టేపులు మాయం చేసే కుట్ర

-ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఆధారాల గల్లంతుకు పన్నాగం
-ఆ సంస్థ మాజీ ఉద్యోగిని సలహాదారుడిగా నియమించుకున్న చంద్రబాబు
-కేసును నీరుగార్చేందుకు ఎత్తులు
నమస్తే తెలంగాణ: ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలను తప్పించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. ఇటీవల ఆ సర్కారు నియమించుకున్న ఓ సలహాదారుడిపై అందరి దృష్టి పడింది. ఆ సలహాదారుడు గతంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో కీలకాధికారిగా చక్రం తిప్పిన అధికారి కావడం గమనార్హం. ఈ ఎపిసోడ్‌తో ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఆధారాలు మాయం చేసే కుట్ర మొదలైందన్న అనుమానాలను తెలంగాణ ఫోరెన్సిక్ అధికారులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు, బాబు వ్యవహారం కేసులో కీలకమైన ఆడియో, వీడియో టేపులు పరిశీలన, పరీక్షలు ఎఫ్‌ఎస్‌ఎల్‌లో జరుగుతున్నాయి. బాబు కుట్రదారుడిగా తేలే ఇలాంటి సమయంలో గతంలో పనిచేసిన ఆయన్ను సలహాదారుడిగా నియమించుకోవడంపై ఇరు రాష్ర్టాల విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆధారాలను మాయం చేయడం లేదా తప్పుడు నివేదికలు రూపొందించేలా ప్రభావితంచేయగల వ్యక్తిని బాబు సలహాదారుడిగా నియమించుకోవడంపై సర్వత్రా విమర్షలు వ్యక్తమవుతున్నాయి.
ఆడియో, వీడియోపై అనాలసిస్ చేస్తున్న ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులను మాజీ అధికారి లాబీయింగ్ చేసి తప్పుడు నివేదికలు ఇచ్చేలా ప్రేరేపించే ప్రమాదం ఉన్నదని తెలంగాణ ఫోరెన్సిక్ సిబ్బంది అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

బాలకృష్ణ కాల్పుల కేసులో
గతంలో సినీ హీరో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసును నీరుగార్చి కోర్టులో వీగిపోయేలా చేశారని అప్పటి ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నో సంచలనాత్మక కేసులు చేధించిన రాష్ట్ర ఎఫ్‌ఎస్‌ఎల్ బాలకృష్ణ కాల్పుల కేసులో అనేక తప్పులు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిపై బాలకృష్ణ కాల్పులు జరిగిన తర్వాత జరిగిన ఎఫ్‌ఎస్‌ఎల్ పంచనామా రిపోర్ట్‌లో అవకతవకలు జరిగినట్లు సమాచారం. తుపాకీ కాల్పుల కేసులో కాల్పులు జరిపిన వ్యక్తిపై బుల్లెట్ నుంచి వచ్చే గన్ పౌడర్ ఆనవాళ్లు ఉంటాయి. దీనిని జీఎస్‌ఆర్ (గన్ షాట్ రెసిడ్యూ) అంటారు. దీనిని పక్కాగా పరీక్షించాల్సి ఉంటుంది. ఎఫ్‌ఎస్‌ఎల్ కీలక అధికారి ప్రమేయంతో ఏ వ్యక్తి చేతి నుంచి తీసిన జీఎస్‌ఆర్ అని స్పష్టంగా పంచనామాలో రాయలేదు. దీనితో కోర్టులో కేసు వీగిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం అయ్యిందని విమర్షలు వినిపించాయి. ఇలాంటి ఎఫ్‌ఎస్‌ఎల్‌లో అప్పుడు కీలక అధికారిగా పనిచేసిన ఆయన్ను ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం సలహాదారుడి నియమించుకోవడం వెనుక ఓటుకు నోటు కేసును నీరుగార్చేందుకే కుట్ర ఉందని విపక్షాలు నెత్తినోరుకొంటుకుంటున్నాయి.

