అతివృష్టి రనావృష్టిః మూషకాశ్శలభాశ్శుకాః
అత్యాసన్నాశ్చ రాజానః షడేతా ఈతయస్మృతాః
అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, మిడతలు, చిలుకలు, రాజులు మరీ దగ్గరగా ఉండటం – అనే ఆరూ ఈతిబాధలు అని పెద్దల మాట.
కరువులు, వరదలు గట్రా ఈతిబాధలంటే సరే. కాని రాజు అతి సమీపంగా ఉండటం ఈతిబాధ ఎలా అవుతుంది?
ఎలా అవుతుందో రాజమండ్రి చెబుతుంది!
పూజలు, ఆచారాలు, కర్మకాండల మీద ఎంత గురి ఉన్నా తెలంగాణ చంద్రుడు మరీ ఎక్కువ సమయం తీసుకోకుండానే పుష్కర స్నానాదికాలు ముగించాడు. ఎందులోనైనా అతడికంటే ఘనుడు అనిపించుకోగోరే ఆంధ్ర చంద్రుడు మాత్రం తన శత్రువుకంటే రెండింతల సమయం జలకాలకు వెచ్చించాడు.
ఎందుకు? భక్తిపాలు ఎక్కువయ్యా? పుష్కర స్నానం మీద శ్రద్ధతోనా? కాదు. శ్రీవారి అసలు దృష్టి తన పేరును, పని తనాన్ని ప్రపంచ స్థాయిలో మోత మోగించేందుకు – సినిమా వాడినెవడినో పెట్టి, ఏదో మీడియా దుకాణాన్ని పురమాయించి… అనేక కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఆ సమయాన చిత్రీకరిస్తున్న డాక్యుమెంటరీ మీద.
ఎంతయినా సినిమావాడి అల్లుడు, సినిమావాడి వియ్యంకుడు, సినిమా వారికి రక్తసంబంధీకుడు కనుక పవిత్ర పుష్కరాన్ని కూడా సినిమా ఫక్కీలో పబ్లిసిటీ స్టంటుగా నాయుడుగారు మార్చాలనుకోవటం ఎంత మాత్రమూ తప్పు కాదు. అదేదో తనబోటి ఘరానా పెద్దల కోసం తానే ప్రత్యేకంగా ఏర్పాటుచేయించిన వి.ఐ.పి. ఘాట్‌లో ఎన్ని గంటలపాటు లాగించినా సమస్య ఉండేది కాదు. సామాన్య జనం తమ స్నానాలేవో తాము పుష్కరాల రేవులో చేసుకుని ఎవరి దారిన వారు పోయేవాళ్లు.
కాని- విడిగా ఎక్కడో కూచుని కార్యక్రమం సాగిస్తే మజా ఏముంటుంది? తిరుగులేని ప్రజా నాయకుడు చేసే స్నాన, పాన, పూజాదికాలకూ బాక్ డ్రాపులో లక్షల జనం ఉండకపోతే సన్నివేశం రక్తి కట్టదు కదా? డైరెక్టరు అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి దయతో ఒప్పేసుకుని, తన పుష్కర స్నాన అద్భుత కార్యాన్ని వేల జనం అప్పటికే వేచి ఉన్న పుష్కరాల రేవులో జరపాలని ఆఖరి నిమిషంలో మెరపు నిర్ణయం చేశాడు. మాన్య ముఖ్యమంత్రి దరిదాపుల్లో అలగా జనం ఉండటం సెక్యూరిటీకి ఇబ్బంది కాబట్టి శ్రీవారి సకుటుంబ స్నానం, పూజ, చీరె, సారె వగైరాలు తాపీగా సాగిన రెండు గంటల పాటూ స్నానాలకు పడిగాపులు పడుతున్న అశేష జనాన్ని ఎక్కడి వారినక్కడ ఆపేశారు. అంతా పూర్తయి ‘పాకప్’ చెప్పేసి, ముఖ్యమంత్రులుంగారు నిష్క్రమించాక, జనాలను వదిలారు.
