మోదీ ఓటు ఎటు?

న్యూఢిల్లీ, జూన్ 9: ఓటుకు నోటు కుంభకోణంలో ఇరుక్కున్న ఆంధ్ర సిఎం చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కారు కాపాడుతుందా? జాతీయ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబును కాపాడాలా? వద్దా? అనే అంశంపై బిజెపి సీనియర్లు, మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నట్టు పార్టీ, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నికల్లో తెరాసకు చెందిన నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్‌సన్ ఓటును కొనుగోలు చేసేందుకు ప్రయత్నించటంతోపాటు, స్వయంగా సిఎం చంద్రబాబే ఆయనతో నెరపిన సంభాషణల ఆడియో టేపులను ఏసీబీ సేకరించిన నేపథ్యంలో బాబును కాపాడటం కష్టమేనని అంటున్నారు. చంద్రబాబును కాపాడాలంటే నరేంద్ర మోదీ లేదా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్థాయిలో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సుపరిపాలనతోపాటు అవినీతిలేని పరిపాలన అందజేస్తామని చెబుతున్న ఎన్డీయే ప్రభుత్వం, నేతలు ఇప్పుడు బాబును కాపాడేందుకు ప్రయత్నించటం ఎంతవరకు సమర్థనీయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అహ్మదాబాద్ అల్లర్ల సమయంలో నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి సిఎం నరేంద్ర మోదీ రాజీనామాకు చంద్రబాబు డిమాండ్ చేయటంతో, అప్పటి ఎన్డీయే సర్కారు నుంచి చంద్రబాబు తప్పుకోవటం, మతతత్వ పార్టీ ప్రభుత్వంలో తాను కొనసాగనని ప్రకటించటం మర్చిపోరాదని ఇద్దరు సీనియర్ బిజెపి నేతలు అధినాయకత్వానికి స్పష్టం చేసినట్టు తెలిసింది.

ఓటుకు నోటు కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంటిలిజెన్స్ బ్యూరో నుంచి తెప్పించుకున్న నరేంద్ర మోదీ, ఈ అంశంపై ఎలా స్పందిస్తారనేది స్పష్టం కావటం లేదు. ఆంధ్రకు చెందిన సీనియర్ మంత్రితోపాటు ఇద్దరు సీనియర్ మంత్రులు ఓటుకు నోటు కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు కేంద్రానికి చెందిన ఒక మంత్రి, ఇద్దరు రాజ్యసభ సభ్యులకు ఈ కేసుతోగల సంబంధాలపై పూర్తి వివరాలను ప్రధానికి వివరించినట్టు చెబుతున్నారు. నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు జరిపిన టెలిఫోన్ సంభాషణలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఆయన మరికొందరు వైఎస్సార్సీపీ, తెరాస ఎమ్మెల్యేలతో జరిపిన టెలిఫోన్ సంభాషణలు కూడా తెలంగాణ సిఎం చంద్రశేఖరరావు వద్ద ఉన్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓటుకు నోటు కుంభకోణం మరింత జఠిలమవుతుంది కాబట్టి, ఇందులో జోక్యం చేసుకోవటం అత్యంత ప్రమాదకరమని కొందరు బిజెపి నేతలు భావిస్తున్నారు. చంద్రబాబును కాపాడే అంశంపై బిజెపి, ఎన్డీయే ప్రభుత్వంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఓటుకు నోటు కుంభకోణంలో పక్కాగా దొరికిపోయిన చంద్రబాబును కాపాడేందుకు ప్రయత్నించటం కూడా మంచిదికాదని బిజెపి సీనియర్ నాయకులు హెచ్చరిస్తున్నట్టు చెబుతున్నారు.

http://andhrabhoomi.net/content/vote

24 Comments

Filed under Uncategorized

24 responses to “మోదీ ఓటు ఎటు?