అంతా ఆయన మనుషులే
ఏండ్లపాటు ఆ విభాగాన్ని శాసించిన అధికారిని సలహాదారుడిగా పెట్టుకోవడంలో మరో ఎత్తు కూడా ఉన్నట్లు సమాచారం. ఆయన పనిచేసిన సమయంలో దగ్గరి వ్యక్తులు, తన మనుషులను ఉన్నతస్థానాల్లో నియమించుకున్నారు. ఇప్పటికీ విభజన ప్రక్రియ ముందుకు సాగకపోవడంలో కూడా వారి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో ఆయన వర్గపు అధికారులపై నిఘా పెంచినట్టు ఉన్నత స్థాయి వర్గాల ద్వారా తెలిసింది. వీరి కదలికలు, కేసులో లోపాలకు అవకాశం ఇచ్చే వ్యవహరించినా, యత్నించినా క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.

గాంధీ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవాడు కావడం గమనార్హం.

http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/conspiracy-to-destroying-evidence-in-fsl-1-2-480491.html

http://namasthetelangaana.com/telangana-news/k-p-c-gandhi-to-aid-andhra-pradesh-in-cash-for-vote-scam-1-1-440696.html

40 Comments

Filed under Uncategorized

40 responses to “టేపులు మాయం చేసే కుట్ర

 1. CV Reddy

  టిప్పును బెదిరించిన ఆంధ్రజ్యోతి
  యాడ్స్ ఇవ్వకపోతే నెగెటివ్ రివ్యూ రాస్తామని బ్లాక్‌మెయిల్
  -మీడియా ముందు వాపోయిన హీరో, దర్శకుడు

  ఆంధ్రజ్యోతి పత్రికపై ఓ కొత్త హీరో, దర్శకుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల విడుదలైన టిప్పు సినిమాపై యాడ్స్ ఇవ్వాలని ఆంధ్రజ్యోతికి చెందిన వారు బెదిరించారని, లేకపోతే నెగెటివ్ రివ్యూ రాస్తామని హెచ్చరించారని చిత్ర హీరో సత్యకార్తీక్, దర్శకుడు జగదీశ్ దానేటి చెప్పారు. బడ్జెట్ కారణంగా చిత్ర నిర్మాత ఆ పత్రికకు, టీవీకి యాడ్స్ ఇవ్వలేకపోయారని, దీంతో వారన్నంతపనీ చేసి తమకు నష్టం కలిగించారని వాపోయారు.

  సినిమా రిలీజ్‌కు ముందురోజు రాత్రి ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేశారు.
  ఆ రోజు రాత్రి 7.10 నిమిషాలకు రవివర్మ అనే వ్యక్తి నుంచి వీ ఆర్ ఫ్రమ్ ఆంధ్రజ్యోతి ప్లీజ్ అటెండ్ ద కాల్ అని మా నిర్మాతకు మేసేజ్ వచ్చింది. ఆ తర్వాత 7.30 గంటలకు ఆ ఫోన్ ద్వారా చౌదరి అనే వ్యక్తి మాట్లాడారు. ఆంధ్రజ్యోతికి రేపు ఉదయం పదకొండు గంటలలోపు మీరు యాడ్స్ ఇస్తే బెటర్ లేదంటే మీ సినిమా గురించి నెగెటివ్ రివ్యూ రెడీ చేసి పోస్ట్ చేస్తాం అని బెదిరించారు. దానికి మా నిర్మాత, ప్రతి సినిమాకు ఒక బడ్జెట్ ఉంటుంది. ఒకరు బెదిరించారు కదా అని నేను ఆస్తులు అమ్మేసుకొని యాడ్స్ ఇస్తే రేపు ఇంకొకరు బెదిరిస్తారు. నెగెటివ్ రివ్యూ పోస్ట్ చేస్తాం అంటే.. మీ దయ నా ప్రాప్తం సార్ అని నిర్మాత వారితో చెప్పారు. ఆయనను బెదిరించిన ఆధారాలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. త్వరలో ఆయన స్వయంగా వాటిని మీడియా ముందు ఉంచుతారు అని దర్శకుడు జగదీశ్ చెప్పారు.

