న్యాయ వ్యవస్థకు చురకలు వేసిన ఛీఫ్ జస్టిస్

http://kommineni.info/articles/dailyarticles/content_20120826_3.php

సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ కపాడియా అధ్బుత వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు దేశాన్ని పాలిస్తున్నామనో, పాలించాలనో అనుకోరాదని, పద్దతిగా తీర్పులు ఇవ్వాలని సూచించారు.ప్రభుత్వం అమలు చేయలేని విధంగా తీర్పులు ఇస్తే కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేయకపోతే వాటిని న్యాయ వ్యవస్థ అమలు చేయగలుగుతుందా అని కపాడియా ప్రశ్నించడంలో ఎంతో వివేచన కనిపిస్తుంది. న్యాయవ్యవస్థ క్రియాశీలకంగా ఉండడం కొంతవరకు ఆమోదయోగ్యమేకాని, అచ్చంగా న్యాయ వ్యవస్థే ప్రభుత్వాన్ని శాసించాలని అనుకోవడం సరికాదు. ప్రభుత్వంలో జరిగే తప్పులు, ఒప్పులపై తీర్పులు ఇవ్వవచ్చు కాని, విధానాలలో జోక్యం చేసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. ఇటీవలికాలంలో కొందరు న్యాయమూర్తులు కొన్ని ప్రభావాలకు లోనై తీర్పులు ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు. ఒకే తరహా కేసులలో న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇస్తుండడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు మాజీ ఛీఫ్ జస్టిస్ కక్రు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ కు వ్యతిరేకంగా సిబిఐ దర్యాప్తు జరపాలని ఇచ్చి తీర్పు విమర్శలకు గురి అవుతోంది.అలాగే చంద్రబాబునాయుడు తదితరులకు వ్యతిరేకంగా మరో ఛీప్ జస్టిస్ గులాం ఇచ్చిన తీర్పు కూడా విమర్శలకు గురి అయింది.ఇక మన రాష్ట్రంలో గాలి జనార్దనరెడ్డి బెయిల్ ముడుపుల కేసు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నించేదిగా మారింది.న్యాయమూర్తులు రాజకీయాలకు అతీతంగా తీర్పులు ఇచ్చే పరిస్థితి రావాలి. ఈ నేపధ్యంలో ఛీఫ్ జస్టిస్ కపాడియా చేసిన వ్యాఖ్యలు అందరూ అనుసరించదగినవని చెప్పాలి.

3 Comments

Filed under Uncategorized

3 responses to “న్యాయ వ్యవస్థకు చురకలు వేసిన ఛీఫ్ జస్టిస్

  1. rajabommareddy

    Politicized Legal System
    Legal System is under the clutches of ruling Political power interference through politically motivated court verdicts with the excess use of recent tool “bail denial for some imaginary evidences “. The same is exercised either to control political leaders or curb new political agendas, there by dictate terms to have difference of opinion, which is the basic principle of Politics. The primary goal is to create obstruction to new political opinions and rub fake Gandhi’s on top of Indians who are 100’s cr. plus fail to find a gold Olympian and love to live under political slavery for decades. We can’t run our nation as ourselves and live like a selfless person at the feet some dick in Delhi.
    In 2G scam arrests were made aftermath of the scam. India witnessed telecom scam right from era of sukhram version to current day 2G version under the surveillance of ruling political parties. Since then we did nothing to prevent these scams first and we look political benefit or mileage aftermath of the scam in terms of economic or party inclination.
    Is there any guarantee that there won’t be another 4G version of scam without any changes in the way of basic funding of Political parties to run world’s largest democracy? Whose money is used to fund Congress party or BJP? No one either Rahul or Advani is doing cultivation for running political parties but how is it possible to get money and run political parties? Oh average Indian shouldn’t think or question like this, otherwise rulers will get annoyed and you will be sent to jail and bail denial there by for jeopardizing legal authorized corruption. We Indians are designed to be ruled by someone else and shouldn’t have any self-respect. Only few master clans exercise the political fields to generate fruits to the Indian society and our job is to help those masters from mars, no questioning or they will deny the bail.
    Denial of Bail for accused by CBI is at mercy of central congress, which paralyzed the legal system for political survival particularly in Andhra. Our political system funded through business men, who wish to do business for personal profit creating business and employment. The funniest part of this game did all scams happened without a percentage of money to central congress? Day time acting cop sorry politically motivated police acting according to book of rules by just forgetting yesterday night he was the one responsible all this corruption mess.
    Right from different versions of verdicts from judge’s the level of transparency in court verdicts is highly influenced by ruling governments, reflecting the autonomous legal system working style in largest Indian Political democracy. Supreme Court verdict of Subramanya swami case against Chidambaram is classic example for this instance.
    Recent developments against Ramdev baba that is FERA case etc. is to send warning signals to who are questioning the supremacy of central congress political practices. To start or survive a political party under current conditions in India need lump sum of money and is bastardized by congress rule to exponential extent. Now the same Congress doesn’t tolerate any voice against its political agenda. Congress is using all sort of legal and police to threaten the genesis of new political ideologies. Does it good for Country? If scams have to happen it should be under only congress?

