The long walk to poll race in Andhra

79 Comments

November 26, 2012 · 1:12 AM

79 responses to “The long walk to poll race in Andhra

  1. CVReddy

    http://amruthamathanam.blogspot.in/
    నరేంద్ర మోడీ.. నారా బాబు
    గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని పోలికలు ఉన్నాయ. బాబు కన్నా మోడీ వయసులో ఆరునెలలు, రాజకీయాల్లో పదేళ్లు చిన్న . కానీ రాజకీయ ఎత్తుగడల్లో ఆరాకులు ఎక్కువే చదివారు. 1950 ఏప్రిల్‌లో బాబు జన్మిస్తే, అదే సంవత్సరం సెప్టెంబర్‌లో మోడీ జన్మించారు. 1978లో కాంగ్రెస్ ఐ ద్వారా బాబు రాజకీయ జీవితం ప్రారంభమయితే, 1987లో బిజెపి ద్వారా మోడీ రాజకీయ జీవితం ప్రారంభం అయింది. బాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

    బాబుకు అనుకూలంగా దాదాపు ప్రపంచ మీడియా మొత్తం ప్రచారం చేయగా, మోడీకి వ్యతిరేకంగా అదే స్థాయిలో ప్రచారం సాగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ అనుకూలంగా కావచ్చు, వ్యతిరేకంగా కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ప్రచారాన్ని పొందింది ఈ ఇద్దరు నాయకులే. మన రాష్ట్రానికి చెందిన సామాజిక శాస్తవ్రేత్త ఒకరు ఒక విషయాన్ని పదే పదే చెబుతుంటారు. 2004లో మన రాష్ట్రంలో, గుజరాత్‌లో దాదాపు ఒకే సమయంలో ఎన్నికలు జరిగాయి. మీడియా బాబుకు అనుకూలంగా విస్తృతంగా ప్రచారం చేసింది, మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మీడియా విస్తృత ప్రచారం చేసింది. కానీ చిత్రంగా వ్యతిరేక ప్రచారాన్ని ఎదురీది మోడీ విజయం సాధించగా, అనుకూల ప్రచారం ఉన్నా బాబు ఓడిపోయారు. అమెరికా అధ్యక్షుడు సైతం నా పాలన చూసి మురిసిపోయారు అని ప్రచారం చేసుకున్న బాబు ఓడిపోగా, అమెరికా వీసా ఇవ్వకుండా అవమానించిన మోడీ మాత్రం ఘన విజయం సాధించారు. బాబు పాలనపై క్లింటన్ సెనెట్‌లో సైతం ప్రస్తావించారు అని తెలుగు మీడియా ప్రచారం చేసినా బాబుకు విజయం చేకూర్చలేకపోయారు. మోడీని తమ దేశానికి రాకుండా అమెరికా అడ్డుకున్నా ఆయన విజయాన్ని అడ్డుకోలేక పోయింది.

    మీడియానో, అమెరికానో కాదు ఓటు వేసే ప్రజలే హీరోలు అని గుజరాత్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్టమ్రైనా పదే పదే నిరూపిస్తూనే ఉంది. మీడియా ప్రచార ప్రభావంపై ఈ ఇద్దరు నాయకుల ఫలితాలను అధ్యయనం చేయాల్సిన అంశమే. గుజరాత్ అల్లర్ల సమయంలో రాజధర్మం గురించి మోడీకి అప్పటి ప్రధాని వాజ్‌పాయి వివరించే సరికి, ఆయన్ని మారుస్తారేమో అనే ప్రచారం జరిగింది. గాలికి పోయే పిండిని కృష్ణార్పణం అన్నట్టుగా ఆ క్రెడిట్ తాను కొట్టేయడం ద్వారా మైనారిటీల ఓట్లను సాధించవచ్చునని బాబు భావించి, మోడీని తొలగించాల్సిందే అని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం బాబు మద్దతుతోనే నిలబడ్డా, బాబు డిమాండ్‌ను మాత్రం వాళ్లు పట్టించుకోలేదు. బిజెపి వ్యవహారాల్లో ఇతర పార్టీల జోక్యం ఏమిటి? అని బిజెపి నాయకులు నిలదీశారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చమనడానికి ఇతర రాష్ట్రాల వారికున్న హక్కేమిటని గుజరాతీలు ప్రశ్నించారు. చివరకు గుజరాత్ అల్లర్ల వివాదం మోడీని గుజరాత్‌లోనే కాదు దేశంలోనే బలమైన నాయకుడిగా నిలిపింది. మీడియా ప్రచారాన్ని చూసి కొందరు బిజెపి నాయకులు ఏవేవో ఊహించుకుని బిజెపిలో తిరుగుబాటు తీసుకు వచ్చి పార్టీ నుంచి బయటకు వెళ్లి , కొత్త పార్టీ పెట్టి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి అడ్రస్ లేకుండా గల్లంతయ్యారు. మోడీ బలాన్ని సరిగా అంచనా వేయలేకపోయామని తరువాత ప్రకటించారు.

    ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఒక నాయకుడు విజేతగా నిలవాలన్నా ప్రజల మద్దతుతో తప్ప అమెరికా అండతోనో, మీడియా మద్దతుతోనో సాధ్యం కాదని మోడీ నిరూపించారు. మోడీని దించాల్సిందే అని పట్టుపట్టిన బాబు ఎనిమిదేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉండి, అధికారం కోసం సుదీర్ఘ పాదయాత్ర చేస్తుండగా, మోడీ మాత్రం నాలుగవ సారి ముఖ్యమంత్రి పదవి అధిష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.

  2. JUST I GOT ONE MORE SMS, THAT SURVE FOR ONLY RAMOJI FILM CITY, NOT FOR ENTIRE STATE, THEY ARE NOT CONSIDERING AP PEOPLE, THEY ARE CONSIDERING ONLY YELLOW GUYS.

    • nlr2014

      They live in a world of their own. They have lost touch with reality since 2003 . Let them enjoy with their SMS’s atleast !!
      TDP …2003 …going …2009….going …2014…Gone .

  3. KAREEM

    JUST I GOT A SMS FROM MY YELLOW FRIEND, TDP GOING TO WIN 285 SEATS (EXCEPT VIJAYAMMA, KCR + 7 MIM)
    THIS IS FROM YELLOW SERVE

  4. Adnan

    Watch the Assembly proceedings today.
    Asad bhai is all out praise to Dr YSR

    Because of MIM support, TRS is tilting now towards NDA. We can best use of MIM support gain larger audience in T region. I am sure there are larger section of people ignored by TRS and looking for good alternative.

  5. vissu

    ఎటూ తిరిగి 2 లేదా 3 నెలలలో జగన్ కు బెయిల్ గ్యారంటీ (.హైకోర్ట్ లో బెయిల్ వస్తుందని ఆశిస్తున్నా )గా వస్తుందని కాంగ్రెస్, తెదేపా అధిష్టానాలకు తెలిసి రాహుల్ గాడు కొత్త డ్రామా కు తెర దీసాడు…వాడికి అవసరం వస్తే వాడు చంద్రబాబు గాడి కాళ్ళు కూడా పట్టుకుంటాడు.. 2009 ఎలేక్షన్స్ అప్పుడే వాడు ఒరిసా టూర్ లో చంద్రబాబు..మా బాబే అని వాగినాడు.. ఇపుడు వాడి టార్గెట్ ఏంటంటే ఆంధ్ర లో అటు కాంగ్రెస్ అన్నా రావాలి లేదా తెదేపా అన్నా రావాలి అని వాడి ప్లాన్.. జగన్ గెలిస్తే వాళ్లకు లొంగడు అనేవిషయం వాడికి బాగా తెల్సు.. “యాంటి కాంగ్రెస్” వోట్ ఏ రకం గా జగన్ కు ప్లస్ అయిందో దానిని దెబ్బ తీయడానికి వాడు ఇలా ప్రచారం చేయిస్తున్నాడు.

  6. Venkata Reddy

    The trouble started when Jagan quoted Sonia Gandhi among potential allies and got exacerbated when Vijayamma garu said time will decide in that PTI interview. Jagan should release a message stating that he is taking back his earlier statement that Sonia Gandhi is a potential ally. He should strongly state that YSRCP is equidistant from both NDA and UPA.

  7. nlr2014

    Day 44 …..Prajaprasthanam

    http://epaper.sakshi.com/apnews/Mahabub_Nagar/02122012/1

    Touching every village ..Conquering every heart.

    • చంద్రబాబు 420.. ఉమా 210.. రావి 105 వీళ్లా నన్ను ఓడించేది?

      11/30/2012 11:43:00 PM
      గుడివాడ, న్యూస్‌లైన్ : చంద్రబాబు 420 అయితే, ఉమా 210 అని, గుడివాడలో రావి శోభనాద్రి 105 అని ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అభివర్ణించారు. దేవినేని ఉమా పిచ్చి ప్రేలాపనలు ఆపకపోతే అసెంబ్లీలోనే చెప్పుదెబ్బలు తింటాడని హెచ్చరించారు. ఎన్నికల్లో తనను ఓడించగలిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. డిపాజిట్లు రాకపోయినా రాజకీయాల్లో ఉండటానికి తనది సిగ్గులేని జన్మ కాదని రావిని ఉద్దేశించి విమర్శించారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణమందిరంలో వైఎస్సార్ సీపీ గుడివాడ పట్టణ యువజన విభాగం కన్వీనర్‌గా లోయ రాజేష్ ఎన్నికైన సందర్భంగా జరిగిన అభినందన సభలో స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు.

      టీడీపీ, కాంగ్రెస్‌లకు నేడు ఏర్పడిన ఈ దౌర్భాగ్యపు పరిస్థితికి కారణాలు వెతక్కుండా.. చంద్రబాబు, సోనియాగాంధీ ఆత్మపరిశీలన చేసుకోకుండా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శించారు. టీడీపీ కుటుంబానికి అన్న ఎన్టీఆర్ నుంచి సంబంధం ఉన్నవాళ్లంతా నేడు ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని అన్నారు. చంద్రబాబు మాత్రం పాదయాత్రలంటూ తిరుగుతున్నారన్నారు. విజయమ్మ చెప్పినట్లు చంద్రబాబు స్వభావాన్ని బట్టే దేవుడు ఆయన్ని 420గా పుట్టించాడని ఎద్దేవా చేశారు. తాను రూ.30 కోట్లకు అమ్ముడుపోయానని, జగన్‌మోహన్‌రెడ్డి లక్ష కోట్లు తిన్నారని పలువురు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఆవేదన చెందారు.

