చంద్రబాబు సారుకు బహిరంగ లేఖ..

http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=53071&Categoryid=11&subcatid=24

గౌరవనీయులైన చంద్రబాబు గారికి,

సార్, ఈమధ్యకాలంలో పేపర్‌లో మీ ప్రసంగాలు చదివినప్పుడు, టీవీలో మీ ప్రసంగాలు విన్నప్పుడు, నా భర్త తరచు అనే మాటలు నాకు గుర్తుకు వచ్చాయి- ‘ఈరోజు రాజకీయాల్లో విలువలు లేని పరిస్థితి చూస్తున్నాము’ అని. అదెంత నిజమో ఇప్పుడు తెలుస్తోంది! మీరు మీ ఎంపీలను చిదంబరం దగ్గరికి పంపి నా భర్తకు రావాల్సిన బెయిల్‌ను అడ్డుకున్నారు. మీ నీచ రాజకీయాలకోసం సీబీఐతో, కాంగ్రెస్‌తో చేతులు కలిపి, మీ గోబెల్స్ ప్రచారకులను, కొన్ని ఎల్లో పత్రికలను, ఛానల్స్‌ను వాడుకుని, జగన్ మీద, మా కుటుంబం మీద మీరు కరడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ కంటే అన్యాయంగా ప్లాన్స్ వేసి, నా భర్తను మా నుండి, మా పిల్లల నుండి, ప్రేమించే ప్రజల నుంచి ఎంతకాలం వీలైతే అంతకాలం దూరంగా వుంచాలని నిత్యం ప్రయత్నిస్తున్నారు. నా భర్తను జైలు లోపల వుంచి, ఆయన మీద ఎన్ని అబద్ధాలు వీలైతే అన్ని అబద్ధాలు మీరు, మీ గోబెల్స్ ప్రచారకులు, మీ ఎల్లో గ్యాంగ్ కలిపి ప్రచారం చెయ్యాలనుకుంటున్నారు.

ఒక మనిషి ఎదుట లేనప్పుడు ఆ మనిషి గురించి తప్పుగా మాట్లాడడం కుసంస్కారం అని మాకు తెలిసిన, మాకు నేర్పిన విలువలు సార్! మరి మీరు నిజాలు కాదు… ఆ మనిషి లేనప్పుడు ఏకంగా అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. అది మీ స్థాయికి, మీ వయస్సుకు తగదు సార్. మిమ్మల్ని ఎందరో ప్రజలు గమనిస్తున్నారు. మీ నుంచి భావితరాలు ఎన్నో నేర్చుకోవాలి. అందుకే ఇటువంటి విలువలు లేని రాజకీయాలను భావితరాలకు నేర్పకండి. ఇప్పటికైనా విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం మానండి. మనిషి ఎదురుగా వున్నప్పుడు పోరాడితే అది ఒక సమఉజ్జీ పోరాటం అవుతుంది. అంతేకాని ఇలా దొడ్డిదారిగుండా ఒకరిని తగ్గించి, మనలను మనం పెంచుకోవాలనుకోవడం వీరుల లక్షణం కాదు సార్. అది నా దృష్టిలో పిరికివారు, నయవంచకులు, వెన్నుపోటుదారులు వాడే మార్గం సార్.

సార్, ఈరోజు మీరు నా భర్త స్థాపించిన వ్యాపారాల గురించి మాట్లాడుతున్నారు. నా భర్త స్థాపించిన రెండు కంపెనీలు – భారతి సిమెంట్, జగతి పబ్లికేషన్స్ రెండూ దేశంలోనే అగ్రగామిగా, మన రాష్ట్రానికి వన్నె తెచ్చేవిగా, ఈరోజు నిలిచాయంటే దానికి కారణం -దేవుని దయ, నా భర్త యొక్క అంకితభావం!

