్యవహరిస్తున్న సిఎం కాపుల ఉద్యమాన్ని తమపై తోసేశాని మంత్రులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరుగుతోందని, దీనికితోడు పంచాయతీల్లో కనీస పనులు చేయలేక పోవడమూ ఇబ్బంది కలిగించే అంశమేనని చెబుతున్నారు. రాజధాని పేరుతో వీటన్నిటినీ కప్పిపుచ్చి ఇప్పుడు కాపు నాయకత్వ బాధ్యత అనడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయాన్ని మంత్రులే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కృష్ణయ్య విషయంలోనూ నాయకత్వం కొంత అనుమానాస్పదంగా వ్యవహరిస్తుందనే విషయాన్నీ ప్రసా ్తవిస్తున్నారు. కాపుల విషయంలో సున్నితమైన అంశమంటూ కృష్ణయ్య ఏం చేసినా ఆయన్ను అదుపు చేయకపోవడం నాయకత్వ లోపమేనని మంత్రులు చెబుతున్నారు. అధికారం లోకి వచ్చిన తొలినాళ్లలో సర్వేల్లో అన్నీ బాగున్నాయని చెప్పిన నాయకత్వం ఇప్పుడు ఎందుకు సర్వేలు చేయించడం లేదని మరో మంత్రి ప్రశ్నించారు. పార్టీ నాయకత్వం తీరుపై మంత్రుల్లోనూ నెమ్మదిగా అసహనం పెరుగుతోంది.

http://www.prajasakti.com/Content/1754617

18 Comments

Filed under Uncategorized

తెలుగుదేశం కనుమరుగేనా?

హైదరాబాద్: తెలంగాణలో టిడిపి క్రమంగా కనుమరుగవుతోంది. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టిడిపికి ఘోర పరాజయం ఎదురు కావడమే ఇందుకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతా ల్లో ఫలితాలు ఎలా ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమకు తిరుగులేదని టిడిపి ఇప్పటివరకూ విశ్వసిస్తూ వచ్చింది. నగరానికి చెందిన పలువురు టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించినా, తిరిగి అసెంబ్లీకి ఎన్నిక కావాలంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓట్లే కీలకం కాబట్టి టిఆర్‌ఎస్ తరఫున గెలువలేమనే అభిప్రాయంతో పార్టీ వీడేందుకు కొందరు ఎమ్మెల్యేలు ఇష్టపడలేదు. ఒక ఎమ్మెల్యే ఏకంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి, మీడియాతో మాట్లాడిన తరువాత తన మనసు మార్చుకున్నారు. గ్రేటర్‌లో ఊహించని విధంగా టిడిపి పరాజయం పాలు కావడంతో పలువురు టిడిపి సీనియర్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు.

తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి గెలుచుకున్నది ఒకే ఒక కార్పొరేటర్ సీటు. ఇక శాసనసభ విషయానికి వస్తే తెలంగాణలో టిడిపి తరఫున 15 మంది విజయం సాధిస్తే, ప్రస్తుతం తొమ్మిదిమంది మిగిలారు. వీరిలో ఆర్ కృష్ణయ్య పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ ఫలితాల తరువాత వీరిలో ఎంతమంది మిగులుతారనే కలవరం పార్టీ నాయకుల్లో మొదలైంది. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో బిజెపి- టిడిపి ఉమ్మడిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచాయి. అయితే వరంగల్‌లో సైతం అదే విధంగా పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కలేదు.

‘నేను ఇక్కడే పుట్టాను, చెడ్డీలు వేసుకుని ఇక్కడే తిరిగాను’ అంటూ తాను స్థానికుణ్నేనని చెప్పుకునేందుకు లోకేశ్ గ్రేటర్ ఎన్నికల్లో ఎన్నో పాట్లు పడ్డారు. అలాగే చంద్రబాబు చివరి రెండు రోజుల్లో సుడిగాలి పర్యటన చేసి, రోడ్‌షోలు నిర్వహించారు. అయినా తండ్రీకుమారుల శ్రమ వృథా అయింది. ఆంధ్ర ప్రాంతం వారు ఎక్కువగా నివసించే శివారు ప్రాంతాల్లోనే ప్రచారం విస్తృతంగా చేసినా ఫలితం లేకపోవడంతో పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి. త్వరలో జరగనున్న నారాయణఖేడ్ ఉప ఎన్నికలోనూ టిడిపి పరిస్థితి చెప్పుకోదగిన విధంగా లేదు. గ్రేటర్ ఫలితాల తరువాత అక్కడ టిడిపి శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి. ఖేడ్‌లో ప్రధానంగా పోటీ టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే సాగుతోంది.

