ముంచాలనుకున్న కాంగ్రెస్ మునుగుతోంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవి చేపట్టిన ముహూర్తబలం బాగోలేదో.. అసలు పదమూడో శాసనసభ ముహూర్తమో బాగోలేదో కాని..రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటివరకు అరిష్టాలనే ఎదుర్కొంటోంది.క్యాబినెట్ లో మంత్రుల మధ్య గొడవలు అయితే అది ఒకరకంగా తేల్చుకోవచ్చు. కాని ఇదొక చిత్రమైన వ్యవహారం .ఎప్పుడు ఏ మంత్రి పై ఏ కేసు వచ్చి పడుతుందో తెలియని పరిస్థితిగా ఉంది. ఒక తప్పు చేసి, వంద తప్పులు కాయవచ్చనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఒక తప్పుకు వంద తప్పులు వచ్చి మీద పడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు పై సిబిఐ ఛార్జీషీట్ లో అభియోగం నమోదవడం అంటే కచ్చితంగా అది కాంగ్రెస్ కు కళంకమే. అదేదో రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగింది అని చెప్పి తప్పుకుందామని ఇంతకాలం చేసిన డ్రామాలకు తెరవేయక తప్పదు.సిబిఐ ని అడ్డం పెట్టుకుని కద నడుపుదామనుకుంటే అది ఎప్పుడో అప్పుడు అడ్డం తిరగక తప్పదని కూడా తేలింది.శాసనసభ ఉప ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ నేతలు ఎన్ని మాటలు చెప్పారు! మంత్రులెవరూ వై.ఎస్. హయాంలో జరిగిన వాటికి బాధ్యులు కారని, మంత్రివర్గ సమష్టి నిర్ణయాల మేరకే జిఓలు విడుదల అయ్యాయని, తెర వెనుక లాలూచీ వ్యవహారాలతో తమకు సంబంధం ఏమిటని వాదించారు. స్వయంగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ తో సహా పలువురు ఇదే వాదనను వినిపించి అదేదో వై.ఎస్., ఆయన కుమారుడు జగన్ కలిసి సచివాలయంలో కూర్చుని పంచుకున్నారు తప్ప తమకు ఎలాంటి పాత్ర లేదని జనాన్ని నమ్మించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఆయా వ్యవస్థలు తమ చేతిలో ఉంటాయి కదా అని కధ ఆరంభించినప్పుడే మామూలు జనం ఆశ్చర్యపోయారు. వారికి ఉన్న కామన్ సెన్స్ కాంగ్రెస్ అధిష్టానానికిగాని, రాష్ట్ర నాయకత్వానికి గాని లేకపోయింది. అడ్డగోలు వాదనతో జగన్ ను మాత్రం ఇరికించి తాము సురక్షితంగా బయటపడిపోయి కడిగిన ముత్యాల వలే కనిపించాలని తాపత్రయపడ్డారు.కాని అన్ని వేళలూ ఒకేరకంగా ఉండవు కదా.ఎంత శక్తిమంతమైన రాజశేఖరరెడ్డి ఆ విధంగా దుర్మరణం చెందుతారని ఊహించామా?ఆయన కొడుకు జగన్ తప్ప రక్షకుడు లేడని అప్పట్లో నినదించిన కాంగ్రెస్ నేతల గొంతులే , ఆ తర్వాత కాలంలో జగన్ పచ్చిదోపిడీ దారుడంటూ విమర్శిస్తారని ఎవరైనా కలగన్నారా?జగన్ జైలుకు వెళతారని అప్పట్లో ఎవరైనా జోస్యం చెప్పారా?(కనీసం ఆయన కొత్త పార్టీ పెట్టుకునేంతవరకు. ఆయన పార్టీ పెట్టాక చాలమంది ఊహించారు.)అలాగే కాంగ్రెస్ మంత్రులు ఒక్కొక్కరు కేసుల ఊబిలో దిగబడుతూ రక్షించేవారు లేక విలవిల లాడతారని భావించామా?.