126years vs 2years

కాంగ్రెస్‌ హైకమాండ్‌ మాటంటే శిలాశాస నం. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే. అధిష్ఠానం మాట ధిక్కరిస్తే శంకరిగిరి మాన్యాలు తప్పవన్న అనుభవంతో కొమ్ము లుతిరిగిన మహామహులు కూడా అధి ష్ఠానం శరణువేడుతుంటారు.కానీ..పులి లాంటి కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆంధ్రప్ర దేశ్‌కు చెందిన ఒక మాజీ ఎంపీ ముందు పిల్లి అయిపోయింది. తన కార్యక్షేత్రానికే వచ్చి, తన పార్టీ ఎమ్మెల్యేలనే తీసుకువచ్చి తనను సవాల్‌ చేసిన జగన్‌ ఇచ్చిన ఝలక్‌తో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా షాక్‌ తిన్నారు. ఏం చేయాలో తెలియక, నోట మాట రాక బేలగా మారారు. తన దయాదాక్షిణ్యాలతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం బతుకుతోందంటూ 36 ఏళ్ల యువనేత విసిరిన సవాలుకు జవాబు లేక అధిష్ఠానం గింగిరాలు తిరుగుతోంది. జగన్‌ వెంట నిలిచిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలో వ ద్దో కూడా తెలియక అంతర్మథనం చెందు తోంది. తన చుట్టూ అంతమంది మేధా వులు ఉన్నా, ఒక్కరి మేధస్సూ ఎమ్మెల్యే లను అడ్డుకోకుండా పోయిందన్న క్రోధంతో అధినేత్రి అల్లాడిపోతున్నారు. తాను టికెట్లు ఇచ్చి గెలిపించిన 28 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలను ఢిల్లీకి తీసుకువచ్చి, నేరుగా తననే సవాల్‌ చేసిన జగన్‌ గుండెధైర్యానికి సోనియాగాంధీ నోట మాట రాక అవాక్క వలసిన దుస్థితి ఏర్పడింది. ఓదార్పు యాత్ర నుంచి జగన్‌ను వెన్నాడి, ఆయనంతట ఆయనే పార్టీని వీడేలా కాంగ్రెస్‌ నాయ కత్వం పన్నిన వ్యూహం విజయవంత మయినప్పటికీ.. ఆ తర్వాత అదే తన పాలిట శాపంలా మారుతుందని, అదే జగన్‌ తనను సవాల్‌ చేస్తారని ఏమాత్రం ఊహిం చని కాంగ్రెస్‌ నాయకత్వం మంగ ళవారం నాటి జగన్‌ బలప్రదర్శనతో బిత్తర పోయింది. జగన్‌ వెంట వచ్చిన28 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలపై ఎలాంటి చర్యలు తీసు కోవాలో కాంగ్రెస్‌ అధిష్ఠానం మల్లగుల్లాలు పడు తోంది. వారిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వం మునిగి పోతుందన్న భయం, తీసుకోకపోతే ఇంత పలకుబడి, ప్రతిష్ఠ ఉన్న కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో మరగుజ్జు అవు తుందన్న సంకేతాలు వెళతాయన్న ప్రతిష్ఠ అధి ష్ఠానాన్ని వెన్నాడుతోంది. దీనితో రాష్టప్రతి పాలన పెట్టి తన పరువు కాపాడుకోవడమే పరిష్కారంగా భావిస్తున్నట్లు సమాచారం. అసలు పరిస్థితి ఇంతదాకా వస్తుందని గ్రహించని నాయకత్వం రాష్ట్ర పరిణామాలపై అంచనాకు రాలేని ఇన్చార్జి వీరప్పమొయిలీ, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డిపై ఆగ్రహంతో ఉంది. ప్రధానంగా ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఘోర వైఫల్యం చెందారని మండిపడుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. జగన్‌ను అణచివేస్తానన్న హామీతో సీఎం పదవి పొందిన కిరణ్‌, ఆచరణలో తాను వైఫల్యం చెందడమే కాకుండా, అధిష్ఠానం పరువును మంటకలిపారన్న మండిపాటుతో ఉంది. సీఎం.. పార్టీ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని, జగన్‌ను అంచనా వేయడంలో కిరణ్‌ అనుభవం-వయసు సరిపోలేదన్న వాస్తవాన్ని నాయకత్వం ఆలస్యంగా గ్రహించింది. ముఖ్య మంత్రి కిరణ్‌, ఇన్చార్జి వీరప్ప మొయిలీ, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ అంతా కలసి అధిష్ఠానాన్ని అప్రతిష్ఠ పాలుచేశారని, రాజకీయాల్లో రెండేళ్ల అనుభవ మయినా లేని జగన్‌ ముందు తలదించుకునేలా చేశారని నాయకత్వం భగభగలాడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ చివరకు ఒక మాజీ ఎంపీ దయాభిక్షపై ప్రభుత్వ మనుగడ సాగుతోందన్న సంకేతాలు వెళ్లడాన్ని జీర్ణించు కోలేకపోతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకువచ్చి, జగన్‌ తనను సవాల్‌ చేస్తే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోవలసి వచ్చిందని ఉడికిపోతోంది. ఇంతమంది ఉండి కూడా ఎమ్మె ల్యేలను ఢిల్లీకి వెళ్లకుండా నియం త్రించలేకపోయారన్న ఆగ్రహంతో నాయకత్వం ఊగిపోతోంది. ఢిల్లీ చరిత్రలో రాత్రి 8.30 వరకూ ధర్నా చేసిన ఏకైక నేతగా జగన్‌ రికార్డు సృష్టించడం, దానికితోడు రైతుల కోసం అరెస్టయ్యారన్న సానుభూతి ప్రజల్లో సంపాదిం చుకోవడం అస్సలు మింగుడుపడకుండా ఉంది.జగన్‌ ఢిల్లీ యాత్ర తేదీని ప్రకటించిన రోజునే ఎమ్మెల్యేలు ఢిల్లీకి రాకుండా చూడాలని అహ్మద్‌పటేల్‌, ప్రణబ్‌ముఖర్జీ, మొయిలీ వంటి మేధావులు ముఖ్యమంత్రి కిరణ్‌ను హెచ్చరించినా.. ఆయన ఆ మేరకు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్లే పరిస్థితి చేయి దాటి పోయిందని అధిష్ఠానం భావిస్తోంది. ఆయన జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, హైదరాబాద్‌లో ఉండి ఫోన్లపై నడిపించడం వల్ల తాము జగన్‌ ముందు అప్రతిష్ఠ పాలుకావలసి వచ్చిందని అధిష్ఠానం మండిపడుతోంది

