అన్న పార్టీ మారిండ్రోయ్..!

http://sakshi.com/main/FullStory.aspx?catid=335998&subcatid=15&Categoryid=3

ఓటరు: నమస్తే అన్నా.. ఏందన్నా మెడలో కండువా మారింది?
ద్వితీయశ్రేణి నాయకుడు: అవుర్రా.. మొన్ననే మా లీడర్ కాంగ్రెస్ కండువా వదిలేశాడు. మేం కూడా వదిలేయాలి కదా! అందుకే మెడలో ఈ కండువా ఉంది. ఇప్పుడు మా గుర్తు సైకిల్.

ఓటరు: అదేందన్నా మొన్ననే కదా పార్టీ మారినావ్?
నాయకుడు: ఏం లేదురా.. టీడీపోల్లు వచ్చారు. వాళ్లకు, మా వాళ్లకు మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. నేను నమ్మలేదు. మా నాయకుడి నుంచి ఫోన్ చేయించాడు. ఇంకే చేస్తాను? సరేనన్నా. 

ఓటరు: ఏందన్నా.. పేపర్లో, టీవీల్లో ఇద్దరూ ఒకర్నొకరు బండబూతులు తిట్టుకుంటున్నారు. ఇదేంది ఇప్పుడు ఇలా చేస్తున్నారు?
నాయకుడు: ఏం చేయాల్రా.. ఈ రాజకీయమే అంత. మొన్న చంద్రబాబు వచ్చాడా? మా కాంగ్రెస్‌వాళ్లని.. వైఎస్సార్ కాంగ్రెస్సోళ్లని నోటికొచ్చినట్టు తిట్టాడా? రాత్రి మా నాయకుడికి ఫోన్‌చేసి ఈ సారి బాగా చెయ్. అని చెప్పాడు.
ఓటరు: అవునా అన్నా? ఈ నాయకుల్ని ఎట్టా నమ్మేది?
నాయకుడు: నీకు దీనికే నోరుతెరిస్తే ఎలారా? ఇట్టాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. 
ఓటరు: అదేంటో చెప్పన్నా?
నాయకుడు: మొన్న చంద్రబాబు ఊరూరా తిరిగాడు గుర్తుందా? మా ఊరోళ్లంతా బాబు మీటింగ్‌కు పెద్ద ఎత్తున వచ్చారు చూశావా?
ఓటరు: ఔ నన్నా?
నాయకుడు: ఆ జనం అంతా ఎక్కడ నుంచి వచ్చారనుకున్నావ్? వారంతా మా ఊరోళ్లే. 
ఓటరు: అదేందన్నా.. మీ ఊరోళ్లకి కోవూరు ఎలక్సన్లలో ఓట్లు లేవు కదా? 
నాయకుడు: అదంతా ఎవడు చూస్తాడు. జనాలు వచ్చారా, లేదా? అనేది కావాల్సింది.

ఓటరు: మరి మీటింగ్‌కు వచ్చినందుకు ఏం ఒప్పందం కుదర్చుకున్నారన్నా?
నాయకుడు: రెండు ఒప్పందాలు ఉన్నాయిరా? 
ఓటరు: అదేందో చెప్పన్నా?

నాయకుడు: అవన్నీ సీక్రెట్. ఎవరికీ చెప్పకూడదు. నీవు అడక్కూడదు. 
ఓటరు: పోన్లే అన్నా నామీద నమ్మకం లేకపోతే చెప్పొద్దు.

నాయకుడు: నీమీద కాదురా? సరేరా.. ఈ విషయం ఎవ్వరకీ చెప్పొద్దు. మొన్నటికి మొన్న జగన్ వచ్చాడు కదా.. ఆయన మీటింగ్‌లకు భలే జనం వచ్చారు. ఆయన్ను చూసి ఆ ఊర్లలోనే పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

అయితే జనం అంతకంటే బాగారావాలని దానికేం కావాలో అది చేయండని చంద్రబాబన్న ఆదేశించాడంట! అందుకని టీడీపీ వాళ్లు మా కాంగ్రెస్ వాళ్లతో మాట్లాడారు. మనలో ఎవరు గెలిచినా ఒక్కటే.. మా మీటింగ్‌లకు మీ వాళ్లను పంపండి.. మీ మీటింగ్‌లకు మావాళ్లను పంపుతామని ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఒక ఊరి జనాన్నంతా తరలించేందుకు అయ్యే ఖర్సంతా వారే భరించాలి. అలా మా ఊరి జనాన్ని బాబు మీటింగ్‌కు తరలించేందుకు 22 లక్షల రూపాయలు ఇచ్చారు. రేపు వారి మీటింగ్‌కు వెళ్లాలన్నా మేం కూడా వాళ్లకు అంతే ఇవ్వాల్సిందే. 
ఓటరు:: అన్నా.. మీది ఏం ప్లాన్ అన్నా.. అదిరందన్నా. మరి ఓట్లేసేది ఎవరన్నా?
నాయకుడు: ఓట్లకత దేవుడికెరుకు..!
(న్యూస్‌లైన్-నెల్లూరు)

36 Comments

Filed under Uncategorized

36 responses to “అన్న పార్టీ మారిండ్రోయ్..!

