Restoring democracy

9 Comments

Filed under Best Videos

9 responses to “Restoring democracy

  1. Sekar

    How come there is no mention of the “saagu poru” in this blog? Why are we so passive nowadays?

    • CVReddy

      Sagu Poru is super hit.
      I can’t believe the response Jagan has got in Chittor for his Sagu Poru.
      Over all tremendous response from all places

  2. naa commentlu moderation waiting

  3. http://indrasenagangasani.blogspot.com/2011/06/blog-post_11.html

    posting again

    ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ కష్టాల నుండి ప్రజల్ని విముక్తి చేయడం ఎలా?

    మానవుడు ఒక నాడు చీకటి గుహలలో నివసించేవాడు.నాగరికత పెరిగిన కొలదీ, నిప్పును కనుగొన్న తరువాత వెలుతురు యొక్క విలువ తెలుసుకున్నాడు.జంతువుల కొవ్వునుండి దీపాలు వెలిగించడం నేర్చుకున్నాడు.ఈ క్రమగతి లోనే నూనె,ఆముదం,కిరోసిన్ దీపం నుండి నేటి ఫ్లోరోసెంట్ లాంపుల వరకు ఎదిగాడు.

    విద్యుత్ అనేది ఒక్క వెలుతురు కోసమేనా? కాదు.
    విద్యుత్ శక్తికి ప్రతిరూపం. విద్యుత్ అనగా ఎలక్ట్రానుల ప్రవాహం.

    బెంజమిన్ ఫ్రాంక్లిన్,గాల్వని ల కృషివలన విద్యుత్ అనేది ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ధామస్ ఆల్వా ఎడిసన్ కృషి వలన విద్యుత్ బల్బ్,ఫారడే కృషి వలన విద్యుత్ మోటర్ కనుగొనడం జరిగింది. వోల్టా గారి కృషివలన విద్యుత్ బ్యాటరి కనుగొనడం జరిగింది. ఈ మానవాళి మీ కృషికి సదా కృతఙ్ఞతలు తెలుపుతుంది.పూర్తి సమాచారం కొరకు క్రింద లింక్ చూడండి.
    http://www.ideafinder.com/history/inventions/battery.htm

    మన దేశములో స్వాతంత్రము వచ్చిన తరువాత పంచ వర్ష ప్రణాళికలలో భాగంగా గ్రామ,పట్టణాల విద్యుత్తీకరణ మీద కొంత శ్రద్ద వహించడం జరిగింది.తద్వారా దేశం లో చాలా వరకు విద్యుత్ వినియోగం లోకి వచ్చింది.మన రాష్ట్రం మాత్రం 99 .99 శాతం విద్యుత్తీకరణ గావించబడినది. సంతోషం.

    కానీ ఇప్పటికి గ్రామాల్లో ప్రతి రోజు ఆరు నుండి ఏడు గంటలు విద్యుత్ సరఫరా ఉండదు.పట్టణాల్లో కూడా కోత తప్పడం లేదు. ప్రపంచంలో అనేక ఇతర దేశాలు కనీసం గృహ అవసరాలకి ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి.మనము ఇప్పటికి కోతల కాలం లో బతకడం సిగ్గు చేటు. విద్యుత్ ని గృహ అవసరాలకే కాకుండా,వ్యవసాయ,వాణిజ్య,పరిశ్రమల లో కూడా వినియోగిస్తారు.

    విద్యుత్ నిర్వహణలో ఉత్పత్తి,సరఫరా అనే రెండు విభాగాలు ఉంటాయి.ప్రస్తుతం మనకు జెన్ కో ,ట్రాన్స్ కో అనే రెండు సంస్థలు ఈ విభాగాల్ని మేనేజ్ చేస్తుంటాయి. ఒకనాడు సరఫరా,ఉత్పత్తి రెండూ ప్రభుత్వ నిర్వహణ లోనే ఉండి చాలా అధ్వాన్న మయిన పరిస్థితి ఉండేది. నేడు ఉత్పత్తిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రవేశ పెట్టడం వలన కొంతవరకు మెరుగయిన ఫలితాలు వచ్చాయి.ముందుగా విద్యుత్ ఉత్పత్తి ఎలా ఉంది అనే విషయం పరిశీలిద్దాము.

    విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరిగి పోతుంది.ప్రజలు ఏసీ లు,ఫ్యాన్లు తదితర వస్తువులు లగ్జరీ కోసం కాకుండా కనీస అవసరాల కోసం వాడటం సంతోషం.మానవాభివ్రుద్దిలో విద్యుత్ వినియోగం అనేది విస్మరించలేనిది,ప్రధానమయినది. మన అవసరానికి తగ్గట్లుగా మనము విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామా?అసలు విద్యుత్ ఎలా ఉత్పత్తి చేస్తారు?

