రామోజీ భూ మోసంపై మళ్లీ దర్యాప్తు షురూ

* విశాఖలో ఈనాడు కార్యాలయం స్థలం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ
* తనదికాని స్థలానికి ప్రభుత్వ ప్రతిఫలం పొందిన రామోజీ
* రామోజీపై కుట్ర, మోసం, ఫోర్జరీ వంటి పలు సెక్షన్ల కింద కేసులు
* రెండో నిందితుడిగా ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ఎండీ కిరణ్

‘ఈనాడు’ అధినేత రామోజీరావు తనదికాని స్థలాన్ని రోడ్డు విస్తరణకు ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి అక్రమంగా మరో స్థలాన్ని పొందిన వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే తొలగిపోవడంతో రామోజీరావుపై కుట్ర, మోసం, ఫోర్జరీ, అధికార దుర్వినియోగంవంటి ఆరు సెక్షన్ల కింద ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేసు దర్యాప్తు జరుగుతోందని ఏసీబీ డెరైక్టర్ జనరల్ బి. ప్రసాదరావు ‘న్యూస్‌లైన్‌కు తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) ఎఫ్‌ఐఆర్ (నంబర్ 5/2012)ను నమోదు చేసింది. సీఐయూ చీఫ్ కె.సంపత్‌కుమార్ నేతృత్వంలో దర్యాప్తు వేగవంతం చేశారు. రామోజీరావును మొదటి నిందితునిగా, ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ఎండీ సీహెచ్ కిరణ్ రెండో నిందితునిగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి స్థలాన్ని పొందడంలో రామోజీకి సహకరించిన ఐఏఎస్ అధికారులు ఎస్వీ ప్రసాద్, కేవీ రావులను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో ‘ఈనాడు’ కార్యాలయమున్న స్థలాన్ని రామోజీరావు 1974లో మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణవర్మ నుంచి లీజుకు తీసుకున్నారు. 1984-85లో ఈ స్థలంలో 289 చదరపు మీటర్లు రోడ్డు విస్తరణలో పోయింది.

భూ యజమానికి ఈ సమాచారం ఇవ్వకుండా, రోడ్డు విస్తరణకు ఇచ్చిన స్థలానికి ప్రతిఫలంగా రేసపువానిపాలెం సర్వే నంబర్ 52లో 872 చదరపు మీటర్ల స్థలాన్ని రామోజీరావు తన కుమారుడు కిరణ్ పేరిట తీసుకున్నారు. ఈ స్థలాన్ని ఇచ్చే అధికారం లేదని తహసీల్దార్ ఇచ్చిన నివేదికను కూడా కాదని, ఉన్నతాధికారులు రామోజీ కోరిన స్థలాన్ని 1985 ఏప్రిల్ 17న ఆయనకు కట్టబెట్టారు. దీనిపై భూ యజమాని వర్మ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దర్యాప్తునకు కోర్టు ఆదేశించింది. దీనిపై రామోజీ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇటీవల హైకోర్టు స్టేను తొలగించడంతో ఏసీబీ దర్యాప్తును తిరిగి ప్రారంభించింది.

14 Comments

Filed under Uncategorized

14 responses to “రామోజీ భూ మోసంపై మళ్లీ దర్యాప్తు షురూ

 1. CVReddy

  టిడిపి మూడు ముక్కలాట-Bhoomi

  హైదరాబాద్, ఆగస్టు 25: తెలంగాణకు అనుకూలంగా గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాయనున్నారని తెలంగాణ టిడిపి నాయకులు చెబుతుండగా, ఇతర ప్రాంతాల నాయకులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన టిడిపి నాయకులు మూడు రకాల వాదనలు వినిపిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో చంద్రబాబు లేఖ ఇవ్వనున్నారని తెలంగాణ టిడిపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆదివారం ఉదయం పది గంటలకు సీమ మేధావులు, నాయకులు, వివిధ వర్గాల వారితో ఖైరతాబాద్‌లోని శ్రీ్ధర్ పంక్షన్ హాలులో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటల నుంచి జరిగే ఈ సమావేశంలో రాజధాని నగరంలో ఉన్న రాయలసీమ వాసులందరినీ పిలిచినట్టు బైరెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాలకు అంగీకరించే ప్రసక్తి లేదని, ఉంటే ఒకరాష్ట్రంగా ఉండాలి లేదంటే రాయసీమను రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందరి అభిప్రాయాలు తెలుసుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నట్టు ఆయన తెలిపారు. చంద్రబాబు తెలంగాణకు కట్టుబడి ఉన్నామని లేఖ ఇవ్వనున్నట్టు టిడిపిలో కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. బాబు ఎలాంటి లేఖ ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు దీనిని ఖండించారు. బాబు లేఖ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని, లేఖ ఇస్తారని తెలిపారు. బైరెడ్డి రాయలసీమ ఉద్యమంతో టిడిపికి సంబంధం లేదని, ఆయన వ్యక్తిగతంగా ఉద్యమం నిర్వహిస్తున్నారని తెలిపారు. కేశవ్ తన వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించారని దయాకర్‌రావు తెలిపారు. తెలంగాణపై కేంద్రానికి చంద్రబాబు రాసే లేఖలో రాయలసీమ ప్రస్తావన ఉండదని దయాకర్‌రావు తెలిపారు.తెలంగాణకు కట్టుబడి ఉండాలని గతంలో తీసుకున్న నిర్ణయానే్న ఇప్పుడు మరోసారి కేంద్రానికి వెల్లడించనున్నట్టు దయాకర్‌రావుతెలిపారు. కొన్ని సార్లు పార్టీకి నష్టం కలిగించినా ఒకసారి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుందని దయాకర్ అన్నారు. లేఖపై తెలంగాణ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా, సీమాంధ్ర నాయకులు మాత్రం తెలంగాణపై ఇంత కాలం ఏం చెబుతున్నామో అదే రీతిలో పార్టీ నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. పార్టీ సమైక్యవాదానికి కట్టుబడి ఉండాల్సిందే అని సీమాంధ్ర నాయకులు కొందరు వాదిస్తున్నారు. బైరెడ్డి చేపట్టే కార్యక్రమానికి రాయలసీమ ప్రజల నుంచి లభించే స్పందన బట్టి ఈ ప్రాంత నాయకులు ఒక నిర్ణయానికి వస్తారని టిడిపి నాయకులు తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నాయకులు పార్టీ అధినేత చంద్రబాబుతో టచ్‌లోనే ఉన్నారని పార్టీ సీనియర్లు తెలిపారు.