 1. CV Reddy

  ఆదివారం 11 మార్చి 2012

  మీడియా తప్పు చేస్తే…

  రాజు తప్పు చేయడు అంటారు. అంటే రాజు ఏం చేసినా అది తప్పు కాదన్నమాట. మన మీడియా సైతం అలానే అనుకుంటోంది. మీడియా తప్పు చేయదు అని మరి అలా తప్పు చేస్తే విమర్శించాల్సిన అవసరం ఉందా? లేదా? ప్రజాస్వామ్య దేశంలో ప్రధానమంత్రి తప్పు చేసినా బోనులో నిలబడుతున్నారు. మీడియాలో ఉండేది కూడా మనుషులు మనుషులన్నాక తప్పులు ఎందుకు జరగవు. కొన్ని ఉద్దేశ పూర్వకంగా జరుగుతాయి. కొన్ని తెలియక జరుగుతాయి. మేం ఏది చేసినా సరైనదే అనుకోవడం కన్నా తప్పును ఒకరు ఎత్తి చూపినప్పుడు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం మంచిది. మీడియా తప్పులను ఎత్తి చూపుతూ మీడియా స్కాన్ పేరుతో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఒక పుస్తకాన్ని వెలువరించారు. ప్రతి వారం మీడియా పోకడలను ప్రస్తావిస్తూ ఈ వారంలో రాసిన వ్యాసాలతో మీడియా స్కాన్ పేరుతో పుస్తకంగా విడుదల చేశారు. ఒక దశాబ్దం క్రితం ఒక మీడియా మాటే వేదంగా చెలామణి అయింది. వాళ్లు వెన్నుపోటు అంటే అది వెన్నుపోటు, కాదు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ప్రజా స్వామ్య పరిరక్షణగా చెలామణి అయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పార్టీకో పత్రిక, ప్రాంతానికో పత్రిక, కులానికో పత్రిక కనిపిస్తోంది. మారిన ఈ పోకడ ఒక విధంగా ఆవేదన కలిగిస్తే, మరో విధంగా అభినందనీయం. ప్రజలను నమ్ముకోవడం కన్నా ఒకటి రెండుపత్రికలను నమ్ముకుని రాజకీయం చేద్దామనుకునేవారికి ఆటలు ఇక సాగవు అని చెప్పే విధంగా మీడియాలో పోటీ ఏర్పడడడం ప్రజాస్వామ్యానికి మంచిదే. తెలుగుమీడియాపై వచ్చిన ఎపి మీడియా బ్లాగ్ స్పాట్ డాట్‌కాం బ్లాగు గురించి మొదలు పెట్టి ఈనాడు , సాక్షి వివాదాల వరకు రచయిత మీడియాలోని అన్ని అంశాలను తన వ్యాసాల్లో ప్రస్తావించారు. ఒక పార్టీపై అభిమానమో, ఒక పత్రికపై ప్రేమ, మరో పత్రికపై వ్యతిరేకత అని కాకుండా నిష్పక్షపాతంగా పత్రికల ధోరణుల గురించి రాశారు. ఒక అంశంలో ఒక పత్రికను విమర్శించిన రచయిత మరో అంశంలో ఆ పత్రిక వైఖరిని మెచ్చుకోవడం ద్వారా తన నిష్పక్షపాత వైఖరిని చెప్పకనే చెప్పారు. రామోజీరావుతో వివాదం తరువాత ఆయన కుమారుడు సుమన్ సాక్షికి తన ఇంటర్వ్యూ ఇవ్వడం, ఆ అంశంపై చానల్స్‌లో జరిగిన చర్చను ప్రస్తావించారు. తెలుగు మీడియా ధోరణులు, రాజకీయ పక్షాలకు మద్దతుగా, వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారికి మంచి సమాచారం అందించారు రచయిత. తప్పు ఎత్తి చూపిన వారిని శత్రువుగా భావించాల్సిన అవసరం లేదు. తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి.
  ఇంగ్లీష్, తెలుగు దినపత్రికలతో పాటు చానల్స్‌లోని వార్తలను, వాటి ధోరణులను సమీక్షించారు. అదే విధంగా నవ్య వారపత్రిక ప్రత్యేక సాహిత్య సంచికపై వ్యాసం ఆకట్టుకునే విధంగా ఉంది. నవ్య వారపత్రిక శ్రీశ్రీపై ప్రత్యేక సంచిక వేసింది. సాధారణంగా సినిమా తారల ముఖ చిత్రంతో వార పత్రిక వెలువడినప్పుడు అమ్మే కాపీల కన్నా సాహిత్య సంచికగా వెలువడినప్పుడు తక్కువ కాపీలు అమ్ముడవుతాయి. కానీ ఇలాంటి ప్రత్యేక సంచికల ద్వారా ఆ పత్రికకు సాహిత్య విలువ ఏర్పడుతుందనే మంచి విషయం చెప్పారు.
  – మురళి
  మీడియా స్కాన్
  ( పత్రికలపై పరిశీలనా నేత్రం)
  రచయిత: డాక్టర్ నాగసూరి
  వేణుగోపాల్
  వెల:150 రూపాయలు
  పేజీలు 240
  ప్రతులకు : ఎన్‌కె పబ్లికేషన్స్
  24-8-1,సమీర రెసిడెన్సీ,
  విజయనగరం 535002
  ఫోన్ 094403 43479

