పాపం బాబుదేశం

పాపం బాబుదేశం-వీక్ పాయింట్

http://www.andhrabhoomi.net/content/papam-babu-desam

సైకిల్ పార్టీ వాళ్లు చంచల్‌గూడ జైలు ముందు ఓ సస్పెన్షన్ కౌంటరు పెట్టుకుంటే సరి! వారి మందలోని ఎమ్మెల్యేనో, ఎంపీనో, మరొకరో శత్రువుతో ములాకత్ అయి బయటికి రాగానే గేటు దగ్గరే సస్పెన్షను పత్రం చేతికిస్తే వారికీ సుఖం. అందుకునే వారికీ సుఖం. వారూ వీరూ తిట్టుకునే తిట్లను లోకానికి వెదజల్లాల్సిన మీడియా నారదులకు మరీ సౌకర్యం. పనిలో పనిగా లోటస్‌పాండు గడీ దగ్గరా ఇంకో ఎక్స్‌టెన్షన్ కౌంటరు తెరిచి జగన్‌మాతను కలిసొచ్చే పాపులకూ అక్కడికక్కడే శుభలేఖ అందజేస్తే బెస్టు!

కులదీపకుడు బాబు ఏమి చేసినా, ఏమి చేయకపోయినా భళా అని ఆకాశానికెత్తడానికి మిత్ర మీడియా ఎప్పుడూ సిద్ధమే. అలాగని తాము ఏమి చేసినా చెల్లుతుందని బాబు దేశం ఆసాములు అహంకరిస్తే కాస్త డేంజరు. ఎందుకంటే రోజులు మారాయి. అన్నీ నమ్మి, మళ్లీ మళ్లీ మోసపోవడానికి జనం సిద్ధంగా లేరు. ఖర్మం చాలకపోతే మన ఆయుధం మనకే ఎదురుతిరగవచ్చు. ఎవరినో కలిసినంత మాత్రానే, అది పెత్తందారెవరికో ఒళ్లు మండించిన మాత్రానే ఎంతటివాడినైనా ఉన్నపళాన వేటువేయటం రైటు అని స్థిరం చేసే పక్షంలో రేపు అలాంటి వేటే నేటి పెత్తందార్లమీదా పడవచ్చు.
అసలే గ్రహచారం బాగా లేదు. చూస్తూనే ఉన్నాం కదా? ఒకప్పుడు దేశ రాజధానిలోనే చక్రం తిప్పి ప్రధానమంత్రిగా ఎవరుండాలో, రాష్టప్రతిగా ఎవరిని ఎన్నుకోవాలో, సెంట్రల్ గవర్నమెంటు పాలసీలను ఎవరికోసం ఎలా వంచాలో నిర్దేశించగలిగిన సూపర్‌మాన్ బాబుకు నేడు సొంత పార్టీలోనే చక్రం సరిగా తిరగని స్థితి! బిల్ క్లింటన్, టోనీ బ్లేర్లకే చదువు చెప్పగలిగిన విజన్ 2020 రూపశిల్పికి 2014 ఎన్నికల్లో పరువు నిలుపుకోవటం ఎలాగన్నదే దిక్కుతోచడం లేదు.
2009 జనరల్ ఎలక్షన్ల తరవాత 41 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే పనిమంతుడు బాబుగారి పార్టీ వాటిలో ఒక్క సీటూ గెలవలేదు. అంతేగాక 22 చోట్ల జయప్రదంగా డిపాజిట్లు పోయాయి. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు బాబును సమానంగా ఆదరిస్తున్నారు. డిపాజిట్లు మూడు ప్రాంతాల్లోనూ గల్లంతయ్యాయి.
కాలం కలిసొచ్చినప్పుడు నాయుడుగారు ఏ ఎత్తు వేసినా పారింది. నాలుక ఎలా మడత వేసినా చెల్లింది. మద్యనిషేధం అవసరమని ఎంత గట్టిగా వాదించాడో అక్కర్లేదని అంత ఘాఠ్ఠిగానూ జనాన్ని నమ్మించగలిగిన బుద్ధిశాలి ఆయన. సెక్యులర్ ఫ్రంటులో ఊరేగినంతకాలమూ కమ్యూనల్ దుష్టశక్తిగా తాను దూషించిన భాజపాతోనే ఎన్డీఎ పందిరికింద మంచం పొత్తు పెట్టుకుని నెగ్గగలిగిన మాటకారి ఆయన. ఏం లాభం? చాకచక్యంలో చాణక్యుడిని చంపి పుట్టినా, చేటుకాలం దాపురించాక అతి తెలివితేటలు నారా వారికి ఎందుకు పనికి రాకుండా పోయాయి. తెలంగాణను ఒక కంటా, సీమాంధ్రను ఇంకో కంటా కనికట్టు చేయొచ్చని రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఆయన లేవదీస్తే, అక్కడా ఇక్కడా మాడుపగిలి మొన్నటి ఉపఎన్నికలతో రెండు కళ్లూ పోయాయి. శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజనీతిని వెలగబెట్టి కాంగ్రెసుతో లోపాయకారి సంధి కుదుర్చుకుని జగన్ ఫ్యానును చెడగొట్టబోతే మాచ్ ఫిక్సింగుల గుట్టు రట్టయి సైకిల్ చైనే పుట్టుక్కుమంది. ఒకప్పటి ‘దేశం’ కోటలైన నర్సాపురం, రామచంద్రపురాల్లో తమ నోట తామే మన్నుకొట్టుకుని కాంగ్రెసు పల్లకిని మోసి, డిపాజిట్లను త్యాగం చేసినా మహాత్యాగి బాబును మెచ్చుకున్న వాళ్లు లేరు. అధికార స్వార్థం కోసం తెరాసతో పొత్తు కలిసినా, కత్తి దూసినా బాబు దేశానికి మిగిలింది భంగపాటే.
తెలంగాణపై ఎటూ తేల్చలేని నిస్సహాయతవల్ల తెలంగాణ ఎమ్మెల్యేలు సైకిలు వదిలి కారు ఎక్కారంటే అర్థం ఉంది. కాని సొంత సామాజిక వర్గానికి సొంత ఎస్టేటు అనుకున్న సీమాంధ్రలోనూ ఎమ్మెల్యేలు, మోతుబరులు పార్టీ నుంచి పారిపోతూంటే ఏమనుకోవాలి? కోవూరు ఎమ్మెల్యే సైకిలు దూకి పంకా పట్టుకుంటే పెద్ద మెజారిటీతో గెలవటం చూశాక… పార్టీ భవిష్యత్తు మీద ఆశలొదులుకున్న మిగతా తమ్ముళ్లకూ ఫిరాయింపు గుబులు మళ్లింది. నన్ను చూడు – నా చక్కదనం చూడు అని మహానాయకుడు ఎన్ని వగలు పోయినా పాపిష్టి బ్రదర్సు జైలువైపు, లోటస్‌పాండు వైపు పక్క చూపులు చూస్తున్నారంటే నాయకుల వారు తలకాయను ఏ గోడకు బాదుకోవాలి? జనరల్ ఎన్నికలకు ఏడాది ముందే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తానని డాబుసరిగా బాబు ప్రకటిస్తే… అప్పటిదాకా ఆగకుండా ఎన్నికలకు రెండేళ్ల ముందే – పార్టీ తరఫున మళ్లీ పోటీ చేసేదిలేదని ఎమ్మెల్యేలు చేటకొడుతూంటే నారావారి పరువు ఏమి కావాలి? ఐదేళ్ల కింద వరంగల్లు బి.సి. సదస్సులో ఇచ్చిన ఉత్తుత్తి హామీకి మళ్లీ గాలికొట్టి బిసిలకు వంద అసెంబ్లీ సీట్లు అని కొత్తగా గొంతుచించుకున్నా బిసి వర్గాలు బొత్తిగా పట్టించుకోకపోతే రాజకీయం ఎలా నడపాలి?
వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ పుట్టిన తెలుగుదేశానికి వారసత్వ రాజకీయాలే ఇప్పుడు శాపం కావటం ఒక తమాషా. మామగారు తన రాజకీయ వారసత్వం ఎవరికివ్వాలో తేల్చకముందే మాయచేసి, అడ్డం తిరిగి దాన్ని తన్నుకు పోగలిగిన అసాధ్యుడికి… ఇప్పుడు తన వారసత్వాన్ని తన కుమారుడికి కట్టబెట్టటం ఎలాగన్నదే కంటికి కునుకు లేకుండా చేస్తున్నది. పెద్ద ఎన్టీఆర్‌నే లాగి అవతల పారేసి, మీడియా మాయాజాలంతో సింహాసనం ఆక్రమించి, తొమ్మిదేళ్లు నిరాఘాటంగా రాజ్యమేలగలిగిన మొనగాడికి ఇప్పుడు పిల్ల ఎన్టీఆర్ కాలిలో ముల్లులా, కంట్లో నలుసులా తయారై తన రాజకీయ జీవితానికే సవాలుగా మారాడేమిటి చెప్మా?! పట్టుబట్టి తాను టిక్కెటు ఇప్పించుకున్న గుడివాడ ఎమ్మెల్యే గోడ దూకటం వెనక తన దర్శకత్వం లేదని చిన్నోడు నోటితో అంటూనే ఉంటాడు. కట్టె కాలేదాకా తెలుగుదేశంలోనే ఉంటానని… ‘ఇప్పటికి నా వయసింకా నిండా ఇరవై ఎనిమిదే’ కనుక చాలా భవిష్యత్తు ఉందని నొసటితో వెక్కిరిస్తూనే ఉంటాడు. నందమూరి వంశం ప్రాపకం కోసం బాలయ్యకు లోకయ్యను అల్లుణ్ని చేసి పడిన కష్టమంతా జూనియర్ పితలాటకంతో రొష్టుగా మారింది. 2014 ఎన్నికల్లోనూ ‘దేశం’ దశ తిరిగేది లేదని తేలిపోయాక – నిన్నటిదాకా కిక్కురుమనని వారికి కూడా తోకలు లేవడాన్ని చూసే కదా… చరిత్రలో ఎన్నడూ లేనిది ‘మహానాడు’ను రద్దు చేసుకున్నది? అందరికీ అలుసై, అసలే రోజులు బాగా లేనప్పుడు తిరుగుబాటుదార్లపై ఒంటికాలిమీద లేచి చడామడా సస్పెన్షన్లు చేస్తూ పోతే ఓటి పార్టీలో చివరికి మిగిలేదెందరు?

 

 

 

72 Comments

Filed under Uncategorized

72 responses to “పాపం బాబుదేశం

 1. vissu

  Mana party naayakula vaadana sarigaa ledu…

  Every body knows that there is no choice for us except supporting pranab..

  but still the way our party leaders are talking in front of media is really

  bad….

  • Karthik

   I don’t see why there is no other choice. Sangma himself was never a member of the BJP. He was part of the NCP which is not a communal party. Just the fact that BJP is supporting him isn’t a strong enough reason to oppose him.
   Even if Sangma is not an option, there is still a choice of rejecting both candidates.

 2. CVReddy

  YSRCP had supported TDP in No-confidence issue.
  Babu , as a key head of National Front Chairman supported Congress President Narayanan.

  Babu recently said Pranab was the right candidate for president post keeping his stature and experience in mind.
  Babu has to explain why has he changed his stand in just 10-15 days.

  I completely support YSRCP decision under the present circumstances as we cannot back Sangma, when Shiva sena, BJP Ally is backing Pranab.
  Moreover NCP to which Sangma belongs is not backing him and is supporting Pranab.

  We will continue our fight against Cong and TDP like what we did before.

  Mekapati only said Cong was telling there was no their role in Cases on Jagan.I saw his interview.He didn’t say there was no Congress role in jagan cases.

  We still firmly believe Cong is using CBI as a tool to harass its opponents and that is why Vijaya Sai Reddy has filed a case in Delhi High Court to make CBI as an independent agency.
  CBI lawyers are appointed by Central Govt only and naturally they argue on behalf of their rulers.

  • pavithra

   I fully back the decision taken by YSRCP, as it is the best alternative available under the present circumstances and this decision will not impact the ongoing fighting with Cong +TDP (Cycle Congress) for the better future of AP.

