ఎపి రాజధానిపై సింగపూర్ పెత్తనం. సింగపూర్- ద బాస్

ఎపి రాజధానిపై సింగపూర్ పెత్తనం. సింగపూర్- ద బాస్ (The Guardian , ఆంధ్రప్రభ)
సింగపూర్- ద బాస్ అంటూ ఆంద్రప్రభ ఒక కధనాన్ని ఇచ్చింది అందులోని విశేషాలు తెలుసుకోదగినవిగా ఉన్నాయి. సింగపూర్ దేశం ఎపిలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని అనుకుంటుంది.దానివల్ల వచ్చే పరిణామాలు ఏమిటన్నదానిపై అందులో చర్చించారు
ద గార్డియన్ అనే అంతర్జాతీయ పత్రిక దీనికి సంబందించిన విశేష కదనాన్ని ఇస్తూ, తన విస్తీర్ణానికి పదింతలు పెద్దదైన భారతీయ నగరాన్ని నిర్మించడానికి ఆసక్తి చూపడానికి కారణాలపై విశ్లేషించిందని తెలిపారు.ప్రస్తుతం చైనా, భారత్ లు ఇప్పుడు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని,ఇప్పటికే చైనాలో పెట్టుబడులు పెట్టిన సింగపూర్ ఇప్పుడు భారత్ పై దృష్టి పెట్టిందని పేర్కొంది. సింగపూర్ వద్ద ధనరాశులు ఉన్నాయని, భారత్ లో అవకాశాల కోసం ఇంతకాలం ఎదురు చూసిందని ,ఎపి రాజధాని నిర్మాణంలో తన సామర్ద్యాన్ని చూపడం ద్వారా భారత కేంద్ర ప్రభుత్వం నుంచి స్మార్ట్ సిటీల కాంట్రాక్టులు పొందాలని యోచిస్తోందని తెలిపారు.
సింగపూర్ విస్తీర్ణం 716 చదరపు కిలోమీటర్లు అయితే,అమరావతి నగరం విస్తీర్ణం 7253 చదరపు కిలోమీటర్లు అని వివరించారు.బహుశా సింగపూర్ సంస్థలు 16.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టవచ్చని అంచనా వేస్తున్నారు.అయితే అనేక షరతులు పెట్టబోతున్నారు.

ఎపి ప్రభుత్వం భూమిని సింగపూర్ సంస్థలకు అప్పగించవలసి ఉంటుంది.అక్కడ భవనాల నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఏభై ఏళ్ల నుంచి 150 ఏళ్ల పాటు ఈ సంస్థలే వాటిపై పూర్తి ఆదిపత్యం కలిగి ఉంటాయి.అంతవరకు వీటి వినియోగదార్ల నుంచి డాలర్ల రూపంలో రుసుం వసూలు చేస్తారు.ఈ చెల్లింపులన్నిటికి రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారిగా ఉండాల్సి ఉంటుంది.అంచనా వేసిన స్థాయిలో ఆదాయం రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం దానిని చెల్లించవలసి ఉంటుంది.వీరు చేసే వసూళ్ల స్థానిక వడ్డీ వ్యాపారుల కంటే ఎక్కువ వడ్డీ గిట్టుబాటు అవుతుందని ఈ కధనంలో తెలిపారు.ఈ రకంగా ఈ మహానగరం మూడు,నాలుగు తరాల పాటు సింగపూర్ పరోక్ష పాలనలో ఉంటుందని ఈ పత్రిక కధనం విశ్లేషించింది.

సింగపూర్ సృష్టించే నగరంలో సామాన్యులు, మధ్య తరగతి వారికి అవకాశమే ఉండదు.ఇప్పటికే ఇండోనేషియా, పిలిప్పిన్స్ , వియత్నాం వంటి దేశాలలో సింగపూర్ సంస్థల పెట్టుబడులకు రుసుంలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని,ముందుగా సింగపూర్ తో పూర్తి ఒప్పందం చేసుకునే ముందు ఆ దేశాల అనుభవాలను తెలుసుకోవడం మంచిదని ఆ కధనం వ్యాఖ్యానించింది.

http://kommineni.info/articles/dailyarticles/content_20150724_3.php?p=1437715479811

8 Comments

Filed under Uncategorized

8 responses to “ఎపి రాజధానిపై సింగపూర్ పెత్తనం. సింగపూర్- ద బాస్

  1. Vuhallo brathukuthu ……Telugu prajalanu mosam chesthu …..
    “Manavalla” kosam vurlu dochukuntunna Gaja/ Gajji dongalu avaru ??

    http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1655:2015-07-24-07-46-02&Itemid=665

    Sitting in a Responsible chair of ruling a state despite being caught Red handed buying people’s representatives and contributing to the death of many in Pushkaralu . Shame …..shame.

