Nammaku Nammaku Ee Maayani ..

Ranga Raju

—–

కోటి కాంతులతో లక్షల గొంతుకలతో మార్పు కోసం ప్రజల కోసం ప్రజా సేవయే పరమార్థంగా మదర్ తెరిసా, అంబేద్కర్, జ్యోతి రావు ఫూలే వంటి మహనీయుల ఆదర్శం తో ఏడుకొండల వాని సాక్షి గా ప్రజా రాజ్యం కలుషిత రాజకీయ ప్రపంచం లో ఉద్భవించింది, కాని దిశా నిర్దేశిత గమనాలు లేకుండా, చేసిన బాసలు మరిచి పుట్టిన పురిటిలోనే పోలియో సోకిన బాలుడి లాగ పడుతూ లేస్తూ, పుట్టి ముంచి చివరకు ఉప్పొంగిన జనాభిమానం మీద ఉప్పు నీళ్ళు చల్లుతూ మృత సముద్రం లాంటి పార్టీ తో కలిసి పోవడాని ఉవ్విలురుతున్నది.

ఏమి సాదించడానికి ఈ మార్పు? ఎవరినికి ఉద్ధరించాదినికి ఈ ఎత్తుగడలు? ఇదేనా ఇన్నాళ్ళు వేచిన ఉదయం? ఏమైంది ప్రజా సంక్షేమం? స్వార్థ రాజకీయాలకు ఇంక సెలవని సెలవిచ్చినారే ఇదేనా తమరి ఉకదంపుడు బుకాయింపు? పార్టీ ని నడుపుకోలేక నిస్తేజం, అచేతనమే ఆయుధాలుగా ధరించి అశాశ్వతమైన పదవుల కోసం వెంపర్లాడి, విలువలని వలు వలు గా వలిచి ఢిల్లీ రాణి ముందు మోకరిల్లి, పిలుపు కోసం ఆత్రంగా,ఆశగా ఒంటి కాలు జపం చేస్తున్న నాయకుడిని చూసి జాలి వేస్తుంది.

కమ్ముకు వచ్చిన ఈ మాయ ఒక కల మాత్రమె, అవసరం తీరినప్పుడు ఆవగింజంత కనికరం లేకుండా మెడ పట్టుకొని అతః పాతాళానికి తొక్కి వేయగల పార్టీ తో కలయికలు మన చేతగాని తనానికి ప్రతీకలు. పదవులతో మనిషికి వన్నె రాదు, కాని వున్నపదవికి వన్నె తెస్తే రాని పదవులు అవంతకవే వస్తాయి. తెర మీద వందల మంది విరోధులను ఒంటి చేత్తో తుత్తినియలు
చేసిన, నటించిన ఆ రుద్ర వీణ ఈ రోజు నడి సంద్రం లో చుక్కాని లేక కొట్టుమిట్టాడు కుంటున్న పార్టీ కి ఆపద్భాందవుడిలా ఆపన్న హస్తం అందుకుంటూ దానికి రాజకీయపు ఎత్తుగడ రంగు పులిమి పంచ రంగుల సినిమా మన ముందుకు రాబోతుంది.

విశ్వాసం కోల్పోతున్న పార్టీ కి అనైతిక, అప్రజాస్వామిక ఉపిరిలు ఉది నిలబెట్టాలనుకుంటే నిట్ట నిలువునా మునిగి పోవడం ఖాయం. రాజకీయ జీవిత అంతానికి గోతులు తవ్వుకొంటున్న అమాయకపు నటులు నిజ జీవితం లో అంతగా రాణించలేరు. చరిత్ర చెపుతున్న రాజకీయ నాయకుల గాథ ఒక్కటే ప్రజల పక్షాన నిలబడిన వాడిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు, లేకపోతే రాజకీయ సమాధి చేస్తారు. ధర్మో రక్షతి రక్షతః

23 Comments

Filed under Uncategorized

23 responses to “Nammaku Nammaku Ee Maayani ..

 1. CS

  Chiranjeevi once said YSR was inspiration for him to come into politics. Today he is saying 2004-09 full of scams thats y I have not joined congress, but now seeing raids on various corporate houses and VIP make me feel that congress is fighiting against corruption I am joining congress. WHAT AN OPPURTUNIST.