45 Comments

Filed under Best Articles on YSR and Jagan

45 responses to “126years vs 2years

 1. post it as new Article :

  Ramoji , Babuji , Hanumanji and Soniaji doing really really good for Jagan?

  Yes !!! we need to say thanks for these four guys. dont scold them , Dont feel bad about them..
  However ,whenever ,whatever they tried to do defame jagan all the time jagan becomes more famous in AP.
  why ?
  whether it is good or bad they always talk or publish about jagan..
  this makes through out the year Jagan name on all kinds of media
  and media is making jagan nama smarana in 2010 . so we can call last year
  “Jagannama samvatsaram”.
  In AP even from Kids to senior citizens, east to west , seema to telangana.. low calss to high class.. poor to posh ..every one knows about Jagan…they brought more awareness in people about Jagan.
  If Ramoji and Babuji wont talk about jagan ,,,, then who will talk about jagan… how jagan news will come to media … how they can focus on jagan…
  So we need these 2 guys ..and I really appriciate Ramoji for his haaaaaaaaaard work …and I will pray ramoji has to publish more articles in yellow papers.
  Same thing he did for YSR and YSR got into power 2 times .. I hope ramoji hand is very lucky(when he is writing bad ) for YSR family…
  becuase of them most of the non kamma’s become united .. I have never seen ” reddys strongly ..solidly ” supporting congress.. becuase of ramoji
  and babuji in 2009 reddies strongly support and work for YSR.

  Please post your comments it if you are not agree with this article….
  What hanuma and sonia made good for jagan?
  continue….

 2. chaitanya

  My dear Jagan babu.

  If Jagan is a Bacha….U must find an answer why TDP,Congress,TRS are only giving statements targeting him.

  If Jagan is a Bacha…U must find an answer why the 125 year old congress is unable to face him.

  If Jagan is a Bacha…U must find an answer why there isnt a day passing without his name uttered in everyhour news.

