మంత్రుల్లో తీవ్ర అసహనం

-అధికారులతో సిఎం నేరుగా సమీక్షించడంపై కలత
-సొంత శాఖలపై పట్టు కోల్పోతున్న మంత్రులు
-టీ, టిఫిన్లు, రవాణా బాధ్యతల అప్పగింతలపై ఆవేదన
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి

‘రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకే తెలియడం లేదు, ఇతరులకు ఏం చెబుతాం, ఏదన్నా కావాలంటే అధికారులను అడగాలి, అదీ ముఖ్యమంత్రి అనుమతుంటేనే చెబుతామని ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారులు చెబుతున్నారు’ అని ఓ రాష్ట్ర మంత్రి వ్యక్తం చేసిన ఆవేదన రాష్ట్ర పరిపాలనా తీరుకు అద్ధం పడుతోంది.

పరిపాలన చేయించేస్థితి నుండి విదేశీ ప్రతినిధులెవరైనా వస్తే వారికి టీ, టిఫిన్లు పెట్టించే దుస్థితికి దిగజారిపోయామనే బాధ వారిలో వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి కూడా నేరుగా అధికారులతో మాట్లాడుతూ వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో తమను చులకన చేస్తున్నారనే బాధ మంత్రుల్లో అంతకంతకూ పెరుగుతోంది.

ఇటీవల సింగపూర్‌ ప్రతినిధులు రాజమండ్రికొచ్చిన సమయంలో వారికి టిఫిన్లు, భోజనాలు పెట్టించే బాధ్యత మంత్రి రావెల కిషోర్‌బాబుకు, వారిని హోటల్‌కు అక్కడ నుండి ఘాట్‌కు అక్కడ నుండి విమానాశ్రయానికి తీసుకెళ్లే బాధ్యతను మంత్రి నారాయణకు అప్పగించారు. హోటల్లో ఆహ్వానం పలకడం, కావాల్సిన ఇతర ఏర్పాట్లు చేయడం వంటి బాధ్యతలు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు అప్పగించారు. వీరందరి పనిని పర్య వేక్షించే బాధ్యత ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి అప్పజెప్పారు. సింగపూర్‌ నుండి వచ్చినవారిలో ఈశ్వరన్‌ ఒక్కరే మంత్రి ఉన్నారు. మిగిలిన వారందరూ సింగపూర్‌లో వివిధ ప్రైవేటు సంస్థల్లో ఇంజనీర్లు మాత్రమే. ముఖ్యమంత్రి ఆదేశం కనుక చేయాల్సి వచ్చిందని, అవమానకరంగానే ఉందని ఇంకోమంత్రి ఇలా ఎవరికివారు మనోవేదనకు గురవుతున్నారు.

రాజధాని నిర్మాణ విషయంలోనూ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారనేది ఒక్క గల్లా జయదేవ్‌, సుజనాచౌదరి, సిఎం రమేష్‌కు తప్ప ఇతర మంత్రులకూ తెలియదు. సింగపూరిచ్చిన రాజధాని మాస్టర్‌ప్లాను కాపీలనూ తొలిరోజు సమావేశంలో మంత్రులకివ్వలేదు. ఒక్క గల్లా జయదేవ్‌కు మాత్రమే అందించారు. ఖాళీ ఫైళ్లు ఇచ్చి వాటినే ప్లాను ఫైళ్లని చెప్పి మంత్రులను అవమానించారు.

దీనికితోడు అన్నిట్లోనూ నేరుగా సిఎం జోక్యం పెరిగింది. ఆయా విభాగాల్లో అధికారులతో నేరుగా పనులు చేయించుకుంటున్నారు. దీంతో పాలనా తీరు పూర్తి ఏకపక్షంగా సాగుతోందనే అభిప్రాయం మంత్రుల్లో మొదలైంది.

