‘సాక్షి’కి న్యూస్ టెలివిజన్ అవార్డుల పంట

న్యూఢిల్లీ: అనతికాలంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ‘సాక్షి’ వార్తాచానల్‌కు న్యూస్ టెలివిజన్ అవార్డుల పంట పండింది. పలు విభాగాల్లో ‘సాక్షి’ అవార్డులు దక్కించుకుంది. ‘సాక్షి’లో ప్రసారమవుతున్న పొలిటికల్ సెటైర్ షో ‘డింగ్‌డాంగ్’ జాతీయ ఉత్తమ వినోద వార్తా కార్యక్రమ పురస్కారానికి ఎంపికయింది. బెస్ట్ పరిశోధనాత్మక ఫీచర్‌గా ‘వేద ఘోష’, బిజినెస్ ఫీచర్‌గా ‘రూపాయీ’, ఉత్తమ పాపులర్ న్యూస్ షోగా ‘వరల్డ్ టుడే’, ఉత్తమ ప్రోమో క్యాంపెయిన్‌గా ‘సేవ్ ఏ గర్ల్ చైల్డ్’తో రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే ప్రైమ్ టైమ్ షో అవార్డులు దక్కించుకున్నాయి. 2011 బడ్జెట్‌పై ‘సాక్షి’ ప్రసారం చేసిన కార్యక్రమం ఉత్తమ బిజినెస్ టాక్ షోగా పురస్కారం గెల్చుకుంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ‘సాక్షి’ టీవీ మార్కెటింగ్ డెరైక్టర్ రాణిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ యాదవ్ ఈ అవార్డులు అందుకున్నారు.

15 Comments

Filed under Uncategorized

15 responses to “‘సాక్షి’కి న్యూస్ టెలివిజన్ అవార్డుల పంట

 1. CVR Murthy

  There are two basic principles in politics.
  1. Never Write off any one in politics. 2. Never under estimate opponent.
  This is particularly so in the last few decades of Indian politics. Almost always opposition wins because of negative vote against government.

  YSRCP should no take 18 elections easy, should not assume that it will be a walkover .

 2. NLR

  No dogs in the assembly when a represtative of the Legend is sworn in.
  It reflects how scared they are to face the reality.
  Just two more years/less, there will be a thumping applause for all our MLA’s.
  Nice to see Prasanna wearing YSRCP scarf in the assembly.

  http://www.sakshitv.com/index.php?option=com_content&view=article&id=23081:2012-03-29-04-48-30&catid=109:2010-11-23-18-17-06&Itemid=757

  Well done Prasanna garu ..Guts to resign and come back.. fighting against all odds .

 3. RM Reddy

  Remove Amar , he pauses alot wile reading . he is not fluent nor spontaneous . If Sakshi need Telangana face , bring someone else who can atleast read .

  • rakesh

   Amar is the best from the resources we have in sakshi tv

  • purandhara

   RM REDDY gaaru,

   AMAR gaaaru HADAVIDI yemi lekundaa COOL gaa conduct chesthaaru…I think he is THE BEST among all…SAKSHI start chesinappudu kudaaa aayane vunnaaru….I have no complaints with him

 4. CV Reddy

  A conspiracy so immense
  http://www.thehansindia.info/News/Article.asp?category=1&subCategory=2&ContentId=48989

  Got much to do with Ameerpet landscam: BP Acharya

  My arrest came just within a week after giving my witness in the ACB court on the Ameerpet land scam.

  Those behind the land scam must be apprehensive of my stand on the issue. I have been opposing the de-notification exercise intended to give away prime land in the heart of the city, which in fact would mean a huge loss to the state”, he adds.

