నరేంద్ర మోడీ.. నారా బాబు

http://amruthamathanam.blogspot.in/2012/12/blog-post_2.html

10 Comments

Filed under Uncategorized

10 responses to “నరేంద్ర మోడీ.. నారా బాబు

  1. nlr2014

    Day 46 …..Prajaprasthanam.

    http://epaper.sakshi.com/apnews/Mahabub_Nagar/04122012/1

    Touching every village …Conquering every heart.

  2. CVReddy

    Petitioning Government of Norway, Norwegian Judges and Government Authorities
    Government of Norway, Norwegian Judges and Government Authorities: Pardon Mr & Mrs Chandrasekhar’s inadvertent mistake and release them

    http://www.change.org/petitions/government-of-norway-norwegian-judges-and-government-authorities-pardon-mr-mrs-chandrasekhar-s-inadvertent-mistake-and-release-them

    Please sigh this petition.

  3. vinay

    డైలాగులు..ఫోజులు
    బాలకృష్ణ టూర్

    సినీ డైలాగులు.. ఫొటోలకు ఫోజులతో నటుడు బాలకృష్ణ సరిపెట్టారు.. జిల్లాలో ముఖ్యంగా గుడివాడలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి ఆక్సిజన్ అందిస్తారని, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఆయన తీరుపై ఆ పార్టీ నేతలే తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తంచేశారు.

    గుడివాడ, న్యూస్‌లైన్ : నందమూరి బాలకృష్ణ వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురుచూసిన తెలుగు తమ్ముళ్లకు తీవ్ర నిరాశే మిగిలింది. ఆయన గుడివాడ పర్యటన అంతా ఓ ‘షో’గా మారింది. ఆ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆదివారం బాలకృష్ణ హాజరయ్యరు. పనిలో పనిగా జిల్లా, నియోజవర్గంలో పడకేసిన పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చేందుకు ఏదో ఒకటి చేస్తారని, యువత, దిగువస్థాయి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం, ఉల్లాసం నింపుతారని అంతా భావించారు. అందుకు విరుద్ధంగా బాలకృష్ణ సినీ డైలాగులు వల్లించారు.. కనిపించిన వారందరితో ఫొటోలకు ఫోజులిచ్చి సరిపెట్టారు. పార్టీని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నమే చేయలేదు. పైగా ఆయన చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. రాజకీయ పరిణతిలేని వ్యక్తి మాటలుగా కొట్టిపారేస్తున్నారు.

    గన్నవరం విమానాశ్రయంలో దిగిన బాలకృష్ణ హనుమాన్‌జంక్షన్ మీదుగా గుడివాడ చేరుకున్నారు. అక్కడ రావి శోభనాద్రి చౌదరి ఇంటికి వెళ్లి ఆయనను పలకరించారు. అనంతరం రావి వెంకటేశ్వరరావు కుమార్తె, అల్లుడు శ్వేత-అభినయ్‌లను ఆశీర్వదించారు. అనంతరం స్థానిక ఏలూరు రోడ్డులో ఉన్న వేములపల్లి కోదండరామయ్య కన్వెన్షన్‌లో జరిగిన రిసెప్షన్‌కు హాజరయ్యారు. తొలుత సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మండలాలవారీగా పార్టీ కార్యకర్తలతో బాలకృష్ణ మాట్లాడతారని స్థానిక నాయకులు ప్రకటించారు. బాలకృష్ణ వేదికపైకి రాగానే కార్యకర్తలంతా ఒక్కసారిగా ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. దీంతో వేదికపై ఉన్న కుర్చీలు, బల్లల్ని బాలకృష్ణ తీయించి సమావేశాన్ని ఫొటో సెషన్‌గా మార్చారు. దాదాపు అరగంటకు పైగా ఒక్కొక్కరుగా వచ్చి ఫొటోలు దిగేందుకు పోటీలు పడ్డారు.

