ల్యాంకో.. కుమ్ముకో

కేంద్రం హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర
రాష్ట్రానికి తక్కువ ధరకే విద్యుత్‌ను ఇవ్వాలన్న కేంద్రం
అధిక ధరకు విక్రయిస్తున్న ల్యాంకో స్టేజ్-2,
జీఎంఆర్ బార్జ్‌మౌంట్ ప్లాంట్లు
ఫలితంగా ఏడాదికి రూ.438 కోట్ల భారం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒకవైపు మన గ్యాస్ మనకే రాకుండా పోతోంది. మరోవైపు వస్తున్న కొద్దిపాటి గ్యాస్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. గ్యాస్ కేటాయింపులు పొందిన సంస్థల నుంచి తక్కువ ధరకే విద్యుత్‌ను పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమ‌వుతోంది. రాష్ట్రానికే గ్యాస్ ఇస్తామ‌ని కేంద్రం నుంచి కేటాయింపులు పొందిన ల్యాంకో సంస్థ మొదట్లో తమిళనాడుకు విద్యుత్‌ను అమ్ముకుంది. జీఎంఆర్ బార్జ్‌వంట్ సంస్థదీ అదే తీరు. రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వకపోతే, అది కూడా తక్కువ ధరకు ఇవ్వకపోతే గ్యాస్ వెనక్కి తీసుకుంటామ‌ని కేంద్రం హెచ్చరించినప్పటికీ ల్యాంకో, జీఎంఆర్‌ల దందా నిరాటంకంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వమూ ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. దీంతో ఆ సంస్థలు యూనిట్ విద్యుత్‌ను ఏకంగా రూ.5.70కు విక్రయిస్తున్నాయి. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై ప్రతి ఏటా రూ.438 కోట్ల అదనపు భారం పడుతోంది. ల్యాంకో సంస్థ కొండపల్లి వద్ద 366 మెగావాట్ల సామ‌ర్థ్యంతో స్టేజ్-2 విద్యుత్ ప్లాంటును నిర్మించింది. ఈ ప్లాంటుకు గ్యాస్ కేటాయించే విధంగా కేంద్రానికి సిఫారసు చేయాలని 2006లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. మరోసారి 2008లో అప్పటి ఇంధనశాఖ మంత్రి షబ్బీర్ అలీని కలిసి కేంద్రానికి సిఫారసు చేయాలని కోరింది. ఇందుకు అంగీకరించిన మంత్రి 2008 సెప్టెంబరు 14న కేంద్రానికి లేఖ రాశారు.

ఈ ప్లాంటుకు గ్యాస్ కేటాయిస్తే రాష్ట్రానికి అదనపు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని… తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి రావడంతో పాటు విద్యుత్ కష్టాలు తీరుతాయని అందులో పేర్కొన్నారు. ఆ విధంగా గ్యాస్ కేటాయింపులు పొందిన తర్వాత ల్యాంకో సంస్థ మాట మార్చింది. 2010 మార్చిలో ఈ ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయింది. పట్టించుకునే వారు లేకపోవడంతో అప్పటి నుంచి 2011 ఫిబ్రవరి వరకు అంటే ఏడాదిపాటు తమిళనాడుకు విద్యుత్‌ను అమ్ముకుంది. అదీ యూనిట్ 5 రూపాయలకు. గత ఏడాది 2011 ఏప్రిల్ నుంచి మాత్రం మనకు విద్యుత్‌ను విక్రయిస్తోంది. తాజాగా గత జూన్ నుంచి వచ్చే ఏడాది మే వరకు ట్రాన్స్‌కో పిలిచిన టెండర్ల మేరకు విద్యుత్‌ను విక్రయిస్తానని ముందుకు వచ్చింది. అయితే యూనిట్ విద్యుత్‌ను ఏకంగా రూ.5.70కు సరఫరా చేస్తోంది. అంటే తమిళనాడు కంటే 70 పైసలు ఎక్కువ. మిగతా ప్లాంట్లతో పోల్చుకుంటే ఏకంగా రూ.3 ఎక్కువ. వాస్తవానికి 2011 ఏప్రిల్ 21న..ల్యాంకో, జీఎంఆర్‌లు రాష్ట్రానికే విద్యుత్ ఇవ్వాలని, లేదంటే వాటికి గ్యాస్‌ను కట్ చేస్తామని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. ల్యాంకో, జీఎంఆర్ సంస్థలు మీకు విద్యుత్ ఇస్తున్నాయా? ఎంత ధరకు ఇస్తున్నాయి? అని 2011 సెప్టెంబర్ 26 నాటి మరో లేఖలో రాష్ట్రాన్ని కేంద్రం ఆరా తీసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనం దాల్చింది.

