నేటి నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తిన అనేక అంశాలతో పాటు, ఇతర ప్రజా సమస్యలపై కూడా రెండు పార్టీలు కత్తులు నూరుకుంటున్నాయి. ప్రధానంగా ప్రత్యేక హౌదా, రాజధాని ప్రాంతంలో భూసేకరణ, రాష్ట్రంలో నెలకొన్న కరవు కాటకాలు, విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ భూతానికి విద్యార్థినుల బలి వంటి పలు కీలక అంశాలు చర్చకు రాను న్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైకాపా సభ్యులు ప్రణాళిక రచిస్తుండగా, వారి దాడిని తిప్పికొట్టేందుకు అధికార పక్షం కూడా సన్నాహాలు చేసుకుంటోంది. సుమారు ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాలు ఉద్వేగంగా, ఉద్రిక్తంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కావాలంటూ వైకాపా, సిపిఎం, సిపిఐలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రజల నుంచి కూడా దీనిపై గట్టిగానే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. చివరకు కొందరు హౌదా డిమాండ్‌తో ఆత్మాహుతికి కూడా పాల్పడుతున్నారు. ఇదే అంశంపై వైకాపా రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ రోడ్డు పైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. శాసనసభలో కూడా హౌదా అంశం ప్రధాన చర్చకు దారి తీయనుంది. హౌదా కావాలంటూ కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాలని శాసనసభలో వైకాపా, శాసనమండలిలో సిపిఎం డిమాండ్‌ చేయాలని నిర్ణయించాయి. మండలిని, శాససభా సమావేశాలను ఈ అంశంపై ఆ పార్టీలు స్తంభింప చేసేందుకూ సిద్ధమయ్యాయి.

రాజధాని ప్రాంతంలో భూ సేకరణ అంశం కూడా సభలో కీలక చర్చకు రానుంది. భూ సమీకరణ స్థానంలో భూ సేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వైకాపాతోపాటు, ఇతర రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. అమరావతి, తుళ్లూరు ప్రాంతాల్లో అనునిత్యం ధర్నాలు, క్రిడా కార్యాలయాల ముట్టడులు సాగుతున్నాయి. ఈ అంశంపై ఉభయ సభల్లోనూ విస్తృత చర్చ సాగనుంది. రైతుల నుంచి భూమిని సేకరించడాన్ని అన్ని పార్టీలూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై ఉద్యమాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఈ అంశంపై ఉభయ సభల్లోనూ ప్రశ్నిస్తూ, ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల కూడా కీలకాంశంగానే చర్చకు రానుంది. ఉల్లి, కందిపప్పు ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్న నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి దారుణంగా ఉందంటూ ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తున్న ప్రతిపక్షం, సిపిఎం సభ్యులు అదే విషయాన్ని ఉభయ సభల్లో ప్రశ్నించనున్నారు. ఈ అనేక అంశాల నేపథ్యంలో శాసనసభ, శాసన మండలి సమావేశాలు వాడిగా వేడిగా సాగనున్నాయి.

17 Comments

Filed under Uncategorized

17 responses to “నేటి నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు

 1. CVR Murthy

  అసెంబ్లీ లో ఫుట్ బాల్ గేమ్ స్ట్రాటజీ ఉండాలి ఒక్కొక్క TDP MLA కి ఒక ysrcp mla mark చెయ్యాలి అచ్చెం నాయుడు లేచినప్పుడు వెంటనే అతని హిస్టరీ మాట్లాడాలి ,ఉమా లేచినప్పిడు అతని హిస్టరీ మాట్లాడాలి

 2. Sridhar Gondhi

  I think content of Sakshi news paper has to improve Vs Eenadu. More research based content has to be presented rather than simply presenting one sided news. Recent Sunday publish on CBN ditching NTR and backstabbing event 20yrs back, i know its a shameful act in democracy to do, but people have moved away from that topic, spending a full page on that topic is debatable, but that space can be effectively used for some other topic too?

  • Rajasekhara

   well said Sridhar Gandi garu ,

   when I read eenadu it act as nueatral view but narration is investigative mode .. only logic they have is they portrait whos in good shade or whose in bad shade .. my point was eenadu narration was like neutral views .

   Eenadu is in tabloid story format for every writings .. sakshi must go on the way because its like which novel will sold who written well . not which novel had great content .. for ex :- who will read Gita instead of we read personality development books best selling we can say…

   Yellow gang must shiver what will come on Sakshi if we do wrong .. like investigation journalism should come for every day..

 3. Kiran

  వాళ్ళు జగన్ ని చూసి ఎంత భయపడుతున్నారు అంటే, 15 రోజులు జరగాల్సిన అసెంబ్లీని 5 రోజులకు కుదించడమే కాక, సెప్టంబర్ 2 (YSR వర్ధంథి రోజు) అస్సెంబ్లి పనిచేస్తుంది.. అ రోజు వాల్లు హ్యపి.. ఎందుకఒంటె.. జగన్ పులివెందులలొ వుంటదు కద. మొత్తంగా 4 రోజులు కూడ జగన్ ని ఎదుర్కోలేరు.