http://andhrabhoomi.net/content/ts-306

6 Comments

Filed under Uncategorized

సీట్ల సునామి

TRS-99, MIM-44, BJP-4, Congress-2, TDP-1
ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టిడిపి ఈ ఫలితాలతో కంగుతింది. తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న టిడిపి గ్రేటర్ ఫలితాలతో పూర్తిగా నిరాశ నిస్పృహలో పడిపోయింది. గ్రేటర్ ఓటర్లపై ఆశలు పెట్టుకున్న చాలామంది నాయకులు టిడిపిలోనే కొనసాగుతున్నారు. గ్రేటర్‌లో ఏ ఒక్క అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోనూ టిడిపి ప్రభావం చూపలేకపోయింది.

మొదటి నుంచి టిడిపికి అండగా నిలిచిన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఇతర సామాజిక వర్గాలు గ్రేటర్‌లో టిఆర్‌ఎస్‌కు ఓటు వేశాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం అదే. ఆ పార్టీ సానుభూతిపరులు బాబుపై వ్యతిరేకతతో టిఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. ఆంధ్ర ఓటర్లపై ఆధారపడ్డ టిడిపికి చివరకు సామాజిక వర్గం నుంచి మాత్రమే గట్టి అండ లభించింది.

హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయనా గ్రామీణ ప్రాంతాల్లో టిఆర్‌ఎస్ తరువాత అంతో ఇంతో ప్రభావం చూపేది కాంగ్రెస్ పార్టీనే. గ్రేటర్‌లో మేం ఘోరంగా దెబ్బతిన్నా టిడిపి తుడిచిపెట్టుకు పోవడం వల్ల ఇక భవిష్యత్తు రాజకీయాలు టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే ఉంటాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

http://www.andhrabhoomi.net/content/s-72

8 Comments

Filed under Uncategorized

హైదరాబాద్ ఐటీ కథ.

కంప్యూటర్లు ఎవరు కనిపెట్టారు? రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పితామహుడెవరు? సాఫ్ట్‌వేర్ విప్లవానికి సృష్టికర్త ఎవరు? మొబైల్స్ ఎవరు తీసుకొచ్చారు? హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలబెట్టిందెవరు? అసలు ఐటీకి పర్యాయపదం ఎవరు?.. ఇంకెవరు నారా చంద్రబాబునాయుడే కదా! అని జవాబు చెప్పేయబోతున్నారా? ఆగండాగండి.. అదంతా ఓ పెద్ద అబద్ధం!! ఇన్నాళ్లూ ఆయన చెప్పుకొన్న గొప్పలు గోబెల్స్ ప్రచారాన్ని మించిపోయి అందరూ ఆ అబద్ధాల మాయలో పడిపోయారు. నిజానికి ఐటీ అభివృద్ధి ఆలోచనా ఆయనది కాదు, ఆ రంగం పురోభివృద్ధికి ఆయన ఆద్యుడూ కాదు! అసలు నగరంలో హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగిన ఆ రోజుల్లో చంద్రబాబు కేవలం ఎన్టీఆర్ శిబిరంలో ఓ సాదాసీదా నాయకుడు మాత్రమే!! హైదరాబాద్ ఐటీ చరిత్ర ఈ హైటెక్ అబద్ధాలతోనే నిండిపోతున్నవేళ, ఆనాటి ఐటీ, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కారకులు, బాధ్యుల ఆనవాళ్లే కనిపించకుండా పోతున్నవేళ.. నాటి పరిణామాలను, సందర్భాలను, ఆధారాలతో సహా అందిస్తున్న నమస్తే తెలంగాణ విశేష కథనం ఇది.

http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/hyderabad-it-story-1-2-502044.html

18 Comments

Filed under Uncategorized