యూనిట్‌కు రూ.3 అదనం: వాస్తవానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు రూ.2.70కే యూనిట్ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. ల్యాంకో సంస్థ కొండపల్లి స్టేజ్-1 ప్లాంటు, వేమగిరి (జీఎంఆర్) సంస్థ కూడా మనకు ఈ ధరకే విద్యుత్‌ను ఇస్తున్నాయి. అంటే ల్యాంకో స్టేజ్-2, జీఎంఆర్ ప్లాంట్ల వల్ల యూనిట్‌కు రూ.3 అదనంగా వెచ్చించాల్సి వస్తోందన్నమాట. ల్యాంకో సంస్థ 90 మెగావాట్లు, జీఎంఆర్ బార్జ్‌వంట్‌లు 81 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. రెండూ కలిపి 171 మెగావాట్లు… అంటే సుమారు 4 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే యూనిట్‌కు అదనంగా రూ.3 చొప్పున రోజుకు 1.2 కోట్లు, ఏడాదికి ఏకంగా రూ.438 కోట్ల మేరకు రాష్ట్ర ఖజానాపై భారం పడుతోందన్నమాట. ఇంత భారం పడుతున్నా.. తక్కువ ధరకు విద్యుత్‌ను ఇవ్వకపోతే గ్యాస్ కట్ చేస్తామని కేంద్రం లేఖల మీద లేఖలు రాస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.

9 Comments

Filed under Uncategorized

9 responses to “ల్యాంకో.. కుమ్ముకో

 1. rohit

  భేటీ నిరూపిస్తే రాజీనామా చేస్తాం
  http://andhrabhoomi.net/content/betee

  • sekar

   just ignore these silly fellows. We don’t need to give much importance to these yellow impotents. Chandrababu can make some media brokers to write such baseless stories…but the normal people know what is truth and what is not.

   People believed babu boot licking acts at Delhi with Chidambaram. And ensured their deposits were lost.

 2. CVReddy

  ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని టిడిపినే ప్రవేశపెట్టిందని, వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓట్ల కోసం, సీట్ల కోసం పలు పథకాలు ప్రవేశపెట్టారని టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు విమర్శించారు.
  http://www.andhrabhoomi.net/content/chandra-babu-24

 3. CVReddy

  వైకాపా కు కాలు లేని సోఫా ఇచ్చారట
  http://telugu.greatandhra.com/cinema/1-08-2012/yka_8.php

 4. CVReddy

  Jagan Party MLAs Just Can’t Relax!
  http://greatandhra.com/viewnews.php?id=39715&cat=1&scat=4
  The newly-elected MLAs of YSR Congress party might be on cloud nine for winning their seats again, but the message from party president Y S Jaganmohan Reddy to them is loud and clear: they just cannot relax and get carried away by the people’s mandate.

  Jagan is learnt to have told them when they met him in batches in Chanchalguda jail that they should work hard and be among the people always, rather than staying back in Hyderabad and concentrating on making money for the next elections.

  “You have to be always among the people taking up their issues in a big way, so that the people would feel that you are one among them. Otherwise, they might not vote for you in the next elections, if you ignore them. The sympathy factor might have worked this time; but it may not be possible every time,” he warned them.

