పచ్చి దగా

వందల కోట్లు ఖర్చు చేసి త్రీ-డి ఎఫెక్టుతో దసరా రోజు నిర్వహించిన అమరావతి శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బెస్ట్‌ ఈవెంట్‌ మేనేజర్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది మినహా రాష్ట్ర ప్రజలకు ఎలాం టి ప్రయోజనం చేకూర్చలేదు. పదహారు మాసాలుగా విభజన హామీల అమలు కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న జనం కనీసం శంకుస్థాపన నాడైనా తమకు భరోసా లభిస్తుందని ఆశించగా ఫలితం శూన్యం. శంకుస్థాపన వేదికపై ప్రధాని ప్రత్యేక హోదా ప్రకటిస్తారని, తీపి కబురు చెబుతారని బిజెపి, టిడిపి నాయకులు ఊరించగా మోడీ తుస్సు మనిపించారు. హోదా సంజీవని కాదని బుకాయిస్తూ వచ్చిన చంద్రబాబు, ప్రధాని అమరావతికొచ్చి బీహార్‌ కంటే అధిక ప్యాకేజీ ముట్టచెబుతారని నర్మగర్భంగా ప్రచారం చేశారు. తీరా మోడీ గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు మోసుకొచ్చి ప్రజల నోట్లో మట్టి కొట్టారు. టిడిపి, బిజెపి మాటలు నమ్మి లక్షల కోట్ల ‘డబ్బు మూట’ తెస్తారనుకున్న జనం ఆశలపై నీళ్లు చల్లారు. ఈ మాత్రం భాగ్యానికే బాబు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మన్ను, నీళ్లే అండ పిండ బ్రహ్మాండమన్నట్లు తాను సంతోష పడటమే కాదు ప్రజలనూ తన ఆనందంలో పాలుపంచుకోమంటున్నారు.

నా ఇటుక-నా అమరావతి-నా మట్టి-నా నీరు అంటూ భావోద్వేగా లను, సెంటిమెంట్‌ను రగిలించి తన వైఫల్యాలకు, తప్పుడు విధానాలకు ‘పవిత్ర’ ముసుగు కప్పేందుకు ప్రయత్నించడం దారుణం. దీనికి మోడీ నేను సైతం అమరా వతి నిర్మాణంలో పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ధార పోశానంటూ మహాకవి శ్రీశ్రీ కొటేషన్‌ అరువు తెచ్చుకోవడం అన్యాయం. అదే శ్రీశ్రీ మెచ్చిన తెలుగునాట మేటి కవి గురజాడ దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనుషులోరు అని ఎప్పుడో గడ్డి పెట్టా రు. గురజాడ కొటేషన్‌ను ప్రధాని, బాబు గుర్తుకు తెచ్చుకుంటే మట్టి, నీళ్లతో ఇంత డ్రామా ఆడేవారు కాదు.