 3. rakesh

  I request dont copy idea of yellow media and post here
  that ysrcp colluded with cong
  pranab is not a rubber stamp, that’s why he is not made PM, though he is most eligible than manmohan
  sonia sends pranab to president to make way clear for her son rahul to be next pm.
  long term, this decision is more helplful for ysrcp , post 2014 or 2013 general elections

 4. CVR Murthy

  The statements , language and body language of Jupudi, yesterday, The statement made by Mekapati that congress is not behind CBI, gives an impression that YSRCP has struck a deal with Congress. This will reduce votes for YSRCP and improve voting for TDP

 5. Karthik

  If, having a relationship with YS family for a long time is enough for us to put a crown on his head, there are many other traitors such as KVP, Undavalli, Anam etc. who had strong and long relations with YS family, why not bind with them?

  Supporting Ansari and Pranab seems to be the worst mistake.

  I know that Pranab will win anyway but we should have stuck to values just like we did during the no confidence motion. Knowing that the government will win anyways, our true loyalists chose not to vote for the government and even took disqualification upon them. Where have those values gone?

  Where has the fighting spirit gone?

 6. Karthik

  If not voting in the presidential elections and vice-presidential elections would set a bad precedent to the common public, then voting for Sangma would have been the next best choice.
  Pranab Mukherjee is one of the key conspirators against Jagan. Isn’t it obvious?! As much as Chidambaram can be blamed for manipulating CBI into filing false cases against Jagan, Pranab can be blamed for manipulating ED to do the same thing. Criticizing Sonia on one side and support people like Pranab is like hating a fist and loving the fingers that form it.
  A person in the role of the President must be honest, impartial and keep up the dignity of this country. A person who bows to an Italian and conspires to hound an innocent man who happens to be a popular leader of this soil is in no way fit for the post of the president.

  Many in this blog have criticized the same man for his dismal performance as the finance minister as well. Should he be promoted to the position of the head of the state for this reason?

  Can we expect such a conspirator to act impartially and not bend to the Italian after becoming the president? I think it is obvious that he will continue to treat her as his boss and continue to do all the illegal and immoral acts for her satisfy her ego and political goals.

  I don’t know of any communal background of Sangma but even if he happens to not be secular, that would be a minor flaw compared to what Pranab did.

 7. CVReddy

  రహస్య మిత్రులు బాబు, కిరణ్.
  జగన్ దెబ్బకు దడిసి గుట్టుగా చేతులు కలిపినా తెలుగుదేశం, కాంగ్రెస్.

  India Today

  http://www.magzter.com/preview_reader.php?edition_id=4978
  Summary:
  కాంగ్రెస్‌ – టిడిపి రహస్య స్నేహం మీద ఇండియా టుడే కవర్‌ పేజీ వార్త రాసింది. కాంగ్రెస్‌తో టిడిపి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కావడం వల్లే ఆ పార్టీలు రెండూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని ఇండియా టుడే అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ కంచుకోట బద్దలైనట్టేనని కూడా ఇండియా టుడే రాసింది.జగన్ సంకల్ప దీక్షను కాంగ్రెస్‌ పార్టీ తక్కువగా అంచనా వేసిందని ఇండియా టుడే అభిప్రాయపడింది. ఒకప్పటి తన కంచుకోటలో అది ఇప్పుడు అగమ్యగోచర స్థితిలో పడిపోయిందని కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి ఇండియా టుడే రాసింది.

  కాంగ్రెస్‌ -టిడిపిల మధ్య రహస్య స్నేహాన్ని జాతీయ మీడియా కూడా బట్టబయలు చేసింది. వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొవడానికి టిడిపి ఢిల్లీ స్థాయిలోనే కాంగ్రెస్‌తో కుమ్మక్కైంది. కాంగ్రెస్‌, టిడిపిలు ఎందుకు దారుణమైన పరిస్థితుల్లోకి తమను..తాము నెట్టుకున్నాయో చెప్పడానికి ప్రయత్నం చేసింది ఇండియా టుడే మ్యాగజైన్‌. అంతేకాదు…కాంగ్రెస్‌ నుంచి జగన్‌ బయటకు రావడానికి గల కారణాలను కూడా ఇండియా టుడే వివరించింది.

  కాంగ్రెస్‌ పార్టీ, జగన్‌ మధ్య రాజకీయాలు ఇలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ ఎందుకు తెల్లబోయిందో కూడా ఇండియా టుడే విశ్లేషించింది. శాసన మండలి ఎన్నికల నుంచి కాంగ్రెస్‌, టిడిపిలు సహకరించుకోవడం ప్రారంభించాయని రాసింది. కాంగ్రెస్‌తో రహస్య మైత్రి కారణంగానే టిడిపి దెబ్బతిన్నదని ఇండియా టుడే అభిప్రాయపడింది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించిందని టిడిపి పొలిట్‌బ్యూరో అభిప్రాయపడినట్లు తెలిపింది.
  ఇండియా టుడే విశ్లేషణ ప్రకారం కాంగ్రెస్‌, టిడిపిలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నమ్మడం లేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అతిపెద్ద రాష్ట్రంలో చిక్కుల్లో చిక్కుకుని..2014 అధికారం పొందడాన్ని ప్రశ్నార్ధం చేసుకుంది. ఇక తెలుగు దేశం పార్టీ మరణశయ్యపై ఉందని ఇండియా టుడే చెప్పకనే చెప్పింది.

  • Sai Prabhakar

   Did Mekapati really say that there was no role of Congress against Jagan?

   • Karthik

    Although he did not say in first person that there is no role of Congress but he made it very clear that he believes that there is no role of Congress in the cases against Jagan. He said “paapam Congress peddalu kooda chepthunnaru, maademi chinna thappu kooda ledu, court lo vachindi, court directions meedey chestunnaru”. The tone and tenor of his speech left no doubt that he believes their statement.
    While quoting the Congress bosses’ statement that there isn’t even a small mistake of theirs, Mekapati should have raised the issue of what motive CBI has in falsely implicating a completely unrelated person like Sunil Reddy in the Emaar case and what motive they have to arrest Jagan without a single piece of evidence and vehemently oppose his bail?
    It is a pity that the people have no doubts that Congress is behind this and even reputed national media, neutral journalists, and in private, opposition leaders agree that it is nothing but political vandetta. Alas, some of our party’s key leaders aren’t condemning the lies of Congress’ bosses.
    I had a lot of respect for Mekapati garu, he is an REC alumnus. I am shocked that made such a statement.

    • NLR

     @ Karthik …

     Using our vote is the ultimate weapon in Democracy .
     In this case we have only two choices and JAGAN was very clear from the beginning that he will go for the Secular choice and he did not change this.
     As CVR garu once said here there are no untouchables in politics .
     We sometime have to go with the flow and let the culprits slap themselves for troubling us.
     People of AP care a foot for the President elections . All they want to see is JAGAN as CM and that is bound to happen.
     I wonder why u always look at the negative side of things ??

    • CVReddy

     పాపం కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు జగన్ పై కేసులో మా ప్రమేయము లేదు, కేవలము కోర్టుల ప్రమేయముంది అని అంటున్నారు కదా.మీరు అయన మాటల్లోని వ్యంగ్యాన్ని గమనించలేకపోతున్నారు .
     అయన పాపమూ అన్నది కాంగ్రెస్ పై ప్రేమతో కాదు, వ్యంగంగా మాత్రమే.

     • Karthik

      CVR garu – I hope you are right. I did not understand it that way. The context did not merit sarcasm. He was defending supporting Pranab in the Presidential elections, I don’t think that is a situation to mock the Congress bosses. Anyway, I really hope you are right.
      NLR garu – I don’t always look at the negative side but yes I do look at negative things very often. Bhajana cheste vachedemi ledu. When I see something wrong, I point it out and if it’s in my power, I would try to change it as well. I don’t know if you and several others on this blog would have opposed refusing to participate in the elections or supporting Sangma but I surely would have supported either of those decisions better than supporting Pranab.
      I feel that many on this blog, (I am really not intending to say you, I really respect you) but in general most bloggers here support any decision blindly. I am sure most people would have supported if YSRCP would have decided to support Sangma or reject both candidates. They are supporting Pranab simply because the party decided to support him.

      • NLR

       @ Karthik garu …

       I agree with u on a personal note that we should not support anyone from the Cong .
       But unfortunately this is a situation where we have to vote for someone as per democratic norms which Babu and his friend JP talk about everyday.
       And I think JAGAN went for this choice only on a Secular note and not that he loves Pranab.
       Sometimes in life we get an opportunity to slap the crooks and sometimes we create an opportunity for the crooks to slap themselves for troubling us for no reason.
       We went for the second choice here because the first choice is in the hands of the people in 2014.

 8. NLR

  Determination ..Dedication …Desperation and Passsion.

  Stop him if u can.

 9. SC admits illegal assets case against Naidu

  Telugu Desam Party president N Chandrababu Naidu might have managed to get out of the case against his alleged illegal assets due to his manipulative tactics in High Court, but his troubles are far from over.

  The Supreme Court on Wednesday admitted the petition of YSR Congress party honorary president Y S Vijayalakshmi seeking a probe into the illegal assets of Naidu and 16 others. She filed the petition challenging the High Court order in February, dismissing her public interest litigation petition on technical grounds. The case was posted to July 23 for hearing.

  If the Supreme Court takes up the case seriously, then it would be the beginning of yet another ordeal for Naidu. However, being a master manipulator, Naidu is capable of managing the investigating agencies and get a clean chit from them, so that even the Supreme Court will be compelled to dismiss the case.

  The YSR Congress party leaders are confident that they would get justice in the Supreme Court as there was a merit in the case.

 10. CVReddy

  Jagan’s bail plea will be taken on 30th of this month in SC

 11. CVReddy

  SC is going to hear Babu disproportionate assets case on 23rd of this month filed by Vijayamma.

  YSRCP is has decided to support Pranab Mukharjee as presidential candidate and Ansari as VP.
  Abstaining from voting doesn’t auger well fro democracy.
  We believe Mr.Pranab Mukaharjee will be the right person to be as a constitutional head when Coalition govt is ruling.

 12. CVReddy

  కేంద్రం, సీవీసీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
  న్యూఢిల్లీ : సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న అంశంపై ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ప్రలోభాలతో పని చేస్తోందని, రాజకీయ కుట్రలను అమలు చేస్తోందని ప్రముఖ ఆడిటర్‌ విజయసాయిరెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని బుధవారం ఆదేశించింది. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌తోపాటు సీబీఐలకు కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

