RBI gives conditional nod for rescheduling crop loans

The Reserve Bank of India has accorded in-principle nod to the proposals of Andhra Pradesh and Telangana governments to reschedule crop loans but sought detailed information from both the States on the quantum and the number of beneficiaries likely to be benefited by the moratorium.

In principle, they have agreed for rescheduling and requested for additional information, official sources confirmed here on Wednesday.

The Andhra Pradesh government has decided to send the details to RBI by Wednesday night itself, the sources indicated.

It is learnt that the RBI in a letter addressed to respective Chief Secretaries sought to know the number of beneficiaries to be covered under the scheme to reschedule crop loans, the quantum of loans to be rescheduled and the number of such accounts.

It is learnt that the RBI wanted to limit the repayment period to three years as against AP government demand for a moratorium of seven years.

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-tamilnadu/rbi-gives-conditional-nod-for-rescheduling-crop-loans/article6218883.ece

26 Comments

Filed under Uncategorized

26 responses to “RBI gives conditional nod for rescheduling crop loans

  1. Ram

    ఆవున్న చోటే అన్నముంది!
    http://www.sakshi.com/news/vanta-panta/where-rice-is-the-cow-148135

    ప్రతి ఏటా దాళ్వాకు విరామం!

    ఆరు ఆవులతో 28 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం.. భూమికి
    విశ్రాంతి కోసం దాళ్వా వరి సాగుకు ప్రతి ఏటా సెలవు!
    సార్వాలో మాత్రమే వరి సాగు.. వినియోగదారులకు నేరుగా ముడి బియ్యం అమ్మకం ద్వారా ఎకరానికి రూ. 40 వేల నికరాదాయం
    ఒక్కో దేశీ ఆవు ద్వారా రూ. 40 వేల సాగు ఖర్చులు ఆదా!

    ‘వ్యవసాయం పరమ లక్ష్యం అధికంగా పంట దిగుబడులు నూర్చడం కాదు.. మంచి మనసు గల మనుషులున్న సమాజాన్ని నిర్మించడం..’ అంటాడు సుప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా. నాచుగుంటలోని భూపతిరాజు రామకృష్ణంరాజు(65) వ్యవసాయ క్షేత్రాన్ని చూస్తే ఈ మాటలకు అర్థం ఏమిటో కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. భూమిని తల్లిగా కొలిచే రైతుగా గత ఏడేళ్లుగా వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. తక్కువ ఖర్చుతో కూడిన గోఆధారిత వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ.. మొదట్లో జీవామృతం వాడినా.. ఇప్పుడు ఏ ఎరువూ వేయకుండా ఎకరానికి 29 బస్తాల విష రహిత ధాన్యం దిగుబడి సాధిస్తున్నారు. 5-10 ఏళ్లు జీవామృతం వాడిన పొలంలో ఏ ఎరువూ వేయకుండానే పంటలు పండించొచ్చని రుజువు చేశారు. తను చేయడమే కాకుండా తోటి రైతులకు జ్ఞానాన్ని పంచి.. పచ్చని బతుకు దారి చూపుతున్నారు. ‘పిచ్చి రాజు.. పిచ్చి పంట..’ అని ఎగతాళి చేసిన రైతులే ఇప్పుడు అనుసరిస్తున్నారు!

    అత్యాశకు పోయి రసాయనిక వ్యవసాయంతో భూమిని సర్వనాశనం చేసుకోవడం రైతు తనకు తాను ద్రోహం చేసుకోవడమేనని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు భూపతిరాజు రామకృష్ణంరాజు(65) ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రకృతిని ఉపయోగించుకుంటూనే ప్రకృతి పరిరక్షణకు దోహదపడే రీతిలో రైతు జీవన విధానం, పంటల విధానం ఉండాలంటారాయన. ఉంగుటూరు మండలం నాచుగుంటలోని శ్రీగోపాలకృష్ణ గోశాలకు డా. సుంకపల్లి పర్వతరావు 28 ఎకరాలను దానం ఇచ్చారు. ఆ భూమిని లీజుకు తీసుకొని రామకృష్ణంరాజు సాగు చేస్తున్నారు.

    పచ్చని పంటలతో మనిషికి ఆయువునిచ్చే భూమిని వ్యాపార వస్తువుగా కాకుండా తల్లిగా చూడడం ఆయన ప్రత్యేకత. సార్వా వరి పంట కోసిన తర్వాత వెంటనే దాళ్వా వేయకుండా.. మినుమో, పిల్లిపెసరో, అలసందో చల్లుతారు. అయిన కాడికి కాయలు కోసుకున్నాక పశువులకు మేపుతారు. ఆనక ఆవులతో పొలంలో మందగడతారు. తొలకరి వర్షాలు కురిశాక దమ్ము చేసి నాటేస్తారు.. నలభయ్యేళ్లుగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న రామకృష్ణంరాజు 2007 నుంచి పంటల సాగు తీరును పూర్తిగా మార్చుకున్నారు.