  If Jagan is a Bacha…U must find an answer why u really bothered all the way to come over to this site and type this comment…pity you.

  If Jagan is a Bacha….150 MLAs wudnt have signed for his chief ministership.

  If Jagan is a Bacha….There wudnt be crowds thronging towards him like we are.

  The real Bachas my friend are those people who dont know how to react and what to do when they face problems like telangana.

  The real Bachas my friend are those who donnot respond to a state which is suffering from famine,inflation,debts,diseases and yet they donnot utter a word.

  And finally The real Bacha my friend are you supporting them.

  Coming to money power I fell that word very funny. Do you think CBN is poor below poverty line and Do you think Sonia Gandhi is earning less than one dollar a day. Think before you talk something.

 3. sharath

  Even i am worried about the Party name.. more people are aware of YSR name than rajjana.. But lets wait and see..

 4. sharath

  Best way to reply is to ignore it

 5. Oks YSR Abhimani From Nellore

  జగన్‌ పార్టీలోకి కాకాణి ప్రవేశానికి రంగం సిద్ధం

  నెల్లూరు, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి:మాజీ కడప ఎంపి వెైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో ఏర్పాటు చేయనున్న పార్టీలో చేరే విషయమై జడ్పీ ఛెైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నివిధాలా రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన తన అనుచరులు, అభిమానులతో చర్చలు జరిపి పార్టీలో చేరేందుకు సిద్ధమవడమే కాకుండా అందుకుగాను ఈ నెల 20వ తేదీన ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకున్నారు. నగరంలోని పొదలకూరురోడ్డులో గల ఆయన నివాసగృహమే ఇందుకు వేదిక కానుంది. ఆ రోజు జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, నేతల సమక్షంలో అక్కడ ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభలో తాను జగన్‌ పార్టీలో చేరే విషయమై కాకాణి ప్రకటించనున్నారు. ఈ విషయంలో ఆయనకు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితర కాంగ్రెస్‌ ప్రముఖుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురెైనప్పటికీ వారికి తాను ఇప్పటికే జగన్‌ పార్టీలో చేరే విషయమై ఒక నిర్ణయానికి వచ్చేశానని, అయితే మీపట్ల తనకున్న అభిమానం, గౌరవం అలాగే ఉంటుందని తెలియజేశారు.

  తాను జిల్లాలో జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్ర నాటికే జగన్‌ వర్గం వెైపు వెళ్లి ఆయనకు అండగా నిలవాల్సివున్నప్పటికీ కేవలం ఆదాల ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే విషయమై ఆలస్యం జరిగిందని చెప్పినట్లు తెలిసింది. అయితే ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాత్రం ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించుకోవాలని, ఒకవేళ జగన్‌వెైపునకు వెళ్లాలనుకుంటే అప్పుడే తొందరేముంది? జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి వెళ్లొచ్చుగదా అని కూడా సూచించినప్పటికీ తాను ఇప్పటికే యువనేత జగన్‌కు మాట ఇచ్చానని, ఎట్టి పరిస్థితిలోనూ దానిని తప్పనని సున్నితంగానే వారికి నచ్చచెప్పినట్లు సమాచారం. అయితే పొదలకూరు మండలం ఆదాల ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండడం, కాకాణి స్వగ్రామం తోడేరు అదే మండలంలోది కావడంతో అక్కడ గట్టి పట్టున్న కాకాణిపెై ఆదాల ఆచితూచి వ్యవహరించాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. పొదలకూరు మండలానికి చెందిన ప్రముఖులెైన నేతలపెై మాత్రం ఒత్తిడి తీసుకురావద్దని ఆదాల కాకాణిని కోరినట్లు తెలిసింది. జిల్లా రాజకీయాలలోకి కేవలం ఐదేళ్ల క్రితమే వచ్చిన కాకాణి గోవర్థన్‌రెడ్డి నేడు ఒక బలమైన నేతగా ఎదగడంతో ఆయనను కాంగ్రెస్‌ పార్టీని వీడి జగన్‌ వెైపునకు వెళ్లనీయకుండా చేసే విషయంలో ఆదాల చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయమై ఆదాల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుె ళ్లినప్పటికీ ఆయన కాకాణిని ఆపే ప్రయత్నం చేయకపోగా ‘ఇప్పటికే వెళ్లిపోయాడు కదా’ అని సిఎం నుంచి స్పందన రావడంతో చేసేది లేక ఆదాల మిన్నకుండిపోయినట్లు సమాచారం.

