విజయమ్మ విమర్శలకు సమాధానం వస్తుందా?

http://kommineni.info/articles/dailyarticles/content_20120827_1.php

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మళ్లీ రాజకీయ ఉపన్యాసం చేసి కాంగ్రెస్ మంత్రులపై విమర్శల వర్షం కురిపించారు. వై.ఎస్. వచ్చి ఎదుట నిలబడితే కళ్లలోకి చూడగలరా అని మంత్రులను ప్రశ్నిస్తున్నారు. మరణించిన వైఎస్ తిరిగి వచ్చి జవాబు చెప్పుకోలేరు కనుక ఆయన మీద చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినా జగన్‌ను జైలుకు పంపినా వైఎస్ ఫొటో లేకుండా చేసినా ఏమీ మాట్లాడని మంత్రులు ఇపుడు వైఎస్‌ను ఉద్దేశించి తలో రకంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లాలో గడప,గడపకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొంటూ ఈ విమర్శలు చేశారు. ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. రకరకాల కథలు అల్లిస్తూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. ఒక మంత్రి అంటున్నారు.. ఆయనకు కనుక పోలీసు ప్రొటెక్షన్ ఇస్తే వైఎస్ హయాంలో జరిగినవన్నీ చెబుతారట! ఇంకొక మంత్రి అంటున్నారు.. తనను క్యాంపు ఆఫీసుకు పిలిపించి తనతో సంతకం చేయించారని! ఇంకొకరైతే తాను హాస్పిటల్‌లో ఉంటే అక్కడికి ఫైలు పంపించి సంతకాలు తీసుకున్నారని చెప్తున్నారు! ఇంకొకరేమో కేబినెట్ నిర్ణయాలన్నీ సమష్టిగా చేసినవేనని.. అందులో ఏమీ లేదు గానీ తెర వెనుక ఏదో బాగోతం నడిచిందని.. అది వారికి తెలియనే తెలియదని అంటున్నారు! ఇంకొకరైతే కేబినెట్ సమావేశాల్లో ఓ రకమైన చర్చ జరిపారనీ ఫైల్లో మాత్రం మరో విధంగా ఉందని అంటున్నారు. ఇంకొకాయన రాజశేఖరరెడ్డిగారు చాలా పవర్ ఫుల్ అని.. ఆయన ముందర ఏమీ
ఈ మంత్రులు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు?అని విజయమ్మ ప్రశ్నించారు.

ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి నాలుగు సార్లే మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తోందని.. అదే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నెలకు రెండు సార్లు కేబినెట్ సమావేశాలు జరిగేవని గుర్తు చేశారు. ‘ఆ రోజు ఈ మంత్రులు కేబినెట్‌లో ఎందుకు మాట్లాడలేక పోయారు? ఏం చేస్తా ఉన్నారు? ఏం చూస్తా ఉన్నారో వారికే తెలియాలి. అపుడు ఏమీ మాట్లాడని వారు ఇపుడిలా మాట్లాడతుంటే మనసుకు చాలా కష్టం కలుగుతోంది. భాధ అనిపిస్తోంది. వైఎస్ సజీవంగా వచ్చి వారి ముందర నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా వీరు చూడగలరా?’’ అని ఆమె ప్రశ్నించారు.ఆ జీవోలు సక్రమమా.. అక్రమమా.. చెప్పరేం?: అసలు అప్పట్లో జారీ అయిన 26 జీవోలు సక్రమమా, అక్రమమా అనేది ప్రభుత్వం ఇంత వరకూ చెప్పటం లేదని విజయమ్మ ప్రస్తావించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని గుర్తుచేశారు. ‘‘జీవోలు సక్రమమని చెప్తే జగన్‌మోహన్‌రెడ్డికి మేలు జరుగుతుంది. అక్రమమని చెప్తే ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది.. అందుకే సమాధానం చెప్పటం లేదు’’ అని ఆమె విశ్లేషించారు. ‘‘అసలు జగన్‌కు ఏం సంబంధం..? ఆయన అపుడేమైనా ఎమ్మెల్యేనా? ఎంపీగా ఉన్నారా? మంత్రిగా పనిచేశారా? లేక అధికారిగా ఏమైనా ఉన్నారా?’’ అని ఆమె నిలదీశారు. జగన్‌ను విచారణ కోసమని పిలిచి సీబీఐ అన్యాయంగా జైల్లో పెట్టి ఇప్పటికి 90 రోజులైందని ఆమె ఆవేదనగా చెప్పారు.మొత్తం మీద విజయమ్మ పదునైన విమర్శలతో ఉపన్యాసాలను ఎక్కు పెడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ నేతలుకాని, మంత్రులు కాని, ప్రభుత్వం కాని ఈ విమర్శలకు సమాధానం చెప్పడంలో విఫలం అవుతున్నందువల్లనే కాంగ్రెస్ పార్టీ ప్రజలలో పలచన అవుతోంది. ఇక్కడ జగన్ పై వచ్చిన అవినీతి ఆరోపణల సంగతి అలా ఉంచితే,కాంగ్రెస్ పార్టీ నేతల నిర్వాకమే ప్రజలలో వారిని అప్రతిష్టపాలు చేసింది. మరి విజయమ్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తారా?