      వారికి జనమే బుద్ధిచెబుతారు..
      అన్న ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపితే.. శవం లాంటి ఆ పార్టీని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బయటకు తీసి ఆక్సిజన్ ఇచ్చి బతికించారన్నారు. అటువంటి మహానేతల ఆత్మ క్షోభించేలా రెండు పార్టీలు వ్యవహరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ టిక్కెట్టిస్తే ఆయన పేరు చెప్పుకుని గెలిచిన రావి శోభనాద్రి చౌదరి ఆయనకే ద్రోహం చేసి, చంద్రబాబుకు అమ్ముడుపోయి వైస్రాయ్ హోటల్‌కు వెళ్లారని చెప్పారు. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసినందునే వారికి గత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు తగిన బుద్ధిచెప్పారని గుర్తుచేశారు.

      వీళ్లా నన్ను ఓడించేది..
      చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెలో మూడేళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. తన పార్టీ ఎమ్మెల్యేను గెలిపించుకోలేకపోయాడు.. గుడివాడలో రావి శోభనాద్రిచౌదరి తాను ఉంటున్న వార్డులో ఇప్పటికి నాలుగుసార్లుగా టీడీపీ కౌన్సిలర్‌ను గెలిపించుకోలేకపోయాడు.. వీళ్లా నన్ను ఓడించేది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు దేవినేని ఉమా బ్రోకర్ అని.. వైస్రాయ్ హోటల్ ఉదంతం నుంచే ఆ వృత్తి మొదలైందని పేర్కొన్నారు. వైఎస్ విజయమ్మపై, షర్మిలపై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హెచ్చరించారు. తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేసే నాయకులకు దమ్ముంటే అనర్హత పెట్టి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.

      జగన్‌ను ఆపే శక్తి ఎవరికీ లేదు…
      రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్ విజయాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని నాని స్పష్టం చేశారు. రైతులు, వృద్ధులు, విద్యార్థులు, వికలాంగులు అంతా వైఎస్సార్ కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పథకాలు అమలవుతాయని నమ్ముతున్నారని చెప్పారు.

      నోరు అదుపు చేసుకోండి..
      పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ దేవినేని ఉమా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నార ని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. ఆరోపణలు మాని టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో 16 నియోజకవర్గాలూ వైఎస్సార్ సీపీవేనని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీ, యువజన, మహిళా సెల్ జిల్లా కన్వీనర్లు పడమట సురేష్‌బాబు, అబ్దుల్ రహీం, తాతినేని పద్మావతి

  8. vissu

    కాంగ్రెస్ తెదేపా ల కొత్త డ్రామా నా… రాహుల్ గాడు ఎదో జగన్ తో రాజీ కోసం ప్రయత్నిస్తున్నాడు అని ఊరక ప్రచారం పుట్టిస్తున్నారు… పార్టీ గట్టి గా తిప్పి కొట్టాలి.. లేదంటే మనకు ఎఫెక్ట్…

    • CVR Murthy

      Categorical statement by YSRCP (officially ) that they would not merge or align with congress will put these rumors to rest.

      • we have told many times and vijayamma her self ruled it out with a signed copy to PTI. so these idiots will make anything an issue murthy garu… dont bother. if you want a signed copy i can put it in on the blog. but these fellow are bent diverting the present issue.

    • nlr2014

      When the crooks realise that they cannot win over the hearts of telugu people they tend to use all cheap tactics they have ,only to be hated further. They are well aware of what is coming in 2014 and they are helpless.

  9. saibaba

    why cant sakshi publish this surveys which will give moral boost to cadre ?
    mind games adakunda and also sharmila kuda ysr schemes ayina KG to pG free education,free electricity for farmers, runalu maffi chepochu ga..
    even sakshi cbn kg to pg free education anadi heading,sharmila congr +tdp kummu ,roju edena ? better vasthe yemichesthamo chepithe best,,, aa sakshi lo telisi rasthunaro,teliyakunda rasthunao kani, tdp vasthe yemi chesthado baga rasthunadu.

  10. sharath

    yedurappa resigns from bjp.. His single point agenda of becoming CM made karnataka unstable..

  11. vissu

    http://www.andhrajyothy.com/districtNewsShow1.asp?subCat=3&ContentId=32888&date=11/30/2012 కిరణ్ నాయకత్వాన్ని సహించడానికి పెద్దిరెడ్డి ఎలా విముఖత చూపుతున్నారో, పెద్దిరెడ్డిని కాంగ్రెస్‌లో కొనసాగించడాన్ని కిరణ్ కూడా అంతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజీనామా సందర్భంగా కిరణ్‌పై పెద్దిరెడ్డి చేసిన విమర్శలు… దీనికి కొన్ని గంటల ముందే పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా కిరణ్ తమ్ముడు కిషోర్ చేసిన విమర్శలు ఒకరితో ఒకరు తెగదెంపులు చేసుకోవడానికి ఇరువర్గాలు ఎంత కృత నిశ్చయంగా ఉన్నారో స్పష్టం చేస్తున్నాయి. పర్యవసానంగా పెద్దిరెడ్డి రాజీనామాను అనుమతించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.అందుకోసమే ఎదురుచూస్తున్న కూడా పెద్దిరెడ్డి ఉపఎన్నికను ఎదుర్కొనడానికి సమరోత్సాహంతో కదులుతున్నారు.

