ఎందుకీ ఆర్భాటం!

ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డిని విస్మరించిన ప్రభుత్వం * స్టార్ హోటళ్లలోనే సదస్సులు * ప్రజాధనం వృథా
హైదరాబాద్, జనవరి 29: అందుబాటులో ఉన్న నివాసాలను విడిచిపెట్టి కొత్త ఆవాసాలను వెదుక్కునే సంస్కృతిని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తూనే ఉంది. గత ప్రభుత్వాలు ఇటువంటి చర్యలకు దిగినా అంతగా సమస్యలేదు. అయితే ఆర్థికభారంతో అతలాకుతలమవుతున్న నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంకా కోట్లాది రూపాయలను వృధాగా ఖర్చు చేయడంపై అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా మానసిక ఉల్లాసానికి మూడు రోజులపాటు చేస్తున్న ఖర్చుపై అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మర్రి చెట్టు నీడను విడిచిపెట్టినట్లుగా ప్రభుత్వ వైఖరి ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా హక్కు ఉంది. దీనికయ్యే మొత్తం ఖర్చును జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం 42 శాతాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 58 శాతాన్ని భరించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం మేరకు ప్రతి నెలా ఆంధ్రప్రదేశ్ తన వాటా 58శాతం నిధులను చెల్లిస్తూనే ఉంది. ఈ సంస్థ ప్రాంగణంలో సమావేశాలు, సదస్సులు పెట్టుకునేందుకు సౌకర్యాలు కూడా విస్తృతంగా ఉన్నాయి. ఏటా దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయల వరకు ఎంసిహెచ్‌ఆర్‌డిసి ఖర్చు అవుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటాగా ఐదు కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతటి భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నప్పటికీ.. అక్కడి సౌకర్యాలను వినియోగించుకోకపోవడంతో కోట్లాది రూపాయలు వృధాగా పోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అత్యంత సౌకర్యవంతమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఖరీదైన హైటెక్స్, నోవోటెల్ వంటి ప్రయివేటు హోటళ్లవైపే మొగ్గు చూపిస్తోంది. తాజాగా మానసిక ఆనందాన్ని పెంపొందించేందుకు ఏర్పాటుచేస్తున్న శిక్షణ తరగతులను ఈ ప్రాంతంలోనే నిర్వహిస్తున్నారు. దానికోసం చేస్తున్న ఖర్చు ఆకాశాన్ని అంటుతోంది.

ఒక్క పూట అల్పాహారం కోసం మనిషికి ఆరు వందలు, భోజనానికి 13 వందలు చొప్పున ఖర్చు చేసి మరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఒక రోజు కార్యక్రమం నిర్వహణ కోసం దాదాపు 30 లక్షల రూపాయలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. మొత్తం కార్యక్రమానికి 1.50 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని హెచ్‌ఆర్‌డిలో నిర్వహిస్తే పాతిక లక్షలు కూడా ఖర్చు కాదని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం అడపాదడపా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ భవనాలను వినియోగించుకుంటోంది. ఎక్కువగా ప్రయివేటు హోటళ్లవైపు వెళ్లకుండా చూసుకోవడం ద్వారా ఆర్ధిక ఇబ్బందులు రాకుండా చూసుకుంటోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం హెచ్‌ఆర్‌డిని విస్మరిస్తోంది. ఇలా చేసే బదులు పూర్తిగా హెచ్‌ఆర్‌డిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేస్తే ఏటా ఐదు కోట్ల రూపాయలైనా మిగులుతాయని అంటున్నారు.

14 Comments

Filed under Uncategorized

14 responses to “ఎందుకీ ఆర్భాటం!

 1. Vikram

  పని ఎగ్గొట్టి యోగ క్లాస్సులు అంట సెంద్రయ్య గారు… ఒక ఉద్యోగి 1 గంట లేదా 2 గంటలు వేస్ట్ చేస్తేనే సహించరు ఎవరూ కూడా ..అలాంటిది 3 రోజులు బొక్క.. మల్లి దానికి దుబారా ఖర్చు..అధికార దుర్వినియోగానికి పరాకాష్ట…

 2. “Manam manam kalasi ” vurlu dochukuntunna rojullo …….
  It is good to see ………….Some honest politicians .

  http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1345:2015-01-23-14-42-25&Itemid=780

