గుజరాత్ కు పోటెత్తిన పెట్టుబడులు

గాంధీనగర్, జనవరి 11: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రం.. గుజరాత్‌లో జరుగుతున్న 7వ వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో పెట్టుబడులు పోటెత్తుతున్నాయి
రాబోయే 12-18 నెలల్లో వివిధ వ్యాపారాల్లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు.
ఇప్పటికే ఇక్కడ ఉన్న వివిధ ఆదిత్య బిర్లా గ్రూప్ పరిశ్రమల్లో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.
మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అమెరికాకు చెందిన సన్‌ఎడిసన్ గుజరాత్‌లో సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయి.

ఇకపోతే వెల్‌స్పన్ రెన్యువబుల్స్ గుజరాత్‌లో 1,000 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు 8,300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని ప్రకటించింది. గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్‌తో కలిసి 500, 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్‌స్పన్ వైస్ చైర్మన్ వినీత్ మిట్టల్ ఆదివారం సదస్సులో తెలిపారు. కల్యాణి గ్రూప్ సైతం 600 కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించింది.

హాంకాంగ్‌కు చెందిన చైనా లైట్ అండ్ పవర్ (సిఎల్‌పి) హోల్డింగ్స్ లిమిటెడ్ కూడా గుజరాత్‌లో 2,000 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకు 2 బిలియన్ డాలర్ల (దాదాపు 12,400 కోట్ల రూపాయలు) పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థ భావిస్తోంది. ఈ మేరకు సంస్థ సిఇఒ రిచర్డ్ లాన్‌కాస్టర్ తెలిపారు. మరోవైపు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మేజర్ వీడియోకాన్ గ్రూప్ సైతం 60,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫైబర్‌గ్లాస్ ప్లాంట్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేయాలనుకుంటోంది. 2వేల కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. కాగా, వీడియోకాన్ టెలికాం వ్యాపారంలో 49 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమని, మంచి ఆఫర్ వస్తే మేనేజ్ మెంట్ కంట్రోల్ వాటానూ అమ్మేసా తమని వీడియోకాన్ గ్రూప్ కో-ప్రమో టర్ రాజ్‌కుమార్ దూత్ తెలిపారు.

గుజరాత్‌లో 4,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న సుజుకి మోటార్ కార్ప్ కార్ల తయారీ ప్లాంట్.. 2017 నాటికి అందుబాటులోకి వస్తుందని సంస్థ చైర్మన్ ఒసాము సుజుకి ఆదివారం ఇక్కడ వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో మాట్లాడుతూ తెలిపారు

http://www.andhrabhoomi.net/content/s-3867

35 Comments

Filed under Uncategorized

35 responses to “గుజరాత్ కు పోటెత్తిన పెట్టుబడులు

 1. CV Reddy

  రోజూ 18 గంటలు కష్టపడుతున్నాను,ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను
  – కోతల రా(నా)నాయుడు (మళ్ళీ వేసేసాడు)
  ముసలి వారికి కూడా కనీసం 6 గంటల నిద్ర అవసరం , కాలకృత్యాలకు ఇంకో 2 గంటలు, కుటుంబ సభ్యుల కోసం ఇంకో 2 గంటలు వెరసి మొత్తంగా ఒక మనిషికి కనీసం సొంత అవసరాల కోసం 10 గంటలు అవసరం
  పొతే మిగిలినది 14 గంటలు మాత్రమే, మరి 18 గంటలు అంటాడేమిటి?
  ఎందుకింత ప్రచార కక్కుర్తి ?

  ఓహ్ సారీ ముని శాపం కదా , నిజం చెపితే తల వెయ్యి వక్కలు అని .
  అయితే ఓకే !

  ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను-పొలిటికల్ పోకిరి
  (నాకంటే పెద్ద నటుడు మా అల్లుడు-NTR)
  అట్నా, అదేంటి మరి రుణ మాఫీ అలా అయింది , అన్ని వంకరలు తిరిగింది
  నిరుద్యోగులకు 2 వేలు, ఇంటికో ఉద్యోగం, డ్వాక్ర రుణమాఫీ ఏదీ?

  ఎలాగు అను కుల మీడియా ఉంది కదా , డప్పు కొడుతుంది అని ఏమి కలర్ ఇస్తున్నావు నాయుడూ! ప్రజల జ్ఞాపక శక్తి మీద అపారనమ్మకం అనుకుంట ఈ అబద్దాల నాయుడుకు

 2. CV Reddy

  కారు జోరు, సైకిల్ బేజారు (కంటోన్మెంట్ ఎన్నికల్లో )
  మా సోనియమ్మ బొమ్మ తో గెలిచాము-VH, సర్వె
  TDP దెబ్బకు BJP అబ్బా !

