చెత్త పలుకు

ధర్మప్రభువు చంద్రబాబు తప్పు చేస్తే దర్బారు బాకా భజంత్రీలు అందరికీ లోకువైన దెబ్బలబ్బాయిలను ఎడాపెడా బాదేస్తున్నారు.
రాజమండ్రి పుష్కరాల రేవులో 27 మంది ప్రాణాలు తీసిన తొక్కిసలాటకు ముఖ్యమంత్రి అసలు ముద్దాయి ఎంతమాత్రం కాదట. సామాన్యులకు కేటాయించిన రేవులోకి నాయుడుగారు హఠాత్తుగా చొరబడి; ఎన్నో గంటల నుంచి స్నానానికి వేచి ఉన్న లక్షల జనాన్ని ఎటూ మెసల లేకుండా బంధించి… పబ్లిసిటీ యావలో, డాక్యుమెంటరీ ఫిల్ము చిత్రీకరణ రంధిలో రెండు గంటల విలువైన సమయం సపరివార జలకాలాటలకు వృధా చేయటం అనర్థానికి మూలమంటే కళ్లు పోతాయట.
మరి – జరిగిన ఘోరానికి ఎవరిని తీయాలి ఉరి?
ఉన్నారుగా తేరగా…? అందరికీ అలుసైన వాళ్లు…! ధర్మం, శాస్త్రం, సంప్రదాయాల గురించి అక్షరమ్ముక్క తెలియని శుంఠలు కూడా ఒంటికాలిమీద లేచేవాళ్లు…
ఇంకెవరు? పీఠాధిపతులూ, హిందూ మతం పెద్దలూ, పండితులూ.

తెలుగునాట ఇప్పుడు భక్తి మాఫియా రాజ్యమేలుతున్నదట. స్వయం ప్రకటిత పీఠాధిపతులు, వారికి తోడుగా ప్రవచనకారులు పుట్టుకొచ్చి భక్తి పేరిట ప్రజలను మానసిక రోగులుగా మార్చివేశారట. పుష్కరాల ప్రారంభంలోనే స్నానం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పి చాగంటి వంటి వారు ప్రేరేపించటం వల్లే… రోజుకో కొత్త స్వామి చానెళ్లలో ప్రత్యక్షమై ప్రవచనాల పేరిట ప్రజలను భయకంపితులను చేయటంవల్లే తెలుగు ప్రజలు లక్షల సంఖ్యలో పూనకం వచ్చినట్టు గోదావరిలో మునకలేశారట. పుణ్యస్నానాలు ఆచరించకపోతే పాపులుగా మిగిలిపోతామన్న భయంతో ముందుగా వెళ్లి పుణ్యం పొందాలని ఎగబడి 27 మంది ప్రాణాలు వదిలారట. అనగా – తప్పు విరగబడిన జనానిదే తప్ప… ఆ జనాన్ని సరిగా నియంత్రించలేక, చవకబారు పబ్లిసిటీ కోసం చిత్రవిచిత్ర విన్యాసాలు చేసి మనుషుల ప్రాణాలు తీసిన తమ కులవేల్పుది ఎంతమాత్రం కాదని పచ్చబ్యాండు మేళగాళ్ల మద్దెల దరువు.

లాభం లేని వ్యాపారి వరదన పోడు. సొంత లాభం లేకుండా ఏ మీడియావాడూ గవర్నమెంటుకు గొడుగు పట్టడు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళితే అక్కడ ఓబీ వాన్లూ, కెమెరాలూ పెట్టి, పబ్లిసిటీ ప్రసాదాన్ని అన్ని చానెళ్లకూ పంచి పెట్టే కాంట్రాక్టును ఏ టెండరు లేకుండా అప్పనంగా కొట్టేసి, ఖర్చులు పోను నెలకు కనీసం అరకోటి తేరగా నొల్లుకుంటున్న వారికి ఆ ముఖ్యమంత్రి లోపాలూ, పాపాలూ కలికానికైనా కంటపడవు. వృత్తి ధర్మాలూ, ప్రజలపట్ల బాధ్యతలూ సుతరామూ పట్టవు. పి.ఆర్.ఒ. పనికి ఒప్పుకున్నాక సర్కారు అపరాధాలను ఎలాగైనా వెనకేసుకురావాలి. వేరే వాళ్లని అంటే ఊరుకోరు కాబట్టి ఊరి పిడుగును నోరూవారుూ లేని హిందువుల మీద పడవేస్తే సరి!

……………
……………

http://andhrabhoomi.net/content/week-point-0

9 Comments

Filed under Uncategorized

9 responses to “చెత్త పలుకు

 1. Whilst the CM who was caught red handed buying MLA’s and also responsible for the deaths of people in Pushkaralu continue to sit in a responsible seat …..
  The Opposition leader continues to fight for the false poll promises from the same CM …..

  http://epaper.sakshi.com/apnews/Anantpur/25072015/8

 2. CVR Murthy

  Jagan, Should stop saying that he would do this and that after becoming CM, he is becoming a laughing stock. It is still 4years

 3. CV Reddy

  గోదావరి జిల్లా ప్రజలకు రుణపడి ఉంటాను- బాబు
  కానీ అదే గోదావరి జిల్లాలకు చెందిన సినీ దర్శకుడు VV వినాయక్(కాపు),శ్రీకాంత్ అడ్డాల (కాపు), శేఖర్ కమ్ముల (కాపు) కు ఆ రాజమండ్రి పుష్కర షూటింగ్ బాధ్యతలు ఇవ్వకుండా బోయపాటి శ్రీను(చౌదరి) కి ఇవ్వడం ఏమిటో?
  Note:Please don’t use indecent words

 4. CV Reddy

  తప్పుమీద తప్పు చేస్తున్న బాబు
  ఒక తప్పును కప్పిపుచ్చడానికి…
  http://www.prajasakti.com/EditorialPage/1659501

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s