తిరుపతి – న్యూస్‌లైన్ ప్రతినిధి: అవినీతికి చిరునామా అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి మీద నిత్యం అవినీతి ఆరోపణలు చేయడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య ఆవేదన చెందారు. నిత్యం జనంలో తిరుగుతూ వారి బాధల్లో భాగం పంచుకుంటున్న జగన్‌మోహన్ రెడ్డి మీద చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష సాధింపో అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు. ఆదివారం ఆయన ‘న్యూస్‌లైన్ ప్రతినిధి’తో మాట్లాడారు. ప్రజల గుండెల్లో చోటు సం పాదించిన ప్రజా నాయకులు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ తర్వాత జగన్‌మోహన్‌రెడ్డే అన్నారు.
రాజకీయ కుట్రలతో, ప్రజల మెదడు చెడగొట్టేందుకు చంద్రబాబు, కాంగ్రెస్ చేసిన కుట్రలు ఏవీ ఫలించవని కడప, పులివెందుల, కోవూరు ఉప ఎన్నికలు రుజువు చేశాయని ఆయన చెప్పారు. తాను చంద్రబాబు మీద కోపంతో ఈ మాటలు మాట్లాడటం లేదనీ, జనాన్ని ఆయన ఏమార్చేందుకు చేస్తున్న ఆరోపణలు, కుట్రలు తనకు బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
జగన్ మోహన్‌రెడ్డిని ప్రజలు నమ్ముతున్నారనీ, అందుకే ఆయన వెంట జనం కదలి వస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా జగన్ లాగా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి నమ్మకం, అభిమానం సంపాదించే ప్రయత్నం చేయాలని సూచించారు. అంతే కానీ తన రాజకీయ స్వలాభం కోసం నోటికొచ్చిన మాటలు మాట్లాడటం పద్ధతి కాదన్నారు. చంద్రబాబు ఏమిటో బాగా తెలిసిన తన లాంటి వారికి ఆయన మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ఆయన ఎదుటి వారి మీద అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు.
చంద్రబాబును పార్టీ నాయకులు, కార్యకర్తలే నమ్మడం లేదనీ, అలాంటప్పుడు ప్రజ లు ఎలా నమ్ముతారని మునిరామయ్య ప్రశ్నించారు. చంద్రబాబుకు జగన్ ఫోబియా పట్టుకుందనీ, వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు జనానికి గుర్తున్నంత కాలం జగన్‌ను ఏ శక్తీ ఏమీ చేయలేదన్నారు. ఇదిలా ఉండగా మునిరామయ్య పార్టీలో ఉంటూనే జగన్‌కు మద్దతుగా మాట్లాడిన విషయం తెలియడంతో నగరి ఎమ్మెల్యే ముద్దు కృష్ణమ నాయుడు ఆయనతో మాట్లాడారు. చంద్రబాబు వ్యవహార తీరు చూసి బాధతోనే తానీ వ్యాఖ్యలు చేశానని మునిరామయ్య ఆయనకు సమాధానం ఇచ్చారని తెలిసింది. సీనియర్ టీడీపీ నాయకుడు మునిరామయ్య చేసిన వ్యాఖ్యలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
Will Roja Contest in Bi-elections from ATP?
If it is true,that is good for us..I want to see Roja as MLA once and I want to see Roja speech in assembly while blasting boli babu..
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/03042012/Details.aspx?id=1269508&boxid=25845372
http://greatandhra.com/viewnews.php?id=36906&cat=15&scat=16
JAGAN in Narsapur …
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=350276&subcatid=19&Categoryid=3
Vangaveeti into YSRCP ..
http://www.sakshitv.com/index.php?option=com_content&view=article&id=23346:2012-04-02-15-06-39&catid=109:2010-11-23-18-17-06&Itemid=757
http://www.ndtv.com/article/andhra-pradesh/chargesheet-against-jagan-refers-to-his-massively-popular-father-ysr-192774?pfrom=home-lateststories
తిరుపతి – న్యూస్‌లైన్ ప్రతినిధి: అవినీతికి చిరునామా అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి మీద నిత్యం అవినీతి ఆరోపణలు చేయడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య ఆవేదన చెందారు. నిత్యం జనంలో తిరుగుతూ వారి బాధల్లో భాగం పంచుకుంటున్న జగన్‌మోహన్ రెడ్డి మీద చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష సాధింపో అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు. ఆదివారం ఆయన ‘న్యూస్‌లైన్ ప్రతినిధి’తో మాట్లాడారు. ప్రజల గుండెల్లో చోటు సం పాదించిన ప్రజా నాయకులు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ తర్వాత జగన్‌మోహన్‌రెడ్డే అన్నారు.
రాజకీయ కుట్రలతో, ప్రజల మెదడు చెడగొట్టేందుకు చంద్రబాబు, కాంగ్రెస్ చేసిన కుట్రలు ఏవీ ఫలించవని కడప, పులివెందుల, కోవూరు ఉప ఎన్నికలు రుజువు చేశాయని ఆయన చెప్పారు. తాను చంద్రబాబు మీద కోపంతో ఈ మాటలు మాట్లాడటం లేదనీ, జనాన్ని ఆయన ఏమార్చేందుకు చేస్తున్న ఆరోపణలు, కుట్రలు తనకు బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
జగన్ మోహన్‌రెడ్డిని ప్రజలు నమ్ముతున్నారనీ, అందుకే ఆయన వెంట జనం కదలి వస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా జగన్ లాగా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి నమ్మకం, అభిమానం సంపాదించే ప్రయత్నం చేయాలని సూచించారు. అంతే కానీ తన రాజకీయ స్వలాభం కోసం నోటికొచ్చిన మాటలు మాట్లాడటం పద్ధతి కాదన్నారు. చంద్రబాబు ఏమిటో బాగా తెలిసిన తన లాంటి వారికి ఆయన మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ఆయన ఎదుటి వారి మీద అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు.
చంద్రబాబును పార్టీ నాయకులు, కార్యకర్తలే నమ్మడం లేదనీ, అలాంటప్పుడు ప్రజ లు ఎలా నమ్ముతారని మునిరామయ్య ప్రశ్నించారు. చంద్రబాబుకు జగన్ ఫోబియా పట్టుకుందనీ, వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు జనానికి గుర్తున్నంత కాలం జగన్‌ను ఏ శక్తీ ఏమీ చేయలేదన్నారు. ఇదిలా ఉండగా మునిరామయ్య పార్టీలో ఉంటూనే జగన్‌కు మద్దతుగా మాట్లాడిన విషయం తెలియడంతో నగరి ఎమ్మెల్యే ముద్దు కృష్ణమ నాయుడు ఆయనతో మాట్లాడారు. చంద్రబాబు వ్యవహార తీరు చూసి బాధతోనే తానీ వ్యాఖ్యలు చేశానని మునిరామయ్య ఆయనకు సమాధానం ఇచ్చారని తెలిసింది. సీనియర్ టీడీపీ నాయకుడు మునిరామయ్య చేసిన వ్యాఖ్యలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
Will Roja Contest in Bi-elections from ATP?
If it is true,that is good for us..I want to see Roja as MLA once and I want to see Roja speech in assembly while blasting boli babu..
What is ATP ??
same doubt
anantapur
ATP Means ANANTAPUR RAYA DURGAM
@ Ratna reddy garu ..
Thank u. I heard it in biology as a kid !!!