    దీంతో పుంగనూరు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. అదే జరిగితే వైసీపీ ఖాతాలో మరో ఎమ్మెల్యే స్థానం జమయ్యే అవకాశాలు కని పిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుల సొంత జిల్లాలో తమ బలాన్ని చాటుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    అధినేతల జిల్లాలో వైసీపీ పాగా!

    ముఖ్యమంత్రి.. మాజీ ముఖ్యమంత్రి. వీరిద్దరి సొంత జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అధినేతల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు వైసీపీ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఇప్పటిదాకా సఫలమవుతూనే ఉన్నాయి. చంద్రబాబును దెబ్బతీసేందుకు పలమనేరు, తంబళ్లపల్లె ఎమ్మె ల్యేలను వైసీపీ ఆకర్షించింది. వీరిద్దరు డిసెంబర్ లో ఆ పార్టీలో చేరబోతున్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా బలమైన అనుచర వర్గం కలిగిన పెద్దిరెడ్డి కూడా ఆ పార్టీలో చేరనున్నారు. సంక్రాంతి తిరువాత ఈయన అధికారికంగా వైసీపీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార, ప్రధాన ప్రతిపక్షా నికి చెందిన ముగ్గురు బలమైన ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లడంతో జిల్లాలో ఆ పార్టీల క్యాడర్ మానసిక స్థైర్యం కోల్పోవాలన్నది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది.

  12. vissu

    హైదరాబాద్, నవంబర్ 30: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ కచ్చితంగా ఇస్తామనే హామీ లేని నాయకులు మాత్రమే టిడిపిలో కొనసాగుతున్నారని, టికెట్‌పై హామీ లభిస్తే అంతా పార్టీ మార్చేవాళ్లేనని టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య తెలిపారు. టిడిపి సీమాంధ్ర నాయకులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో, తెలంగాణలో టిఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అసెంబ్లీ లాబీల్లో విలేఖరులతో అన్నారు. టిడిపికి నాయకులుంటే ఓటర్లు లేరనీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు ఉన్నారు కానీ బలమైన నాయకత్వం లేదని అన్నారు. పార్టీ మారుతున్న వారిని అమ్ముడు పోతున్నారని చంద్రబాబు చెబుతున్న దానిలో నిజం ఎంతో ఆయనే చెప్పాలని అన్నారు. తనకు రాత్రికి రాత్రే టికెట్ ఇచ్చారనీ, ఎంతకు కొన్నారో బాబు చెప్పాలని ఆయన అడిగారు. ప్రజల మద్దతు లేని బాబు వైపు ఉండలేకనే పార్టీ మారానని అన్నారు.http://andhrabhoomi.net/content/ysr

  13. vissu

    నెల్లూరు, నవంబర్ 29: నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి తనయుడు గౌతమ్‌రెడ్డి ఎన్నికల ఫలితాలపై ముందస్తు సర్వే నివేదికల్ని తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది వచ్చిన ఉప ఎన్నికల్లో తాము కీలకంగా వ్యవహరిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ భవితవ్యాన్ని ముందుగానే చెప్పేందుకు సర్వే నిర్వహించారు. సర్వేల ప్రకారం తయారైన అంచనాలు, పోలింగ్ అనంతరం వచ్చిన అభ్యర్థుల ఓట్లశాతం దాదాపుసారూప్యత కనిపించిందంటున్నారు. వాస్తవంగా చూస్తే మేకపాటి గౌతమ్‌కు ఇంకా ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం జరగనట్లే చెప్పాలి. గత కొనే్నళ్లగా తండ్రి రాజమోహనరెడ్డి ఎన్నికల బరిలో నిలిచినప్పుడల్లా ఈయన స్థానికంగా పర్యటనలతో హోరెత్తిస్తూ హడావుడి సృష్టిస్తున్నారు. ఆరునెలల క్రితం నెల్లూరు ఎంపీ ఉప ఎన్నికల్లో విస్తృతంగా పర్యటిస్తూ వయస్సుమీద పడ్డ రాజమోహనరెడ్డికి కాస్తంత ఊరటనిస్తూ కన్పించారు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేసే అవకాశాలున్నాయని భోగట్టా. అయితే ఈయన బరిలో నిలిచేది ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా అనేది ఇంకా ఇతమిత్థంగా తెలియరావడం లేదు. కాని అత్యంత ప్రామాణికంగా ఉండేలా సర్వేలు నిర్వహిస్తూ రాటు దేలుతుండటం తల నెరిసిన రాజకీయ పండితుల్ని సైతం విస్మరింపజేస్తోంది. అంతేగాక ఈయననుద్దేశించి పలువురు ‘జూనియర్‌లో సీనియర్’ అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలాఉంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బలమైన అభ్యర్థుల్నే బరిలో నిలపాలనే కసరత్తులోనూ మేకపాటి కుటుంబం ముందుంటోంది. కోస్తాంధ్ర జిల్లాల బాధ్యత పూర్తిగా నెత్తిన వేసుకున్నట్లు కూడా సమాచారం. ఇందులో భాగంగానే మేకపాటి గౌతమ్ కోస్తాంధ్ర జిల్లాలంతటా పార్టీ పరిస్థితి, బరిలో నిలవాల్సిన అభ్యర్థుల వివరాలను సేకరించారట. తమ పార్టీకి సగటు ప్రజానీకంలో నిలువెత్తు ఆదరాభిమానాలు తొణికిసలాడుతున్నా అభ్యర్థుల విషయంలోనూ ఏ మాత్రం పొరపాట్లకు తావివ్వకుండా అప్రమత్తంగానే వ్యవహరించాలని ఎంపి మేకపాటి భావిస్తున్నారు. అందువలనే గౌతమ్ కోరికను కాదనక రాజమోహనరెడ్డి ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు ముందస్తుగా సర్వేలు సాగుతున్నాయి. ఇలా చేయడం వల్ల రాజకీయంగా బహుళ ప్రయోజనాలుంటాయని కూడా భావిస్తున్నారు. ఎన్నికల్లో పెట్టుబడి అంశంలో వ్యూహాత్మకంగా వ్యవహరించనేది విశే్లషణ. అందుకనే మొన్నటి ఉప ఎన్నికల్లో తమ ప్రత్యర్థి ప్రతి ఓటరుకు రూ. ఐదొందలు వంతున నజరానా అందజేసినా మిన్నకున్నట్లు తెలుస్తోంది. తమకూ అదేవిధమైన హంగులు ప్రదర్శించగలిగే సామర్ధ్యం ఉన్నా వెనుకడుగు వేయడానికి కారణమదేనంటున్నారు.