ఈరోజు ఆ రెండు కంపెనీలు ఆధారంగా 30,000 పైచిలుకు కుటుంబాలు బతుకుతున్నాయి. మీకు జగన్ మీద, మా మామగారి మీద వుండే కక్షపూరితమైన మనస్సుతో ఈ 30,000 కుటుంబాలకు అన్యాయం చేసే నీచ రాజకీయాలు మానండి.

సార్, తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఒకానొకప్పుడు దేశ రాజకీయాలను నిర్దేశించిన వ్యక్తిగా, మన రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష ముఖ్యనాయకుడుగా వున్న మీ ద్వారా ప్రజలకు, నాలాంటి ఈ రాష్ట్ర ఆడబిడ్డలకు మంచి జరగాలి కానీ, మీ మూలంగా నాలాగా ఏ ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో కన్నీరు పెట్టకూడదు సార్! నాలాంటి ఆడబిడ్డల కన్నీరు మీకు మంచిది కాదు… మన రాష్ట్రానికి అంతకన్నా మంచిది కాదని చెప్తూ…

వయస్సులోను, అనుభవంలోనూ మీకంటే చిన్నదాన్ని అయిన నేను రాయడం తప్పుగా భావిస్తే క్షమించమని కోరుతూ…
విలువలుగల రాజకీయాల కోసం నా భర్త నిలబడినట్టుగా మీరు కూడా నిలబడాలని మనస్పూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

yours sincerely,
Y.S. Bharathi

14 Comments

Filed under Uncategorized

14 responses to “చంద్రబాబు సారుకు బహిరంగ లేఖ..

  1. Adnan

    KCR’s speech says it all. He is panic of YSRP wave in Telangana.

  2. nlr2014

    Day 39 ….Prajaprasthanam …Neerajanam.

  3. CVReddy

    హంద్రీనీవా కల నిజమవుతోన్న వేళ

    http://www.andhrabhoomi.net/content/handri-neeva-7

    అనంతపురం, నవంబర్ 24 : కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు వరదాయని హంద్రీనీవా. నాడు అదొక కల.. నేడు నిజమయ్యింది. శ్రీశైలం రిజర్వాయర్‌లోని మిగులు జలాలను వినియోగించుకొనేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది.

    మొదట్లో ఇది సాధ్యమేనా అని అనుమానించిన వారున్నారు.. ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించిన వారున్నారు.

    ఇది దేశంలోనే అత్యంత పెద్ద ఎత్తిపోతల పథకం కావడమే ఇందుకు కారణం. తెలుగుదేశం పార్టీ హయాంలో దీనికి రూపకల్పన జరిగినప్పటికీ శంకుస్థాపనలకే ఇది పరిమితమయ్యింది.

    2004వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకానికి ఊపిరి పోశారు. దీనితో 2005వ సంవత్సరం నుండి పనులు వేగం పుంజుకున్నాయి. కర్నూలు జిల్లాలోని మల్యాల నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి జలాశయానికి కృష్ణా జలాలు తీసుకువచ్చి జిల్లా కరువుకు శాశ్వత పరిష్కారం చూపేందుకు హంద్రీనీవాకు రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావించారు. మొదటి దశలో 291.83 మీటర్ల ఎత్తుకు, రెండవ దశలో 78 మీటర్ల ఎత్తుకు వెరసి 369.83 మీటర్ల ఎత్తు వరకు వరుస ఎత్తిపోత కేంద్రాల ద్వారా నీరు సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందించారు. దీనితో ఇది ఆసియాలోనే భారీ ఎత్తిపోతల పథకంగా గుర్తింపులోకి వచ్చింది. ఇక వరుస పంపింగ్ స్టేషన్లతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. మొదటి దశకు రూ.2783.05 కోట్లు ఖర్చు చేశారు. మొదటి దశలో 1,98,000 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని, 120 గ్రామాలలోని 10 లక్షల జనాభాకు తాగునీటిని అందించడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క
    అనంతపురం జిల్లాలోనే 1,18,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