    ఎగతాళి చేసిన వారే..!

    తొలుత 9.5 ఎకరాల్లో జీవామృతంతో వ్యవసాయాన్ని ప్రారంభించి.. క్రమంగా 28 ఎకరాలను ఈ పద్ధతిలోనే రసాయనిక ఎరువులు, పురుగుమందులను కొంచెం కూడా వాడకుండా సాగు చేస్తున్నారు. తొలుత జీవామృతంతో సాగు చేసిన 9.5 ఎకరాల్లో నాలుగేళ్లుగా అసలు జీవామృతం కూడా వాడడం లేదని, కేవలం ఆవులతో మందగట్టడం తప్ప ఇంకేమీ చేయడం లేదని ఆయన తెలిపారు. ఆయనను పిచ్చి రాజు గారు, పిచ్చి వ్యవసాయం. ఇది అయ్యేదా పొయ్యేదా.. అని ఎగతాళి చేసిన రైతులే ఇప్పుడాయనను అనుసరిస్తున్నారు.
    రామకృష్ణంరాజు స్వగ్రామం తణుకు మండలం తేతలి గ్రామం. పూర్వీకుల దగ్గర నుంచి వ్యవసాయ కుబుంబం. 1970లో వ్యవసాయం చేపట్టి.. పరిమితంగా రసాయనిక ఎరువులు వాడుతూ సేద్యం చేశారు. సాంద్ర వ్యవసాయ పద్ధతి అమల్లో ఉన్న జిల్లాలో ఇతర రైతులు విరివిగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు దట్టిస్తూ.. తెరపి లేకుండా పంటల మీద పంటలు వేయడం పట్ల అసంతృప్తి చెందుతుండే వారు. ఆ దశలో మధ్యప్రదేశ్ చిత్రకూట్‌లోని దీనదయాళ్ సంస్థ, నాగపూర్‌లో మరో సంస్థను సందర్శించినప్పుడు ప్రకృతి వ్యవసాయం విలువ ఆయనకు అవగతమైంది. ఆ విధంగా ఏడేళ్ల క్రితం ప్రకృతిసిద్ధమైన పద్ధతుల్లో వ్యవసాయం ప్రారంభించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం పూర్తిగా నిలిపివేసిన తొలి ఎకరానికి ఏడాది 20 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. క్రమంగా 29 బస్తాలకు పెరిగింది. ఒక్క ఆవు మూత్రం, పేడలతో జీవామృతం తదితర కషాయాలను తయారు చేసుకుంటూ తక్కువ ఖర్చుతో 4, 5 ఎకరాలను సాగు చేయవచ్చని నిరూపించారు. ఇతర రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులకు ఎకరానికి రూ. 7,8 వేలు ఖర్చు పెడుతున్నారు. ఇరుగు పొరుగు రైతుల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. కొందరు ఆయనను అనుసరిస్తున్నారు. గద్దె వెంకటరత్నం అనే రైతు 10 ఎకరాల్లో, మరో రైతు 4 ఎకరాల్లో గోఆధారిత వ్యవసాయం చేయనారంభించారు. మరో 20 మంది రైతులు అరెకరం, ఎకరంలో ఈ పద్ధతిలో సాగు చేస్తూ ధాన్యాన్ని సొంతానికి వాడుకుంటున్నారు.

    నాట్లు వేయటం.. కలుపుతీయటం.. పంట కోయటం!

    అనేక ఏళ్లుగా జీవామృతం వేసి పంటలు పండిస్తున్నందున భూమి పూర్తిగా సారవంతమైంది. నాట్లేయటం, కలుపు తీయడం, పంట కోసుకోవడం తప్ప ఏ ఎరువులూ వేయాల్సిన అవసరం లేనేలేదని రామకృష్ణం రాజు తెలిపారు. కోత కోసిన తర్వాత పిల్లిపెసర వంటి గింజలు చల్లితే.. ఆవులు తినగా మిగిలిన పంట పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుంది. ఎలాంటి ఎరువులు, జీవామృతం వేయకుండానే తదుపరి ఖరీఫ్‌లో వరి పంటను సాగు చేయవచ్చని ఆయన రుజువు చేశారు. ఏ భూమిలోనైనా వరుసగా ప్రకృతి వ్యవసాయం చేస్తే వానపాములు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, భూమిలో సేంద్రియ కర్బనం కొరత తీరుతుందని, 5 నుంచి 10 ఏళ్లలో ఇదే ఫలితం వస్తుందని ఆయన గంటాపథంగా చెబుతున్నారు.