  వెనుక బండిలో ఆదాల ?
  కాంగ్రెస్‌ పార్టీలో ఉంటున్న కాకాణి గోవ ర్థన్‌రెడ్డి జగన్‌ వెైపునకు వెళ్తున్న నేపథ్యంలో ఆయనతో సన్నిహిత సంబంధాలున్న సర్వేపల్లి శాసనసభ్యులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి సైతం అదే మార్గంలో పయనించే అవకాశముందని జిల్లాలోని రాజకీయవాదులు భావిస్తున్నారు. అయితే కాకాణికి కేవలం జడ్పీ ఛెైర్మన్‌ పదవి 6 నెలలు మాత్రమే ఉండగా, ఆదాలకు మరో మూడున్నరేళ్లు పదవి ఉండడం వల్లే ఆయన పార్టీని వీడే విషయంలో తొందరపడడం లేదనేది వారివాదన. తనకు సమీప బంధువు, సన్నిహిత సంబంధాలున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంత్రిపదవిపెై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదాలకు అది దక్కకపోగా తన ప్రత్యర్థి వర్గానికి చెందిన ఆనంను మరింత అందలం ఎక్కించడంతో అధిష్ఠానం పట్ల ఆదాల గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే జగన్‌ పార్టీకి భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో అప్పుడే తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదనేది ఆదాల భావనగా తెలుస్తోంది. అయితే కాస్తా ముందు వెనుకగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి సైతం జగన్‌ వర్గం వెైపునకు వెళ్తారనే ఊహాగానాలు మాత్రం జిల్లా రాజకీయ వర్గాల్లో బలంగానే వినిపిస్తున్నాయి.

 6. rajnjj

  i was talking about karnataka senario i think karnataka mlas who were disqualified cannot contest elections for next 7 years

 7. Sivasankara Reddy

  Hi Friends,

  I wish you & your family a very happy pongal …

  Regards,
  Siva Sankara Reddy.

 8. rajnjj

  nawaz we also need too talk about our negatives uruke if every one only talks about positives its not good for jagan i dont want to jagan be another chiranjeevi u know how it its with cinema people just praise praise praise evadu undadu cinema valla chuttu negatives chepaanki jagan is young and hes just launching his party so negative kuda chepte positives ga malchukuntadu ani oka small feeling

 9. rajnjj

  konda surekha should be little careful when she talks congress planning too disqualify her disqualification ante she cannot contest elections for next 7 years so within rules off election commison lo maltadite manchidi and more over even if she resigns now its very tough too win because off telenagna sentiment trs vadu ettukuladu surekha seat time being calm ga undi talk with in rules off anti defetion laws matladete it will be good her poltical future and jagans

  • rohit

   It is not true disqualified mla,s can contest elections from th next day.
   Last time 3 trs rebel mlas were disqualified i think t jaya praksh reddy was disqualified and he contested next election

   • rajnjj

    i was talking about karnataka senario i think karnataka mlas who were disqualified cannot contest elections for next 7 years

    • b'lore

     //i was talking about karnataka senario i think karnataka mlas who were disqualified cannot contest elections for next 7 years//

     100% Wrong!!

     in one scenario it’s true that disqualified MLA’S canot eligible for election for next 7 years.

     But they can contest with another party at any time.

     disqualify ayyina they can join in another party and they can content at any time

     so nothing to worry
     //some one correct me if i’m wrong. i’m telling this because i’m in b’lore now and i knw some thing more abt k’taka politics.

 10. rajnjj

  chill nawaz hope its a statergy

 11. Nawaz

  sir rajnjj garu meru kastha samyamana patisthara yenduku sir meku aantha aathram okka vela party name Rajana Rajyam party aaeithe already sakshi newspaperlo sakshi tv lo eepatiki chepevalu kadandi kastha oopikapatandi sir, already ee blog lo challa members chapinatu this may be one stratagy aaundavachukada we all already suspected you as covert please don’t blam sakshi TV or sakshi paper otherwise it will not be good.

