బాబొచ్చే.. జాబు రాలే..

ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి లలోనమోదైన నిరుద్యోగులు 8.29 లక్షలు
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు:1.5 లక్షలు
ఉపాధ్యాయ ఖాళీలు:10 వేలు
బాబు CM అయ్యాక ఉద్యోగాలు ఇవ్వక పోగా తీసివేసిన ఉద్యోగాలు:35 వేలు
విగాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చిన తరువాత టిడిపి ప్రభుత్వం సుమారు 35 వేల ఉద్యోగాలను తొలగించింది.
వైద్యారోగ్య శాఖలో 1500 మంది కాంట్రాక్టు కార్మికులనూ, ఉపాధి పథకంలో 2 వేల మంది ఫీల్డు అసిస్టెంట్లనూ, గృహ నిర్మాణ శాఖలో 7వేల మంది వర్క్‌ ఇన్స్‌పెక్టర్లనూ తొలగించారు.టిడిపి ప్రభుత్వం పీఠం ఎక్కగానే 15 వేల మంది ఆదర్శరైతులను తొలగించారు.
ఇటీవలే హాస్టళ్లలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు 300 మందిని తొలగించారు
http://www.prajasakti.com/Content/1695691

అంగ‌న్ వాడీ వ‌ర్కర్ పోస్టుకి రెండు ల‌క్ష‌లు, హెల్ప‌ర్ పోస్టుకి ల‌క్ష మాత్రమే
-అధికారిక స‌ర్వేలో వెల్ల‌డ‌యిన విష‌యాలు

వాటిని కూడా వ‌ద‌ల‌కుండా అమ్మ‌కానికి పెట్టారు..!
ఏపీలో అమ్మ‌కానికి ఏదీ అతీతం కాద‌న్న చందంగా త‌యార‌య్యింది. అన్నింటినీ కొనుగోలు చేయ‌డానికి అల‌వాటు ప‌డ్డ జ‌నాలు ఆఖ‌రికి ప్ర‌తీదీ అమ్మాకానికే అనుకుంటున్నారు. అందుకే ఆఖ‌రికి అంగ‌న్ వాడీ పోస్టులను కూడా సంత‌లో స‌రుకుల్లా అమ్మ‌కాలకు పెడుతున్నా కిమ్మ‌న‌కుండా కొనుక్కోవ‌డానికి ఎగ‌బ‌డుతున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలో అంగ‌న్ వాడీ నియామాకాల‌కు తెర‌లేసింది. దాంతో అంతా అటువైపు క‌న్నేశారు. అధికార పార్టీ నేత‌ల‌కు ఇదో పెద్ద ఆదాయ‌వ‌న‌రుగా మారిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌నుకుంటున్న నేత‌లంతా అంగ‌న్ వాడీ పోస్టుల‌ను అమ్మ‌కానికి పెట్టేశారు. పోస్టుకో రేటు ఫిక్స్ చేసి కావాల్సిన వాళ్లు రావ‌చ్చు అన్న‌ట్టుగా ఓపెన్ మార్కెట్ మాదిరి మార్చేశారు.