  I don’t know whether floating a party during YSR regime was a smart move by chiranjeevi or not its debatable. But in present situation if he is a leader, MAGADU aithe this is the right time for him to emerge and prove himself. He is joining at a time when resentment among people is growing against Congress.

  As AMBATI said yes he and his bava sold (not a mortagage) his property (PRP) to a profit like any producer do. What better people can expect from such baffoons. He claims he will do samajikanyam with congress, I am sure he cannot even give mla tickets to present 14 MLAs next time ( I am sure about this).

  Any way lets look forward it could prove advantage to YSJ, hope YSJ will do his homework well. Let us be prepared for TRS merger too!!!!

 2. sridhar

  Gurava Reddy garu…….ur comments are very good…..its having 100% meaning.

 3. rohit

  The Praja Rajyam’s second-rung leaders and cadre are to join the Congress or Y.S. Jagan’s group in the city after the party merged with the Congress on Sunday.
  http://www.deccanchronicle.com/vijayawada/pr-second-rung-leaders-sail-congress-713

 4. rohit

  PRP cadre livid with Chiru TIMES NEWS NETWORK
  Resentment Strong In ‘Kapu-Dominant’ Godavari Dists
  Hyderabad/Kakinada: Senior leader Kotagiri Vidyadhar Rao claimed that 80 per cent of the cadre and second rung leaders in PRP were okay with the merger and only 20 per cent were upset with the plan. But contrary to his claims, the PRP cadre in both Godavari districts and the coastal belt is livid with Chiranjeevi for ‘mortgaging’ their interests.
  The undercurrent of resentment and anger on the merger is very strong in the Godavari districts, considered to be stronghold areas of Kapu-dominant PRP. “It is difficult for us to get along with the Congress workers. We fought hard against Congress during the 2009 elections to win it for Chiranjeevi in villages. How can he simply announce merger of the party in Delhi without bothering about our interests,” fumed Yalla Rambabu of Sahapuram village in Karapa mandal.
  Another PRP worker, Kondamudi Satyanarayana of Uppada village, said they were not ready to reconcile to the merger. “It would have been better for Chiranjeevi to give outside support to Congress or be an alliance partner. But not the merger,” he said angrily.
  He said intellectuals, educationists, social activists and BC leaders came out openly and supported Chiru in the hope that he would provide a strong alternative to Reddy-dominant Congress. “They were vexed with Congress and its political path. How could he join the same party against whom we all fought and shouted slogans,” he questioned.
  Several PRP workers came out on the streets of Kakinada, Bhimavaram, Amalapuram, Palacole, Anaparthi, and other towns and villages to discuss the merger. “We thought Chiru would bring about a social change with his social justice slogan. We are orphaned now as we would be butchered in the caste-dominant Congress politics,” rued Boda Kotaiah of Anaparthi.
  While grassroots workers and second rung leaders of PRP were seething with rage, senior leaders felt the merger could help resurrect the workers lying low after the drubbing in the 2009 elections. Senior PRP leader and former MLA Thota Trimurthulu supported Chiranjeevi’s decision as the state cannot afford another election in the near future.

 5. Gurava Reddy

  అనివార్యమైన విలీనం జరిగింది. రాష్ట్రప్రజానీకం మొత్తం మానసికంగా ఎప్పుడో సిద్ధమయిపోయిన విషయం అందరికి తెలిసిందే. తప్పులేదు. కాంగ్రెస్ కి కొంచెం ఊపిరి పీల్చడానికి అవకాశం దొరికింది. చిరంజీవికి నేనూ ఒక ముఖ్య నాయకుడిని అని చెప్పుకోవడానికి ఆస్కారం కలిగింది. ఆయన కోసం పిఆర్పీ పార్టీ కోసం రక్తాన్ని, డబ్బుని, ఆశలని, అశ్రువుల్ని ధారపోసిన అశేష అభిమానుల కోసమే ఈ విలీనం అయితే చాలా మంచిది. కాని తన అవసరాల కోసం తన కుటుంబం కోసం అయితే మాత్రం అయితే మాత్రం ఇది ఒక చారిత్మాత్మిక తప్పిదం. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఒక పాడి గేదని (జగన్) ఇంట్లోంచి తరిమి ఒక వట్టి గేదని (చిరంజీవి) పక్కింట్లోంచి తెచ్చి గుంజకి కట్టేయడంలోనే వారి ప్రతిభేంటో అర్ధమవుతుంది. ఇరు పార్టీల అవసరాలమీరకు జరిగిన ఒప్పందం ఇది. కాంగ్రెస్ కి రాష్ట్రంలో మిగిలిన మూడేళ్ళు అధికారం కావాలి, తర్వాత ఎన్నికలలో ఒక ఆకర్షణీయమయిన ముఖంతో ప్రజల ముందుకి పోవాలి. పార్టీ పెట్టేప్పుడు ఉన్న ప్రజాబలం, మద్దత్తు చాలావరకు కోల్పోయిన చిరంజీవికి ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం కావడం, వచ్చే ఎన్నికలనాటికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉండటం అత్యంత అవసరం. ఈ వీరి వీరి స్వప్రయోజనాల్నిదేశం లేక రాష్ట్ర చారిత్మాత్మిక అవసరాలు అని సోనియమ్మ చిరంజీవి అనుకుంటే ప్రజలు నమ్మడానికి వారేమి వేర్రోల్లు కాదు.