 13. CVReddy

  అల్లుళ్ళ పర్వం.
  అన్నపేరుకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయినట్టు, అల్లుడు పదానికి బాబు పెట్టింది పేరు. రాజకీయాల్లో అల్లుడు గారు అనగానే కాంగ్రెస్ వారికి సైతం చంద్రబాబే గుర్తుకు వస్తారు. అమ్మ (ఇందిరమ్మ) ఆదేశిస్తే మామపై పోటీ చేస్తానని 82లో చంద్రబాబు సవాల్ చేశారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఏ విషయం అయినా చంద్రబాబు కుండ బద్ధలు కొట్టినట్టు చెంప చెళ్లుమనిపించేట్టు, జీవితంలో మరిచిపోని విధంగా చెప్పగలరు. ఉచిత విద్యుత్ వల్ల విద్యుత్ తీగలు బట్టలారేసుకోవడానికి పనికి వస్తాయని చెప్పినా, కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని చెప్పినా ఆయన ఒక్కసారి చెబితే జీవితంలో మరిచిపోని విధంగా చెబుతారు. సినిమాల్లో దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ డైలాగులను ఒకసారి వింటే మరువలేం, రాజకీయాల్లో ఆయన అల్లుడు గారి డైలాగులూ అంతే పవర్‌ఫుల్ . పాపం మామగారికే ఆయన పవర్ అర్ధం కాలేదు. ఓడిపోయాక ఆయన టిడిపిలోకి వస్తానని దరఖాస్తు చేసుకుంటే మా అల్లుడు గారు వస్తున్నారు అని సమావేశంలో ఎన్టీఆర్ చెప్పగానే ముక్తకంఠంతో అంతా ఒకేసారి వద్దూ అనేశారట! పాపం వాళ్లంతా అల్లుళ్లతో ఎంత విసిగివేసారిపోయిన నాయకులో కదా? ఎన్టీఆర్ మాత్రం చిన్నబుచ్చుకుని, నాదెండ్ల భాస్కర్‌రావు, జానారెడ్డి, ఉపేంద్ర, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి ఒకరికి తెలియకుండా ఒకరిని ఒప్పించి అల్లుడిగారి స్వగృహ ప్రవేశానికి స్వాగతం పలికారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఒక పార్టీ వీడి మరో పార్టీకి వెళ్లినప్పుడు పలికే తొలి డైలాగు ‘సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది’. ఈ డైలాగు ఒక్క బాబు విషయంలో మాత్రమే న్యాయమైనది. ఎందుకంటే అల్లుడికి మామగారిల్లు సొంతిల్లే కదా!
  అస్తవ్యస్థంగా ఉన్న దేశానికి ఒక దిశ చూపిన నెహ్రూ లాంటి దార్శనికుడే అల్లుడితో బెంబేలెత్తిపోయారు. అలాంటిది ఎన్టీరామారావుకు ఇద్దరు అల్లుళ్లు. ఎన్టీఆర్ రాజకీయ జీవితం మొత్తం ఇద్దరు అల్లుళ్ల రాజకీయాలతో సతమతమయ్యారు. నడుచుకుంటూ ఆలసిపోయిన వ్యక్తి సైకిల్‌పై లిఫ్ట్ అడిగి, కొంత దూరం వెళ్లాక సైకిలే ఎత్తుకెళితే ఎలా ఉంటుంది? పాపం అలాంటి పరిస్థితిలోనే అల్లుడి దెబ్బకు ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసిపోయింది.
  నుదుటిపై రాసిపెట్టి ఉంటే ఎలాగైనా తప్పదేమో! సొంతల్లుడు లేకపోతేనేం అల్లుడి వరుస అయ్యే జూనియర్ ఎన్టీఆర్ బాబు భవిష్యత్తు రాజకీయాలను ప్రశ్నార్ధకంగా మార్చారు. నన్ను గెలిపించండి సాధ్యం కాకపోతే మా అబ్బాయిని ఆదరించండి అంటూ బాబు త్యాగానికి సిద్ధపడుతున్న సమయంలో అల్లుడు నేనున్నాను అంటున్నారు. బావకోసం తండ్రిని త్యాగం చేసిన బాలకృష్ణ ఇప్పుడు అల్లుడు లోకేశ్ కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని త్యాగం చేసేందుకు రిహార్సల్స్ చేస్తున్నారు.

  ఒలింపిక్ కాగడాను ఒకరి నుంచి మరొకరికి అందించినట్టుగా అల్లుడి సమస్య ఒకరి నుంచి ఒకరికి వారసత్వంగా వస్తోంది తెలుగు రాజకీయం. తెలుగు ప్రజలు అల్లుడి కుమారుడిని ఆదరిస్తారా? అల్లుడిగారి అల్లుడిని ఆదరిస్తారా? కాలమే తేల్చాలి. భవిష్యత్తు తెలుగు కిరీటం బాలకృష్ణ అల్లుడిదా? బాబు అల్లుడిదా? తేలాలంటే వేచి చూడాలి.

  ముక్తాయింపు:ఏదీ శాశ్వతం కాదు. అల్లుడూ ఒకనాటికి మామ అవుతాడు.

  Courtesy: Buddha Murali

 14. CVReddy

  ‘క్విడ్ ప్రో కో’ కు ఆస్కారమే లేదు
  సీబీఐ వాదన అర్థరహితం
  సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించిన నిమ్మగడ్డ తరఫు న్యాయవాది

  హైదరాబాద్, న్యూస్‌లైన్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత కూడా నిమ్మగడ్డ ప్రసాద్ రూ.430 కోట్లను జగన్ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారని.., లాభాల కోసమే ఆయన పెట్టుబడులు పెట్టినట్లు స్పష్టమవుతుండగా ‘క్విడ్ ప్రోకో’కు ఆస్కారమెక్కడిదని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు మంగళవారం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ.. జగన్ సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ మొత్తం రూ.847 కోట్లు పెట్టుబడులు పెట్టారని, వాటిలో 70 శాతం పెట్టుబడులు వాన్‌పిక్‌కు ముందు, వైఎస్‌ఆర్ మరణం తర్వాతే ఉన్నాయని వివరించారు. వాన్‌పిక్ సంస్థను ప్రారంభించక ముందు 2006 డిసెంబర్ నుంచి 2007 జనవరి మధ్య 20 శాతం పెట్టుబడులు పెట్టారని చెప్పారు. 2009 సెప్టెంబరు 2న వైఎస్‌ఆర్ మరణించారని, ఆ తర్వాత 2010 ఏప్రిల్ వరకు 50 శాతం పెట్టుబడులు పెట్టారని తెలిపారు.

  కేవలం లాభాల కోసమే జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, ఇందులో పరస్పరం లబ్ధి పొందింది ఏమీ లేదని చెప్పారు. రాక్‌తో చేసుకున్న ఒప్పందం ప్రతిని (ఎంవోయూ) ఐఏఎస్ అధికారి మన్మోహన్‌సింగ్ మంత్రి మండలికి పంపారని, అలాంటప్పుడు మంత్రి మోపిదేవి కేబినెట్‌ను తప్పుదోవ పట్టిచ్చారని ఎలా అంటారని ప్రశ్నించారు. వాన్‌పిక్‌కు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించలేదని చెప్పారు. వాన్‌పిక్ అనేక రాయితీలను కోరిందని, ప్రభుత్వం కొన్నింటిని తిరస్కరించిందని తెలిపారు. 66 ఏళ్లు లీజుకు ఇవ్వాలని కోరినా, ప్రభుత్వం 33+11+11 ప్రాతిపదికన 55 ఏళ్ల వరకు మాత్రమే లీజు ఇచ్చిందని తెలిపారు. వాన్‌పిక్ సేకరించిన 13 వేల ఎకరాల్లో 200 ఎకరాలే ప్రభుత్వ భూమి ఉందని, దీనికి కూడా ప్రభుత్వం ధర నిర్ణయించిందని, డబ్బు చెల్లించిన తర్వాతే ఆ భూమిని స్వాధీనం చేసిందని వివరించారు.

  రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రస్‌ఆల్‌ఖైమా (రాక్), వాన్‌పిక్ సంస్థలు… ఆర్థిక మాంద్యం కారణంగా వాటాలను నవయుగ సంస్థకు విక్రయించారని, ఇందులో సీబీఐకున్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. రాక్‌తో మాత్రమే వాన్‌పిక్ భాగస్వామ్య ఒప్పందం చేసుకుందన్నారు. ప్రభుత్వానికి, వాన్‌పిక్‌కు సంబంధమే లేదని అన్నారు. అలాంటప్పుడు ఏదో జరిగిపోయిందంటూ నిమ్మగడ్డను అరెస్టు చేయడమే చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సీబీఐ చేస్తున్న 90 శాతం ఆరోపణలకు ఆధారాలే లేవన్నారు. కుట్రలో భాగస్వాములై ఉంటే చనిపోయిన వారిని నిందితుల జాబితాలో ఎలా చేర్చాలో సీబీఐకి తెలుసని, వైఎస్‌ఆర్ కుట్రదారుడు కాదు కాబట్టే సీబీఐ ఆయన్ని నిందితునిగా చేర్చలేకపోయిందని చెప్పారు.

  వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో జగన్ కుమ్మక్కై పలువురికి లబ్ధి చేకూర్చడం ద్వారా ఆయన సంస్థల్లోకి పెట్టుబడులు పెట్టించుకున్నారని సీబీఐ ఆరోపిస్తోందని.., అయితే వైఎస్‌ఆర్ మరణం తర్వాత జగన్ ఏ రకంగా లబ్ధి చేకూర్చగలడని ప్రశ్నించారు. నిమ్మగడ్డ అరెస్టు సమయంలో ఆధారాలను మాయం చేస్తారనే అనుమానంతోనే ఆయన్ని అరెస్టు చేశామని పేర్కొన్నారని, సీబీఐ అపోహతోనే ఆయన్ని అరెస్టు చేసిందని పేర్కొన్నారు.

  రూ.285 కోట్లే మొదటి పెట్టుబడి: జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్‌లో నిమ్మగడ్డ ప్రసాద్ మొదట రూ.285 కోట్లు మాత్రమే పెట్టుబడిగా పెట్టారని ఉమామహేశ్వర్‌రావు తెలిపారు. భారతీ సిమెంట్స్‌లో ఆయన పెట్టుబడులను ఫ్రెంచ్ కంపెనీకి విక్రయించారని, దీంతో రూ.560 కోట్లు వచ్చాయని తెలిపారు. ఫ్రెంచ్ కంపెనీ తెలివి తక్కువగా వాటాలు కొనుగోలు చేయలేదని, లాభాలు వస్తాయనే నమ్మకంతోనే వాటాలు కొన్నారని చెప్పారు. అదే తరహాలో నిమ్మగడ్డ ప్రసాద్ కూడా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, అందుకు వారు లాభాలు కూడా ఇచ్చారని వివరించారు. భారతీ సిమెంట్స్‌లో వాటాల విక్రయం ద్వారా నిమ్మగడ్డకు లాభం రూపంలో దాదాపు రూ.300 కోట్లు వచ్చిందని చెప్పారు. అందులో రూ.62 కోట్లు ఆదాయ పన్నుగా చెల్లించారని తెలిపారు. భారీగా లాభాలు వస్తాయనే ఈ డబ్బును మళ్లీ జగన్ సంస్థల్లోనే పెట్టుబడులు పెట్టారని చెప్పారు. ప్రసాద్‌కు ప్రభుత్వం లబ్ధి చేకూర్చినందుకే లంచంగా ఇవ్వాల్సిన డబ్బును జగన్ సంస్థల్లో పెట్టుబడుల రూపంలో పెట్టారని సీబీఐ ఆరోపిస్తోందని, అయితే లంచంగా ఇచ్చిన డబ్బును తిరిగి వెనక్కు ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు.

  పెట్టుబడులకు లాభం వచ్చేలా చేసి, 100 శాతానికి పైగా అదనంగా డబ్బు ఎందుకు ఇస్తారని అన్నారు. సాండూర్ పవర్ కంపెనీలో రూ.650 ప్రీమియంతో 22.46 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోందని, అయితే ప్రసాద్ కొన్నది రూ.140 ప్రీమియంతో మాత్రమేనని వెల్లడించారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండానే సీబీఐ ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తూ కోర్టును తప్పుదోవపట్టిస్తోందని ఆరోపించారు. భారతీ సిమెంట్స్‌లో ప్రసాద్ రూ.285 కోట్లు పెట్టుబడిగా పెట్టారని, సీబీఐ మాత్రం రూ.240 కోట్లు పెట్టుబడిగా పెట్టారంటూ తప్పుడు లెక్కలు చూపుతోందని వివరించారు. వాదనలు కొనసాగుతుండగానే కోర్టు సమయం ముగియడంతో… వాదనలను గురువారానికి వాయిదావేశారు.

 15. NLR

  These are the idiots representing the Telugu people in the Parliment.
  Taking lessons from an Italian about how to caste their vote !!!
  They are a disgrace to India.

  http://sakshitv.com/index.php/న్యూస్-బిట్స్/న్యూస్-బిట్స్/2012-06-01-07-24-14/6353-సోనియాతో-కాంగ్రెస్-ఎంపీల-సమావేశం.html

 16. CVReddy

  బయటపడుతున్న రాజగురువు అసలు రంగు
  http://troothandtrooth.blogspot.in/

 17. CVReddy

  మూడేకాళ్ళు అంటున్న సిబిఐ
  http://telugu.greatandhra.com/cinema/16-07-2012/mu-17.php

 18. CVReddy

  అప్పనంగా మన పెరట్లోని గ్యాస్ లంకె బిందెలను కొల్లగొట్టిన రిలయెన్సోడు ఇప్పటికే పెట్టుబడివ్యయం, ధర ఖరారు, లాభాల షేరింగ్ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి గంతలు కట్టి లక్షల కోట్లకు టెండర్ పెట్టాడు. ఇప్పుడు మళ్లీ ఇంకా భారీగా ధర పెంచి మరిన్ని లక్షల కోట్లు కొల్లగొట్టే ఎత్తుగడతో, కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వీలుగా ఉత్పత్తిని మూడోవంతుకు తగ్గించేశాడు. దీంతో మన రాష్ట్రంలో కరెంటుత్పత్తి తగ్గి కష్టాలు, అదనపు ఇంధనం వాడకం వల్ల మరింతగా వాచిపోతున్న కరెంటు బిల్లులు…. తెల్లారితే అవినీతిపై యుద్ధమని సొల్లు కబుర్లు చెప్పే రామోజీ, చంద్రబాబు సయామీ కవలలకు ఈ రిలయెన్సో వ్యవహారం ఎందుకు కనిపించదు? ఎందుకు మీ నోళ్లు పెగలవు? ఎందుకంటే ఈనాడులో రిలయెన్స్ పెట్టుబడులు, పచ్చబాబు బాసట!! అక్రమాలతో దేశ అర్థిక మూలాల్ని, తద్వారా దేశపాలననూ శాసిస్తున్న రిలయెన్సోడిని ఎలా శిక్షించాలి అసలు!? మరి ఇవెందుకు మాట్లాడరు.