ముందు మోపిదేవి వెంకటరమణరావు జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆయన జైలులో ఉండగానే ధర్మాన మీద ఛార్జీషీట్ నమోదైంది.ఒక మంత్రిని జైలుకు పంపిన సిబిఐ ధర్మాన జోలికి ఎందుకు వెళ్లలేదో తెలియదు.అంతవరకు దర్మాన అదృష్టవంతుడే.ఛార్జీషీట్ లో పేరు వచ్చాక మంత్రి ధర్మాన రాజీనామా నిర్ణయం సరైనదే. రాజీనామా పత్రం సమర్పించడంతో ఇప్పుడు బంతి కిరణ్ కోర్టులో పడింది. ఈ తలనొప్పి ఎందుకని దర్మాన రాజీనామాను వారించినట్లు ఉన్నారు. కాని ధర్మాన చేసిందే సరైనది.ఇప్పుడు ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వం అయితే ధర్మాన రాజీనామాను ఆమోదించాలి.లేదా సిబిఐ చేసింది తప్పు అని ప్రకటించగలగాలి.అంతే తప్ప విధానా నిర్ణరయాలను సిబిఐ ఎలా తప్పు పడుతుందని ఇప్పుడు విలవిల లాడితే ఏమి ప్రయోజనం?కాని ముఖ్యమంత్రికి ఆ ధైర్యం ఉంటుందా అన్నది సందేహం. కనుక ఆయన అధిష్టానం సలహా కోసం ఎదురు చూడవచ్చు. ఏది ఏమైనా ఈ మొత్తం ప్రక్రియలో తీవ్రంగా నష్ట పోయింది కాంగ్రెస్ పార్టీ,కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం.వేరే ఏ పని జరగనివ్వకుండా ఈ వ్యవహారాలే కాంగ్రెస్ ను సలిపివేస్తున్నాయి. ఈ ప్రభుత్వంలోని మంత్రులపై వరసగా వస్తున్న కేసులు పరువు తీస్తున్నాయి.నిజానికి వాన్ పిక్ కేసులో ప్రభుత్వానికి జరిగిన నష్టం లేదు. ఆ మాటకు వస్తే సేకరించిన భూమి ఇంకా పూర్తిగా స్వాధీనమే కాలేదు. పైగా పెద్దగా అక్కడ దీనిపై వ్యతిరేకత లేదనడానికి నిదర్శనం స్వయంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిజాం పట్నం వెళితే ఒక్క స్థానికుడు కూడా ఆయనకు మద్దతు ఇవ్వకపోవడమే పరిస్థితిని తెలియచెబుతుంది.చంద్రబాబు ఆ ప్రాజెక్టు వద్దని ఆయన చెప్పదలిచారా? భూములను వెనక్కి ఇచ్చివేయమని ఆయన అంటున్నారు. రైతులను తిరిగి డబ్బు వెనక్కి చెల్లించమని చంద్రబాబు చెప్పదలిచారా?లేక ఆ డబ్బు కూడా ఎగవేసి భూములు తీసుకోండని తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి అనుభవం కలిగి, సంస్కరణవాదిగా చెప్పుకున్న చంద్రబాబు సలహా ఇస్తారా? ఏమో తెలియదు.రాష్ట్రానికి పెద్ద ప్రాజెక్టు తెస్తామని సొంతడబ్బు ఖర్చు పెడితే అరెస్టు చేసిన చరిత్ర మన రాష్ట్రంలోనే ఉంటుందేమో.ఈ ప్రాజెక్టు ఏమవుతుందో తెలియదు. రెవెన్యూ మంత్రి దర్మాన ప్రసాదరావు భూముల కేటాయింపు జిఓలు జారీ చేశారు.ఎకరా భూమి కేటాయించాలన్నా మంత్రివర్గమే నిర్ణయించాలి. అలాంటిది ఒక్క దర్మాన మాత్రమే ఎలా చేస్తారు?అయితే చకచకా అనేక జిఓలు ఇచ్చారని చెబుతున్నారు. ఒక ప్రాజెక్టు రావల్సినప్పుడు కొన్నిసార్లు పరపతి ఉపయోగపడే మాట నిజమే. అయితే ఈ వ్యవహారాలలో ఎక్కడా అవినీతి జరగలేదని సర్టిఫికెట్ ఇవ్వజాలం.