సీమలో సాగు నీటి కోసం ఆందోళన– 20 లక్షల ఎకరాలు బీడు పడే ప్రమాదం

సీమలో సాగు నీటి కోసం ఆందోళన– 20 లక్షల ఎకరాలు బీడు పడే ప్రమాదం
-ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలవారు.పార్టీలవారు బాబు తీరును తప్పుపడుతున్నారు
శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 854 అడుగుల ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా సీమ ప్రాంతంలో దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుంతుంది (తెలుగుగంగ – 6 లక్షల ఎకరాలు, గాలేరు- నగరి -4 లక్షల ఎకరాలు, శ్రీశైలం కుడికాలువ (ఎస్‌ఆర్‌బిసి) 1.90 లక్షల ఎకరాలు, కర్నూలు- కడప కాలువ – 2.70 లక్షల ఎకరాలు, హంద్రీ- నీవా ప్రాజెక్టుతో నాలుగు జిల్లాల పరిధిలో 4 లక్షల ఎకరాల సాగవుతాయి.)

శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 854 అడుగులకు చేరకముందే 840 అడుగులకు రాగానే నాగార్జునసాగర్‌ డ్యాం ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్ళు విడుదల చేస్తున్నాడు బాబు. AP , T రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ ఉత్పత్తికి పాల్పడుతూ 17వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నాయి.

http://www.prajasakti.com/Content/1690815

రాజధానీ వ్యాపారమే!
-ఒప్పందాల్లోని అంశాలన్నీ గోప్యం
-విస్మరణకు గురైన పట్టణాభివృద్ధిశాఖ
-క్రిడా పరిధి పెంపు ఎవరి కోసమో..?
తెలుగుదేశంలో కీలకపాత్ర పోషిస్తున్న వ్యాపారవేత్తలకు విదేశీ పర్యటనల్లో ప్రధాన భూమిక కల్పిస్తున్నారు. ఎక్కడ ఒప్పందాలు చేసుకోవాలో ముందుగానే వారు నిర్ణయించిన తర్వాత ముఖ్యమంత్రి చట్టపరమైన ప్రక్రియ నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి

ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ వ్యాపార ధోరణులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సింగపూర్‌లో సిఎం బృందం ఇటీవలి పర్యటనలో పట్టణాభివృద్ధిశాఖ అధికారులు లేరు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కేంద్రమంత్రి, ఇద్దరు రాష్ట్ర మంత్రులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే సిఆర్‌డిఎ పరిధిని పెంచారనే వార్తలూ వస్తున్నాయి. రెవెన్యూ శాఖను పక్కన పెడుతునట్టు, మున్సిపల్‌శాఖలో అధికారులను ఒక్కొక్కరిని మార్పు చేస్తున్నట్టు పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఒప్పందాల్లోనూ సంబంధిత అధికారులకు సమాచారం ఉండటం లేదు. ఇటీవలి సింగపూర్‌ పర్యటనలో పట్టణాభివృద్దిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వలవన్‌కు స్థానం కల్పించలేదు. రాజధాని ప్రణాళికపై సింగపూర్‌లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నా, ఆ శాఖ ముఖ్య అధికారే పర్యటన బృందంలో లేకపోవడం చర్చనీయాంశమైంది. రాజధానికి సంబంధించి చేసుకుంటున్న ఒప్పందాల్లోని వివరాలేమీ బయటకు రానీయడం లేదు. రాజధాని విషయంలో ఇంతవరకు ఆరు ఒప్పందాలు చేసుకున్నా వాటిలోని అంశాలేమిటనేది గోప్యంగా ఉంచుతున్నారు.
రెవెన్యూశాఖ ప్రాధాన్యం తగ్గింపు
రాజధాని నిర్మాణ వ్యవహారాల్లో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి పాత్ర ఇంతవరకు ఎక్కడా కనిపించడమే లేదు. భూ సమీకరణ, సేకరణ ప్రకటనలతో ఆశాఖకు నేరుగా సంబంధం ఉన్నా, అవసరమైన పనిని కలెక్టర్‌తో నేరుగా చేయించేస్తుండటం గమనార్హం. పట్టణాభివృద్ధిశాఖలో ముగ్గురు ప్రిన్సిపల్‌ సెక్రటరీలను మార్చేశారు. ఆశాఖ మంత్రి నారాయణకు ఇష్టం లేకపోవడం వల్లే ఈ మార్పులు చోటు చేసుకున్నాయంటున్నారు. తెలుగుదేశంలో కీలకపాత్ర పోషిస్తున్న వ్యాపారవేత్తలకు విదేశీ పర్యటనల్లో ప్రధాన భూమిక కల్పిస్తున్నారు. ఎక్కడ ఒప్పందాలు చేసుకోవాలో ముందుగానే వారు నిర్ణయించిన తర్వాత ముఖ్యమంత్రి చట్టపరమైన ప్రక్రియ నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. క్రిడా పరిధిని పెంచడం ద్వారా కృష్ణా జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఓ మంత్రికి పెద్దఎత్తున లబ్ధి కలిగించాలనే ఆలోచన ఉందని ప్రచారం సాగుతోంది. వివరణ ఏమీ లేకుండానే క్రిడా పరిధి విస్తరణకు ఉత్తర్వులు జారీ కావడానికి కారణమిదేనంటున్నారు.
వృద్ధి పేరిట ప్రచారం

