Saphaleekrutha Deeksha ..

కర్షకుల కష్టాలు తీర్చండి: జగన్ డిమాండ్

ఆర్మూరు: రైతు, రైతుకూలీలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఎన్ని ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని దుయ్యబట్టారు. అన్నదాతల కోసం నిరాహారదీక్షలు చేశామని, కలెక్టర్లేను ముట్టడించామన్నారు. ఎన్నిచేసినా ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని పెర్కిట్ వద్ద మూడు రోజులుగా చేస్తున్న రైతుదీక్షను గురువారం సాయంత్రం ఆయన విరమించారు. అనంతరం భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.

రాష్ట్రంలో రైతులు దారుణమైన పరిస్థితిలో ఉన్నారన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. పెట్టుబడి మూడింతలు పెరిగితే రాబడి మాత్రం అందులో మూడోవంతు కూడా రావడం లేదన్నారు. వ్యవసాయం చేసుకోవడం కన్నా ఉరివేసుకోవడం మేలన్నట్టుగా పరిస్థితి ఉందన్నారు. రైతు కూలీలు కూడా రైతులపై సానుభూతి చూపించే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర చరిత్రలో రైతులు మొట్టమొదటసారిగా క్రాప్‌హాలీడే ప్రకటించినా సర్కారు కళ్లు తెరవడం లేదన్నారు.

దివంగత మహానేత వైఎస్సార్ రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలకు అర్థంలా నిలిచారన్నారు. కర్షకుల కష్టాలపై ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు ముసలికన్నీరు కారుస్తారని ఆరోపించారు. అవిశ్వాసం సందర్భంగా రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన కొండా సురేఖను చూస్తే తనకు గర్వంగా ఉందని జగన్ అన్నారు. పదవులను సైతం లెక్కచేయకుండా 17 మంది ఎమ్మెల్యేలు అన్నదాత పక్షాన నిలిచారని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు.

రైతుల కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని, 9 గంటలు పాటు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇవ్వాలని, ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి అన్నదాతల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపించిన వారికి జగన్ ధన్యవాదాలు తెలిపారు.

22 Comments

Filed under Uncategorized

22 responses to “Saphaleekrutha Deeksha ..

 1. CV Reddy

  Jagan, TRS Ahead In Opinion Polls
  The Congress leadership had commissioned the survey.

  http://greatandhra.com/viewnews.php?id=35001&cat=15&scat=16

  Out of 17 constituencies that will have to go to poll as a result of the possible disqualification of legislators loyal to Y S Jagan Mohan Reddy, the YSR Congress Party is expected to win 14 seats while the ruling Congress has a bright chance of emerging victorious in three constituencies– Narasannapet, Ramachandrapuram and Narsapurm.

  Except in Mahbubnagar and Nagarkurnool in Mahaboobnagar district, the TRS is in a position to return its candidates in the rest of the constituencies in Telangana region– Kollapur, Adilabad, Station Ghanpur, Kamareddy and Parakala – with landslide victories.

  The YSR Congress leader Konda Surekha is lagging behind TRS in Parakala

  • CVR Murthy

   My information is all 17 will be with YSRCP. This is how they seed information to shift the trend

   • CV Reddy

    You are right Murthy Garu
    Various surveys done by Cong and TDP had indicated clean sweep by YSRCP in Seemandhra.

    • NLR

     I stick to my stand that …

     If they do no touch JAGAN- cong and tdp might get deposits here and there.
     If they touch Him – cong and tdp will lose deposits everywhere.

     YSRCP will sweep the elections.

  • Apsrtc

   Hi ANNA,

   Once again my request. Unless it is related to our party stuff, let us avoid linkage to this kind of news. Also Yellow gang never link our websites. They create a snapshot and upload images to not give hits or links to our websites. We atleast avoid non YSRCP links here. Just my 2 cents.

 2. Apsrtc

  I was thinking about this suggestion since Rosaiah government itself. Some of our members may not like it, but I feel it is important tool in getting confidence of common man who looks to YS Jagan as a humble leader. Past is past when it comes to previous association and his stubbornness with AP congress govt. YS Jagan need to understand the current government antics by meeting CM and corresponding ministers when an issue has taken up. Just like Rythu Deeksha in Armoor, he could take an appointment with CM, Governer and Agriculture and Marketing ministers as a party representation. This is necessary to understand their mind set and working methodology. He did this with Sharad Pawar. He must do this in AP also.