గ‌తంలో కూడా అంగ‌న్ వాడీల నియామాకాల‌లో కొన్ని అక్ర‌మాలు జ‌రిగేవి. అయితే అవి అక్క‌డ‌క్క‌డా జ‌రిగేవి. కానీ ఇప్పుడు స‌క్ర‌మమం అన్న మాటే మ‌రిచ‌పోయి అన్నీ అక్ర‌మాల‌కు అవ‌కాశంగా మార్చేశారు. ఈవిష‌యంలో ఏకంగా అధికార‌పార్టీ నిర్వ‌హించిన స‌ర్వేలో కూడా స్ప‌ష్ట‌మ‌య్యింది. ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై టీడీపీ కాల్ సెంటర్ నుంచి చేప‌ట్టిన‌ ప్రజాభిప్రాయ సేకరణలో అది రుజువ‌య్యింది. గ‌డిచిన ఆదివారం 83339 99999 ఫోన్ నంబర్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలకు ఫోన్ చేసి సర్వే నిర్వ‌హించారు. కురుపాం, ఎస్ కోట, పార్వతీపురం నియోజకవర్గాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు అందాయి. కురుపాంలో భర్త ఉన్న మహిళకు వితంతు కోటాలో ఉద్యోగం ఇచ్చినట్టు వెల్లడైంది. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీపై కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనూ అంగన్వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, పలువురు ఎమ్మెల్యేలపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం జిల్లాలో ప్రజాప్రతినిధులు లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఇవ‌న్నీ అధికారిక స‌ర్వేలో వెల్ల‌డ‌యిన విష‌యాలు. కొన్ని ప్రాంతాల స‌ర్వేకు సంబంధించిన వాస్త‌వాలు. కానీ అస‌లు నిజాలు అంత‌క‌న్నా చేదుగా ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే రీతిలో సాగుతోంది. అంగ‌న్ వాడీ వ‌ర్కర్ పోస్టుకి రెండు ల‌క్ష‌లు, హెల్ప‌ర్ పోస్టుకి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కూ అధికారికంగానే వ‌సూలు చేస్తున్నారు. కొంద‌రు ఎమ్మెల్యేలు బ‌రితెగించి ఈ వ్య‌వ‌హారం సాగిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌తిప‌క్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట కూడా జ‌న్మ‌భూమి క‌మిటీలు, ఇన్చార్జ్ మంత్రుల పేరుతోనూ అధికార‌పార్టీ నేత‌లే ఇలాంటి వ్య‌వ‌హారాలు సాగిస్తున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దానికితోడు ఇలాంటి ప‌రిస్థితిని ఉప‌యోగించుకుని కొంద‌రు అడ్డందిడ్డంగా వ‌సూళ్లు సాగిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అమాయ‌కులైన అశావాహుల‌ను మ‌భ్య‌పెట్టి ఇష్టారాజ్యంగా దండుకుంటున్న‌ట్టు చెబుతున్నారు.
http://updateap.com/anganwadi-poosts-sales-in-market/

7 Comments

Filed under Uncategorized

7 responses to “బాబొచ్చే.. జాబు రాలే..

 1. విగ్గు: బావా గెలిస్తే జాబులు ఇస్తామన్నాం మరి ఇవ్వలేదేం?
  నిప్పు: పిచ్చి బామ్మర్దీ జాబు రావాలంటే బాబు రావాలి అన్నాం కానీ బాబొస్తే జాబొస్తుంది అనలేదు. అయినా నాకు బొద్దు బాబుకు నీకు మనోల్లందరికీ జాబులు వచ్చాయి మరిచిపోయావా?
  విగ్గు: నువ్వు కేక బావా

 2. Veera

  కేంద్రం ఇప్పటికి రూ.65 వేల కోట్ల విలువైన ప్రయోజ‌నాలు APకి అందించింది , అయితే అందులో 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసారు -BJP MLC సోము వీర్రాజు
  మీరు మరీనూ వీర్రాజు గారూ, హుండీబాబా గారిని అలా అడిగితె ఏమి లాభం, పోయి అయన గారి హుండీలో వెతకండి!జాగ్రత్త అండీ అసలే అయన గోరు నిప్పు అట, కాలిపోగలరు సుమీ!

 3. Veera

  దేశంలోనే డెంగ్యూ జ్వరాల్లో బాబు జిల్లా చితూరు ఫస్ట్ (1,059 కేసులు)
  సింగపూర్ చేస్తాం,జపాన్ చేస్తాం,షాంఘై చేస్తాం -చిలక జోస్యం
  సూడాన్, ఇథియోపియా చేయకుంటే చాలు మహాప్రభో-బ్రహ్మి

  • YS Fan

   జర్మన్ ఛాన్సలర్(ఏంజెలా మెర్కెల్) వస్తే మోడీ గారు దగ్గరుండి కాంగ్రెస్ పరిపాలనలోని కర్నాటకాకు తీసుకెళ్ళారు.పక్క రాష్ట్రంలో ఉన్న మిత్రపక్ష మహామేధావికి కనీసం ఆహ్వానమైన అందిందా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s