ఐఎంజీ వ్యవహారంపై మీ వైఖరేమిటి?

వారంలోగా కౌంటర్ దాఖలు చేయండి: సీబీఐకి హైకోర్టు ఆదేశం

వనరుల కొరత ఉందన్న సీబీఐ వాదన ఇప్పుడు చెల్లుబాటు కాదని తన కౌంటర్‌లో స్పష్టం చేసిన రాష్ట్ర హోంశాఖ ఇటీవలి కాలంలో సీబీఐ అనేక కేసులు దర్యాప్తు చేపట్టి, చార్జిషీట్లు కూడా వేసిందని వెల్లడి.

వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఐఎంజీ భూముల వ్యవహారంలో వైఖరి ఏమిటో తెలియజేస్తూ వచ్చే సోమవారంనాటికి కౌంటర్ దాఖలు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్, న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత వారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర హోంశాఖ ఈ మొత్తం వ్యవహారంలో తన వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ దాఖలుచేసింది. సీబీఐ ఇటీవలి కాలంలో పలు కేసుల్లో దర్యాప్తు జరిపి, చార్జిషీట్లు ూడా దాఖలు చేసిందని, అందువల్ల వనరుల కొరత అంటూ సీబీఐ గతంలో చేసిన వాదన ఇప్పుడు చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది.

తద్వారా ఈ కేసును సీబీఐయే దర్యాప్తు చేయాలని పరోక్షంగా చెప్పినట్లయింది. ఐఎంజీ భూముల కేటాయింపు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం 2006లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ జీవో జారీ చేసినా, ఆ సంస్థ ఇప్పటివరకు దర్యాప్తు ప్రారంభించలేదని, వెంటనే దర్యాప్తు ప్రారంభించేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబీకె ప్రసాద్, ఆడిటర్ వి.విజయసాయిరెడ్డిలు ఈ ఏడాది మార్చిలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనతో న్యాయవాది టి.శ్రీరంగారావు కూడా మరో పిల్ దాఖలు చేశారు. ఐఎంజీకి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందాలు, కల్పించిన రాయితీలు తదితర అంశాలపై సీబీఐ జరిపే దర్యాప్తును పర్యవేక్షించేలా సెంట్రల్ విజి లెన్స్ కమిషన్ (సీవీసీ)ని ఆదేశించాలని ఎ.బి.కె ప్రసాద్, విజయసాయిరెడ్డిలు కోర్టును కోరారు.

