‘ఒక్కడు’ లక్ష్యంగా మమ్మల్ని బలిస్తారా? మంత్రుల మండిపాటు

రోడ్లు భవనాల మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సీబీఐ చార్జిషీట్ ఉదంతం రాష్ట్ర కాంగ్రెస్‌లో కుంపట్లు రాజేస్తోంది. అధిష్టానం తన కొమ్మను తానే నరుక్కుంటోందని, ఢిల్లీ అండ చూసుకుని సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ‘‘పార్టీకి పెద్ద దిక్కు తరహాలో వ్యవహరిస్తున్న ధర్మానకే ఈ గతి పట్టిస్తే ఇక మిగతా వారి పరిస్థితేమిటి? ఇలా ఒక్కో మం త్రినీ కేసుల్లో ఇరికిస్తుంటే పార్టీ మనగలుగుతుందా?’’ అం టూ వారు ప్రశ్నిస్తున్నారు. ధర్మానను నిందితుడిగా సీబీఐ పేర్కొనడంపై కాంగ్రెస్‌లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోం ది.

మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన ధర్మానను బుధవారం పలువురు మంత్రులు, పార్టీ నేతలు విడివిడిగా కలిశారు. వారంతా పార్టీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ చార్జిషీట్లతో పాటు అధిష్టానం, సీఎం కిరణ్ వ్యవహార శైలిపైనా ధర్మానతో వారు సుదీర్ఘంగా చర్చిం చినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సీబీఐ చార్జిషీటును తప్పుబడుతూధర్మాన తీవ్రంగా ఆవేదన చెందారు. ‘‘30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ స్థాయికి వచ్చానంటే కొన్ని విలువలు పాటిస్తేనే కదా? నాపై ఇలాంటి అభియోగాలు మోపాక పదవి కోసం ఆ విలువలను వదులుకోలేను. అందుకే రాజీనామా చేశాను’’ అని వివరించారు.

సీబీఐ తీరు చూస్తుంటే మరీ ఇంత దారుణమా అనిపిస్తోందని ధర్మానతో భేటీ అయిన మంత్రి ఒకరు వాపోయారు. ఎవరిపైనో కుట్రలు చేసేందుకో, వాటిని నిరూపించేందుకో తమను ఇలా పావులుగా చే స్తోందంటూ తప్పుబట్టారు. ‘‘ఇదివరకు సీబీఐ తన విచారణ సందర్భం లో మేం తీసుకున్న శాఖాపరమైన నిర్ణయాలపై సందేహాలు లేవనెత్తింది. అప్పుడే వాటన్నింటికీ స్పష్టమైన వివరణలి చ్చాం. అన్నీ తెలిసి కూడా ఇలా మమ్మల్ని కేసుల్లో ఇరికిం చడం, బజారుపాలు చేయడం ఏం పద్ధతి?’’ అంటూ ధర్మానను కలిసి సీనియర్ మంత్రులు కూడా ఆక్షేపించారు. ఈ విషయంలో అధిష్టానం తీరును కూడా వాళ్లు తప్పుబట్టారు. చూస్తుంటే అసలిదంతా కావాలనే ఆడుతున్న నాటకమేమోననే అనుమానం కలుగుతోందన్నారు.

‘‘సీబీఐ ఎవరిపైనో పెట్టిన కేసులో ‘కుట్ర’ను నిరూపించే ప్రయత్నంలో మమ్మ ల్ని బలిపశువులను చేస్తోందా? ప్రభుత్వం కూడా దీన్ని చూస్తూ మౌనంగా కూర్చుం టోందా? అసలు ఇదెక్కడి పద్ధతి? ముప్ఫై ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేస్తే ఇలాగేనా మాతో ప్రవర్తిం చేది? ఢిల్లీ పెద్దలు కూడా తాము ఎంచుకున్న వ్యక్తులను వేధిం చే క్రమంలో మంత్రులను కూడా బలి పెడుతున్నా రు. సీబీఐని మాపైకి ఉసిగొల్పుతున్నారు. మాపై కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తే పార్టీతో పాటు ప్రభుత్వం పరువు కూడా మంటగలుస్తుందని కూడా అధిష్టానానికి అర్థం కాకపోవడం విచిత్రం!’’ అంటూ ధర్మానతో పాటు ఇతర మం త్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ధర్మాన తనపై మోపిన అభియోగాలకు బదులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

