వైఎస్సార్సీపీదే ఫస్ట్ ప్లేస్: జేపీ

అమలాపురం/కాకినాడ(తూర్పుగోదావరి), న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ బలీయమైన శక్తిగా ఎదిగిందని, రాష్ర్టంలో ఆ పార్టీ మొదటి స్థానంలో ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. నూట పాతికేళ్ల కాంగ్రెస్, ముప్పై ఏళ్ల టీడీపీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే మూడవ స్థానంలోకి దిగజారతామేమోనన్న ఆందోళన ఆ రెండు పార్టీలనూ వెన్నాడుతోందన్నారు. శనివా రం ఆయన అమలాపురం, కాకినాడడలలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో మొదటి స్థానంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. తెలంగాణాలో కూడా మంచి స్థానాలే వస్తాయని జోస్యం చెప్పారు. అన్ని పార్టీలూ ఆ పార్టీనే లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేస్తున్నాయన్నారు.

6 Comments

Filed under Uncategorized

6 responses to “వైఎస్సార్సీపీదే ఫస్ట్ ప్లేస్: జేపీ

 1. Jagan Party Is No. 1 In The State!

  YSR Congress party headed by Kadapa MP Y S Jaganmohan Reddy has emerged as No. 1 part in the state and it is going to form the government in the next elections.

  This statement has come not from the leaders of YSR Congress party or its supporting media group. It is the assessment of Lok Satta Party president Dr Jayaprakash Narayan, who is supposed to be a man of impartiality, integrity and impeccable character. He said the future belongs to the YSR Congress party, which has emerged as an undaunted political force in the coastal Andhra and Rayalaseema region.

  “Even in the Telangana region, the YSR Congress would win good number of seats. The 125-year old Congress and the 30-year old Telugu Desam Party would have to compete for the second and third places in the elections. Both the parties are apprehensive that they might get the third position,” JP told the media in Kakinada and Amalapuram.

  One wonders why JP had to project the Jagan party in such a high esteem. He may have to face criticism for his candid talk and some people might even accuse him of trying to forge an alliance with YSR Congress in future. But somebody has to speak the truth and if people like JP make a statement, it will have some value!

 2. Sir/Madam !
  Good site. Good contents. Yet ,please edit the permanent link to the posts before publish. If there is Telugu words in the link , it will be difficult to share the post in social networking sites.

 3. CVReddy

  శాస్త్రీయతలేని టీవీ రేటింగ్స్

  పిల్లి మెడలో గంట కట్టేదెవరు? టీవీ రేటింగ్స్ విషయంలో ఇన్నాళ్ళూ చానల్ యజమానులకు మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. తమ చానల్‌కు ప్రజాదరణ ఉన్నా, రేటింగ్స్‌లో ప్రతిఫలించడం లేదన్నది వాళ్ళ బాధ. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రేటింగ్స్ లెక్కగట్టే టామ్ సంస్థ నుంచి ‘సబ్ ఠీక్ హై’ అనే సమాధానం రావటం తప్ప, ప్రయోజనమేమీ లేదన్నదే వాళ్ళ నిస్పృహకు కారణం. కానీ అందరూ ఇలా బాధ పడుతున్నారా? ఒకవిధంగా అవుననే చెప్పాలి. కాకపోతే, వాళ్ళ చానల్ రేటింగ్ బాగున్నరోజు అంతా బాగున్నట్టు, తగ్గితే మాత్రం రేటింగ్స్‌లో మోసం జరుగుతోందని గగ్గోలు పెట్టటం మామూలైపోయింది. అయితే టామ్ లెక్కలన్నీ కచ్చితమని చెప్పటం ఈ వ్యాసం లక్ష్యం కాదు. సమస్య మూలాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోకపోవటం వల్లే సమస్య ఎప్పటికీ సమస్యగా ఎలా మిగిలిపోతున్నదో వివరించడం అవసరం.
  టీవీని మనం ఒక వినోదసాధనంగానో, సమాచార సాధనంగానో అనుకుంటాం గాని దాని యజమానికి అదో వ్యాపార సాధనం. ప్రకటనల కోసం ప్రేక్షకులను సమకూర్చిపెట్టటమే టీవీల పని. ఎంతమంది చూస్తున్నారో లెక్కగట్టి చెప్పే అంతర్జాతీయ సంస్థ భారతదేశ విభాగం ‘టామ్ ఇండియా’. ఆ లెక్కలే రేటింగ్స్. ఏ కార్యక్షికమాన్ని ఏ వయసు వారు మహానగరాల్లో, నగరాల్లో ఎంతసేపు చూశారో తేల్చి చెబుతున్నామంటుంది టామ్ సంస్థ. ఒక వైపు రేటింగ్స్‌ను తిట్టుకుంటూనే మరోవైపు ఆ రేటింగ్స్ పెరగాలని అక్రమమార్గాలూ, అనైతిక పద్ధతులూ అనుసరించే చానల్స్ కోకొల్లలు. కానీ ఆ అక్రమమార్గాల్లో టామ్‌కూ భాగస్వామ్యముందని ఆరోపణలు రావటమే కీలకం.