జిఎస్‌డిపిలో రెండంకెల వృద్ధి లక్ష్యమంటూ మూడు నెలల సమీక్షతోనే భుజాలు చరుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ గణాంకాల్లోనూ ప్రారిశ్రామిక వృద్ధి రేటు తక్కువగా ఉందనే ప్రణాళిక శాఖ అంచనాలకు, దేశంలో పెట్టుబడులకు అవకాశం ఉన్న రాష్ట్రాల్లో ఎపికి ద్వితీయ స్థానాన్ని ప్రపంచ బ్యాంకే ఇవ్వడానికి పొంతన లేదనే చర్చా నడుస్తోంది. ఏడాది ముగిశాకగాని జిఎస్‌డిపి అసలు రూపం బయటకు రాదని కొందరు వ్యాఖ్యాని స్తున్నారు. ఒక పక్క అప్పులు, మరో వంక వృద్ధి సాధిస్తున్నామనే లెక్కలు సామాన్యులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. మితిమీరిన ప్రచారం వల్ల కలల ప్రజారాజధాని కాకుండా, కేవలం వ్యాపారమే కాగలదని పలువురు భావిస్తున్నారు

http://www.prajasakti.com/Content/1691123

8 Comments

Filed under Uncategorized

8 responses to “సీమలో సాగు నీటి కోసం ఆందోళన– 20 లక్షల ఎకరాలు బీడు పడే ప్రమాదం

 1. Sridhar Gondhi

  YSJ should be touring various universities & dist headquarters extensively to drive the understanding & benefits of special status, i dont think having a meeting for every 2 weeks will result in a mass movement.

 2. YS Fan

  ఏ హోదా లేనివారు ప్రత్యేక హోదా అడుగుతారు – వెంకయ్య
  ప్రజల ద్వారా డైరెక్ట్ గా ఎలెక్ట్ కాలేని వారు రాజ్యసభ ద్వారా మంత్రులు అవుతునారు – సామాన్యుడు

 3. PSK

  We are fighting against CUNNING CBN….
  CBN is like kukka toka vankara….He will never ever change…15 months is direct example….inka direct ga kaavaalante pattiseema pump set is real TRUE nature of CBN….

  It’s simple equation for us…
  Ramoji need not support Jagan, but he should not damage Jagan with banner headings….A simple news can be damaging a whole lot when it is published as banner heading….He will stop that from this meeting hopefully…He can still project CBN as he wishes…We don’t care….
  As a whole….Ramoji is not that bad compared to ABN and TV9…..

  • Sridhar Gondhi

   I dont agree that Ramoji is not that bad as ABN/TV9, last general elections if you check the editorials starting from last week of April 2014 till May elections, we will understand who did the maximum damage, ofcourse now both parties have realized that their business interests are at loss in the whole schema of things.

   I’m sure this meeting has some link to court ruling today & YCP taking a decision of postponing the agitation , all this are not just coincidence but well orchestrated events.

   Overall its more or less coming out to be true that Ramoji doesn’t want to fight for too long due to his ill health and YSJ getting in right age and YSJ’s best is yet to come. Ramoji has more to loose than ABN/TV9 by being an enemy of YSJ and he has his ground reports clear on knowing that YSJ turn of govt is not too far.

   • YS Fan

    Ramoji’s son is non-political person. He may not take sides like his dad. so down the line eenadu might play the neutral angle.

    • Vijay

     Dramoji is the reason for the current state of Telugu people. He is Sakuni and pored so nuch poison into the society.

     • Vijay

      I am not against jagan meeting dramoji, but be careful it is a black hole. aware that whom we r dealing with. Dramoji pored so much hatred into Telugu and posed as Saint.

 4. Veera

  జగన్‌కు రామోజీ ఆహ్వానం వెనుక…
  http://teluguglobal.com/behind-the-meeting-of-jagan-and-ramoji/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s