అనుసంధానం ముసుగు జారి.. కొల్లేటికి చేరిన అవినీతి కథ!

అనుసంధానం’ పేరుతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రదర్శించిన నాటకం రక్తి కట్టలేదు. పుష్కరాల్లో చేసిన పబ్లిసిటీ వేట లాగే ఇదీ వికటించింది. పట్టిసీమ పేరుతో లేచిన అవినీతి ‘కురుపు’ కనిపించకుండా ‘అనుసంధానం’ అనే ముసుగును కప్పేశారు.
ఎవరి కంటా పడకుండా హంద్రీనీవా ప్రాజెక్టు మోటారును రహస్యంగా ఎత్తుకొచ్చారు. మూడురోజులు తంటాలు పడి కాసిన్ని గోదావరి నీళ్లు తోడి పోశారు. తోడుగా కొన్ని తాడిపూడి ఎత్తి పోతల నీళ్లను కలిపారు. వీటికి కొద్దిపాటి వర్షం నీరు తోడైంది.

వైఎస్సార్ హయాంలో 80% పూర్తయిన పోలవరం కుడి కాల్వను ఉపయోగించుకొని కీర్తి కిరీటం పెట్టుకునే ప్రయత్నం చేశారు. మిగిలిన కొద్దిపాటి కాల్వ పనులను నాసిరకంగా ముగించడంతో కృష్ణాకు వెళ్లాల్సిన నీళ్లు తమ్మిలేరులోకి జారిపోయి కొల్లేరు బాట పట్టాయి.
ఒక్క మోటారు ఆన్ చేస్తేనే బద్దలైన కుడికాల్వ అక్విడెక్ట్

గతంలో వైఎస్ మార్కు..ప్రస్తుతం ‘మమ’
175 కిలోమీటర్ల కుడికాల్వ పనుల్లో 130 కి.మీ.కు పైగా కాల్వను దివంగత వైఎస్ హయాంలోనే పూర్తి చేశారు. కాల్వ పనులు పూర్తి చేయడమంటే.. తాత్కాలికంగా కొద్దిపాటి నీటి ప్రవాహానికి వీలుగా అరకొర పనులు చేయడం కాదు. 80 మీటర్ల వెడల్పుతో కాల్వ తవ్వి లైనింగ్ సహ పనులు పూర్తి చేయిం చారు.కుడికాల్వ పనులపై అప్పట్లో రాద్ధాంతం చేసిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పనులనే ఆసరాగా చేసుకొని, తామే ఆ పనులన్నీ చేశామనే చెప్పుకోవడానికిప్రయత్నించింది.

కుడికాల్వను ఉపయోగించుకొని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడానికి ప్రయత్నించి అభాసుపాలయింది. కాల్వలో మిగిలిన 30 శాతం పనులను హడావుడిగా చేసింది. నాణ్యతను పట్టించుకోకుండా మమ అనిపించింది. కాంక్రీట్ నిర్మాణాల్లోనూ నాణ్యత లేకపోవడంతో కాల్వకు గండిపడటానికి ప్రభుత్వం కారణమయింది.

పాత మోటారుతో పక్కా మోసం
పట్టిసీమ ఎత్తిపోతలకు..హంద్రీనీవా పథకానికి చెందిన పాత మోటారు బిగించి ప్రభుత్వం నయవంచనకు పాల్పడింది. హంద్రీనీవా లిఫ్ట్‌కు ఆరేళ్లపాటు ఉపయోగించిన మోటారును తొలగించి పట్టిసీమ మొదటి పంపునకు బిగించింది. ఇది బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచింది. పైగా భోపాల్ నుంచి తీసుకువచ్చామని నమ్మబలికింది. అయితే, తెచ్చిన మోటారు పరిమాణం తక్కువగా ఉండటం.