 19. CVReddy

  రామోజీపై ’ఐ’టీ,ఉషోద​యాలోకి రిలయన్స్ నిధుల వరదపై దర్యాప్తు మొదలు.

  35 రోజుల వ్యవధిలో పుట్టిన పదుల కొద్దీ గొట్టం కంపెనీల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లోకి నిధులు ప్రవహించిన తీరును తప్పుబడుతూ… దీనికి సంబంధించి జారీ చేసిన 2007-08 సంవత్సరపు ఉత్తర్వుల్ని ఆ శాఖ పక్కనబెట్టింది. ఈ నిధుల ప్రవాహపు తీరును సమీక్షిస్తున్నామంటూ రామోజీరావుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. రామోజీరావు, ఆయన గ్రూపు కంపెనీలు కలిసి రూ.3,550 కోట్ల మేర ఆదాయపు పన్నును ఎగవేశాయని, కేజీ బేసిన్ గ్యాస్‌ను రిలయన్స్‌కు కట్టబెట్టిన చంద్రబాబు.. అందుకోసం ఆ సంస్థ నుంచి తాను తాను తీసుకున్న ముడుపులనే గురుదక్షిణ రూపంలో రామోజీరావుకు అదే రిలయన్స్ ద్వారా తిరిగి అందజేశారంటూ ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఐటీ శాఖ ఈ చర్యలు తీసుకుంది.
  మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్లకు సంబంధించి రామోజీరావు అటు సుప్రీంకోర్టు వద్ద, ఇటు రిజర్వు బ్యాంకు వద్ద పేర్కొన్న మొత్తాల్లో దాదాపు రూ.150 కోట్ల మేరకు తేడా ఉంది.

  కేవలం 35 రోజుల్లో 6 బ్రీఫ్‌కేసు కంపెనీల్ని సష్టించి, వాటిద్వారా రూ.2,600 కోట్లను రామోజీ కంపెనీల్లోకి పంపించింది. ఇలా 39 శాతం వాటాను కొనుక్కుంది. చిత్రమేంటంటే వీటిలో అనూ ట్రేడింగ్ అనే గొట్టం కంపెనీ పెయిడప్ క్యాపిటల్ కేవలం రూ.లక్ష. అలాగే మరో గొట్టం కంపెనీ ఈక్వేటర్ ట్రేడింగ్ పెయిడప్ క్యాపిటల్ రూ.200 కోట్లు. కానీ ఇవి ఒకో షేరుకు ఏకంగా రూ.5,28,630 చెల్లించి మొత్తమ్మీద రూ.2,606 కోట్లను ఉషోదయాలో పెట్టుబడి పెట్టాయి. ఇంత భారీ నిధులు తమకు ఏ సంస్థ నుంచి వచ్చాయన్నది తమ ఆస్తిఅప్పుల పట్టీల్లో ఈ కంపెనీలు ఎక్కడా చెప్పలేదు. కన్వర్టబుల్ లోన్‌గా ఆ డబ్బు తెచ్చుకున్నట్లు చూపించాయే తప్ప ఎవరి దగ్గర్నుంచి తెచ్చామన్నది చెప్పనేలేదు. నిజానికి ఈ డబ్బులు రిలయన్స్‌వే అయి ఉంటే అది తొలుత తన బోర్డు అనుమతి తీసుకోవాలి. సెబీకి చెప్పాలి. స్టాక్ ఎక్స్ఛేంజీలకూ సమాచారమివ్వాలి. అలా చేసినపుడు ఈ బ్రీఫ్‌కేసు కంపెనీల అవసరమే ఉండదు’
  ఉషోదయా సంస్థ తన టీవీ చానెళ్ల విలువను రూ.4,200 కోట్లుగా చూపించిందని చెబుతూ… ‘‘వీటికి పాత సినిమాలు, సీరియళ్లపై హక్కులున్నా వాటిని అప్పటికే చాలాసార్లు ప్రసారం చేయటంతో విలువ లేకుండా పోయాయి. వాటికి విలువ కట్టిన ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ కూడా దీన్ని ప్రస్తావించింది’’

  కష్ణా-గోదావరి బేసిన్లో గ్యాస్ నిక్షేపాల కోసం పోటీపడకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కావాల్సినంత మేలు చేశారని, అందుకు ప్రతిఫలంగానే రిలయన్స్ సంస్థ రూ.2,600 కోట్లు రామోజీ సంస్థల్లోకి పంపించింద
  నాగార్జునా ఫైనాన్స్ వ్యవహారంలో డిపాజిటర్లను ముంచిన కంపానీకి చంద్రబాబు అన్నిరకాలుగా రక్షణనివ్వబట్టే ఆయన కూడా రంగంలోకి వచ్చారన్నారు. ‘‘రిలయన్స్ ఏమీ మామూలు సంస్థ కాదు. దేశంలోనే సమర్థమైన ఇన్వెస్టరు. అలాంటి సంస్థ దేన్లోనైనా పెట్టుబడి పెడితే తగిన నివేదికలు తెప్పించుకుని, నిజ నిర్ధారణ చేసుకుని, అన్నీ సరిచూసుకున్నాక, తనకు కావాల్సినంత ప్రచారం వచ్చే రీతిలో పెడుతుంది. కానీ ఏ నివేదికా కూడా లేకుండా బ్రీఫ్‌కేసు కంపెనీల ద్వారా అత్యంత రహస్యంగా పెట్టుబడి పెట్టడమే ఈ డీల్ తాలూకు అక్రమాల్ని సూచిస్తోంది.

  ఇటీవల హైకోర్టులో వైఎస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశాకే.. రిలయన్స్ సంస్థ ఆ పెట్టుబడులు తమవని బహిరంగంగా అంగీకరించింద

  ఇవిగో మనీ లాండరింగ్‌కు ఆధారాలు…

  ‘‘కంపానీ గ్రూపులో డెరైక్టర్లుగా ఉన్నవాళ్లే రిలయన్స్ సష్టించిన గొట్టం కంపెనీల్లోనూ డెరైక్టర్లుగా సాగారు. మనీ లాండరింగ్ జరిగిందనటానికి ఇంతకన్నా వేరే ఆధారాలు అక్కర్లేదు. అయితే తమ గ్రూపుపై సెబీ, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, సీబీఐ వంటి సంస్థలు దర్యాప్తు జరపకుండా రిలయన్స్ సంస్థ మరో ఎత్తు వేసింది. ఉషోదయలో తమకున్న వాటాను నెట్‌వర్క్-18కు బదలాయించింది. ఇక్కడ కూడా ఈనాడు పత్రికలో తనకున్న వాటాను రామోజీ , చంద్రబాబు కోసం రిలయన్స్ త్యాగం చేసేసింది. గట్టిగా రూ.300 కోట్లు కూడా విలువ చెయ్యని తెలుగేతర చానెళ్లలో మాత్రమే వాటా ఉంచుకుంది. ఈ పనికిరాని చానెళ్లకు టీవీ-18 ఏకంగా రూ.2,100 కోట్ల విలువ కట్టగా, అందుకు కావలసిన డబ్బును కూడా మళ్లీ రిలయన్సే టీవీ-18కు అడ్వాన్సుగా అందజేసింది. ఇదంతా రిలయన్స్, టీవీ-18 ఇన్వెస్టర్లను బహిరంగంగా దోచుకోవటం, నిలువునా మోసం చేయటం తప్ప మరొకటి కాదు’’

  వాస్తవ విలువలా లేదు
  ‘‘టీవీ18-రిలయన్స్-ఈటీవీ డీల్‌లో చేతులు మారిన మొత్తం, ఈ డీల్‌లో ఇమిడి ఉన్న ఆస్తుల వాస్తవ విలువను ప్రతిబింబించడం లేదు. ఇందులో బయటికి చెప్ప(లే)ని ఇతర అంశాలేవో ఉండి ఉంటాయి. టీవీ-18 వాటాదారులు వచ్చే ఐదేళ్లలో 15 శాతం వార్షిక రాబడి కళ్లజూడాలంటే ఈటీవీ కనీసం రూ.550 కోట్ల నికర లాభం ఆర్జించాలి. అది దాని ప్రస్తుత మొత్తం రాబడికి సమానం! అందుకని ఈ స్థాయి ఆర్జన దాదాపుగా అసాధ్యమే’’

  – నిఖిల్ వోరా, ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎండీ

 20. CVReddy

  హైకోర్టు రాజకీయ క్రీడా వేదిక అవుతోంది-Kommineni
  రాష్ట్ర హైకోర్టు చేసిన ఒక వ్యాఖ్య అందరూ గమనించవలసిన అంశం. కోర్టులను రాజకీయ క్రీడా వేదికగా చేయవద్దని ఛీఫ్ జస్టిస్ తో కూడిన దర్మాసనం వ్యాఖ్యానించింది.సుప్రింకోర్టు నోటీసులు ఇచ్చిన మంత్రులకు న్యాయ సాయం జిఓలపై పడిన పిటిషన్ పై హైకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. మంత్రులకు న్యాయసాయం చేయడాన్ని తప్పుపట్టలేదు. మంత్రులు వ్యక్తిగతంగా పనిచేయరని, ప్రభుత్వం తరపున పనిచేస్తారని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే సుప్రింకోర్టులో ఈ అంశం విచారణలో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని చెబుతూనే ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. నిజంగానే హైకోర్టు రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. కాని మన రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కీలకమైన రాజకీయ పరిణామాలకు హైకోర్టే ప్రధాన భూమిక కావడం అన్నది చేదు నిజం. జగన్ ఆస్తుల కేసులో ఆనాటి చీఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పుపై అనేక విమర్శలు ఉన్నాయి. సిబిఐ ప్రాధమిక నివేదిక ఏమి ఇచ్చిందో, పిటిషనర్ దరఖాస్తుపై సంతకం కూడా సరిగా లేదని చెప్పినా వినిపించుకోకుండా జగన్ కు వ్యతిరేకంగా సిబిఐ విచారణకు హైకోర్టు ఎలా ఆధేశించిందో తెలియదు.అదే సమయంలో మొత్తం కేసును హైకోర్టు ఎందుకు పర్యవేక్షించడం లేదో అంతకంటే తెలియదు.ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పరాయి రాష్ట్రం వాడైనా, ఇక్కడ మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ అవడంపైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రులు వ్యక్తిగతంగా పనిచేయరని, ప్రభుత్వం తరపును పనిచేస్తారని కోర్టు అంటే, మరి వారెవరి తప్పు లేనప్పుడు ప్రైవేటు వ్యక్తిగా ఉన్న జగన్ దే తప్పు అని కోర్టు ఎలా భావిస్తుందో తెలియాల్సి ఉంటుంది. అలాగే సిబిఐ కూడా మిగిలినవారికి సంబంధం లేదన్నట్లుగా కేవలం జగన్ నే టార్గెట్ గా చేసుకుని విచారణ చేస్తున్నదన్న భావన కలగడం కూడా వ్యవస్థకు ఎంతవరకు మంచిదో ఆలోచించాలి.అవినీతిని నిజంగానే అంతమొందించాలంటే , మూలం నుంచి చివర వరకు వెళ్లాలి కదా. ఆ సూత్రాన్ని విస్మరించి విచారణలు చేస్తే కేసులు తేలతాయా?హైకోర్టు రాజకీయ వేదిక అవుతున్నదన్న విమర్శ ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఉంది. గతంలో ఎన్.టి.ఆర్.పై కాంగ్రెస్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ కేసు వేసిన వైనం,విచారణ జరిగిన తీరు అందరికి తెలిసినవే. ఇదేకాదు. ఇంకా అనేక కేసులు ఉన్నాయి. అందువల్ల ఛీఫ్ జస్టిస్ చెప్పింది అక్షర సత్యం. హైకోర్టును రాజకీయ క్రీడ వేదికగా కొందరు చేసుకుంటున్నారు. దీనికి రాజకీయ నాయకులు, వ్యక్తులే కాకుండా, హైకోర్టు కూడా బాధ్యత వహించాలి.