ఆర్థిక మంత్రిత్వశాఖ, హోంశాఖ పూర్తి చులకనగా మారాయని చెబుతున్నారు. ఈ పోస్‌ పేరుతో పౌరసరఫరాలశాఖపై అధికారుల పెత్తనం సాగుతోందనే భావన వారిలో ఉంది. కొన్నిశాఖలపై ముఖ్యమంత్రే నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. మంత్రులను పక్కనబెట్టేస్తున్నారు. ఇది కూడా మంత్రుల్లో అసహనానికి ప్రధాన కారణంగా ఉంది.

http://www.prajasakti.com/Content/1660212

24 Comments

Filed under Uncategorized

24 responses to “మంత్రుల్లో తీవ్ర అసహనం

  1. Monna ………Pillannni icchina Mamani
    Ninna Pushkarallo …..Muppayi mandhi amyakulani
    Repu Bhookampallo ….Konni vela mandhini ?
    “Manavari” kosam……ee mathram cheyalena ??

    http://www.greatandhra.com/politics/gossip/amaravati-is-prone-to-earthquakes-67866.html

    When will these fanatics pay for their Sins ?

  2. RIP ……….Abdul Kalam
    A man that broke all barriers in life to acheive the top most job in India.
    Kula Mathalaku athitham ga ….Desam kosam seva chesina Mahanubavudu.

    http://www.ndtv.com/india-news/former-president-apj-abdul-kalam-1201111?pfrom=home-lateststories

  3. CV Reddy

    వాళ్ళు మనోళ్ళు బాబూ!
    [న్యూస్ నారద.కామ్: ఇది వరకు అధికారులను అందరూ చూస్తుండానే కొట్టడం. మహిళ అని కూడా చూడకుంటా ఆటవికంగా దాడిచేయడం వంటి దృశ్యాలను ఏ బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో చూసేవాళ్లం. వాటిని టీవీల్లో చూసి మరీ ఇంత అరాచకంగా పాలన చేస్తున్నారా అని ఆశ్చర్యపోయేవాళ్లం. మనం రాష్ట్రం చాలా బెటర్ ఇలాంటి ఆటవిక దాడులు జరగవు అని గర్వపడేవాళ్లం.. కానీ ఇప్పుడు పదేపదే అలాంటి సంఘటనలను ఏపీలో చూడాల్సి వస్తోంది.

    ప్రతిపక్షంలో ఉనప్పుడు ఎక్కడో ఢిల్లీలో మహిళలపై దాడి జరిగినా ప్రెస్ మీట్ పెట్టి దేశం ఎటుపోతోంది అనే అవేదన చెందేవారు చంద్రబాబు. కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నదేమిటి?. మహిళా తహసీల్దార్‌ను ఓ ఎమ్మెల్యే,అతడి అనుచరులు ఇసుక రీచ్‌లో పడేసి కొడితే చంద్రబాబు స్పందించలేదు. పైగా తహసీల్దార్ వనజాక్షే సరిహద్దులు దాటి వెళ్లారని తప్పుపట్టారు. అంటే ఒకవేళ సరిహద్దు దాటి వెళ్లినంత మాత్రాన కొట్టేస్తారా! పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దు ఏమైనా ఇండియా, పాకిస్తాన్ సరిహద్దా?.

    కాంగ్రెస్ పాలనలో ఆడపిల్లలు కాలేజ్‌కు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉందంటూ ఎన్నికల ముందు పదేపదే ఆయనే రావాలంటూ ప్రకటనల ప్రసారం చేయించారు. మరీ నాగార్జున యూనివర్శిటీలో రిషికేశ్వరి ఆత్మహత్యపై సీఎం ఎందుకు స్పందించరు?. దీనిపై రాష్ట్రంలోని విద్యార్థి లోకం ఉడికిపోతున్నా ఒక్క ప్రకటన చేయలేదెందుకు?. రిషికేశ్వరి కేసులో నిందితులు టీడీపీ అనుకూల సామాజికవర్గానికి చెందిన వారని అందుకే ప్రభుత్వం వెనుకేసుకొస్తోందని ఆరోపణలు వస్తున్నా అలాంటిదేమీ లేదని ఎందుకు సీఎం చెప్పడంలేదు?.