అంగరంగ వైభవం, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లతో సాగిన శంకుస్థాపనతో రాష్ట్రానికి బాబు సాధించిందేమీ లేదు. జూన్‌లో పది కోట్లు భూమి పూజకు వెచ్చిం చారు. మళ్లీ నాలుగు నెలలకు రూ.400 కోట్లు కుమ్మరించారు. ఇంతా చేసి, తాను కనుక ప్రధానిని తీసుకొస్తున్నానని గొప్పలకు పోయి చివరికి రూపాయి కూడా అదనపు సాయం సాధించలేదు
ఎన్నికలకు ముందు మోడీ, వెంకయ్య, బాబు త్రయం తాము నమ్మే తిరుపతి వెంకన్న సాక్షిగా హామీలు అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేసి ఓట్లేయించుకొని అధికారంలోకొచ్చారు. అమరావతిలో కాకపోయినా తిరుపతిలోనైనా వాటి ఊసెత్తకుండా ప్రజలనే కాదు వెంకన్ననూ వంచించిందా త్రయం.
కేంద్రం ఎపి ప్రయోజనాలను ఇంతగా కాలరాస్తున్నా తెలుగు జాతి ఆత్మగౌరవం ప్రాతిపదికన పుట్టిన టిడిపి అధినేత ఎందుకు మౌనం దాలుస్తున్నారన్నదే ప్రశ్న. కేంద్రం మెడలు వంచైనా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తానని ఎన్నికల్లో బాబు చేసిన వాగ్దానం ఇప్పుడెందుకు భంగమైంది? శంకుస్థాపన వేదికపై ప్రధానికి కనీసం ప్రజల ఆకాంక్షలను ఎందుకు వ్యక్తీకరించలేకపోయారు? హోదాతో సహా విభజన హామీలపై మోడీ సర్కారు నాన్చుతున్నా ఎందుకు స్పందించట్లేదో బాబు ప్రజలకు జవాబు చెప్పా లి.
రాజధానికి నాలుగు లక్షల కోట్లు కావాలని బాబు పేర్కొన్నారు. అమరావతికి కేంద్రం ఎంతిస్తుందో ఇప్పటికైతే పజిల్‌. రాజధాని కోసం భూములు త్యజించిన రైతులను శంకుస్థాపన రోజు మూడు దొంతరల అవతల ఉంచారు. ప్రధాని సైతం రైతుల గురించి మాట మాత్రం ప్రస్తావించలేదు. మాస్టర్‌ ప్లాన్‌లో రైతులకు భూమి ఎక్కడిస్తారో తెలపకపోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా బిజెపి, టిడిపి నాటకాలు కట్టిపెట్టి హోదా, వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీలతో సహా విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలి. కేంద్రంపై బాబు ఒత్తిడి తేవాలి. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు రెండు పార్టీలూ దగా చేస్తే ప్రజలు క్షమించరు.

http://www.prajasakti.com/EditorialPage/1703150

రాజదాని శంకుస్థాపన- ఒక కులానిదేనా
రాజదాని శంకుస్థాపనలో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చారని కొంతమంది నేతలు విమర్శించడం ఆరంబించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా అదే విమర్శ చేస్తున్నారు.శంకుస్థాపన ఒక సామాజికవర్గానిదే అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిందని ఆయన అన్నారు. లోకేష్ కు పట్టాబిషేకం చేయడానికే రాజధాని శంకుస్థాపనను ఇంత ఆర్భాటంగా నిర్వహించారని ముద్రగడ విమర్శించారు.శంకుస్థాపన అంతా తన కుటుంబ ఆస్తిగా ముఖ్యమంత్రి బావిస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద చంద్రబాబు మోకరిల్లారని ఆయన ఆరోపించారు.ఎపి ప్రభుత్వం విదేశీ కంపెనీలకు రాజదాని నిర్మాణం అప్పగించడానికి సిద్దమవుతోందని, దీనిని ప్రదాని మోడీ గమనిస్తుండాలని ఆయన సూచించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోడీ ప్రజలను అవమానించారని అన్నారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20151024_7.php?p=1445664195274

రాజదాని అంటే పైరవీలే.పవిత్రత అవసరమా
లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ రాజధాని అంటే లంచాలు,పైరవీలు జరిగే ప్రాంతమని అబివర్ణించారు. దానికి అంత పవిత్రత అవసరమా అని ఆయన అన్నారు. జెపి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదానిని ఈవెంట్ మేనేజ్ మెంట్ లా చేస్తూ ప్రజలను ఏమార్చుతోందని విమర్శించారు. రాజదానికి పన్నుల రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని, కాని ఉత్తరాంద్ర,రాయలసీమకు ఈ పన్నుల రాయితీ అడగాలని ఆయన అన్నారు. రాజధాని అంటే కార్యాలయాలతో ఉండే ప్రాంతమని, అక్కడ పైరవీలు, లంచాలు మాత్రమే ఉంటాయని, అందువల్ల అంత పవిత్రత అవసరమా అని ఆయన ప్రశ్నించారు. మట్టి,నీరు అంటూ సెంటిమెంటు చేసినా ప్రత్యేక హోదా మాత్రం రాలేదని, ప్రదాని మోడీ ప్రసంగం ప్రజలను నిరాశ పరచిందని జెపి వ్యాఖ్యానించారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20151024_10.php?p=1445664268817

27 Comments

Filed under Uncategorized

27 responses to “పచ్చి దగా

 1. Buildings cities in Earthquake zones ….
  Human greed and its consequences .
  Nature cares a foot for your caste or religion ?