ప్రశస్తమైన ఈ ఏర్పాటువల్ల సినిమా అక్కర తీరింది. చిత్రీకరణ రక్తికట్టింది. కాని – రైళ్లు దిగి మైళ్ల దూరం నడిచి, తెల్లవారుఝాము నుంచే స్నానఘట్టానికి చచ్చీ చెడీ చేరుకుని గంటల తరబడి ఎటూ మెసలలేక బారికేడ్లలో ఇరుక్కుని, పిడచకట్టే గొంతు తడుపుకునేందుకు మంచినీళ్లు ఇచ్చే దిక్కులేక, కళ్లు బైర్లు కమ్ముతున్న వేలాది అభాగ్యులకు శోష వచ్చింది. అసలే కిక్కిరిసి ఉన్న చోటికి గేటు తెరిచి బయట వేచి ఉన్న వేలమందినీ వదలడంతో భయంకరమైన తొక్కిసలాట జరిగింది. 27 మంది ప్రాణాల నిష్కారణంగా పోయాయి.
పనిగలవాడు పందిరి వేస్తే పిచ్చుకలు వచ్చి కూలదోసినట్టు మహా పనిమంతుడని పేరుమోసిన ముఖ్యమంత్రి మూణ్నెల్లకు పైగా సమీక్షల మీద సమీక్షలు జరిపి, సర్వం తానే అయ దగ్గరుండి ఏర్పాట్లు చేయిస్తే మొట్టమొదటి రోజునే 27 ప్రాణాలు బలి!
పోనీ – తన పరిమితులు ఏమిటో తనకు తెలిసొచ్చాకయినా కాస్త దూరం జరిగి, అధికారుల గొంతుమీది నుంచి కాలుతీసి వారి పని వారిని మహా ప్రభువులు చేసుకోనిచ్చారా? లేదు. పుష్కరం 12 రోజులూ రాజమండ్రిలోనే తిష్టవేసి, అన్నీ దగ్గరుండి చూసుకుంటూ సమీక్షలు చేస్తూ, మీడియాను వెంటేసుకుని అర్ధరాత్రులు కూడా ఘాట్ల వెంట తిరుగుతూ ఇలాగే ముందుకు పోతానని శ్రీవారి హెచ్చరిక! ముఖ్యమంత్రి మందీమార్బలంతో తమకు మరీ దగ్గరగా ఉన్నంతకాలమూ సామాన్య జనానికి, యాత్రికులకు ఈతిబాధ తప్పదు.
http://andhrabhoomi.net/content/week-point
Dissecting the ‘Pawanism’ phenomenon
Shifting, Often self-contradictory,stand
From his threats on land acquisition to his take on cash-for-vote scam,Pawan Kalyan’s strategy shows him as a reluctant politician, willing to strike but afraid to hurt big leaders
At best, this upcoming politician’s shifting and often contradictory stand on issues may just add some colour to the otherwise drab political narrative in TS and AP
బాబు గారిపై కొత్త జనరేషన్ అనుమానాలు
న్యూస్ నారద.కామ్: చంద్రబాబు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్ అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. తనకు అనుకూలమైన మీడియా సంస్థలు ఈ విషయాన్ని జనంలోకి మరింతగా తీసుకెళ్లాయి. దీన్ని నమ్మే..
మొన్నటి ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత బస్సులు, ట్రైన్‌లలో తోసుకుంటూ వెళ్లి మరీ ఏపీలో టీడీపీకి ఓటేశారు. చంద్రబాబు వస్తేనే, ఆయనలాంటి అడ్మినిస్టేటర్ చేతిలో కొత్త రాష్ట్రాన్ని పెడితేనే మంచి జరుగుతుందన్న ప్రచారం నమ్మి పార్టీల గురించి ఆలోచించకుండా చాలా మంది ఓటేశారు. అయితే ఇప్పుడు వారందరిలోనూ చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొన్నటి ఎన్నికల సమయంలోనే ఓటు హక్కు వచ్చి, టీడీపీకే ఓటేసి కొందరిని పలకరిస్తే చంద్రబాబు గురించి తమకేమి అర్థం కావడం లేదంటున్నారు. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని నమ్మేందుకు ఒక్క అంశం కూడా కనిపించడం లేదంటున్నారు. కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు.
కృష్ణా జిల్లాలో మహిళ తహసీల్దార్‌పై ఎమ్మెల్యే చింతమనేని దాడి చేస్తే కనీసం అరెస్ట్ కూడా చేయకపోవడమేనా బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే అని ఆశ్చర్యపోయారు.. చంద్రబాబు నిజంగా మంచి పరిపాలన దక్షకుడే అయితే ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. మీడియా ముందు అదిచేస్తాం ఇదిచేస్తామని చెప్పడమేనా పరిపాలన దక్షత అంటే అని నిలదీస్తున్నారు.