  As a result, many of the YSR Congress party MLAs have been participating in one programme or the other in their respective constituencies to highlight the people’s issues.

  For example, Tirupati MLA Bhumana Karunakar Reddy has been constantly in touch with the local people, fighting for their burning issues. On Monday, Bhumana held a huge rally in Tirupati with a large number of women in front of the Tirupati municipal corporation demanding release of Rs 450 crore for providing drinking water facilities for the people. Earlier, he staged an indefinite fast for closure of liquor shops in the town. The same tactics is being adopted by the YSR Congress party MLAs everywhere.

 5. CVReddy

  Will Jagan Get Bail?
  http://greatandhra.com/viewnews.php?id=39718&cat=1&scat=4

  YSR Congress head Jagan is trying for bail and has filed a petition at the Supreme Court. Though he filed it sometime back he withdrew the application due to certain technical reasons.

  Specifically the state government’s special GOs to provide legal assistance for five of their ministers the petition was withdrawn. But now, with the same GOs, Jagan has filed the bail petition.

  If Supreme Court considers that angle then there is a chance of granting bail. Already, there is a contention that this case has been progressing on purely political basis. CBI will automatically oppose the bail. So it all boils down to the arguments at court and how Supreme Court will treat it.

  This would decide the fate of Jagan. Even Jagan’s mother Vijayamma is positive that her son will get the bail this time and he will be released. The tension continues…

 6. CVReddy

  ల్యాంకో లూటీ

  – ఆయాచితంగా గ్యాస్ కేటాయింపులు
  – కేంద్రం అభ్యంతరాలు పట్టించుకోని రాష్ట్రం
  – చర్యలు తీసుకోవాలని వెల్లువెత్తుతున్న డిమాండ్లు
  హైదరాబాద్, ఆగస్టు 7 (టీ మీడియా): ‘మా ఇంటికి వస్తే ఏం తెస్తారు.. మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు’ అన్నట్లుగా ఉంది ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టు(విస్తరణ)తీరు. ఆయాచితంగా కేంద్రం నుంచి గ్యాస్ కేటాయింపులు తీసుకుంటూ, అం దుకు అనుగుణంగా రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వాల్సి ఉన్నా.. అవే మీ పట్టించుకోకుండా పక్క రాష్ట్రానికి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటోంది. కేంద్రం రంగంలోకి దిగడంతో బహిరంగ విపణిలో ఉన్న ధరకు విద్యుత్ ఇస్తానని ముందుకు రావడంపై విద్యుత్ రంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇతర గ్యాస్ ఆధారిత ప్లాంట్లు రాష్ట్రానికి సక్రమంగానే విద్యుత్ ఇస్తున్నా, ల్యాంకో మాత్రం అందుకు అతీతంగా వ్యవహరిస్తున్నది. ఫలితంగా ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టుపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్నది.

  నాడు గ్యాస్ కోసం నానా తంటాలు
  విజయవాడ సమీపంలో ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టుకు సమీపంలో స్టేజ్-2 ప్రాజెక్టును యాజమాన్యం చేపట్టింది. ఇం దుకు అవసరమైన గ్యాస్ కేటాయింపులపై 2002లో రాష్ట్ర ప్రభుత్వానికి ల్యాంకో ప్రతిపాదనలు అందజేసింది. అప్పట్లో జీవీకే పవర్ ప్రాజెక్టు కంటే రెండు రూపాయలకు తక్కువగా, ఫిక్స్‌డ్ కాస్ట్‌కు లోబడి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తామని ల్యాంకో స్పష్టం చేసింది. అయినా గ్యాస్ కేటాయింపులు ఇవ్వలేదు. దీంతో ల్యాంకో యాజమాన్యం అప్పటి 2008లో విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ ద్వారా గ్యాస్ కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయించడంలో సఫలీకృతమైంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని షరతులతో ల్యాంక్ కొండపల్లి పవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్యాస్ కేటాయించింది. గ్యాస్‌తో విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన ల్యాంకో, రాష్ట్రానికి కేటాయించకుండా, తమిళనాడుకు విక్రయించేందుకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకుంది.