ఆ మాటకు వస్తే ఇప్పుడు ఇన్ని కబుర్లు చెబుతున్న తెలుగుదేశం కు చెందిన ప్రముఖులతో సహా కాంగ్రెస్ తదితర రాజకీయ పక్షాల ప్రముఖులు పలువురు వాన్ పిక్ భాగస్వామి నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి ఆర్ధిక లబ్ది పొందినవారే .అయినా ఆ కద వేరు.అంతదాకా ఎందుకు హైటెక్ సిటీ ప్రాజెక్టులో తొలి భవనం నిర్మించినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపైఅప్పటి కాంగ్రెస్ విపక్ష నేత పి.జనార్దనరెడ్డి ఎన్ని ఆరోపణలు చేశారో తెలియదా?ఎల్.అండ్ టికి టిడిపికి మద్య ఆర్ధిక లావాదేవీలు నడిచాయని , అందువల్ల ప్రభుత్వ భూమిలో నిర్మించిన భూమి చదరపు అడుగు 2650కి అమ్ముకునే అవకాశం కల్పించారంటూ అనేక ఆరోపణలు గుప్పించారు. కాని ఆరోజు చంద్రబాబు చేసినదానిని రాజకీయాలకు అతీతంగా చూసినవారు ఎవరూ తప్పు పట్లలేదు. ఒక పెద్ద పరిశ్రమ వస్తుందని సంతోషించారు.ఆ తర్వాత రకరకాల ప్రాజెక్టులకు సంబంధించి భూములు కేటాయించిన చంద్రబాబుపైన కాంగ్రెస్ , ఆ తర్వాత ముఖ్యమంత్రి గా వచ్చిన రాజశేఖరరెడ్డిపై టిడిపి అనేక ఆరోపణలు చేస్తూ వచ్చాయి. అయినా ఇద్దరి హయాంలో పారిశ్రామిక ప్రగతికి పెద్దగా ఆటంకం కలగలేదనే చెప్పాలి. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత మారిన రాజకీయాలలో కాంగ్రెస్ అధిష్టానం అతి తెలివి తేటలనండి,లేదా తెలివి తక్కువతనం అనండి.. మాజీ మంత్రి శంకరరావుతో పిల్ వేయించడం , దానిలో టిడిపి జత కలవడం, హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశం ఇచ్చిన తీరు , ఆ తర్వాత సిబిఐ విచారణ జరుపుతున్న వైనం.. ఇవన్ని వివాదాస్పద అంశాలుగానే ఉన్నాయి.వై.ఎస్.జగన్ ను అరెస్టు చేయాలంటే ఎవరో ఒకరిని బలి చేయాలన్నట్లుగా మంత్రి మోపిదేవి ని అరెస్టు చేశారని భావించారు.జగన్ ను అరెస్టు చేసినప్పుడు సంబరపడిన కాంగ్రెస్ వర్గాలు ఉప ఎన్నికల తర్వాత నాలుక కరుచుకున్నాయి. ప్రతిపక్ష టిడిపి కి కూడా తల బొప్పి కట్టింది. దాంతో ఆ పార్టీ ప్రముఖ నేతలు జగన్ ఊసెత్తడానికే వెనుకాడే పరిస్థితి ఏర్పడింది. తాము ఎంత విమర్శిస్తే జగన్ కు అంత సానుభూతి వస్తోందన్న విషయం గ్రహించడానికి వీరికి చాలా సమయం పట్టింది.ఈ తరుణంలో మంత్రి దర్మానపై పిడుగుపడిన చందంగా ఛార్జీషీట్ వచ్చి పడింది. గత ఉప ఎన్నికలలో తన సొంత సోదరుడుపైనే హోరాహోరా పోరాడి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మెజార్టీని బాగా తగ్గించగలిగానని,దానికి ప్రతిఫలంగా తనకు కేసు చుట్టుకుందని ఆయన వాపోతుండవచ్చు.సుప్రింకోర్టు నోటీసు ఇచ్చినప్పుడు న్యాయసాయం ఖర్చుల జిఓ పొందగలిగాను కదా అని అన్న సంతోషం దక్కకముందే ధర్మానకు ఈ దెబ్బ తగిలింది.1989లో తొలిసారి ఎన్నికైన ఈయన నేదురుమల్లి,కోట్ల క్యాబినెట్లలో సహాయ మంత్రిగా ఉండేవారు. 1999లో రెండోసారి విపక్షంలో పనిచేసే అవకాశం రావడం ఈయనకు కలిసి వచ్చింది. శాసనసభలో టిడిపి ప్రభుత్వాన్ని తన పదునైన ఉపన్యాసాలతో ఇరుకున పెడుతుండేవారు. ఆ క్రమంలో వై.