కాంక్రీటు దిమ్మలో అమర్చే సమయంలో అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలోనే హంద్రీనీవా లిఫ్ట్ వద్ద ఆరో మోటారు హఠాత్తుగా కనిపించకపోవడంతో దానినే ఇక్కడకు తీసుకువచ్చి బిగించారన్న సంగతి బట్టబయలైంది. ఆ మోటారు కూడా తొలిరోజే మొరాయించింది. మరమ్మతులు చేసి ఆన్ చేశారు.

http://www.sakshi.com/news/top-news/only-motor-on-then-broken-right-canal-aqueduct-277778

ద‌త్త‌త‌తో స‌రి
-ఏడు నెలలైనా ‘పెద లబుడు’ పట్టని సిఎం
-ఇదీ స్మార్ట్‌ విలేజీల పరిస్థితి
-గ్రామాలను పట్టించుకోని ప్రముఖులు

స్మార్ట్‌ విలేజి కార్యక్రమంలో చంద్రబాబు ప్రకటన.
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలోని పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకున్నట్లు ఈ యేడాది ఫిబ్రవరిలో ప్రకటించారు. ఈ పంచా యతీ పరిధిలో 21 గ్రామాలున్నాయి. 15 వేల మంది జనాభా ఉంది. రెండుసార్లు సిఎం పెదలబుడు పర్యటన వాయిదా పడింది. ఈ పంచాయతీ పరిధిలోని 21 గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణానికి ఆరు కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అలాగే అరకు, పెద లబుడులో కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు ఒక్కొక్కదానికి రూ.15 లక్షల చొప్పున రెండు భవనాలకు రూ.30 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు పైసా విడుదల కాలేదు. సిఎం పర్యటన ఖరారైనప్పుడు రహదారుల మరమ్మతుల తప్ప తరువాత ఏ పనీ చేపట్టలేదు. 800 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలకు దరఖాస్తులొచ్చినా 300 మరుగుదొడ్లు నిర్మాణాలే జరుగుతున్నాయి.

పైసా ఖర్చు చేయని మురళీమోహన్‌
సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్‌ సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామాన్ని ఏడాది క్రితం దత్తత తీసుకున్నారు. ఆయన ఒక్కసారి కూడా ఈ గ్రామం మొహం చూడలేదు. మూడున్నర వేల జనాభా గల ఈ ఊళ్లో రహదారులు, కొత్త కాలనీలో మంచినీటి ట్యాంక్‌, ఊరగడ్డ వద్ద వంతెన నిర్మించాలి. మూడు పాఠశాలలకుగాను రెండింటికి ప్రహరీ లేదు. మూడు అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా వాటిలో రెండింటికి సొంత భవనాల్లేవు. ఉండేశ్వరపురంలోని గౌడవీధి నుంచి తొర్రేడు వరకూ 450 మీటర్ల బిటి రోడ్డు నిర్మిస్తే రాజమండ్రి రావడానికి రెండు కిలోమీటర్ల దూరం కలిసి వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎంపీ ఈ రహదారి నిర్మాణానికి ఎలాంటి కృషీ ఇప్పటి వరకూ చేయలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోకేష్‌ దత్తత ఊళ్లో ఉన్న భవనాలకే రిపేర్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ తన తాత నందమూరి తారకరామారావు సొంత గ్రామం నిమ్మకూరును ఈ యేడాది ఫిబ్రవరిలో దత్తత తీసుకున్నారు. ఆ గ్రామ జనాభా 8,065. ఇంతవరకూ గ్రామాన్ని సందర్శించలేదు. ఆయన పంపించిన బ్రృందం గ్రామంలో పర్యటించి సమస్యలను అవగాహన చేసుకొని లోకేష్‌కు నివేదిక అందించినట్లు సమాచారం.
దివంగత ఎన్టీ రామారావు నిర్మించిన కళ్యాణ మండపం, పిహెచ్‌సి, పంచాయతీ కార్యాలయం, పశువుల ఆసుపత్రి భవనాలకు మరమ్మతులు చేయించారు. గ్రామాన్ని అభివృద్ధి చేయటంలో లోకేష్‌ పూర్తిగా దృష్టి సారించలేదనే చెప్పొచ్చు. ఈ నెలాఖరులో గ్రామాన్ని సందర్శించబోతున్నట్లూ అప్పుడు అభివృద్ధి ప్రణాళికను ప్రకటించబోతున్నట్లూ తెలుస్తోంది. దళితవాడల్లో రహదారులు, మరుగు దొడ్లు, నిర్మించాల్సి ఉందని సర్పంచ్‌ జంపాన వెంకటేశ్వరరావు తెలిపారు. గురుకుల పాఠశాలలు, కళాశాలలపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. గ్రామంలో నిరుద్యోగాన్ని రూపుమా పేందుకు ఏదైన పరిశ్రమను ఏర్పాటు చేయాలని లోకేష్‌ను కోరతామన్నారు.
దత్తత తరువాత
నారావారిపల్లెలో అడుగు పెట్టని బ్రహ్మణి
చంద్రబాబు జన్మభూమి అయిన కందులవారిపల్లి పంచాయతీలో నారావారిపల్లి హాబిటేషన్‌ను ఆయన కోడలు బ్రహ్మణి గతేడాది నవంబరులో దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్నాక ఇంతవరకూ ఒక్కసారి కూడా ఆమె ఆ గ్రామాన్ని సందర్శించలేదు. ఏ అభివృద్ధి పనీ చేపట్టలేదు. గ్రామాన్ని టాటా కన్సెల్టెన్సీ వారు సర్వే చేశారు. భూగర్భ డ్రెయిన్లు, క్లష్టర్‌ పాఠశాల ఏర్పాటు చేయాలని, సోలార్‌ సిస్టమ్‌లో ఎల్‌ఇడి బల్బులు వేయాలని, ఎస్‌టి కాలనీకి సిసి రోడ్డు వేయాలని, తాగునీరు, డంపింగ్‌యార్డు కావాలని ప్రతిపాదనలు ఉన్నట్లు సర్పంచి తెలిపారు.