 5. CV Reddy

  తెలుగు దేశం కు పునర్వైభవం సాధ్యమేనా?
  http://amruthamathanam.blogspot.in/
  Summary:

  ఎన్టీఆర్ నాయకత్వంలో 94లో జరిగిన ఎన్నికల్లో టిడిపికి 44 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తరువాత బాబు నాయకత్వంలోకి పార్టీ వచ్చాక క్రమంగా ఓట్ల శాతం పడిపోతూనే ఉంది. 99లో బిజెపి సానుభూతి పని చేసి 39 శాతం ఓట్లు వచ్చాయి. 2004లో 37 శాతం వస్తే, 2009 నాటికి 28 శాతానికి పడిపోయాయి. ఇప్పుడు వామపక్షాలు సైతం దూరమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. 2009 అసెంబ్లీ సాధారణ ఎన్నికల తరువాత 21 అసెంబ్లీ నియోజక వర్గాలకు, ఒక పార్లమెంటు నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరిగితే, అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. రాయలసీమ, కోస్తా, తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఈ రెండు ప్రధాన పక్షాలు ఘోరంగా ఓడిపోయాయి. గెలుపు మాట అటుంచి 21 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను టిడిపి కేవలం మూడు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కించుకుంది.

  మీడియా మద్దతు, బలమైన సామాజిక వర్గం అండ దండలు సైతం టిడిపిలో ఉత్సాహాన్ని నింపలేకపోతున్నాయి.

  బిజెపికి రాష్ట్రంలో సొంతంగా 18 శాతం ఓట్లు వచ్చాయి, టిడిపితో చేతులు కలిపిన తరువాత 2 శాతానికి పడిపోయంది. 2004లో బిజెపితో పొత్తు వల్ల ఓడిపోయాం అని బాబు ప్రకటించారు. 2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తు వల్ల ఓడిపోయినట్టు చెప్పుకున్నారు. 2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తు లేకపోతే ప్రజారాజ్యం, టిఆర్‌ఎస్, సిపిఐ కలిసి పోటీ చేసేవి, అలా జరిగితే అప్పుడు తెలిసేది. ఒక్క ఓటుతో వాజ్‌పాయి ప్రభుత్వం ఓడిపోవడం వల్ల వచ్చిన సానుభూతి వల్ల 99లో గెలిచిన విషయం ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోని బాబు బిజెపి వల్ల ఓడాం అని చెప్పినా టిడిపి, బిజెపి బంధాన్ని ముస్లింలు మరిచిపోలేక పోతున్నారు.

  కులాన్ని అత్యధికంగా ఉపయోగించుకుంటున్న నాయకుడు ఆయనే, పార్టీ ఆయనదే. చివరకు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, ఆరోపణలు ఎవరు చేయాలో కుల ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఎన్టీఆర్ భవన్‌లో రెడ్డి నాయకుని విలేఖరుల సమావేశం అంటే కాంగ్రెస్ లేదా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి నాయకులపై విమర్శల కోసం అని ముందే నిర్ణయించుకోవచ్చు. ప్రత్యర్థి పార్టీలో ఏ కులం నాయకున్ని విమర్శించాలంటే అదే కులానికి చెందిన టిడిపి నాయకులతో ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేయిస్తారు.

  టిడిపి సామాజిక వర్గంతో అనుబంధంగా ఉండే కులాల కన్నా టిడిపి వ్యతిరేక శిబిరాల్లోని కులాల వారి ఓట్లు అధికం అదే ఇప్పుడు టిడిపి కొంప ముంచింది. జగన్ అవినీతిపై టిడిపి, టిడిపికి అండగా నిలిచే వర్గాలు ఎంత వ్యతిరేక ప్రచారం సాగించినా, ఎన్నికల్లో అది పని చేయకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. టిడిపి తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునే బలమైన వర్గం ఒకవైపు జగన్ వ్యతిరేక ప్రచారం విస్తృతం చేస్తూ మరోవైపు తెలంగాణ అంశాన్ని మరుగున పరచడానికి ఎంత ప్రయత్నించాలో అంత వరకు ప్రయత్నించారు. కానీ రెండింటిలోనూ విజయం సాధించలేకపోయారు.
  2009 ఎన్నికలకు ముందు టిడిపికి అండగా నిలిచే వర్గం తన సర్వశక్తులు ఒడ్డింది. యువగర్జనలో ఈ శక్తుల బలప్రదర్శనగా జరిగింది. ఇప్పుడు చివరకు ఈ వర్గంలో సైతం బాబు పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది.

  కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలో ఉన్న తరువాత మూడవ సారి జరిగే ఎన్నికల్లో సులభంగా గెలుస్తామనుకున్న టిడిపికి కాంగ్రెస్ స్థానంలో సీమాంధ్రలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రత్యర్థులుగా నిలవడం మింగుడుపడడం లేదు.