ఈ మొత్తం వ్యవహారంపై వెంటనే ప్రాథమిక విచారణ చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని శ్రీరంగారావు కోరారు. ఈ రెండు వ్యాజ్యాలను జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. గతవారం తామిచ్చిన ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేశా రా అని ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాది జానకిరామిరెడ్డిని ప్రశ్నిం చింది. కౌంటర్ దాఖలు చేశామని ఆయన సమాధానం చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో మీ వైఖరి ఏమిటని సీబీఐ తరపు న్యాయవాది కేశవరావును ధర్మాసనం ప్రశ్నించింది. తనకు కౌంటర్ ఇప్పుడే అందిందని ఆయన సమాధానమిచ్చారు. అయితే హోంశాఖ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో, ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని, పూర్తి వివరాలతో వచ్చే వారంనాటికి కౌంటర్‌ను తమ ముందుంచాలని కేశవరావును ధర్మాసనం ఆదేశించింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఆ అవకాశమే లేదు..: ధర్మాసనం ఆదేశాల మేరకు ఐఎంజీ వ్యవహారంలో మొదటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో వివరిస్తూ హోంశాఖ డిప్యూటీ సెక్రటరీ జి.కన్నందాస్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ‘‘ఐఎంజీ భూముల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి దర్యాప్తునకు సీబీఐని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2006 డిసెంబర్ 13న జీవో నంబర్ 310 జారీ చేసింది. దీనికి స్పందనగా చెన్నైలోని సౌత్‌జోన్ సీబీఐ జాయింట్ డెరైక్టర్ 2007 జనవరి 29న ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఇప్పటికే ఐదు కేసుల్లో ప్రాథమిక విచారణ ప్రారంభించామని, అధికారులందరూ అందులో తీరిక లేకుండా ఉన్నారని, ఈ కేసును చేపట్టే పరిస్థితిలో సీబీఐ లేదని ఆ లేఖలో తెలిపారు. శాఖాపరంగానే ప్రాథమిక విచారణకు ఆదేశించాలని, అధికారులపై నేరారోపణలు రుజువైతే, అప్పుడు అవసరాన్నిబట్టి తాము దర్యాప్తు చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని హోంశాఖ లేఖ రూపంలో యువజన సర్వీసుల శాఖకు తెలియజేసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై సీఐడీతో దర్యాప్తు చేయాలని యువజన సర్వీసుల శాఖ హోంశాఖను కోరింది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా సీఐడీ అదనపు డీజీని హోంశాఖ కోరింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ సీఐడీకి ఇవ్వాలని యువజన సర్వీసుల శాఖకు సూచించింది. ఇదే సమయంలో ఐఎంజీకి చంద్రబాబు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఐఎంజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం.. ఈ మొత్తం వ్యవహారంతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం ముడిపడి ఉన్నందున దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి మరోసారి సీబీఐ సౌత్‌జోన్ జాయింట్ డెరైక్టర్‌కు లేఖ రాసి, ప్రాథమిక విచారణ ప్రారంభించాలని కోరారు. వనరుల కొరత వల్ల ప్రాథమిక విచారణ సాధ్యం కాదని జేడీ మరోసారి తేల్చి చెప్పారు. హైకోర్టులో ఐఎంజీ దాఖలు చేసిన పిటిషన్ వల్ల ఈ కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ యువజన సర్వీసుల శాఖ అడ్వొకేట్ జనరల్‌కు సమర్పించింది. ఈ రికార్డులను ఇవ్వాలని సీఐడీ అధికారులు యువజన సర్వీసులశాఖను కోరారు. వాటికి సీఐడీకి అప్పగించాలని అడ్వొకేట్ జనరల్‌ను యువజన సర్వీసులశాఖ కోరింది. అయితే రికార్డులు హైకోర్టు రిజిస్ట్రీ కస్టడీలో ఉన్నందున, కేసు తేలేంతవరకు వాటిని వెనక్కి ఇవ్వడం సాధ్యంకాదని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. వాస్తవానికి ఐఎంజీ వ్యవహారంలో ప్రభుత్వం ఢిల్లీ స్పెషల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ జీవో జారీ చేసింది. సీబీఐ ఇటీవలి కాలంలో అనేక కేసుల్లో దర్యాప్తులు చేపట్టి, చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. కాబట్టి గతంలో వనరుల కొరత అంటూ సీబీఐ చేసిన వాదన ఇప్పుడు ఎంత మాత్రం చెల్లుబాటు కాదు’’ అని ఆ కౌంటర్‌లో వివరించారు. తన కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుని, ఈ కేసులో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు.

36 Comments

Filed under Uncategorized

36 responses to “ఐఎంజీ వ్యవహారంపై మీ వైఖరేమిటి?

 1. Swaroop Reddy

  Om Sai Ram
  Sri Sai Ram
  Jai Sai Ram

  May Sai Baba bless Jagan and help him get his bail today.
  Johar YSR

 2. CVReddy

  http://amruthamathanam.blogspot.in/

  నారా లోకేష్ తొలి రాజకీయ ప్రకటన — అక్షర సత్యం

  కాంగ్రెస్స్ ను ఎదుర్కొనే సత్తా మాకే ఉంది ..చిత్తూరులో నారా లోకేష్ ( చంద్రబాబు కుమారుడు )

  – రాజకీయాలకు కొత్త అయినా , ఏ ఉద్దేశం తో చెప్పినా బాగా చెప్పావు లోకేష్ .. తెలంగాణాలో తెరాస , సీమంద్రలో జగన్ మొదటి స్థానం లో నిలుస్తారని సర్వేలు చెబుతున్నాయి . రెండవ స్థానం కోసం కాంగ్రెస్స్ తో పోటీ పడే సత్తా మీకే ఉంటుంది .