ఎస్.కు దగ్గరవడంతో రెండువేల నాలుగులో అధికారంలోకి రావడంతో ఏకంగా రెవెన్యూ మంత్రిఅయి రికార్డు స్థాయిలో కొనసాగారు.ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టుకోవడం విచిత్రమైన పరిణామం.ఈయన తర్వాత వరసలో ఉన్న మిగిలిన నలుగురు మంత్రులకు కూడా సహజంగానే ఈ పరిణామం బితుకుబితుకుమంటుంది.కిరణ్ క్యాబినెట్ లోని మొత్తం పది మంది ఏదో ఒక కేసులో ఇరుక్కునే పరిస్థితి ఉండడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదనే చెప్పాలి.కొద్ది రోజుల క్రితమే దానం నాగేందర్ ఒక నాన్ బెయిలబుల్ కేసులో ఇరుక్కున్నారు. మంత్రిగా ఉన్నారు కాబట్టి మేనేజ్ చేసుకోగలిగారు. మామూలు వ్యక్తినైతే పోలీసులు ఎప్పుడో అరెస్టు చేసేవారు.కృష్ణా జిల్లా మంత్రి పార్దసారధి ఫెరా కేసులో కూరుకుని బయటపడడానికి తంటాలు పడుతున్నారు.గాలి బెయిల్ కేసులో ఏకంగా అరెస్టు అయిన జడ్జి నరసింహారావు మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డిని రక్షించడానికి తమను బలి చేస్తున్నారంటూ పిటిషన్ వేశారు. అందులో ఎంతవరకు నిజమున్నది చెప్పలేము.పిసిసి అధ్యక్షుడు , మంత్రి బొత్స సత్యనారాయణ మద్యం సిండికేట్ల గొడవల నుంచి విముక్తి పొందడానికి నానా హైరానా పడ్డారు.జగన్ ఆస్తుల కేసులో గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ,పొన్నాల , సబితా ఇంద్రారెడ్డిల భవిష్యత్తు అగమ్య గోచరంగానే ఉంది.ఇదంతా జనం నమ్ముతున్నదాని ప్రకారం కాంగ్రెస్ హై కమాండ్ పన్నిన కుట్ర.ఆ కుట్రలో ఒక్క జగన్ మాత్రమే చిక్కుకుంటారని అనుకున్నారు. కాని అందుకోసం ఇలా తమ మంత్రులను , ప్రభుత్వంలోని ఐ ఎ ఎస్ లను బలి పెట్టవలసి వస్తుందని అనుకోలేదు. రాజకీయాలలో విద్వేషం కన్నా వివేచన బాగా పనిచేస్తుంది.కక్ష సాధింపు కన్నా , తెలివిగా తన లక్ష్యాన్ని సాధించుకోవడం చాలా ముఖ్యం కాంగ్రెస్ అధిష్టానంలో ఆ రెండూ కొరవడ్డాయి. అవే ఉండి ఉంటే,నిజాయితీగా కిరణ్ సర్కార్ ఈ అంశాలలో ఇదీ తమ వైఖరి అని హైకోర్టుకే చెప్పి ఉండేది.ఉదాహరణకు వాన్ పిక్ కు సంబంధించి నిజంగానే ఘోర తప్పిదాలు జరిగి ఉంటే దానికి సంబందించిన సమాచారం తెప్పించుకుని హైకోర్టులో చెప్పి ఉండవచ్చు. లేదా తప్పు జరగకపోతే ఆ మాటే తెలిపి ఉండవచ్చు. ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి ఉపయోగమో,కాదో తేల్చి ఉండవచ్చు.అలాగే భూమి కేటాయింపులు కాని, పరిశ్రమలకు నీటి కేటాయింపులు కాని..ఏదైనా కాని ప్రభుత్వం ఈ అభిప్రాయంతో ఉందని న్యాయస్థానానికి తెలిపిన తర్వాత ప్రభుత్వ బాధ్యత పూర్తి అవుతుంది. తదుపరి హైకోర్టు నిర్ణయం తీసుకుంటే అది వేరే విషయం. ఇక్కడే రాష్ట్ర ప్ఱభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నిబద్దత లోపించింది.దానికి ప్రతిఫలం కాంగ్రెస్ అనుభవించకతప్పదు.