 2. CVReddy

  Naidu, Narayana Are Rank Opportunist!
  Taking a dig at Narayana for launching a week-long agitation for Telangana, he said it had reflected the opportunistic policies of the CPI leader. At the same time, Raghavulu also found fault with the TDP’s double standards on the release of water from Nagarjunasagar to Krishna delta.

  “A few days ago, Telangana TDP leaders agitated against release of water to Krishna delta. Now, the Seemandhra TDP leaders are staging a huge dharna at Vijayawada demanding release of water. And Naidu is watching the tamasha. Why is this double game?” he asked.

 3. rakesh

  hc(sonia) gamble is to sack all ministers who are issued summons by sC
  and fix jagan by all means.
  if any shame left to these telugu mlas/mp,,should show italian her place

  • NLR

   2014 will be the last elections for Cong in AP. The Pseudogandhi’s dont even have the guts to canvass in AP. It is a shame that MLA’s and MP’s dont have the courage of a common man in AP due to selfish reasons.

 4. @Karthik…

  YSR ni oppose chesina yentho mandi COMMON PPL ippudu YSR CP ni support chesthunnaaaaru…….same is the case with the LEADERS also…why shuld we loose their help????

  manalni kaavaali ani vachevaARINI vaddu anukovadam yenduku????

  • Karthik

   Vidyasagar garu – I am sorry to say that I am disappointed with your argument andi. Perhaps you are so loyal that you blindly support the actions of the party, but that is not a good thing.
   Jagan is not in jail today for the sake of Vuppunuthala or Mysura or PJR’s family. He is in jail for fighting for the common man. Jagan is here to serve the common man. Yes, even those common folks who don’t vote for our party will benefit once we come to power. If you wish to challenge that, I don’t even want to take up an argument. But I hope you realize that it is not the same as accepting and supporting leaders like Vuppunuthala.
   Accepting votes from somebody who voted for a different party is not even comparable to making a known YS opponent stand on stage with Jagan under a banner of the late Mahanetha and asking people to support them. Their past comments will reverberate in the hearts of genuine YS fans and disappoint them. No such thing will happen if somebody who voted against YS in the past votes for Jagan today. I hope you understand what I am saying.

   • Karthik

    YSR vunnappudu aayana valla PADAVI,HODA pondina yenthoo mandi ivaaala yekkada vunnaaaru??????

    YSR vunnappudu aayana ni vyathirekinchinavaallu…..ivaaala vaalla POLITICAL NEEDS kosam or nijam gaane realise ayyi mana vaipu vasthunte why shuld we oppose them????

    JAGAN anna JAIL ki vellinaa kudaa PARTY ki yemi problem ledu…..ane signal pampadam kosame MYSURA gaarini JAGAN ye swayam gaa invited into the party……MYSURA gaaru vachi 1LAC CRS CORRUPTION is a FARCE ani cheppinaaka YELLOW BATCH chaalaa varaku silent indi…..

    naa varaku naaku……AANAM…DAANAM…BOTCHA…SABITHA….DHARMANA laanti VENNUPOTU daarula kante VUPPUNUTHALA 1000 times better……

    • Karthik

     Vidyasagar garu – I don’t want to argue with you but just think to yourself. Would you have said its a bad decision if YSRCP had refused to accept Vuppunuthala or PJRs daughter who were refused tickets by YSR? Would you have made the same argument that they realized or are coming for thei political gains, why should we refuse? Would you said the party is making a bad move by declining them? I have a feeling that you wouldn’t. If anything, you would say that it’s an excellent decision and we have no need to accept such people. It is best to keep genuine YSR fans and loyalists happy by not taking such people. What I feel is that you feel this is right because that is what the party has decided. There can be only one right decision. Accept or reject. It is not very wise to say that whatever the party does is right. Of course, these are only small issues and YSRCP is undoubtedly the best party today but I want it to be even better!

 5. rakesh

  this case has been so long
  why no court give judgement though the crimal act by ramoji is proved beyond doubt
  what a pity of our judiciary only give judgements based on political calculations

   • Karthik

    This is a really disappointing news. Accepting YSR opponents has been disappointing many YS fans for quite sometime now. If Vuppunuthala who is not only a known critic of YSR but also totally useless and nearly forcefully retired due to YSR is also accepted into YSRCP the only remaining ones would be Shankar Rao, DLR, KK, and VH.
    Please anybody who has access to YSRCP leadership take this message across: We don’t have anything to gain by accepting so many known YSR opponents. They might gain by joining our party but the party will only disappoint genuine long time YS fans. Please don’t accept such people.
    If possible, make people like Sai Pratap who are strong and known loyalists of YSR join the party.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s