బోగస్ ఓట్లు 6 లక్షలపైనే!

– ఒక్క మల్కాజిగిరి సెగ్మెంట్ లెక్క ఇది
– 3 నెలల్లో జోరుగా బోగస్ ఓట్ల నమోదు
– హైదరాబాద్ శివార్లలో ఆంధ్రామాయ
– చిరునామా లేకుండానే ఓటర్లుగా రిజిస్టర్
– నకిలీలతో ఎన్నికల ఫలితాలు తారుమారు
– ఖమ్మంలోనూ ఇదే పరిస్థితి..
– ఆధార్ లింక్‌తో బయటపడుతున్న మోసం

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఊహించినట్లే హైదరాబాద్ నగర శివార్లలో బోగస్ ఓట్ల గుట్టు రట్టవుతున్నది. బోగస్ ఓట్లు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. గత ఏడాది సాధారణ ఎన్నికలకు ముం దు ఆంధ్ర వలస ఓటర్లు ఆన్‌లైన్‌లో జరిపిన కుట్ర ఆధార్ కార్డు అనుసంధానంతో బట్టబయలవుతున్నది. ఎన్నడూ లేనివిధంగా గత సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు లక్షలాదిగా పుట్టుకొచ్చిన బోగస్ ఓట్లు ఎన్నికల ఫలితాలను తారుమారు చేశాయి. ఒక్క మల్కాజిగిరి పార్లమెంట్ నియోజవర్గంలోనే దాదాపు 6,40,000 పైచిలుకు బోగస్ ఓట్లు నమోదైనట్లు తాజా పరిశీలనలో తేలింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. బోగస్ ఓట్ల ఏరివేతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.

హైదరాబాద్ శివార్లలోనే కాకుండా ఖమ్మం జిల్లా కొత్తగూడెం తదితర నియోజకవర్గాలలో కూడా బోగస్ ఓట్లు వేల సంఖ్యలో బయటపడుతున్నాయి. 2009లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుమారు 23, 50,000 ఓటర్లుండగా 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి ఏకంగా 31,83,000కు పెరిగారు. ఎన్నికలకు కేవలం మూడునెలల ముందే దాదాపు ఆరు లక్షల పైచిలుకు ఓటర్లు ఆన్‌లైన్‌లో నమోదైనట్లు అధికారుల పరిశీలనలో స్పష్టమైంది. వారందరికీ అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోనూ ఓట్లున్నట్లు తేలింది. వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు హైదరాబాద్‌లో తమ పట్టునిలుపుకోవడానికి ఆన్‌లైన్‌లో తప్పుడు చిరునామాలతో ఓట్లు నమోదు చేసుకున్నట్లు విమర్శలొచ్చాయి. గతేడాది ఏప్రిల్ 30న తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరుగగా, మే 7న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉండే చాలామంది కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, మల్కాజిగిరి నియోజకవర్గాలలో ఓటర్లుగా ఆన్‌లైన్‌లో నమోదుచేసుకొని ఏప్రిల్ 30న తెలంగాణలో మే 7వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లేశారు. దీనిపై శివాలెత్తిన డూప్లికేట్లు అన్న శీర్షితో మే 21న నమస్తే తెలంగాణలో వార్త ప్రచురితమైంది.

ఆ తర్వాత అధికారులు దానిపై దృష్టి సారించారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో సెటిలర్ల పేరిట వేలమంది ఓటర్లుగా నమోదుచేసుకొని రెండు రాష్ర్టాల్లోనూ ఓట్లు వేసి ఫలితాలను తారుమారుచేసినట్లు ఆధారాలున్నాయి.

ఆధార్ లింక్‌తో మోసం బట్టబయలు
ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేసేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఆధార్ లింక్‌తో బోగస్ ఓటర్ల బాగోతం బట్టబయలైంది. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానిస్తూ అధికారులు చేస్తున్న పరిశీలనలో విస్మయకర వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. కూకట్‌పల్లి నియోజవర్గంలోని దాయార్‌గూడలో 5-6-119/6 ఇంటి చిరునామాతో 36 ఓట్లు నమోదయ్యాయి. కానీ ఆ ఇంట్లో కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నట్లు ఇటీవల అధికారుల పరిశీలనలో తేలింది. మిగతా వారంతా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే. వారంతా తప్పుడు అడ్రస్‌తో ఆన్‌లైన్‌లో ఓట్లు నమోదుచేసుకున్నట్లు వెల్లడైంది.