  14. Adnan

    http://greatandhra.com/viewnews.php?id=42310&cat=10&scat=25

    Good one Somayajulu garu, Gurava & CVR Murthy.

    Yellow gang always boasts CBN with false credits. But the real fact is that he was always feeling unsecure at the beginning of his CM post. He grabbed the CM post by backstabbing from then popular mass leader. On fear that there could be backlash, he wanted to divert the attention of public from this episode and started false claims as if he developing the state rapidly.

  15. Ram

    http://greatandhra.com/viewnews.php?id=42310&cat=10&scat=25

    Unmasking of Naidu’s contributions to Hyderabad

    We often hear from our TDP friends and Chandrababu Naidu himself that he, Chandrababu himself was responsible for development of Hyderabad into a world class (?) city and IT revolution that had swept India and that cell phone technology was invented and brought to use of the public (?). Their claims belittle Al Gore’s claim of inventing Internet. These claims are incorrect and are deliberately misleading, and without any basis. Hyderabad was the fifth largest city in 1956 and was fifth largest city in 2004 and in 2012. Osmania University is a century old university.

    Immediately after India became independent, the Government took upon the responsibility of Industrial development of the country. As there were not too many private entrepreneurs available at that time, the Central Government started a large number of public sector units (PSUs). The PSUs awarded to AP included BHEL, HMT, HAL, BEL, Hindustan Cables, IDPL, NRSA, Nuclear Fuel Complex, ECIL, NMDC, STP, CMC, and NFDB. In addition, a large number of civil and defence research laboratories were also sanctioned by Central Government in AP including DMRL, DRDL, DLRL, DRDO, IICT, CCMB. For reasons best known to the Chief Ministers of those days, unlike in other states where the Central Government public sector units were widely dispersed all over the State, in our State all of them were set up in and around Hyderabad. The private sector came as ancillary to the PSUs and were set up in the proximity of PSUs naturally.

    It is because of IDPL, Hyderabad has emerged as the bulk drug capital of India. 90% of these pharmaceutical companies are located in Hyderabad and some of these ancillaries have grown into global companies with huge assets. All these developments took place when Mr Chandrababu Naidu was in his high school and, for him to claim any credit for these is like living in fool’s paradise.

    Similarly, the only public sector institutions that were engaged in software development in the country viz ECIL and Computer Maintenance Corporation (CMC) had their head quarters in Hyderabad. It was because of this that Narasimha Rao Government at the Centre, which saw an opportunity for the promotion of software industry in the country promoted six Software Technology Parks (STPs) in India in 1991 and Hyderabad got the first of these. Chennai did not get its own STP till recently. Satyam Computers which was India’s fourth larger software exporting companies was also promoted in early 1990s.

