రాష్ట్రపతి.. ప్రధానమంత్రి.. చంద్రబాబు..!

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అది కూడా అధికారంలో ఉన్నాడంటే, ఏపీ ముఖ్యమంత్రి హోదా పేరు ముందు ఉంటే బాబు కొన్ని అరుదైన ఫీట్లను సాధిస్తూ ఉంటారు. వెనుకటికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారత దేశంలో ఒకడే ముఖ్యమంత్రి ఉన్నాడేమో అనేంత స్థాయి ఇమేజ్ ను తెచ్చుకొన్నాడాయన. తన బలం మీద ఆధారపడి ఉన్న ఎన్డీయేను ఒక ఆట ఆడిస్తూ బాబు విదేశీ అధ్యక్షులతో చేయీ చేయీ కలిపేంత స్థాయికి ఎదిగాడు.

అయితే అలాంటి ఫీట్ల వల్ల పదేళ్ల పాటు ప్రతిపక్షానికి పరిమితం కావడమే తప్ప మరో ప్రయోజనం దక్కలేదు. అప్పటి సంగతి అలా ఉంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా దక్కాకా బాబు చాలా ఫీట్లను సాధిస్తున్నాడు.

మొదటిది ప్రత్యేక విమానంలో విదేశీ పర్యటనకు వెళ్లడం. ఇలాంటి ఫీట్ ను సాధించిన ఏకైక ముఖ్యమంత్రిగా ఇటీవలే బాబు రికార్డు సృష్టించారు. సాధారణంగా భారత దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతులు మాత్రమే ఇలా విదేశాలకు వెళ్లినప్పుడు ప్రత్యేక విమానాల్లో వెళతారు. ఇక విదేశాంగ మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. సర్వీస్ విమానాల్లోనే ఏదో ఒక సీట్లో అడ్జస్ట్ అయి వెళతారు. అయితే బాబు అందరిలాంటి సీఎం కాదు… అది ఆయన ప్రగాఢ విశ్వాసం.

అందుకే ఇటీవల తన ట్రూపు ను తీసుకెళ్లి విదేశీ పర్యటనలు చేసినప్పుడు ఎంచక్కా ప్రత్యేక విమానం వేసుకొళ్లాడు. తద్వారా ప్రత్యేక విమానంలో విదేశం వెళ్లిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాడు. అసలే చితికిపోయిన ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఇలాంటి బాబు వ్యవహారాలు గుదిబండగా మారుతున్నాయనే విమర్శలు వస్తున్నా బాబు లెక్క చేయడం లేదు!

ఇప్పుడు మరోసారి బాబు రాష్ట్రపతి, ప్రధానమంత్రిల తర్వాత తనేనని అనిపించాడు. వరంగల్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో బాబు ఈ ఫీట్ ను సాధించారు. వరంగల్ పర్యటన నేపథ్యంలో బాబు భద్రత కోసం ఏపీ పోలీసులు ప్రత్యేక జామర్ ను ఏర్పాటు చేశారట. పోర్టబుల్ ఆర్ఎఫ్ జామర్ అనేది ఇది అత్యంత విలువైనదట. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ నుంచి తెప్పించారట.

ఇంకా విశేషం ఏమిటంటే.. ఇలాంటి జామర్ ను భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి ల భద్రతా ఏర్పాట్లలో మాత్రమే ఇప్పటి వరకూ వినియోగిస్తున్నారు. అయితే బాబుకు ఏర్పాటు చేయదలిచిన ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా వరంగల్ పర్యటనలో బాబు భద్రతా బలంగం ఈ జామర్ ను వినియోగించిందట. తద్వారా బాబు మరోసారి దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రిల తర్వాతి స్థాయి తనదేనని పించాడు.

మొత్తానికి ఏపీ ఆర్థిక వ్యవస్థకూ.. బాబు ఆడంబరాలకూ ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. ఏదైతే అదైంది.. అధికారంలో ఉన్నాం.. అన్నింటినీ అనుభవించేద్దాం.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నాడు ఏపీ ముఖ్యమంత్రుల వారు. అనుభవించు రాజా…!

-Great Andhra

34 Comments

Filed under Uncategorized

34 responses to “రాష్ట్రపతి.. ప్రధానమంత్రి.. చంద్రబాబు..!

  1. CV Reddy

    ఎమ్బీయస్‌: ఆంధ్రకు పరిశ్రమలు తరలివస్తాయా? – 1
    http://telugu.greatandhra.com/articles/mbs/mbs-ap-ki-industries-1-59720.html

  2. CVR Murthy

    Let YSJ wish Indian team through Social Media

  3. CVR Murthy

    CBN and KCR are using every opportunity to arouse regional emotions. Krishna water sharing is the latest. They want to create perception in the minds of people that they fought tooth and nail to get/give water and other interests. This is all political drama being enacted by KCR and CBN.

