డొంక కదిలించే తీగ!

-ఏసీబీ తెరపైకి వచ్చిన జిమ్మీ
-బాబు, లోకేశ్‌ల కీలక అనుచరుడు
-రూ.50 లక్షలు తరలించాడని అనుమానం
-కుట్రలో కీలక పాత్ర ఉందంటున్న దర్యాప్తు అధికారులు
-రెండో ఎపిసోడ్‌లో కీలకంగా మారనున్న జిమ్మీ

-ఇద్దరు ఎంపీల జాతకాలు బయటపడే అవకాశంఆ ఎంపీలకు సంకటమే..
జిమ్మీ వ్యవహారంలో మరో కీలక ట్విస్ట్ ఎదురయ్యే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు రేవంత్, సెబాస్టియన్, ఉదయ్‌సింహాలను విచారించిన ఏసీబీకి కుట్రలో రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయం పూర్తిగా ధృవపడలేదు. ఈ డబ్బులను కొందరు ఎంపీలు సరఫరా చేశారని ఏసీబీ దగ్గర సమాచారం ఉంది. దాన్ని ధృవపరుచుకోవాల్సి ఉంది. ఇపుడు జిమ్మీని విచారిస్తే ముడుపులిచ్చిన ఎంపీల సంగతి తేలుతుందని విశ్వసనీయ సమాచారం. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రోత్సహించిన ఎంపీలకు జిమ్మితో షాక్ తగలనుందని ఏసీబీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.

http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/vote-for-case-1-2-481948.html

15 Comments

Filed under Uncategorized

15 responses to “డొంక కదిలించే తీగ!

  1. CV Reddy

    విచారణా? అరెస్టా!?హైదరాబాద్, జూలై 5: ఓటుకు నోటు కేసులో కొద్దిరోజుల స్తబ్ధత తర్వాత మళ్లీ కదలిక మొదలైంది. కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎసిబి ముందు హాజరుకానున్నారు. సండ్రను విచారణకు హాజరవ్వాల్సిందిగా కోరుతూ ఏసీబీ రెండు రోజుల క్రితం నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5లోగా ఏసీబీ కార్యాలయానికి రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. కాగా, సండ్ర సోమవారం ఉదయం 11 గంటలకల్లా బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకోనున్నట్టు సమాచారం. సండ్రతోపాటు కేసులో కొత్త వ్యక్తిగా చేరిన సెబాస్టియన్ స్నేహితుడు జిమ్మి కూడా విచారణకు హాజరుకానున్నారు. అయితే ఓటుకు నోటు కేసులో సోమవారం సాయంత్రం కల్లా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సండ్ర, జిమ్మిల నుంచి రాబట్టే సమాచారం ఆధారంగా కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ అరెస్ట్ చేస్తుందంటూ ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. సండ్రకు ఏసీబీ జారీ చేసిన మొదటి నోటీసులో సిఆర్‌పిసి 160 సెక్షన్ సాక్షిగా విచారణకు హాజరవ్వాలని పేర్కొంది. ఏసీబీ జారీ చేసిన రెండో నోటీసులో మాత్రం సిఆర్‌పిసి 41ఏ కింద (కేసుతో సంబంధం ఉన్న వ్యక్తి) విచారణకు రావాలని పేర్కొంది. ఓటుకు నోటు కుట్రలో సండ్రను తొలుత సాక్షిగా మాత్రమే పరిగణించిన ఏసీబీ, కేసు దర్యాప్తులో భాగంగా అతడిని కుట్రలో స్వయంగా ప్రమేయం ఉన్న వ్యక్తిగా భావిస్తున్నట్టు సమాచారం. సండ్రను ఏసీబీ అరెస్ట్ చేయనుందన్న ఊహాగానాలకు ఇది మరింత బలం చేకూరుస్తోంది.