http://www.prajasakti.com/Content/1688058

8 Comments

Filed under Uncategorized

8 responses to “అనుసంధానం ముసుగు జారి.. కొల్లేటికి చేరిన అవినీతి కథ!

 1. CVR Murthy

  Yuva bheri should have a detailed professional presentation on Special Status and its benefits. Not more than 10% of the speech should be on CBN.

 2. Veera

  నాబాబే-ఓ తల్లి ఆనంద భాష్పాలు
  చిన్నప్పుడు స్కూల్ లో పెన్నులు దొంగాలించేవడివి, పెద్దయ్యాక యూనివర్సిటీ లో పర్స్ లో దొంగాలించేవాడివి,ఇప్పుడు ఏకంగా అంత పెద్ద పెద్ద మోటార్ లు దొంగలిస్తున్నావా? ఎంత ఎదిగిపోయావయ్యా! పూవు పుట్టగానే పరిమలించును అంటే ఇదే కదా!

 3. Veera

  ఔరా? ఏమి డ్రామాలు బాబూ?
  175 కిలోమీటర్ల పోలవరం కుడికాల్వ పనుల్లో 80 మీటర్ల వెడల్పు, లైనింగ్ తో సహ 130 కి.మీ.కు పైగా కాల్వను వైఎస్ హయాంలోనే పూర్తి చేశారు.
  అప్పట్లో ప్రతిపక్ష నేత బాబు ఈ కాలువ దండగ అన్నాడు , ఇప్పుడు అదే YS కట్టిన పోలవరం కుడి కాలువ వాడుకొని రాయలసీమ ప్రాజెక్ట్ హంద్రీ నీవా పంపు రహస్యంగా తరలించి పట్టిసీమకు బిగించి నదుల అనుసంధానం అంటారా బాబూ?
  [YS జలయజ్ఞం ద్వారా రాష్ట్రం లో 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది అని మొట్టమొదటి అసెంబ్లీ సమావేశములో CM బాబు, అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించాడు.
  ఇది YS జలయజ్ఞానికి బాబు సర్కారు ఇస్తున్న సర్టిఫికేట్-ప్రో నాగేశ్వర్]
  జలయజ్ఞం కాదు ధనయజ్ఞం, ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు
  -ప్రతిపక్ష నేత బాబు(ముని శాపం, ముని శాపం)
  1500 కోట్ల పట్టిసీమ ప్రాజెక్ట్ లో 500 కోట్ల అవినీతి జరిగింది, చర్చకు పిలిస్తే నేను ఆధారాలతో సహా నిరూపిస్తా-ఉండవల్లి
  పట్టిసీమ కేవలం ముడుపుల కోసమే-లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ చౌదరి

 4. Veera

  టీచర్:రామూ, పట్టిసీమ అనగా ఏమి?
  రాము:సీమ పంపు తీసుకొచ్చి బిగిస్తే అదే పట్టిసీమ
  టీచర్:ఆ!!!