  • NLR

   I think Babu has changed the slogan for TDP in the last 10 years from..

   TDP Pilusthundhi… ra…kadhali ra.

   to
   TDP Pilusthundhi…po….pari po !!!

 6. CV Reddy

  తెలుగు దేశం కు పునర్వైభవం సాధ్యమేనా?
  http://amruthamathanam.blogspot.in/

  వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్టీరామారావు 1982 మార్చి 29న ఏర్పాటు చేసిన టిడిపి , రెండవ తరం నాయకుని చేతిలో 30 ఏళ్లను పూర్తి చేసుకుని 31వ ఏట అడుగుపెడుతోంది. బాబు పార్టీకి పూర్వవైభవం తీసుకు రాగలరా? మూడవ తరం నాయకుడు బాబు కుమారుడా? బాలకృష్ణనా, హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆరా? ఇప్పుడు టిడిపి శ్రేణులను తొలుస్తున్న ప్రశ్నలివి. వీటికి 2014 ఎన్నికల తరువాతనే సమాధానాలు లభిస్తాయి. మీడియా ఎంత అండగా నిలిచినప్పటికీ ఒకప్పుడు ఉజ్వలంగా వెలుగొందిన టిడిపి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మరో రెండేళ్లలో మూడవ సారి ఎన్నికలు ఎదుర్కోవాలి. రాజకీయాల్లో రెండేళ్లు అంటే సుదీర్ఘ కాలమే! ఒక్క చిన్న సంఘటన చాలు ఎన్నికల్లో జయాపజయాలను మార్చివేయడానికి. అలాంటిది రెండేళ్లలో ఏం జరుగుతుందో చెప్పలేం అంటూ అనుకూల మాటలు ఎన్ని చెప్పుకున్నా ఏ కోణంలోనూ టిడిపికి ఆశాజనకమైన వాతావరణం కనిపించడం లేదు. తెలంగాణలో తెలంగాణ వాదం, సీమాంధ్రలో జగన్ బలం ఈ రెండూ టిడిపిని ఆడకత్తెరలో పోకచెక్కలా మార్చేశాయి.

  ఎన్టీఆర్ నాయకత్వంలో 94లో జరిగిన ఎన్నికల్లో టిడిపికి 44 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తరువాత బాబు నాయకత్వంలోకి పార్టీ వచ్చాక క్రమంగా ఓట్ల శాతం పడిపోతూనే ఉంది. 99లో బిజెపి సానుభూతి పని చేసి 39 శాతం ఓట్లు వచ్చాయి. 2004లో 37 శాతం వస్తే, 2009 నాటికి 28 శాతానికి పడిపోయాయి. ఇప్పుడు వామపక్షాలు సైతం దూరమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. 2009 అసెంబ్లీ సాధారణ ఎన్నికల తరువాత 21 అసెంబ్లీ నియోజక వర్గాలకు, ఒక పార్లమెంటు నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరిగితే, అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. రాయలసీమ, కోస్తా, తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఈ రెండు ప్రధాన పక్షాలు ఘోరంగా ఓడిపోయాయి. గెలుపు మాట అటుంచి 21 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను టిడిపి కేవలం మూడు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కించుకుంది.

  మీడియా మద్దతు, బలమైన సామాజిక వర్గం అండ దండలు సైతం టిడిపిలో ఉత్సాహాన్ని నింపలేకపోతున్నాయి. ‘సంక్షోభంలో ఉన్నది టిడిపి కాదు… రాష్ట్రం సంక్షోభంలో ఉంది… రాష్ట్ర ప్రజలు సంక్షోభంలో ఉన్నారు’ అంటూ బాబు ఎంత మాటల గారడీ చేస్తున్నా, టిడిపి తన జీవితంలో ఇంతకు ముందెన్నడూ లేనంత సంక్షోభంలో ఉంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వయసు 38 ఏళ్లు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ విజయం సాధించగానే అఖిలేష్ చేసిన మొదటి ప్రకటన సమాజ్‌వాది పార్టీది గుండాల రాజ్యం అనే ముద్రను చెరిపివేయడానికి కృషి చేస్తామని ప్రకటించారు.