  టామ్ సంస్థ రేటింగ్స్ మీద విమర్శలు కొత్తేమీ కాదు. కాకపోతే, ఈసారి ఎన్డీటీవీ ఏకంగా టామ్ మాతృసంస్థ ఎ.సి. నీల్సన్ మీద న్యూయార్క్‌లో కోర్టుకెక్కటం, విమర్శలకు కొన్ని ఆధారాలు కూడా చూపడం సంచల నం కలిగించింది. అనేక చానల్స్ ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నది ఇలాంటి ఫిర్యాదే. మొత్తానికి ఎన్డీటీవీ ఇలా పిల్లిమెడలో గంట కట్టిన తరువాత ఒక్కొక్కరూ విమర్శలతో దాడులు మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రసారభారతి దూరదర్శన్ తరఫున టామ్ మీద ఆరోపణలు చేసింది. డీడీ రేటింగ్స్ లెక్కింపులో అన్యాయం జరుగుతోందని గట్టిగా వాదిస్తోంది. న్యూయార్క్‌లో దాఖలైన కేసు కోర్టులో నిలబడుతుందా, లేదా అనేది పక్కనబెడితే దేశంలో ఏటా 13 వేల 500 కోట్ల రూపాయల టెలివిజన్ ప్రకటనల వ్యయాన్ని ప్రభావితం చేసే రేటింగ్స్‌లో ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న తప్పిదాలున్నట్టు ఆధారాలు దొరకడం సహజంగానే పరిక్షిశమను కుదిపేసింది.

  ఈ రేటింగ్స్ లెక్కించే పద్ధతిని పరిశీలిద్దాం. పత్రికల సర్క్యులేషన్ నిర్ధారించటానికి దాదాపుగా కచ్చితమైన లెక్కలుంటాయి. అందువల్ల ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఎబిసి) పని చాలా సులభం. టీవీ విషయానికొచ్చేసరికి సర్వే పధ్ధతిపై ఆధారపడాలి. అందుకే ఇది వివాదాస్పదంగా మారింది.. వారానికొకసారి ఇచ్చే రేటింగ్స్ కోసం ప్రతి నిమిషం చానల్స్‌ను టామ్ సంస్థ గమనిస్తూ ఉంటుంది. అందుకే ప్రతిటీవీ చానల్ క్షణ క్షణానికీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కృషి చేయాలి. లేకపోతే రిమోట్ తన పని తాను చేసుకుపోతుంది.ఈ పోటీ వాతావరణంలో టీవీ రేటింగ్స్ సున్నితమైన అంశమైపోయింది.
  రేటింగ్స్ లెక్కించటమంటే సర్వే మాత్రమే. ఈ సర్వే ఎంత దారుణంగా ఉంటుందో చూస్తే రేటింగ్స్ మీద కొద్దిపాటి గౌరవం కూడా మిగలదు. దేశం మొత్తం మీద 12 కోట్లకు పైగా కేబుల్ కనెక్షన్లు ఉంటే కేవలం 10 వేల ఇళ్లలో సర్వే చేస్తున్నారు. అంటే పన్నెండువేల ఇళ్లలో ఒకటి చొప్పున మాత్రమే సర్వే చేసి దాన్నే ప్రేక్షకుల అభివూపాయంగా చెబుతున్నారు.

  జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్ల్లో ఈ సర్వే జరగదు. దేశంలోని 120 కోట్ల జనాభాలో 40 వేల మంది అభివూపాయమే రేటింగ్ అవుతోంది. అదే ఆంధ్రవూపదేశ్‌లో ఇక్కడున్న కోటీ ఇరవైలక్షల కనెక్షన్లలో 1000 ఇళ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ లెక్కలనే మనం ప్రేక్షకుల తీర్పుగా నమ్మవలసి వస్తోంది.

  సర్వే చేస్తున్న పధ్ధతి కూడా అయోమయమే. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాలను మూడు రకాలుగా విభజించారు. మొదటిది హైదరాబాద్ నగరం. ఆ తరువాత విభాగంలోకి విశాఖపట్నం, విజయవాడ నగరాలొస్తాయి. ఈ మూడు నగరాలు కాకుండా లక్ష పైబడిన జనా భా ఉన్న పది పట్టణాలు కూడా రేటింగ్ పరిశీలనలో ఉన్నాయి. వీటి జాబితా రహస్యమ ని టామ్ సంస్థ చెబుతుంది. కానీ ఇది బహిరంగ రహస్యమే. అన్ని చానల్స్‌కూ ఈ పట్టణాలు తెలుసు. అందువల్ల చానల్స్ చాలా విషయాల్లో ఆ పట్టణాలకు ప్రాధాన్యం ఇస్తా యి. ఆ పట్టణాల్లోని ఆపరేటర్లందరూ తమ చానల్స్ తప్పనిసరిగా ఇచ్చేలా చానల్స్ చూసుకుంటాయి. ‘ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్నట్టు’ ఆపరేటర్లు మరి మాకేంటీ అంటారు. చచ్చినట్టు వాళ్ళకి డబ్బివ్వాలి. దానికి క్యారేజ్ ఫీజ్ అని పేరు పెట్టారు.

  మొత్తానికి వాళ్ళకి ఆ ఫీజు సమర్పించుకొని చానల్ వచ్చేలా చూసుకోవాలి. అది మొదటి దశ. ఈ క్యారేజ్ ఫీజు గుదిబండలా తయారైందని చానల్ యజమానులు లోలోపలే కుమిలిపోతున్నారే తప్ప గట్టిగా చెప్పుకోవటంలేదు. ఈ మధ్య ట్రాయ్ వాళ్ళు దీన్ని నియంవూతించే క్రమంలో ఎంత క్యారేజ్ ఫీజు ఇస్తున్నారో చెప్పమని అడిగితే చానల్ యజమానుపూవరూ నోరుమెదపలేదు. ఇదంతా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరమేంటంటే, రేటింగ్ పట్టణాలంటూ కొన్ని తయారవ్వటం వల్లనే చానల్స్‌కు ఈ భారం పెరిగింది.
  ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్ తమ కార్యక్షికమాల్లో, చివరికి ఫోన్-ఇన్ కార్యక్షికమాల్లో ఆయా పట్టణాలకే ప్రాధాన్యం ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. న్యూస్ చానల్స్ కూడా మినహాయింపేమీ కాదు. ఆయా పట్టణాల వార్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తా యి.

  వీలైతే అక్కడ రకరకాల చర్చా కార్యక్షికమాలు చేపడతాయి. అక్కడ బాగా చురుకైన రిపోర్టర్లను నియమిస్తాయి. అక్కడి వార్తలకు అత్యంత ప్రాధాన్యమిస్తాయి. అక్కడి ఎమ్‌ఎస్‌ఓ చెప్పిన వాళ్ళకు ఉద్యోగాలిస్తాయి. అక్కడ నైతిక నియమాల ప్రసక్తే ఉండదు.. కేవలం వ్యాపార ప్రయోజనాలే. ఎమ్ ఎస్ ఓ తో మంచిగా ఉండటం వలన టామ్ మీటర్ల ఆచూకీ కనిపెట్టగలగటం లాంటి అదనపు ప్రయోజనాలున్నాయనే ఆరోపణలున్నా వాటిని నిరూపించటం కష్టం కాబట్టి అవునని కచ్చితంగా చెప్పడం కుదరదు.
  లెక్కింపు విషయానికొస్తే, ఈ ఎంపిక చేసిన ఇళ్లలో పీపుల్స్ మీటర్ ఏర్పాటు చేస్తా రు. దీన్ని ఒక రిమోట్‌తో అనుసంధానం చేస్తారు. ఎవరైనా టీవీ ఆన్ చేయాలంటే ఈ మీటర్ మీద తమకు సంబంధించిన బటన్ నొక్కాలి. స్త్రీ,పురుషులకు వేరువేరు బటన్స్ ఉంటాయి.