    1 )జల విద్యుత్త్ :రిజర్వాయర్ దగ్గర కొన్ని విద్యుత్ కేంద్రాలు కట్టి,పెద్ద పెద్ద రోటర్లని విద్యుత్ అయస్కాంత క్షేత్రం ద్వారా నీటి ప్రవాహ బలంతో తిప్పి ఉత్పత్తి చేస్తారు.
    2 ) ధర్మల్ విద్యుత్: బొగ్గును మండించి,నీటి ద్వారా ఆవిరి శక్తిని ఉత్పత్తి చేసి,వాటి ద్వారా పైన చెప్పిన విధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.

    3 )అణు విద్యుత్: అణు శక్తి ద్వారా,శక్తిని ఉత్పత్తి చేసి తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.
    4 ) సహజ వాయువు విద్యుత్ కేంద్రము: గ్యాసు ను మండించి,నీటి ద్వారా ఆవిరి శక్తిని ఉత్పత్తి చేసి,వాటి ద్వారా పైన చెప్పిన విధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.

    ఇవే కాక పవన,సౌర శక్తి ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.ఇక విద్యుత్ ఉత్పత్తిలో నా ఆలోచనలు కొన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను.

    ఫస్ట్ లా అఫ్ ధర్మో డైనమిక్స్ ప్రకారం శక్తిని సృష్టించలేము,నాశనం చెయ్యలేము,శక్తిని ఒక రూపంనుండి ఇంకొక రూపం లోకి మార్చగలము అంతే.(energy can neither be created nor destroyed .It can only change forms )
    ఈ సూత్రాన్ని అనుసరించి పైన చెప్పిన విధంగా జల శక్తి నుండి,ఆవిరి శక్తి నుండి,అణు శక్తి నుండి విద్యుత్ అనే శక్తి లోకి మార్చడం జరుగుతుంది.

    చాలెంజ్ 1 ) అణు శక్తి లో రెండు రకాలు ఉంటాయి. అణు విచ్చితి,అణు సంయోగం (Nuclear Fission,Nuclear Fusion ).

    యురేనియం,ప్లుటోనియం అనే ప్రముఖ ఐసోటోపులని ఉపయోగించి అణు విచ్చితి ద్వారా శక్తిని సృష్టించవచ్చు. మనకు కావాల్సినంత అణు శక్తికి సంబంధించిన మూలకాలు (elements ) మన దేశంలో లభ్యం అవుతున్నాయి. నా ఆలోచనల ప్రకారం ఈ ఐసోటోపులని ఉపయోగించి అణు సంయోగం(Nuclear Fusion ,దీని ద్వారానే హైడ్రోజన్ బాంబ్ తయారు చేస్తారు) చేయ వచ్చు.

    దీని ద్వారా అమిత మయిన శక్తిని సృష్టించ వచ్చు. ఎవరయినా ఒక్కసారి అణు సంయోగం ఉపయోంచి కొన్ని ట్రిల్లియన్ ట్రిలియన్ ట్రిలియన్ జౌళ్ ల శక్తి ని సృష్టించి ఎయిర్ కంబస్టన్ ఇంజన్ ( కార్నాట్ ఇంజన్ ) లోని టెక్నాలజీ మిళితం చేసి జిల్లియన్స్ అఫ్ మెగా వాట్ల విద్యుత్ ఒకటే సారి ఉత్పత్తి చేయాలి. ఒక నెల రోజుల్లో ఈ ప్రాసెస్ పూర్తి కావాలి.తరువాత ఈ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలి.

    చాలెంజ్ 2 )ఈ విద్యుత్ ని నిల్వ చేయడానికి మనకు అమితమయిన శక్తి గల బ్యాటరీ లు కావాలి. ఎవరన్న అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే బ్యాటరీలో ఒక వెయ్యి మెగా వాట్ల విద్యుత్ ని ‘శాశ్వతంగా’ నిల్వ ఉంచే బ్యాటరీ ని కనుగొనాలి. ఈ బ్యాటరీ ల లోకి మనము ముందు చెప్పిన విధంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ ని నిల్వ చేయాలి. ఇలా చేస్తే మనము కోటాను కోట్ల జౌళ్ ల శక్తిని పర్మనెంట్ గా నిల్వ చేసుకోగలం. నాకు తెలిసి టెక్సాస్ రాష్ట్రం లోని ఆస్టిన్ నగరంలో కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి ఇటువంటి బ్యాటరీల కోసం.