  తప్పులు ఏమిటో గుర్తించుకుంటే వాటిని ఎలా సవరించుకోవాలో ఆలోచన వస్తుంది. తొలిసారి ఓటమి చెందగానే ఎందుకలా జరిగిందో సమీక్షించుకొని, లోపాలను నిజాయితీగా బహిరంగంగా ఒప్పుకుంటే పార్టీకి మేలు జరిగేది. బిజెపికి రాష్ట్రంలో సొంతంగా 18 శాతం ఓట్లు వచ్చాయి, టిడిపితో చేతులు కలిపిన తరువాత 2 శాతానికి పడిపోయంది. 2004లో బిజెపితో పొత్తు వల్ల ఓడిపోయాం అని బాబు ప్రకటించారు. 2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తు వల్ల ఓడిపోయినట్టు చెప్పుకున్నారు. 2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తు లేకపోతే ప్రజారాజ్యం, టిఆర్‌ఎస్, సిపిఐ కలిసి పోటీ చేసేవి, అలా జరిగితే అప్పుడు తెలిసేది. ఒక్క ఓటుతో వాజ్‌పాయి ప్రభుత్వం ఓడిపోవడం వల్ల వచ్చిన సానుభూతి వల్ల 99లో గెలిచిన విషయం ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోని బాబు బిజెపి వల్ల ఓడాం అని చెప్పినా టిడిపి, బిజెపి బంధాన్ని ముస్లింలు మరిచిపోలేక పోతున్నారు. టిడిపికి చేరువ కాలేకపోతున్నారు.
  అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా పాలించాము అని ప్రచారం చేసుకున్న బాబుకు ఓటమికి కారణాలు చెప్పుకోవడానికి మనసు ఒప్పలేదు. అహం అడ్డు వచ్చినట్టుగా ఉంది. మేం ప్రజలకు మంచి చేయడం వల్లనే ఓడిపోయాం, అవినీతికి దూరంగా ఉండడం వల్లనే ఓడాం అని టిడిపి నాయకత్వం వింతైన వాదనలు చేస్తుంది. గుండారాజ్ అనే ముద్ర చెరిపేసుకుంటాం అని అఖిలేష్ ప్రకటించారంటే అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ వాళ్లు గుండాల్లో వ్యవహరించారని అతను నిర్మొహమాటంగా ఒప్పుకున్నట్టే. తాము ఎక్కడ తప్పు చేశామో గ్రహించి వాటిని సవరించుకోవడానికే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇచ్చామని అఖిలేష్ బహిరంగంగానే చెప్పారు. మేం సంక్షోభంలో లేం, రాష్ట్రం, రాష్ట్ర ప్రజలే సంక్షోభంలో ఉన్నారని ఒకవైపు చెబుతూనే మరోవైపు టిడిపికి సంక్షోభాలు కొత్త కాదు అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలతో ఏ మాత్రం పరిచయం వారికి బాబు మాటలు వింటే ముచ్చటేస్తుంది. రాజకీయ పక్షాలు ఎన్నికల్లో డబ్బును గుమ్మరిస్తున్నాయి, కులాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఇవి బాబు కనిపెట్టిన విషయాలు. ఇవాయన కనిపెట్టినవి కాదు ఆయన రాజకీయాల్లో మొదటి నుంచి అమలు చేస్తున్నవి. కులాన్ని అత్యధికంగా ఉపయోగించుకుంటున్న నాయకుడు ఆయనే, పార్టీ ఆయనదే. చివరకు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, ఆరోపణలు ఎవరు చేయాలో కుల ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఎన్టీఆర్ భవన్‌లో రెడ్డి నాయకుని విలేఖరుల సమావేశం అంటే కాంగ్రెస్ లేదా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి నాయకులపై విమర్శల కోసం అని ముందే నిర్ణయించుకోవచ్చు. ప్రత్యర్థి పార్టీలో ఏ కులం నాయకున్ని విమర్శించాలంటే అదే కులానికి చెందిన టిడిపి నాయకులతో ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేయిస్తారు.