  వయసులను బట్టి కూడా బటన్స్ మారతాయి. ఎవరైనా టీవీ దగ్గరనుంచి పక్కకి వెళ్ళిపోవాలంటే వాళ్ల బటన్ ఆప్‌చేసి వెళ్ళాలి. ఆ విధంగా ఎవవరు ఎంతసేపు ఏ చానల్ చూశారో బరోడాలోని టామ్ కార్యాలయ రికార్డులలో నమోదవుతుంది. అసలే తక్కువ శాంపిల్ తీస్తున్నారనే విమర్శ ఉండగా ఇలా బటన్ నొక్కే పద్ధతిలో ఎంతమంది నమోదు చేస్తారనేది సర్వసాధారణమైన అనుమానం. సరే.. బటన్ నొక్కి కూర్చున్నారనే అనుకుందాం..కూర్చున్న వాళ్ళలో ఫోన్ వచ్చిందనో, స్టవ్ మీద పాలు మరిగిపోతున్నాయనో అక్కడినుంచి వెళ్ళిపోయే వాళ్ళెంతమంది? ఆ హడావిడిలోనూ మరిచిపోకుండా బటన్ నొక్కి వెళతారా? టీవీ ఎదురుగా కూర్చుని కూడా పేపర్ చదువుకునే వాళ్ళెంతమంది? హోమ్ వర్క్‌లో మునిగిపోయి అప్పుడప్పుడు తలెత్తి చూసే వాళ్ళెంతమంది? అయినా సరే, వాళ్ళంతా ఆ చానల్ చూస్తున్నట్టే టామ్ లెక్క. సరే… వీళ్ళందరూ టీవీ చూశారనే అనుకుందాం.. టీవీ చూడటం అనేది ఆ కార్యక్షికమాన్ని మెచ్చుకోవటానికి నిదర్శనంగా భావించాలా? ఇది కీలకమైన ప్రశ్న.

  దూరదర్శన్ సేకరించే ప్రజాభివూపాయ విధానంలో ఈ లోపం కనిపించదు. ప్రేక్షకులలో ఒక విధమైన ఆసక్తి రేకెత్తించి ఆ అర్థగంటపాటు ఆకట్టుకున్నామా లేదా అన్నదే చానల్‌కు ముఖ్యమైపోయింది. ఆ కార్యక్షికమాన్ని చూసిన వాళ్ళందరూ రేటింగ్స్ ప్రకారం ఆ కార్యక్షికమాన్ని మెచ్చుకున్నట్టు లెక్క. ఇది చాలామంది అభివూపాయం అది కాకపోవచ్చు. కానీ తమ కార్యక్షికమానికి మంచి రేటింగ్ వచ్చిందని ఆ చానల్ సంతోషించవచ్చు.ఈ విధానాన్నే దూరదర్శన్ తప్పుబడుతోంది. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈవాదనతో ఏకీభవిస్తోంది. ఈ రేటింగ్స్ మన కార్యక్షికమాల భవిష్యత్తు ను నిర్ణయిస్తాయి. ఒక కార్యక్షికమానికి రేటింగ్ రాకపోతే చానల్ ఆ కార్యక్షికమాన్ని రద్దు చేస్తుంది. ప్రజలకు ఉపయోగపడే కార్యక్షికమం కంటే ప్రజలకు నచ్చే కార్యక్షికమం అందించాలన్నదే చానల్స్ పాలసీ అయిపోయింది. రేటింగ్స్ కోసమే కార్యక్షికమాలు రూపొందిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రమాదకరమైన ధోరణి.