 21. Indeed, if the Congress acquired a certain stability after Ms Gandhi took over the reins of the party in 1998, even growing steadily, reacquiring some of the political space it had lost, returning to power in 2004 after eight years in the opposition, securing a renewed and enlarged mandate in 2009, all that now lies in smithereens today. As one Congress functionary put it baldly, “We are at our lowest ebb today.” In recent Assembly elections, the party failed to retain Goa, or wrest Punjab from the Akalis; its showing in Uttar Pradesh was pathetic: only in Uttarakhand, it squeaked through. In local polls since in Delhi, Mumbai, Uttar Pradesh, Madhya Pradesh, the picture continues to be dismal. And the Congress’ showpiece state, Andhra Pradesh, lies in ruins, with the party having to contend both with the continuing agitation in Telangana and the rising popularity of YSR Congress chief Jaganmohan Reddy in the Andhra region.

  An internal survey conducted by the party a few months ago indicated that if a general election were to be called right now, the party would not even touch 100 seats. The only comfort the party could draw from the survey was that the Bharatiya Janata Party (BJP) was just a few seats ahead.

 22. CVReddy

  రామోజీపై ’ఐ’టీ
  ఉషోదయాలోకి రిలయన్స్ నిధుల వరదపై దర్యాప్తు మొదలు
  saakshi.com

  2007-08 సంవత్సరం ఆర్డర్‌ను సమీక్షిస్తామంటూ నోటీసులు
  పాత సినిమాలు, సీరియళ్లకు రూ.787 కోట్ల విలువపై విచారణ
  మార్గదర్శి డిపాజిట్లపై సుప్రీంకో మాట… ఆర్‌బీఐకి మరోమాట
  ఈ మేరకు రూ.150 కోట్ల తేడా; దానిపైనా ఐటీ సమీక్ష
  ఆడిటర్ విజయసాయిరెడ్డి ఫిర్యాదుకు స్పందనగా ఈ చర్యలు
  సోమవారం ఐటీ ముందు హాజరై మరిన్ని వివరాలిచ్చిన సాయిరెడ్డి
  అక్రమ డీల్స్, మనీ లాండరింగ్‌పై 193 పేజీల పత్రాల సమర్పణ
  కేజీ బేసిన్ గ్యాస్‌ను కట్టబెట్టినందుకే బాబుకు రిలయన్స్ క్విడ్ ప్రో కో
  దాన్నే రామోజీకి గురుదక్షిణగా బాబు చెల్లించారని వెల్లడి

  రాజగురువు అసలు రంగు బయట పడుతోంది. నిత్యం ఉషోదయంతో పాటే తన ‘ఈనాడు’ పత్రిక ద్వారా శ్రీరంగ నీతులు వల్లిస్తూ.. తెర వెనక మాత్రం అదే ఉషోదయాలోకి అల్లిబిల్లి కంపెనీల నీడన.. అడ్డంగా, అడ్డదిడ్డంగా, భారీగా, అక్రమంగా నిధులు రాబట్టుకున్న అతి పెద్ద ఆర్థిక నేరం తాలూకు గుట్టు పూర్తిస్థాయిలో రట్టవుతోంది. తన గ్రూపు కంపెనీలతో కలిసి రామోజీ ఏకంగా వేలాది కోట్ల రూపాయల మేరకు పన్నుల ఎగవేతకు పాల్పడ్డ వైనంపైనా నెమ్మదిగా తెర తొలగుతోంది. ఇటు మీడియా పవర్‌ను, అటు అప్పటి ప్రభుత్వంపై తనకున్న పూర్తిస్థాయి ‘పట్టు’నే తిరుగులేని పెట్టుబడిగా మార్చుకుని, అస్మదీయ ‘బాబు’కు అంబానీ చదివించుకున్న‘కేజీ బేసిన్ గ్యాస్’ ప్రతిఫలాన్నే గొట్టం కంపెనీల ద్వారా ఇష్టారాజ్యంగా సొంత సంస్థల్లోకి ఆయన మళ్లించుకున్న తీరు బట్టబయలవుతోంది. ఈ బాగోతంపై ససాక్ష్యంగా ఆడిటర్ విజయసాయిరెడ్డి కొంతకాలం క్రితం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. గురివింద నీతుల రామోజీ ఆర్థిక నేరాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తోంది…

  For full details, please visit saakshi.com

 23. YSR Congress party president Y S Jaganmohan Reddy is likely to come out of the jail on bail in the first week of August, if one were to go by the sources in the Congress party in New Delhi.

  According to these sources, Jagan’s petition for bail would come up for hearing in the Supreme Court in the last week of July. The instruction to the Central Bureau of Investigation from the Delhi bosses is that it should not put up any strong argument to oppose the bail, unlike what it did in CBI court and the state high court. This would facilitate the Supreme Court to grant bail to Jagan, sources said.

  It is learnt that Presidential nominee of the UPA Pranab Mukherjee has taken the initiative in securing bail to Jagan as a goodwill gesture to the latter’s support to him in the Presidential elections. Pranab is learnt to have convinced the party leadership that the longer Jagan is in the jail, the more will be the damage to the Congress party. So, it is better Jagan comes out of the jail on bail.

  Perhaps, Jagan’s mother Vijayalakshmi has also been sounded about the release of Jagan. That is the reason why she told the party workers in Pulivendula on Monday that her son would come out of the jail very soon and they should maintain restraint.

  Source: great andhra

  • CVReddy

   This is sheer nonsense.
   Jagan had told Delhi Media one year back that he would support UPA or Third Front and get max Cabinet berths to state to develop our state.

   Babu should have taken plum cabinet berths in NDA like DMK in UPA and should have developed AP more like Karunanidhi and Akhilesh.
   See Akhilesh is getting 40,000 Cr for UP as central assistance by supporting UPA.

   Babu should have done like Akshilesh and Karunannidhi.
   Jagan is going to do what Akhilesh is doing now.

   Jagan was arrested on 21st of May and has almost completed 2 months.
   Most of the accused will get bail after 3 months as CBI should file charge sheet.
   AS per law, jagan will get bail after Aug 21st(By that time he completes 3 months).

   CBI is opposing bail stating that Jagan could tamper evidence if he is set free outside and as such they cannot show any evidence to support their argument.Jagan has not threatened any witness so far and that is what CBI indirectly admitted to court as they could not show any evidence in this regard.

   So there is nothing like that and we will get bail as per court norms soon.
   It is no way related to supporting Pranab.
   Pranab is a close family friend to YS family for the past 30 years and President post is not a political post like Governor.

   Naturally, Jagan has to support Pranab and there is no alternative for us.
   Abstaining from voting is very bad for any party and how can we ask people to cast their vote when we don’t follow the same.

    • CVReddy

     During NDA’s rule, only Babu personally got max benefit and not state.
     Babu should have asked for key cabinet berths and thus he could have developed AP.Had he done so, who knows he might have come back to power again.
     Babu always claims he has vision but what he has is only blur vision.

     Babu has never practiced what he preached.

 24. tp

  అసెంబ్లీకి జగన్!

  చాలా రోజులుగా చంచల్ గూడ జైలుకు, సీబీఐ కోర్టుకు తిరుగుతున్న జగన్ ఇప్పుడు అసెంబ్లీ బాట పట్టనున్నాడు. రాష్ట్ర పతి ఎన్నికల నేపథ్యంలో ఎంపీగా తన ఓటు హక్కును వినియోగించుకొనేందుకు జగన్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. జగన్ కోరిక మేరకు రాష్ట్రపతి ఎన్నికలకు గానూ మన రాష్ట్ర స్థాయిలో పోలింగ్ జరిగే అసెంబ్లీలోనే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ ఇచ్చింది. సాధారణంగా ఎంపీలందరూ రాజ్యసభ, లోక్ సభల్లో తమ ఓటు హక్కు వినియోగించుకొంటారు. అయితే ఇప్పుడు జగన్ ఉన్న’ప్రత్యేక’పరిస్థితుల దృష్ట్యా రాష్ట స్థాయిలోనే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఓటు వేయబోతున్నాడు. ఈ నెల 19 న జగన్ అసెంబ్లీకి వస్తాడు. మరి ఈ సందర్బంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని కనీసం తాకి అయినా ఆనందాన్ని పొందటం ఖాయమే! అలాగే ఎంత మంది అధికార పక్ష ఎమ్మెల్యేలు జగన్ తో కరచాలనం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. జగన్ అసెంబ్లీలో లాన్ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు సాగిపోయే తరుణంలో ఎంత మంది ఎమ్మెల్యేలు జగన్ తో హమ్ చేస్తారు అనే దాన్ని బట్టి కొత్త అంచనాలు, మరిన్ని విశ్లేషణలు మొదలవుతాయనడంలో సందేహం లేదు. సందడిలో సడేమియా అంటూ జగన్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమాంతం కౌగిలించేసుకొన్న ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఈ నెల 19 న మరి కొన్ని కాంగ్రెస్ వికెట్లు డౌన్అవుతాయా?

 25. CVReddy

  పులివెందులలో విజయమ్మ ప్రసంగం
  http://kommineni.info/articles/dailyarticles/content_20120716_6.php
  “వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరును చెప్పరట,ఆయన పదకాలకు పేర్లు మార్చుతారట. పేర్లు మార్చితే ఏముంది? మనసు ఉండాలి. ‘అలాగే వై.ఎస్.రాజశేఖరరెడ్డి పధకాలను ప్రభుత్వం సజావుగా అమలు చేయాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. పులివెందులలో రైతుల డిమాండ్ల కోసం ధర్నా నిర్వహించారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి సంక్షేమ కార్యక్రమాలను కూడా చక్కగా అమలు పరచారని, అందువల్లనే ప్రకృతి కూడా కరుణించిందని విజయమ్మ అన్నారు.జగన్ చేసిన దీక్షలను చూసి చంద్రబాబు కూడా రైతు మాట చెబుతున్నారని , కాని ఆయన ప్రభుత్వం నడిపినప్పుడు రైతు వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించారని ఆమె విమర్శించారు. చంద్రబాబు ఇప్పుడు రైతు జపం చేస్తున్నారని ఆమె విమర్శించారు. విజయమ్మ క్రమేపి ఉపన్యాసం ధాటిగా చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు కనబడుతుంది. అనేక స్కీములు, కార్యక్రమాల గురించి తడుముకోకుండా ప్రసంగంలో ప్రస్తావిస్తున్న తీరు ఆసక్తికరంగానే ఉంది.రాజకీయ అనుభవం లేని ఒక మహిళ ఈ మాత్రం చెప్పగలగడం విశేషమేనని భావించాలి.

 26. CVReddy

  జగన్ కు నార్కొటెస్ట్-సిబిఐ పెటిషన్ కొట్టివేత
  http://kommineni.info/articles/dailyarticles/content_20120716_7.php
  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆడిటర్ విజయసాయిరెడ్డిలకు నార్కొ పరీక్ష నిర్వహించాలన్న సిబిఐ పిటిషన్ ను నాంపల్లి సిబిఐ కోర్టు కొట్టివేసింది. నిజానికి సిబిఐ ఇలాంటి పిటిషన్ వేయకుండా ఉండవలసింది. ఎందుకంటే సిబిఐ తనవద్ద అనేక ఆధారాలు ఉన్నాయని చెబుతూనే మళ్లీ నార్కో టెస్టును కోరడంలో ఆంతర్యం అర్ధం కాదు. విజయసాయిరెడ్డి విషయంలో గతంలో నే కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చినా, మళ్లీ సిబిఐ ఈ పిటిషన్ వేయడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఏది ఏమైనా సిబిఐ ఇప్పటికైనా దీనిని రాజకీయ కోణంలో కాకుండా,వృత్తిపరమైన నిపుణతతో , ఈ కేసులో సంబందం ఉందన్న అనుమానాలు ఉన్నవారందరిపై విచారణ జరిపే తీరులో సిబిఐ వ్యవహరిస్తే మంచిది. అలాకాకుండా కేవలం జగన్ ను మాత్రమే టార్గెట్ చేసుకుని దర్యాప్తు జరుగుతోందన్న అభిప్రాయం ప్రబలేలా సిబిఐ విచారణ కొనసాగిస్తే దానివల్ల వ్యవస్థకు నష్టం కలుగుతుంది. కాని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సిబిఐ అలా చేస్తుందనుకోవడం అత్యాశే అవుతుందా!