 3. CV Reddy

  Naidu Escapes CBI Probe For 2 Months
  See how “Not Before” Naidu is escaping and still posing like a saint in his yellow media.
  http://greatandhra.com/viewnews.php?id=34980&cat=15&scat=16

  • Apsrtc

   1. Reliance Oil Mafia and Congress mafia colluded in India. Bolli Bob and Ramoji biggest benifiters of the oil loot in KG basin. To save this entire nexus of Kampani route money, they pushed Network18 deal and converted it into white money before court take up. This gave immunity in other asset appropriation – land and other loot in the name of IT gone under the cover. We could have split it into two cases to override Ambani effect. But it is too late, since legal system also helping Ambani mafia.
   2. AP Congress need media support and they joined hands with Yellow Media who treated these guys as roches.
   3. Bolli Bob and Ramoji promosed Chiddu a guru dakahina in the form of Erase YSR image and finish off YSRCP party and YS Jagan. Vijay Rama Rao involved in the case opening channel both way communicatiOn for Yellow Media and CBI hand in glove.

   Inspite of clear and detailed expose of land grabbing and loot, we dont have any support in entire legal process. So we have to succumb to this. But there is a saying. “Kinda Padda Vaadu, Chedda vaadu kaadu”.

   We need to wait for few more years to tackle all this.

 4. Real-Reddy

  నవ్వి పోదురు గాక …నాకేంటి . ముఖ్యమంత్రి పీఠం కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా ఒడిగడతాదు , మేనరికం వద్దన్న చంద్రబాబు కొడుకుకు కూడా ద్రోహం చేసాడు

 5. Real-Reddy

  somebody convey to Jagan to continue his speeches in his natural accent the way he did it in Armur . Earlier ppl is to complain that he is stammering with extended accent . Few also complained that his earlier speeches were like Christian sermons . But it was quite different in Armur.

 6. Really its a great begining Victory for YSR Party after success of Armoor Rythu Dikhsha its right time to Jagan to start a massive yatras in Teleganga Region. Jaiho Jagan… Jaiho YSR Party ……….But srry to say YSR Party should select Youth president should be very dynamic to motivate and energise youth. Present leadership is not sufficient. Youth wing should be revamped. Why Not Ms.Roja should be given the Chance of YSR Youth President……..?

 7. Sekar

  Tremondous improvement in Jagan’s speech recently.

 8. Saireddy

  విజయసాయిరెడ్డి కస్టడీ పొడిగింపు ఉత్తర్వులు రద్దు
  సాయిరెడ్డి కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
  అలాంటి అధికార పరిధి ఇన్‌చార్జి కోర్టుకు లేదు
  జగన్, సాయిరెడ్డి కుట్రపన్నారనే సీబీఐ ఆరోపణలను నిర్ధారించడం సహించరాని విషయం
  జడ్జి ఒత్తిడికి లోనై ఉత్తర్వులు జారీ చేసినట్లు అనిపిస్తోంది
  కస్టడీ కావాలంటే సీబీఐ కోర్టునే ఆశ్రయించండి
  హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆడిటర్ విజయసాయిరెడ్డి కస్టడీని వారం రోజుల పాటు పొడిగిస్తూ ఈ నెల 10న ఇన్‌చార్జి కోర్టు హోదాలో ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు గురువారం రద్దు చేసింది. అలాంటి అధికార పరిధి ఇన్‌చార్జి కోర్టుకు లేదని స్పష్టం చేసింది. కస్టడీ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన జడ్జి సుధాకర్‌నాయుడు తీరును న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి తప్పుపట్టారు. ఈ కేసులో జగన్‌మోహన్‌రెడ్డి (ఏ1), విజయసాయిరెడ్డి (ఏ2)లు కలిసి కుట్ర పన్నారని జడ్జి తన ఉత్తర్వుల్లో నిర్ధారించడాన్ని న్యాయమూర్తి ఎత్తిచూపారు. అది కేవలం సీబీఐ ఆరోపణ మాత్రమేనని, ఆరోపణను ఆరోపణగా ప్రస్తావించాల్సింది పోయి, చార్జిషీట్ కూడా దాఖలు చేయని కేసులో ఆరోపణలు నిర్ధారిం చడం ఎంత మాత్రం సహించరాని విషయమని ఘాటుగా వ్యాఖ్యానించారు. అన్ని కేసుల్లోనూ జడ్జి ఇలాగే వ్యవహరిస్తున్నారా..! అనే సందేహాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు. జడ్జి సుధాకర్ నాయుడు ఒత్తిడికి లోనై ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

