అవును, ప్రత్యేక హోదాయే సంజీవని: వైఎస్ జగన్

ప్రత్యేక హోదా రాగానే రాష్ట్రం నెంబర్ 1గా ఉంటుంది. కారణం, ఈ హోదా వస్తే రెండు ప్రధానమైన మేళ్లు జరుగుతాయి.
1.కేంద్రం మనకిచ్చే నిధులు గ్రాంటుగా.. అంటే తిరిగి ఇవ్వక్కర్లేకుండా 90 శాతం వస్తాయి. పది శాతమే రుణంగా ఉంటుంది. అదే ప్రత్యేక హోదా లేకపోతే 70 శాతం రుణంగా ఉంటుంది, 30 శాతమే గ్రాంటుగా ఉంటుంది.

2.హోదావస్తే రాష్ట్రానికి అప్పులు తగ్గుతాయి. రెండోది.. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం వందశాతం ఎక్సైజ్ డ్యూటీ, ఆదాయపన్ను మినహాయింపులు ఇస్తుంది. రవాణా ఛార్జీలు కూడా వెనక్కి ఇచ్చే సదుపాయం ఉంటుంది. ఇవి ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలకు మాత్రమే వస్తాయి. ఈ విషయాలు పరిశ్రమలకు తెలిస్తే.. మన రాష్ట్రం నుంచి చాలామంది పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తారు. దేశ విదేశాల నుంచి కూడా వస్తారు. లక్షల కోట్లు పెట్టుబడిగా తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఇస్తారు.

3.ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్ లో జరిగిన అభివృద్ధి చూద్దాం. అక్కడ 2వేల పరిశ్రమలు వచ్చాయి 30వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
హిమాచల్ ప్రదేశ్ లో ఏకంగా 10వేల పరిశ్రమలు వచ్చాయి. ఇది ప్రత్యేక హోదా వల్ల మనకు జరిగే మేలు.

మనకు 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ప్రత్యేక హోదా ఇస్తే, కలిగే ప్రయోజనాల వల్ల లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. ప్రత్యేక హోదా గురించి తెలుసుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్, స్పెషల్ స్టేటస్ అని గూగుల్ లో కొడితే బోలెడు వెబ్ సైట్లు వస్తాయి. వాటిని చూసి చంద్రబాబు ప్రభుత్వానికి మీరే అవగాహన కల్పించవచ్చు.

ప్రజల చెవిలో పూలు పెట్టొద్దు
14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు కాబట్టి హోదా ఇవ్వడంలేదని మరో అబద్ధం చెబుతున్నారు. మేమంతా చదువుకున్నవాళ్లమే. మాకూ తెలుసు. ఆర్థిక సంఘం పరిధి, ప్రణాళికా సంఘం పరిధి, ప్రత్యేక హోదా ఇచ్చేదెవరో మాకు తెలుసు, మా చెవిలో పూలు పెట్టొద్దని బాబుకు చెప్పండి. దేశంలో పన్నుల రూపేణా వసూలు చేసిన డబ్బులను ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనే నిష్పత్తిని చూసేది ఆర్థిక సంఘం. నాన్ ప్లాన్ గ్రాంటులు, రుణాలు చూస్తుంది. ప్రత్యేక హోదా అనే అంశం పూర్తిగా కేబినెట్ నిర్ణయం. నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్.. దానికి అధ్యక్షుడు ప్రధాని. నీతి ఆయోగ్ కు అధ్యక్షుడు కూడా ప్రధానమంత్రి. ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకునేది ప్రధానమంత్రి అవునా కాదా అని నిలదీయండి. మార్చి 3న ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇప్పటికి 18 నెలలైనా ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని అడగండి. ఇంత పచ్చిగా అబద్దాలు చెబుతున్నారు. దీన్ని గట్టిగా నిలదీయాల్సింది మనం.

17 Comments

Filed under Uncategorized

17 responses to “అవును, ప్రత్యేక హోదాయే సంజీవని: వైఎస్ జగన్

 1. http://www.sakshi.com/news/top-news/ys-jagan-mohan-reddy-deeksha-will-not-stop-anymore-278995?pfrom=home-top-story

  Why are the Kammanists and Cheevaji chowdary not opening
  their mouths ??
  Kulam……Manam…..Dhanam – Idhe maa jeevitham ???