  • CVReddy

   ఆదర్శ కుంభకోణం లో మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ ముక్య మంత్రి మీద సిబిఐ కేసు వేసిన మరుసటి రోజే సిబిఐ జే డి ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసారు.ఇక్కడ బొత్స మీద ACB అధికారి శ్రీనివాస రెడ్డి అధారాలు సేకరించాగానే రాతి కి రాత్రి 10 గంటలకు promotion ఇచ్చి మరీ transfer చేసారు.

   CBI కానీ ACB కానీ వాళ్ళ బాసులు చెప్పినట్టునడవాల్సిందే అని ప్రజలకు ఎప్పుడో అర్ధమయింది అందుకే వోట్ల రూపంలో తమ నిరసన వ్యక్తం చేసారు అధికార కాంగ్రెస్ మరియు దాని మిత్ర పక్షము తెదేప కు వ్యతిరేకంగా గుద్ది.

  • NLR

   I dont know how many times the High Court has to slap thsi JD/KD about trying to violate the Human Rights. Shameless fellow being paid by taxpayers for his job.

 27. CVReddy

  The late NT Rama Rao (“NTR”), founder of Telugu Desam, would have continued merrily well past his seventies but for a coup by his son-in-law N Chandrababu Naidu. Naidu did an Aurangzeb on him and seized power through an internal coup in 1995 — a year before NTR’s death.

  Courtesy:First Post

 28. NLR

  TSR garu …We told u that u are being made scapegoat by Sonia and Purandeswari before the Nellore bypoll. U did not listen.
  The fact now is ..no matter who contests from Vizag …the winner is from YSRCP.

  http://sakshitv.com/index.php/

 29. CVReddy

  YS Jagan Killed One And Injured One
  http://greatandhra.com/viewnews.php?id=39197&cat=15&scat=16
  The last few months has seen a lot happening on the political front for Andhra Pradesh. The emergence of Y S Jagan and his YSR Congress party in a quick way as a lead contender has shook the pillars of few long standing political parties. And now, Jagan is responsible for some serious casualties.

  Well, with the young leader in the marquee, the Telugu Desam Party has reached a totally gone situation and congress has suffered heavy damages. The prediction is that by 2014 TDP will be wiped out and they would no longer have their existence. As for Congress, already many are jumping towards YSR congress.

  If this calculation goes right then the fight is between YSRCP and Congress only. The political analysts believe that the Jagan factor has been quite crucial in routing TDP and inflicting serious dents to Congress. It will be interesting to see how things take shape once Jagan comes out of jail.

 30. CVReddy

  Balakrishna looks for a ‘safe’ seat.
  http://timesofindia.indiatimes.com/city/hyderabad/Balakrishna-looks-for-a-safe-seat/articleshow/14967393.cms

  TDP senior leaders believed to have told the actor that Gudivada is not a safe bet for making his political entry.
  Sources said Balaiah might opt for a Kamma-dominant Penamalur constituency. School education minister K Pardhasaradhi, a BC, won the election from Penamalur with a wafer-thin majority of 177 votes over TDP candidate Chalasani Pandu in the last election. Sources said the party leaders have started scouting for the safest seat for Balaiah.

  His fans and party cadres believe that the hero would help the party regain its lost glory in the coastal region if he decides to enter active politics. While the party’s worst defeat from Prathipadu, one of the Kamma-dominant segments in Guntur district, in the recent byelections jolted the morale of the cadres, Gudivada legislator Kodali Nani’s exit has further hit the calculations of the party. “In this backdrop, Balaiah’s decision to take an active role in the party affairs will galvanise the party cadres,” a political analyst reasoned.

  A section of the leaders argues that Balaiah should enter Parliament portals instead of confining himself to the state assembly. A senior leader not wanting to be named said that party chief Chandrababu Naidu might not prefer Balaiah to be in the assembly as it would create another power centre and rift in the Nandamuri family.

  • CVReddy

   అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉంది. గుడివాడ ఎమ్మెల్యే నానిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన రాజీనామా చేస్తారా? చేయరా? అనేది ఇంకా తేలలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేసినా ఆమోదం పొందే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజీనామాలు చేస్తున్నారనే విమర్శ ఉంది. జగన్ అరెస్టు సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాజీనామా లేఖలు అందజేసినా వాటిని ఇప్పటి వరకు ఆమోదించలేదు. నాని రాజీనామా చేసినా దానిని కూడా ఆమోదించే అవకాశం కనిపించడం లేదు. రాజీనామాలపై అంతిమ నిర్ణయం స్పీకర్‌దే. గతంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదించడం లేదని సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అధికారపక్షం, ప్రతిపక్షం ఉప ఎన్నికలను కోరుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో నాని రాజీనామా చేసినా ఉప ఎన్నికలు రావనే టిడిపి నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా గుడివాడలో విజయం సాధించాలని, లేకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని తేదేపా భావన.

 31. rohit

  జగన్‌పై ఇడి విచారణ ముగిసిందా..?
  http://andhrabhoomi.net/content/jegan-13

 32. rakesh

  cbn is a closed chapter
  he thrives on pro media propaganda
  unfortunately, nobody in AP believes yellow media now a days
  so better close his chapter and discuss new things here

 33. CVReddy

  చెల్లని నాణాలే బాబు కు మిగిలాయి
  http://epaper.greatandhra.com/PUBLICATIONS/GREATANDHRA/GRE/2012/07/13/ArticleHtmls/13072012003002.shtml?Mode=1

 34. vissu

  ntv lo recent ga Srisailam project lo poodika ekkuvaindani oka kathanam vesaaru… 320 TMC la capacity unde reservoier 1995 ki adi 263 TMC la ku… present 213 TMC la ku water storage padipoyindani cheppaaru… Main reason vachi poodika perukupovadam valla…. Mana party ee poodika samasya gurinchi evarinaa experts tho problem study chesi action plan eminaa cheste baaguntundi… At least 300 TMC lu gaanee project lo storage aithe Rayalaseema ki taaguneeti samasya plus Lepakshi SEZ ki koodaa water provide cheyochu…

 35. CVReddy

  రిలయన్స్ మాత్రం డి 6 వెల్‌కు సంబంధించి గ్యాస్‌ ఉత్పత్తి పడిపోయిందని, ఈ బ్లాక్స్‌లో గ్యాస్‌ ఆశించిన స్థాయిలో లేదని చెబుతున్నది. ఇదిలా ఉండగా రిలయన్స తాను ఉత్పత్తి చేసిన కేజీ డి 6 గ్యాస్‌ ధరను తక్షణం ఎమ్‌బిటియుకు 4.5 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నది. ఆధర చెల్లిస్తేనే గ్యాస్‌ను డీ 6 బ్లాక్‌లో ఉత్పత్తి చేయగలమని ఆర్‌ఐఎల్‌ తేల్చి చెబుతున్నది.

  మరోవెైపు డి-6 బ్లాక్‌లో గ్యాస్‌ లేదంటూనే రిలయన్స్ గ్యాస్‌ ధర పెంచమని కోరడంపెైనా పెద్ద ఎత్తున అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవెైపు ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకమైన వెైఖరి అవలంభించలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సీఎం ను రిలయన్స్‌ గ్యాస్‌ పై ప్రశ్నించగా ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశానని, దీనిపెై కేంద్రమే చోరవ తీసుకోవాలని పేర్కొనడం గమనార్హము.

  నాటి బాబు పాపం మనలను కరెంటు కష్టాల రూపంలో వెంటాడుతోంది
  రిలయన్స్ కు వదిలివేయకుండా ,ఆ రోజే తెదేప ప్రభుత్వమూ kG Basin గ్యాస్ బిడ్డింగ్ లో పాల్గొని ఉంటె మనకు ఈ కరెంటు కష్టాలు కొంతైన తగ్గేవి అని అంతా అంటారు.

 36. CVReddy

  Ambani Comment Puts Fire Under Kiran’s Seat.

  http://greatandhra.com/viewnews.php?id=39171&cat=1&scat=4

  Kiran seems to have put his own foot in mouth by passing a statement. It is heard that recently Kiran made a comment on the Ambanis regarding the natural gas resources. This has been causing a lot of trouble in Andhra.

  But this open criticism of Kiran has backfired on him. It is heard that he got dressing down from high command because of criticizing Reliance openly. Incidentally, the Ambanis are pets of congress high command so it is natural that our man will not be spared. Perhaps Kiran got to be more careful next time.

 37. CVReddy

  చంద్రబాబు కళ్లు మాత్రం చెరో వైపు చూస్తున్నాయా!: బీవీ రాఘవులు ఎద్దేవా
  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతంపై సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు సెటైర్ విసిరారు. ఎవరైనా రెండు కళ్లతో ఒకదాన్నే చూస్తారు.. చంద్రబాబు కళ్లు మాత్రం చెరో వైపు చూస్తున్నాయని బీవీ ఎద్దేవా చేశారు.

  రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన చంద్రబాబు తెలంగాణపై తెదేపా వైఖరి ఏంటో చెప్పలేని స్థితిలో ఉన్నారని బీవీ వ్యాఖ్యానించారు. టీడీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక అర్హత లేదని రాఘవులు అన్నారు.

  కాగా రెండు కళ్ల సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి ఎప్పటికప్పుడు ఇబ్బందులు తెచ్చి పెడుతూనే ఉంది. అయితే తెలంగాణ అంశంపై రెండు కళ్ల సిద్ధాంతానికి చంద్రబాబు స్వస్తి చెప్పనున్నట్లు తెలిసింది.

  రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడానికి ఇరు ప్రాంతాల నాయకులకు స్వేచ్ఛనిచ్చి ఓ వైపు సమైక్యాంధ్ర కోసం, మరో వైపు తెలంగాణ కోసం పోరాటాలు చేసే సంప్రదాయానికి చంద్రబాబు తెర తీశారు. అయినా ఈ మంత్రం ఫలించలేదు. దాంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతూ వస్తోంది.

  Source:WebDunia

 38. CVReddy

  అల్లుడు గిల్లుడు. జూనియర్ ఎన్ టీ ఆర్ ఝులక్
  అసలే నక్క జ్వరంతో ములుగుతుంది.ముక్కుతూ మూలుగుతూ వస్తుంటే కాల్లో ముళ్ళు గుచ్చుకొంది. కుయ్యో మొర్రో అనుకుంటూ సేద తీరుదామని కొబ్బరి చెట్టు క్రింద కూర్చుంటే టెంకాయ విరిగి నెట్టి మీద పడింది.ఒక మనిషికి బాడ్ టైం రన్ అవుతుంటే ఎన్ని కష్టాలు వస్తాయో చెప్పడానికి బాబే పెద్ద ఉదాహరణ.

  http://www.lawyerteluguweekly.com/1n.htm

 39. NLR

  Dramakrishna seems to slowly understand the facts .

  http://greatandhra.com/viewnews.php?id=39153&cat=15&scat=16

  Drama babu, Drama krishna and Dramoji rao’s chapters will be closed in 2014. One will plough his two acres of land , one will be a paper boy and the other will continue to make pickles and eat them.