  http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/tippu-movie-director-jagadesh-daneti-press-meet-on-abn-1-2-480544.html

 2. Rajasekhara

  lifted from FB… hilarious ..
  రేవంత్ కి తోటిఖైదితో జరిగిన సంభాషణ…

  తోటి ఖైదీ : నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు…
  రేవంత్ : షాపింగ్ చేసినందుకు అరెస్ట్ చేశారు…
  తోటి ఖైదీ : షాపింగ్ చేస్తే కూడా అరెస్ట్ చేస్తున్నారా???
  రేవంత్ : 5కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్యేను కొన్నాను…
  తోటి ఖైదీ : @#!&^%$

 3. sekhar

  Pavan kalyan sikandi politics chestunadu

  We must get very effective communication strategy for pavan kalyan in near future …

  On Pavan Kalyan I dont have any good Opinions . I observed he can’t digest any kind of sattires on him …

  Ysrcp shoukd Work on pavan kalyan counter strategy not personal level
  .. People level …

 4. CV Reddy

  రాజమండ్రి లో బొల్లినేని చౌదరి హాస్పిటల్ లో సండ్ర వీరయ్య.నిప్పా మజాకా!
  [సండ్ర వీరయ్య ను కనిపెట్టిన హిందూ పత్రిక
  ఓటుకు నోటు కేసులో ఎసిబి విచారణకు హాజరు కావల్సి ఉన్న సండ్ర వెంకట వీరయ్య తాను మరికొంతకాలం అండర్ గ్రౌండ్ లో ఉండాలని అనుకుంటున్నానని చెప్పడం విశేషం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన శుక్రవారం రాత్రి విశాఖపట్నం నుంచి కాకినాడ మీదుగా రాజమండ్రికి వచ్చారు. అక్కడ బొలినేని ఆస్పత్రిలోని 306 నెంబర్ రూమ్ లో చేరారు. దీనిపై హిందూ పత్రిక విలేకరి అక్కడకు వెళ్లారు. కాని ఆయన అక్కడ లేరు. అన్వేషణ చేస్తే ఆ ఆస్పత్రి బవనం పెంట్ హౌస్ లో ఉన్న అతిధి గృహంలో ఆయన ఉన్నారు.అక్కడ ఈయన ఎమ్మెల్యేని పలకరించగా ఆయన కొంత కంగారుగా మాట్లాడినట్లు కనిపిస్తుంది.తనను వివాదంలోకి లాగవద్దని ,మరికొన్ని రోజులు తాను రహస్యంగా ఉండాలని అనుకుంటున్నానని అన్నారట.అదే విషయాన్ని హిందూలో ప్రచురించడం విశేషం.ఈ కేసు పరిణామాల కారణంగా తనకు బిపి అదికంగా ఉందని ఆయన అన్నారట.రాజమండ్రి నుంచి సండ్ర వెంకట వీరయ్య ను రాయలసీమకు తరలించవచ్చని ఆ పత్రిక పేర్కొంది.
  http://kommineni.info/articles/dailyarticles/content_20150621_17.php?p=1434871202478%5D

 5. CV Reddy

  ఆస్తులు మాత్రం కొడుక్కి, పాపాలు మాత్రం ప్రజలకా బాబూ?
  (తన అవినీతి కప్పి పుచ్చుకోవడానికి బాబు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు
  – లోక్ సత్తా JP చౌదరి)
  సొంత మామ NTR మీదే చెప్పులేయించిన బాబు కు ఇదొక లెక్కా ?

  • CVR Murthy

   JP is demanding CBI Probe. I feel he is trying to help CBN out by demanding CBI probe. Once it is out of Telangana ACB. CBN will help manage it at Delhi

   • CV Reddy

    Yes, JP works for Ramoji and indirectly for Babu.
    JP came out against Babu due to severe criticism from all quarters especially social media.
    Babu will manage CBI with the help of NDA.