  ఈ ధోరణి మీద విమర్శలు ఏ స్థాయికి వెళ్ళాయంటే అసలు రేటింగ్స్ అనేవే ఉండకూడదనే వాదన కూడా ఇప్పుడు తెరమీదకొచ్చింది. ఇది రేటింగ్స్ తప్పా? రేటింగ్స్ ను ఆపాదించుకోవటంలో ఉన్నతప్పా? వాటిలో శాస్త్రీ యత లోపించటం తప్పా? అక్రమాలకు అవకాశాలుండటం తప్పా?
  టామ్ లెక్కింపు మీద ఉన్న మరో ప్రధానమైన అభ్యంతరం ఏమిటంటే,లక్షలోపు జనా భా ఉన్న మండల కేంద్రాలూ, గ్రామ పంచాయితీలూ లెక్కకు తీసుకోవటం లేదు. అలాంటప్పుడు ఇది సరైన సర్వే ఎలా అవుతుందనేది జవాబుదొరకని ప్రశ్న. టామ్ రేటింగ్స్‌లో లోపాల మాటేమిటి? ఎంచుకున్న పట్టణాల్లో కూడా శాంపి ల్ సైజ్ తక్కువైనప్పుడు ఏయే ఇళ్ళలో టామ్ మీటర్లున్నాయో తెలిసే అవకాశం లేదా? మేం చాలా రహస్యంగా ఉంచుతామని టామ్ చెబుతుంది. కానీ అది సాధ్యం కాదు. సాధారణంగా ఒక ఇంట్లో ఈ పీపు ల్స్ మీటర్ ఉంచాలంటే ఆ ఇంటి వాళ్ళను ఒప్పించి, దానివల్ల వాళ్ళకెలాంటి ఇబ్బందీ ఉండదన్న నమ్మకం కలిగించాలి. ఆరునెలలపాటు సర్వేకు సహకరించేలా నచ్చజెప్పాలి. ఈ మొత్తం క్రమం లో వాళ్ళడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. వాళ్ళకో బహుమతి ఇచ్చి ఒప్పించటమనేది ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ. అయినా ఏదో ఒక అనుమానం వాళ్ళను వెంటాడుతూనే ఉంటుం ది.

  అందుకే కేబుల్ ఆపరేటర్‌నో, కేబుల్ బిల్ కలెక్షన్ బాయ్‌నో అడిగి అనుమానాలు నివృత్తి చేసుకుంటారు. అలా ఈ రహస్యం బయట పడుతుంది. అసలే ఆపరేటర్ తన ప్రాంతంలో టామ్ మీటర్లున్నాయేమో తెలుసుకోవాలన్న ఆత్రుతలో ఉంటాడు. ఎందుకంటే అలా తెలిసిన మరుక్షణం చానల్స్ నుంచి కారేజ్ ఫీజ్ వసూలు చేసుకునే అవకాశమొస్తుంది. చానల్ అధిపతులు అతనికి బ్రహ్మరథం పడతారు. పీపు ల్స్ మీటర్ ఉన్న ఇల్లు గుర్తించటం ఎంత మావూతమూ రహస్యం కాదు. చానల్స్‌లో దాదాపు అందరికీ టామ్ సెంటర్లు తెలుస్తాయి. ఇళ్ళు కూడా కనిపెట్టే అవకాశాలూ ఉన్నాయి. నిజానికి ఇప్పు డు ఎన్డీటీవీ చేస్తున్న ఆరోపణ కూడా ఇదే. టామ్ ప్రతినిధులే వచ్చి రేటింగ్స్ తారుమారుచేస్తామంటూ బేరమాడారని చెబుతోంది.
  రేటింగ్స్‌ను ప్రభుత్వం నియంవూతించకపోతే ఎక్కువ నష్టపోయేది ప్రజలే.

  అందుకే ఈ విషయంలో ఒత్తిడి పెరిగి ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. రేటింగ్ వ్యవస్థ మీద అధ్యయనం చేసిన ఈ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. రెండేళ్ళలో శాంపిల్ సైజు 15 వేలకు పెంచాలని, మూడేళ్ళలో అది 30 వేలకు చేరాలని సూచించింది. అంటే మీటర్లకు, వాటి నిర్వహణకు కలిపి టామ్ మరో 660 కోట్లు ఖర్చుచేయాల్సి వస్తుంది. ఈ ఖర్చులో కొంతభాగాన్ని పరిక్షిశమ భరించాలని కూడా చెప్పింది. మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే, వారానికొకసారి కాకుండా పదిహేను రోజులకొకసారి రేటింగ్స్ వెల్లడించే పరిస్థితి ఉంటే రేటింగ్స్ ఆధారంగా కార్యక్షికమాల రూపకల్పన కొంత మేరకు తగ్గుతుందని అభివూపాయపడింది.