  YS బొమ్మతో గెల్వలే, మా సోనియమ్మ బొమ్మతో గెలిచాము అన్న VH కు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో డిపాసిట్ కూడా రాలేదు, 4 వ అ స్థానం లో నిలిచాడు
  ఇక YS బ్రతికున్నప్పుడు వంగి వంగి దండాలు పెట్టిన సర్వె నేడు సోనియా బొమ్మ తో వెళితే ఆయనే కాదు అయన కొడుకు, కూతురు కూడా ఓడిపోయారు కంటోన్మెంట్ ఎన్నికల్లో

  కంటోన్మెంట్ TDP MLA సాయన్న కూతురు కూడా ఓడింది

  మొత్తానికి TDP తో ఊరేగుతున్నందుకు BJP కూడా భారీ మూల్యం చెల్లించుకొంది ఒక్క సీటు కూడా గెలవకుండా

  తెరాస:6/8, కాంగ్రెస్:2/8, TDP :0/8, BJP :0/8

 3. CV Reddy

  ఫ్రీ ఫ్రీ ఫ్రీ -ఆల్ ఫ్రీ బాబు
  రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రైవేటు సంస్థలకే -సింగపూర్ మంత్రి ఈశ్వరన్

  మరి ప్రైవేట్ సంస్థలు కూడా మాస్టర్ ప్లాన్ ఫ్రీ గా ఇస్తాయా?
  ఇస్తే ఏ రూపం లో వారికీ లబ్ది చేకూరుస్తున్నాడు సింగపూర్ బాబు
  పైకి అంతా ఫ్రీ అంటాడు లోపల దోపిడీ కి అనుమతులు

  బాబు ఆస్తులు సింగపూర్ లో నే కదా ఎక్కివ భాగం ఉండేది

 4. Rastranni munchuthunna variki …………Rythulu oka lekka ??

  Our Motto …….Loot………Invest ……..Loot ?

  http://www.sakshi.com/news/andhra-pradesh/sujana-chowdary-kin-betrayed-maize-farmers-203266?pfrom=home-top-story

  Ethics and Human values …….Never heard of them !!
  Velugulu ???

 5. Sad …..this is how money and greed can destroy talent and realtionships ?

  http://www.greatandhra.com/articles/special-articles/disgusting-are-you-watching-this-chakri-63019.html

  Finally we take nothing with us .

 6. Ravi

  NLR and CVR sir, can you please send your Facebook ID’s? mine is Ravi Kiran.

 7. Kulam kosam……Kalam ni addam peettukuni ….Kotlu dochukuntu
  Neethulu palika varini ………Ami Peru petti Pilavali ??

  http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/chandra-babu-and-vemuri-radhakrishna-did-injustice-to-telangana-1-2-452961.html#.VLNhsWIgGK0

 8. Ravi

  CVR Garu, small suggestion. Can we create an account in Facebook which takes sakshi or YSRCP messages and post in it. Currently if messages are tagged with sakshi or YSRCP few neutral people are not seeing them. The account should name it like AP government transperancy.

 9. CV Reddy

  గుజరాత్ కు లక్షల కోట్ల పెట్టుబడులు
  (ప్రపంచానికి పాఠాలు చెప్పిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ కోతల రా(నా)యుదు ఎక్కడ?
  మోడి నన్ను చూసి కాపి కొట్టాడు -BJP తో పొత్తుకు ముందు అబద్దాల నాయుడు
  బాబు తరవాత CM అయిన మోడీ వరుసగా ఒంటరిగా 3 సార్లు ఎన్నికల్లో గెలిచాడు, ప్రధాని కూడా అయ్యాడు కానీ స్వయం ప్రకాశం లేని చంద్రుడు ఇప్పటికి 2 సార్లు మాత్రమే ఎన్నికల్లో పార్టీని గెలిపించాడు అదికూడా వేరేవాళ్ళ కాళ్ళు , గడ్డాలు పట్టుకొని.
  ఊరికే సింగపూర్ , జపాన్ అని ప్రత్యెక విమానాలు వేసుకొని తిరగదమెనా? ఏమైనా పెట్టుబడులు వచ్చాయా?)

  • CVR Murthy

   ఇదంతా పాత పద్ధతే .ఇలాంటి ఉత్సవాలప్పుడు నోటికి తోచిన పెట్టుబడులు చెప్పడం తరువాత మరచిపోవడం చంద్ర బాబు గతంలో ఇదే చేసేడు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s