 4. rajesh2442

  Next elections cbn will say only about captial.Ysj should come out with good strategy or else again we need to be in opposition again.

 5. Veera

  ఉత్తరాంధ్ర , సీమ నోట్లో మట్టి .కృష్ణ గుంటూర్ నోట్లో బంగారం -TDP నాయకులు
  Focus on capital breeds discontent
  You take any project, The CM is granting to the capital city districts-Krishna and Guntur.Why doesn’t the Govt sanction a big-ticket project to the backward districts? Senior TDP leader from Kurnool

  It seems chief minister Chandrababu Naidu’s focus on the capital city is sowing seeds of discontent among TDP leaders in Rayalaseema and north coastal districts.

  On Saturday , deputy chief minister KE Krishnamurthy had accused Naidu of ignoring their demands just because the party did not win more than three seats in the assembly elections in Kurnool. “How are we responsible for the party’s debacle in Kurnool?“ he asked at a mini-mahanadu meeting, adding that the CM was focusing on West Godavari as the TDP won all the seats there.

  Meanwhile, Pathivada Narayana Swamy a senior leader from Vizianagaram, also lashed out at the government’s failure to set up a medical college in the district. “We promised the people that they will get a government medical college as Vizianagaram is a backward district. How can you go back on this issue and encourage private people to open the college?“ he asked at another mini-mahanadu meeting in Vizianagaram on Sunday .

  According to party insiders, many leaders from the north coasta AP and Rayalaseema are unhappy over the centraliza tion of develop ment programmes. Though Rayalaseema advocates have been demanding the setting up of a high court in Kurnool, the chief minister has made it clear that it would be located in the capital city. When the Centre granted an agriculture university, the government again zoomed in on Guntur.

  “The agriculture research station at Nandyal (Kurnool) has produced several revolutionary varieties of paddy seeds and has been a seed hub for groundnut and cotton. What is the logic behind granting the agriculture university to the Guntur research station?“ asked Ramachandra Reddy , a veteran agriculture scientist.

  Leaders from Prakasam district, meanwhile, are upset at not bagging the All India Institute of Medical Sciences (AIIMS). “We came to know the foundation stone laying ceremony of AIIMS was put off as the district administration failed to allocate 200 acres near Mangalagiri. Why could not the government consider Prakasam district for location of such a project despite knowing that hundreds of acres of government land is available here?“ asked R Ramakrishna, Prakasam district development forum leader.

  http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=Focus-on-capital-breeds-discontent-25052015002074%5D

 6. Veera

  నోరా తాటి మట్టా!
  తలుపులు మూసి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు-అసెంబ్లీ లో బాబు
  1.(పార్లమెంటు బయట)విభజనకు అనుకూలంగా మొదటి వోట్ మేమే వేసాము
  -బాబు, నామా నాగేశ్వర రావు చౌదరి(అప్పటి TDP పార్లమెంటు నాయకుడు)
  2.విభజన లేఖ లో సీమంధ్ర కు న్యాయం చేయాలి అనే కండిషన్ పెట్టండి అని బాబు ను కలిసి ప్రాధేయ పడినా పక్కనే ఉన్న కడియం శ్రీహరి ఒప్పుకున్నాడు కాని ఆ మాటలు లేఖ లో పెట్టడానికి బాబు ఒప్పుకోలేదు కాని విజయమ్మ గారు లేఖ లో పెట్టారు
  -ఆంధ్ర మేధావుల నఘం అద్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి TV9 చర్చ లో
  3.4 నెలల క్రితం మహబూబ్ నాగర్, వరంగల్ సభలలో నా లేఖల వల్లనే తెలంగాణా వచ్చింది అని చెప్పారు బాబు
  4.YS మరణం, ప్రతిపక్ష నాయకుడు బాబు విభజన లేఖల వలన తెలంగాణా ఏర్పడింది
  -ప్రో నాగేశ్వర్

  తెలంగాణా లో వోట్లు సీట్లు పోతాయని తెలిసినా సమైక్యాంధ్ర అన్న జగన్ ది తప్పా?

  http://kommineni.info/articles/dailyarticles/content_20121231_5.php

  No Harsh Comments Please!

  • Sridhar Gondhi

   YSJ has to counter that its only Vijayamma who has spoken against bifurcation & in favor of united AP. CBN hasn’t uttered as single word in 2014, while the bill was tabled.

 7. Veera

  బాబు:నేనే హైదరాబాద్ ను ప్రపంచ పటం లో పెట్టాను
  బ్రహ్మి:వదలండి, నన్నువదలండి!
  No Harsh Comments Please!