 5. Veera

  బాబు గోరు రోజుకు 20 గంటలు కష్టపడుతున్నారు
  -నేటి NTV చర్చ లో ఆంధ్ర మేధావుల సంఘం అద్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి
  అయ్యా మేధావి గారూ, మిమ్మల్ని ఏ మేధావులు ఎప్పుడు ఎన్నుకున్నారో తెలియదు కానీ మీ అను కుల మీడియా మాత్రం మీకిచ్చిన బిరుదు మేధావుల సంఘం అద్యక్షుడు అని.

  సరే అ పేరు వాళ్ళు ఇచ్చినా మీరు పెట్టుకున్నా కొంచెం అయినా పేరుకు న్యాయం చేయండి చౌదరి గారూ.

  ఒక మనిషి 20 గంటలు పని చేస్తే మరి తన కాలకృత్యాలు, భోజనాలు ఇతర కార్యక్రమాలకు రెండు గంటలు అవసరం అంటే బాబు గోరు కేవలం 2 గంటలే నిద్ర పోతారు అన్న మాట మేధావి గారూ!
  భలే భలే మేధావులు కాబట్టి మీకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియకపోవచ్చు .ఆ మధ్య మరో యువ మేధావి అదే లోకేష్ కూడా ఇదే మాట చెప్పారు నాన్నారు రోజూ 20 గంటలు పనిచేస్తారు అని.

  (రోజుకు కనీసం 6 గంటల నిద్ర అవసరం కదా!
  ఒక సారి CM YS ను బాబు గారు రోజుకు 20 గంటలు పనిచేస్తారట కదా అని విలేఖరులు అడిగితె నాకు తెలియదు నేను మాత్రం 10-12 గంటలు మాత్రమే పని చేస్తాను అన్నారు.
  ఒక మనిషి క్యారెక్టర్ ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది)

  సర్ మీరు ఇప్పటికే TDP అనధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు ,బాబు అను కుల భజన చానళ్ళు కూడా మేధావి అనే ముసుగులో మిమ్మల్ని పిలిచి బాబు కు సన్నాయి డోలు వాయిస్తాయి. మరీ బాగోదు ప్రజలు అనుమానిస్తారు అని అప్పుడప్పుడు పూల చెండ్లు తో కొడుతారు బాబు గారిని మీరు .

  మీకుతోడు ప్రముఖ మానసిక విశ్లేషకులు అని చెప్పుకొని తిరిగే C నరసింహారావు చౌదరి గారు, సినిమాలు లేని శివాజీ చౌదరి గారు మీడియా లో సన్నగా బాబు భజన భలే చేస్తారు సర్! కానీండి మీరు కూడా బాబు లాగా ఆ విధంగా ముందుకు పోతున్నారన్నమాట

  బాబు అను కుల భజన చానళ్ళు కూడా భలే తమాషాగా వీళ్ళకు రకరకాల బిరుదులూ ఇస్తూ వీరు వీరులు శూరులు అంటూ బాబు భజన భలే చేస్తాయి సుమీ!

  ఇంకొంతమంది మేధావులను బాబు గోరు నెల నెల NTR ట్రస్ట్ భవన్ నుంచి జీతాలు పంపుతూ తనకు అనుకూలంగా చానల్స్ లో మాట్లడిస్తారు

  కొసమెరుపు:బాబు గారిలో నాకు నచ్చేదేమంటే దేన్నైనా కోనేయచ్చు అనే పాలసీ!

Leave a Reply to Veera Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s