  http://www.ndtv.com/india-news/tremors-felt-in-delhi-adjoining-areas-1236435?pfrom=home-lateststories

 2. Sridhar Gondhi

  Normally YSJ uses these statistics to convey his point, he should use more frequently to explain why AP needs Special status

  http://www.tupaki.com/politicalnews/article/Rayalaseema–North-Andhra-worse-off-than-special-States–Jayaprakash-Narayan/116121

 3. Veera

  భ్రమరావతికి పొలం ఇవ్వలేదని మాజీ MLA గద్దె రత్తయ కొడుకు గద్దె చంద్రశేఖర్ పొలం తగలపెట్టి వేధిస్తున్న ప్రభుత్వం
  [మాజీ ఎమ్మెల్యే కుమారుడికి పోలీస్ వేదింపు
  మాజీ ఎమ్మెల్యే గద్దె రత్తయ్య కుమారుడు చంద్రశేఖర్ తనకు ఎదురవుతున్న వేదింపులను విపక్ష నేత జగన్ కు వివరించారు.
  పొలంలో షామియానాలు ,కుర్చీలు వేసినందుకు గాను పోలీస్ కానిస్టేబుళ్లు వచ్చి డిఎస్పి రమ్మంటున్నారని ,జీపు ఎక్కమన్నారని ఆయన వాపోయాడు. గతంలో కూడా ఇలాగే రెండెకరాలు ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు నరసరావుపేటవరకు తీసుకువెళ్లి కేసు పెట్టి వేధించారని ఆయన అన్నారు.
  రాజధాని కి భూమి ఇవ్వడానికి నిరాకరించానన్న కక్షతో తనపై పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆయన అన్నారు. తాను టిడిపికే ఓటు వేశానని, అయినా ఈ పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు.
  జగన్ కు తాను ఓటు వేయలేదని,అయినా వచ్చి పరామర్శించినందుకు ధన్యావాదాలు తెలుపుతున్నానని అన్నారు.చంద్రశేఖర్ పొలంలోని ఐదెకరాల చెరకు పంటను దుండగులు దగ్దం చేయడంతో ఆయనను పరామర్శించడానికి జగన్ వెళ్లారు.
  http://kommineni.info/articles/dailyarticles/content_20151026_26.php?p=1445852481258 ]

 4. Veera

  కృష్ణ గుంటూరు రైతుల పంట పండింది
  కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏడాది క్రితం వరకు భూముల ధరలు ఎకరా రెండు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు ఉండగా, ఇప్పడు రాజధాని వలన ఈ భూముల ధరలు ఎకరాకు ఆ యా ప్రాంతాలనుబట్టి 30 లక్షల రూపాయల నుండి ఒక కోటి యాభై లక్షల రూపాయల వరకు పెరిగింది.
  రైతు పంట పండింది! -ఆంధ్రభూమి Oct 26

