రక్తదానం, అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు
ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద
శ్రద్ధాంజలి ఘటించనున్న విజయమ్మ
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించడానికి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. రక్తదానం, అన్నదానంతోపాటు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. వీటితోపాటు ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నారు. ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఇడుపులపాయలోని మహానేత సమాధి వద్ద ప్రార్థనలు జరిపి, శ్ర ద్ధాంజలి ఘటిస్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులందరూ పాల్గొంటారు.
హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు వైఎస్‌కు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ సేవాదళం ఆధ్వర్యంలో ఇక్కడో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో 2,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు సరఫరా చేస్తారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కాకుండా గ్రామస్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకూ వైఎస్ సంస్మరణ కార్యక్రమాలు జరగనున్నాయి. వైఎస్ మరణించిన నల్లకాలువ వద్ద కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడ పేదమహిళలకు చీరల పంపిణీ చేయడంతో పాటుగా కొవ్వొత్తులు వెలిగించి మహానేతకు నివాళులర్పిస్తారు.
Chengala Venkata Rao’s shocker to TDP, Uppunuthala bids adieu to Congress
http://www.frontpageindia.com/andra-pradesh/chengala-venkata-raos-shocker-tdp-uppunuthala-bids-adieu-congress/37123