    Where and what was the position Chandrababu Naidu holding at that time? There is no greater dishonesty for him to claim any credit for the software development in Hyderabad. It so happened that when Y2K in Western world provided a great opportunity for software exports from India he was the Chief Minister of Andhra Pradesh (AP). If he was as efficient as his predecessors were, he should have grabbed the opportunity for making the state as the largest exporter of software from India, as in the case of bulk drugs. That did not happen and instead, Andhra Pradesh was ranked 3rd in software exports in 1995, i.e. before he became CM in September 1995, has slid to 5th position in 2004. The gap between the software exports of Bangalore and Hyderabad which was just Rs 250 crores in 1995-96 has widened to Rs 2,500 crores in 2003-04 i.e. when he left his seat. AP’s share of India’s software exports in 2003-04 was only 9% as against Karnataka’s 38%. Despite this, thanks to his extraordinary clout in media, he launched a nation-wide propaganda that Hyderabad was the IT Capital of India. Other States like Karnataka and Tamilnadu which have really done wonderful job had never claimed any credit for this. Unsurprisingly, a modest leader that Dr YSR was that he too never claimed any credit for improving AP’s share of 9% in India’s software exports in 2003-04 to 14% in 2008-09.

    The only credit Chandrababu can claim is for bringing ISB, but what is the ISB’s social and economic impact on the State or for that matter on Hyderabad? Who are the real beneficiaries of that institution? Unlike Chandrababu, Dr YSR promoted three IIITs, an IIT and 18 new Universities and unlike Chandrababu, Dr YSR always said that the credit must go to the children and their parents for their success in education and IT development. He always used to say that it’s not due to effort of the politicians, but because of the toil of parents and children that they go places and government only provides the facilities and avenues for the children. Big difference between Chandrababu and YSR.

    Chandrababu should be credited for donating 850 acres of prime land in Hyderabad with a market value of Rs 2500 crores to his close relative (Billy Rao) from Chittoor district for a deferred payment of Rs 400 crores in the midst of an Interim Government. The IMG Bharath to which said donation was made was a sham company with just one lakh rupees share capital. Similarly, Chandrababu gifted away 535 acres of prime land to EMAAR at Rs 29 lakh per acre although the fair market price was Rs 3 crores per acre in 2002, confirming the loot of the public property.

    Chandrababu also must be credited for closing down of prestigious state public sector units such as Allwyn, Nizam Sugar Factories and others of which most of them have been pocketed by his supporters. Yet, he claims to be an honourable man and all others unethical.

    D A Somayajulu, Member of Political Affairs & Central Governing Committees of YSR Congress Party, with Gurava Reddy (Atlanta), CVR Murthy (Hyderabad)

    • nagalakshmi

      Nenu same yee post naa facebook wall lo post chesanu “Ram” garu..konthamandi pichi ga matladutunnaru. nenu okkadanne fight chestunnanu.meeku ok ayithe meeru kuda comment pettandi. nagalakshmi pothireddy ani facebook lo search chesthe vastundi.

  16. purandhara

    vijayamma shuldn’t criticise with such kind of words…

  17. Kareem

    To Mr KTR…………..
    Addanga dochukunnadu MLA’s ni kontunnadu antunnav, nuvvu kooda paper, channel pettav ga, me ayya mutalu mosi sampadinchada.

    • nlr2014

      TRS is feeling the heat now. They know that they cannot fool Telangana people for a long time. They are panicking with the response Sharmila is getting. Soon there will be influx from TRS too.

  18. nlr2014

    Day 42 …Prajaprasthanam.

    http://m.youtube.com/watch?v=zjRg4FVpsXg

    Neerjanam continues inTelangana.
    Cong or its keep CBI has no influence in the Praja court.
    They will see a mind blowing result in less than 2 yrs time.

  19. nlr2014

    Jagan …Adugu vayyakundane ..Adhuruthunna adhikara peetam.

    http://indiatoday.intoday.in/story/jagan-mohan-reddy-ysr-congress-andhra-pradesh/1/235018.html

    Pulivendula …Puli bidda.

  20. NLR

    Day 40 …Prajaprasthanam.

    http://m.youtube.com/watch?v=UpFdKyNgYn0

    Touching every village..Conquering every heart.
    The journey goes on.

  21. CVReddy

    ముప్పయ్యవ ఏట అడుగిడుతున్న తెలుగుదేశం వన్నె తగ్గిన విజయవిశ్వాసం.
    http://amruthamathanam.blogspot.in/search/label/telugu%20desam

  22. vissu

    ఇలాగైతే పీలేరులో పోరు సాగించేదెలా?
    ఆంధ్రజ్యోతి – చిత్తూరు ‘మా కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబంతో రాజకీయ శత్రుత్వముంది… గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో సీఎం కిరణ్ కాంగ్రెస్ తరపున నిలిపిన తన ప్ర«ధాన అనుచరునికి మద్దతివ్వమని చంద్రబాబే మమ్మల్ని ఆదేశిస్తే మేమిక ఎవరికి చెప్పుకోవాలి? సొంత నియోజకవర్గంలో మా పరిస్థితేమిటి? పార్టీ క్యాడర్‌కు ఏమని సమాధాన మివ్వాలి? ముఖ్యమంత్రిపై పోరాడే విషయంలో చంద్రబాబు చెప్పినా పార్టీ నేతలెవరూ వినిపించుకోవ డం లేదు… ముఖ్యమంత్రి, ఆయన కుటుంబీకులపై నేను ఆధారాలందించినా జిల్లాలో ముద్దుకృష్ణమ నాయుడు మినహా మిగిలిన ముఖ్య నేతలెవరూ గళం విప్పరు… ముఖ్యమంత్రిపై ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టడానికి వారెందుకు మొహమాటపడుతు న్నారో అర్థం కావడంలేదు… పార్టీ నుంచీ ఎలాంటి అండదండలూ అందడంలేదు… అధినేతకు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకపోతోంది… పీలేరులో ముఖ్యమంత్రిపై పోరాడమంటే ఎలా పోరాడేది? పార్టీ ముఖ్య నేతలు సీఎంతో లోపాయికారీగా రాజీ పడిపోతున్నందు వల్లే జిల్లాలో పార్టీ నట్టేట మునుగుతోంది……” అంటూ తనను కలిసిన సన్నిహితుల వద్ద పీలేరు టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తన బాధల చిట్టా విప్పుతున్నారు. దీనికి తోడు వైకాపా నేతల నుంచీ అందుతున్న ఆహ్వానాల నేపధ్యంలో ఆయన సోమవారం జరగనున్న టీడీపీ జిల్లా సమావేశానికి కూడా గైర్హాజరవుతున్నట్టు సమాచారం.

    ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అసంతృప్తికి బీజం గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కిరణ్ వాల్మీకిపురం మండలానికి చెందిన తన సన్నిహిత అనుచరుడు నరేష్‌కుమార్‌రెడ్డిని పార్టీ అభ్యర్థిగా నిలిపారు. ఆయన చింతలకు సమీప బంధువైనా వారిమధ్య రాజకీయంగా రెండు దశాబ్దాల నుంచీ వైరముంది. అలాంటిది పార్టీ అధినేతే కాంగ్రెస్ అభ్యర్థికి రెండవ ప్రాధాన్యత ఓట్లు వేయించమని ఆదేశించారని, దీనివల్ల పార్టీ అప్రదిష్టపాలైందని, అధిష్టానం మీద అపనమ్మకం ఏర్పడ్డాయని ఆయన ఆరోపిస్తు న్నారు. అలాగే పీలేరు నియోజక వర్గంలో రూ.87 కోట్ల విలువైన రోడ్లు, వంతెనల నిర్మాణ పనులకు ఈ ఏడాది మార్చిలో రోడ్లు, భవనాల శాఖ రెండు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచింది. ఈ పనులను నియోజక వర్గానికి చెందిన రాష్ట్రస్థాయి ముఖ్య నేత కుటుంబసభ్యుడొకరు తనకు కావాల్సిన వారికి కట్టబెట్టుకు నేందుకు పైస్థాయిలో చక్రం తిప్పారు. ఫలితంగా ఒకటి రెండు టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. దీన్ని చింతల అప్పుడే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సిట్టింగ్ ఎంపీగా వున్న ఓ నేతకు చెందిన నిర్మాణ సంస్థతో పోటీ టెండరు వేయించాలని కోరారు. దీంతో చంద్రబాబు పోటీ టెండరు వేయాలని ఆ నేతను గట్టిగా కోరారు. అయితే అధికార పార్టీ నేత సోదరుని ఒత్తిడికి తలొగ్గిన పార్టీ ఎంపీ రూ. 50 కోట్ల ప్యాకేజీని వదిలిపెట్టి, రూ. 37 కోట్ల ప్యాకేజీకి మాత్రమే అది కూడా ఉద్దేశపూర్వకంగా డిస్‌క్వాలిఫై అయ్యేలా టెండరు వేశారని, ఫలితంగా అధికార పార్టీ నేతలు భారీగా లబ్ధి పొందారని చింతల ఆరోపిస్తున్నారు. సాక్షాత్తూ చంద్రబాబే చెప్పినా పార్టీ నేతలు వినిపించుకోవడం లేదని వాపోతున్నారు.

    సీఎం సోదరునిపై కోర్టులో ఫిర్యాదుదీ అదే క«థ! సీఎం కిరణ్ సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి పీలేరు నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్న చింతల వాటికి సంబంధించిన ఆధారాలను చంద్రబాబుకు అందజేసి పార్టీ లీగల్ సెల్ ద్వారా హైకోర్టులో ఫిర్యాదు చేయించాలని కోరారు. చంద్రబాబు లీగల్ సెల్‌లో సభ్యుడైన సీనియర్ న్యాయవాదిని పిలిపించి కేసు అప్పగించి ఏడాది కావస్తున్నా ఇంతవరకూ పిటిషన్ ఫైలు చేయలేదని, ఎన్నిసార్లు అధినేతను కలసి చెప్పినా పట్టించుకోవడంలేదని చింతల ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సీఎం కిరణ్, ఆయన సోదరులపై హైదరాబాదులో విలేకరుల సమావేశం పెట్టి ఆరోపణాస్త్రాలు సంధించమని చంద్రబాబు జిల్లా ఎమ్మెల్యేలను ఆదేశిస్తే నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు మినహా మిగిలిన వారెవరూ నోరు మెదపలేదన్నది చింతల ఆరోపణ. అలాగే డీఆర్సీ సమావేశంలో సైతం దీనిపై ముద్దుకృష్ణమ నాయుడు తప్ప ఇతరులు మాట్లాడలేదని ఆరోపిస్తున్నారు. పీలేరులో పడా నిధులు దుర్వినియోగమయ్యాయని, ఆ పనుల పరిశీలనకు జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలంతా బృందంగా కలసి పీలేరులో పర్యటించాలని కోరినా ఎవరూ ముందుకు రాలేదంటున్నారు.