 1. CV Reddy

  యూ ఆర్ ఇన్ క్యూ!
  కాల్‌డేటాలో ఓ మాజీ, ఇద్దరు ఎంపీలు?
  – కుట్రలో పాత్రపై ఏసీబీ వద్ద సాక్ష్యాధారాలు
  – కంపెనీల్లోంచి ప్రవహించిన నిధులు
  – ఏసీబీ చేతిలో బ్యాంకు లావాదేవీల డాక్యుమెంట్లు
  – కోటిన్నర ఆఫర్‌తో ఎమ్మెల్యేతో మంతనాలు జరిపిన మాజీ
  – ఢిల్లీకి పరారైన పచ్చనేతలు.. న్యాయనిపుణులతో చర్చలు!
  http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/acb-in-vote-to-note-case-1-2-479767.html

 2. CV Reddy

  ఈ వాయిస్ మీదే బాబూ అంటున్న రాజ్ దీప్ సర్దేసాయ్

 3. CV Reddy

  గవర్నర్ నరసింహన్ ను మార్చండి -మోడీ తో బాబు
  (బహుశా మా కులపోన్ని గవర్నర్ ను చేయండి అని అడిగి ఉంటాడు)
  [Hyderabad: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu who had a one-on-one meeting with Prime Minister Narendra Modi on Wednesday evening, reportedly sought the replacement of Governor E.S.L. Narasimhan immediately, as he had failed to protect the interests of the Andhra Pradesh government and was showing an inclination towards the Telangana state government in all matters related to the two Telugu-speaking states.
  http://www.deccanchronicle.com/150611/nation-current-affairs/article/shift-governor-chandrababu-naidu-tells-narendra-modi%5D

 4. Sridhar Gondhi

  you have to accept one thing, CBN managed whole lot off media reporters in an attacking manner, with a mindset that its other parties which have committed crime and not me and i must say that even though its shameful to defend it that way, he has done it effectively.

 5. CV Reddy

  KCR పంచ్ లు
  నా వెంట్రుక కూడా పీకలేడు, పోయి డిల్లీ కాళ్ళ మీద పడ్డాడు.
  గొంతుదాకా కూరుకుపోయాడు, పట్టుబడ్డ దొంగ, డిల్లీ కూడా రక్షించదు ఈ దొంగను.
  3 కాంగ్రెస్ MLA లను కూడా కొనాలని చూస్తె నేనే కాంగ్రెస్ వాళ్ళను అలెర్ట్ చేశా.
  ఈయన భాగోతం చాల ఉంది , ముందు ముందు తెలుస్తుంది.
  అక్కడ జగన్ పార్టీ MP SPY రెడ్డి, కొత్తపల్లి గీత లను ఎట్లా చేర్చుకున్నాడు?

 6. CV Reddy

  What I am saying is నన్ను పట్టుకోవడానికి నీకు అధికారం లేదు-నిప్పు

 7. Pls see Babu’s posture and body language in this photo with Modi …that says it all ?

  2002 ……..I will not let Modi set his foot in Hyd
  2015………Ayya….Nee Kallu mokkutha ….nannu kapadu ??

  http://www.sakshi.com/news/national/andhra-pradesh-cm-chandrababu-niadu-met-narendra-modi-247457?pfrom=home-top-story

 8. CV Reddy

  నిప్పులాంటి వాదన
  వ్యభిచారం చేస్తున్నారనే సమాచారం తో మాటువేసి ఆధారాలతో ఒక టీవీ నటిని పట్టుకున్న పోలీసులు
  ఇలా రహస్యంగా పట్టుకోవడం కుట్ర అని, మానవ హక్కుల ఉల్లంఘన అని వాదిస్తున్న టీవీ నటి

 9. CV Reddy

  AP భవన్ ఉండగా ఖరీదైన ప్రైవేట్ హోటల్ లో దిగిన బాబు, బహుశ రాష్ట్ర అభివృద్ధి గురించి అయి ఉంటుంది(కేసు గురించి మాత్రం కాదు)

 10. CV Reddy

  బాబు అను కుల మీడియా TV9, ABN, ఈనాడు, జ్యోతి ,TV5, NTV, ExpressTV,MahaTV,CVR,… కు సూటి ప్రశ్నలు
  1.పశువులను కొన్నట్టు కొంటున్నాడు కెసిఆర్-బాబు
  2014 ఎన్నికల్లో గెలిచిన రెండవ రోజే YCP కు చెందిన నంద్యాల MP SPY రెడ్డి ని బాబు కండువా కప్పి TDP లో చేర్చుకోలేదా? నెల తిరక్కముందే అరకు MP కొత్తపల్లి గీతను TDP లో చేర్చుకోలేదా?
  కానీ kCR 3 నెలల తర్వాత మాత్రమే TDP MLA లను చేర్చుకున్నాడు మరి మొదలెట్టింది ఎవరు?

  2. మెజారిటీ లేకుండా కెసిఆర్ 5 వ MLC ని ఎలా నిలబెట్టాడు?బాబు
  మరి కర్నూల్, నెల్లూర్ , ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల్లో YCP కి స్పష్టమైన మెజారిటీ ఉంది అయినా కర్నూల్ జిల్లా మీరెట్ల గెలిచారు తరవాత ప్రకాశం, నెల్లూర్ మీ వైపుకు ఎట్లా తిప్పుకునారు మెజారిటీ లేకపోయినా?