  వైఎస్స్ జగన్ వర్గానికి సంభందించిన నాయకులకి ఈ విలీనం పైన స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కళ్ళకి కనబడని ఇంకో విలీనం జరిగింది. జగన్ అనే శక్తిని ఎదుర్కొనడానికి చంద్రబాబు, టిడిపి, ఆ రెండు పత్రికలు ఎప్పుడో కాంగ్రెస్ లో విలీనం అయ్యారు. విచిత్రమేమిటంటే ప్రజలకి ఈ విషయం ఎప్పుడో అవగతమయింది. వైఎస్స్ జగన్ కి సంభందించినంత వరకు ఇది చిరంజీవి పిఆర్పిని కాంగ్రెస్ కి ధారబోయడం కంటే, తనని తాను సోనియమ్మకి సమర్పించుకోవడం కంటే ముఖ్యమయినది. ఈ విషయాన్ని ప్రజల ముందు పదే పదే ఉంచి వారి మద్దత్తు ఈ అనయితిక పొత్తుకు వ్యతిరేకంగా కూడగట్టాలి.

  ఒక్క వైఎస్స్ జగన్ అనే శక్తిని ఎదుర్కొనడానికి రాష్ట్ర రాజకీయ పక్షాలన్నీ ఏకమవుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఆయనకీ, ఆయనవెనుకున్న వైఎస్సార్ అంశ కి , యావత్తు రాష్ట్ర ప్రజలకి, మరియు వైఎస్సార్ అభిమానులకి ఇదో పెద్ద విజయం. ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రం లో వైఎస్సార్ కి ఉన్న మంచిపేరుకి , చనిపోయినా ఆయనకున్న శక్తికి ఇదో నిదర్శనం. సమర్పించుకోగానే మేడం మాట ప్రకారం తూఛ తప్పకుండా వైఎస్సార్ ని విమర్శించిన చిరంజీవికి ఒక వ్యక్తిత్వం అనేది లేదు అని నిరూపించుకున్నాడు. ఇవి ఏ రోజు ఒక మాటిచ్చి నిలబెట్టుకొనే ఉద్దేశమే లేని ఒక త్రుచ్చ చవకబారు బజారు వ్యక్తి అనే మాటలు. సూర్యుడి లాంటి వ్యక్తిపై ఉమ్మేస్తే తనముఖమే ఖరాబవుతుందనే కనీస జ్ఞానం లేని ఒక మూర్ఖుడు అనే మాటలు. మంత్రి పదవి తీసుకో, బావమర్దిని రాజ్యసభకి పంపు, గవర్నమెంటులో పలుకుబడి పెంచుకో. కాని ప్రజలకి కల్లబొల్లు కబుర్లు చెప్పి, రాష్ట్రంలో పార్టీని స్థాపించి, ఒక పద్దెనిమిది ఎంఎల్ఏలని కాంగ్రెస్ ని విమర్శిస్తూ గెలిపించిన ప్రజలకి కనీస గౌరవం ఇవ్వకుండా తన అవసరాల కోసం డిల్లీలో సోనియమ్మకి సమర్పించిన చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ అంటే నచ్చక గెలిచిన పదవికి రాజీనామా చేసి బయటకి వచ్చిన వైఎస్స్ జగన్ కి ఉన్న తేడా నక్కకి నాగలోకానికున్నంత అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. వైఎస్సార్ ఉన్నప్పుడు గొంతే పెగలని ఈ నటనాయకుడికి ఈ రోజు సోనియమ్మ వాపు చూసి తనకి చాలా బలమోచ్చింది అని ఆ మహానాయకుడి మీద అవాకులు చవాకులు వాగడం చిరంజీవి వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి. సోనియా గాంధీ ఆదేశాలమేరకు వైఎస్సార్ అనే కాంగ్రెస్ రక్షకుడి గుర్తుల్ని రాష్ట్ర ప్రజల గుండెల్లోంచి తొలిగించడానికి చేసే ఒక విఫల ప్రయత్నంలో ఒక విహెచ్, ఒక డిఎల్, ఒక కేకే కంటే ఈ చిరంజీవి గొప్ప కాదు అనే విషయం ప్రస్పుటపరుస్తున్న చందం ఆయన అవివేకం మాత్రమే. ఇది ఎప్పటికీ జరిగే అవకాశమే లేదనే విషయాన్ని ప్రజలు ప్రతి రచ్చబండలో, ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో తెలియజేస్తున్నారు.
  (to be continued)