  2. CV Reddy

    వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాహుల్
    AP లో డిపాసిట్లు కూడా రాకపోయేసరికి YS విలువ తెలిసినట్టుంది.
    నక్క కాంగ్రెస్ తో కలిసి వైఎస్ కుటుంబాన్నిఎంత ఏడిపించారు
    ఒంటిచేత్తో YS గెలిపించిన 31, 33 MP సీట్లతోనే డిల్లీలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది అన్న విషయం మరిచిపోయారా రాహుల్?

  3. వార్త: అసారాం బాపు మానభంగం కేసులో సాక్షికి లంచం ఇవ్వచూపిన తాలూకా టేపును పోలీసులకు అందించారు

    బ్రేకింగ్ న్యూస్: నిప్పుతో అపాయిన్తుమెంటు ఖరారు, రేపే (అంటే tomorrow లెండి) ఆసారం రాజమండ్రి ప్రయాణం 🙂

  4. CV Reddy

    బాబు పోతేనే ఏడూల్ల శని పోతుంది,పులి నోటికి దొరకినారు అనుభవించండి అని బ్యాంకు వాళ్ళు అంటున్నారు.బాబు మాటలు నమ్మి మోసపాయాము.
    YS దేవుడయ్యా , మంచివాల్లను దేవుడు తొందరగా తీసుకుపోతాడు
    -అనంతపూర్ లో జగన్ తో ప్రజలు

  5. CV Reddy

    ఎన్టీఆర్ వలన తెలంగాణా వాళ్ళు తెల్లవారుఝామున లేవడం నేర్చుకున్నారు-బాబు
    ఎన్టీఆర్ రాత్రి 8 గంటలకు పడుకొని తెల్లవారు ఝామున 2.30 గంటలకే లేస్తాడు.
    అయితే ఎంతమంది TDP నాయకులు తెల్లవారుఝామున లేస్తున్నారో ?
    నేను ఉదయం మంగలి షాప్ లో కటింగ్ చేయించు కుంటున్నప్పుడు ఇదే మాట అడిగాను .
    ఆ మంగలి షాప్ అతను అన్నాడు నాకు వయసు వచ్చినప్పటినుంచి
    5 గంటలకే లేస్తున్నాను,7 గంటలకు షాప్ తెరవాలి కదా అన్నాడు.
    ఇటువంటి బేకార్ మాటలు మాట్లాడి ఎన్టీఆర్ ను బాబు బద్నాం చేస్తున్నాడు
    Note: No indecent words please

  6. CV Reddy

    త్వరలో సాదారణ పౌరుడినవుతా- గవర్నర్ (Indian express )
    మొత్తానికి వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు పట్టుబట్టి BJP మెడలు వంచి గవర్నర్ ను మార్చుతున్నారు.ఏమైనా ఈ నాయుడు బ్రదర్స్ లాబీ చాల గట్టిది గురూ
    పట్టపగలు ఓటుకు 5 కోట్లు ఇస్తూ పట్టుబడ్డా ఎవరూ ఏమీ చేయలేరు
    నిప్పును ముట్టుకోవడానికి అందరికీ భయం.నిప్పు మనుషులు అన్ని వ్యవస్థల్లో ఉన్నారు

    • The roots of this Yellow Weed is in every department in AP . They help each other out no matter in which Party they are. All their plans are discussed in the garden parties. No different from ISIS, Taliban etc.
      It is very important that these roots are identified and exposed in the best interest of the 95% Public. Otherwise this Weed will destroy the peace and harmony in the society.
      Every educated individual from AP should make this a priority.

  7. What a shame ?
    DGP of AP taking instructions from a movie director !!
    Yellow Fanatics are showing a movie to the 95% Public .
    When will the Public wake up and ban this movie ??

    http://www.sakshi.com/news/district/godavari-pushkaralu-climax-directed-by-boyapati-srinu-260152?pfrom=home-top-story

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s