కుంభమేళా తరహాలో పుష్కరాలను నిర్వహిస్తామని భారీగా ప్రచారంచేసి తీరా రాజమండ్రిలో తొక్కిసలాటను నిరోధించలేకపోయారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నిజంగా మంచిపారిపాలన దక్షకుడే అయితే ఈ పరిణామాలుఎందుకు జరుగుతాయన్నది వారి ప్రశ్న. తప్పో ఒప్పో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనబోయారు కనీసం ఆ పనేదో మూడో కంటికి తెలియకుండా చేయలేరా అని అంటున్నారు.
మరో యువకుడు ఆసక్తికరమైన విశ్లేషణ చేశాడు. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు తాము చిన్న పిల్లలమని కాబట్టి అప్పట్లో ఆయన తీరు ఎలా ఉండేదో తమకు నేరుగా తెలియదని చెప్పాడు. టీవీల్లో చెప్పింది విని మొన్నటి ఎన్నికల్లో ఓటేశామన్నాడు.
ఇంతలో పక్కనే ఉన్న ఓ పెద్దాయన జోక్యం చేసుకుని ”చంద్రబాబు గురించి తెలుసు కాబట్టే మొన్నటి ఎన్నికలప్పుడు రాష్ట్రానికి అనుభవస్తుడు అవసరం ఉందని తెలిసినా, టీడీపీకి 150 సీట్లు రావాల్సిన వాతావరణం ఉన్నా ఆయన గురించి గతంలో తెలుసుకున్న జనం పెద్దగా ఓటేయలేదని విశ్లేషించారు. చంద్రబాబు తొమ్మిళ్ల పాలన గురించి తెలియక ఇలాంటి పిల్లలంతా ఓటేశారు. అందుకే కేవలం ఐదు లక్షల ఓట్లతో చంద్రబాబు గట్టేక్కారు”అని చెప్పి పెద్దాయన వెళ్లిపోయారు. పెద్దాయన చెప్పిన మాటలు విన్న ఆ ఇద్దరు యువకుల కూడా నిజమే కదా అన్నట్టు తెల్లమొహం వేశారు.
http://www.newsnarada.com/2015/07/19/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B1%88-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%9C%E0%B0%A8%E0%B0%B0%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8/
నిప్పు పాలనకు మచ్చు తునక
డిజిపి JV రాముడు అసంతృప్తి? ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
కృష్ణా జిల్లా ముసునూరు సబ్ ఇన్‌స్పెక్టర్‌పై చర్య తీసు కోవాలని డిజిపి రాముడు భావించారని, ఎస్పీకి ఆ విధంగా సూచనలు చేయగా, చంద్రబాబు జోక్యం చేసుకొని వారించారని సమా చారం. దాడి సమయంలో ఎస్‌ఐ అక్కడే ఉన్నా అడ్డుకోలేదని ఫోటోలతో సహా పత్రికల్లో వార్తలొచ్చాయి. బాధిత తహసీల్దార్ వనజాక్షి సైతం అదే విషయం చెప్పారు.అలసత్వం చూపిన ఎస్‌ఐపై చర్య తీసుకోవాలని డిజిపి రాముడు జిల్లా ఎస్పీకి సూచించినా అమలు కాలేదని తెలిసింది. రాముడిని చంద్రబాబు పదవీ కాలాన్ని పొడిగింపజేసి మరీ డిజిపిగా వేసుకుని, పక్కనపెట్టారని ప్రచారం సాగుతోంది.
ఎస్పీలతో నేరుగా మాట్లాడుతున్న సిఎం
ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంతగా ప్రాధాన్యం ఇవ్వట్లేదని పోలీస్ వర్గాల్లో గుసగుసలు బయలుదేరాయి. నేరుగా జిల్లా ఎస్పీలు, నగర కమిషనర్లతో సిఎం మాట్లాడుతూ ఆదేశాలిస్తున్నారని, దీంతో పోలీస్ బాస్‌ను అధికారులు పెద్దగా పట్టించుకోవట్లేదని సమాచారం. సిఎం తీరుపై రాముడు కొంతకాలంగా అసహ నంతో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సుదీర్ఘ కాలం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసి రిటైరైన ఒక పోలీస్ ఉన్నతాధికారి సలహాలను చంద్రబాబు వింటున్నారని సమా చారం. సర్వీస్‌లో లేని అధికారికి అధిక ప్రాధాన్యమిస్తూ ప్రస్తుతం కీలక స్థానాల్లో ఉన్నవారికి విలువ ఇవ్వకపోవడం పై ఐపిఎస్‌ల్లో అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం జరుగు తోంది. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాటకు బాధ్య త పోలీసులదేనని అందరివేళ్లూ ఆ శాఖ వైపు చూపుతున్నా యి. వైఫల్యానికి ఎవరిపై వేటు వేస్తారోనన్న ఊహాగానాలూ మొదలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, క్షేత్రస్థాయి అధికారులపై చర్యలు తీసుకునే ముందు అంతకంటే ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారుల మాటేమిటి, అంతపెద్ద కార్యక్ర మాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తరుణంలో డిజిపి, ఇతర పోలీస్ ఉన్నతాధికారుల పాత్ర ఎలా ఉండాలి? ముందస్తు భద్రతా ఏర్పాట్లపై పర్యవేక్షణా బాధ్యత వారికి లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి.