కూకట్‌పల్లి ప్రకాశంనగర్‌లోని రత్న నిలయంలో 130 నుంచి 140 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాలో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అక్కడ 30 మంది కూడా లేరు. కూకట్‌పల్లి ఎల్‌ఐజీ, ఎంఐజీలోని ఒక్కో ఇంట్లో 30 నుంచి 40 మంది ఉన్నట్లు ఓటర్ల జాబితాలో ఉండగా అందులో సగం మంది బోగసేనని తేలింది. కొన్ని పోలింగ్ కేంద్రాలలో 50 శాతానికి పైగా ఓటర్లు చిరునామా లేకుండానే జాబితాలో నమోదయ్యారు. కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని 326, 327, 375 పోలింగ్ కేంద్రాల్లో సమగ్ర పరిశీలన జరిగింది. ఈ మూడు కేంద్రాలలో 2,786 మంది ఓటర్లుండగా 1,281మంది అసలు చిరునామాలో లేకపోవడం గమనర్హం. వారంతా బోగస్ ఓటర్లేనని అధికారులు తేల్చారు. ఆంధ్రప్రాంతానికి చెందిన నాయకులు వ్యూహాత్మకంగానే ఆన్‌లైన్‌లో నకిలీ ఓట్లను నమోదు చేయించారు. కూకట్‌పల్లిలో దాదాపు 85 వేలు, శేరిలింగంపల్లిలో లక్ష, కుత్బుల్లాపూర్‌లో 60 వేల వరకు ఆన్‌లైన్‌లో నకిలీ ఓట్లు నమోదైనట్లు అంచనా.

40 శాతం మందికి రెండుచోట్ల ఓట్లు
రెండు రాష్ర్టాల్లో ఎన్నికలు వేర్వేరు తేదీల్లో జరపడం వల్ల భారీ సంఖ్యలో ఓటర్లు రెండు చోట్ల ఓట్లు వేసినట్లు ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. నకిలీ ఓట్ల నివారణకు ఆధార్ కార్డును అనుసంధానించే పని చేపట్టడంతో మొత్తం గుట్టురట్టవుతున్నది. ప్రస్తుతం ఆధార్ లింక్‌తో జీహెచ్‌ఎంసీ అధికారులు కేసీహెచ్‌బీ కాలనీతోపాటు కొన్ని పోలింగ్ బూత్‌ల కేంద్రంగా జరిపిన సర్వేలో దాదాపు 40శాతం మందికి రెండుచోట్ల ఓట్లు ఉన్నట్లు తేలింది. ఓటర్లుగా నమోదైన చాలామందికి ఆధార్‌కార్డు కాదు కదా ఎలాంటి ఆధారం లేదు. కొన్ని చోట్ల ఒకే వ్యక్తికి కూకట్‌పల్లి, శేరిలింగంపల్లితోపాటు ఆంధ్రలో కూడా ఓట్లున్నట్లు తేలింది. నకిలీ ఓట్లవల్లే తాము ఓడిపోయామని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన గొట్టిముక్కల పద్మారావు, కొలను హనుమంత్‌రెడ్డి, శంకర్‌గౌడ్, రామ్మోహన్‌గౌడ్‌లు హైకోర్టులో వేసిన పిటీషన్‌పై విచారణ మొదలయ్యింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్17,18 ప్రకారం ఒక ఓటరు ఒకటికంటే ఎక్కువచోట్ల ఓట్లు వేస్తే అది చెల్లదు. సాధారణ ఎన్నికలలో చాలా మంది రెండు చోట్ల ఓట్లు వేసినందున మొత్తం ఎన్నికనే రద్దు చేయాలని పిటిషన్‌లో టీఆర్‌ఎస్ నేతలు కోరారు.

http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/6-lakh-on-a-bogus-voter-cards-1-2-475186.html#.VTMvfyGqqkq

14 Comments

Filed under Uncategorized

14 responses to “బోగస్ ఓట్లు 6 లక్షలపైనే!

 1. CV Reddy

  బాబు చిలకపలుకులు
  కాంగ్రెస్ నేతలకు ముడుపులపైనే యావ-మాజీ కాంగ్రెస్ మంత్రి , AP CM బాబు
  అందుకే మొన్న ఎన్నికల్లో 33 మంది కాంగ్రెస్ నాయకులకు టికెట్లు ఇచ్చాడు, మంచి వాటా ఇస్తారని.
  NTR మొదలెట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ వాళ్ళు పూర్తి చేయలేదు, అనంతపురంకు నేను ఎంతో చేశాను- బాబు
  NTR తరువాత 9 సం CM గా ఉన్నబాబెందుకు పూర్తిచేయలేదు ?
  గతం లో అనంతపురం జిల్లాను మీరు దత్తత తీసుకొన్నారు అయినా దేశం లోనే రెండవ కరువు జిల్లాగా అనంతపురం ఎందుకుంది? NTR ను కూడా ఇక్కడినుంచి గెలిపించారు, ఇప్పుడు బాలయ్యను గెలిపించారు అయినా ఏమిలాభం ?