  http://amruthamathanam.blogspot.in/

 2. CV Reddy

  మాకొకటి.. మీకొకటి… Suryaa

  హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: ఉప సమరానికి గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ చిత్రాలు రోజుకో రకంగా మారిపోతున్నాయి. ఒకవైపు ప్రచార పర్వాన్ని తీవ్రతరం చేస్తూనే మరోవైపు ఇచ్చి పుచ్చుకునే ప్రతిపాదనల జోరు ను ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, కాంగ్రెస్‌ పెంచు తున్నట్టు విశ్వసనీయ సమాచారం.తెలంగాణలో మిగి లిన స్థానాల మాట ఎలా ఉన్నా పాలమూరు జిల్లాలోని మూడు స్థానాలు అన్ని పార్టీలకూ ప్రతిష్ఠా త్మకమయ్యాయి. అందులోనూ టీడీపీ, కాంగ్రెస్‌ నాయకత్వాలకు నాగర్‌కర్నూలు, కొల్లాపురం స్థానాలు మరీ ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి. నాగర్‌ కర్నూలు విషయా నికి వస్తే అక్కడ స్వతంత్రుడుగా పోటీ చేస్తున్న నాగం జనార్దనరెడ్డి ఓటమిని చెవులారా వినాలని స్వయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉవ్విళ్ళూరుతున్నారు. కొల్లాపురంలో ఎలా చేసైనా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తన బద్ధ విరోధి జూపల్లి కృష్ణారావును మట్టి కరిపించి, తాను ఏరి కోరి టికెట్‌ ఇప్పించుకున్న విష్ణువర్ధన్‌రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి డీకేఅరుణ అహర్నిశలూ శ్రమిస్తున్నారు.

  స్వంత బలాలతో పని నడవదు….
  అయితే అటు టీడీపీ కానీ, ఇటు కాంగ్రెస్‌ కానీ ఈ లక్ష్యాలను సాధించాలంటే కేవలం స్వంత బలం ఒక్కటే సరిపోదు. ఆ సంగతి రెండు పార్టీల జిల్లా నాయకత్వాలకూ తెలుసు. నాగర్‌ కర్నూలులో నిన్న మొన్నటిదాక తెలుగుదేశం పార్టీలో ఉండి, బయటకు వచ్చి టీఆర్‌ఎస్‌, బీజేపీ మద్దతు తెలుపుతున్న నాగం జనార్దనరెడ్డిని ఓడించటం అంత సులభం కాదని, స్వశక్తికి అదనపు బలం జత అయితే తప్ప నాగం ఓటమికి బాటలు వేయలేమని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. నాగంను శాసనసభలో తాను చూడదలచలేదని చంద్రబాబు నాయుడు స్వయంగా నాయకత్వానికి చెప్పటంతో వారు మరింత పకడ్బందీ వ్యూహానికి తెర తీసినట్టు జిల్లాలోని పార్టీ శ్రేణుల నుంచి సమాచారం అంతర్గతంగా అందుతున్నది.

  ఇదీ తాజా వ్యూహం…
  నాగర్‌ కర్నూలులో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి నాగం జనార్దనరెడ్డి ప్రత్యర్థిగా మర్రి జనార్దనరెడ్డిని ఎంపిక చేసింది. అక్కడ దామోదర్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నాగం, టీడీపీ మధ్య నువ్వా నేనా అనే పరిస్థితి నెలకొంది. అయితే టీఆర్‌ఎస్‌, బీజేపీ మద్దతుతో పాటు పలు దఫాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, టీడీపీ నాయకుడుగా ఒక్క వెలుగు వెలిగిన నాగంను ఢీకొనటానికి తమ బలం మాత్రమే సరిపోదని, ప్రస్తుతానికి మూడవ స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ బలం లోపాయికారీగా తమకు కలసి వస్తే తప్ప సాధ్యం కాదని టీడీపీ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ రెండు ప్రధాన పార్టీల బలం జత కూడితే నాగం ఓటమి అంత కష్టమేమీ కాదని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం.