    We all know what happened in Kodela case.
    4 People died while making local bombs at Kodela’s hospital and Kodela was escaped from CBI cluches with the help of the then Home Minister Advani..
    Babu can stoop down to any level to achieve his goals.

    I have never seen such a worst politician in my life.

    • CV Reddy

     I am using JP name here and there to shut the mouths of Pseudo-intellectuals

     • KDP has stooped to low very levels in politics and contiue to fool the 95% Public in AP using its seeds,roots and branches in every department and party. They will have to pay for their sins in the GOD’s court one day.

 6. CV Reddy

  బాబు బినామీ ఆంధ్ర జ్యోతి రాదక్రిష్ణ చౌదరి వ్యాపార విధానం
  టిప్పు సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి 7.10 నిమషాలకు రవివర్మ (ట్రూకాలర్ ప్రకారం) అనే వ్యక్తి కాల్ చేసారని, ఎత్తకపోతే, మెసేజ్ పెట్టారని దర్శకుడు దానేటి వెల్లడించారు. దాంతో 7.30కి మాట్లాడారని, చౌదరి అనే వ్యక్తి మాట్లాడుతూ ఆంధ్ర జ్యోతికి 11 లోపు ప్రకటనలు ఇస్తే సరి అని లేదంటే నెగిటివ్ సమీక్ష రాస్తామని చెప్పారట. మెసేజ్ ప్రూఫ్, కాల్ ప్రూఫ్ అన్నీ వున్నాయన్నారు.

  ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రిక సినిమా సమీక్షలు రాయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమకు ప్రకటనలు ఇవ్వని వారి సినిమాలను విమర్శించడం, ఇచ్చినవారి సినిమాలు బాగుంటే సమీక్షలు రాయడం, బాగులేకుంటే సమీక్షలు రాయడం మానేయడం కార్యక్రమంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ వారం విడుదలైన టిప్పు సినిమాను తుప్పు అంటూ ఉతికి ఆరేసింది. అయితే దీనిపై ఆ సినిమా హీరో కార్తీక్ తీవ్రంగా స్పందించారు.

  సినిమా రంగంపై ఆసక్తితో వచ్చే కొత్తవాళ్లని కాస్తయినా ప్రోత్సహించాలని, అలాకాకుండా ఇలా నిలదీయడం సరికాదని ఆయన అన్నారు. మీరు సినిమా తీసి, దానిపై ఇలా సమీక్ష వస్తే మీరు ఎలా ఫీలవుతారు అని నిలదీసారు. అన్నింటికి మించి, తన సినిమా గొప్పదని, మంచిదని తాను చెప్పడం లేదని, అయితే తన నటన, వాచకం, విషయాల్లో మంచి రిమార్కులే వచ్చాయని, అందరూ తన నటన, వాచకం విషయంలో బాగానే చేసాడని రాసారని, కానీ ఆంధ్ర జ్యోతి మాత్రం తనది స్టోన్ ఫేస్ అని డైలాగులు చెప్పలేకపోయాడని పేర్కొన్నారని, అదే బాధ అనిపించిందని కార్తీక్ పేర్కోన్నారు.

  తనది స్టోన్ ఫేస్ నా కాదా, సినిమాలో బాగా చేసానా లేదా అన్నది మీడియా జనాలే సినిమా చూసి చెప్పాలని అన్నారు. స్టోన్ ఫేస్ అని, బాగా చేయలేదని రాస్తే, ఏ అప్ కమింగ్ హీరోతో అయినా మళ్లీ సినిమా చేయడానికి ఇంకెవరు ముందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు.