    Hoping legal system to work as more autonomous bodies rather under clutches of ruling political will or to the least basic principle of constitutional rights, a chance to accuse to prove what happened. Let us see how many will be at least arrested in coal scam worth of millions .

  2. CVReddy

    న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్నారు
    కేంద్రంపై యశ్వంత్ సిన్హా సంచలన ఆరోపణ.
    అనుకూల తీర్పును సులువుగా తెచ్చుకుంటున్నారు
    అడ్డుకట్టకు జాతీయ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి
    న్యూఢిల్లీ: కోర్టు తీర్పులను డబ్బులిచ్చి కొంటున్నారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా చల్లారకముందే… బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా అలాంటి సంచలన ఆరోపణలే సంధించారు! కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థను వినూత్న పద్ధతుల్లో ప్రభావితం (మేనేజ్) చేస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. తమకు అనుకూలమైన తీర్పును సులువుగా తెచ్చుకునే పరిస్థితిని ఈ ప్రభుత్వం సృష్టించిందని ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలకు స్వస్తి చెప్పడానికి జాతీయ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిన్హా ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ న్యాయమూర్తుల నియామక ప్రక్రియపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
    ‘మూడు నుంచి ఆరు నెలల ప్రొబేషన్ ప్రాతిపదికన ఓ జడ్జీని నియమిస్తారు. ఆ జడ్జీ తమకు అనుకూలుడని ప్రభుత్వం భావిస్తేనే, అతడి నియామకం ఖరారవుతోంది. సర్కారు ఇలాంటి కొత్త కొత్త పద్ధతుల్లో న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తుందని ఎవరైనా ఊహించారా?’ అని ప్రశ్నించారు. తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను వల్లెవేయడం లేదని, తమ దృష్టికి వచ్చిన కొన్ని ఉదాహరణల ఆధారంగానే మాట్లాడుతున్నానని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు

  3. CVReddy

    జడ్జిలు దేశాన్ని పాలించరాదు
    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా వ్యాఖ్య

    తీర్పులు వెలువరించేటప్పుడు అవి ఆచరణ సాధ్యమా కాదా అని చూడాలి
    నిద్రపోవడం కూడా ప్రాథమిక హక్కేనని చెబితే ఎలా?
    ఒక హక్కు పరిధిని విస్తరిస్తే దాని సాధ్యాసాధ్యాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి
    జడ్జిలు వెలువరించే మార్గదర్శకాలు పాలనలో జోక్యం చేసుకోరాదు

    http://sakshi.com/Main/Fullstory.aspx?catid=438296&Categoryid=1&subcatid=32

Leave a Reply to CVReddy Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s