    ఈ సాగు పద్ధతి గురించి ఆ నోటా ఈ నోటా విన్న రైతులు అనేక జిల్లాల నుంచి వచ్చి శిక్షణ పొందుతూ ఉంటారు. ఏడాదికి 400 నుంచి 500 మంది రైతులు శిక్షణ పొందుతుండగా, వీరిలో 60 % మంది ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారని రామకృష్ణంరాజు తెలిపారు.

    – యడ్లపల్లి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం, ప. గో. జిల్లా
    ఫొటోలు: ఎస్ కే రియాజ్

    ఎకరాకు రూ. 40 వేల నికరాదాయం

    గత ఖరీఫ్‌లో అరెకరంలో చెరకు, 27.5 ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఎకరాకు 15 వేలు ఖర్చు చేశారు. అవిపోను రూ. 40 వేల నికరాదాయం సంపాదించారు. ఇతర రైతులు రెండు పంటలు పండించి ధాన్యం అమ్ముకొని సంపాదించే మొత్తాన్ని. తాను ఒక పంటలో పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి సంపాదిస్తున్నానని రామకృష్ణంరాజు తెలిపారు. పండించిన ధాన్యాన్ని నిల్వ చేసి, మరపట్టించి ముడి బియ్యాన్ని కిలో రూ. 52 చొప్పున నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. పీఎల్ -1100, బీపీటీ -5204 రకాల బియ్యం సుమారు 55 వేల కిలోలను రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలతో పాటు చెన్నై, బెంగళూరు, బళ్లారి, కోయంబత్తూరు, పుణే వంటి ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్టు ద్వారా పంపిస్తున్నారు. ఈ బియ్యాన్ని సుమారు 500 కుటుంబాలు వాడుతున్నాయి. ఆరోగ్యదాయకమైన ఈ బియ్యాన్ని జనానికి అలవాటు చేయడానికి తనకు మూడేళ్లు పట్టిందని, వీటి విలువ తెలిసిన తర్వాత వాళ్లే పది మందికి చెబుతున్నారని రామకృష్ణంరాజు వివరించారు. ‘పెద్ద రైతులు, చిన్న. సన్నకారు రైతులు ఎవరికైనా ఈ వ్యవసాయం సాధ్యమే. కాకపోతే ఓపిక ఉండాలి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్ముకోగలగాలి..’ అంటారాయన.

    ఆవుతో 40 వేలు ఆదా!

    రామకృష్ణంరాజు వ్యవసాయ క్షేత్రంలో ఆరు దేశవాళీ ఆవులు, రెండు ఎద్దులు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే మూత్రం, పేడతో ఇక్కడ 28 ఎకరాల వ్యవసాయం సాగుతోంది. ఒక ఆవు మూత్రం, పేడతో తయారుచేసిన జీవామృతం తదితరాలతో 4,5 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. అంటే ఆ 4,5 ఎకరాల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు మిగిలినట్టే కదా. ఒక ఆవు ద్వారా రూ. 40 వేలకుపైగా వ్యవసాయ ఖర్చు తగ్గుతుంది. ఏటా రెండు పంటలు వేసే వాళ్లకు ఇంతకు రెట్టింపు మిగిలినట్టే. దేశవాళీ ఆవు లీటరు పాలిచ్చినా.. అవి అమృతతుల్యమైనవి. ఆవు ఉన్న ఇంట్లో పిల్లలు, పెద్దలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు. అంతేకాదు.. ఆవు మూత్రంతో అర్క్, చర్మవ్యాధుల నివారణకు లేపనం కూడా తయారు చేసి అమ్ముతున్నారు. గడ్డి కొనాల్సిన అవసరం లేని రైతుకు ఒక్కో ఆవుకు రూ. వెయ్యి వరకు దాణా ఖర్చవుతుంది అంటారాయన. గో ఆధారిత వ్యవసాయాన్ని పట్టుదలగా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న రైతులకు తన పొలం దగ్గర ఒక రోజు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