  సీమాంధ్ర రాజకీయాల్లో కులానిది ప్రధాన పాత్ర కాగా, తెలంగాణలో కులం ప్రభావం తక్కువ, తెలంగాణ వాదమే ప్రధానం. కులం కార్డుతో తెలంగాణ వాదాన్ని మరుగున పరచడానికి తీవ్రంగానే ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. టిడిపి ఆవిర్భావం నుంచి ఏ ప్రాంతంలో ఏ కులం ఓట్ల శాతం ఎంత? కాంగ్రెస్ ఏ కులానికి టికెట్ ఇస్తే మనం ఏ కులానికి ఇవ్వాలి అని లెక్క పెట్టుకునేది. పార్టీ బాబు నాయకత్వంలోకి వచ్చాక ఇది మరీ పెరిగిపోయింది. రోజు రోజుకు కులం ప్రభావం అధికం కావడంతో ఈ సమస్య చివరకు టిడిపి తలకు చుట్టుకుంది. టిడిపి సామాజిక వర్గంతో అనుబంధంగా ఉండే కులాల కన్నా టిడిపి వ్యతిరేక శిబిరాల్లోని కులాల వారి ఓట్లు అధికం అదే ఇప్పుడు టిడిపి కొంప ముంచింది. జగన్ అవినీతిపై టిడిపి, టిడిపికి అండగా నిలిచే వర్గాలు ఎంత వ్యతిరేక ప్రచారం సాగించినా, ఎన్నికల్లో అది పని చేయకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. టిడిపి తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునే బలమైన వర్గం ఒకవైపు జగన్ వ్యతిరేక ప్రచారం విస్తృతం చేస్తూ మరోవైపు తెలంగాణ అంశాన్ని మరుగున పరచడానికి ఎంత ప్రయత్నించాలో అంత వరకు ప్రయత్నించారు. కానీ రెండింటిలోనూ విజయం సాధించలేకపోయారు. అయితే సమైక్యవాదం లేదంటే, తెలంగాణ ఉద్యమానికి కెసిఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకత్వం అనే సిద్ధాంతంతో తొలుత విజయశాంతిని, తరువాత గద్దర్‌ను ఆకాశానికెత్తారు. విజయశాంతి టిఆర్‌ఎస్‌లో చేరగా, గద్దర్ తన శక్తి తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడుతుందని భావించినా కెసిఆర్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలువలేనని గ్రహించారు. 2009 ఎన్నికలకు ముందు టిడిపికి అండగా నిలిచే వర్గం తన సర్వశక్తులు ఒడ్డింది. యువగర్జనలో ఈ శక్తుల బలప్రదర్శనగా జరిగింది. ఇప్పుడు చివరకు ఈ వర్గంలో సైతం బాబు పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది.

  తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది? జగన్‌ను అరెస్టు చేస్తారా? వీటికి ఇప్పటికిప్పుడు సమాధానం లభించని ప్రశ్నలు. నిజమే ఈ రెండు సమస్యలను కాంగ్రెస్ హై కమాండ్ ఎలా పరిష్కరిస్తుందో తెలియదు. కానీ టిడిపికి ప్రయోజనం కలిగే విధంగా ఈ రెండు సమస్యలు పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ ఎందుకనుకుంటుంది. జగన్, టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది అనేది టిడిపి కొత్త ప్రచారం. టిడిపి తిరిగి అధికారంలోకి రావాలంటే అది జరిగి తీరాలి. కాబట్టి టిడిపి శ్రేయోభిలాషులు ఆ కోరిక కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఎందుకు విలీనం అవుతారు. కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ అని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు అది టైటానిక్ లాంటి గొప్ప పడవ అయినా కావచ్చు కానీ మునిగేప్పుడు అందులో ఎక్కేవారుంటారా? కాంగ్రెస్ వ్యతిరేకతే సిద్ధాంతంగా ఉన్న టిడిపికి కాంగ్రెస్ మరీ బలహీనపడిపోవడం కలవరపెడుతోంది. తమతో ఓడిపోయే స్థాయిలో కాంగ్రెస్ ఉండాలని టిడిపి కోరుకుంటోంది కానీ సోదిలో లేకుండా పోయే స్థాయిలో ఉంటే అది టిడిపికి సైతం నష్టమే. అదే ఇప్పుడు టిడిపి సమస్య. కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలో ఉన్న తరువాత మూడవ సారి జరిగే ఎన్నికల్లో సులభంగా గెలుస్తామనుకున్న టిడిపికి కాంగ్రెస్ స్థానంలో సీమాంధ్రలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రత్యర్థులుగా నిలవడం మింగుడుపడడం లేదు. ఒకవైపు అసలు నాయకుడే లేని కాంగ్రెస్, మరోవైపు అవినీతి ఆరోపణలున్న జగన్, అయినా వీరిని ఎదుర్కోలేని నిస్సహాయ స్థితిలోకి టిడిపిని ఆ పార్టీ నాయకత్వం నెట్టివేయడం సంక్షోభం కాకుంటే మరేమిటి?
  -బుద్దా మురళి