  హైదరాబాద్, అక్టోబర్ 25: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ ప్రఖ్యాత నగరంగా అభివృద్ధి చెందడం ఎలా ఉన్నప్పటికీ, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. సాధారణ పౌరుల ఊహలకు అతీతంగా ఈ ధరలు అమాంతం పెరిగిపోయాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏడాది క్రితం వరకు భూముల ధరలు ఎకరా రెండు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు ఉండగా, ఇప్పడు ఈ భూముల ధరలు ఎకరాకు ఆ యా ప్రాంతాలనుబట్టి 30 లక్షల రూపాయల నుండి ఒక కోటి యాభై లక్షల రూపాయల వరకు పెరిగింది. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో రైతులు ఆనందపడిపోతున్నారు. రాజధాని నగరం ఎంపిక చేసే సమయం నుండి ఈ ప్రాంతంలో భూముల ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 2014 జూన్ 2 న రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా పెద్దగా ధరలు పెరగలేదు. రాజధాని కోసం వేర్వేరు ప్రాంతాల్లో భూములను పరిశీలించి, చివరకు విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని రాజధాని కోసం ఎంపిక చేస్తున్నట్టు ప్రాథమిక సమాచారం అందగానే భూముల ధరలు పెరగడం ప్రారంభమైంది. ఇప్పటికే లెక్కలేనన్ని రెట్లు పెరిగిన భూముల ధరలు, భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
  గతంలో వ్యవసాయం చేసేందుకు ఒక రైతు నుండి మరో రైతు భూములను కొనుగోలు చేసి పంటలు పండించేవారు. వరి, పత్తి, మిరప తదితర పంటలతో పాటు అరటి తదితర పళ్లతోటలను కూడా పెంచేవారు. ఇప్పుడు వ్యవసాయం కోసం భూములను కొనే పరిస్థితి లేదు. ప్రస్తుతం రైతుల నుండి భూములు కొనుగోలు చేస్తున్న వారు రియల్‌ఎస్టేట్ వ్యాపారులే తప్ప సాధారణ రైతులు కాదు. కొనుగోలు చేస్తున్న భూమి కూడా సాగుకోసం కాకుండా వ్యాపార పరమైన అవసరాలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగానే రెండు జిల్లాల్లో పంటల విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, హనుమాన్ జంక్షన్, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతోంది. హైదరాబాద్, చెన్నై, విశాఖ తదితర ప్రాంతాల నుండి కార్లలో వస్తున్న రియల్ వ్యాపారులు రైతులతో మాట్లాడుకుని, కాస్తోకూస్తో ఎక్కువ తక్కువ ధరలకు భూములను కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఆఘమేఘాల మీద జరుగుతోంది. పట్టాపాస్‌పుస్తకాలు, పహణీలు, ఆర్‌ఓఆర్‌లు తీసుకువచ్చిన రైతులతో రియల్ వ్యాపారులు బేరాలు కుదుర్చుకుంటూ, సగం డబ్బు అడ్వాన్సుగా ఇచ్చేస్తున్నారు. మిగతా డబ్బును కొంత కాలం గడిచిన తర్వాత ఇస్తామంటూ ఒప్పందాలు కుదుర్చుకుని కాగితాలు రాసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో రైతులకు మొత్తం డబ్బు చెల్లించి ఒకే పర్యాయం రిజిస్ట్రేషన్లు కూడా చేసేసుకుంటున్నారు. వాస్తవ పరిస్థితి గమనిస్తే, అమరావతి నగరం కన్నా, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు చేపడుతున్న సాటిలైట్ టౌన్‌షిప్‌లే ముందుగా పూర్తవుతాయా అనిపిస్తోంది. మెల్లమెల్లగా భూముల ధరల పెరుగుదల ప్రభావం ఉభయగోదావరి, ప్రకాశం తదితర జిల్లాలకు కూడా పాకుతోంది.
  ………………………………………….
  కెసిఆర్ ఫోటో పెట్టుకోవచ్చు
  మా ప్రాంతంలో భూముల ధరలు పెరిగిపోవడానికి తెలంగాణ సిఎం కెసిఆర్ కారణం. రాష్ట్ర విభజన జరగడంతో మా ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయి. దాంతో కెసిఆర్ ఫోటోలను మేము (రైతులం) మా ఇళ్లలో పెట్టుకోవచ్చనిపిస్తోంది. మచిలీపట్నం మండలంలోని చిన్నయాదర గ్రామంలో నాకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విలువ ఏడాది క్రితం వరకు ఎనిమిది లక్షలు. ఇప్పుడు 30 లక్షలు పైనే.
  ఎ. శివరామప్రసాద్,
  చిన్నయాదర గ్రామం, కృష్ణాజిల్లా.

  ఎకరా కోటి పైమాటే
  గుంటూరు జిల్లా బెల్లంకొండ మా స్వగ్రామం. గతంలో ఎకరా భూమి 30 నుండి 50 వేలు కూడా ఉండేది కాదు. రాష్ట్ర విభజన తర్వాత భూముల ధరలు పెరిగాయి. ఎకరా కోటికి మించి పెరిగింది. ఇంత పెద్ద మొత్తంలో భూముల ధరలు పెరుగుతాయని ఏనాడూ ఊహించలేదు.
  పల్లపు సాంబయ్య,
  బెల్లంకొండ, గుంటూరు జిల్లా.