    ఆలోచనా విధానం మారాలి

    రైతుల ఆలోచనా విధానం మారాలి. మన తాతలు, తండ్రులు, మనకు సారవంతమైన భూమిని ఇచ్చారు. మనం మన తర్వాతి తరాలకు భూమిని సారవంతంగా ఉంచి అప్పగించాలంటే గో ఆధారిత వ్యవసాయం చేయాలి. ఈ వ్యవసాయంలో భూమి సారవంతమవుతుంది. ఆరోగ్యదాయకమైన ధాన్యం పండించుకోవచ్చు. ఆస్పత్రి మెట్లెక్కే అవసరం రాదు. ఇంటిల్లి పాదీ సుఖంగా ఉండవచ్చు, ఇంట్లో ఒక దేశీయ ఆవు ఉంటే అదే మహాభాగ్యమని రైతులోకం గుర్తించాలి. సేంద్రియ కర్బనం పెరగడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది. ప్రతి నీటి చుక్కను పట్టుకొనే గుణం భూమికి ఉంటుంది. 20 శాతం నీరు ఆదా అవుతుంది. వర్షాలు తగ్గినా ఇబ్బంది ఉండదు. పూర్వీకులు భూమిని తల్లిగా చూసేవారు, మనం వ్యాపార వస్తువుగా చూస్తున్నాం, మనం పూర్వీకుల బాట పట్టాలి. ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి. సంఘటితమై స్వాభిమానం చాటాలి.

    – భూపతిరాజు రామకృష్ణంరాజు(94404 87864),
    గో ఆధారిత వ్యవసాయదారుడు, నాచుగుంట,
    ఉంగుటూరు మండలం, ప. గో. జిల్లా

    • Vikram

      good one..

    • Ram

      Now, compare this article with Enadu interview with Subhash Palekar last year. It was published in regular edition, and not in Annadaata. He was indirectly mocking SP. ఎగతాళి chesadu ayananu, without publishing any available scientific arguments or giving advice to farmers on how to use the zero budget method. People like Anil Chow-Mein annai need to look deeper removing yellow tinted glasses on who is deceiving public with false news – Sakshi / Enadu.

  2. Sevalu meedha chillari verukovatam ante idhe nemo ??

    Human brains seem to regress with evolution .

    http://www.dailymail.co.uk/news/article-2697538/Shocking-new-accounts-carnage-MH17-crash-site-emerged-today.html

    Looks like Human beings are eagre to wipe out Human race soon ??
    Shooting down passenger planes and looting from the dead bodies !!

  3. CVR Murthy

    While the focus in on TDP and Chandra babu naidu, One should not miss out the following

    1. We do not find YSRCP leaders on Television Debates these days
    2. We have not heard or read any thing about strengthening/creating organization
    3. It has been 24 hours since Aaraku MP expressed her opinion on YSRCP , no body clarified it
    4. We hear nothing from YSRCP on Telengana issues.

    • What is the Youth wing , IT wing and Mahila wing doing ??
      Sleeping after the polls ??? Not even a Press meet !!
      We have to work ten times harder to come back to power.
      KDP is giving us golden opportunities by not sticking to the false promises even two months after the results and yet we have not hit the streets !!
      People should be made aware that we will fight on their behalf for the promises to be implemented.
      Where is the initiative to attract the leaders from the Cong who hate Babu and are in real despair ??
      If one leaves two should come in and that is the aggressive approach we need.
      I think we need more motivational and organisation skills.

    • underhill

      These are the exact reasons we lost the elections. Never realized the importance of party structure and focused on strengthening it.
      Instead making over confident statements like we will win 167 if conduct the elections is going to make people and cadre averse to his leadership. These thoughts should come from people.

      • Sadly it is like Jagan’s weakness is Chandrababu strength.
        I know a Cong MLA made comment after elections which I think very apt
        “Your leader (read as Jagan) gave life to a dead buried under 10ft”.

        • I think the so called leaders should take more initiatives at the local level and co ordinate this with the Central Core Committee.
          It will be extremely difficult for Jagan to do all this on his own and I think he should trust and hand over such responsibilities to enthusiastic and reliable people.
          We need to grab hold of every opportunity to be the voice of the People for the next five years.
          We should stop making over confident statements at this point as it will not make any difference to our situation.
          Just be confident and work hard and we will see the results favouring us in five years time.
          There will not be Runa Mafi’s or Modi Tsunami’s all the time. No one has ever been in Power permanently.

  4. CVReddy

    ఆల్ ఫ్రీ బాబూ వింటున్నారా?