  • CVR

   Super Gurava Reddy

  • Gurava Reddy

   ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఈ ప్రభుత్వాన్ని ఎలా రక్షించుకుందామని చూస్తుంటే చిరంజీవి అల్లు అరవిందులు ఎలా బేరం ఆడి వారి పిఆర్పి పార్టీని అమ్మి సోమ్ముచేసుకున్దామని ఆలోచించారు కాని ప్రజా శ్రేయస్సు ఎవరికీ పట్టకపోవడం ప్రజలు గమనించారు. పవిత్ర తిరుపతిలో సామాజిక న్యాయం నినాదంతో డెబ్భై లక్షలమంది ప్రజల ఆమోదంతో పుట్టిన పీఆర్పిని ధిల్లీ లోని ఇటాలియన్ సోనియా గాంధీ పాదాలముందు తాకట్టు పెట్టబడింది. పదవీ వ్యామోహంతో చేసిన ఈ నిర్వాకం చాలదన్నట్టు సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సోనియా గాంధీతోనే సాధ్యం అని బుకాయింపు చేస్తున్న ఈ నటనా నాయకుడు ఎవర్ని మోసం చేస్తాడు ఇంకా?
   ఇక తెలుగు దేశం చంద్రబాబు విషయానికొస్తే రెండు కళ్ళు నాలుగు నాలికలు పదహారు అబద్ధాలు సిద్ధాంతంతో రాష్ట్రం మొత్తం మీద ప్రజామోదం కోల్పోయి అన్ని వర్గాలకి దూరం అయిపోయి ఇది ఒకప్పుడు కాంగ్రెస్ మీద పోరాటం చేసిన పార్టీ ఏనా అనిపించే రీతిలో ఉంది. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే సంఖ్యాబలం సులభంగా దక్కే పరిస్థితి ఉన్నా కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం అనే వెర్రి మాటలు మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించకుండా ఇంకొక ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం ఎప్పుడూ ఎల్లప్పుడూ అవిశ్వాసం ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉండాలనే ఒక గురుతర బాధ్యతని మర్చిపోయిన ఈ తెలుగు దేశం ఒక ప్రతిపక్షం గానే కాదు ఒక రాజకీయ పక్షంగా కూడా ఉండటానికి అర్హత కోల్పోయింది. ఎంతసేపటికి నాటకాలు తప్ప ప్రజా సమస్యలపైన కూడా స్పందించడం మానేసింది. ఈ తెలుగు దేశం పార్టీ ఎంత సేపు ఇలా తన కర్తవ్యాలని మరిచి మసలుతుందో అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
   వైఎస్స్ జగన్ ని చాలా మంది చాలా అన్నారు. అతని సిద్ధాంతాలు అతను చేసే అలుపెరగని పోరాటాలు, ప్రొద్దున ఏడింటి నుంచి తెల్లవారి నాలిగింటి వరకు చేసిన ఓదార్పు యాత్ర అతనిలోనే పట్టుదలని సూచిస్తున్నాయి. కాంగ్రెస్ హై కమాండ్ సోనియా గాంధీలు చేస్తున్న అన్యాయాలని ఎదిరించి వారిపై తిరుగుబాటు జండాను ఎగురవేసిన ఈ నవతరం కధానాయకుడిగా, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పై పైకి పెంచిన అతన్ని అభినందిచాల్సింది పోయి అదే కాంగ్రస్ తో అదే సోనియా గాంధీతో బయట (చిరంజీవి) లోపల (చంద్రబాబు) ఒప్పందాలు కుదుర్చుకుంటున్న ఈ తెలుగు రాజకీయ నాయకులు జగన్ అవినీతి సంపాదనంటు నోరు పారేసుకోవడం రొజూ సాగే ఒక బుర్రకధ. ఇది వినీ వినీ వారికి తట్టే ఒక ప్రశ్నకి వీరి సమాధానం ఏమిటో మరి? అంత సొమ్ముచేసుకుని ఎక్కడో భవంతుల్లో కూర్చుని, సోనియమ్మ అడుగులగు మడుగులొత్తుతూ హాయిగా ఇంకా సంపాదించుకోకుండా ప్రతి క్షణం భార్యకి బిడ్డలకి దూరం ఉంటూ ప్రజల కోసం ఆరోగ్యం చెడిపోయేలా పగలనక రాత్రనక ప్రజల మధ్యలోనే ఉంటూ ఈ దీక్షలు, ఈ ఓదార్పులు, ఈ ప్రజా పోరాటాలు ఎందుకు చేస్తున్నాడో? ఘనతవహించిన రెండెకరాల ఆసామి ఈ రోజు రెండు లక్షల కోట్లు సంపాదించి, సామాజిక న్యాయం అని గొంతిత్తి సోషోచ్చేదాక అరిచిన ఇంకో పెద్దమనిషి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా పన్ను కట్టకుండా డిల్లీ బజార్లో ఒక విదేశి వనిత ఇంటి ముందు అదే పనిగా వేచి వేచి పార్టీని అమ్మేసి ఒక పోరాట తెలుగు బిడ్డని విమర్శించడం తప్పు తప్పు. వారు మూర్ఖులు కావచ్చు కాని ప్రజలు కాదు. ఎందుకంటే ఈ ప్రజలే 2004, 2009 లో పత్రికలు, రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఊదరకోట్టినా వారు పట్టించుకోకుండా వారి పక్షానే ఉన్న ఒక మహా నాయకుడికి పట్టం కట్టారు. ఇదే చరిత్ర త్వరలోనే ఖచ్చితంగా పునరావృతం అవుతుంది!