 3. pavithra

  Tribute to YSR

 4. vissu

  yello media kathanam entante… YV Subbareddy vaallatho padaka Konda couple hurt ayyaarani raasaaru… one month back … Prakasam district lo Markapuram area lo anukuntaa YS vigrahaavishkarana nu Balineni Surekhammma tho cheyinchi…. “Konda surekhamma ku home ministry ivvaalani Jagan ku cheppaanu .. ” ani cheppadu.. Balineni ,YV are close relatives… inka Konda family ki YV family ki godavaleppudu jariginaayoo yello media ke teliyaali….

  • MSR_YSR

   Upset is BCz errabelli dayakar rao’s brother Pradeep Rao joined YSR Congress. Errabelli tortured Konda couple with so many cases during TDP rule and also he worked against them in recent bielections. I think we should have avoided this guy…..

   • Karthik

    It has become a norm to accept such leaders who were opposed to YSR and YS loyalists and filed court cases, did slander using media etc. against YSR. Dayakar Rao’s brother is a small fish. Vuppunuthala, Harirama Jogaiah, Mysura Reddy, Kodali Nani, PJR’s daughter… the list is never ending. I hope it stops and YSRCP becomes more selective about whom to accept. Earlier, Jagan used to be very selective about who to accept in the party. These days, it seems to be free for all. After Jagan has been jailed, the situation seems to be worsening.
    I dread the day DLR, Shankar Rao and KK get a red carpet welcome into the party.
    I firmly believe that there is no use of accepting such people into the party. They may gain because of YSRCP but the party won’t gain anything. In fact it might lose a little because of such people.

    • Vijay Nalabolu

     I don’t think YSRCP begged these people to join the party. It is their wish and anything is possible in politics. You are talking as if these are the only people joined YSRCP.There are many who are not in media but in public.

     • Karthik

      I know that anything is possible in politics. That is why I said I am dreading the day DLR, Shankar Rao, KK etc. get a red carpet welcome into YSRCP. I didn’t say or imply that these are the only people who joined the party. But I was hoping that YSRCP would be different from other political parties and stay away from the adage “anything can happen in politics”.
      Also, I disagree that “it is their wish” to join the party. The party also should wish. It is not a free for all party where politicians with a poor background and poor image among people can come and join whenever they wish.
      It is not a fair comparison to compare these politicians with common people who may not have voted for YSR in 2009. Nobody will be hurt by letting common people join.

    • nlr2014

     It might be ok to take in few leaders from Telangana but we need to be cautious in Seemandhra about whom we accept.

 5. rakesh

  http://www.andhraheadlines.com/state/kcr-goes-about-offering-merger-to-cong-bosses-4-105486.html

  Seems kcr to follow footsteps of mega chiru
  falling at the feet of sonia to merge his party with her for T state
  cbn meeting delhi bosses for his safety…etc

  Only one man stands against delhi congress
  its anybody guess

 6. CVReddy

  ఎవరడిగారు.. ఎవరికిస్తారు?
  http://www.andhrabhoomi.net/content/yevaradigaru

 7. Swaroop Reddy

  Jagan Confident Of Getting Bail This Time!

  YSR Congress party president Y S Jaganmohan Reddy’s bail petition in the Supreme Court will come up for hearing on September 14 and this time, he is said to be pretty confident that he would get the bail.

  According to highly placed sources, the Central Bureau of Investigation which has filed a counter in the Supreme Court is said to have put up a relatively weak defence while requesting the court not to grant him bail.

  “The counter petition does not have strength. The CBI has argued that Jagan is an influential politician with his business empire spreading over all parts of the country; and hence, he can influence the witnesses. But the court has not showed any evidence as to how he can influence the witnesses, as investigation in most of the cases is completed,” a legal source in Delhi said.

  One does not know whether it is a deliberate attempt by the CBI to put up a weak counter or it really does not have the strong points to oppose the bail, but there is every possibility that the Supreme Court might grant bail to Jagan this time. Hope, he would breath it easy at least after four months!