 2. Vikram

  “హంద్రి నీవా , తెలుగు గంగ లు ఎన్ టి ఆర్ , నేనే ప్రారంభించాము..”- బాబు గారు.. ప్రారంబించడం అంటే శంఖు స్థాపనలు చేయడం… దిక్కులేని దాని లాగా వదిలేయడమా.. . 2004 తరువాత నే సమైక్య రాష్ట్రం లోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఊపిరి పోసుకున్నాయి అనే సంగతి అందరికి తెలుసు… వై ఎస్ హయాం లో 4600 కోట్లు , రోశయ్య, కిరణ్ లు కలిసి 1000 కోట్లు కేటాయించి హంద్రి నీవా ఫేజ్ -1 ని పూర్తి చేస్తే …పూర్తీ అయిన వాటికి కూడా నీళ్ళు ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం.. 170 కోట్లు హంద్రి నీవా మోటార్ ల కరెంటు బిల్ లు కట్టలేక శ్రీశైలం వరద ఉన్న సమయం లో ఆ మోటార్ లను ఖాళీ గా పెట్టిన ఘనత తమరిది.. పోనీ తరువాత అయినా నీళ్ళు ఇచ్చారా అంటే అదీ లేదు… తెలంగాణా ప్రభుత్వం మీద సొట్టు పెట్టి ఉన్న నీళ్ళు కిందకి పోయా… అయినా అనంతపూర్ ప్రజలకు సిగ్గు లేదు లే.. మళ్ళా మీకే వోట్లు వేస్తారు గాని..

 3. CV Reddy

  తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచేది లేదని కేంద్రహోంశాఖ కేంద్రహోంశాఖ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 వరకు ప్రస్తుత అసెంబ్లీ స్థానాలు కొనసాగుతాయని తేల్చి చెప్పింది.

 4. CV Reddy

  Fortuners వద్దు అని Safari లు తెచ్చుకున్న అనుభవం ….
  నీ సోంత కాన్వాయ్ లో వాహనాలు ఏమి ఉండాలో కూడా తెలియకుండా ఒక్క ఏడాది లో 3 సార్లు కాన్వాయ్ మార్చిన మీరు ఈ రాష్ట్రానికి రాజధాని కడతార ???
  అనుభవం అనేది ఉంటె మొదటిసారి కొన్నప్పుడే సరి అయిన వాహనాలు కొనాలి .. మీకు ఉన్నది అనుభవం కాదు … కమీషన్ల మీద కక్కుర్తి …

  Sridhar Reddy Avuthu

 5. This is what can happen when green belts are turned into Mega cities …
  Everyone pay the price for the greed of few .

  No matter how many millions they loot they will all have to breathe the same poisonous air .

  http://www.bbc.co.uk/news/magazine-32352722

 6. CV Reddy

  ఇండైరేక్ట్ గా బాబును తిడుతున్నఎర్రబెల్లి(ఆయనకుTTD బోర్డ్ లో పదవి ఇవ్వలేదనా?)
  దమ్ముంటే TRS లో చేరిన వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలి -ఎర్రబెల్లి
  మరి ఆంధ్ర లో TDP లో చేరిన YSR MPలు SPY రెడ్డి, కొత్తపల్లి గీత సంగతేమిటి?
  అంతేలే పచ్చోడు చేస్తే సంసారం, పక్కోడు చేస్తే ……….!

 7. CV Reddy

  పాత పాట:- “గుడివాడ ఎల్లాను ,గుంటూరు పొయ్యాను” !
  పచ్చ పాట:-“సింగపూరు ఎల్లాను,సాంఘైకి పొయ్యాను”
  ఎంత దోచినా,,ఏమి ఇచ్చినా ఏదో కావాలంటారు,,,నచ్చినోల్లు,,,నా దోపిడి మెచ్చినోల్లు !
  -శ్రీనివాస్ ఉత్తరాంద్ర

 8. CV Reddy

  అమ‌రావ‌తి కాదు,ఇది భ్ర‌మ‌రావ‌తి-న‌క్క‌ల పాల‌న‌కు తోడేళ్ల ప్ర‌చారం(Suresh Vmrg )