  Please don’t write negitive comments this my request to you onbehalf of all the members of this blog please don’t demotivate us even if the name of the party is Rajana Rajyam Party we don’t have any problem we ready to accept what even Jagan anna feel better.

  So once again I request you don’t write negitive comment here I alway see you writing negitive and demotivative comment so please don’t write such comments.

 12. Sivasankara Reddy

  See Konda Surekha comments..
  ************************************

  నాపై వేటు వేస్తే ప్రభుత్వం కూలిపోతుంది: కొండా సురేఖ
  వరంగల్‌ : తనపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వేటు వేయాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆలోచిస్తే తేనేతుట్టెను కదిల్చినట్టేనని పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. తనపై చర్యలు తీసుకుంటే జగన్‌ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని, దాంతో ప్రభుత్వం కూలడం ఖాయమని సురేఖ హెచ్చరించారు. తనపై వేటు వేయాలనుకుంటే సోనియాకు బహిరంగ లేఖ రాసిననాడే చర్యలు తీసుకునేవారు… ఇప్పుడు అలాంటి సాహసం పార్టీ చేయదని భావిస్తున్నట్లు సురేఖ చెప్పారు.

 13. rajnjj

  ee rajana rajyam party entoo who ever advised this name too jagan is misleading him my bet would be sakshi ppl sms lo ede peru vachidi sir ani chepi untaru aa sakshi bhajana gang

  • Sivasankara Reddy

   Dont worry about party name at this moment .. It will not be Rajanna rajyam ..
   Please wait for few more days … we will get clear picture ..

 14. Nawaz

  JAGAN ANTE

  J: JAGAMANTA
  A: ABIMAANAM
  G: GALA
  A: ANDHRA(I)
  N: NETA

  Y : YOUNG
  S : SMART
  J : JOYFUL
  A : ATTRACTIVE
  G : GLORY
  A : AFFECTIONATE
  N : NEAT PERSON
  WOULD BE CHIEF MINISTER OF ANDHRA PRADESH

  from jaganisthecm blog….

 15. celebrating jala deeksha….

  jaganisthecm.blogspot.com

 16. Oks YSR Abhimani From Nellore

  Hi All,

  Sakshi District edition lo add ivvalantee procedure enti, evarikanna idea vundaaa, vuteee plase share cheyyandi.

  And Kakani Govardhan Reddy Garu 20 vaa tedina official gaaa announce cheseeestarani talks.

 17. 13 more MLAs with us: Jagan camp

  http://timesofindia.indiatimes.com/city/hyderabad/13-more-MLAs-with-us-Jagan-camp/articleshow/7273165.cms

  By making this claim, the implication of the Jagan camp was that the Congress MLAs with him were not only the 21 who took part in the fast in Delhi, but also these 13 legislators, thus taking the total number of Jagan loyalist MLAs to 34.

  According to sources, Congress legislators Dwarampudi Chandrasekar Reddy (Kakinada) and Kapu Ramachandra Reddy (Rayadurg) personally telephoned Jagan and conveyed their explanation for not joining him in the fast. Other MLAs M Rajesh Kumar (Chintalapudi), Perni Nani (Machilipatnam), Jogi Ramesh (Pedana), Malladi Vishnu (Vijayawada), Labbi Venkata Swamy (Nandikotkuru), Shajahan Basha (Madanapalli), M Prasada Raju (Narsapuram), P Ramanjaneyulu (Bhimavaram), Raja Ashok Babu (Tuni) and R Varaprasad (Razole) also communicated their reasons for absence to various Jagan loyalists, the sources claimed.

  Read more: 13 more MLAs with us: Jagan camp – The Times of India http://timesofindia.indiatimes.com/city/hyderabad/13-more-MLAs-with-us-Jagan-camp/articleshow/7273165.cms#ixzz1AsGJSPRH

  • Pileru

   Please paste the matter.