    తహసీల్దార్ వనజాక్షిపై దాడి తరహాలోనే ఆదివారం(జులై 26) గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ కొందరు భూకబ్జాదారులు వీఆర్‌ఓ, వీఆర్ఏలను టీవీ కెమెరాల సాక్షిగా బట్టలూడదీసి కొడితే చర్యలు లేవెందుకు?. ప్రజలతో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ప్రతి అంశంపై ప్రెస్ మీట్లు పెట్టే ముఖ్యమంత్రి మహిళలు, ఉద్యోగులపై జరుగుతున్న దాడులను ఎందుకు ఖండించి వెనువెంటనే చర్యలు తీసుకోవడం లేదు ?.

    ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఒక అనుమానం వస్తుంది. చంద్రబాబు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అన్న బిరుదు ఆయనకు అనుకూల మీడియా ఇచ్చినదేనని. ఎందుకంటే చంద్రబాబు తొమ్మిదేళ్ల సీఎంగా ఉనప్పుడు వైరిపక్షం మీడియా అన్నదే లేదుగదా.]

  4. CV Reddy

    నిప్పు:చూసావా అందరూ నాకు మునిశాపం అంటారు కానీ బెల్టు షాప్ లు తీసి వేసి మాట నిలబెట్టుకున్నా
    బ్రహ్మి:బెల్టు షాప్ లు ఉన్నాయిగా, ఎక్కడ తీసివేసారు ?
    నిప్పు:హ హ హ SMS కొట్టు,మందు బాటిల్ పట్టు అనే పధకం పెట్టి ఇంటింటికీ మద్యం ఇస్తున్నాం కదా ,ఇంకా బెల్ట్ షాప్ లు ఎక్కడుంటాయి?
    బ్రహ్మి:ఆ!

  5. CV Reddy

    కులరక్కసికి బలైన రిషితేశ్వరి-Must Read
    ఇసుక మాఫియ ను అడ్డుకున్న MRO వనజాక్షి పై దాడి చేయించిన TDP విప్ ,MLA చింతమనేని చౌదరి మీద యాక్షన్ ఉండదు పైగా ఆమెదే తప్పు అన్నారు
    అవును ఆయనే రావాలి ఆయనోస్తేనే బాగుంటింది అని దప్పుకొట్టిన కుల మీడియా ఎక్కడ? ఆడు మనోడు అయితే ఓకే!
    http://www.muchata.com/state-news/why-caste-is-a1/

    Note:Please don’t use indecent words.

  6. Chedharani Athma viswasam…Alupu aragani Praja Poratam
    Jagan in Anantapur …..

    http://epaper.sakshi.com/apnews/Anantpur/27072015/8

  7. Whilst the Boss shamelessly continues in a responsible chair despite being caught red handed buying MLA’s …..
    The Opposition Leader contiues to fight for the common man ….
    Govt responds to the demands of the Municipality workers.

    http://www.sakshi.com/news/top-news/will-never-support-to-workers-says-ys-jagan-260934?pfrom=home-top-story

  8. CV Reddy

    నడివీధిలో రైతన్న పరువు!- బ్యాంకుల్లోని బంగారు నగలు వేలం
    – పత్రికల్లో ప్రకటనలు
    – రుణమాఫీని నమ్ముకున్నందుకు ఫలితం
    ప్రజాశక్తి ప్రతినిధి – తిరుపతి జోన్‌
    రుణమాఫీ పథకాన్ని నమ్ముకున్నందుకు రైతుల పరువు వీధులపాలవుతోంది. పంట రుణాల కోసం తాకట్టుపెట్టిన బంగారు నగల వేలానికి సన్నాహాలు చేస్తుండటమే దీనికి కారణం. బకాయిదారులుగా తమ పేర్లు పత్రికల్లోకి ఎక్కడాన్ని అవమానంగా భావిస్తున్న రైతులు ప్రభుత్వం చేసిన నిర్వాకంపై మండిపడుతున్నారు. అప్పోసప్పో చేసి తమ నగలను బ్యాంకుల నుంచి విడిపించుకుంటున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచికి సంబంధించి 241 మంది రైతుల పేర్లతో బంగారు నగల వేలం ప్రకటన శుక్రవారం పత్రికలో ప్రచురితమైంది. దానికి వారం ముందు ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకర్‌ (ఐఓబి) నారాయణవనం బ్రాంచి కూడా 294 మంది పేర్లతో ఇలాంటి ప్రకటనే ఇచ్చింది. ఫలానా తేదీలోపు అప్పు చెల్లించకుంటే నగలు వేలం వేస్తామని అందులో స్పష్టం చేశారు. ఇలాంటి ప్రకటనలు రాయలసీమ జిల్లాల్లో రోజూ పత్రికలలో వస్తూనే ఉన్నాయి.

