ఏపీలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోరెందుకు..!?

ఇది ఏ ఒక్క‌రి అనుమాన‌మో కాదు. మీడియాను చూస్తూ, నేత‌ల మాట‌లు వింటూ గ‌డుపుతున్న ప్ర‌తీ ఒక్క‌రికీ క‌లిగే అనుమాన‌మే. ప్ర‌స్తుతం సాగుతున్న ప్ర‌చారం అలా క‌నిపిస్తోంది. ఓవైపు ఆత్మ‌హ‌త్య‌ల‌పై అన్ని చోట్లా ఆందోళ‌న పెరుగుతోంది. ప‌లువురు నిర‌స‌న‌లు కూడా వ్య‌క్తం చేస్తున్నారు. మీడియా కూడా దృష్టిసారించింది. అయితే అది పాక్షికంగా ఉండ‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌గా క‌నిపిస్తోంది. ఏకాక్షుల మాదిరి రాజ‌కీయ‌, మీడియా స‌హా వ్య‌వ‌స్థ మారుతుండ‌డ‌మే దీనికి కార‌ణంగా క‌నిపిస్తోంది. తెలంగాణాలో మాత్ర‌మే రైతు ఆత్మ‌హ‌త్య‌లు సాగుతున్న‌ట్టు ఏపీలో రాజ‌ధాని రంగుల క‌ల న‌డుస్తున్న‌ట్టు జ‌నాల‌ను మ‌భ్య‌పెట్టే పనిలో ఈ త‌ర‌గతుల‌న్నీ నిమ‌గ్నంకావ‌డం వారి నైజానికి అద్దంప‌డుతోంది.

నిజానికి ఏపీలో ఆత్మ‌హ‌త్య‌ల ప‌రంప‌ర పెరుగుతోంది. తెలంగాణాలో కేవ‌లం రైతు ఆత్మ‌హ‌త్య‌లు మాత్ర‌మే సాగుతుండ‌గా ఏపీలో విద్యార్థి, రైతు, ప్ర‌త్యేక హోదా ఆందోళ‌నకారులు వివిధ ర‌కాల శ్రేణుల ఆత్మ‌హ‌త్య‌లు సాగుతున్నాయి. అయినా అవి స‌మాజంలో చ‌ర్చ‌నీయాంశాలుగా మార‌కుండా చేయ‌డంలో పాల‌కులు ప‌లు జాగ్ర‌త్త‌లు పాటిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు మీడియా వంత‌పాడుతున్న‌ట్టుగా అగుపిస్తోంది.
ఏపీలో రైతు ఆత్మ‌హ‌త్య‌ల లెక్క‌లు తీస్తే గ‌డిచిన నెల‌రోజుల్లోనే ఒక్క ప్ర‌కాశం జిల్లాలోనే 19 మంది బ‌ల‌వ‌న్మ‌రణాల‌కు పాల్ప‌డ్డారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌కృతమ్మ ప్ర‌సాదంలా క‌నిపించే ప‌చ్చ‌ని ప‌శ్చిమ‌గోదావ‌రిలో కూడా ప‌ది మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో పొగాకు రైతుల‌తో పాటు అన్న‌దాత‌లు కూడా ఉండ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. ఆ జిల్లాలోని య‌ర్న‌గూడెంలో న‌ల‌భై ఎక‌రాల రైతు, టీడీపీ సానుభూతిప‌రుడు వెంక‌టేశ్వ‌ర రావు నేరుగా సీఎంకి లేఖ‌రాసి పురుగుల‌మందు తాగిన ఘ‌ట‌న అంద‌రినీ క‌ల‌వ‌ర‌ప‌రిచింది. అయినా ఏలిక‌ల‌కు క‌నీసం చీమ‌కుట్టిన‌ట్టు కూడా క‌నిపించ‌లేదు.

రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉన్న ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతూ హైకోర్ట్ కూడా చీవాట్లు పెట్టింది. అయినా స్పంద‌న లేదు. నిన్న కూడా సీఎం క్యాంప్ ఆఫీసు ఉన్న జిల్లాలో ఓ క‌ర్ష‌కుడు, ఆ ప‌క్క‌నే ఉన్న గోదావ‌రి జిల్లాలో మ‌రో రైతు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. త‌మ‌కు పూర్తిస్థాయి స‌మ‌గ్ర‌నివేదిక ఇవ్వాల‌న్న హైకోర్ట్ ఆదేశం కూడా చెవికెక్కిన‌ట్టు లేదు. తూతుమంత్ర‌పు చ‌ర్య‌ల‌తో స‌రిపెట్టుకునే ధోర‌ణే సాగుతోంది. రాజ‌ధాని ప్ర‌చార హోరులో పాపం అమాయ‌కులు బ‌ల‌వుతున్న వాస్త‌వాన్ని అంగీక‌రించే ఓపిక లేన‌ట్టుగా క‌నిపిస్తోంది. తెలంగాణాలో రైతు యాత్ర‌ల‌కు సిద్ధ‌మ‌య్యే పార్టీ ఏపీలో అధికారంలో ఉంటుంది. కానీ ఇక్క‌డ ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోవ‌డానికి వెన‌క‌డుగువేస్తోంది.

మ‌రోవైపు విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు మ‌రింత దయ‌నీయ‌త‌కు అద్దంప‌డుతున్నాయి. నిత్యం ఏదో చోట ప‌సిమొగ్గ‌లు నేల‌రాతున్నాయి. అది కూడా ఏకంగా మంత్రిగారి కాలేజీలోనే అత్య‌ధికులు ఇలా ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి. అయినా ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌తో అక్క‌డ‌క్క‌డా నామ‌మాత్ర‌పు విచారించ‌ద‌గ్గ విచార‌ణ‌లు త‌ప్ప స‌మ‌గ్ర చ‌ర్య‌లు క‌నిపించ‌వు. నారాయ‌ణ కాలేజీలో గ‌డిచిన కొద్ది మాసాల్లేనే రెండుప‌దులు దాటిన పిల్ల‌ల చావుల‌కు కార‌ణ‌మెవ‌రో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. వ‌రుస మ‌ర‌ణాలు కావు అవి నారాయ‌ణ సంస్థల హ‌త్య‌లే అంటున్న విద్యార్థుల గొంతుకు స‌మాధానం చెప్పే నాథుడే కనిపించ‌డం లేదు. మ‌రోవైపు ప్ర‌త్యేక హోదా కోసం కూడా మునిస్వామి మొద‌లుకుని ప్రాణ‌త్యాగాల‌కు తెగిస్తున్న వారి సంఖ్య పెరిగుతూనే ఉంది. ప్ర‌కాశం జిల్లాలో ఓ విద్యార్థి అలాంటి ప్ర‌య‌త్న‌మే చేసిన ఘ‌ట‌న తాజాగా వెలుగులోకి రావ‌డం జ‌నాల అభిప్రాయానికి అద్దంప‌డుతోంది. అయినా అధికారంలో ఉన్న‌వారికి ప్ర‌జ‌ల అస‌లు స‌మ‌స్య‌లు కంటే త‌మ‌కు ప్ర‌చారం ల‌భించే అంశాలే ప్రధానంగా మారిపోవ‌డం పెద్ద చిత్రంగా క‌నిపించ‌డం లేదు.

రైతుల గురించి, యువ‌త గురించి ఓట్ల‌ప్పుడు ఊక‌దంపుడు ఊప‌న్యాసాలు ఇచ్చే పెద్ద మ‌నుషులు ఇప్పుడు వారి ప్రాణాలు గాలిలో క‌లిసిపోతున్నా గానీ త‌మ గాలిమేడ‌ల గురించే ఆలోచించ‌డం సిగ్గుగా అనిపిస్తోంది. ఎప్ప‌టికి మారేనో..వీళ్ల‌ తీరు

http://updateap.com/ap-farmers-suicides-why-not-taking-as-issue/

13 Comments

Filed under Uncategorized

13 responses to “ఏపీలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోరెందుకు..!?

