ప్రభుత్వమే మీడియా విశ్లేషకులను నియమిస్తుంది

ఎపి ప్రభుత్వం మీడియా,ప్రచారం విశ్లేషణలలో కొత్త పుంతలు తొక్కడానికి ప్రయత్నాలు ఆరంబించింది. ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలను ప్రచారం చేసే కార్యక్రమాన్ని సమన్వయం చేయడానికి పి.ఆర్.ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు మీడియా కదనాలను విశ్లేషణ చేయడానికి కూడా టీమ్ లు ఏర్పాటు చేయబోతున్నారు.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

దీని ప్రకారం ముఖ్యమంత్రి కార్యాలయంలో మీడియా కథనాలపై విశ్లేషించేందుకు ప్రత్యేక బంద్రాన్ని నియమించడానికి వీలుగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.ఇద్దరు సీనియర్ జర్నలిస్టులను విశ్లేషకులుగా నియమిస్తారు.వీరికి ఒక్కొక్కరికీ జీతం, అలవెన్సులు కలిపి రూ.34,653 చెల్లిస్తారు. అలాగే.. డేటా రికార్డు పరిశీలకులుగా 23 మందిని నియమించనున్నారు. వీరికి జీతం, అలవెన్సులు కలిపి ఒక్కొక్కరికీ రూ.23,564లు చెల్లిస్తారు., మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సమన్వయం ఏర్పరచుకునేందుకు వీలుగా పీఆర్వోలను నియమిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. మొత్తం 20 మంది సమన్వయకర్తలను నియమించనున్నారు. జర్నలిజంలో ఒకటి, రెండేళ్ల అనుభవం ఉన్న వారిని నియమిస్తారట. నెలకు కన్సాలిడేట్‌ పద్ధతిన రూ.20 వేలు చొప్పున చెల్లిస్తారు. అలాగే ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ కార్యాలయంలో ఇద్దరు సీనియర్‌ జర్నలిస్టులను నియమిస్తారని సమాచారం.ప్రభుత్వం ఈ విషయంలో కొత్త పుంతలు తొక్కుతోందా!

http://kommineni.info/articles/dailyarticles/content_20150114_11.php?p=1421218056255

5 Comments

Filed under Uncategorized

5 responses to “ప్రభుత్వమే మీడియా విశ్లేషకులను నియమిస్తుంది

  1. Vikram

    బఫూన్ నామ సార్థకం చేసుకుంటున్న పొలిటికల్ పోకిరి..

  2. Ravi

    This is heights. What is the purpose of journalism if it is appointed by government itself? They will be a TDP boot suckers. Idiotic Idea, I am getting frustration by looking at the government decisions and their stupid reasoning. Really stupid.

  3. CV Reddy

    చెల్లని నాణాన్ని జేబులో వేసుకొని మార్కెట్కు ఎన్ని సార్లు వెళ్ళినా ఫలితం ఇలానే ఉంటుంది.
    – TDP తో పొత్తుపై కంటోన్మెంట్ ఫలితాల తరువాత బిజెపి EX-MLA శ్రీనివాసరెడ్డి (V6 చానల్)
    నిజమే BJP కి గుదిబండ గా మారిన TDP
    దేశమంతా బిజెపి హవా సాగుతున్నా కాలం లో ఇలాంటి ఓటమి బాధ కలిగించడం సహజమే!

  4. CV Reddy

    నిజంగా పని చేసేవాడికి ప్రచారం అవసరమా?
    (రోజుకు18 గంటలు కష్టపడుతున్నా-కోతల రా(నా)యుదు)
    బాబు సూపర్ అని చెప్పడానికి 50 మంది జర్నలిస్టుల నియామకం( ప్రజల డబ్బుతో)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s