http://kommineni.info/articles/dailyarticles/content_20120816_4.php

22 Comments

Filed under Uncategorized

22 responses to “ముంచాలనుకున్న కాంగ్రెస్ మునుగుతోంది.

 1. Karthik

  It is possible that the Congress may be sacrificing some of their own men like Mopidevi and Dharmana in order to make people believe Jagan did cause loot public wealth. Their claims were treated as ridiculous and disregarded by the people when they said that their own cabinet was sincere but a person who was never part of the government caused losses to the state. Now, they may be trying to show some of their own men as corrupt to make believe their claims against Jagan.

  I am confident that the truth will prevail and sooner or later, Jagan’s innocence would be proven in a court of law also. All the people know that Jagan is a kind of person who donates his hard earned money for the people. They will never believe that he looted public wealth to create wealth for himself.

 2. CVReddy

  కేబినేట్ బ్లో అవుట్
  http://www.lawyerteluguweekly.com/1n.htm

  • Karthik

   Congress can never be in trouble because of the CBI. JD Lakshminarayana is a stooge of the Congress bosses in Delhi. Their actions are no doubt confusing but it could be part of a larger game plan. CBI can never become a threat to Congress while a bootlicker like Lakshminarayana is leading the investigation.

   • rakesh

    its just a matter of time karthik
    countdown for the cong govt has started both state and central
    when the cong govt is gone
    where this jd laxmi hide his head
    we shall see

    • Karthik

     He must be prosecuted for misusing his official powers to fabricate charges against Jagan, Vijay Sai, Sunil Reddy etc.