    [హామీలను నెరవేర్చలేమని తెలిసీ, చేస్తామని రాజకీయ నాయకులూ నమ్మబలికితే అది మోసం కాదా? -హైకోర్టు జడ్జి చంద్రకుమార్, ఆనంతపుర్ ,July 18,2014

    హైకోర్టు జడ్జి చంద్రకుమార్ చేసిన కొన్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.ప్రత్యేకించి రాజకీయ నాయకుల హామీలపై ఆయన ప్రశ్నిస్తున్న తీరు విశేషంగా ఉంది.
    పర్యవసానాలేమీ తెలియకుండా నాయకులు హామీలెలా ఇస్తారని ఆయన అడుగుతున్నారు. హామీలను నెరవేర్చలేమని తెలిసీ, చేస్తామని నమ్మబలికితే అది మోసం కాదా? అని చంద్రకుమార్ వ్యాఖ్యానించారు

    http://kommineni.info/articles/dailyarticles/content_20140718_9.php?p=1405665469397%5D

    హామీలిచ్చి డబ్బుల్లేవంటే ఎలా? పశ్చిమ గోదావరిలో చంద్రబాబును నిలదీసిన మహిళలు

    [నా వద్ద మంత్రదండం లేదు,డబ్బులు చెట్లకు కాయడంలేదు. సమస్య పరిష్కారానికి చూస్తా’ అంటూ సీఎం అసహనం

    సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘మీరే కదా రుణ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవంటే ఎలా’ అని పశ్చిమగోదావరి జిల్లాలో పలువురు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు

    కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో జరిగిన ముఖాముఖిలో కూడా మహిళలు రుణ మాఫీపైనే ప్రశ్నించారు. వారికి బాబు సమాధానమిస్తూ.. ‘మీ కష్టాలు మీకుంటే నా కష్టాలు నాకున్నాయ్. అందరికీ న్యాయం చేద్దాంలే’ అని అన్నారు. ‘ఎన్నికల సమయంలో మీరే కదా హామీలు ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు లేవం టే ఎలా’ అని నోముల దుర్గమ్మ గట్టిగా నిలదీసింది.

    రాజధాని సంగతి తర్వాత.. రైతుల విషయం చూడండి

    హైదరాబాద్ వంటి నగరాలు మూడు, నాలుగు నిర్మించే శక్తి ఉందంటూ సీఎం చెప్తుండగా.. టిడిపికే చెందిన మాజీ ఎంపీటీసీ కట్టా సత్యనారాయణ, మరికొందరు రైతులు కల్పించుకొని.. ‘రాజధాని సంగతి తర్వాత. ముందు మీరన్న రుణ మాఫీ, పొగాకు గిట్టుబాటు ధరల గురించి మాట్లాడండి’ అని అన్నారు.

    హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తా..

    నరసన్నపాలెంలో రైతులతో జరిగిన ముఖాముఖిలో గంగరాజు అనే రైతు కరెంటు సమస్యను ప్రస్తావించారు. ‘గవర్నర్ పాలనలోనే 4 గంటలు కరెంట్ వచ్చేది. మీరు వచ్చిన తర్వాత రోజుకు 2 గంటలే ఉంటోంది’ అని ప్రశ్నించారు. దీంతో బాబు ఆగ్రహిం చారు. ‘ఏం మాట్లాడుతున్నావ్. కథలు చెప్పొద్దు’ అంటూ గదమాయించారు. ‘సార్ నేను చెబుతోంది నిజమే’ అని ఆ రైతు అనగా.. బాబుకు ఆగ్రహం మరింత పెరిగింది. ‘ఏయ్ నువ్ ఊరికే అరవొద్దు. నేను ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడతా. నీకు సమస్యలు వస్తాయ్.

    నీ అడ్రస్ కనుక్కుని హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తా’ అని ఒకింత బెదిరింపు ధోరణితో మాట్లాడారు. గంగరాజు మళ్లీ స్పందిస్తూ.. ‘రెండు రోజులుగా కరెంట్ సరఫరా సరిగా లేదు. మంగళవారం అయితే గంట కూడా రాలేదు’ అని తెగేసి చెప్పారు. ఇందుకు సంఘీభావంగా పక్కనున్న రైతులు పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు. దీంతో బాబు ‘సరే.. నాకు పనుంది. డ్వాక్రా మహిళలతో కొయ్యలగూడెంలో సమావేశం ఉంది. నువ్వు అక్కడికి రా. నీ విషయం అక్కడ తేలుస్తా’ అంటూ ముందుకు సాగారు.

    కేసీఆర్ పిచ్చి తుగ్లక్‌లా మాట్లాడుతున్నారు]

  5. CVR Murthy

    Aaraku MP statement is dubious , She may leave

    • @ Murthy garu …

      I don’t think they will have much personal benefit’s in leaving bcs they will not get any Minister posts and they can be axed by the Party.
      Indian politics is sadly all about Personal benefit’s and this would apply for disgruntled TDP members as well .