  విడుదలకు ముందు రోజు రాత్రి 7.10 నిమషాలకు రవివర్మ (ట్రూకాలర్ ప్రకారం) అనే వ్యక్తి కాల్ చేసారని, ఎత్తకపోతే, మెసేజ్ పెట్టారని దర్శకుడు దానేటి వెల్లడించారు. దాంతో 7.30కి మాట్లాడారని, చౌదరి అనే వ్యక్తి మాట్లాడుతూ ఆంధ్ర జ్యోతికి 11 లోపు ప్రకటనలు ఇస్తే సరి అని లేదంటే నెగిటివ్ సమీక్ష రాస్తామని చెప్పారట. మెసేజ్ ప్రూఫ్, కాల్ ప్రూఫ్ అన్నీ వున్నాయన్నారు.

  http://telugu.greatandhra.com/movies/movie-news/abn-ni-niladeesina-tippu-62901.html

 7. CV Reddy

  ఈ పవన్ ఎవ్వరికీ అర్ధం కాడు!
  రాష్ట్రమంతా బాబు అవినీతిని ప్రశ్నించవేమి అంటుంటే, తన తోట లో పండిన మామిడి పండ్లు పంపి తను బాబు వైపే అని స్పష్టంగా చెబుతున్నాడు.
  నోట్:దయచేసి ఎలాంటి కామెంట్లు పెట్టకండి,ముక్యంగా అమర్యాదగా అసలు వద్దు
  [Finally, Pawan breaks silence
  Of late, Jana Sena chief Pawan Kalyan’s silence had become talk of town. Many people were questioning Pawan’s whereabouts and his silence after the cash-for-vote scam became a major scam in the two Telugu states.

  Even controversial filmmaker Ram Gopal Varma took a dig at Pawan on his Twitter handle. Yet, Pawan failed to come out and respond on the issue. However, there seems to be some kind of indication if his recent gesture is to be considered.

  Wonder what we are talking about? Well, Pawan sent mangoes grown at his farmhouse to none other than Andhra Pradesh Chief Minister Chandrababu Naidu. Ever since the news spread, it is being speculated that the mango parcel is the actor’s reply to his critics. Does it mean he is still supporting Chandrababu? Your guess is as good as mine.

  http://www.thehansindia.com/posts/index/2015-06-20/Finally-Pawan-breaks-silence-158427%5D

 8. CV Reddy

  మోడీ ఒక వివేకానందుడు-బాబు
  (వోటుకు 5 కోట్ల ఎఫెక్ట్ ?)
  గుజరాత్ CM మోడీ హైదరబాద్ లో అడుగుపెడితే ఊరుకోను, అరెస్ట్ చేయిస్తా -2002 లో అప్పటి CM బాబు
  అందితే రాళ్ళు అందకపోతే కాళ్ళు బాబు పాలసీ-కెసిఆర్

 9. CV Reddy

  ఇతర రాష్ట్రాల ల్యాబ్‌లకు టేపులు?

  కసరత్తు చేస్తున్న ఏసీబీ
  ఓటుకు నోటులో కీలక పరిణామం
  సిఎంకు తాజా అంశాల నివేదిక
  సండ్రపై తదుపరి చర్యలకు రెడీ
  మత్తయ్య కదలికలపై ఆరా

  రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఓటుకు నోటు కేసులో రోజురోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాప కింద నీరులా ఏసీబీ దర్యాప్తు చేసుకుపోతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ సిఎం కెసిఆర్‌కు నివేదిస్తోంది

  తాజాగా ఆంధ్ర ప్రభుత్వ సలహాదారుగా ఫొరెన్సిక్ సైన్స్ రంగ నిపుణుడైన కెపిసి గాంధీని నియమించిన విషయం తెలిసిందే. గాంధీ గతంలో ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. ఎపిఎఫ్‌ఎస్‌ఎల్‌లో అటెండర్ స్థాయి నుంచి అన్ని విభాగాల్లోని కీలకస్థానాల్లో ఉన్న వారు గాంధీకి శిష్యులుగా పనిచేసిన వారే. అలాగే గతంలో సినీ నటుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్ సాక్ష్యాలను తారుమారు చేశారని అప్పట్లో కొంతమంది సిబ్బందిపై అభియోగాలు ఉన్నాయి.