 2. Mana Gajji ……..Magnet kanna gattidhi ?

  http://www.sakshi.com/news/district/lagadapati-rajagopal-meets-chandrababu-naidu-in-delhi-278810?pfrom=home-top-story

  Akkda vunna …..ami chesthunna …Manasantha nuvva ??
  Kammati jeevithalu ……Viluvalu leni brathukulu.

 3. Jagan Met Ramaji today in Film City!!!!!!!!!!!!!!!!!!!!!!

 4. Veera

  నిప్పు బాస్ మనోగతం పై గుంపులో గోవిందయ్య !
  ప్రత్యెక హోదా వస్తే మహా అయితే రాష్ట్రం బాగు పడుద్ది నాకు ఏమి లాభం బొంగు ?
  అదే ఎంచక్కా డబ్బులు ఇస్తే మా హుండీలో వేసుకుంటాము, ఇంకా మిగిలితే విజయవాడ లో ఖర్చు పెడతాము.మేము మా వాళ్ళు చల్లగా ఉంటె చాలు, వచ్చే ఎనికల్లో 20 వేల కోట్లు ఖర్చు పెట్టగలను.
  ఇప్పుడే వోటుకు 5 కోట్లు ఇచ్చినా, నా సామీ రంగా 4 సం తర్వాత వోటుకు 10 కోట్లు ఇస్తా ! కొనడం మొదలెడితే నన్నుఅద్దుకొనెదెవరు ?
  పైగా నా అవినీతి కేసుల చిట్టా వాళ్ళ దగ్గర ఉంది, నేను పొరపాటున కూడా వాళ్ళ మీద యుద్ధం చేయను! అయినా నేను పుట్టినప్పటినుంచి ఎదురుగా నిలబడి యుద్డంచేసింది లేదు కదా?
  ఒకటి నీవు నాకు ఎదురొచ్చినా లేక నేను నీకు ఎదురొచ్చినా మనది ఎప్పుడూ ఒకే పోటు, అదే వెన్నుపోటు! కాస్కో నా రాజా!

 5. Veera

  ఆత్మహత్య చేసుకున్నపొగాకు రైతు సింహాద్రి వెంకటేశ్వర రావు బాబు కు వ్రాసిన లేఖ
  అయ్యా మీరు మాత్రం 5.5 కోట్ల తో బస్ కొనుక్కుంటారు మాకు మాత్రం చిన్న చిన్న సహాయాలు కూడా చేయరా?
  కాంగ్రెస్ ప్రభుత్వం లో పొగాకు బోర్డ్ ఎకరాకు 8.5 క్వింటాళ్ళ పొగాకు కొంటె బాబు వచ్చి ఎకరాకు 5 క్వింటాలు తీసుకొవదముతొ బ్యాంకులు ఎకరాకు ఇచ్చే అప్పు 5 లక్షల నుంచి 2 లక్షలకు తగ్గించారు.దానితో అప్పులు పుట్టక రైతులం ఇబంది పడుతున్నాము అని ఆత్మహత్య లేఖ లో వ్రాసారు,
  [Debt-ridden farmer flays Chandrababu Naidu, ends life
  Rajahmundry: A week after he wrote to the Centre, the state government and Chief Minister N. Chandrababu Naidu appealing for help, a tobacco farmer on Wednesday committed suicide by consuming soft drink laced with pesticide after incurring losses. Farmer Simhadri Venkateswara Rao, 49, ended his life at Yernagudem village of Devarapalli mandal in West Godavari.

  In his letter for help, Rao referred to the APSRTC spending Rs 5.5 crore to procure a bulletproof bus for Mr Naidu and said the government could spend such a huge amount of money to protect the life of the Chief Minister and wondered whether the lives of the tobacco farmers were not that important. He also said that if a tobacco farmer committed suicide, his family members would lose the bread-winner. He said tobacco cultivation had become un-remunerative and farmers were incurring huge loss.

  He said nearly 14,000 tobacco farmers in the state were facing heavy debts. Rao complained that the Tobacco Board had unilaterally reduced the quantum of tobacco yield to 25 quintals for a baron (five acres) for 2015-16 against 44 quintals per baron earlier.