  6. CVReddy

    బాబు కు అసలు మొగుడు జగన్ అయితే రంకు మొగుడు కెసిఆర్
    (పిచ్చి తుగ్లక్‌లా కేసిఆర్ -బాబు)

    రుణమాఫీ చేయకపోతే రచ్చే-జగన్ హెచ్చరిక

    దూసుకుపోతున్న కెసిఆర్, 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు బిక్కమొహం.

    4జి, వైఫై దిశగా అడుగులు రాష్టవ్య్రాప్తంగా విస్తరణ 4100 కోట్ల పెట్టుబడికి పథకాలు
    రిలయన్స్, ఐటి అధికారులతో సిఎం కెసిఆర్ చర్చలు

    హైదరాబాద్, జూలై 17: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలకు 4-జీ సేవలను అందించడానికి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మొదటి విడతగా హైదరాబాద్ నగరంతో పాటు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, 37 మున్సిపల్ పట్టణాలు, 220 మండల కేంద్రాలలో 4-జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే అంతకుముందుగా హైదరాబాద్ నగరాన్ని 4-జీ వైఫై నగరంగా మార్చేదిశగా ప్రభుత్వం తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ సేవలను అందించడానికి ముందుకు వచ్చిన రిలయన్స్ కంపెనీ వీటికిగాను సుమారు రూ. 4100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు అంచనా వేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గురువారం ఐటీ సేవల విస్తరణపై సంబంధిత మంత్రి కె తారకరామారావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, రిలయన్స్ కంపెనీ రాష్ట్ర సిఇవో కెఎస్ వేణుగోపాల్, కో-ఆర్డినేటర్ పివిఎల్ మాధవరావుతో చర్చించారు. సెప్టెంబర్ నాటికి హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో 4-జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. రాజధాని నగరంలో డిజిటల్ బ్రాడ్ బాండ్ ఇన్ఫస్ట్రక్చర్‌ను మెరుగు పర్చాలని ముఖ్యమంత్రి సూచించారు

    . http://www.andhrabhoomi.net/content/tech-telangana

  7. CVReddy

    మంత్రదండాల్లేవ్,కలిసి అభివృద్ధి సాధిద్దాం.
    పిచ్చి తుగ్లక్‌లా కేసిఆర్- అభినవ తుగ్లక్ బాబు
    ప.గో. పర్యటనలో చంద్రబాబు,రుణమాఫీపై తప్పని నిరసన ధ్వనులు

    ఆయన పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా కొన్నిచోట్ల రుణాల మాఫీపై రైతులు, మహిళలు ముఖ్యమంత్రిని నిలదీయటం కన్పించింది. ఒకచోట కాన్వాయ్‌ను అడ్డగించి, రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరెంటు విషయంలో కూడా సమస్యలు మరింత పెరిగాయని నిలదీశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు వాటి పరిష్కారానికి కొంత సమయం పడుతుందని, ఓపికగా ఉండాలంటూ హితవు పలుకుతూ ముందుకు సాగిపోయారు.

    http://www.andhrabhoomi.net/content/chandra-babu-18

  8. CVReddy

    రుణమాఫీ చేయకపోతే రచ్చే-జగన్ హెచ్చరిక

    శ్రీకాకుళం, జూలై 17: రైతుల రుణమాఫీపై మరో నెల రోజులు చూస్తాం.. తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. .ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు కాలయాపనతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

    ఆర్బీఐ రుణాల రీ-షెడ్యూల్‌కు అంగీకరించడంతో అదేదో తన గొప్పగా బాబు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కరవు, వరదలు వంటివి సంభవించినప్పుడు రుణాలు రీషెడ్యూల్ చేయడం సాధారణమేనని, గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ హయాంలో కూడా రీషెడ్యూల్ జరిగిందన్నారు. పది వేల కోట్ల రూపాయల రుణాలు మాత్రమే రీషెడ్యూల్ చేస్తామంటే మిగిలిన 90 వేల కోట్ల రూపాయల మాట ఏమిటని ప్రశ్నించారు. బ్యాంకర్ల ఉన్నత స్థాయి సమావేశంలో 87 వేల కోట్ల రూపాయలు రైతు రుణాలు ఉన్నాయని స్వయంగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పదివేల కోట్ల రూపాయల రీషెడ్యూల్ కోసం మాట్లాడుతుండడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. కోటయ్య కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని, ఇప్పటి వరకూ ఆ కమిటీ నివేదిక కూడా ఇవ్వలేదన్నారు.