 7. Sekar

  Amar has good knowledge with a good tone…but he is not fluent in reading. I see him him stumbling while reading quite a few times.

 8. CV Reddy

  నాకు గుర్తింపు లేదు
  http://www.andhrabhoomi.net/content/naaku
  న్యూఢిల్లీ, మార్చి 28: ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు. ప్రస్తుతం అదే పార్టీకి అధినేతగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడుకు స్వయానా బావమరిది. అయినప్పటికీ ఇతరులకు లభిస్తున్న గౌరవంలో కాస్త అయినా తనకు దక్కడం లేదని, పార్టీలో సరైన ప్రాధాన్యత లభించటం లేదన్న ఆవేదనతో కుమిలిపోతున్నారు. పార్టీలోనేగాక చివరకు పార్లమెంటులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా తనకు తగిన స్థానం లభించటం లేదన్న భావన ఆయనను వెంటాడుతోంది. ఆయనే రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ. ఎన్టీఆర్ తనయుడైనప్పటికీ పార్టీ కార్యాలయం బయట సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సోఫాలో కూర్చుంటున్నారు హరికృష్ణ. ఇదేమని అడిగితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం లోపల కూర్చోవటానికి తగినన్ని కుర్చీలు లేవని, కార్యాలయంలోని మొత్తం సీట్లు కార్పొరేట్ రంగానికి, వారి ప్రతినిధులకు రిజర్వ్ అయిపోయాయని అంటున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పేదవారి కోసం, కష్టించి పనిచేసే కార్యకర్తల కోసం ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తిగా వేలాది కోట్లకు పడగలెత్తిన కార్పొరేట్ రంగానికి అమ్ముడుపోయిందని హరికృష్ణ బుధవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో మధుకాన్ సంస్థ అధిపతి నామా నాగేశ్వర్‌రావు, సృజనా సంస్థల అధిపతి వైఎస్ చౌదరి, రాంకీ గ్రూప్‌నకు చెందిన ఎం వేణుగోపాల్ రెడ్డి పార్టీలో కార్పొరేట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న ఆయన ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సిఎం రమేష్, దేవేందర్ గౌడ్ ఎంపికపైనా అసంతృప్తి వ్యక్తంచేశారు. సిఎం రమేష్ వ్యాపార రంగానికి చెందిన వారేనని, దేవేందర్ గౌడ్‌కు కూడా రియల్ ఎస్టేట్, ఫార్మా పరిశ్రమతో సంబంధాలున్నాయన్నారు. ఫలితంగా పార్లమెంటులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజకీయ పార్టీ కార్యాలయంగాక ఒక కార్పొరేట్ కార్యాలయానికి దిగజారిందని పార్టీ అధినేత వైఖరి పట్ల తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు.
  అయితే పార్టీ అధినేత చంద్రబాబుతో తీవ్రంగా విభేదిస్తున్న హరికృష్ణ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో వ్యవహరిస్తున్న తీరు పార్టీలోని కార్పొరేట్ దిగ్గజాలకు కలవరం పుట్టిస్తోంది. రాజ్యసభలో ఒంటరిగా కూర్చుంటున్న ఆయన కనీసం పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టేందుకు సైతం అయిష్టత ప్రదర్శిస్తున్నారు. దీంతో హరికృష్ణను బుజ్జగించి పార్టీలో అభిప్రాయభేదాలు లేవని నమ్మించటానికి సీనియర్ నాయకులు పడరానిపాట్లు పడుతున్నారు.

 9. MSR_YSR

  Amar seems to be doing well in prime time show, infact better than Murali Krishna. He has good knowledge on politics n also history.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s