  This resulted in bankers reducing the quantum of loan to Rs 2 lakh from Rs 5 lakh and above per baron earlier. This added to the troubles of the farmers as they were not sufficient loans to cultivate the crop and were unable to clear the arrears.

  http://www.deccanchronicle.com/150924/nation-current-affairs/article/debt-ridden-farmer-flays-chandrababu-naidu-ends-life ]

 6. Veera

  వివిధ దేశాల రాజధానుల , నగరాల విస్తీర్ణం-బాబు నిలువు దోపిడీ
  అమెరికా రాజధాని వాషింగ్టన్ ఏరియా- 29.5 square km
  సింగపూర్ రాజధాని ఏరియా-675 square km
  న్యూ యార్క్ సిటీ ఏరియా -1214 square km
  లండన్-1572 square km
  పారిస్-2845 square km
  డిల్లీ-2000 square km కంటే తక్కువ
  కలకత్తా -2000 square kmకంటే తక్కువ
  అమరావతి-8,352 square km
  ఇప్పుడు చెప్పండి ఇది 2 లక్షల కోట్ల నిలువు దోపిడీ కాదా?

  సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ను బాబు ఒంటరిగా రహస్యంగా కలిసాడు
  -Indian Express,Sep 22
  [Follow-up Master Plan With Capital Building, Naidu Tells Singapore​.
  HYDERABAD: Chief Minister N Chandrababu Naidu on Monday had a ‘private meeting’ with Singapore’s Second Minister for Trade and Industry S Eswaran and reportedly discussed the modalities to make Singapore agencies partners in the construction of Amaravati through Swiss Challenge Method.

  The ‘private meeting’, on the second day of his three-day official visit to Singapore, took place amidst opposition criticism that Naidu was taking all decisions regarding the new capital like his ‘private affair’.]

  రాజధాని భూసేకరణ పై ఎవరేమన్నారు?
  1.రాజధాని భూసేకరణ దేశం లోనే అది పెద్ద కుంభకోణం -AAP నేత యోగేంద్ర యాదవ్
  2.రాజధాని భూసేకరణ దేశం లోనే అది పెద్ద కుంభకోణం అని మాజీ ఎన్నికల ప్రధానాధికారి లింగ్డో అన్నారు -తెలంగాణా కాంగ్రెస్ MLA అద్దంకి దయాకర్, NTV చర్చలో
  3.రాజధాని పేరుతో రియల్ ఎస్టే ట్ వ్యాపారం చేస్తున్న బాబు -మావోయిస్టు పార్టీ కార్యదర్శి హరిభూషణ్
  4.సొంత కులస్థుల లబ్ది కోసమే రాజధాని-బొత్స, రగువీరారెడ్డి యాదవ్, C రామచంద్రయ్య
  5.బాబు సొంత మనుషుల కోసమే రాజధాని అమరావతి -ఉండవల్లి,Sep 11
  6.తెలంగాణ కారకుడు చంద్రబాబే, పదవులన్నీబాబు కులస్తులకే- శైలజానాథ్
  7.బాబుది అంతా కుల పాలన -శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య
  8.బాబు వచ్చాక కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి
  రాజధానికి 4 లేదా 5 వేల ఎకరాలు చాలు ,ఇప్పటికే 30 వేల సేకరించాక ఇంకా వేల ఎకరాలు ఎందుకు? అభివృద్ధి అంతా రాజధానికే పరిమితం చేయడం సరికాదు ,వికేంద్రీకరణ జరగాలి -లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ చౌదరి,
  9.Vijayawada-Guntur may be Naidu’s choice for capital
  -May 18, 2014-Times.
  [It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
  The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].

  10.బాబు అవినీతి పరుడు ,కులం కోసం పనిచేస్తాడు- London Professor Dalel

  Chandra Babu’s HITEC City Story-London Professor Dalel Benbabaali
  http://www.youtube.com/watch?v=9O6oL8bkzRU ]

 7. Farmers commiting suicides and a CM buying buses and MLA’s for 5 crore each with Public money .
  Shame …….Shame……Shame.

  http://www.ndtv.com/south/5-5-crores-for-bus-chief-minister-says-farmer-in-letter-before-suicide-1220911?pfrom=home-lateststories

  Please post and share this article on Facebook, Twitter etc.
  Please post comments on all National articles.
  Let the world know the true colours of Andhra Hazares.