    http://www.andhrabhoomi.net/content/jagan-4

  9. Vikram

    http://andhrabhoomi.net/content/kotha-velugu-krishnapatnam
    విద్యుత్ మొత్తం ఆంధ్రకే * ఏడాది చివరికి ప్రాజెక్టు పూర్తి
    ప్రస్తుత ఉత్పత్తి 800 మెగావాట్లు * పూర్తి సామర్థ్యం 1600 మెగావాట్లు
    హైదరాబాద్, జూలై 17: ఆంధ్ర రాష్ట్రానికి వెలుగు ప్రసాదించే కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఈ ఏడాది చివరికి పూర్తిస్థాయిలో 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయనుంది. విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రకు, ప్రాజెక్టు సకాలంలో అందిరావడంతో విద్యుత్ నిపుణులు, ఇంజనీర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర విభజన, మరోవైపు వినిమయ ప్రాతిపదికన విద్యుత్ కేటాయింపులతో నష్టపోయిన ఆంధ్రకు కృష్ణపట్నం ప్రాజెక్టు వరప్రదాయిని అని చెప్పవచ్చు. కృష్ణపట్నం విద్యుత్‌లో వాటా కావాలని తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కోరినా, ప్రతిపాదిత పిపిఏలను రద్దు చేసుకున్నందున కృష్ణపట్నం విద్యుత్‌ను సరఫరా చేసే ప్రసక్తిలేదని ఆంధ్ర జెన్కో అధికారులు తేల్చి చెప్పడం గమనార్హం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దార్శనికతతో కృష్ణపట్నం ప్రాజెక్టుకు మోక్షం లభించింది. విద్యుత్ సంక్షోభంతో సతమతమం అవుతున్న రాష్ట్రానికి కృష్ణపట్నం ప్రాజెక్టు పెద్ద ఉపశమనమని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జెన్కో పరిధిలో థర్మల్ విద్యుత్ సామర్థ్యం 2348.15 మెగావాట్లు. కాగా 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి అయితే జెన్కో సామర్థ్యం దాదాపు 4000 మెగావాట్లకు పెరుగుతుంది. ప్రస్తుతం 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మరో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తికి చకాచకా సాంకేతిక పనులు పూర్తవుతున్నాయి. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు దాదాపు 11000 కోట్లు ఖర్చయ్యింది. ప్రస్తుతం మరో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తికీ ప్రభుత్వం అనుమతి మంజూరైంది. ఒక మెగావాట్ థర్మల్ విద్యుత్‌కు ఐదారు కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, ప్రస్తుతం ఖర్చులు పెరగడం వల్ల ఏడు కోట్లకు చేరింది. 2008 జూలై 17న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దాదాపు 80శాతం నిధులు సమకూర్చింది. ఒడిశాలోని తాల్చేరు గనుల నుంచి 60శాతం, విదేశాల నుంచి 40శాతం బొగ్గు సమకూర్చుతున్నారు. ఏడాదికి తాల్చేరు నుంచి 40 లక్షల టన్నులు, విదేశాల నుంచి 20 లక్షల టన్నుల బొగ్గు సేకరిస్తారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 90 శాతం చేరుకోవాలనే లక్ష్యంతో అత్యంత ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాదాపు ఏడేళ్లలో 1600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించారు.
    ప్రస్తుతం జెన్కో పరిధిలో విటిపిఎస్ 1710, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ 1020 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. జల విద్యుత్ 1765.72 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ ఉంది. భౌగోళికంగా 1959 వరకు ఆంధ్రలో ఉన్న భద్రాచలం రెవెన్యూ డివిజన్ మళ్లీ ఇటీవల పార్లమెంటు చట్టంతో తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చింది. దీనివల్ల దిగువ సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టు 200 మెగావాట్ల సామర్థ్యం ఆంధ్రకు పెరిగింది. రాష్ట్రంలో సంయుక్త రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏపిజిపిసిఎల్ పరిధిలో 272 మెగావాట్లు, గ్యాస్ విద్యుత్ రంగంలో 2500 మెగావాట్లు, మినీ హైడల్ 48.16 మెగావాట్లు, పవన విద్యుత్ 306.12 మెగావాట్లు, బయోగ్యాస్ 234.47 మెగావాట్లు, మినీ పవర్ ప్లాంట్స్ కింద 36.33 మెగావాట్లు, ఇతర మార్గాల ద్వారా 56.16 మెగావాట్లు, సౌరవిద్యుత్ ద్వారా 21.10 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ ఉంది. కేంద్ర విభాగం, జెన్కో, ప్రైవేట్ ద్వారా 7708.36 మెగావాట్ల కెపాసిటీ విద్యుత్ రాష్ట్రంలో ఉంది. కృష్ణపట్నం 1600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తే 9300 మెగావాట్లకు ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ సామర్థ్యం పెరుగుతుంది.