   • ROHIT

    13 more MLAs with us: Jagan camp
    Hyderabad: Building up pressure on chief minister N Kiran Kumar Reddy and the Congress high command, Jagan loyalists claimed on Wednesday that at least 13 Congress MLAs loyal to their leader had conveyed to them that they could not make it to New Delhi to join Jagan in his oneday fast on Tuesday because of other pressing engagements.
    By making this claim, the implication of the Jagan camp was that the Congerss MLAs with him were not only the 21 who took part in the fast in Delhi, but also these 13 legislators, thus taking the total number of Jagan loyalist MLAs to 34.
    According to sources, Congress legislators Dwarampudi Chandrasekar Reddy (Kakinada) and Kapu Ramachandra Reddy (Rayadurg) personally telephoned Jagan and conveyed their explanation for not joining him in the fast. Other MLAs M Rajesh Kumar (Chintalapudi), Perni Nani (Machilipatnam), Jogi Ramesh (Pedana), Malladi Vishnu (Vijayawada), Labbi Venkata Swamy (Nandikotkuru), Shajahan Basha (Madanapalli), M Prasada Raju (Narsapuram), P Ramanjaneyulu (Bhimavaram), Raja Ashok Babu (Tuni) and R Varaprasad (Razole) also communicated their reasons for absence to various Jagan loyalists, the sources claimed.
    Moreover, these MLAs apparently said that they would make it a point to be present at the next political event or meeting that Jagan would hold and display their solidarity to him. “Jagan’s strategy is clear. He wants to create instability for the Kiran regime,” according to a high command loyalist.
    Jagan loyalist Ambati Rambabu claimed that the chief minister and other PCC leaders threatened many of these MLAs of dire consequences in case they took part in the fast in Delhi. “They dissuaded Chintalapudi MLA Rajesh from going to Delhi by saying that if he does so, the posting of his father in-law, who is collector of Guntur, would be affected,” Rambabu said.
    After holding two successful meetings, Jagan is now hinting at expediting the process of damaging the Congress image not only in the state but also at the Centre. Sources close to Jagan said that he would encourage his loyalist Congress MLAs to defy the party and continue to embarrass it by publicly criticising the Kiran regime.
    Before toppling the government, Jagan reportedly wants to show to the people that the Congress has failed on all counts and that he would usher in better governance.
    Strategists in the Jagan camp are busy identifying the lacunae in the Kiran government so that that the information could be provided to the MLAs as fodder.

 18. NLR

  If anyone has any chance of speaking/asking questions during the telephone conversations during panel interviews in TV9, please use this to highlight the partiality shown by TV9 towards TDP, so that everyone in AP knows about it.
  We should increase the awareness among common people , so pls go for it.
  Also we should write letters/emails to this TV9 idiots to remind them about ethics in journalism.

  If they still dont change they will get washed away like their fellow kula gajji yellow channels after the next elections. People are not fools like in the 1980’s.

  None can stop JAGAN….He is Born to Win…..

  • Ram

   Aditionally, we should form teams and spread the positive messages about Jagan in all blogs, and website news comments. To start with we need to identify which are the sites that are anti-jagan, and pro-jagan, and analyse which sites are more popular. Based on this, we should spend energies on the high visibility sites.

   • Gopalakrishna

    It is waste of time. All those who spend time in blogs/sites are fanatics. Instead of concentrating for votes of educated people it is better to convince illitrates.

 19. rajnjj

  tv9 gadi gurunchi ekkuva patichkonadi tv9 gadu eenadu aj succeesfully divided jagan from congress with the support off musali congress leaders u can just go through their storys since ysr s demise vadi agenda telsipodi and more over tv9 gadu evadu money padeste adi vadi channel dont think too much aboutt ittttt just ignore it vadu vedu emi ana jagan is here too stay and fight

 20. Nawaz

  Hi Sharath garu total how many people contact details we got just send it to Manajagan (moderator)so that he can make it avilable to all of us.

  and request to the people who have not yet given there details please post here are send to sharath garu to his email id sharathkatpally@gmail.com
  or to me at sarfraj.nawaz2002@gmail.com

  Plese provide the following details.

  Name:
  Job:
  Phone:
  Email:
  Native:
  Current Location:
  About me:

  • sharath

   sorry nawaz garu for the delay in replying.. i received around 30 names which i complied in excel sheet and sent it to all. I can forward that to you if you did not receive it

 21. Ranga Raju

  TV9 is all out against Jagan .. please stop watching this TV channel .. it ran a story that Jagan’s support of MLAs is dwindling .. where as it is growing everyday .. I guess we need to Brand aa naalugu (tv9,etv, andhra jyothy and studio N) as yellow channels and stop watching and encourage others to avoid these channels .. so called “For Better society channel” is working hard for betterment of TDP.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s