కాగా డిజిపి సన్నిహితులు మాత్రం ఆ సంఘటనతో తమ బాస్‌కు, తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. డిజిపిని పక్కనబెట్టి చంద్రబాబు అంతా తానై వ్యవహరిస్తున్నారని, ఏడాది కాలంగా జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లతో నేరుగా మాట్లాడుతూ, సూచ నలు, ఆదేశాలు చేస్తున్నారని చెబుతున్నారు. శాంతి భద్రతలు సిఎం కింద ఉన్నప్పటికీ డిజిపికి ప్రాధాన్యమివ్వాల్సిన అవస రం ఉందంటున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పోలీస్ బాస్ అభిప్రాయం తీసుకోవడం సబబని చెబుతు న్నారు.నేరుగా యూనిట్ అధికారులతో ముఖ్యమంత్రి మా ట్లాడితే, కింద ఏం జరుగుతుందో డిజిపికి తెలియడం లేదని వాపోతున్నారు. మీడియా, పత్రికల ద్వారా తెలుసుకొని డిజి పి హౌదాలో ఎస్పీలను అడిగితే, సిఎం గారితో చెప్పాం, సార్ మాట్లాడారు అనే సమాధానం వస్తోందని సన్నిహితుల వద్ద రాముడు అసంతృప్తి వెలిబుచ్చినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా సిఎం చూసుకుంటారని, ఆయనతోనే మాట్లాడా లని ఒక్కోసారి కిందిస్థాయి అధికారులకు రాముడు సలహా ఇస్తున్నట్లు సమాచారం.
గోదావరి పుష్కరాల భద్రతలోనూ అదే విధంగా జరిగిందని అధికారులు చెబుతున్నారు.
తాజా గా కృష్ణా జిల్లా ముసునూరు సబ్ ఇన్‌స్పెక్టర్‌పై చర్య తీసు కోవాలని డిజిపి భావించారని, ఎస్పీకి ఆ విధంగా సూచనలు చేయగా, చంద్రబాబు జోక్యం చేసుకొని వారించారని సమా చారం. దాడి సమయంలో ఎస్‌ఐ అక్కడే ఉన్నా అడ్డుకోలేదని ఫోటోలతో సహా పత్రికల్లో వార్తలొచ్చాయి. బాధిత తహసీల్దార్ సైతం అదే విషయం చెప్పారు.అలసత్వం చూపిన ఎస్‌ఐపై చర్య తీసుకోవాలని డిజిపి రాముడు జిల్లా ఎస్పీకి సూచించినా అమలు కాలేదని తెలిసింది. రాముడిని చంద్రబాబు పదవీ కాలాన్ని పొడిగింపజేసి మరీ డిజిపిగా వేసుకుని, పక్కనపెట్టారని ప్రచారం సాగుతోంది.
http://www.prajasakti.com/Content/1657691
Some Fun stuff
http://madeintg.com/2015/07/19/11518/social-meida/
When I speak to friends and relatives from AP, I notice that disenchantment is setting in against CBN . This is not resulting in shift to YSJ. people are desperately looking for alternative . YSRCP and YSJ need to introspect. We do not read or hear any top think tank … Politburo or seniors group meeting on current issues in YSRCP. It is always YSJ met so and so etc.. Latest being meeting of Parliamentary party no senior is seen at all. There are no committees of MLAs . YSJ comes out now and then to criticise CBN . He does not come out as leader with knowledge on Issues. His reluctance to meet press to discuss issues or give interviews is his undoing. Do not forget, BJP, Jana sena, and Congress or in the waiting . YSRCP should not think that they are automatic choice if Babu fails. As an external viewer , YSRCP is a group with YSJ as leader not a democratic party . It has been 6/7 years since he walked into politics, he has not given single detailed interview to media. I personally do not know what he is and how good he would be as CM. Politics any thing can happen anytime . Party should be ready always. . Assumption that election will happen only 2019 so take it easy till then may prove costly, if things were to happen in such a way that elections happen before that. Time for YSJ to prove that he can build political party not group and he is good enough to be CM
Good analysis and write-up Murthy garu..i wish someone to pass this message to YSJ.