  • CVReddy

   AP High Court also said CBI didn’t show any evidence that Jagan had tampered evidence or threatened witnesses.

  • Karthik

   CBI has not shown evidence of Jagan influencing the investigation even in the past. By that standard, their counters were always weak. But does that matter? All this would have mattered if we had sincere judges who go by the constitution. Unfortunately such judges have become extremely rare.
   It is unlikely that we would come across such judges even this time. As long as this Pseudo Gandhis are heading the government, they will influence judges and keep Jagan in jail.

   • Karthik

    I think it is best if we don’t depend upon Jagan coming out on bail. We have to be patient until 2014 when the judiciary may be allowed to act independently. It is almost certain that in 2014, YSRCP is going to be a big force even at the central level. We can clean up judiciary. Along with agriculture, railways, we should union law ministry also.

 8. PSK

  There is every possibility that TDP and CONGI will try their level best to (stoop low to such a level) SPLIT our party or bring differences between our leaders …….
  Neechaati neechamaina kaarya kalaapaalu chestaaaru…..
  Just like they SPLIT anna’s team…….
  It is the testing time for our party from now to the 2014 elections……
  It has to withstand and stay credible……
  I need to Re-think in case Konda couple leaves us…????

 9. PSK

  What’s happening in our Party……
  What’s wrong with the Leadership…..
  Resolve this ASAP…..
  Credibility at stake…..
  At any cost we CAN NOT LOOSE Konda Couple, Ambati and Bose Gaaru…..

  • CVReddy

   Don’t worry.Nobody leaves us.

    • nlr2014

     Why would anyone leave YSRCP that is going to come to power ??
     When even some enemies and yellow fanatics are eagre to join us !!
     No family is perfect and differences can be resolved.

     • nlr2014

      Did anyone predict that PJR’s daughter, Vuppunuthala or Kodali Nani to join YSRCP ?? But the yellow papers never talk about this bcs there are many more to follow them.

     • PSK

      “Why would anyone leave YSRCP” …..
      I don’t like this type of argument as clearly there is arrogance in it….
      Konda couple are not after the Power….It proved time and again….Why would they leave Govt n Power and even MLA ….. sacrifice so much for Jagan….We should not be OVER-CONFIDENT at all…..!!

      • PSK…

       KONDA FAMILY gurinchi manaku theliyadaaa????

       POWER…MINISTRY…MLA…..MLC….ilaaa anni kevalam….YSR and JAGAN kosam vadilesaaaru……alaanti vaaallu manalni vadili vellipothaarani yelaa nammuthunnaaru???

       asalu alaanti doubt manaku vachinaaa thappe…..

       YELLOW BATCH yedo raaasthundi….vaatini pattukuni KONDA FAMILY ni anumanisthe yelaaa??????

       • PSK

        It’s like a chicken and egg….!!!
        Let’s leave it to the party…..
        We are just an ordinary worker/supporter…
        I am from Vijayawada, but die-hard supporter of Konda couple…..

       • nlr2014

        @PSK

        Most people in this blog are confident but not overconfident of the future.
        It is the way u interpret things. We dont have to be arrogant to be confident. The main purpose of yellow media is to raise the anxiety by writing gossips. Some fall into that trap and some dont.
        All of us here have respect for Konda couple.

 10. CVReddy

  http://greatandhra.com/viewnews.php?id=40512&cat=15&scat=16

  Naidu Is Lucky; He Is Still Getting Party Funds!
  We have often heard Telugu Desam Party president N Chandrababu Naidu crying like a poor soul, stating that his party does not have financial resources to match that of the Congress party and even newly-formed YSR Congress party.

  However, that was proved false with the release of a report by Association of Democratic Rights (ADR) and National Election Watch after analysing the income-tax returns and donations received by the political parties on Monday.

  The TDP tops all the political parties in the state with a collection of Rs 53.9 crore from industrialists and infrastructure companies in the form of party funds since 2005. Of course, the Congress and the Bharatiya Janata Party being the national parties got the lion’s share with Rs 2,008 crore and Rs 994 crore respectively. In the state, the TDP is followed by Telangana Rashtra Samithi, which has got Rs 10.3 crore in five years; of course it has a reason because it can ruin the happiness of industrialists by taking up agitations for separate state.

