ఇసుక దందా

ఇసుక తవ్వకాల ముసుగులో రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమార్కుల దందాకు హైకోర్టు వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ప్రక్కిలంక గ్రామ పరిధిలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసం చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకమైనవి. కేసు విచారణ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు ప్రత్యక్ష హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తినీ తిరస్కరించడం అక్రమాల తీవ్రతకు నిదర్శనం. భూ గర్భ జలాల శాఖ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయకుండానే యంత్రాల వినియోగానికి అనుమతి ఇవ్వడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.

ఇసుక మాఫియా విచ్చల విడిగా దోపిడి చేస్తున్న తీరును, అధికార యంత్రాంగం కీలుబొమ్మగా మారిన వైఖరినీ ప్రస్తావించింది. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ వాస్తవానికి అవి రాష్ట్రం మొత్తానికి ఉద్దేశించి చేసినవిగానే భావించాలి. రాష్ట్రమంతా అదే పరిస్థితి నెలకొనడమే దీనికి కారణం.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక తవ్వకాలను డ్వాక్రా మహిళలకు అప్పగిస్తున్నట్లు అట్టహాసంగా చేసిన ప్రకటనను ఆచరణలో కాగితాలకే పరిమితం చేసిన తీరు దుర్మార్గం. డ్వాక్రా సంఘాల ముసుగులో ఎక్కడికక్కడ పాలకపక్ష నేతలు చెలరేగిపోయారు. నిబంధనలను విచ్చలవిడిగా ఉల్లంఘించడం, భౌతిక దాడులకు దిగడం మాఫియాను మరిపించింది. కొన్నిచోట్ల మంత్రులు, ఎంఎల్‌ఎలే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి చట్టాలను తుంగలో తొక్కుతున్న తీరు దారుణం.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్థితిపై ఆందోళనలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమార్కుల కొమ్ము కాయడంలో గత పాలకులను మించి పోయింది. ప్రభుత్వానికి కాంట్రాక్టర్లకు మధ్య ఉండాల్సిన గీత చెరిగిపోయింది. మంత్రులు, ఎంఎల్‌ఎలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడం, అడ్డుకున్న అధికారులపై దాడులకు దిగడం, ముఖ్యమంత్రి మద్దతూ వారికే లభించడంతో ఇసుక మాఫియా మరింతగా బరి తెగించింది. అక్రమ రవాణాను అడ్డుకున్న కృష్ణా జిల్లా ఎంఆర్‌ఒ వనజాక్షిపై దాడి చేసిన వారిపై ఇంతవరకు చర్యలు లేకపోవడమే దీనికి నిదర్శనం. ఆ తరువాత కూడా దాడులు కొనసాగుతున్నాయంటే ఉన్నత స్థాయి నుండి సహకారం అందుతున్న ధీమానే కారణం. పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కాబట్టే హైకోర్టు తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. ధర్మాసనం చేసిన వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వ పెద్దల్లో కదలిక రావాలి. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టే దిశలో చిత్తశుద్ధ్దితో చర్యలు తీసుకోవడానికి సిద్ధం కావాలి.

http://www.prajasakti.com/EditorialPage/1681040

స‌ర్కార్ భూదాహం
పరిశ్రమల పేర ‘పెద్దల’కు పందేరం
15 లక్షల ఎకరాలు లక్ష్యంగా ల్యాండ్‌ బ్యాంక్‌
ఇప్పటికే ఏడు లక్షల ఎకరాలు గుర్తింపు
పేదల భూముల స్వాధీనానికి రంగం సిద్ధం
రాజధాని అమరావతికి అవసరమైన 45,500 ఎకరాలు కాకుండా గుంటూరు జిల్లాలో కేవలం పరిశ్రమల కోసం 48,560 ఎకరాల భూమిని అందుబాటులో ఉంచామని అధికారులు ఇదివరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

http://www.prajasakti.com/Content/1681876

BJP ministers in Cabinet face heat

http://www.deccanchronicle.com/150910/nation-current-affairs/article/bjp-ministers-cabinet-face-heat

7 Comments

Filed under Uncategorized

7 responses to “ఇసుక దందా

 1. Sridhar Gondhi

  Why is YSRCP silent on KesavaReddy school scam? This guy has taken TDP membership after May 2014 results.

 2. PSK

  No one in YSRCP can speak logic like Undavalli…See below:

 3. Veera

  పవన్ వలన TDP గెలవలేదు-TDP MLC పయ్యావుల కేశవ్ చౌదరి
  పవన్ కాళ్ళు మోడీ గడ్డం పట్టుకొని అతి కష్టం మీద బాబు గెలిచాడు
  -Congress MLC C రామచంద్రయ్య
  రుణమాఫీ వలన బాబు గెలిచాడు
  -ఆంద్రజ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి,TDP MP గరికపాటి చౌదరి
  పవన్ వలన బాబు గెలిచాడు-కాపునాడు
  కాపులకు బాబు చెప్పింది కొండంత చేసింది గోరంత -చిరు
  ఎన్నికలకు ముందు పవన్ ఇంటికి బాబు వెళ్ళడా లేక బాబు ఇంటికి పవన్ వెళ్ళాడా కేశవ్?బాబు వలన గెలిచాము అన్న పెద్ద మనిషి ఎవరన్నా ఉన్నారా?
  పులి బిడ్డ మీదకి ఒంటరిగా వెళితే ఏమి జరుగుద్దో తెలియదా వెన్నుపోటు నాయుడికి?

 4. Veera

  ఇక పులి వేట మొదలైంది-బాస్ బానిస
  (అవును ఒక్కో ఎలుకను పడితే పది రూపాయలు అని మీ బాస్ చెప్పాడుగా!)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s