    మాఫీని నమ్మి..నట్టేట మునిగి
    తెలుగుదేశం గత ఎన్నికల సమయంలో రుణమా ఫీపై హామీ ఇవ్వడంతో రైతులు పంట రుణాలు చెల్లించడం ఆపేశారు. అధికారంలోకి వచ్చాక రుణ మాఫీకి సవాలక్ష ఆంక్షలు పెట్టి కోతలు విధించారు. బంగారు నగలు తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలనూ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలిదశలో నామమాత్రంగా చెల్లించి, మిగిలింది తరువాత ఇస్తామని చెప్పింది. మరోవైపు బ్యాంకులు తమపని తాము చేసుకుపోతున్నాయి. నిబంధనల ప్రకారం మూడేళ్లు దాటిన రుణ ఖాతాల్లోని బంగారు నగలు వేలం వేస్తున్నాయి. 2013 మార్చి వరకు తీసుకున్న రుణాలకు సంబంధించిన నగలు వేలం వేస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయి. దీంతో రైతులకు దిక్కుతోచడం లేదు. వాస్తవంగా ఇది ఖరీఫ్‌ సమయం. రైతుకు పెట్టుబడులు అవసరమవు తాయి. బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వకపోగా… ఖాతాల్లోని నగలు వేలానికి పూనుకుంటున్నాయి. ఇటీవల నారాయణవనం ఐఓబీ నగల వేలం ప్రకటన ఇచ్చేసరికి….బెంబేలెత్తిన రైతులు బ్యాంకు బాట పట్టారు. వారం వ్యవధిలోనే 100 మందిక ిపైగా రైతులు బకాయిలు చెల్లించి నగలు విడిపించుకెళ్లినట్లు బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాసులు చెప్పారు. వరదయ్యపాళెం సప్తగిరి బ్యాంకులో కూడా ఇదే పరిస్థితి. ప్రకటన వెలువడిన శుక్రవారం 15 మంది రైతులు హుటాహుటిన అప్పు చెల్లించారు. ‘పంట ఖర్చుల కోసం తెచ్చుకున్న డబ్బులు తెచ్చి బ్యాంకు అప్పు తీర్చాను…మళ్లీ ఇప్పుడు ఎక్కడైనా అప్పు తెచ్చుకోవాలి…ప్రభుత్వం చేసిన దానికి మా పరువు పేపర్లకు ఎక్కింది’ అని వాపోయారు వరదయ్యపాళెంకు చెందిన ఓ రైతు. ‘మా బ్యాంకులోనూ నగలు వేలం ప్రకటన ఇచ్చారు. పిల్లల చదువుల కోసం అప్పు తెచ్చుకున్న డబ్బులు కట్టేసి నగలు విడిపించుకున్నాను’ అని చెప్పారు ఏర్పేడు మండలం పాపానాయుడు పేటకు చెందిన ఓ రైతు.

