అనర్హులుగా ప్రకటించండి – ప్రజల వద్దకు వెళతాం!

హైదరాబాద్: తమను అనర్హులుగా ప్రకటిస్తే ప్రజా తీర్పును కోరతామనీ మళ్లీ నోటీసులు జారీ చేయడం ఎందుకని వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను ప్రశ్నించారు. తన ముందు హాజరు కావాలని స్పీకర్ కొందరు ఎమ్మెల్యేలకు తాజాగా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అవిశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఓట్లేసిన ఎమ్మెల్యేలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ ‘శాసనసభ సభాపతి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించిన మా ఎమ్మెల్యేలందరికీ మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా మేమొక్కటే ఆయనకు స్పష్టం చేయదల్చుకున్నాం. స్పీకర్ సాక్షిగా రైతులకు, పేదవారికి మద్దతుగా వైఎస్ అభిమానులముగా విశ్వసనీయతకు కట్టుబడి అవిశ్వాస తీర్మానానికి ఓటేసిన మాట వాస్తవం. ఇదే విషయమై గతంలో నోటీసు ఇచ్చినపుడు కూడా మేం సమాధానం ఇచ్చాం. స్వయంగా స్పీకర్‌ను కలిసి మా విధానం ఏమిటో చెప్పాం. మమ్మల్ని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా కోరాం. ప్రజా తీర్పు కోరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. అయినా మళ్లీ నోటీసులు ఎందుకు ఇచ్చారో మాకు అర్థం కావడం లేదు. మీరు మళ్లీ నోటీసులు ఇచ్చినా మా విధానం మారదు. మా అభిప్రాయాలు అంతకంటే మారవు. మేం కచ్చితంగా అదే మాట మీద ఉన్నాం. మరోసారి మేమంతా ముక్త కంఠంతో మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మమ్మల్ని విడివిడిగా కలిసి వివరణ ఇవ్వాలని కోరడం అనవసరం. వెంటనే మీరు మమ్మల్ని అనర్హులుగా ప్రకటించండి. ఎన్నికల కమిషన్‌కు తెలియ జేయండి. త్వరగా ఎన్నికలు పెట్టించండి. మేం ప్రజా తీర్పును కోరడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తేల్చి చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తాము తాజాగా ప్రజా తీర్పు కోరాల్సిన అవసరం ఉందనీ ఎందుకంటే దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై గల అభిమానంతో రెండో సారి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తే ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా నిర్ణయాలు జరుగుతున్నాయని బోస్ అభిప్రాయపడ్డారు. అందుకే వీటన్నింటి మీద ప్రజా తీర్పు కోరాల్సి ఉందనీ ఆయన అభిప్రాయపడ్డారు. స్పీకర్‌ను ఉద్దేశించి ‘దయచేసి మరోసారి మమ్మల్ని పిలవకండి…మేం రావడానికి సిద్ధంగా లేము…దయతో మా సభ్యత్వాలను రద్దు చేయండి’ అని బోస్ విజ్ఞప్తి చేశారు. స్పీకర్ మళ్లీ జారీ చేసిన నోటీసులను పురస్కరించుకుని తామెవరమూ ఇపుడాయన వద్దకు వెళ్లడం లేదని బోస్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. స్పీకర్ పిలిచినా వెళ్లక పోవడం ఆయనను అగౌరవ పర్చినట్లు కాదా? అని ప్రశ్నించినపుడు ‘స్పీకర్ మీద మాకు అత్యంత గౌరవం ఉంది. వారిని ఎపుడూ అగౌరవ పర్చం. మేం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశాం. అందుకు వారే సాక్ష్యం. మరోసారి ఆయన వద్దకు వెళ్లి చెప్పేదేముంటుంది అనేదే మా ఉద్దేశ్యం’ అని బోస్ స్పష్టం చేశారు. సమావేశానికి రాని తమ ఎమ్మెల్యేలందరితోనూ ఫోన్‌లో మాట్లాడామనీ అందరి తరపున ముక్త కంఠంతో తమను అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నామనీ ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాము ఎన్నికలకు ఎంత మాత్రం భయపడటం లేదనీ బహుశా ఆ భయం కాంగ్రెస్‌కు ఉందేమో వారిని అడిగితే బాగుంటుందని వివరణ ఇచ్చారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొన్నారు.

18 Comments

Filed under Uncategorized

18 responses to “అనర్హులుగా ప్రకటించండి – ప్రజల వద్దకు వెళతాం!

  1. CV Reddy

    Kiran has written letter to Governer to sack Sankar Rao

  2. Real-Reddy

    I was shocked to read this when one of my colleague FWD this URL …. CBN instigating his men to take Law into their hands and destroy YSR statues . He further tells them that he will take care of them if anything happens after demolition .
    http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=60753&boxid=239149824

    • YSFan

      YSR Statues padagodithe, Manam NTR Statues Padagodatham anthe simple. Need not to worry.

      • asalu YSR statue ni Touch chesentha scene ledu le….

        NTR ki nijam gaa antha scene vundi vunte ee paati ki STATUES petti vundaali….but alaa kaakundaa…YSR STATUES ni chusi kothagaa STATUES tho Politics START chesaaru….

        manam ilaanti Cheap Politics chese sthithi ki digajaaraalsina pani ledu…….