  4. vissu

    కర్నూలు, నవంబర్ 24: ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు తమ ఘనత వల్లే పూర్తయిందని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పథకానికి నిధులు విడుదల చేసి పనులు ప్రారంభింపజేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆ ఘనత దక్కకుండా చేయాలని అగచాట్లు పడుతున్నారు. ఆయన పేరును ప్రస్తావించాల్సిన చోట ‘2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక’ అని ప్రసంగిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని హంద్రీ-నీవా కాలువ వెంట భగీరథ విజయయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి రఘువీరారెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వస్తున్న కేంద్ర మంత్రులు, రాష్టమ్రంత్రులు, ఎంపిలు ఇతర నేతలు హంద్రీ-నీవా పథకం దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కరరెడ్డి వల్లే సాధ్యమైందని ప్రచారం చేస్తున్నారు. చివరకు తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి శనివారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఇదే విషయాన్ని ప్రస్తావించడం కొసమెరుపు. ప్రాజెక్టు గురించి తన బాణీలో మాట్లాడినప్పటికీ సారాంశం మాత్రం అదేనని స్పష్టమవుతోంది. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం తొలిదశ ప్రారంభం రోజున కూడా ముఖ్యమంత్రి కిరణ్ హంద్రీ-నీవా పథకం సాధన వెనుక దివంగత నేతలు ఎన్టీఆర్, కోట్ల విజయ భాస్కర రెడ్డిల పేర్లు ప్రస్తావించి వైఎస్ పేరును విస్మరించారంటూ వైకాపా నాయకురాలు షర్మిల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హంద్రీ-నీవా పథకానికి ఎన్టీ రామారావు పేరు పెట్టారని, కోట్ల విజయభాస్కరరెడ్డి సమగ్ర నివేదిక కోసం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సిఎం కిరణ్ పేర్కొన్నారు.
    2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హంద్రీ-నీవా పథకానికి రూ.7వేల కోట్లు ఖర్చుతో మొదటి దశ పనులు పూర్తి చేసి రైతులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. పనులు పూర్తవడంతో భగీరథ విజయయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన మంత్రి రఘువీరా రెడ్డికి సంఘీభావం తెలుపుతున్న నేతలు ఎక్కువగా కోట్ల పేరు ప్రస్తావిస్తున్నారు మినహా ఇతర పేర్లను ప్రస్తావించక పోవడం గమనార్హం. నిజానికి 2004లో వైఎస్ అయ్యాక అప్పటికి ప్రతిపాదనల్లో ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టు ఫైళ్ల బూజు దులిపి అవసరమైన అనుమతులు మంజూరైన విషయం అందరికీ తెలిసిందేనని వైకాపా నాయకులు కాంగ్రెస్ నేతల ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు. ఇపుడు కోట్లకు కీర్తి తీసుకువచ్చే ప్రయత్నం చేసినా ప్రజల నుంచి వ్యతిరేకతే వస్తుంది మినహా ప్రయోజనం శూన్యమంటున్నారు. ఈ పథకం పూర్తయి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందడానికి ఎన్టీఆర్, కోట్ల కృషి కన్నా పనులు చేపట్టి పూర్తి చేసిన ఘనత వైఎస్‌దేనన్న విషయం సీమ ప్రజలందరికీ తెలుసంటున్నారు. కొన్ని ప్రయోజనాల కోసం ఈ వాస్తవాన్ని దాస్తే మాత్రం దాగుతుందా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం కోసం ఎవరేం చేశారో జనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నారనుకుంటే వారి భ్రమ అని హంద్రీ-నీవా ఘనత వైఎస్‌కు దక్కకుండా చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామంటున్నారు. మొత్తం మీద హంద్రీ-నీవా పథకం ఇపుడు ఓట్ల వేటలో ప్రధాన అంశంగా మారిందని విశే్లషకులు సైతం పేర్కొంటున్నారు.

  5. NLR

    Day 38 …Prajaprasthanam.

    http://m.youtube.com/watch?v=Y73yOHwZpp4

    Neerajanam continues.

  6. Is Chandrababu also joining YCP?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s