  1. Veera

    తెలంగాణ ది బెస్ట్
    బిజినెస్ లీడర్ అవార్డుకు ఎంపిక
    హైదరాబాద్, అక్టోబర్ 15: పెట్టుబడులకు విస్తృతంగా అవకాశాలున్న రాష్ట్రాల్లో తెలంగాణను అత్యుత్తమైన రాష్ట్రంగా ది ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ (ఐబిఎల్‌ఎ) ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఆశావహ రాష్ట్రాల ఎంపిక కోసం నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా జ్యూరీ సభ్యులు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసినట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు సిఎన్‌బిసి-టివి 18 మేనేజింగ్ ఎడిటర్ శిరీన్ బాన్ లేఖ ద్వారా తెలియజేశారు. ఈ అవార్డును అందుకోవడానికి త్వరలో ముంబయిలో నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కెసిఆర్‌ను ఐబిఎల్‌ఎ ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి చేపడుతున్న చర్యలు, ప్రోత్సహకాలు, ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని జ్యూరీ అభినందించినట్టు లేఖలో పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఏవిధంగా అత్యుత్తమైందో త్వరలో తమ చానల్‌లో వరుస కథనాలను ప్రసారం చేయనున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
    http://andhrabhoomi.net/content/business-leaders

  2. It is not Peoples capital ….It is Real estate venture – JAGAN

    http://www.sakshi.com/news/top-news/do-not-invite-me-to-foundation-cermony-of-capital-city-ys-jagan-writes-open-letter-to-chandra-babu-284105?pfrom=home-top-story

    Kamma ti jeevithalu …….Viluvalu leni brathukulu
    Avaru ee ……….. Gajji / Gaja dongalu ?

  3. Veera

    ‘పట్టిసీమ’కు మళ్లీ లీక్‌, నిష్ప్రయోజనమైన జాయింట్‌ రిపేర్లు అక్విడెక్టుకు పొంచి ఉన్న ముప్పు?
    ప్రజాశక్తి ాఏలూరు ప్రతినిధి
    పట్టిసీమ పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. యుద్ధప్రాతిపదికన నిర్వహించిన అక్విడెక్టు జాయింట్‌ రిపేర్‌ పనులు నిష్ప్రయోజనమయ్యాయి. గురువారం మళ్లీ లీకులు ఏర్పడటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మాణంలో నాణ్యత లోపించిన అక్విడెక్టుకు ముప్పు పొంచి ఉందని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తుండగా.. లీకులు సహజేమనని, వాటిని సత్వరమే సరిచేస్తామని.. ఏ ఇబ్బందీ రాదని అధికారులు కొట్టిపారేస్తున్నారు.
    తొలిపంపు ద్వారా నీటిని విడుదల చేసి 24 గంటలు గడవకుండానే సెప్టెంబర్‌ 19న పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మించిన ఆక్విడెక్టు జాయింట్‌ భాగం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దాదాపు రెండురోజులపాటు పట్టిసీమ మొదటి పంపు, తాడిపూడి ద్వారా విడుదల చేసిన నీరంతా తమ్మిలేరులోకి వృథాగా పోయింది. దీంతో నీటి విడుదలను నిలిపివేశారు. అపట్లో సంఘటనా స్థలాన్ని రాజకీయపక్షాలు సందర్శించి పట్టిసీమ పనుల నాణ్యతపై విమర్శలు గుప్పించాయి. అప్పట్లో ప్లాన్‌ ‘బి’ ప్రకారం పనులు చేపట్టడం వల్లే ఆక్విడెక్టు కూలినట్లు అధికారులు అంతర్గత చర్చల్లో చెప్పుకొచ్చారు. ఈసారి అటువంటి పరిస్థితి ఉండదని తెలిపారు.
    చైనా మోటార్‌తో పునరుద్ధరించినా…
    25 రోజులపాటు రాత్రీపగలు పనిచేసి ఆక్విడెక్టు జాయింట్‌ను పునరుద్ధరించారు. నాలుగు రోజుల క్రితం చైనా నుంచి తెచ్చిన మోటారు బిగింపు పూర్తిచేసి, తొలి పంపు నుంచి మళ్లీ 350 క్యూసెక్కుల నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు. విడుదలైన నీరంతా జానంపేట వద్దకు చేరుకుంది. గురువారం ఆక్విడెక్టు పైనుంచి కృష్ణాకు నీటి మళ్లింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. 40 మీటర్లు పొడవున ఉన్న ఆక్విడెక్టు నుంచి మూడు చోట్ల నీరు లీకవుతోంది. దీంతో మరోసారి ఆక్విడెక్టు కూలడం ఖాయమనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్విడెక్టుపై ప్రస్తుతం 300 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. గురువారం సాయంత్రానికి నీటి ప్రవాహం 700 క్యూసెక్కులకు పెరిగిందని పోలవరం కుడికాలువ ఎస్‌ఇ శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. లీకులు సాధారణంగా ఉంటాయని, వాటిని సరిచేస్తామని ఆయన చెప్పారు. 2,500 క్యూసెక్కుల నీరు ప్రవహించినా ఆక్విడెక్టుకు ఎటువంటి ఇబ్బందీ లేదని అధికారులు చెబుతున్నారు. పనుల్లో నాణ్యతా లోపాల వల్ల గతంలో ఆక్విడెక్టు జాయింట్‌ కూలింది. మళ్లీ నీరు లీకవడంతో ఆక్విడెక్టు నిర్మాణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టిసీమ పనుల నాణ్యతపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో రెండోసారి ఆక్విడెక్టు నుంచి నీరు లీకవడం అంతటా చర్చనీయాంశమైంది.
    http://www.prajasakti.com/BreakingNews/1700189

