రాష్ట్ర వ్యాప్తంగా నేడు జగన్ జన్మదినోత్సవాలు

హైదరాబాద్, 21 డిసెంబర్‌ 2012: నేడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి 40వ పుట్టినరోజు. జననేత శ్రీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. గురువారం అర్ధ రాత్రి కేక్ కట్ చేసి వారంతా శ్రీ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని చోట్ల సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ యువజన, విద్యార్థి విభాగాలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో పలుచోట్ల రక్తదాన శిబిరాలు, పండ్లు, దుప్పట్ల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమాలు, అన్నదానం నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలులో నిర్బంధించినందుకు ఆయా విభాగాలు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి.

శ్రీ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని గుంటూరులో అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక షిర్డీ సాయి దీన దయాళ్ అంధుల పాఠశాలలో కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పార్టీ నేతలు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

18 Comments

Filed under Uncategorized

18 responses to “రాష్ట్ర వ్యాప్తంగా నేడు జగన్ జన్మదినోత్సవాలు

 1. Adnan

  Happy Birthday to Leader!

 2. happy birthday to jagan mohan reddy.coming C.M jagan

 3. Happy bday to our leader YS Jagan

 4. NLR

  Many Happy returns of the day to Jagan ..the future of AP.

  Anna ..cheppinatle ..Vuppena puttindhi ..
  2014 lo..kottukoni potharu Todu dongalu.

 5. CVReddy

  భయపడడు… తొందరపడడు..- YS భారతి

  http://sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=54657&Categoryid=11&subcatid=23

 6. CVReddy

  The jail staff describes Jagan Mohan Reddy as a “peaceful” prisoner. He has a fixed daily routine. “He starts the day with prayers and then does a complete work-out. He can often be spotted playing badminton or an outdoor sport of some sort,” said a source.

  http://www.deccanchronicle.com/121221/news-politics/article/jagan-celebrate-birthday-jail

 7. CVReddy

  Two more Congress MLAs set to join Jagan’s party
  http://newindianexpress.com/states/andhra_pradesh/article1388308.ece

  Two more young legislators from the ruling Congress, Gottipati Ravi Kumar (Addanki) and Buchepally Sivaparasada Reddy (Darsi) from Prakasam district, are all set to join YS Jagan Mohan Reddy’s party.

 8. CVReddy

  నరేంద్ర మోడీ.. నారా బాబు
  http://amruthamathanam.blogspot.in/2012/12/blog-post_2.html

  Narendra Modi …Got a Hatirck.
  Nara Babu ….on a Hatrick.
  The only difference is..
  One is a winner the other is a loser.

  Courtesy: NLR

 9. CVReddy

  కష్ట సుఖాలు పగలు రాత్రి లాంటివి.
  పగలంతా కష్టపడితే అలసిన శరీరానికి రాత్రి సుఖంగా నిద్ర పడుతుంది.
  ముందు కష్టపడితే తరువాత సుఖపడుతాడు.
  జగన్ ఇప్పుడు కష్టాలు పడుతున్నాడు తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుంది.

  బాబు ను చూడండి కష్టపడకుండా మామ అధికారాన్ని దొంగ దారిలో తీసుకొన్నాడు కాబట్టి ఇప్పుడు బాధ యాత్ర, చేస్తున్నాడు అయినా గెలుపు కనుచూపు దూరములో కనబడతము లేదు బాబు గారికి.

  ప్రత్యర్ధులు అంతా ఏకమై జగన్ ను జైలుకు పంపారు కానీ జైలు జీవితము తనకు జీవితానికి సరిపడా అనుభవము నేర్పుతుంది.మున్ముందు మరింత జాగరూకతతో నడుస్తాడు.

  చరిత్రలో కష్టపద్దవాడు ఎప్పుడూ నష్టపోయినట్టు దాఖలాలు లేవు.
  జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు

Leave a Reply to anushareddy.dandem Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s