    పార్టీ నుంచీ నేతల, కార్యకర్తలకు ఎలాంటి అండదండలూ అందడంలేదని వాపోతున్నారు. ఉదాహరణకు తన సమీప బంధువు, పార్టీ నేత హరీష్‌కు చెందిన క్వారీపై అధికార పార్టీ నేతలు దాడి చేయించి తప్పుడు కేసు బనాయించి రూ. 50 లక్షల జరిమానా వేయించారని, కిందటి ఎన్నికల్లో గుర్రంకొండ మండలం చెర్లోపల్లెలో అ«ధికార పార్టీ ముఖ్యనేత సోదరుని గట్టిగా ఎదుర్కొన్న పార్టీ నేత హరిప్రసాద్ నాయుడుపై కేసులు బనాయించి వేధించారని, పార్టీ సానుభూతిపరులైన చౌకదుకాణ డీలర్లను పెద్ద ఎత్తున తొలగించారని, ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చేంతాడవుతుందని ఏకరువు పెడుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో సీఎంపై పోరాడమంటే ఎలా పోరాడేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. సోమవారం చిత్తూరులో జరుగుతు న్న పార్టీ సమావేశానికి చింతల హాజరు కారాదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం ఆయన త్వరలోనే వైకాపాలో చేరతారని జరుగుతున్న ప్రచారానికి ఊతమిస్తోంది.

  23. vissu

    YSRCP leaders donate Rs 8 lakh for student’s treatment

    Nellore: Leaders of YSR Congress Party (YSRCP) donated Rs 8 lakh for treatment of Ester Preethi, an IV year ECE student of NBKR Engineering College, here on Saturday.

    The student, who is suffering from white jaundice, a chronic liver ailment, is waiting to undergo a liver transplantation surgery, which costs Rs 50 lakh.

    According to YSRCP convener Kakani Govardhan Reddy, the members of YSRCP student wing contributed Rs 5 lakh to facilitate better treatment for the student.

    He along with the party leaders Shyam Prasad Reddy and KR Pratap Kumar Reddy donated Rs 1 lakh each to support the efforts of the students, he added. The leaders handed over a Demand Draft of the amount to the NBKR students.

  24. vissu

    మునగపాక, నవంబర్ 25: రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు పటిష్ఠంగా అమలు జఠగాలంటే వైఎస్‌ఆర్ పార్టీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు తహతహలాడుతున్నారని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి పేర్కొన్నారు. మండలంలో చూచుకొండ, గణపర్తి, మెలిపాక, యాదగిరిపాలెం, వరద ముంపుగ్రామాల్లో ఆదివారం ఎంపి సబ్బం హరి విస్తృతంగా పర్యటించారు. వరద బాదితులను పరామర్శించారు. యలమంచిలి నియోజకవర్గ వైఎస్‌ఆర్ సిపి నేత కాండ్రేగుల జగదీష్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సబ్బం మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖరెడ్డి హయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజుకు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. ఆనాటి కార్యక్రమాలు పకడ్భందీగా అమలు జరగాలంటే యువనేత జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చూచుకొండ గ్రామస్తులను ఎంపి సబ్బం రైతులను, మహిళలను గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు తుఫాన్ బిల్డింగ్ కావాలని అడగగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గణపర్తి గ్రామం నుండి జోగారావుపేటకు రోడ్డు ఏర్పాటు చేయాలని రైతులంతా కలసి అడగగా ఆ రోడ్డును పరిశీలించిన సబ్బం త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
    గణపర్తి గ్రామంలో మహిళలతో మాట్లాడుతూ మీకేం కావాలని సబ్బం అడగగా రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ సిఎం కావాలని కోరుతున్నామని ఎంపికి చెప్పారు. దీంతో ఎంపి ఈ మహిళల కోర్కెను పత్రికల్లో ఖచ్చితంగా రాయాలని విలేఖర్లకు సూచించారు. అలాగే మెలిపాక శ్మశానానికి ప్రహారీగోడ కావాలని కోరగా అలాగే పల్లపు ఆనందపురం వాటర్ ట్యాంక్ కావాలని ప్రజలను అడిగిన మేరకు ఒక వారం రోజుల్లో అధికారులను పంపించి ఎస్టిమేట్ వేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి వైఎస్‌ఆర్ సిపి నేత కాండ్రేగుల జగదీష్, అచ్యుతాపురం వైఎస్‌ఆర్ సిపి నేత ప్రగడ నాగేశ్వరరావు, వైఎస్‌ఆర్ సిపి మండల నాయకులు మళ్ల కృష్ణ, మోహన్, వెంకట్రావు, కాండ్రేగుల నాయుడు, వెంకట్రావు, చదరం రమణ, బొడ్డేడ బాబ్జీ, పెంటకోట నూకరాజు, కాండ్రేగుల కారునాయుడు తదితరులు ఎంపి వెంట ఉన్నారు.

  25. CVReddy

    TDP will be pushed to 3rd place. TRS will emerge as main opposition party by crushing TDP and pushing it to 3rd place.
    Cong and TDP would compete for 3rd place.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s