    ఇది సాధ్యమేనా? ఇది కలేనా? ఈ కలను నిజం చెయ్య లేమా? ఈ రెండు చాలెంజ్ లని ఎవరన్న సాధించ గలిగితే ప్రపంచ చరిత్ర గతినే మార్చ వచ్చు.వీటి వలన ఉపయోగాలు చూద్దాము.

    ప్రస్తుతం ఉన్న డీజల్,పెట్రోల్ ఇంజన్ ల స్థానం లో పూర్తిగా ఈ విద్యుత్ శక్తిని ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి విద్యుత్ సరఫరా అక్కరలేదు. కర్రెంట్ స్తంభాలు,కర్రెంట్ లైన్ లు అక్కరలేదు. చిన్న బ్యాటరీ ద్వారా అమితమయిన శక్తి మన సొంతం.కాలుష్యం పూర్తిగా నిర్మూలించ వచ్చు.గ్లోబల్ వార్మింగ్ తగ్గించ వచ్చు. భారీ పరిశ్రమలు,పెద్ద పెద్ద రోడ్లు,ప్రాజెక్ట్లు,గృహాలు విద్యుత్ యంత్రాల ద్వారా నిర్మించ వచ్చు.

    డీసాల్టేషణ్ ద్వారా ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చి ,ఈ భూమండలానికి అంతటికి మంచి నీటిని సరఫరా చేసి,ప్రపంచం మొత్తం మీద ఎడారి లేకుండా పచ్చగా మార్చ వచ్చు. అంతెందుకు విమానాలు,హెలికాఫ్టర్లు,ఓడలు ఈ బ్యాటరీల ద్వారా నడపవచ్చు.

    నేను వ్యవసాయ అభివృద్ధి లో చెప్పినట్లుగా కొన్ని వందల అంతస్తులు నిర్మించి విద్యుత్ ద్వారా పంటలు పండించవచ్చు. వస్తూత్పత్తి,రవాణా,మౌలిక సదుపాయాలన్నీ ఈ శక్తి ద్వారా సాధ్యం. మిడిల్ ఆసియా లోని ఆయిల్ మీద ఆధార పడటం పూర్తిగా పోతుంది. ఊహించుకోండి,మన దేశంలో ప్రతి ఒక్కరికి సెంట్రలైజ్డ్ ఎ సి ల తో ఇల్లు నిర్మించి,చక్కటి రోడ్లు నిర్మించి ,భూమి మీద ప్రతి అంగులాన్ని పచ్చటి హారం లాగా చేయ వచ్చు.

    దీని ద్వారా ప్రపంచ పేదరికాన్నే దూరం చెయ్య వచ్చు. ప్రతి ఒక్కరు ఒక హెలికాఫ్టర్ సొంతం చేసుకోవచ్చు. కోరిన తిండి,కోరిన బట్ట కట్ట వచ్చు. ఏ ఒక్కరు పొట్ట చేత పట్టుకొని దేశాలు పోనక్కరలేదు.ఉపాది అవకాశాలు పెరగడం వలన క్రైం రేటు తగ్గించి శాంతి భద్రతలు పెంచ వచ్చు. ప్రపంచంలో అన్ని దేశాలు కలుపుతూ బ్రిడ్జీ లు కట్ట వచ్చు.

    దేశాల మధ్య సరిహద్దులు చెరిపేయ వచ్చు. విశ్వ మానవులంతా ఒకటే అని అన్ని దేశాల ప్రజలు కలిసి సుఖ శాంతులతో బతక వచ్చు. భారత దేశంలో దళిత,గిరిజన,బడుగు,బలహీన ,ఇతర వర్గాల ప్రజల్లోని పేదరికాన్ని పూర్తిగా మటుమాయం చెయ్య వచ్చు. ఈ భూమండలాన్ని స్వర్గంగా మార్చ వచ్చు.

    ఆలోచించండి విజ్ఞులారా. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. నా దేశ ప్రజల్లో కొంత మంది అయినా ఆ పై రెండు చాలెంజ్ లని సాల్వ్ చెయ్య గలిగితే వారికి మానవ జాతి రుణ పడి ఉంటుంది. కొన్ని రోజుల క్రితం నేనే వీటిని సాధించడానికి న్యూక్లియర్ ఫిజిక్స్ చదవడం మొదలు పెట్టాను.కానీ నాకు సాధ్య పడలేదు. మన భారతీయ ప్రజలు ఎవరన్న తమ జీవితాన్ని త్యాగం చేసి అయినా తమ రీసెర్చ్ ద్వారా పై రెండు సాధిస్తారు అని ఆశిద్దాము. నాకు కనీసం కల కనే హక్కు ఉంది. భవిష్యత్తులో తప్పక ఎవరో ఒకరు సాధిస్తారు.