  టామ్ పనితీరు పర్యవేక్షించేందుకు పరిక్షిశమలోని వివిధ వర్గాలతో 2010లో ఏర్పాటైన బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రిసెర్చ్ కౌన్సిల్ ఆ తరువాత ముందడుగు వేయలేదు. ఈ పరిస్థితుల్లో రేటింగ్స్ లెక్కించటానికి ఇప్పుడున్న వ్యవస్థలో కొద్దిపాటి మార్పులు చేయటం తప్ప మార్గం లేదని ప్రభుత్వం నియమించిన కమిటీ భావిస్తోంది. కానీ మరో మూడేళ్లలో దేశమంతటా డిజిటైజేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరితే అప్పుడు వ్యూయర్‌షిఫ్ డేటా నేరుగా సంపాదించగలిగే అవకాశమేర్పడుతుంది. అప్పుడు సర్వే పద్ధతి కాకుండా పత్రికల్లాగే కచ్చితమైన డేటా సంపాదించటం వీలవుతుంది. పైగా న్యూస్‌చానల్స్ కూడా పే చానల్స్‌గా మారగలుగుతాయి. అప్పుడు క్యారేజ్ ఫీజు కనీసం 25 శాతానికి తగ్గుతుంది. జనం మెచ్చే చానల్స్ మాత్రమే చందాదారులను సంపాదించుకోగలుగుతాయి. మిగిలినవి మూతపడతాయి. చూడాలనుకున్న చానల్ ఎంచుకొని వాటికి మాత్రమే డబ్బు చెల్లించే వెసులుబాటు ప్రేక్షకుడికుంటుంది. అప్పుడు ప్రకటనల ఆదాయంపై ఆధారపడాల్సిన అవసరం కొంత తగ్గి రేటింగ్స్ వేలం తగ్గుముఖం పడుతుంది. అప్పటిదాకా వ్యవస్థలో వీలైనంత మెరుగైన ఫలితాలకోసం ప్రయత్నించాల్సిందే.

  -తోట భావనారాయణ, టీవీ జర్నలి
  http://www.namasthetelangaana.com/Editpage/article.asp?Category=1&subCategory=7&ContentId=139006

 4. CVReddy

  JP said presently the Congress and Telugu Desam Party were fighting for second position while the YSR Congress Party was forging ahead as proved by the results of the recent by-elections.

  http://www.thehansindia.info/epaper.asp?edition=0&page=4

 5. CVReddy

  వైఎస్ఆర్ కాంగ్రెస్ జోష్ ఇచ్చే జెపి జోస్యం –
  http://kommineni.info/articles/dailyarticles/content_20120812_1.php
  వైఎస్సార్సీపీ బలీయమైన శక్తిగా ఎదిగిందని, రాష్ర్టంలో ఆ పార్టీ మొదటి స్థానంలో ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ జోస్యం చెప్పొనగ్తు కథపాలే రావడం విశేషం. కాంగ్రెస్, టీడీపీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే మూడవ స్థానంలోకి దిగజారతామేమోనన్న ఆందోళన ఆ రెండు పార్టీలనూ వెన్నాడుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా జెపి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా ఉంది. సీమాంధ్రలో మొదటి స్థానంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో కూడా గణనీయంగా గెలుస్తుందని చెప్పడం గమనార్హం. వేరే పార్టీలు ఎలాగూ ఇలాంటి విషయాలపై తమ అంచనాలను ఇతర పార్టీలకు అనుకూలంగా చెప్పవు. కాని జయప్రకాష్ నారాయణ నిర్మొహమాటంగా చెప్పిన తీరుతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు మరింత ఉత్సాహం వస్తుందని చెప్పకతప్పదు. అదే సమయంలో కాంగ్రెస్,టిడిపిలు జెపిపై విరుచుకుపడతాయి. గత ఎన్నికలలో కూడా ఈయన వల్ల కూడా తాము ఓడిపోవలసి వచ్చిందని టిడిపి బాధపడుతుంటుంది.వారికి ఇది మరింత జీర్ణం కాని అంశమే.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s