        BABU gaadu pichi patti ilaanti vaagudu vaaguthunnaadu…..

        vaadi ki kudaa thelusu….vaadu ee JANMA lo malli ADHIKAARAM loki raaledu ane sangathi vaadi ki kudaa thelusu…..

        waste fellow……

  3. CV Reddy

    శంకరరావు తిరుగుబాటు చేస్తారా?
    http://kommineni.info/articles/dailyarticles/content_20120119_2.php

  4. CV Reddy

    రుజువులున్నా అబద్ధాలెందుకు?
    చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం

    ‘సత్యం’ రామలింగరాజు మీ అబ్బాయికి డొనేషన్లెందుకు కట్టారు?
    రామోజీ సంస్థల్లో రిలయన్స్ పెట్టుబడులు నిజమని రుజువైందిగా?
    అంత సొమ్ము పెట్టి విలువలేని చానెళ్లను ఆ సంస్థ ఎందుకు తీసుకుంది?
    ఈ సొమ్ము రామోజీ ద్వారా పరోక్షంగా మీకిచ్చిన ముడుపులు కాదా?
    సుజనా చౌదరికి రుణం ఇప్పించింది ఆ మనీల్యాండరింగ్ సొమ్ము కోసమేగా?
    ఈ ప్రశ్నలకు జవాబివ్వాలని డిమాండ్

    http://sakshi.com/main/FullStory.aspx?catid=305719&Categoryid=1&subcatid=33

  5. Gurava Reddy

    Who said Chandrababu is smart? His statements and my questions!

    Chandrababu: ‘‘రాష్ట్రంలో రోడ్లను విస్తరించి, కొత్తవాటిని నిర్మించింది నా హయాంలోనే. అటువంటి వాటిని పాడు చేసి రోడ్లకు అడ్డంగా ఎక్కడపడితే అక్కడ వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్‌లకు లేన న్ని విగ్రహాలు వైఎస్‌కు ఏర్పాటు చేశారు అంటూ అక్కసు వెళ్లగక్కారు. ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే మేమూ లక్ష ఎన్టీఆర్ విగ్రహాలను పంపిణీ చేసి ఆవిష్కరిస్తాం. అభిమానం ఉంటే మనస్సులో, పెరట్లో, ఇంట్లో పెట్టుకోండి. ఎక్కడపడితే అక్కడ విగ్రహాలు పెట్టడం సరికాదు. విగ్రహాల ఏర్పాటుపై సర్కారు చర్యలు తీసుకోవాలి. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఒక్కొక్కరి విగ్రహంపట్ల ఒక్కో రకంగా వ్యవహరించటం సరికాదు. రానున్న మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించి సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరో పరిశ్రమను పెడితే సీఎం సిఫారసు చేస్తే ఉద్యోగాలు ఇవ్వరు. చెత్తబుట్టలో పడేస్తారు అని చెప్పారు. విద్యుత్ రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము సమర్ధవంతంగా నడిపిన ఆ రంగాన్ని నాశనం చేశారన్నారు. విద్యుత్ రంగం గురించి పట్టించుకోకుండా ఉండి ఉంటే తాము తిరిగి అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లమని చెప్పారు.
    My question: If installing one lakh YSR statues causes the roads YOU built congested and worse to travel on, installing one lakh more of NTR statues would lessen the congestion and alleviate the situation? Mulluki mullu, pattharko javaab pattharsehi denge attitude eh?

    Chandrababu: ఫోన్‌లలో మాట్లాడి తాను రాష్ట్రపతి, ప్రధాన మంత్రులను ఎంపిక చేస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ తిరిగి అధిష్టానానికి గులాంగిరీ చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భరంగా ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. పార్లమెంటులోఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
    My question: If you were so able to pick and command the Presidents and Prime Ministers, why did you not ask those Presidents and Prime Ministers to install NTR statue in parliament? Did you forget or wilfully did not want NTR statue in there in the first place? Is it not true that you had NTR pictures taken out of every TDP statewide office between 1995 and 2004, only to put them back after the massive defeat in the local body elections of 2005? Chee neeku siggundaaa? nee yellow media ki siggundaa? oka thandriki puttina vaallenaa meeru? Thoo mee bathukulu…..

    • CV Reddy

      Excellent Gurava

    • Sekar

      Hi Guruva , Very good replies.
      For the last one you can also add why he couldn’t get Bharatha Ratna for NTR during the 8 years period he was a CM after NTR’s death. Why demanding now?

      Pls send this information as an article to the websites: GA, thatstelugu etc.

    • rakesh

      well said guruva garu
      babu lost his sense, after two consecutive defeats
      the fear he has is not of congress but of jagan
      who can make him hit hatrick defeats
      that’s why sleepless nights for yellow band

    • vissu

      Continuation to gurava anna Q’s:
      If babu is that much powerful, then why cant he get the national project status to Polavaram or Pranahita-chevella , leave apart national project status, he even didnt think about those projects to construct ..

      If he is that much powerful, why he cant get cabinet posts at central

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s