  దానికితోడు ఎఫ్‌ఎస్‌ఎల్ విభజన ఇంకా జరగలేదు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉండటం, అత్యంత కీలకమైన 14 ఆడియో, వీడియో టేపులు ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో ఉన్న తరుణంలో గాంధీ నియామకానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆడియో, వీడియో టేపుల విశే్లషణ అత్యంత పారదర్శకంగా జరిపించాలని తెలంగాణ ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి. ఈమేరకు అన్ని టేపులను దేశంలోని ప్రముఖ ఫొరెన్సిక్ ల్యాబ్‌లలో నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దేశంలో బెంగళూరు, పూణే, ఛండీగఢ్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో అత్యాధునిక ఫొరెన్సిక్ ల్యాబ్‌లు ఉన్నాయి. హైదరాబాద్ ఎఫ్‌ఎస్‌ఎల్‌తోపాటు ఆయా రాష్ట్రాల్లోని ల్యాబ్‌లోనూ ఆడియో, వీడియో టేపుల విశే్లషణ జరిపించాలని ఏసీబీ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.

  ఆడియో టేపుల్లో ఏపీ సిఎం చంద్రబాబు వాయిస్ ఉండడంతోపాటు ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు ఎంపీలు, మరికొందరు ఎమ్మెల్యేలకు సంబంధించిన టేపులుండడంతో కచ్చితమైన రిపోర్టు కోసం సెకండ్ ఓపీనియన్ కింద ఇతర రాష్ట్రాల ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం
  http://andhrabhoomi.net/content/acb-71

 10. The Boss is Chandra Babu …..Stephenson
  It is Babu’s voice ……..Forensic Lab

  Boss ….Don’t worry

  We have Gandhi Chowdary who can change the tapes
  We have Ramudu Chowdary who can change the files
  We have Venukayya Chowdary who can manage at the centre
  We also have a few Judges in HC and SC if need be ?

  Ivvani pani cheyakapotha ….Simple……we just have to create a rift between Telangana and AP to distract the Public ??

  Antha KAMMATI Jeevithalu ??

  http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/stephenson-statements-to-acb-special-court-1-2-480554.html

 11. Boss creating a rift between telugu states and telugu people to escape from his corruption case and then claims to be Andhra Hazare ?
  Shame ……shame

  http://namasthetelangaana.com/LatestNews-in-Telugu/leaders-comments-about-t-news-channel-notice-issue-1-1-440931.html

  Vusaravalli ki Babu adhuruvastha …siggu tho chanipothundhi …Harish Rao.

 12. sekhar

  Hi Team,

  I guess forensic expert will help CBN tamil sandelwood labor killing episode .. And tapes episode …

  Ysrcp.team should focus on this ….

 13. CV Reddy

  Finally, Pawan breaks silence
  Pawan sent mangoes grown at his farmhouse to none other than Andhra Pradesh Chief Minister Chandrababu Naidu. Ever since the news spread, it is being speculated that the mango parcel is the actor’s reply to his critics. Does it mean he is still supporting Chandrababu? Your guess is as good as mine.
  http://www.thehansindia.com/posts/index/2015-06-20/Finally-Pawan-breaks-silence-158427

  • @ PK garu …..

   Your fans wants to know how many crores did the Boss give you for your mango boxes before and after the elections ??
   Gundu kottinchukunna varikanna siggu vundali ….lekha potha
   Gundu kottina varikanna siggu vundali …
   Iddhariki lenidhi…..Telugu prajalu ami chesharu ?
   Mavidi pandlu atala ….Arati pandlu avutharu ??
   Does PK know that the yellow caste fanatics in tollywood tried to crush Chiru’s career for twenty odd years ??

 14. CV Reddy

  పూణేకు టేపులు?