  ఇప్పుడు జ‌రుగుతున్న‌దంతా యుద్ధ‌మే! యుద్ధంలో ఎప్పుడూ ఓడిపోయే ప్ర‌జ‌లే మ‌రోసారి ఓడిపోవ‌డానికి సిద్ధ‌మవుతున్నారు. ‘రాజ‌ధాని అమ‌రావ‌తి’ పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న అతి భారీ కుట్రకు రాబోయే త‌రాల‌న్నీ మూల్యం చెల్లించ‌బోతున్నాయి. సుక్షేత్రాలు సింగ‌పూర్ మోడ‌ళ్ల పేరుతో రైతులూ, స‌గ‌టు మ‌నుషుల‌తో సంబంధాలు తెంచుకోబోతున్నాయి. మొన్న రావులూ, సుజ‌నా చౌద‌రులూ … ఈరోజు గంటాలూ, నారాయ‌ణ‌లూ … మారింది నాయ‌కుల పేర్లు మాత్ర‌మే. అంద‌రూ మాయ‌ల మ‌రాఠీలే. స‌హ‌జ‌వ‌న‌రుల విధ్వంసానికి కంక‌ణం క‌ట్టుకున్న దోపిడీదొంగ‌లే!

  “అమ‌రావ‌తి కాదు … ఇది భ్ర‌మ‌రావ‌తి” అని జ‌నం ఇప్పుడిప్పుడే వాస్త‌వాలు గుర్తిస్తున్నారు. కానీ, పాల‌కుల కుట్ర‌ల్ని చీల్చిచెండాడాల్సిన ప్ర‌తిప‌క్షపాత్ర‌ను పోషించాల్సిన ప‌త్రిక‌లూ, టీవీ డ‌బ్బాలూ మాత్రం నిస్సిగ్గుగా పచ్చ‌రంగు చొక్కాలు తొడిగేసుకుని, నిజాల మీద న‌ల్ల‌సిరాను రుద్దుతున్నాయి. పాల‌కుల దురాగ‌తాలే అస‌లైన‌ చ‌రిత్ర‌గా రికార్డు చేయ‌డానికి మ‌రోసారి మ‌న మీడియా త‌హ‌త‌హ‌లాడుతోంది. ఏదోరూపంలో వార్త‌ల్లో వుండ‌డ‌మే రాజ‌కీయ ల‌క్ష‌ణంగా భావించే పార్టీలూ వాటికి తోడ‌య్యాయి. వెర‌సి ప‌రిస్థితి “న‌క్క‌ల పాల‌న‌కు తోడేళ్ల ప్ర‌చారం”లా త‌యారైంది. మ‌నం కొన్ని త‌రాల ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును కూల్చేస్తున్నామ‌నే బాధ వారెవ‌రికీ, ఏ కోశానా క‌నిపించ‌డంలేదు.

  ఈరోజు మ‌నం బ‌తుకుతున్నంత క‌నీస‌మాత్ర‌పు బ‌తుకుకు కూడా రేపు మ‌న పిల్ల‌లు నోచుకోక‌పోవ‌చ్చు. రెండు పూట‌లా నాలుగు మెతుకులు తిన‌డానికి కూడా వాళ్ల‌కి అదృష్టం వుండ‌క‌పోవ‌చ్చు. ఆరోజు మ‌న తండ్రులకూ, తాత‌ల‌కూ సిగ్గు, ముందుచూపు లేక‌పోవ‌డ‌మే త‌మ దుస్థితికి కార‌ణ‌మ‌ని వాళ్లు రేపు మ‌న‌ల్ని తిట్టుకోక‌ మాన‌రు. మ‌న పిల్ల‌ల‌కు వ‌రాలిస్తున్నామా? వారిని శాప‌గ్ర‌స్తుల్ని చేస్తున్నామా? మ‌న‌కి మ‌నం స‌మీక్షించుకోవాల్సిన స‌మ‌యం ఇది.

 9. CV Reddy

  ఈ యోగా గురు చాలా కాస్ట్‌లీ గురూ! యోగా తరువాత “అమ్మతోడు, అడ్డంగా నరికెస్తా”
  (మొన్నబాబు అండ్ కో అంతా 3 కోట్లు ఖర్చుపెట్టిజగ్గీ వాసుదేవ్‌ దగ్గర యోగా నేర్చుకొన్నారు.
  ఈయన దగ్గర యోగా నేర్చుకొన్న తరువాత అసెంబ్లీ లో “అమ్మతోడు, అడ్డంగా నరికెస్తా” అని ఒక MLA , మీ అంతు చూస్తా అని బాబు బెదిరించడం అంతా చూసాము కదా.
  యోగా వలన ఒత్తిడి తగ్గి క్రమశిక్షణ అలవడుతుంది అని 3 కోట్లు దోచిపెట్టాముకదా బాబూ!