  What is more interesting is that the TDP continues to get party funds from industrialists though it does not have big chances of coming to power. And in the next elections, analysts say, the TDP does not have the chance even to be the main opposition party. Yet, there are industrialists who fund the TDP. That way, Naidu should be considered a lucky man!

 11. vissu

  jalayagnam dhanayagnam ani comments chesina yello mafia gaallandariki answer : http://eenadu.net/district/inner.aspx?dsname=Mahabubnagar&info=mbn-panel1

 12. CVReddy

  లేఖ ఇస్తే నష్టం… ఇవ్వకుంటే కష్టం
  http://www.andhrabhoomi.net/content/lekha-0
  హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని కేంద్రానికి లేఖ రాస్తే పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువని, ఒక వేళ లేఖ ఇవ్వకపోతే మరింత నష్టం తప్పదని సీమాంధ్ర నాయకులు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు తేల్చి చెప్పారు. తెలంగాణపై లేఖ ఇవ్వడానికి సీమాంధ్ర నాయకుల అభిప్రాయ సేకరణను చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. సీమాంధ్ర సీనియర్ నాయకులు కోడెల శివప్రసాదరావు, యనమల రామకృష్ణుడు,కాలువ శ్రీనివాస్,సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కె.ఇ.కృష్ణమూర్తి చంద్రబాబుకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సీమాంధ్ర నాయకులంతా తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబుకు స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయనకు సూచించారు. ‘డిసెంబర్ తొమ్మిదిన కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయాన్ని ప్రకటించగానే మేమంతా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఉద్యమించాం.ప్రజలు రోడ్డుమీదకు వచ్చి ఉద్యమించారు.ఇప్పుడు ఎవరు అడుగుతున్నారని లేఖ ఇవ్వాలనుకుంటున్నారు’ అని కె.ఇ. కృష్ణమూర్తి,సోమిరెడ్డి తదితరులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో లేఖ ఇవ్వడం వల్ల సీమాంధ్రలో పార్టీ నష్టపోతుందని అన్నారు. లేఖ వల్ల పార్టీకి కలిగే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ అని నాయకులు తెలిపారు. ఇదే సమయంలో ‘లేఖ ఇవ్వనున్నట్టు మీరు సూచన ప్రాయంగా వెల్లడించారు.తెలంగాణ టిడిపి నాయకులు సైతం మీరు లేఖ ఇస్తున్నట్టు పదే పదే ప్రకటనలు చేశారు.ఇప్పుడు లేఖ ఇవ్వకపోతే పార్టీకి మరింత నష్టం’అని వారు అన్నట్టు తెలిసింది. వీరి వాదన విన్న చంద్రబాబు ‘ అందుకే మీ అందరి అభిప్రాయాలను కోరుతున్నాను.వాటి ప్రాతిపదికగానే లేఖపై నిర్ణయం తీసుకుంటాను’అని బదులిచ్చారు. ఈ అంశంపై మంగళ, బుధవారాల్లో పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తానని ఆయన వెల్లడించారు. ‘మేం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామనే విషయాన్ని చంద్రబాబుకు గట్టిగానే చెప్పాం. పార్టీ మేలు కోరి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదిస్తాం’ అని సీనియర్ నాయకుడొకరు తెలిపారు.
  కాగా, తెలంగాణపై లేఖ ఇవ్వాలని చంద్రబాబు ముందుగానే నిర్ణయం తీసుకున్నారని, ఈ దశలో అభిప్రాయ సేకరణ వల్ల ప్రయోజనం ఏమిటని ఓ సీనియర్ నాయకుడు ప్రశ్నించారు. కేవలం తెలంగాణ గురించే కాకుండా సీమాంధ్ర ప్రయోజనాలను కూడా లేఖలో ప్రస్తావించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీని వల్ల తెలుగుదేశం పార్టీ రెండు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రెండు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తోందనే సందేశం జనంలోకి వెళుతుందని వారు స్పష్టం చేశారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s