    ఈ సన్నివేశాన్ని చూసి పార్టీ నాయకులంతా అయోమయంలో పడ్డారు. కనిపించిన వారినందర్ని రండి వచ్చి ఫొటోలు దిగండని బాలకృష్ణ పిలిచారు. గుడివాడలో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేస్తాడనే భావనతో తమ లైవ్ వ్యాన్ల్లను సిద్ధం చేసుకున్న ఎలక్ట్రానిక్ మీడియా వారు ఆయన తీరుకు విస్తుపోయారు. ఫొటోలు దిగి వెళ్లి పోతున్న బాలకృష్ణను మాట్లాడాలని కోరారు. దీంతో ఆయన నాలుగు మాటలు సెలవిచ్చి సరిపెట్టారు. బాలకృష్ణ తీరుకు గుడ్లవల్లేరుకు చెందిన టీడీపీ నాయకుడొకరు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘మీటింగ్ బంగారంలా సాగేది… మాట్లాడకుండా ఫొటోలు దిగి వెళ్లి పోతున్నాడు.. ఎందుకు పిలిచినట్లు ..? అని వ్యాఖ్యానించారు. మరో నాయకుడు మాట్లాడుతూ ‘రెండు రోజలు క్రితం కొడాలి నాని మీ బావని 420 అని తిట్టాడు, ఉమను 210 అన్నాడని బాలయ్యకు చెప్పాను.. అందుకు ఆయన విన్నాను .. అని అన్నారు. ఇక్కడ గట్టిగా నానిపై విమర్శలు చేస్తాడనుకుంటే అదేమీ లేదు..’ అంటూ అసంతృప్తి వెళ్లగక్కారు.

    రండిరా.. రండి.. ఫొటోలు దిగండి..
    గుడివాడ టీడీపీ కార్యకర్తల సమావేశంలో బాలయ్య తీరు అందర్ని నవ్వించింది. ఫొటోలు దిగటానికి వచ్చే వారిని ‘రండి ఎంతమంది వస్తారో రండి..’ అంటూ సినిమా డైలాగులు మాట్లాడారు. దాదాపు 200 మందికి పైగా కార్యకర్తలు ఫొటోలు దిగటానికి వచ్చారు. ఫొటోగ్రాఫర్ తీయకపోతే ‘ తీయండి.. ఎందుకు తియ్యరు’ అంటూ మండి పడ్డారు. బ్యాటరీ అయిపోయిందని ఫొటోగ్రాఫర్ చెప్పినా వినకుండా ‘ఇంకా తీయండి.. ’అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలతో అక్కడి వారు నవ్వుకున్నారు. బాలకృష్ణ తీరును చూసి ఆ పార్టీవారే విస్తుపోయారు.

  4. sharath

    I saw rana’s movie today.. dongana dash gallu prakruthi sampadha ni range lo svaha chesthunnaru.. matti kanillu pedithe mattilo kalsi potharu andharu

  5. CVReddy

    నరేంద్ర మోడీ.. నారా బాబు
    గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని పోలికలు ఉన్నాయ. బాబు కన్నా మోడీ వయసులో ఆరునెలలు, రాజకీయాల్లో పదేళ్లు చిన్న . కానీ రాజకీయ ఎత్తుగడల్లో ఆరాకులు ఎక్కువే చదివారు. 1950 ఏప్రిల్‌లో బాబు జన్మిస్తే, అదే సంవత్సరం సెప్టెంబర్‌లో మోడీ జన్మించారు. 1978లో కాంగ్రెస్ ఐ ద్వారా బాబు రాజకీయ జీవితం ప్రారంభమయితే, 1987లో బిజెపి ద్వారా మోడీ రాజకీయ జీవితం ప్రారంభం అయింది. బాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