 8. Veera

  సిఎం పర్యటన ఖర్చు తడిసి మోపెడు
  – 18 సార్లు పర్యటనలో రూ.1.45 కోట్లు ఖర్చు
  – కన్పించని జవాబుదారీతనం
  ప్రజాశక్తి – విశాఖపట్నం ప్రతినిధి
  ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన ఖర్చు తడిసి మోపెడవుతోంది. రాష్ట్ర విభజన తరువాత చెట్టు కింద కూర్చోవడానికి కుర్చీ కూడా లేదని వీలైనప్పుడల్లా మాట్లాడే చంద్రబాబు తన పర్యటన ఖర్చులను మాత్రం తగ్గించుకోవడం లేదు. నిరాడంబరంగా ఉండాలని పాఠాలు బోధించిన ఆయన ఖర్చులకు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. 2014 జూన్‌ నుంచి ఈ ఏడాది మే నెలకు 18 సార్లు పర్యటనకు అక్షరాలా రూ.1.45 కోట్లు ఖర్చయింది. ముఖ్యమంత్రి విశాఖ పర్యటనకు వచ్చి వెళ్లారంటే అధికార యంత్రాంగంలో భయం పట్టుకుంటోంది. సిఎం వచ్చివెళ్లినప్పుడు అయ్యే ఖర్చులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో ఆ ఖర్చులను ఆదాయ వనరులు గల శాఖలకు అప్పగించేస్తున్నారు. ప్రభుత్వ అతిథిగృహాల్లోనే ఉంటూ, సాధారణ భోజనం చేయడానికి ఇష్టపడకపోవడంతో నగరంలో పేరెన్నికగన్న హోటళ్ల నుంచి భోజనం తెప్పించి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. సిఎంతో పాటు వెంట వచ్చిన మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులకు ప్రొటోకాల్‌ ప్రకారం రవాణా ఖర్చులు, హోటళ్లు, భోజనం తదితర సదుపాయాలన్నీ సమకూర్చేసరికి బిల్లు గుండె గుబేల్‌ మన్పిస్తోంది. పర్యటన కాలంలో సిఎంను సంతృప్తిపర్చే ఏర్పాట్లు చేయకపోతే ఎక్కడ చీవాట్లు కాయాల్సివస్తుందోనని హైటెక్‌ స్థాయిలో భారీ ఏర్పా ట్లు చేస్తున్నారు. 2014 జూన్‌లో ఆంధ్రాయూనివర్శిటీ సెనెట్‌ హాల్లో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంతో ప్రారంభమైన ఆయన విశాఖ పర్యటన ఈ ఏడాది మే నాటికి దాదాపు 18 సార్లు సాగింది. ఈ కాలంలో ఆయన పర్యటనకు సుమారు కోటీ 45 లక్షలా 45 వేల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు తెలిసింది.

  http://www.prajasakti.com/Content/1690004

 9. Veera

  పనికిరాని మొగుడు పట్టె మంచం నిండా ఉన్నాడు-ఒక సామెత
  జగన్ ప్రత్యెక హోదా కోసం డిల్లీ లో దీక్ష చేసాడు, ఇప్పుడు గుంటూర్ AC కాలేజ్ మైదానం లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటే అనుమతి ఇవ్వడం లేదు బాబు అండ్ కో (యూనివర్సిటీ లలో మీటింగ్ అంటే అనుమతి ఇవ్వలేదు కూడా)
  గత 10 సం కాంగ్రెస్ హయాములో బాబు ఎన్నో మీటింగ్ లు పెట్టాడు దీక్షలు చేసాడు మరి YS ఏనాడూ అడ్డు చెప్పలేదే?3 నెలల క్రితం బాగా రద్దీగా ఉండే విజయవాడ బెంజి సెంటర్ లో మీటింగ్ పెట్టాడు బాబు
  అవినీతి కేసులకు భయపడి అధికారం లో ఉన్న బాబు ఎలాగు కేంద్రం పై వత్తిడి తేలేదు కనీసం ప్రయత్నిస్తున్న జగన్ ను అడ్డుకోవడం కరెక్టేనా?