    కొత్త రుణాలకు కోటి నిబంధనలు
    అప్పుచేసైనా నగలు విడిపించుకుని…మళ్లీ తాకట్టుపెట్టి రుణం తీసుకుందామంటే….స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ (రుణ పరపతి) అడ్డంకిగా మారిపోయింది. గతంలో ఉదారంగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు రుణ పరపతికి మించి అప్పు ఇవ్వడం లేదు. బంగారు తాకట్టుపెట్టినా…పంట రుణ పరపతికి మించి ఇవ్వడం లేదు. చెరకు సాగు చేసినట్లు చూపితే రూ.40 వేల దాకా రుణం ఇచ్చేవారు. ఇప్పుడు సంబంధిత చక్కెర ఫ్యాక్టరీ నుంచి ధ్రువీకరణ పత్రం తెస్తేగాని చెరకుపై రుణం ఇవ్వడం లేదు. రైతుల పరిస్థితి తెలిసి బ్యాంకులు సాయం చేద్దామనుకున్నా చేయలేకున్నారు.
    అంతా అన్‌లైన్‌ చేయడం వల్ల స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌కు మించి రూపాయి అదనంగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటివన్నీ రైతులకు సమ స్యగా మారాయి. ఇప్పుడు ఏ బ్యాంకులోనైనా ఇదే కథ. ఏ రైతుదైనా వ్యథ. ప్రభుత్వానికి ఇవేవీ పట్టడం లేదు. రుణాలు ఇవ్వండని బ్యాంకర్లకు అన్యాపదే శంగా చెప్పడమే తప్ప ఆచరణలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదు.

    http://www.prajasakti.com/Content/1660672

  9. CV Reddy

    ప్రక్షాళనలో పరకాలపై వేటు ?
    ఓటుకు నోటు వ్యవహారం తర్వాత తాను మీడియా సలహాదారుగా ఉండలేనని, తనను ఎంఎల్‌సి చేసి, మంత్రి పదవి
    ఇవ్వాలని పరకాల సిఎంకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు చేసేందుకు సిద్ధపడ్డట్లు సమాచారం. కాగా పరకాలకు పదవిపై సిఎం సుముఖంగా లేరని తెలుగుదేశం పార్టీ నేతలంటున్నారు.

    – కొంత కాలంగా సిఎం అసంతృప్తి
    – పుష్కర ఏర్పాట్ల కమిటీ ఛైర్మన్‌గా ఫెయిల్‌
    – కేబినెట్‌లోనే ఆగ్రహం
    ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఓటుకు నోటు దగ్గర నుంచి గోదావరి పుష్కరాల వరకు ముఖ్యమైన ప్రతి సందర్భంలోనూ పరకాల వ్యవహరించిన తీరు పట్ల అసహనం వెలిబుచ్చినట్లు సమాచారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది అయినందున కేబినెట్‌లో, సిఎం కార్యాలయం (సిఎంవొ)లో, ప్రత్యేకించి తన బృందంలో సమూల మార్పులు చేయాలనుకున్నారు ముఖ్యమంత్రి. ఓటుకు నోటు, జపాన్‌ పర్యటన, గోదావరి పుష్కరాలు వెంట వెంటనే రావడంతో ప్రక్షాళన వాయిదా పడింది. పుష్కరాలు పూర్తయినందున ఇక మార్పులపై దృష్టి సారిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్షాళన అంటూ మొదలు పెడితే తన టీంలోని పరకాల ప్రభాకర్‌పైనే తొలి వేటు పడొచ్చని అంచనాలు కడుతున్నారు. అందుకు పలు కారణా లను పేర్కొంటున్నారు. ఓటుకు నోటు వ్యవహా రంలో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారంటున్న ఆడియో టేపులు మీడియాలో హల్‌చల్‌ చేసిన కొద్ది సేపటికి సర్కారు తరఫున పరకాల మాట్లాడారు. ఆయన స్పందించిన తీరు బాగాలేదని అప్పుడే సిఎం అసంతృప్తి వెలిబుచ్చారని తెలిసింది. మంగళగిరి వద్ద నిర్వహించిన సంకల్ప సభలో సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, విజయాలపై ప్రదర్శించేందుకు ఎంతో వ్యయ ప్రయాశలతో సీడీని తయారు చేశారు. స్క్రీన్‌పై ఆ సీడి ప్రదర్శిస్తారని సభలో సిఎం ప్రకటిం చగా, పరకాల సీడీ మర్చిపోయారు. ప్రతిష్టా త్మకంగా నిర్వహించిన సంకల్ప సభ కోసం రూపొం దించిన సీడీని మర్చిపోవడం ఏంటని పరకాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పరకాల కొన్నాళ్లు అంటీముట్టనట్లున్నారు. మీడియా సమావేశాలకు దూరంగా ఉన్నారు.

    గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై నియమించిన కమిటీకి పరకాల ఛైర్మన్‌. ఏర్పాట్ల విషయంలో ఆయన పెద్దగా శ్రద్ధ పెట్టలేదని సిఎం అసంతృప్తిగా ఉన్నారు. అసలు సమీక్షలు చేయలేదని, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించడంలో విఫలమ య్యారని అసహనంతో ఉన్నారు. పరకాల సరిగ్గా పని చేయనందున అన్నీ తానే చూసుకోవాల్సి వచ్చిందని రాజమండ్రిలో ఇటీవల జరిగిన కేబినెట్‌లో పరకాల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

    పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాటకు షార్ట్‌ ఫిలిం షూటింగ్‌ కారణమని పత్రికల్లో వార్తలొచ్చాయి. అనంతరం మీడియా సమావేశంలో పరకాల మాట్లా డుతూ నేషనల్‌ జియోగ్రాఫికల్‌ చానెల్‌తో ఒప్పం దం కుదుర్చుకున్నామని వెల్లడించడంపై కూడా చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు సమాచారం.

    ఇదిలా ఉండగా ఓటుకు నోటు వ్యవహారం తర్వాత తాను మీడియా సలహాదారుగా ఉండలేనని, తనను ఎంఎల్‌సి చేసి, మంత్రి పదవి ఇవ్వాలని పరకాల సిఎంకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు చేసేందుకు సిద్ధపడ్డట్లు సమాచారం. కాగా పరకాలకు పదవిపై సిఎం సుముఖంగా లేరని తెలుగుదేశం పార్టీ నేతలంటున్నారు.

    ఒక వేళ ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు తెచ్చినా లొంగకపోవచ్చని చెబుతున్నారు. పరకాల భార్య, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎపి నుంచి రాజ్యసభకు రెండేళ్ల కాలానికి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నేత నేదురుమల్లి జనార్ధనరెడ్డి మరణంతో గత ఏడాది ఉప ఎన్నిక జరిగింది. వచ్చే జూన్‌కు ఆమె పదవీకాలం ముగుస్తుంది. మళ్లీ నిర్మలను ఎపి నుంచి రాజ్యసభకు పంపాల్సి ఉన్నందున, పరకాలకు ఎలాంటి పదవీ ఇవ్వకపోయినా ఇబ్బందేమీ ఉండదన్న ఆలోచనలో సిఎం ఉన్నట్లు తెలిసింది.

    http://www.prajasakti.com/Content/1660675

  10. CV Reddy

    పుష్కరాల్లో VIPల వికృత హేల -EAS Sharma, Retired IAS
    http://www.sakshi.com/news/opinion/vips-in-pushkara-ghats-260894?pfrom=home-top-story

  11. CVR Murthy

    32 మంది మరణించిన వారి గురించి ఏమాత్రం చెప్పకుండా ,వారి ఆత్మ శాంతి కి ప్రార్దించకుండా , దానికి తగ్గటు మత పరమైన చర్యలు పాటించకుండా పుష్కర ముగింపు వేడుకలు బాణ సంచాలతో ,అట్టహాసం గా చేసుకోడం మానవత్వమున్న ఎవరు చెయ్యరు . దాన్ని నిర్వహించినవారు ,దాంట్లో పాల్గొన్నవారు ,ప్రేక్షకులు వీక్షకులు వీరందరికీ పాపం కలుగుతుంది . వై ఎస్ అర్ సి పి రాజముండ్రి లో వేదపండితుల తో ప్రత్యేక కార్యక్రమం , సంతాప సభా చెయ్యాలి