  అందుకు ప్రతిగా….
  అయితే అలా సహకరిస్తే మరి మాకేంటి? అనే ప్రశ్న కాంగ్రెస్‌ నుంచి ఎదురైనట్టు సమాచారం. కాంగ్రెస్‌ ఒకవేళ నాగర్‌కర్నూలులో లోపాయికారీగా స్నేహహస్తం అందిస్తే కొల్లాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డికి సహకరించే ప్రతిపాదనలను పరిశీలిస్తామని టీడీపీ నుంచి కాంగ్రెస్‌ శిబిరానికి వర్తమానం అందినట్టు విశ్వసనీయ సమాచారం. గత ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రస్తుత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జూపల్లిని గట్టిగానే ఢీకొన్న విష్ణువర్ధన్‌రెడ్డికి ఆ స్థానంలో ప్రస్తుతానికి మూడవ స్థానంలో ఉన్నట్టు భావిస్తున్న టీడీపీ సహకారం లభిస్తే జూపల్లిని చిత్తు చేయవచ్చునని మంత్రి డీకే అరుణతో పాటు స్థానిక కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది.

  ఇద్దరూ విరోధులే…
  టీడీపీ ఈ ప్రతిపాదన తేవటానికి మరో కారణం ఉంది. కొల్లాపురంలో జూపల్లితో ఎంత విరోధం ఉందో, అటు నాగంతో సైతం డీకే కుటుంబానికి వైరం ఉంది. నాగం మంత్రిగా ఉండగా ఆర్డీఎస్‌ విషయంలో మొదలైన గొడవ, తూములు పగలగొట్టిన సంఘటనలు, డీకేఅరుణ దీక్ష, ఆమె భర్త డీకే భరతసింహారెడ్డి చేస్తున్న వ్యాపారంపై నాగం గతంలో చేసిన వ్యాఖ్యలు అన్నీ జిల్లాలో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే నాగంపై కసి తీర్చుకోవాలంటే కాంగ్రెస్‌ సహకారంతో పాటు మంత్రి అరుణ చొరవ ఉపయోగపడుతుందని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యూహం ప్రకారం ప్రతిపాదనలు ఇప్పటికే రెండు పార్టీల నాయకత్వాలకు చేరాయని, దానిపై లాభనష్టాలు, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకునే పనిలో ఉన్నాయని తెలుస్తోంది.

  • CV Reddy

   సూర్యా పేపర్ తెలుగు దేశం పార్టీ పేపర్ కాబట్టి కేవలం రెండు చోట్ల అన్నాడు కానీ అన్ని చోట్ల కాంగ్రెస్, తెలుగు దేశం కలిసి పోయి పనిచేస్తున్నాయి.

 3. NLR

  @ admin

  Could u pls delete the Anantapur could be MLA list .
  I dont think it might be a good idea to post it here due to different reasons.

  I am sure Vissu garu wouldn’t mind it .

 4. sada

  vissu,

  Where did you get this info, Are you from anantpur distict?

 5. vissu

  list may change… i got info from few district party officials… they said there may be change..

 6. Vidya Sagar Reddy

  visu, ye raghuveera reddy?

 7. subbu

  Hi visu garu
  who is that raja maaraj i rayadurg kapu (ex mla)is not contesting

  • vissu

   he is sriramulu(Karnataka )’s follower. MP Pakkeerappa’s relative and B.C candidate… Kapu may not contest even in this by poll also…

 8. CV Reddy

  నలుగురికీ పరీక్షే!
  http://www.andhrabhoomi.net/content/litmus-test-four

 9. NLR

  Raghuveera garu ..What is this cheap politics ?? U are no different from some yellow caste fanatics .

  http://www.andhrabhoomi.net/content/raghuveera-0

  U cannot erase YSR from peoples hearts no matter what caste or religion they are .

  • sekar

   Yeah,…Although Raghuveera has Reddy tag behind…he is a yadav a BC like Thulasi reddy who is a Balija. These kind of guys win only due to party or other images not by their own image

 10. Pavithra

  We should have a strategy for all the 17 constiuencies immediately. With allocation of responsibilities for all crowd-pullers as well as good adminstrators like Dharmavarapu Subramaniam, who handled the election co-ordination during YSR Regime. We need to pull all resources to handle the election strategy. Once central co-ordination office, tie-up with all the Constituencies, with focus on collating the information for better data
  massaging and giving guidelines, actions to be taken,etc. This will be good reharsal for the final 2014 election or before that.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s