    ఇక ఇవేమీ సాధ్య పడకపోతే KG బేసిన్ లో గ్యాసు ను ముఖేష్ అంబానీ కి దోచిపెట్టడం ఆపివేసి ఆ గ్యాసుని పూర్తిగా రాష్ట్ర అవసరాలకి ఉపయోగించి ,పంపిణీ లోని నష్టాల్ని నివారించి కనీసం లక్ష మెగా వాట్ల విద్యుత్ని ఒక లక్ష్యం గా ఏర్పరుచుకొని సాధించాలి.పోలవరం,ఇతర బహులార్ధక సాధక ప్రాజెక్టులని త్వరితగతిన పూర్తి చేసి జల విద్యుత్ ఉత్పత్తి చేయాలి. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తీ చేసే వాళ్ళు త్వరగా ఫైనాన్సియల్ క్లోజర్ తెచ్చుకొని ,తమ ప్రాజెక్ట్ లని నిర్దిష్ట కాల పరిమితిలో త్వరిత గతిన పూర్తి చేయాలి.

    అణు విద్యుత్ కర్మాగారాలు నిర్మించి అణు విద్యుత్ను యుద్ద ప్రాతిపదకన ఉత్పత్తి చేయాలి. జల విద్యుత్ మీద నాకు ఒక నూతన ఆలోచన ఉంది. ఒక నది పై ప్రతి పది కిలోమీటర్లకి ఒక మధ్య స్థాయి రిజర్వాయర్ నిర్మించి ఎన్నో జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించ వచ్చు. కానీ ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది. సౌర,పవన విద్యుత్ మీద ద్రుష్టి సారించాలి. విద్యుత్ పొదుపుపై అవగాహన పెంచాలి. జై హింద్. విజ్ఞులారా చర్చించండి. మీ నూతన ఆలోచనలని పంచుకోవలిసింది గా విజ్ఞప్తి.

  4. Indrasena

    http://indrasenagangasani.blogspot.com/2011/06/ntr.html

    చంద్ర బాబు నిజ స్వరూపం NTR మాటల్లో
    ఎవరో పనికిమాలిన వ్యక్తులు చంద్రబాబు చేసింది తిరుగుబాటు అంటున్నారు.ఒక్క సారి NTR చివర చెప్పిన మాటలు వింటే అసలు నిజం తెలుస్తుంది.
    ఇంతకీ ఈ చంద్ర బాబు భక్తులు చెప్పేది నిజమా,NTR చెప్పేది నిజమా? కింద వీడియో చూసి మీరే డిసయిడ్ చెయ్యండి.

    చంద్ర బాబు భక్తులారా,త్వరలో మీకోసంమీ బాబు గారి చిన్న నాటి, చిరకాల మిత్రుడు తుడా మాజీ చైర్మన్ శంకర్ రెడ్డి గారు మీ బాబా గురించి చెప్పిన పలుకులు వెల్లడిస్తాము.

  5. mekonking

    king maama ..adharakottav.

    • Mana Jaitrayatra

      రాజుకుంటున్న కులాల కుంపటి
      ప్రాధాన్యం తగ్గిస్తున్నారంటూ రెడ్డి కులాల ఆగ్రహం ఇక మా దారి మేం చూసుకోవలసిందేనంటున్న ఆ వర్గం కాపులకు ప్రాధాన్యతవల్ల లాభనష్టాల బేరీజు
      June 13th, 2011