 3. CVReddy

  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఉత్సాహాన్ని ఇచ్చే సర్వే!
  http://kommineni.info/articles/dailyarticles/content_20120817_1.php
  దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతుండగా, ఆంద్రప్రదేశ్ లో ఎమ్.పి సీట్లలో కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు తాజా సర్వే చెబుతోంది.ఇండియా టుడే,నీల్సన్ సర్వే ప్రకారం ప్రస్తుతం 259 సీట్లు కలిగిన యుపిఎ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 171-181 వరకు మాత్రమే సీట్లను సాధించగలుగుతుంది. కాగా ఎన్.డి.ఎ.కి 195-205 సీట్ల వరకు రావచ్చని అంచనా చెబుతోంది. బిజెపి సీనియర్ నేత ఎల్.కె.అద్వాని వ్యాఖ్యానించినట్లుగా యుపిఎ, ఎన్.డి.ఎలు మరో కొత్త ఫ్రంట్ లేదా మరికొన్ని కొత్త పార్టీలపై ఆధారపడే ప్రబుత్వానికి రావాలి. లేదా వేరే పార్టీ వారికి ఈ రెండు పార్టీల నాయకులలో ఎవరో ఒకరు మద్దతు ఇవ్వవలసి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి 23 నుంచి 27 సీట్లు వస్తాయని అంచనా వేయడం ఆ పార్టీకి మరింత ఉత్సాహం వచ్చేదే.కాగా ఎలాగైనా తిరిగి పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న టిడిపికి ఇది తీవ్ర నిరాశ కలిగించే అంశమే. కాంగ్రెస్ కు సంబంధించినంతవరకు ఎవరికి నమ్మకం లేదు. కాని టిడిపినే గట్టి పోరాటం చేయడానికి రకరకాల వ్యూహాలు అమలు చేస్తోంది.అయితే మరో ఏడాదినర్న తర్వాత రాబోతున్న ఎన్నికలకు ఇప్పటి సర్వే వర్తిస్తుందా అంటే ప్రస్తుత పరిస్థితులు యధాతధంగా కొనసాగితే ఫలితాలు కూడా అదే ప్రకారం ఉండవచ్చు.కనుక నీల్సన్ సర్వే వాస్తవాలకు అనుగుణంగానే ఉన్నట్లు కనబడుతోంది.

 4. Karthik

  It is a known fact that YSRCP will sweep the polls if they are held now. However, Telangana is still seen as a weak point for our party. We should focus on Telangana. Jagan should complete Odarpu in Telangana as soon as he gets bail. T people are facing the same issues as Seema and Andhra. I am sure we can win them over in the same way if we develop a good cadre and leaders. Separate state is not going to be only issue in 2014. Even in 2009, it was not the only issue. YSR could make Congress emerge as the single largest party not by using T sentiment but by addressing the basic issues.

 5. CVReddy

  ఎన్నికలొస్తే యూపీఏ ఇంటికే!
  ఇండియా టుడే-నీల్సన్ సర్వేలో వెల్లడి
  17/08/2012 12:19:00 AM
  – మన్మోహన్ సర్కారుపై ప్రజాగ్రహం
  – ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏ ఓటమి తథ్యం
  – యూపీఏకు 171-181 సీట్లు మించకపోవచ్చు
  – క్రమంగా బలం పుంజుకుంటున్న ఎన్డీఏ
  – ఎన్డీఏకు 195-205 సీట్లు రావొచ్చు
  – ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 23-27 లోక్‌సభ సీట్లు రావొచ్చు
  http://sakshi.com/main/Fullstory.aspx?catid=432749&Categoryid=1&subcatid=32

 6. CVR Murthy

  India Today -Nielsen projected more than 50% vote share for YSRCP in AP.(not sure only Andhar and seema or including telengana) in the latest poll shown on TV today

 7. CVR Murthy

  What is disgusting is , the real stakeholders in this , People of AP , who gave 33 seats to Congress, who never pressurized Congress for cabinet berths, railway lines, Power or Gas allocation, special projects etc , are suffering.

  The political tactics of CBN have stooped to such a level, he successfully stopped all the projects and congress fell in to his trap.

  I am sure No political party would be willing swear that they never collected money from Industrialists.

  • Hi Murthy garu,
   just now i too watched same and looks like in next indiatoday weekly results will be published..

   thanks,
   niranjan

  • rohit

   Our mp’s should learn from their counterparts in TN, Maharashtra, bihar, etc when it comes to states interest they get united and successfully managed to take good projects to their states.

   CBN has reached a stage where he is ready to sacrifice the basic interests of state to come back to power. I thing people of AP will give his party a deathly blow in 2014 elections for all misdeeds in stopping industrialization of the state.

   AND
   Even a bachelor CM like narendra modi if facing charges of giving away land cheaply to essar, adani etc but these people have developed large industries. Despite criticising modi oppostion political parties also are not stopping the rapid industrialization in gujarat.

  • CVReddy

   100% correct Murthy Garu.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s