  10. Nara Chowdary garu……….Intiko Udyogam isthanu antuntunta…..
    Nadella Chowdary garu…. Vunna Udyogam peekesthanu antunnadu !!
    What a pity ??

    http://www.bbc.co.uk/news/business-28348223

  11. @ Alqaeda …..

    We are already struggling with some Weeds in India so please don’t plant anymore .
    Any fanatism will only destroy mankind and some animals don’t understand this.

    http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2694949/Al-Qaeda-plans-final-jihad-India-Intel-report-points-terror-recruitment-drive-targeting-nations-Muslims.html

  12. CVReddy

    రుణమాఫీకి నెలరోజుల గడువు-జగన్
    నెల రోజుల పాటు రుణమాఫీ హామీపై వేచి చూస్తామని, ఆ తర్వాత రైతులతో కలిసి ఉద్యమిస్తామని ప్రకటించారు.ఈ లోగా శాసనసభ సమావేశాలు జరుగుతాయి కనుక అక్కడ ఎలాగూ ఈ అంశం పలుమార్లు ప్రస్తావనకు వస్తుంది.ఈలోగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఒక స్పష్టత ఇస్తే ఒకరకంగా ఉంటుంది.లేకుంటే ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రజలలోకి వెళ్లి పోరాడడానికి సిద్దం అవుతుందని భావించాలి.

    • Anil Reddy

      Jai Jagan….jai Jai Jagan …. Raithulatho vudhyaminchi Babu peecham anachaali …Jagan should also fight for Rayalaseema development

  13. CVReddy

    ఎక్కడైతే 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి లభిస్తుందో అక్కడే రాజధాని నిర్మాణం జరగాలి-మైసూరారెడ్డి
    అంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రైవేట్ భూముల కొనుగోలు సరికాదు ,ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి రాజధాని ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని

    రాజధాని విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సునిశితంగా ఆలోచించాలని సూచించారు. శివరామకృష్ణ కమిటీ కొన్ని ప్రాంతాలను సందర్శించనే లేదని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ప్రైవేట్ భూముల్లో రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులొస్తాయని హెచ్చరించారు. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రుల ప్రత్యేక హోదా, ప్యాకేజీల గురించి ఒక్క అడుగు ముందుకు కదల్లేదని మైసూరారెడ్డి విమర్శించారు.

  14. CVReddy

    మూడేళ్లలో తీరుస్తారా?

    హైదరాబాద్, జూలై 16 : వ్యవసాయ రుణాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎదురు చూస్తున్న విధంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) నుండి లేఖ వచ్చింది. 2013-14 సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్‌బిఐ పేర్కొంది. అయితే కేంద్రప్రభుత్వం రూపొందించిన విధి, విధానాలకు అనుగుణంగా రీషెడ్యూల్ చేయాల్సి ఉంటుందని, అంటే అతివృష్టి (కరవు) అనావృష్టి (్భరీ వర్షాలు, వరదలు, తుపాన్లు) వల్ల పంటలకు నష్టం జరిగిన ప్రాంతాలకు రీ షెడ్యూల్ వర్తింప చేయాల్సి ఉంటుందని ఆర్‌బిఐ గుర్తు చేసింది. రుణాలను రీషెడ్యూల్ చేస్తే మూడేళ్లలోగా చెల్లించే ఏర్పాటు చేస్తారా అంటూ ఆర్‌బిఐ సూటిగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు పూర్తి వివరాలతో లిఖితపూర్వకంగా అందిస్తే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్‌బిఐ పేర్కొంది.

    నిబంధనల ప్రకారం కరవు, అతివృష్టికి సంబంధించి ఖరీఫ్ పూర్తయిన మూడు నెలల్లోగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే ఆర్‌బిఐ అనుమతి అవసరం ఉండేది కాదు. రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితి వల్ల కరవు ప్రాంతాలు, తుపాన్లకు గురైన ప్రాంతాల ప్రకటన సకాలంలో చేసి ఉంటే రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ స్వయంగా రీ షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది.
    కరవు ప్రాంతాలు, తుపానుకు గురైన ప్రాంతాలను గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంలో జాప్యం జరిగింది. అందువల్ల ఆర్‌బిఐ నుండి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి వస్తోంది.

    http://www.andhrabhoomi.net/content/m-261

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s