Bang on Sir.
Brathiki vunna varini kuda ..sevalu ani vadilesaru – Vundvalli garu.
Mari varu ……..”Mana vallu” kadhu Sir.
http://www.sakshi.com/video/news/undavalli-arunkumar-blames-police-for-the-pushkaralu-stampede-33514?pfrom=inside-related-video
Chanipoyindhi …”Manavallu” kadhu kadha ?
Nenu andhuku ikkada vundali ??
Babu cares a foot for the dead.
http://www.sakshi.com/news/district/cm-chandrababu-leaves-pushkara-ghat-after-stamped-happen-258766?pfrom=home-top-story
Some people were never taught ethical and human values in life ..
All they learn is …..Caste and Financial values but take nothing with them when they die .
Another root cause analysis by ABN channel pointing Rajmundry stampede towards swamiji’s. Previously it was people’s irresponsible behavior, govt officers inability to manage properly & now its swamiji’s turn, take it.
http://www.andhrajyothy.com/Artical?SID=131043
ఇదే సాక్షి పేపర్ లో కాని ఇలా రాసి ఉండి ఉంటే.. ఇంకా జగన్ ని సాక్షి ని ఏ రేంజ్ లో హిందూ మత వ్యతిరేకి గా ప్రొజెక్ట్ చేసి ఉండే వారో మనమే ఊహించుకోవాలి..
If this kind of stampede happens under YCP rule then you can imagine the kind of communal turn it would have taken.
వై .యెస్ ఆర్ 66 వ జయంతి వేడుకలు అట్లాంటా మహా నగరం లో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ప్రత్యక్ష ప్రసారమ్ చూడాలనుకున్న వారు http://www.ustream.tv/channel/bytegraph లో చూడగలరు
http://www.timesnow.tv/Debate-Is-it-time-to-end-VVIPRacism-in-religious-places/videoshow/4478345.cms
Narayana was totally clueless and neither felt sorry about the incident. check the way Arnab ripped varla ramaiah.
Some fantics kill their own people with Bombs …
http://www.sakshi.com/news/top-news/40-killed-in-baghdad-bomb-attack-258420?pfrom=home-top-story
Some fanatics kill their own people for Photos …..
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1646:2015-07-17-06-55-57&Itemid=665
తొక్కిసలాట సర్వ సాధారణం,రాజకీయం చేయడం తగదు- వెంకయ్యనాయుడు
http://www.prajasakti.com/Content/1657355
TDP నాయకులు కూడా ఇంత ఇదిగా బాబు కు మద్దతివ్వలేదు.
ఆ నాయుడు ఈ నాయుడు ఒక్కటే అని కెసిఆర్ ఊరికే అన్నాడా?
మనకి 1995 ముందు కంప్యూటర్స్ గురించి తెలియదు . చంద్రబాబు గారు దాన్ని కనిబెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దరిం చేరు ఇంజనీరింగ్ కాలేజీ లలో కంప్యూటర్ విద్య పెట్టి లెక్కకు మించిన కాలేజీ లు పెట్టి హైటెక్ సిటీ కట్టి అబివ్రుద్హి చేసేరు ఈ నాడు అనిమేషన్ గ్రాఫిక్స్ లో మనం ముందు ఉన్నాము అంటే ఆయనే కారణం బహుబలి అంత గొప్పగా రావడానికి అసలు ఆ భారి ఎత్తు సినిమా తియ్యాలని ఐడియా రావడానికి బాబు కారణం అందువలన బహు బలి సినిమా గొప్పతనం ఆయనకే చెందాలి కానీ అన్యాయం ఏమిటంటే టైటిల్స్ లో చంద్ర బాబు పేరు వెయ్యక పోవడం . లోకం పోకడ అలా అయిపొయింది బాబు లాంటి నిజాయతి పరులు దూర ద్రుష్టి ఉన్న మేధావులను గౌరవించడమ్ చేతకాదు
Ha Ha Ha
Nice description…. Very much injustice to CBN,,, Finally identified 🙂