11 Comments

Filed under Uncategorized

11 responses to “విజయమ్మ విమర్శలకు సమాధానం వస్తుందా?

  1. CVReddy

    జగన్ వైపే మెజార్టీ ప్రజల మొగ్గు: ఎన్డీటీవీ

    హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నట్టు తాజాగా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. జగన్ ను సీఎంగా 48శాతం మంది ప్రజలు కోరుకోగా, చంద్రబాబును సీఎంగా 18శాతం, కేసీఆర్ ను 17శాతం, కిరణ్‌కుమార్‌ రెడ్డిని సీఎంగా 11 శాతం, చిరంజీవిని సీఎంగా 6శాతం మంది కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.

    ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలొస్తే టీడీపీ పతనం ఖాయంమని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 21 ఎంపీ సీట్లు, టీఆర్ఎస్‌కు 10 ఎంపీ సీట్లు, 9 ఎంపీ సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని సర్వేలో వెల్లడైంది.

  2. Simhapuri ...!

    NDTV Exclusive

    Mid Term Polls with Dr Prannoy Roy

    Says complete sweep by Jagan Mohan Reddy…

    Watch NTDV…

  3. CVReddy

    HC reopens IMG land case against Naidu
    http://greatandhra.com/viewnews.php?id=40164&cat=15&scat=16

    Despite his “managing skills” to get out of the cases against him one way or the other, Telugu Desam Party N Chandrababu Naidu continues to face legal wrangles for his misdeeds during his nine-year regime.

    The high court on Monday reopened the case against Naidu pertaining to allotment of 1,000 acres of land in the heart of Hyderabad to a bogus sports infrastructure company IMG Bharata for construction and maintenance of various sports stadia in the city.

    The petition was filed by V Vijay Sai Reddy, the personal auditor of YSR Congress party president Y S Jaganmohan Reddy and vice chairman of Jagathi Publications, along with senior journalist A B K Prasad.

    Finding fault with the Central Bureau of Investigation for not taking up the probe on the pretext of lack of staff, the high court issued notices to the CBI, the Central government, the home department and the IMG Bharata for filing a counter petition. It ordered the CBI to take up the investigation into the allegations against Naidu.

    Let us see whether Naidu will be able to come out of this case, too.

  4. CVReddy

    Naidu’s foreign tours.

    Where does Telugu Desam Party president N Chandrababu Naidu go every six or seven months in the name of holidaying in foreign countries?

    It has always raised a lot of curiosity among the media persons and even political leaders.
    The TDP president went on a foreign tour along with his family members four days ago and will be returning to the country on Monday. Though it is not uncommon for Naidu to go on a foreign tour with his family members once in a while, nobody, including party leaders, knows about where he goes.
    The purpose of his tour and his itinerary has always remained a closely guarded secret.
    Analysts are suspecting that Naidu has gone to Dubai or Singapore only to oversee his huge benami properties and do certain monetary transactions.
    Central Govt should order a probe into Naidu’s frequent foreign tours and his foreign bank transactions.
    There is certainly something fishy about his foreign tours.
    Courtesy:GA

    • Adnan

      CBN choose a deceptive option – family personal trip – to avoid attention from people. Media should highlight this and there should be some media investigation.

  5. CVReddy

    చంద్రబాబునాయుడు హయాంలో ఐఎంజీ భారత కంపెనీకి భూకేటాయింపులపై విచారణ జరపడానికి దర్యాప్తు సంస్థ సిబిఐ నిరాకరించడం సరి కాదని హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌, జస్టిస్‌ విలాస్‌ అఫ్జల్‌ పుర్కర్‌తో కూడిన బెంచ్‌ ముందుకు విజయసాయిరెడ్డి, ఏబీకే ప్రసాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు వచ్చింది. వనరుల కొరత పేరుతో దర్యాప్తుకు సీబీఐ నిరాకరించటం సరికాదని హైకోర్టు అభిప్రాయపడినట్లు సమాచారం.ఈ కేసుకు సంబంధించి సీబీఐ, కేంద్ర ప్రభుత్వం, సీవీసీ, హోంశాఖ, ఐఎంజీ భారత కంపెనీలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

  6. CVReddy

    మళ్లీ చంద్రబాబు మెడకు ఐఎమ్ జి భూమి కేసు
    http://kommineni.info/articles/dailyarticles/content_20120827_5.php

    టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుకు కొత్త చిక్కు వచ్చిపడేలా ఉంది. జగన్ ఆస్తుల కేసులో నిందితుడైన విజయసాయిరెడ్డి, ప్రముఖ జర్నలిస్టు ఎబికె ప్రసాద్ లు వేసిన కేసులో హైకోర్టు సిబిఐ తదితర సంస్థలకు నోటీసు జారీ చేయడం విశేషంగా ఉంది. ఎలాగైనా చంద్రబాబును కోర్టుకు లాగాలన్న జగన్ అనుచరుల ప్రయత్నం కొంత సఫలం అయినట్లు కనబడుతోంది.చంద్రబాబునాయుడు హయాంలో ఐఎంజీ భారత కంపెనీకి భూకేటాయింపులపై విచారణ జరపడానికి దర్యాప్తు సంస్థ సిబిఐ నిరాకరించడం సరి కాదని హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌, జస్టిస్‌ విలాస్‌ అఫ్జల్‌ పుర్కర్‌తో కూడిన బెంచ్‌ ముందుకు విజయసాయిరెడ్డి, ఏబీకే ప్రసాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు వచ్చింది. వనరుల కొరత పేరుతో దర్యాప్తుకు సీబీఐ నిరాకరించటం సరికాదని హైకోర్టు అభిప్రాయపడినట్లు సమాచారం.ఈ కేసుకు సంబంధించి సీబీఐ, కేంద్ర ప్రభుత్వం, సీవీసీ, హోంశాఖ, ఐఎంజీ భారత కంపెనీలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఐఎంజీ భారత అనే కంపెనీకి చంద్రబాబు నాయుడు క్రీడల అభివృద్ది కోసం అని చెప్పి 850 ఎకరాలను కేటాయించిన తీరుపై వీరు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసింది.అయినప్పట్టికీ ఇప్పుడు జగన్ పై పిటిషన్ వేసినందుకు ప్రతిగా విజయసాయిరెడ్డి ఈ కేసు ఫైల్ చేశారు. విజయమ్మ వేసిన కేసు నుంచి చంద్రబాబు తదితరులు బయటపడగా, ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు వస్తాయో చూడాలి.

  7. CVReddy

    బాబు విదేశీయానాల ‘రహస్యం’ తేల్చండి
    ప్రధానికి లక్ష్మీపార్వతి లేఖ

    టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఏటా రహస్యంగా చేస్తున్న విదేశీ పర్యటనలపై కేంద్రం అత్యున్నత దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు చేయించాలని ఎన్‌టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు ఆమె ఆదివారం ఒక లేఖరాశారు. గడిచిన 15 ఏళ్లలో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు చేసిన విదేశీ పర్యటనలు, విదేశాల్లో వారి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలని ప్రధానిని కోరారు. ‘‘ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజా జీవితంలో ఉన్న చంద్రబాబు ఎక్కడికి వెళుతున్నారో చెప్పకుండా రహస్యంగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అయితే అవి ఆయన వ్యక్తిగత అంశమైతే ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరంలేదు.

    కానీ గతంలో తెహెల్కా మ్యాగజైన్ చంద్రబాబు దేశంలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకుడిగా ప్రకటించింది. బినామీ పేర్లతో చంద్రబాబుకు సింగపూర్, మలేషియాల్లో హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉన్నట్లు ఆ పత్రిక బయటపెట్టింది’’ అని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు పార్టీ ద్వారా 2009 తర్వాత సి.ఎం.రమేష్, వై.వి.సుజనాచౌదరిలు రాజ్యసభలో అడుగుపెట్టారు. ప్రజాజీవితంలో పెద్దగా కనిపించని వీరు రాజ్యసభకు వెళ్లటం పట్ల చాలా మందికి ఆశ్చర్యం, ఆస్తకి కలిగించింది. 2009 సాధారణ ఎన్నికలకు ముందు ఈ ఇద్దరి ద్వారానే టీడీపీ ఎన్నికల కోసం మనీ లాండరింగ్ చేసింది’’ అని ఆమె ఆరోపించారు. గతంలో వీటిపై విచారణ జరపాల్సిందిగా వై.ఎస్.విజయమ్మ కోర్టుకు నివేదించినప్పటికీ అత్యంత దురదృష్టకరమైన రీతిలో ఆ పిటిషన్ తిరస్కరణకు గురైందన్నారు. హసన్ ఆలీ మనీ లాండరింగ్ కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మాజీ ముఖ్యమంత్రి భాగస్వామ్యం ఉన్నట్లు ఈడీకి ఆయన వెల్లడించిన విషయం జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైందన్నారు. అప్పట్లో హసన్ ఆలీ వ్యవహారం బైటకొచ్చిన కొద్ది రోజుల్లోనే చంద్రబాబు హడావిడిగా విదేశీ పర్యటనకు వెళ్లారని గుర్తుచేశారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s