  4. Vikram

    Way to go..

    వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం హంద్రినీవా, గండికోట ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన కడప స్టేట్ గెస్ట్ హౌస్లో అధికారులతో భేటీ అయ్యారు. రాయలసీమకు ప్రధానమైన ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఉన్న అడ్డంకులపై ఆయన ఆరా తీశారు.
    ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కావలసిన వివరాలు, ఇతర అనుమతుల అంశాలపై వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. ప్రభుత్వం కేవలం 20 శాతం నిధులు ఇస్తే…ప్రాజెక్టులు పూర్తి అవుతాయి కదా అని ఆయన అన్నారు.

    http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-review-meeting-on-handrineeva-gandikota-212331

  5. An elderly lady who was not scared to tell the Weed that they are Bad.

    http://www.dailymail.co.uk/news/article-2952226/The-granny-stood-ISIS-Elderly-woman-filmed-confronting-militants-branding-devils-quoting-verses-Koran-forbid-slaughter.html

    If she could do it …………why can’t the 95 % public in AP ??

  6. CV Reddy

    ష్, మాట్లాడకండి అని జేసీ కి క్లాస్ తీసుకొన్న బాబు
    (ఏమి మాకు రావా నిజాలు చెప్పడం రెడ్డి గారూ,కాకపోతే ముని శాపం కదా అర్ధం చేసుకోరూ!)

    • Vikram

      దివాకర్ రెడ్డి కి నోరు ఊరక ఉండదు.. ఖచితం గా తెదేపా లో గౌరవం పోగొట్టుకుంటాడు…

  7. CV Reddy

    విస్తరణలో సొంత కులానికి పెద్దపీట? ఆ విధంగా ముందుకు పోతున్న బాబు
    [పయ్యావుల కేశవ్ చౌదరి, గాలి ముద్దు కృష్ణమ నాయుడు మంత్రివర్గం లోకి?(10TV)]
    13 జిల్లాల AP లో 19 మంది ఉన్న క్యాబినెట్ లో ఇప్పటికే 5 గురు బాబు కులస్తులు , వీరి చేరికతో 7 కు పెరగనునున్నది బాబు కులస్థుల సంక్య
    వీరు కాకా కేంద్రమంత్రి సుజన చౌదరి ఉన్నారు
    వీరే కాక క్యాబినెట్ ర్యాంకు పదవుల్లో స్పీకర్ కోడెల చౌదరి, రాష్ట్ర ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు చౌదరి, కేంద్రం లో రాష్ట్ర అధికార ప్రతినిధి కంభంపాటి చౌదరి ఉన్నారు

    మొత్తానికి 13 జిల్లాల AP లో క్యాబినెట్ ర్యాంకులో ఇప్పటికే బాబు కులస్తులు 9 మంది ఉన్నారు, విస్తనరణలో మరో ఇద్దరు చేరే అవకాసం!

  8. CV Reddy

    AP ని సింగ ‘పూర్’ చేస్తా-పిట్టల దొర
    (చేసారుగా 7 నెలలకే జీతాలకు కూడా డబ్బులు లేకుండా ?)
    అది సరే ముందు ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరును ను చేయి చూద్దాం.
    (నిమ్మకూరుకు బస్సులు కూడా పొవట)
    http://kommineni.info/articles/dailyarticles/content_20150213_4.php?p=1423812476944
    ఛీ దీనెమ్మ జీవితం, ఒక్కరోజన్నా నిజం చెబితే వినాలనే కోరిక నేరవేరదా?

  9. CV Reddy

    బాబు చుట్టూ వెధవలు- TDP MP జేసీ దివాకర రెడ్డి(నమస్తే తెలంగాణా)
    (ఊరుకో అన్నా, మీరు ప్రత్యేకంగా చెప్పాలా ఏమిటి?
    ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరుతాయి కదా !)
    9 సం అవినీతికి పాల్పడిన బాబు, పెద్ద దొంగల ముఠా నాయకుడు -2009 లో PRP పవన్
    (ఏంటో అప్పుడప్పుడు కొన్ని నిజాలు ఎంత దాచినా ఆగవు కదా !)

  10. CV Reddy

    ఊరుకో అన్నా, మీరు ప్రత్యేకంగా చెప్పాలా ఏమిటి?
    ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరుతాయి కదా !
    9 సం అవినీతికి పాల్పడిన బాబు పెద్ద దొంగల ముఠా నాయకుడు -2009 లో PRP పవన్
    ఏంటో అప్పుడప్పుడు కొన్ని నిజాలు ఎంత దాచినా ఆగవు కదా !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s