  4. Veera

    బాబు:ఈ రాష్ట్రానికి పెద్ద కూలీను నేను
    బ్రహ్మి:కూలీలు ప్రత్యెక విమానాల్లో తిరిగే APకి ప్రత్యెక హోదా, సహాయం అవసరమా అని మోడీ అనుకొన్నట్టున్నాడు
    [బాబు విమాన ప్రయాణాలకు చేసిన ఖర్చు అమెరికా అధ్యక్షులు కూడా చేయరేమో?
    హుద్ హుద్ నుంచి జనం కోలుకుంటుంటే సంబరాలు చేస్తారా?
    చంద్రబాబుకు అమరావతి తప్ప…ఏమీ కనిపించడం లేదు
    గతంలో అన్నింటిని హైదరాబాద్ లోనే పెట్టి…మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేసారు.
    -లోక్ సత్తా JP చౌదరి ]

  5. rajesh2442

    I cant understand who is giving sugessions to ysj,if dont want to come he should have given proper reason.total wrong decision.

    • PSK

      Absolutely RIGHT decision…Mark my word…

      • rajesh2442

        PSK garu, defenitely jagan should not attend the captial function but points which he raised is not that much convincing.

        • @ rajesh2442

          Wonder what reasons you would have given if you were in Jagans place ?
          I think Jagan has given valid reasons . It is Babu who should give reasons for grabbing fertile lands from farmers to feed his caste fanatics in guntur at the expense of the rest of AP .
          Are there are no other areas to develop in AP ?
          What about underdeveloped Rayalaseema and other districts in AP ??
          Why did Babu go against Sivarama krishna report ?
          Is Sivaramakrishna report false ??
          Why did Babu go against Environmemtal report , not to build capital in earthquake prone region ??
          Is environmental report false ??
          Where are ethical and human values here ???

          The fact is ….Kondhariki amma kanna …?amma mukhyam.
          The truth is ….They will all rot in hell and it is just a matter of time.

  6. Kulam …….Dhanam…….Maa Jeevitham antu
    KAMMA ti jeevithala kosam….Ryhtula kadupu koduthu..Pacchati polalu nasanam chesthu kaduthunna
    Paccha Rajadhaniki …naku Ahawanam vaddhu – YS JAGAN

    Thinking one step ahead of the fanatics …Good one Jagan.

    http://www.sakshi.com/news/top-news/do-not-invite-me-to-foundation-cermony-of-capital-city-ys-jagan-writes-open-letter-to-chandra-babu-283961?pfrom=home-top-story

    Our slogan – Equal distribution of resources and development to all areas in AP when we come to power. This slogan should reach the public and let the people decide.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s