  మొత్తం విద్యుత్ తమిళనాడుకే విక్రయం
  ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టు(స్టేట్-2) చేసే 100 మెగావాట్ల విద్యుత్ మొత్తాన్ని ఆ రాష్ట్రానికే సరఫరా చేస్తున్నది. ఇదిలా ఉండగా తెలంగాణ జిల్లాల్లో సకల జనుల సమ్మె సందర్భంగా తలెత్తిన బొగ్గు సంక్షోభంతో, విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఆ సమయంలో విద్యుత్ కొరత ఏర్పడడంతో తమిళనాడుకు ల్యాంకో విద్యుత్ విక్రయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. సర్కారు పెద్దలకు ఈ విషయం ఎప్పుడో తెలిసినప్పటికీ మౌనం వహించారు. అయితే తమిళనాడుతో ల్యాంకో ఒప్పందం చేసుకోవడంతో వాటికి భిన్నంగా వ్యవహరించేందుకు చట్టాలు అడ్డువస్తాయం టూ ట్రాన్స్‌కో, రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసింది.

  కేంద్రం లేఖలు రాసినా నిష్ప్రయోజనం
  కేంద్ర ప్రభుత్వం చేసిన బొగ్గు, గ్యాస్ కేటాయింపులు, ఉత్పత్తి అవుతున్న విద్యుత్, సరఫరా, వినియోగం అంశాలు పర్యవేక్షించిన సమయంలో ల్యాంకో కొండపల్లి వ్యవహారాన్ని కేంద్రం పసిగట్టింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. ల్యాంకోకు ఇస్తున్న రాయితీల వల్ల ఆంధ్రవూపదేశ్‌కు లాభం లేనట్లయితే ల్యాంకోకు గ్యాస్ కేటాయింపులను రద్దు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం మూడో లేఖ రాయడంతో ట్రాన్స్‌కో అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించింది.

  బిడ్డింగ్ మతలబు..
  రాష్ట్ర సర్కారు సిఫార్సుతో గ్యాస్ కేటాయింపుల ప్రయోజనం పొందిన ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టు, కేంద్రం కొరడాతో దిగివచ్చింది. అయితే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఇసీ) నిబంధనలకు లోబడి రెగ్యులేటరీ ధరకు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ల్యాంకో పవర్ కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందినప్పుడు రెగ్యులేటరీ నిర్ణయించిన ధరకే విద్యుత్ విక్రయాలు జరగడం అనవాయితీ. ఈ విధంగా గ్యాస్ అధారిత ప్రాజెక్టులైన జీవీకే(జేగురుపాడు), జీఎంఆర్(వేమగిరి), కోనసీమ, గౌతమి పవర్ ప్రాజెక్టులు రెగ్యులేటరీ ధరకే రాష్ట్రానికి విద్యుత్‌ను అందిస్తున్నాయి. ఇలాంటి వాస్తవాలను పక్కన పెట్టి ట్రాన్స్‌కో ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టుకు బిడ్డింగ్ ధర ఇస్తున్నట్లుగా కేంద్రానికి తెలియజేసింది. ఇందు కోసం ట్రాన్స్‌కో షార్ట్ టర్మ్ బిడ్డింగ్‌ను ఆహ్వానించింది. బిడ్డింగ్‌లో పాల్గొన్న ల్యాంకో కొండపల్లి యూనిట్‌కు రూ.5.50పైసలతో పాటు అదనపు ఛార్జీలు(వూటాన్స్‌మిషన్ చార్జీలు, వీలింగ్ ఛార్జీలు)పొందుపరిచింది.

  http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=137504

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s