    ఇలాఉండగా, ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిలు మంజూరవడం, బెయిలు రద్దుకు ఏసీబీ సుప్రీం కోర్టును ఆశ్రయించినా నిరాశే మిగలడంతో కేసు కథ కంచికి చేరిందన్న ప్రచారం జోరందుకుంది. కానీ ప్రభుత్వానే్న అస్థిరపర్చేలా జరిగిన ఓటుకు నోటు కుట్రను తెలంగాణ సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం, రేవంత్‌రెడ్డి బెయిలు రద్దుపై సుప్రీంలో ఎదురు దెబ్బ తగలడంతో ఏసీబీ కూడా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

    దీంతో దూకుడుగా వెళ్లి ఇబ్బందులు పడకుండా పక్కా సమాచారం, ఆధారాలతో చాపకింద నీరులా కేసు దర్యాప్తు సాగిస్తోంది. అందులో భాగంగానే నోటీసుల జారీపై మొదట్లో దూకుడుగా వ్యవహరించిన ఏసీబీ ప్రస్తుతం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు సండ్రతోపాటు జిమ్మి అనే మరో వ్యక్తికి ఎలాంటి హడావుడి లేకుండా శుక్రవారం రాత్రే నోటీసులు జారీ చేయడం ఉదాహరణ.

    బయట ప్రచారం ఎలా ఉన్నప్పటికీ ఓటుకు నోటు కేసు, ఎసిబి దర్యాప్తు నివురుగప్పిన నిప్పులా ఉంది. సండ్రకు రెండోసారి నోటీసులు, ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంతో కేసుతో సంబంధం ఉన్న వారిలో మళ్లీ అలజడి మొదలైంది.

    http://andhrabhoomi.net/content/state-1135

  2. CV Reddy

    ఓటుకు నోటు కేసులో మరో మలుపు
    హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరో మలుపు తిరగనుంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కేసుగా పరిగణించే అంశాన్ని ఏసీబీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్టీఫెన్‌ సన్‌తో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ వల వేసినట్లు సమాచారం. రేవంత్ బెయిల్ పిటీషన్‌లో ఏజీ ప్రత్యేక వాదనలు వినిపించనుంది. ఏజీ వాదనలకు బలం చేకూరే విధంగా ఆధారాల సేకరణలో ఏసీబీ బిజీగా ఉంది. ఏసీబీ.. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    http://www.10tv.in/content/Another-twist-in-Cash-for-Vote-Scam-1165

  3. Well done young lady ……an inspiration

    http://www.sakshi.com/news/national/i-used-to-take-the-cows-for-grazing-in-the-open-fields-civils-ranker-tells-254493?pfrom=home-top-story

    But one suggestion …pls don’t come to AP. Ikkada kancha chenumesthundhi ….Ika gedhalaku gaddi akkada vuntundhi ??

  4. Jagan meetng the President to talk about the Boss who is still shamelessly sitting in a very responsible chair after being caught red handed.
    Kancha chenu mestha ?? GOD save AP.

    http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-to-meet-pranabh-mukharjee-254500?pfrom=home-top-story

  5. Modi ji ………any comments on what is happening in MP ?
    33 people who are ether witness or accused in the scam died in the last five years !!
    Sounds really dodgy ??

    http://www.ndtv.com/india-news/dean-of-jabalpur-medical-college-found-dead-at-a-delhi-hotel-778322?pfrom=home-lateststories

  6. It would be nice to have them in YSRCP. Kanna garu will also be an asset. He is one who openly challenges the yellow weed in Guntur.

  7. CV Reddy

    ఉండవల్లి ,మల్లాది విష్ణు,వట్టి వసంత కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వస్తారా?
    ఉండవల్లి పచ్చదండు బెండు తీస్తారు అనడం లో నాకు ఎలాంటి సందేహం లేదు
    ఉండవల్లి గారూ, మీలాంటి వారు ఇంకా కాంగ్రెస్ లో ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు.నాకు ఉండవల్లి గారు, వట్టి వసంత కుమార్ అంటే ఇష్టం

    [కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరిని ఆకట్టుకోవడానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తోందన్న కధనాలు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖుడు, మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ , కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖులు , మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ లను పార్టీలో చేర్చుకోవడానికి యత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.ఉండవల్లి మంచి వక్తగా, మాటకారిగా పేరొందారు.వాదనాపటిమ కలిగినవారి వల్ల పార్టీకి ఉపయోగం జరుగుతుందని భావిస్తున్నారు. అలాగే సామాజకివర్గాల పరంగా వట్టి వసంతకుమార్ పార్టీలో చేరితో ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నారు.]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s