  నోటుకు ఓటు కేసులో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీపెన్‌సన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్ర బాబు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో వీడియో టేపులను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) నిపుణులు ఫూణేకు పంపించినట్లు తెలిసింది. గొంతు ఎవరిదనేది ప్రాథమికంగా గుర్తించినప్పటికీ స్పష్టత కోసం పూణే లోని ల్యాబ్‌కు పంపించారని తెలుస్తోంది. 14 ఆడియో, వీడియో టేపులను, సెల్‌ ఫోన్లను నిపుణులు గొంతును గుర్తుపట్టే పనిలో నిమగమయ్యారు. వాయిస్‌ చంద్రబాబుదా? లేక మిమిక్రీ ఆర్టిస్టులు మాట్లా డినదా అనేది తెలుసుకునేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు చెందిన నిపుణులు శోధనలో పడ్డారు.

  http://www.prajasakti.com/Content/1646794

 15. CV Reddy

  నాణ్య‌త గోదారిలో..నిధులు ‘బాబు’గారి ఖ‌జానాలో..
  http://updateap.com/no-quality-in-pushkara-works-and-funds-diverted/

 16. CV Reddy

  పాపం పవన్!
  ప్రశ్నిస్తానన్న పవన్, నిప్పు అవినీతి పై ఎందుకు మాట్లాడడు?-VH
  ఆఖరికి VH కూడా కడిగేస్తున్నాడు పవన్ ను. ఏంటో ప్చ్!
  (గుసగుసలు
  డబ్బులు ఇచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా కొన్ని ఆధారాలు పెట్టుకొన్నాడట నిప్పు.
  ప్రశ్నిస్తా అంటే ఆ ఆధారాలు చూపి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట)
  నిప్పా మాజాకా! నమ్మించి గొంతు కోయడం వెన్నతో పెట్టిన విద్య!
  నిప్పు అంటే ఏంటో తెలిసాక రీల్ సింహాలు ఏమి చేస్తాయి చెప్పు హనుమంతన్నా
  నోట్:పవన్ పట్ల నాకు సానుభూతి ఉంది, పాపం తెలీక ఇరుక్కుపోయాడు.
  No comments Please!

 17. CV Reddy

  నిప్పు అవినీతిని బయటపెట్టిన T న్యూస్ సాక్షి టీవీ లకు నోటీసు లు
  -కమ్మ ని పాలన మరి

 18. CVR Murthy

  CBN is clearly obstructing investigation by abducting witness and named in the FIR. Threatening channels and agencies…. How can this be tolerated

 19. CV Reddy

  అవినీతి పారేవరకు నిద్రపోను-నిప్పు
  జాబు సంగతేమో కాని జేబులు మాత్రం ఫుల్
  [వెలుగుల కుంభకోణం
  -రూ.100 బల్బు 400లకు కొనుగోలు?
  – ఖజానాకు రూ. 600 కోట్ల్లు నష్టం
  మార్కెట్‌ లో ఎల్‌ ఇడి బల్బ్‌ 100రూపాయలకు దొరుకుతుండగా డిస్కమ్‌లు దాదాపు 400 రూపాయలకు కొనుగోలు చేయడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్క బల్బ్‌కు 300రూపాయలు వంతున అదనంగా చెల్లించడమంటే , రెండు కోట్ల బల్బ్‌లకు దాదాపు 600కోట్ల ప్రజాధనం నష్టం అవుతోందని ఆరోపిస్తున్నారు. కొంత కాలం క్రితం సోషల్‌ గ్రూప్‌ల ఒత్తిడి కారణంగా ఎల్‌ ఇ డి బల్బ్‌ల కొనుగోలు ధరను సుమారు 50 రూపాయలు తగ్గించినట్లు సమాచారం. ఈ కొనుగోళ్ళ వ్యవహారంలో పారదర్శకత లేదని విమర్శలు వచ్చాయి.ఇందులో ఎవరి ప్రయోజనాలు ఇమిడిఉన్నాయో తేల్చవలసి వుందని సామాజిక కార్యకర్తలు కొందరు డిమాండు చేస్తున్నారు.

  http://www.prajasakti.com/Content/1646462%5D

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s