 6. NLR

  Excellent article ….. Rangaraju garu…..

  Avvaru anni chesina …..Jayam manadhe….

  JAGAN…..Born to win……

 7. Gopalakrishna

  RETAIL SELLING : Selling Party Tickets

  WHOLESALE: Selling Party itself.

  Allu bava: Evadu vadu? evadu vadu? Nalaka kostha.

 8. Ranga Raju

  నేను సైతం…. నేను సైతం…
  అవినీతి అగ్ని కి ఆహుతవుతాను, మునిగి పోతున్న నావికుల ఆర్తనాదానికి వెర్రి గొంతుకనవుతాను అంటూ ఉవిల్లురితూ, ఉహలోకం లో విహరిస్తూ అవినీతి లో మండుతున్న దానవ రాజ్యం అగ్నికీలల్లో ఆహుతవుతుంటే నేను సైతం అంటూ ఆ మురికి ని ఒళ్లంతా రాసుకొని, మిగిలి వున్న పదవుల కోసం ప్రజా సంక్షేమమనే నాటక సౌరభానికి తెర లేపాడు మన పద్మ భూషణుడు. పదవీ వ్యామోహం లో తెలుగు జాతి ఆత్మగౌరావాన్నిగంపగుత్తగా కొంగ్రొత్త సామ్రాజ్ఞి పాదాల చెంత కేజీల లెక్క సవినయము గా సమర్పించుకొని, మురిసి, ఆశపడి ఉప్పొంగుతున్న సంతోషాన్ని అణుచుకొంటూ ప్రజల మీద భారం అపడానికని బొంకితే, నటిస్తే అమాయక ప్రజలు నమ్ము తారనుకొంటే అంత కన్న అవివేకం ఇంకోటి వుండదు.