    బాబుకు అనుకూలంగా దాదాపు ప్రపంచ మీడియా మొత్తం ప్రచారం చేయగా, మోడీకి వ్యతిరేకంగా అదే స్థాయిలో ప్రచారం సాగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ అనుకూలంగా కావచ్చు, వ్యతిరేకంగా కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ప్రచారాన్ని పొందింది ఈ ఇద్దరు నాయకులే. మన రాష్ట్రానికి చెందిన సామాజిక శాస్తవ్రేత్త ఒకరు ఒక విషయాన్ని పదే పదే చెబుతుంటారు. 2004లో మన రాష్ట్రంలో, గుజరాత్‌లో దాదాపు ఒకే సమయంలో ఎన్నికలు జరిగాయి. మీడియా బాబుకు అనుకూలంగా విస్తృతంగా ప్రచారం చేసింది, మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మీడియా విస్తృత ప్రచారం చేసింది. కానీ చిత్రంగా వ్యతిరేక ప్రచారాన్ని ఎదురీది మోడీ విజయం సాధించగా, అనుకూల ప్రచారం ఉన్నా బాబు ఓడిపోయారు. అమెరికా అధ్యక్షుడు సైతం నా పాలన చూసి మురిసిపోయారు అని ప్రచారం చేసుకున్న బాబు ఓడిపోగా, అమెరికా వీసా ఇవ్వకుండా అవమానించిన మోడీ మాత్రం ఘన విజయం సాధించారు. బాబు పాలనపై క్లింటన్ సెనెట్‌లో సైతం ప్రస్తావించారు అని తెలుగు మీడియా ప్రచారం చేసినా బాబుకు విజయం చేకూర్చలేకపోయారు. మోడీని తమ దేశానికి రాకుండా అమెరికా అడ్డుకున్నా ఆయన విజయాన్ని అడ్డుకోలేక పోయింది.

    మీడియానో, అమెరికానో కాదు ఓటు వేసే ప్రజలే హీరోలు అని గుజరాత్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్టమ్రైనా పదే పదే నిరూపిస్తూనే ఉంది. మీడియా ప్రచార ప్రభావంపై ఈ ఇద్దరు నాయకుల ఫలితాలను అధ్యయనం చేయాల్సిన అంశమే. గుజరాత్ అల్లర్ల సమయంలో రాజధర్మం గురించి మోడీకి అప్పటి ప్రధాని వాజ్‌పాయి వివరించే సరికి, ఆయన్ని మారుస్తారేమో అనే ప్రచారం జరిగింది. గాలికి పోయే పిండిని కృష్ణార్పణం అన్నట్టుగా ఆ క్రెడిట్ తాను కొట్టేయడం ద్వారా మైనారిటీల ఓట్లను సాధించవచ్చునని బాబు భావించి, మోడీని తొలగించాల్సిందే అని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం బాబు మద్దతుతోనే నిలబడ్డా, బాబు డిమాండ్‌ను మాత్రం వాళ్లు పట్టించుకోలేదు. బిజెపి వ్యవహారాల్లో ఇతర పార్టీల జోక్యం ఏమిటి? అని బిజెపి నాయకులు నిలదీశారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చమనడానికి ఇతర రాష్ట్రాల వారికున్న హక్కేమిటని గుజరాతీలు ప్రశ్నించారు. చివరకు గుజరాత్ అల్లర్ల వివాదం మోడీని గుజరాత్‌లోనే కాదు దేశంలోనే బలమైన నాయకుడిగా నిలిపింది. మీడియా ప్రచారాన్ని చూసి కొందరు బిజెపి నాయకులు ఏవేవో ఊహించుకుని బిజెపిలో తిరుగుబాటు తీసుకు వచ్చి పార్టీ నుంచి బయటకు వెళ్లి , కొత్త పార్టీ పెట్టి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి అడ్రస్ లేకుండా గల్లంతయ్యారు. మోడీ బలాన్ని సరిగా అంచనా వేయలేకపోయామని తరువాత ప్రకటించారు.

    ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఒక నాయకుడు విజేతగా నిలవాలన్నా ప్రజల మద్దతుతో తప్ప అమెరికా అండతోనో, మీడియా మద్దతుతోనో సాధ్యం కాదని మోడీ నిరూపించారు. మోడీని దించాల్సిందే అని పట్టుపట్టిన బాబు ఎనిమిదేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉండి, అధికారం కోసం సుదీర్ఘ పాదయాత్ర చేస్తుండగా, మోడీ మాత్రం నాలుగవ సారి ముఖ్యమంత్రి పదవి అధిష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s