 3. CV Reddy

  జగ్గీ వాసుదేవ్ యోగా కేంప్ లో…… ముఖ్యమంత్రి…..
  తొలి వరుసలో……. నేలమీద కూర్చుని……. ఆసనాలు వేశారు….
  @ ‘ఈనాడు’ మొదటి పేజీలో ప్రధాన వార్త
  *********************************************************************************
  నాకర్దం కానిది……. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటో…???
  # సుమారు 2 కోట్ల పైగా ఖర్చు పెట్టి మరీ ఏర్పాటు చేసిన కార్యక్రమం…
  ముఖ్యమంత్రి పాల్గొనకుండా ఉంటాడా…???
  # రాష్ట్ర ముఖ్యమంత్రి ముందువరసలో కాకుండా,
  ఆ చివరాకరన ఎక్కడో మూలన కూర్చొంటాడా….????
  అన్నిటికన్నా నవ్వు వచ్చేదేంటంటే….
  ఆసనాలు నేల మీద కాకుండా ఇంకెక్కడ వేస్తారబ్బా……???
  కొంపదీసి అందరూ అక్కడ గాలిలో తెలుతూ వేస్తుంటే…..
  ఈయన మాత్రమే నేల మీద కూర్చొని వేస్తున్నాడా….. ఏంటి….????
  అయినా మనకెందుకు లేండి…
  అసలే అత్యంత నీతి నిజాయతులతో, నిష్పక్షపాతం గా వార్తలు ప్రచురించే పత్రికాయే……
  -Srinivasa rao, Sinivasa rao Bora

 4. CV Reddy

  రాజదాని భూ సమీకరణ- శర్మ హెచ్చరిక
  రాజధాని పేరుతో సాగుతున్న భూముల సేకరణ అంతా రాజ్యాంగ విరుద్దంగా ఉందని ప్రముఖ పర్యావరణ వేత్త,మాజీ ఐఎఎస్ అదికారి ఇఎఎస్ శర్మ అన్నారు. ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ దీని ప్రభావం మొత్తం పదమూడు జిల్లాలపై పడుతుందని,ఎన్నోవిధాలుగా ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.ముప్పైవేల ఎకరాలను బూ సమీకరణ పద్దతి ద్వారా సేకరించడం రాజ్యాంగ విరుద్దమని, మానవ హక్కుల ఉల్లంఘన కూడా అవుతుందని ఆయన అన్నారు.రైతుల అభిప్రాయాలతో సంబందం లేకుండా చేయడం దారుణమని అన్నారు. ముప్పైవేల ఎకరాల భూమి సమీకరణకు, దానికి సంబందించి ఇతర వ్యయాలు అన్నిటిని రాష్ట్రం అంతటా భరించవలసి ఉంటుందని, ఉత్తరాంద్ర, రాయలసీమ కూడా ఈ భారాన్ని మోయాల్సి వస్తుందని ఆయన అన్నారు.ఇది అన్ని రకాలుగా అనర్ధాలకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
  http://kommineni.info/articles/dailyarticles/content_20150130_4.php?p=1422610523750

 5. CV Reddy

  KCR నా కాలిగోటికి కూడా సరిపోడని గతం లో కడియం అన్నాడు-మోత్కుపల్లి
  [TDP లో ఉండడం కంటే అడవిలో కట్టెలు కొట్టుకోవడం మేలు
  -తనకు రాజ్యసభ ఇవ్వకుండా గరికపాటి చౌదరి కి ఇచ్చినప్పుడు కన్నీటితో మోత్కుపల్లి మాటలు

  నార నారా పోరా పోరా , NTR కు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల కన్నా చరిత్ర ఉంటుందేమో కానీ నీకు అది కూడా ఉండదు
  -NTR ను పదవినుంచి దించినప్పుడు బాబు నుద్దేశించి మోత్కుపల్లి అన్న మాటలు ]

 6. CV Reddy

  కరో కరో జల్సా జల్సా!
  (బీద అరుపులు, హుండీలు-40 ఏళ్ల అనుభవం మరి!)
  కదిలితే ప్రత్యెక విమానం లో ప్రయాణం, స్టార్ హోటల్స్ లో మీటింగు లు , మల్లా డబ్బుల్లేవ్)
  ఒక్క పూట అల్పాహారం కోసం మనిషికి ఆరు వందలు, భోజనానికి 13 వందలు చొప్పున ఖర్చు చేసి మరీ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఒక రోజు కార్యక్రమం నిర్వహణ కోసం దాదాపు 30 లక్షల రూపాయలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. మొత్తం కార్యక్రమానికి 1.50 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని హెచ్‌ఆర్‌డిలో నిర్వహిస్తే పాతిక లక్షలు కూడా ఖర్చు కాదని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply to Vishnu Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s