 10. Veera

  జాబు వస్తుందని గుడ్డిగా నమ్మి ఓటేశాను-రాజేష్, లక్ష్మునాయుడు
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన ‘యువభేరి’లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
  రాజేష్: నేను మెకానికల్ డిప్లొమా చేశాను. టెంత్లో నాకు 98 శాతం వచ్చింది. కానీ ఈరోజుకూ జాబ్ లేదు. గుడ్డిగా నమ్మి ఓటేశాను. నిరుద్యోగ భృతి అన్నారు.. ఒక్క రూపాయి కూడా లేదు. మా నాన్న చనిపోయారు. మా అమ్మ టిఫిన్ బండి వేసి కుటుంబాన్ని నడిపిస్తోంది. వైఎస్ఆర్ గారు మాకు ఉచితంగా చదువు చెప్పించారు. తమ్ముడు ఇంజనీరింగ్ చదివినా తగిన ఉద్యోగం లేదు. 2 వేలు కాదు.. కనీసం 200 ఇచ్చినా చాలు. మా కోసం పోరాడండి
  లక్ష్మునాయుడు: నేను డిగ్రీ సెకండియర్ అయిపోయింది. చదువుకోడానికి కూడా డబ్బులేక వైన్ షాపుల్లో గుమాస్తాగా పనిచేస్తున్నాం. ఆ షాపులు కూడా మాకు లేకుండా.. ప్రభుత్వమే నడిపిస్తామంటోంది. ఎమ్మెల్యేలు, మంత్రులే తీసుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం మేం ప్రాణత్యాగానికి కూడా సిద్ధం.
  వైఎస్ జగన్: రాజేష్ అడిగిన ప్రశ్నలన్నీ టీవీలలో ఇంతకుముందు మనకు కనిపించినవే. బాబు ఓట్లేయించుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ జాబులను గాలికి వదిలేశాడు. 2వేల నిరుద్యోగ భృతిని అసలు పట్టించుకోవడం లేదు. దీనంతటికీ ఏకైక సమాధానం ప్రత్యేక హోదా. అది వస్తే మనకు నో వేకెన్సీ బోర్డు కనిపించదు. మనమే కంపెనీలను ఎంచుకోవచ్చు.

 11. Veera

  స్మార్ట్ సిటీ లపై ప్రజల్లో మోజు తగ్గకముందే ఎన్నికలకు వెళ్ళాలి-స్మార్ట్ బ్ర‌ద‌ర్స్ ప్లాన్
  స్మార్ట్ సిటీ లంటే ఏదో కాదు ప్రజల పై పన్నులు వేసి ఆ డబ్బుతో అభివృద్ధి చేస్తాం,
  ఒక్కో స్మార్ట్ సిటీకి 200 కోట్లు ఇస్తాం-వెంకయ్య నాయుడు
  [స్మార్ట్ గా ఓట్ల వేట‌కు సిద్ద‌మైన నాయుడు బ్ర‌ద‌ర్స్..!
  ఏపీలో మ‌ళ్లీ ఓట్ల సంద‌డి మొద‌లుకాబోతోంది. ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం రాబోతోంది. అన్ని పార్టీలు అప్పుడే అటువైపు దృష్టి సారించాయి. ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. గ‌త ఏడాది జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించిన టీడీపీ, బీజేపీ కూట‌మి అదే ఊపును కొన‌సాగించాల‌ని భావిస్తోంది. అయితే స్వ‌ల్ప ఓట్ల‌తో చ‌తికిల‌ప‌డ్డ వైఎస్సార్సీపీ ఏదో విధంగా స‌త్తాచాటాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. దాంతో ఈ ఎన్నిక‌లు కూడా మంచి ర‌స‌వత్త‌రంగా మారే అవ‌కాశం ఉంది.

  ముఖ్యంగా మినీ స‌మ‌రంగా భావించ‌ద‌గ్గ ఈ ఎన్నిక‌ల్లో ప‌లు న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రిగ‌బోతున్నాయి. అందులో ఏపీకి వాణిజ్య రాజ‌ధానిగా చెప్పుకోద‌గిన విశాఖ‌, ఆధ్యాత్మిక రాజ‌ధాని తిరుప‌తి, మ‌రో సాగ‌రతీర న‌గ‌రం కాకినాడ వంటి కీల‌క న‌గ‌రాలున్నాయి. దాంతో ఈ న‌గ‌రాల‌పై ఇప్ప‌టికే పార్టీల‌న్నీ దృష్టి పెట్టాయి. అందులో భాగంగానే కేంధ్ర ప‌ట్ట‌ణాభివృధ్ది శాఖ మంత్రి వెంక‌య్య‌నాయుడు ఈ మూడు న‌గ‌రాల‌ను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చ‌డం జ‌రిగింది. చంద్ర‌బాబుతో సాన్నిహిత్యాన్ని మ‌రింత బ‌ల‌ప‌రుచుకోవాల‌ని భావిస్తున్న వెంక‌య్య స్మార్ట్ సిటీల పేరుతో ప‌క్కా ఎన్నిక‌ల వ్యూహానికి తెర‌లేపారు. స్మార్ట్ సిటీల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో క్రేజ్ ఉండ‌గానే ఓట్ల వేట సాగించాల‌ని నాయుడు బ్ర‌ద‌ర్స్ ప్లాన్ వేసిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే సాగుతున్న ప్ర‌చారం హ‌డావిడితో ప‌నికానిచ్చేయాల‌న్న‌ది అస‌లు వ్యూహం. దీపం ఉండ‌గానే ఇల్లు చక్క‌దిద్దుకోక‌పోతే స్మార్ట్ సిటీల అస‌లు భాగోతం జ‌నానికి అర్థ‌మ‌యిన త‌ర్వాత మ‌ళ్లీ కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉన్నందును త్వ‌ర‌గా అక్క‌డ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స‌ర్కారు భావిస్తోంది.