      హైదరాబాద్,జూన్ 12: కీలక పదవులన్నీ భర్తీ కావడంతో కాంగ్రెస్‌లో అసలు రాజకీయం ఇప్పుడు ప్రారంభం కానుంది. పదవుల భర్తీలో అధిష్ఠానం అనుసరించిన వైఖరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో కులాల కుమ్ములాటకు దారి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల తరబడి ఆధిపత్యం చెలాయిస్తున్న రెడ్డి కులాల ప్రాబల్యం తగ్గించేలా అధిష్ఠానం వైఖరి ఉందని ఆ కులానికి చెందిన నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్‌లో కాపు కులానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పార్టీకి ఏయే కులాలు దూరమవుతాయి, ఏయే కులాలు దగ్గరవుతాయన్న చర్చలు సాగుతున్నాయి. మంత్రివర్గ మార్పుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కులాల కుంపటి రాజుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
      దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు జగన్మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడంతో కాంగ్రెస్‌లోని రెడ్డి కులానికి చెందిన నాయకులందరూ జగన్ పార్టీలో చేరిపోతున్నారన్న ప్రచారాన్ని కాంగ్రెస్‌లోని కొంతమంది నాయకులు ప్రారంభించారు. రెడ్డి కులానికి చెందిన నాయకులందరూ జగన్ పార్టీలో చేరుతున్నందున కాంగ్రెస్ పార్టీలో ఆ కులానికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని తగ్గించి కాపు, వెనుకబడిన కులాలకు ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలంటూ కొంతమంది మంత్రులు, పార్టీ నాయకులు అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కాపు కులానికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని రెడ్డి కులానికి చెందిన నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. పిసిసి అధ్యక్షునిగా రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ నియమితులు కావచ్చన్న ప్రచారం కాంగ్రెస్‌లో ఎప్పటినుంచో జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే పిసిసి అధ్యక్ష పదవిని తెలంగాణ ప్రాంతానికే ఇవ్వాలంటూ సీమాంధ్రకు చెందిన రెడ్డి కులానికి చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు కొందరు చెబుతూ వచ్చారు. కారణం ఏదైనా చివరకు పిసిసి అధ్యిక్ష పదవిని బొత్సకే అధిష్ఠానం కట్టబెట్టింది. కాంగ్రెస్‌లో రెడ్డి కులం ఆధిపత్యాన్ని తగ్గించాలంటూ కొంతకాలంగా కొంతమంది నాయకులు చెబుతున్న దాన్ని అధిష్ఠానం నమ్మినట్లయిందని రెడ్డి కులానికి చెందిన నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘రెడ్లకు ప్రాధాన్యం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ దెబ్బతినక మానదు, అధిష్ఠానం వైఖరి అదే అయితే మా దారి మేం చూసుకుంటాం’ అని రెడ్డి కులానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.
      కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, తెలుగుదేశం పార్టీలో కమ్మ కులస్ధుల ఆధిపత్యం అన్నది మొదటి నుంచి వస్తోంది. జనాభా పరంగా కాపుల కన్నా రెడ్లు, కమ్మ కులస్థులు తక్కువయినా గ్రామాల్లో మాత్రం ఈ కులాలకు చెందిన వారు పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. ‘జనాభా పరంగా ఎక్కువ ఉన్నా కాపు కులానికి చెందిన వారు నాయకత్వం వహించిన దాఖలాలు ఎక్కడా లేవు, పైగా ఆ కులానికి చెందిన వారితో ఇతర కులాలకు చెందిన వారు కలిసిరారు’ అని కాంగ్రెస్ నాయకుడొకరు అన్నారు. ఎన్టీఆర్ తర్వాత సినీ నటునిగా అంతటి ప్రజాభిమానం ఉన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ప్రజాదరణను పొందలేక పోవడానికి కారణం ఇదేనని ఆయన చెప్పారు. ముఖ్యంగా కాపు కులస్థులతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో కులానికి పడదు. వంగవీటి రంగా హత్య అనంతరం కాపు, కమ్మ కులస్థుల మధ్య పూర్తిగా దూరం పెరిగింది. అలాగే గోదావరి జిల్లాల్లో కాపు, శెట్టిబలిజ కులాలకు ఏమాత్రం పడదు. కొన్ని ప్రాంతాల్లో మాలలు, మరికొన్ని ప్రాంతాల్లో మాదిగలకు కూడా కాపులంటే పడదు. దీనికి తోడు రెడ్డి, కమ్మ కులస్థుల్లో ఉన్న ఐక్యత కాపు కులస్థుల్లో కనిపించదు. బ్రాహ్మణ కులస్థులకు రెడ్డికులస్థులతో ఉన్న అనుబంధం కమ్మ, కాపు కులస్థులతో కనిపించదు.
      తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వెనుకబడిన కులాలకు చెందిన వారు ఆ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు. వెనుకుబడిన కులాలకు చెందిన వారిని దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. వెనుకబడిన కులాలు, మరీ ముఖ్యంగా వివిథ వృత్తులను నిర్వహించే కులాలు కూడా తెలుగుదేశం పార్టీకే మద్దతుగా ఉంటున్నాయి. అధిష్ఠానం చేపట్టిన ప్రయోగం ఎంత మేరకు కలిసొస్తుందన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s