  ఇది ఫోరం పర్చేజ్ కిందకు వస్తుంది

  సాయిరెడ్డి కస్టడీ విషయంలో ఒకరోజు ఆగితే వచ్చిన నష్టమేమిటని సీబీఐని నిలదీశారు. ఒక్కరోజు కూడా ఆగకుండా.. ఇన్‌చార్జి కోర్టులో కస్టడీ పొడిగింపు కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరమేమొచ్చిందని సీబీఐని ప్రశ్నించారు. ఇలా చేయడం ఫోరం పర్చేజ్ (ఏ న్యాయమూర్తి ముందు కావాలంటే అక్కడ కేసు దాఖలు చేసుకోవడం) కిందకు వస్తుందని మండిపడ్డారు. ‘సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి సెలవులో ఉన్నారు. సెలవు పూర్తి చేసుకుని ఆయన వచ్చేంత వరకు వేచి ఉండటం వల్ల మీకొచ్చిన నష్టమేమిటి..? ఒక రోజులో మునిగిపోయేదేముంది..? అంత అత్యవసరంగా ఇన్‌చార్జి కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది..?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి కస్టడీ పొడిగింపు కావాలనుకుంటే.. కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు దరఖాస్తు దాఖలు చేసుకోవాలని సీబీఐ అధికారులకు సూచించారు. ఈ మేరకు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తన కస్టడీని వారం రోజుల పాటు పొడిగిస్తూ ఇన్‌చార్జి కోర్టు హోదాలో ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 10న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విజయసాయిరెడ్డి హైకోర్టులో గురువారం మధ్యాహ్నం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీబీఐ అధికారులు విజయసాయిరెడ్డిని ఇప్పటికే 30 రోజులకు పైగా విచారించారని, ఇంత సుదీర్ఘ విచారణ చేపట్టిన అధికారులు, తిరిగి కస్టడీ కోరడం ఆశ్చర్యంగా ఉందని ఆయన కోర్టుకు నివేదించారు.

  సాయిరెడ్డి సీబీఐ విచారణకు ప్రతి దశలోనూ సహకరించారని, అరెస్టు చేసే రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయిరెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అరెస్టుకు తగిన కారణాలను వెల్లడించకుండానే అరెస్టు చేశారని తెలిపారు. సాయిరెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచిన సీబీఐ అధికారులు.. రిమాండ్ రిపోర్ట్ లేకుండానే కస్టడీ కోరారని, ఇందుకు ప్రత్యేక న్యాయస్థానం సైతం అంగీకారం తెలుపుతూ ఐదు రోజుల కస్టడీకి ఇచ్చిందని ఆయన వివరించారు. కస్టడీ ముగిసిన వెంటనే సీబీఐ అధికారులు సాయిరెడ్డిని ప్రత్యేక న్యాయస్థానం జడ్జి సెలవులో ఉన్నందున.. ఇన్‌చార్జి కోర్టయిన ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ముందు హాజరుపరిచి, కస్టడీ పొడిగింపునకు దరఖాస్తు చేశారని తెలిపారు. సీబీఐ అభ్యర్థన మేరకు జడ్జి వెంటనే స్పందించి సాయిరెడ్డి కస్టడీని వారం రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది కేశవరావు స్పందిస్తూ.. తగిన సమయం లేకపోవడం వల్లే ఇన్‌చార్జి కోర్టును ఆశ్రయించామని తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్ 167 క్లాజ్ 1, సబ్ క్లాజ్ 2 ప్రకారం ఏ మేజిస్ట్రేట్ అయి నా కస్టడీని పొడిగించవచ్చునని వివరించారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి ఈ వాదనలను తోసిపుచ్చారు. కస్టడీ కోసం సీబీఐ అనుసరించిన పద్ధతి మంచి పద్ధతి కాదని.. ఇన్‌చార్జి కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పరిధి దాటి వ్యవహరించడమే అవుతుందని తేల్చి చెప్పారు. సెక్షన్ 167 క్లాజ్ 1, సబ్ క్లాజ్ 2లను వేర్వేరుగా చూడాలని, రెండింటినీ అన్వయించడం సరికాదని పేర్కొన్నారు. ఐదు రోజుల కస్టడీ పూర్తయిన తరువాత.. కస్టడీ పొడిగింపు కోసం అదే కోర్టుకు (సీబీఐ కోర్టు) వెళ్లాలే తప్ప.. ఇన్‌చార్జి కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు పొందడం సరికాదని స్పష్టం చేస్తూ.. సాయిరెడ్డి కస్టడీని పొడిగిస్తూ జడ్జి సుధాకర్‌నాయుడు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి రద్దు చేశారు
  Source: Sakshi.com

 9. Speech adaragottadu Jagan anna

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s