  ముఖ్యంగా స్మార్ట్ సిటీల అస‌లు ఉద్దేశాన్ని ఇటీవ‌లే హైద‌రాబాద్ లో జ‌రిగిన స‌ద‌స్సులో వెంకయ్య నాయుడు స్ప‌ష్టం చేశారు. పీపీపీ ప‌ద్ధ‌తిలో ప్రాజెక్ట్ లు చేప‌ట్టాల‌ని సూచించారు. అంతేగాకుండా ప‌న్నుల‌ను స‌ర‌ళ‌త‌రం చేయాల‌ని ఆదేశించారు. పన్నుల విధానంలో మార్పులు కీల‌క‌మ‌ని చెప్పారు. అంటే దాదాపుగా ప‌న్నులు పెంచాల్సిందేన‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. దాని అర్థం స్మార్ట్ పేరుతో ప్ర‌జ‌ల‌కు పెనుభారం త‌ప్ప‌ద‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పేశారు. దాని ప్ర‌భావంతో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌కు దారితీసే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ముందుగా మేల్కోవ‌డం మంచిద‌న్న‌ది వారి అంచ‌నా. దానికి తోడు స్మార్ట్ సిటీ ప్రణాళిక‌ల అమ‌లులో పాల‌క‌వ‌ర్గాల పాత్ర కీల‌కం. దాంతో ఎన్నిక‌యిన పాల‌క‌మండ‌లి లేకుండా అధికారుల‌తో స్మార్ట్ సిటీల అభివృద్ది నిధులు విడుద‌ల‌య్యే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నా..వీల‌యినంత త్వ‌ర‌గా ఎన్నిక‌లు జ‌ర‌పాల్సి ఉంటుంది. వాటికి తోడు ఇటీవ‌లే కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిల‌క‌పై హైకోర్ట్ కూడా సీరియ‌స్ అయ్యింది. దాంతో ఇక ఎన్నిక‌లు అనివార్యంగా మారుతున్నాయి.

  ఈ ప‌రిస్థితుల్లో ఈ ఏడాది చివ‌రిలోగా కీల‌క‌మైన కార్పోరేష‌న్ల ఎన్నిక‌ల‌కు రంగం సిద్దం చేసే దిశ‌లో ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోంది. అధికార పార్టీగా ఉన్న అనుకూల‌త‌ను సొమ్ము చేసుకోవాల‌ని ప‌థ‌క ర‌చ‌న చేస్తోంది. టీడీపీ, బీజేపీల కూట‌మిగానే ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ద‌మ‌య్యింది. జ‌న‌సేనానికి క‌లిసి వ‌స్తాడా లేదా అన్న‌దానితో ఫ‌లితాల‌పై ప్ర‌భావం ఉంటుంది. ఈ వ్యూహాన్ని ఎదుర్కోవ‌డానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కూడా స‌న్న‌ద్ద‌మ‌వుతోంది. ఇప్ప‌టికే తిరుప‌తి, విశాఖ‌లో నిర్వ‌హించిన స‌ద‌స్సులు స‌క్సెస్ కావ‌డంతో కొత్త ఆశ‌ల‌తో సాగుతోంది. మ‌రి కాంగ్రెస్ పూర్తిగా ఢీలా ప‌డిపోయి ఉన్న ద‌శ‌లో ఆ పార్టీ ఎంత‌మేర‌కు ఉనికి చాటుకుంటుంద‌న్న‌ది చూడాలి.

  http://updateap.com/andhra-pradesh-government-preparing-for-corporaation-elections/ ]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s