కిరణ్ మౌనమెందుకో?
ఈ విషయాలపై కిరణ్ మౌనం పట్ల మంత్రులు మరింత అసంతృప్తితో ఉన్నారు. పదేపదే ప్రస్తావించినా ఆయన కనీసం స్పందించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఒక్కొక్కరుగా మంత్రుల పేర్లను చార్జిషీట్లలో చేరుస్తూ, వారిని ప్రాసిక్యూషన్ చేసేందుకు సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు. ‘‘సీబీఐ అభియోగాలు మరీ హాస్యాస్పదం. నాటి అవసరాలు, పారిశ్రామికాభివృద్దికోసం ఒప్పందాలు చేసుకునే అధికారం ప్రభుత్వానికుంటుంది. ఆ మేరకు రాయితీలూ ఇస్తుంటారు.
కాదనే హక్కు సీబీఐకి ఎక్కడిది? మాపై నిందలేస్తున్నప్పుడు, మాకు డబ్బో, ఇతరత్రా ప్రతిఫలాలో ముట్టి ఉంటే వాటినైనా బయటపెట్టాలి? అదేమీ చేయకుండా కేవలం ఎవరినో లక్ష్యంగా చేసుకొని సీబీఐ ఇలా మాపై కేసులు పెట్టి వేధిస్తుండటం బాధ కలిగిస్తోంది’’ అని ధర్మానను కలిసిన మహిళా మంత్రి ఒకరు వాపోయారు.

5 Comments

Filed under Uncategorized

5 responses to “‘ఒక్కడు’ లక్ష్యంగా మమ్మల్ని బలిస్తారా? మంత్రుల మండిపాటు

  1. CVReddy

    Congress is digging its own grave in their attempt to bury Jaganmohan Reddy.

  2. CVReddy

    దర్మాన ప్రాసిక్యూషన్- కిరణ్ కు పరీక్ష? Kommineni

    జగన్ కేసు వ్యవహారం ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లయింది.మంత్రి దర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించాలా?వద్దా అన్నదానిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తర్జనభర్జన పడుతున్నారు.అయితే ఆయన ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలా?వద్దా అన్నదానిపై గవర్నర్ కోర్టులోకి బంతిని తోయాలని ముఖ్యమంత్రి బావిస్తున్నట్లు కదనాలు వస్తున్నాయి. సిబిఐ అభ్యర్ధన, మంత్రి వివరణ కలిపి గవర్నర్ కు పంపితే ఎలా ఉంటుందని కిరణ్ ఆలోచిస్తున్నారట. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో తప్పు చేస్తున్నారన్నమాట.నిజంగానే తన మంత్రి వర్గ సహచరుడు వాన్ పిక్ కేసులో తప్పు చేశారని బావిస్తున్నారా?లేదా అన్నది తేల్చుకోవాలి.ఆ తర్వాత నిర్ణయం తీసుకుని తాను అనుమతి ఇవ్వడమో, లేక నిరాకరించడమో చేయాలి. లేదా గవర్నర్ వద్దకు ఈ ఫైలు వెళ్లవలసి ఉంటే ఆయన సిఫారస్ తో సహా పంపాలి. ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇస్తే ధర్మాన రాజీనామాను వెంటనే ఆమోదించవలసి ఉంటుంది.ప్రాసిక్యూషన్ ను తిరస్కరిస్తే కేసు బలహీనపడి జగన్ కు కూడా ప్రయోజనం కలగవచ్చు. అయితే ఇక్కడ చూడవలసింది. జగన్ కు లాభం కలుగుతుందా? లేదా అన్నది కాదు. తన ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికాని,కాంగ్రెస్ హై కమాండ్ కాని ఈ విషయాలపై స్పష్టత తెచ్చుకోకపోతే కాంగ్రెస్ తో పాటు రాష్ట్రం కూడా తీవ్రంగా నష్టపోతుంది.కనుక దైర్యంగా కిరణ్ నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇప్పుడు కిరణ్ కు ఇది పరీక్షగా మారింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s