 40. vissu

  andhrabhoomi the best in content presentation…. hope sakshi will find this kinda of team…

 41. CVReddy

  దేశం’ క్లిష్ట పరిస్థితుల్​లో ఉంది.
  Key Points:

  2014 ఎన్నికల వరకు చంద్రబాబు నాయకత్వానికి ఢోకా లేదు. ఆ ఎన్నికలలో గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే సరేసరి! లేదా పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ఇంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పార్టీని అందరూ కలిసి కాపాడుకోవలసింది పోయి, శ్మశానాన్ని ఏలుకోవడానికి పోటీ పడటం చంద్రబాబుతో సహా ఎన్.టి.ఆర్. కుటుంబ సభ్యుల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం.
  ఇదంతా చంద్రబాబు చేసుకున్న స్వయంకృతాపరాధమే! తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇంతకాలంగా అనుసరించిన ఎత్తుగడల పర్యవసానాలే ప్రస్తుత పరిణామాలు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టిన చందంగా ఎప్పటికప్పుడు అవసరం తీరడం కోసం చంద్రబాబు ఎంతో మంది అనర్హులను చేరదీసి పార్టీలో పెద్ద పీట వేస్తూ, తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని దశాబ్దాల పాటు ఎన్నో త్యాగాలు చేసిన వారికి అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత దుస్థితి దాపురించింది.
  తెలుగుదేశం విషయానికి వస్తే, కృష్ణాజిల్లా నూజివీడులో దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న వారిని, విధేయులను వదిలేసి, రియల్ఎస్టేట్ వ్యాపారి రామకోటయ్యకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన జగన్ వైపు మొగ్గారు.
  తెలుగుదేశం పార్టీ అంటే తమదేననీ, ఎన్.టి.ఆర్. వారసులుగా పార్టీకి కూడా తామే వారసులమని హరికృష్ణ ప్రభృతులు భావిస్తూ ఉంటారు. అయితే పార్టీ అభివృద్ధికి వారి కృషి మాత్రం శూన్యం.
  దీంతో ఎన్.టి.ఆర్. కుటుంబ సభ్యులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే విషయం అటుంచి, తలనొప్పిగా మారారు. తన కుమారుడైన జూనియర్ ఎన్.టి.ఆర్.కు ఏదో అన్యాయం జరిగిపోతున్నదని హరికృష్ణ వాపోతూ ఉంటారు. చంద్రబాబు అండ్ కో అడ్డుపడకపోతే తన కుమారుడు రేపే ముఖ్యమంత్రి అవుతాడన్నట్టుగా హరికృష్ణ భావిస్తూ ఉంటారు. దీంతో చంద్రబాబును, ఆయనకు అండగా ఉంటున్న పార్టీ నాయకులను హరికృష్ణ తిట్టిపోస్తూ ఉంటారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్.టి.ఆర్.పై కూడా ఆయన ఒత్తిడి తెస్తూ ఉంటారు.

  దీంతో అటు తండ్రి, ఇటు మామయ్య, పార్టీ అధినేత చంద్రబాబు మధ్య తాను నలిగిపోతున్నానని జూనియర్ ఎన్.టి.ఆర్. తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారసత్వం తన కుమారుడికి దక్కకుండా చంద్రబాబు తన కుమారుడైన లోకేష్‌కు అప్పగించబోతున్నారన్న బాధ హరికృష్ణలో ఏర్పడింది. దీంతో పార్టీలో చికాకులు సృష్టించడానికి హరికృష్ణ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. హరికృష్ణ ఇలా భావించడానికి చంద్రబాబు కూడా కారకుడే! కష్టాలలో ఉన్న పార్టీని నిలబెట్టుకోవడానికి ఏమి చేయాలన్న విషయం కంటే లోకేష్ వారసత్వంపైనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చర్చ జరగడం, అలాంటి చర్చలను నివారించడానికి చంద్రబాబు సిన్సియర్‌గా ప్రయత్నించకపోవడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనం.
  తాను దూర సందు లేదు. మెడకు ఒక డోలు’ అన్నట్టు ఇప్పుడు చంద్రబాబుకే దిక్కులేదు. ఇలాంటి పరిస్థితులలో తన వారసుడిగా లోకేష్‌ను ప్రొజెక్ట్ చేయాలని చంద్రబాబు మనసులోనైనా అనుకోవడాన్ని ఏమనాలి? పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో ఉన్న పరిస్థితులలో వారసత్వం విషయంలో హరికృష్ణ, చంద్రబాబు కీచులాడుకోవడం ఆ పార్టీ సీనియర్లకు మింగుడుపడటం లేదు. లోకేష్‌లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయో, లేవో తెలియదు. ఆయన రాజకీయాలలో ఎంత వరకు రాణిస్తారో, ప్రజలను ఏ మేరకు ఆకర్షించగలరో స్పష్టత లేదు. మరోవైపు తాము నటించిన ఒక సినిమా హిట్ అయితే, రెండు సినిమాలు ఫట్ అవుతున్న బాలకృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్.లు సినీ జీవితం కంటే రాజకీయ జీవితంపై ఆసక్తి చూపుతున్నారు.
  దీంతో బాలకృష్ణ- జూనియర్ ఎన్.టి.ఆర్.ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎన్.టి.ఆర్. కుటుంబంలోనే ఇన్ని విభేదాలు! అయినా ఎవరికి వారే తెలుగుదేశం వారసత్వాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అనుకూలంగా మలచుకోలేక అవస్థలు పడుతున్న తెలుగుదేశం పార్టీకి, తమ చర్యల ద్వారా ఎన్.టి.ఆర్. కుటుంబ సభ్యులే హాని చేస్తున్నారు. పార్టీ భవిష్యత్తు ఏమిటో చెప్పలేని స్థితి! 2014లోగానీ, ఈలోపుగానీ వచ్చే ఎన్నికలలో గట్టెక్కుతామన్న భరోసా ఆ పార్టీ శ్రేణులలో ప్రస్తుతానికి లేదు. అయినా వారసత్వ రగడ మాత్రం జోరుగా కొనసాగడాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కింది స్థాయి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

  2019 లక్ష్యంగా వారసత్వ పోరు సాగడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. 2014 ఎన్నికల వరకు చంద్రబాబు నాయకత్వానికి ఢోకా లేదు. ఆ ఎన్నికలలో గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే సరేసరి! లేదా పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అంటే వచ్చే ఎన్నికలలో గెలవలేకపోతే చంద్రబాబు శకం ముగిసినట్టే అవుతుంది. ఆ తర్వాత పార్టీ ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ జరిగి, తెలుగుదేశం పార్టీ తృతీయ స్థానానికి పడిపోతే భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీలే మిగులుతాయి.
  ఈ లెక్కన తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టాలంటే వచ్చే ఎన్నికలలో ప్రథమ లేదా ద్వితీయ స్థానాలలో ఏదో ఒక స్థానంలో ఉండాలి. ఇంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పార్టీని అందరూ కలిసి కాపాడుకోవలసింది పోయి, శ్మశానాన్ని ఏలుకోవడానికి పోటీ పడటం చంద్రబాబుతో సహా ఎన్.టి.ఆర్. కుటుంబ సభ్యుల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. పుత్ర వాత్సల్యం ఉండటంలో తప్పులేదు గానీ, అర్హత లేకపోయినా అందలం ఎక్కించాలనుకోవడం, ఎండమావుల కోసం పరుగులు తీయడం విజ్ఞుల లక్షణం కాదని అటు చంద్రబాబు, ఇటు హరికృష్ణ గుర్తించడం అవసరం.

  వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తమనే ఎందుకు టార్గెట్ చేసిందన్న ఆలోచనలు చేయకుండా, అంతర్గత కీచులాటలతో కాలక్షేపం చేయడం తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న ప్రధాన బలహీనత! పై నుంచి కింది స్థాయి వరకు ఇదే పరిస్థితి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో పాటు ఆ పార్టీకి చెందిన ప్రధాన ఓటు బ్యాంకులు జగన్ పార్టీవైపు మళ్లినప్పటికీ, ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో సమానంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు సాధించింది. దీన్నిబట్టి కాంగ్రెస్ పార్టీ ఇకపై ఇంతకంటే నష్టపోయేది ఏమీ లేదని స్పష్టమవుతోంది. అదే సమయంలో కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న విషయం మరువకూడదు.

  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంతటి విపత్కర పరిస్థితిని ఆ పార్టీ ఎప్పుడూ ఎదుర్కొనలేదు. 1989లో అధికారం కోల్పోయిన తర్వాత ఎన్.టి.ఆర్. మౌనంగా ఉండేవారు. ఆయన తరఫున పార్టీ వ్యవహారాలను చంద్రబాబు నేతృత్వంలో ముఖ్య నాయకులు కొందరు నిర్వహించేవాళ్లు. చంద్రబాబు విషయంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. అన్నీ తానై వ్యవహరించాలన్నది చంద్రబాబు ఆలోచన. ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయన కొంత కాలం మౌనంగా ఉండి, పార్టీ ముఖ్య నాయకులను తెర మీదకు తెచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు మౌనంగా ఉండలేకపోతున్నారు. రోజూ ఏదో ఒక సమీక్ష పేరుతో బిజీగా ఉండటానికే ఇష్టపడుతున్నారు.
  వచ్చే ఎన్నికలలో పార్టీ బతికి బట్టకడితే వారసత్వం గురించి అప్పుడు ఆలోచించుకోవచ్చు. హరికృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్.కు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా ఎన్.టి.ఆర్. పేరు చెప్పి వారసత్వం ఆశించే ప్రయత్నాలకు స్వస్తి చెప్పకపోతే తెలుగుదేశం పార్టీకే ప్రజలు స్వస్తి చెబుతారు. జైలులో ఉన్న జగన్‌కు ఉన్నపాటి దూరదృష్టి కూడా లేని ఎన్.టి.ఆర్. కుటుంబ సభ్యులు వారసత్వంపై ఆశలు పెట్టుకోవడం అవివేకమే అవుతుంది. పార్టీకి ప్రారంభం నుంచి అండగా ఉంటూ వచ్చిన వర్గాలు కొన్ని ఇప్పటికే దూరం అయ్యాయి.

 42. Chandrababu couldn’t have back-stabbed/killed NTR, if SAKSHI was present in 1994.

  • CVReddy

   Yeah.
   Had Saakshi been there in 1994, Babu would not have come to power in 1999.
   Babu manged to get back to power in 1999 just because of BJP’s 18% (Due to Vajpayye and Cargil war win) vote and own media support.

   That is why Babu is hell-bent on closing Sakshi. Babu knows Sakshi will expose him completely.

   Now people can see other side of the Babu.

 43. CVReddy

  వృద్ధ సింహం-బంగారు కంకణం
  వెనుకట అడవిలో ఒక సింహం ఉండేది. వయసు, శక్తి, దూకుడు ఉన్నకాలంలో ఆ సింహం అడవిలో స్వైరవిహారం చేసింది. తన పర భేదం లేకుండా అవసరాన్ని బట్టి అందరినీ మింగేస్తూ వచ్చింది. తనకు సన్నిహితంగా ఉండి సలహాలు, సూచనలు, చాడీలు చెప్పినవారిని సైతం కబళించేది. తను పరుగెత్తగలిగిన కాలంలో తాను ఏం చేసినా నడిచింది. వయసైపోయింది. కాళ్లు చచ్చుబడిపోయాయి. శక్తి చాలడం లేదు. కదలలేకపోతోంది. మరి పొట్ట గడిచేదెలా? జీవనం సాగేదెలా? ఏదో ఒక జంతువును, ఎవరో ఒక మనిషిని తన వద్దకు రప్పించుకుని దగ్గరకు రాగానే పంజా విసరాలి. ఎవరో ఒకరు ఊరకే ఎందుకు దగ్గరకు వస్తారు? తాను మారిపోయానని నమ్మించాలి. శాకాహారిగా మారానని విశ్వాసం కలిగించాలి. తాను ఎవరికీ హాని చేయబోనని, అందరినీ బాగా చూసుకుంటానని హామీలు కురిపించాలి. అంతేకాదు ఒక బంగారు కంకణం సంపాదిం చి, దారిన పోయేవారికి చూపించి, దగ్గరకు వస్తే ఇస్తానని భ్రమపెట్టాలి. దగ్గరకు వచ్చిన తర్వాత తననుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆ వృద్ధసింహం ధీమా. కానీ ఎవరు నమ్ముతారు? సింహం శాకాహారిగా మారిందంటే ఎందుకు మోసపోతారు? ఇది పంచతంత్ర కథ! ఎప్పుడో రాసిన కథ! కానీ ఇందులోని నీతి ఇప్పటి రాజకీయాలకూవర్తిస్తుంది.