  YCP ZPTC లను కిడ్నాప్ చేసారు, కొట్టారు అంతా TV లలో చూసాము

  3.జగన్ TRS కు మద్దతు ఎలా ఇచ్చాడు?బాబు
  జగన్ పార్టీ కు ఉంది ఒక్క వోటు, TRS వాళ్ళు మాకు వోట్ వేయండి అని అడిగారు, మిగిలిన పార్టీలు TDP , కాంగ్రెస్. కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ ఉంది ఒక సీట్ గెలవడానికి , ఇకపోతే TDP వాళ్ళు అడగలేదు జగన్ ను, అయినా చూస్తూ చూస్తూ TDP కి మద్దతు ఎలా ఇస్తాడు జగన్?
  ఇంకో పార్టీ పోటీలో లేదు కాబట్టి TRS కి మద్దతిచ్చాడు

  మరి రంగా రెడ్డి ZP ఎన్నికలలో TRS కు మద్దతిచ్చి ZP వైస్ చైర్మన్ పదవి TDP ఎలా తీసుకుంది?

  TDP 2009 లో TRS తో పొత్తు పెటుకొని ఎన్నిలకు వెళ్ళలేదా అప్పుడు కరెక్టా మరి?
  అయినా రాష్ట్రం విడిపోయింది ఇప్పుడు తెలంగాణా తో గొడవేంటి?
  అయినా రాష్ట్రం విడగొట్టమని 2 లేఖలు ఇచ్చి పార్లమెంటులో విభజనకు అనుకూలంగా మొదటి వోట్ మేమే వేసాం అన్న బాబు కు ఆ హక్కుందా?

  4.బాబు నన్ను కలిసాడు అని నిండు పార్లమెంటులో అప్పటి హోం మంత్రి చిదంబరం అన్నాడు కానీ ఏ రోజూ ఏ టీవీ కూడా ఈ ప్రశ్న బాబు ను కానీ TDP కానీ ఎందుకు అడగదు? అంతా రహస్యంగా బాబు చిదంబరం ను ఎందుకు కలిసాడు?
  తన మీద ఉన్న కేసులు కొట్టేయమని చెప్పడానికి కాదా ?

  5.ఇప్పుడు బాబు అవినీతి చేసాడు అనేది స్పష్ట మైనా టెలిఫోన్ ట్యాపింగ్ చేయవచ్చా అని గంటలకొద్దీ చర్చలు పెట్టడం, కెసిఆర్ TDP వాళ్ళను చేర్చుకోవడం కరక్టేనా అని అనడం బాబు ను రక్షించదానికెగా ?

  పై ప్రశ్నలు చర్చల్లో TDP వాళ్ళను పొరపాటున కూడా అడగరు ఏమంటే బాబు మావాడు అని

  ఎంతసేపూ కెసిఆర్ జగన్ దుష్టులు మా బాబు నిప్పు అని చూపడానికే కష్టపడుతున్నాయి చానళ్ళు
  http://kammasworld.blogspot.in/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html

 11. This shows the desperation for last attempt to avoid arrest, seems like CBN is realizing the ultimate situation he might land in to

  http://www.ndtv.com/india-news/if-kcr-tries-to-arrest-me-his-government-will-fall-chandrababu-naidu-to-ndtv-770256?pfrom=home-lateststories

 12. CV Reddy

  మీరలా నవ్వకూడదు మరి!
  (స్మార్ట్ సిటీల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి వెంకయ్య నాయుడు తో తీవ్రంగా చర్చిచిన బాబు-టీవీ5 )

 13. CV Reddy

  నిప్పు: మన నిఘా విభాగం ఏమి చేస్తోంది ఇంత జరుగుతుంటే?
  నిఘా విభాగం: సర్ మీరు నిప్పు కదా అని …………
  నిప్పు: ఆ!
  బ్రహ్మి:ఓవర్ ఏక్షన్ చేస్తే ………..

  • Kalthi Palu….Kalthi Pacchallu…..Kalthi Media
   Kalthi Manasulu………Kalthi Manushulu
   Mukhalaki make up ….Reel heros
   Kullu / KULA rajakeeyalu

   Viluvalu …..Viswasaneeyatha…..Maa blood lo ledhu …radhu ??

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s