  కోటలు దాటే ఆవేశం, స్పూర్తినిచ్చేనటనాభిశయం తో లక్షలాది అభిమానులను సంపాదించుకున్న గ్యాంగ్ లీడర్, కోతల రాయుడు గా కుప్పి గంతులు వేస్తుంటే, తొట్టి గ్యాంగ్ లతో చెట్టాపట్టాలు వేసుకొని వెలిగే సూర్యుడిని మురికి అర చేతితో మూయించి, అస్త్రాలు త్యజించి రాజకీయ నిష్క్రమణ కి అత్యంత చేరువకి చేరుకున్నాడు. అవినీతి ని కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తానని డాంబికాలు పలికి ఇప్పుడు ఆ విషవృక్షం ఫలాలను అందుకోడానికి ఆరాటపడుతున్న సన్నివేశం అంతగా రక్తి కట్టలేదు. చేతగాని తనానికి రాజకీయపు రంగు అద్ది కొంగ జపం చేస్తూప్రజలని నమ్మించాలని చూడడం మూర్ఖత్వం.

  ఇంతలాంటి సంబడానికి అంత పెద్ద ఆదర్శాల? పార్టీ ఎందుకు పెట్టి నట్టు? ఏమి వుద్దరించినట్టు, ఇప్పుడు ఏమైనాదని అనాలోచిత నిర్ణయం తీసుకున్నట్టు? ఇప్పడు అవసరం అనిపించలేదా ఆ అమాయక అభిమానులు, శ్రేయోభిలాసులు? మార్పు కోసం అంటూ తనే మారిపోయిన రాజకీయ నాయకుల ఎత్తుగడలు చూసి ఉసర వెల్లులు సిగ్గు పడుతున్నవి. మోస పోయిన ప్రజల చేతిలో ఓటు అనే ఆయుధం వుంది, అది కన్నెర్ర చేస్తే రాజకీయ సమిధలు కాక తప్పదు.

 9. rajnjj

  ee priyadarshini ram gadi over action ki evaru ana fans unarara ikkada adi abba vadu vadi voice edo cheyali ankuntadu kani hes better off screen thuu ni abba aa big scrolls entira ni abba we cant evrn watch the visuals on the screeen tht too big black fonts on the upper part off the screen visuals are not eye friendly ani prorams lo scrolls vestaru on upper part off the screen with big font ppl cant see the pics or visuals plz change it any knows this idiot priyadashini rams email id id plz post it here adi abba manamu number kavali kani not like cbns STUDION or ABN AJ or some other tdp channel

 10. rajnjj

  eee congres na kodukulu or prp valu 18%antqaru as far as i knw all those are individual candiatees votes oka 1 or 2 % TAPPITE THT TOO I DOUBT IN TELGANGANA as far i know or seen enduku chebutunanu ante oka 5 or 6 ppl i knw who conttested on prp ticket wht evr votes they got tht was there own vote bank ee chimpadu oka vote add cheyaledeu chesina gesinina oka 1 or 2% tappite saying this coz watched closly i dunno abt seenaandhra region akkada caste and all plays a big role antaru telanganlo cinema vadini chusi vote vesina vallu less %

 11. rajnjj

  adi abba chimpadu ki ippudu gurutukuvachinda dk gadu ysr ni anadamu veedu congress lo cheri minister oo cm or pm vadiki emi kavaliana avvachoucu vedava why drag ysr in too this crap **** idot

 12. NLR

  I think the politics in A.P are heading towards the right direction …
  All these are a clear indication of how strong a threat JAGAN is to all the crooks in A.P politics ….
  Come what may come …..the final victory is ours ….
  It is written…..No one can change it ……
  It has happened thousands of years ago in MAHABHARATH ….
  It has happened a hundred years ago with the BRITISH …..
  The history is going to repeat again ……

  Only one anthem in A.P ….
  JAGAN ….JANAM……PRABHANJANAM……….

 13. pileru

  Chiru is saying that YSR regime is corrupt. Few weeks before he said that YSR is ispiration to join into politics. This guy even can not speak simple english then commenting YSR.
  Where is Vundavalli? Sonia ni musalodu venkata swamy oka mata ante ila rechhipoyade, ee roju ekkadunnado.

  • rajnjj

   adi abba chimpadu ki ippudu gurutukuvachinda dk gadu ysr ni anadamu veedu congress lo cheri minister oo cm or pm vadiki emi kavaliana avvachoucu vedava why drag ysr in too this crap ****in fool

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s