 8. Veera

  అసెంబ్లీ ప్రసారాలు బాబు బినామీ రాదక్రిష్ణ చౌదరి కి చెందిన ABN ఆంధ్రజ్యోతి చానల్ కు ఇచ్చిందే జగన్ మైక్ కట్ చేయడానికి, బాబు కు ఇష్టమైనవి చూపించి మిగితావి చూపించకుండా ఉండటానికే.అసలు రవి ప్రకాష్ చౌదరి కి చెందిన TV9 కు ఇద్దామనుకున్నారట ముందు కానీ ఇప్పటికే బాబు భజన చేస్తున్నాము అని ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి మేము వెనకాల నుంచి దరువు వేస్తాము , మాకు వద్దు అన్నారట TV9 వాళ్ళు.

 9. Veera

  AP ప్రభుత్వం భూసేకరణ నుంచి వెనక్కి తగ్గడం వెనక అసలు కారణం ..
  [ఆర్డినెన్స్‌కు బ్రేక్‌ సేకరణకు చెక్‌
  ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి
  రాజధాని గ్రామాల్లో భూ సేకరణకు హడావుడిగా నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం వారం తిరక్కుండానే వెనక్కి తగ్గడం వెనుక ఉన్నత స్థాయిలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
  కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్టానికి నిరంకుశంగా సవరణలు చేసి మూడుసార్లు ఆర్డినెన్సు తెచ్చింది. చివరిగా పొడిగించిన ఆర్డినెన్సు గడువు సోమవారంతో ముగుస్తుంది. సవరణకు సంబంధించిన బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. అంతేగాక ఈ ఆర్డినెన్సును మరోసారి పొడిగించే ఉద్దేశం లేదని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వానికి వారం కిందటే అందడంతో భూ సేకరణపై ఏం చేయాలనే అంశమై ఉన్నత స్థాయిలో తర్జన భర్జనలు జరిగాయి.
  సవరణల ఆర్డినెన్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమూ పలు జీవోలు తెచ్చింది. తీరా కేంద్రం నుంచి ఆకస్మికంగా సవరణలను పొడిగించడం లేదని స్పష్టమవడంతో గత్యంతరం లేక భూసేకరణను రద్దు చేసింది. ఇప్పటికిప్పుడు భూ సేకరణ చేస్తే 2013 చట్టం ప్రకారం చేయాలి. దీని ప్రకారం 80 శాతం మంది అంగీకరిస్తేనే భూములు తీసుకోవాలి. అంతేగాక బహుళ పంటలు పండే భూములను తీసుకోకూడదు. సామాజిక సర్వే చేయాలి. ప్రజాభిప్రాయం ప్రకారమే సేకరణ చేయాలి. రైతులకు సంబంధించి పలు సదుపాయాలు కల్పించాలి. సాంఘిక భద్రత, నాలుగు రెట్లు ధర చెల్లించాలి.
  వీటిని అమలు చేయడానికి సిద్ధపడని ప్రభుత్వం సేకరణను రద్దు చేసి రైతులకు మేలు చేసేందుకు సమీకరణకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు బీరాలు పోతోంది. అంతేగాక ఇప్పటివరకూ గన్నవరం విమానాశ్రయానికి పలు దఫాలుగా భూసేకరణకు పూనుకున్న ప్రభుత్వం ఆకస్మికంగా కేంద్రంలో వచ్చిన మార్పును గమనించి ఇక్కడా సేకరణ నిలిపేసి సమీకరణ ద్వారా భూములు తీసుకుంటామనీ, పరిహారంగా రాజధాని గ్రామాల్లో గన్నవరం ప్రాంత రైతులకు ప్లాట్స్‌ కేటాయిస్తామని ప్రకటించింది.
  ఇప్పటికే భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులకు పరిహారంగా ఎక్కడ భూములు ఇస్తారో చెప్పని ప్రభుత్వం గన్నవరం ప్రాంతం వారికీ 29 గ్రామాల్లోనే భూములు కేటాయిస్తామనడం విడ్డూరంగా ఉందని ఈ ప్రాంత రైతులు చెపుతున్నారు.
  భూ సేకరణ చేస్తే ఉద్యమం చేస్తామని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడం, కేంద్రం నుంచి వచ్చిన సమాచారంతో సేకరణ ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేయడం, రైతుల మనోభావాలను అర్థం చేసుకుని సేకరణ నిలిపివేసినందుకు మంత్రులు నారాయణ, పుల్లారావుకు పవన్‌కళ్యాణ్‌ కృతజ్ఞతలు చెప్పడం చకచకా జరిగిపోయాయి.
  http://www.prajasakti.com/Content/1675558

 10. Veera

  జగన్ మూర్ఖుడు- అచ్చెన్నాయుడు
  (పిచ్చివాల్లకు ఇతరులు పిచ్చివాల్లుగా , మూర్ఖులకు ఇతరులు మూర్ఖులుగా కనపడటం సహజం)
  గమనిక: అభ్యంతరకర పదాలు వాడి మన స్థాయిని అతని స్థాయికి తగ్గించుకోవద్దు
  వీలుంటే అతని పట్ల జాలి చూపుదాం!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s