  తాను మారానని చంద్రబాబునాయుడు చెబుతుంటే ఎవరూ నమ్మడం లేదు. ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా ఉద్యోగుల్లో సానుభూతి పెగలడం లేదు. అందరినీ బాగా చూసుకుంటానంటే చాలా మంది ఇంకా విశ్వసించడం లేదు. చంద్రబాబునాయుడు చేసే ప్రతి విమర్శ తిరిగి తిరిగి వచ్చి ఆయనకే తగులుతున్నది. ఆయన ప్రయోగించే బాణాలు బూమరాంగై ఆయననే గాయపర్చుతున్నాయి. ‘నువ్వు వెన్నుపోటుదారువి’ అని కొడాలి నాని ని విమర్శిస్తే, ‘నిన్ను మించిన వెన్నుపోటుదారునా? ఎన్‌టిఆర్‌కు నువ్వు చేసిన అన్యాయం మరిచిపోయా వా? నేషనల్ ఫ్రంట్‌కు వెన్నుపోటు పొడిచి బిజెపి పంచ న చేరావు. టీఆస్, కమ్యూనిస్టులు…అందరినీ వెన్నుపోటు పొడిచావు. నువ్వు ద్రోహం చేయనిదెవరి కి?’ అని ఎదురుదాడి చేశారు. ‘ప్యాకేజీ రాజకీయాలు వచ్చా యి. ఎమ్మెల్యేలను కొంటున్నారు’ అని చంద్రబాబు ఆరోపిస్తే, ‘ఏ ప్యాకేజీ ఇచ్చి ఎన్‌టిఆర్‌కు వ్యతిరేకంగా దగ్గుబాటిని బుట్టలో వేశావు? ఏ ప్యాకేజీ ఇచ్చి ఎమ్మెల్యేలను వైస్రాయ్‌కి రప్పించావు? ఏ ప్యాకేజీ ఇచ్చి ఇత ర పార్టీల వారిని నీ పార్టీలో చేర్చుకున్నావు?’ అని మరో గొంతు ప్రశ్నిస్తున్నది. ‘బీసీలకు వంద సీట్లు ఇస్తా ను. పదివేల కోట్లు వారి సంక్షేమానికి కేటాయిస్తాను’ అని చంద్రబాబు అంటే, ‘గత ఎన్నికలకు ముందుకూడా ఇలాగే చెప్పారు-కానీ కేవలం 56 మందికి మాత్రమే టికెట్లు ఇచ్చారు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారు?’ మరొకాయన ప్రశ్నించారు. ‘జగన్ అవినీతి సామ్రాట్టు. గజదొంగ…..’ అని చంద్రబాబునాయుడు మిన్నూ మన్నూ ఏకం చేసినా, ‘అవినీతి పరులు కానిదెవరు? నువ్వేం తక్కువ తిన్నావా? నీ సంగతి ఎవరికి తెలియ దు’ అని జనం గొణుక్కోవడమే కాదు, ఓటుతో కొట్టి మరీ చెప్పారు. ఉచిత విద్యుత్తు అడిగితే, ‘తప్పు తప్పు’ అని ప్రచారం చేసిన చంద్రబాబు, నగదు బదిలీ ఇస్తామంటే కూడా గెలిపించలేదు. ఎందుకిలా జరుగుతోంది? చంద్రబాబునాయుడు ఏం మాట్లాడినా ఎందుకు సానుకూలత రావడం లేదు? ఎందుకు ఆయన విశ్వసనీయత పెరగడం లేదు? లోపం ఎక్కడ ఉంది?

  నమ్మకమయినా అపనమ్మకమయినా ఒక్కసారి పెరగదు. ఒక్కసారే తరగదు. మన చేతిలో అధికారం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, అవకాశాలు ఉన్నప్పుడు, చెర్నాకోలా విసరగలిగినప్పుడు మనం జనంతో, వివిధ వర్గాలతో ఎలా వ్యవహరించామన్నదే నమ్మ కం పెరగడానికయినా, తరగడానికయినా కారణం. చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల అధికారంలో ఎలా వ్యవహరించారో చాలా మందికి ఇప్పటికీ గుర్తుంది. గుర్తు చేసే నాయకులు ఉన్నారు. ప్రచార, ప్రసార సాధనాలు ఉన్నాయి. ఒకప్పుడంటే ఒకటే దృశ్యం. ఒకటే అక్షరం. ఆ దృశ్యం, అక్షరం రెండూ చంద్రబాబు ఆయుధాలే. ఇప్పుడు భిన్నభావాల దృశ్యాలు, అక్షరాలు పరస్పరం సంఘర్షిస్తున్నాయి. ఒకరి గుట్టును మరొకరు పట్టి పల్లార్చుతున్నారు. చంద్రబాబునాయుడు గత రెండు దశాబ్దాలుగా అపనమ్మకాన్ని టన్నుల కొద్దీ పెంచుకుంటున్నారే తప్ప తగ్గించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎన్‌టిఆర్‌కు చేసిన అన్యాయాన్ని అతిబలవంతంగా కప్పిపెట్టవచ్చు. అసలది చరివూతలోకి ఎక్కకుండా దాచిపెట్టవచ్చు. కానీ ఎన్‌టిఆర్ అకాల మరణంతో నొచ్చుకున్న లక్షలాది మంది తెలుగు ప్రజలు ఇప్పటికీ చంద్రబాబును నమ్మడం లేదు. క్షమించడం లేదు.

  ఆ గాయాలు అలాగే ఉన్నాయి. అందుకు, 2004లో ఆయనను శిక్షించారు. తెలంగాణపై అనుకూల నిర్ణయం తీసుకోవడం, టీఆస్, వామపక్షాలతో జట్టుకట్టడం వల్ల 2009 ఎన్నికల్లో ఆయనపై కాస్తంత నమ్మకం పెరిగింది. 92 స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది. కానీ పెరిగిన ఆ కాస్త నమ్మకాన్నీ ఆయన కాపాడుకోలేదు. పైగా ఆయన కొత్త తప్పులు చేస్తూ పోయారు. ఎన్నికల్లోనే టీఆస్‌ను, వామపక్షాలను దెబ్బతీశారు. తెలంగాణ ఏర్పా టు ప్రకటన రాగానే, ‘చట్….అలా ఎలా చేస్తారని’ అడ్డం తిరిగారు. ఇక ఆయనపై నమ్మ కం పెరిగేది ఎలా?

  నాయకునిగా రుజువు చేసుకోవాల్సిన ప్రతిసందర్భంలో, రాజనీతిజ్ఞత ప్రదర్శించాల్సిన ప్రతిమలుపులో పిల్లిమొగ్గలు వేస్తూ పోయారు. అలా టన్నుకు టన్ను….అనేక టన్నుల అపనమ్మకాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన అసలు సమస్య ను వదిలేసి మిగతా సమస్యలన్నీ మాట్లాడుతున్నారు. చర్చలు, తీర్మానాలు, డిక్లరేషన్లు చేస్తున్నారు. అవన్నీ చేయాల్సిందే. కానీ వాటన్నింటికీ విలువ ఎప్పుడు వస్తుందంటే, మౌలికమైన అంశంపై నాయకుడు తన నిజాయితీని చాటుకున్నప్పుడు! చంద్రబాబు ఎంతమంచి నిర్ణయాలు చేసినా, తెలంగాణపై పోగేసుకున్న అపనమ్మకం వాటన్నింటినీ కమ్మేస్తుంది. తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా చంద్రబాబునాయుడు ఇవ్వాళ ఇంటికో తులం బంగారం ఇస్తామంటే, తీసుకుంటారేమో కానీ ఓటు మాత్రం వేయరు. చంద్రబాబును నమ్మరు. నాయకుడు కేంద్రంగా(లీడర్ సెంట్రిక్) మనుగడ సాగించే పార్టీల్లో బలమైనా, బలహీనతైనా నాయకుడే. నాయకుడు గట్టోడయితే పార్టీ గట్టిగా ఉంటుంది. నాయకుడు బలహీనపడితే పార్టీ బలహీనపడుతుంది.

  మొన్నటి ఉప ఎన్నికల్లో చంద్రబాబునాయుడు శ్రీకాకుళంలో ప్రసంగిస్తూ ఉంటే చూశాను. చంద్రబాబు అత్యంత ఉచ్ఛస్వరంతో జగన్ ను, ఈ ప్రభుత్వాన్ని ‘సిగ్గుందా? శరముందా?’ అని ప్రశ్నిస్తుంటే సభకు హాజరైనవాళ్ల ముఖాలు చూశాను. అంతటి నాయకుడు, అంత తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే జనంలో ఎంతటి అలజడి ఉండాలి? కానీ ఒక్కడు చప్పట్లు కొట్టినవాడు లేడు. నినాదాలు చేసినవాడు లేడు. కనీసం ముఖాల్లో ఏ ఫీలింగూ లేదు. అదే రాజకీయాల్లో కొత్తగా ఓనమాలు నేర్చుకుంటున్న షర్మి ళ మాట్లాడుతుంటే, నిరంతర జయజయధ్వానాలు! కొత్తొక వింత అని ఎవరయినా అనవచ్చు.

  కొత్తగా కనిపించకపోతే, కొత్త నినాదాలు, కొత్త మాటలు చెప్పకపోతే జనం నాయకులను ఎందుకు పట్టించుకుంటారు? చంద్రబాబు కూడా కొత్తగా కనిపించాలి. రాజశేఖర్‌డ్డి పాదయాత్ర చేసి ఒక కొత్త అవతారంలో జనానికి చేరువయ్యారు. చంద్రబాబు కూడా పాదయాత్ర చేయాలని కాదు. మరో మార్గం! మరో ప్రయత్నం! చంద్రబాబు కూడా ప్రజల్లో నమ్మకాన్ని పాదుకొల్పే ఏదో కొత్త విషయం చెప్పకపోతే ఎందుకు వింటారు? చెప్పిన విషయాలే పదేపదే చెబు తూ ఉంటే జనంలో స్పందన ఎలా వస్తుంది? జనం నాయకుడిని పట్టించుకోవడం లేదంటే, ఆ పార్టీ పని అయిపోతున్నట్టే లెక్క. ఉప ఎన్నికల ఫలితాలన్నీ వ్యతిరేకం గా వస్తున్నాయంటే నాయకుడి మంత్రం పనిచేయడం లేదని సంకేతం! అటువంటి సంకేతం పదేపదే వస్తే నాయకుడు బలహీనపడిపోతారు.నాయకుడు బలహీనపడే కొద్దీ నిన్నమొన్నటిదాకా జయజయధ్వానాలు కొట్టినవాళ్లే ఎదురుతిరగడం మొదలుపెడతారు.

  గెలిచే పార్టీల వైపు దూకడం మొదలవుతుంది. లీడర్లు, కేడర్లు జారిపోతుంటారు. ఈ పరిణామాలను ఆపాలంటే, ఈ పతనాన్ని అధిగమించాలంటే మళ్లీ పూనుకోవలసింది నాయకుడే. తెలుగుదేశం బతకాలంటే తెలంగాణకైనా, ఆంధ్ర ప్రాంతానికయినా గట్స్ ఉన్న ఒక నాయకు డు కావాలి. ఆయా ప్రాంతాల ప్రజలకు నమ్మకం కలిగించగల ధీరుడు కావాలి. స్పష్టత, నిజాయితీ కలిగి ఉండడమే కాదు మాటమీద నిలబడే మొనగాడు కావాలి. కుట్రలు, కుతంవూతాలు, ఎత్తులు జిత్తులపై ఆధారపడకుండా, జనం చేత అందరివాడు అనిపించుకునే ప్రయత్నం జరగాలి. అంతా బాగుంది(ఆల్ ఈజ్ వెల్) అని మీడియా ఇచ్చే బిల్డప్‌లు, కవరప్‌లు పెయిన్ కిల్లర్స్ లాంటివి. అవి తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తాయి. వాటితో పూర్తిగా కోలుకోవడం సాధ్యం కాదు. తెలుగుదేశానికి ఇప్పుడు కావాల్సింది యాంటీ బయాటిక్స్. మూలాల్లోంచి చికిత్స జరగాలి. చంద్రబాబునాయుడే అందుకు పూనుకోవాలి. పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే షార్ట్‌కట్‌లు ఉండవు. కఠిన నిర్ణయాలు, కఠోర శ్రమ అనివార్యం.

  Source: Katta Sekhar Reddy, Namashte Telangana

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s