  4 వేల కోట్ల దోపిడా బాబూ?
  విజయవాడ రాజధాని ప్రాంతం దగ్గర యోగా గురు జగ్గీ వాసుదేవ్‌ కు 400 ఎకరాలు కేటాయింపు.అక్కడ ఎకరం ఎంత లేదన్నా 10 కోట్లు పైమాటే అంటే 4 వేల కోట్లు.
  అందులో 90 శాతం ఆంధ్రా నిప్పు జేబులోకి)

  [జగ్గీ వాసుదేవ్‌ యోగా శిక్షణ చాలా కాస్ట్‌లీ గురూ..10TV
  జత బట్టలు మూడు వేలు.. ప్లేటు భోజనం పదిహేను వందలు.. సబ్సు మూడొందలు.. ఎక్కడా అని ఆశ్చర్యంగా ఉందా ? ఇది ఎక్కడో కాదు.. జగ్గీ వాసుదేవ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఇచ్చిన పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ తరగతుల్లో జగ్గీ కేటాయించిన రేట్లు. శిక్షణ పేరుతో కోట్లు దండుకున్న యోగా గురువు.. ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని భూములపై కన్నేశాడు.
  మూడు రోజుల శిక్షణ.. కోట్లలో ఖర్చు
  మూడు రోజుల శిక్షణ.. కోట్లలో ఖర్చు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు జగ్గీ వాసుదేవ్‌ ఇచ్చిన పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఖర్చు.ఒక్కొక్కరికి వేల ఖర్చు.. మొత్తం మూడు రోజులు.. అన్నీ అక్కడే. ఇంకేముంది ఖర్చు తడిసి మోపడయ్యింది. ఆయన పెట్టిన ఆహారమే తినాలి.. అయితే వీటి ధర మాత్రం చాలా కాస్ట్‌లీ.
  తెల్ల బట్టలు వేసుకోవాలి…
  ఈ శిక్షణ తీసుకోవాలంటే ఆయనిచ్చిన తెల్లబట్టలే వేసుకోవాలి.. వీటి కాస్ట్‌ జస్ట్‌ మూడు వేలు మాత్రమే. ఇక ఇక్కడ పెట్టే భోజనం ప్లేట్‌ కేవలం పదిహేను వందలు.. టిఫిన్‌కు మూడొందలు. ప్రత్యేకంగా వాడే సబ్బులు మూడొందలు. ఇక్కడ యోగా శిక్షణ తీసుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సిందే. ఇది సామాన్యులతో అయ్యే పని కాదు. అందుకే జగ్గీ గారు ప్రభుత్వ పెద్దలను పట్టుకున్నారు. ఇంకేముంది ప్రజాప్రతినిధులు, అధికారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. అయ్యవార్లు గంతులేసి యోగా క్లాసులకు వెళ్లారు. ఎందుకు వెళ్లరు.. వాళ్ల జేబుల నుంచి డబ్బులు తీస్తే కదా.. అంతా ప్రజాధనమే.. అందుకే హుషారుగా యోగా క్లాసులకు హాజరయ్యారు. ఇది ఒళ్లు వంచి కష్టపడ్డారు.
  తొలిరోజు కన్వెన్షన్‌ సెంటర్‌లో….
  వీళ్లు కాస్ట్‌లీ కాబట్టి.. కార్పొరేట్‌ గురువుగారు స్టార్‌ హోటళ్లలో యోగా నేర్పించారు. మొదటి రోజు సైబర్‌ సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో,.. మిగిలిన రెండు రోజులు నోవాటెల్‌లో శిక్షణ తరగతులు. వీటి ఖర్చంతా చూస్తే తడిసిమోపడయ్యింది. యోగాతో ఎంత ఆరోగ్యం వచ్చిందో తెలియదు కానీ.. ప్రజాధనం మాత్రం జగ్గీ వాసుదేవ్‌ అకౌంట్‌లో చేరిపోయింది. చంద్రబాబు జగ్గీతో ఉన్న తన అనుబంధం ఈ విధంగా బలపర్చుకున్నారు.

  http://www.10tv.in/news/news-ap/Costly-Yoga-classes-by-Jaggi-Vasudev-89003%5D

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s