  12. CV Reddy

    లీడర్ : సావు కథ తేల్చమంటె ..సెలవులిచ్చేశారు
    “ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత” ఈ మాటలు ఇంతకుముందు లీడర్ సినిమాలో విన్నట్లు అనిపిస్తుంది కదూ. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో కళ్లముందు కనిపిస్తుంది. కులగజ్జికి తిరుగులేని ఉదాహరణలుగా ఉండే కోస్తాంధ్ర జిల్లాలలోని గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో సీనియర్ విద్యార్థుల దాష్టీకానికి బలయిన తెలంగాణ విద్యార్థి రితికేశ్వరి మరణం విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మీద ఈ ఆంధ్రా ముఖ్యమంత్రి ఇంత వరకు నోరు తెరిచి మాట్లాడలేదు.

    కళాశాలలో సీనియర్ విద్యార్థి చేతిలో ర్యాగింగ్ కు గురయిన రితికేశ్వరిని అర్ధనగ్నంగా ఊరేగించి వీడియో తీశారు. ఆ వీడియోను కొందరు షేర్ చేశారు. ఈ అవమానం వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ చేసే విద్యార్థులకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ అండగా ఉన్నాడు. వారితోనే తాగి తందనాలు ఆడుతాడని వీడియో సాక్ష్యాలతో సహా బయటపడింది. ఆ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయగానే ఇక అక్కడ కులగజ్జి బయటకు లేచింది.

    కమ్మ – నాన్ కమ్మ విద్యార్థి సంఘాలు ఏర్పడి కమ్మ విద్యార్థి సంఘం ప్రిన్సిపాల్ వైపు, నాన్ కమ్మ సంఘం ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా గొడవ మొదలు పెట్టాయి. ఈ కులగజ్జి విద్యార్థుల మీద చర్యలు తీసుకొని ప్రిన్సిపాల్ ను కఠినంగా శిక్షించాల్సింది పోయి కళాశాలకు సెలవులిచ్చి పంపేసి సమస్యను తొక్కిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన శ్రీనివాస్, అనిషా అనే విద్యార్థులతో పాటు, శ్రీచరణ్ అనే లెక్చరర్ వ్యవహారం ఎటూ తేలలేదు. ఈ కేసులో ఉన్నవారంత కమ్మ వారు ఉండడంతోనే దీనిని తొక్కిపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఓ మంత్రి హస్తం కూడా ఉందని తెలుస్తోంది. అందుకే ఈ వ్యవహారం గురించి ప్రభుత్వ పెద్దలు ఎవరూ నోరెత్తడం లేదు.
    http://madeintg.com/chandra-babu-naidu-61/

    • Some naked caste fanatics in AP think everyone else in the state is naked too ??
      Unethical , Inhumane and un democratic actions of some yellow people is bringing shame to telugu community.
      Please use the social media and let the world know their true colours.
      It is 5% Weed Vs 95 % Grass. Don’t let the weed destroy the grass.

  13. CV Reddy

    చౌదరి గారికి దొనకొండ మీద ఎంత ప్రేమ?
    కృష్ణానదికి సమీపంలో నందిగామలో స్థాపించదలచిన ఫార్మాస్యూటికల్‌ వంటి పరిశ్రమల కారణంగా నది, ఇతర సహజ వనరులు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉంది .
    ఆ పరిశ్రమలను దొనకొండ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి
    -ఆంద్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ (చౌదరి)

    అంటే రాజధాని మాత్రం కృష్ణ గుంటూర్ లో పెట్టాలి ,కలుషితాలు, పొగ దుమ్ము, ధూళి, విషపదార్ధాలు వచ్చేవి మాత్రం దొనకొండ లో పెట్టాలి
    ఎంత కమ్మని ప్రేమ !

    Note:Please don’t use indecent words.

    http://kommineni.info/articles/dailyarticles/content_20150726_17.php?p=1437893261317

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s