  http://andhrabhoomi.net/content/state-2998

 5. Veera

  నేను TDP కి వోటు వేసాను, నా చెప్పుతో నేనే కొట్టుకొంటున్నాను
  -గద్దె చంద్ర శేఖర్ ,పంట తగలపడిపోయిన రైతు
  పంట పొలాలను తగలపెట్టించింది బాబే
  -మాజీ TDP వ్యవసాయ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చౌదరి గారు (క్రిష్ణ జిల్లా)

 6. Veera

  పంట పొలాలను తగలపెట్టించింది బాబే, గాలిలో మేడలు కడుతున్నారు
  -మాజీ TDP వ్యవసాయ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చౌదరి గారు (క్రిష్ణ జిల్లా)
  [ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలిలో మేడలు కడుతున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.
  తుళ్లూరు వద్ద రాజదాని భూమి పూలింగ్ కు ఇవ్వని రైతు పొలాలను దగ్దం చేసిన ఘటనలో బాదితుడు గద్దె చంద్రశేఖర్ ను ఆయన పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు.ఇలా చేయడం దారుణం అని , పంట దగ్దంపై రెవెన్యూ అదికారులకు ఫిర్యాదు చేస్తే వారు భూములు ఇవ్వాలని బెదిరించారని , దీనిని బట్టి ఎవరు పంటను దగ్దం చేసింది అర్దం చేసుకోవచ్చని ఆయన అన్నారు.రైతులను భయబ్రాంతులను చేసి భూములు లాక్కోవాలని చూస్తున్నారని, ఎవరూ భయపడనవసరం లేదని ఆయన అన్నారు
  చంద్రబాబు గాలిలో మేడలు కట్టడం మాని, మెట్ట , వర్షాధార భూములలో రాజదాని నిర్మాణం చేపట్టి,జరీబు భూములను వదలిపెట్టాలని ఆయన కోరారు.
  http://kommineni.info/articles/dailyarticles/content_20151026_16.php?p=1445840480943%5D

  • Veera

   బాబు కుల పాలన పై రగిలి పోతున్న కాపు నాయకులు ఏమంటున్నారు?
   గత ఎన్నికల్లో పవన్ చెప్పాడని కాపులు గంపగుత్తగా బాబుకు వోట్లు వేసారు
   (కాపులకు జగన్ 30 అసెంబ్లీ , 6 MP సీట్లు ఇస్తే బాబు కేవలం 18 అసెంబ్లీ , 2 MP సీట్లు ఇచ్చాడు, అయినా పవన్ ను చూసి వోట్లు వేసారు )
   1.అమరావతి వేదికపై కాపులకు చోటేది-కాపునాడు నాయకుడు వెంకటేశ్వర్లు
   రాజదాని వేదికపైకి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ను కాని, జనసేన నేత పవన్ కళ్యాణ్ ను కాని పిలవలేదు , ఇది కాపులను అవమానించడమే
   -కాపునాడు నాయకుడు వెంకటేశ్వర్లు
   2.కాపులను వాడుకొని అధికారం లోకి వచ్చి కరివేపాకులగా చూస్తున్నాడు, సొంత కులస్థులను కుబేరులను చేస్తున్నాడు. కాపు అధికారుల మీద అవినీతి ముద్ర వేసి దూరం పెడుతున్నాడు బాబు.
   రాజధాని శంకుస్థాపనలో కేవలం బాబు ‘కులాన్ని’ మాత్రమే భాగస్వామిగా చేసారు.
   -కాపునాడు నాయకుడు ముద్రగడ పద్మనాభం
   3.కమ్మ కులస్థుల కోసమే బాబు పాలన
   -గంగాభవాని,మాజీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు with NTV
   4.కాపులకు బాబు చెప్పింది కొండంత చేసింది గోరంత-చిరు
   5.బాబు పాలన లో లబ్ది అంతా బాబు కులస్తులకే
   – శాసన సభలో ప్రతిపక్ష నేత C రామ చంద్రయ్య
   6.మొన్న 14 మంది ని బాబు MLC లు గా చేస్తే అందులో సగం బాబు కులస్తులే, AP చరిత్రలో ఇంత పెద్ద మొత్తములో ఒక కులానికి MLC పదవులు ఇవ్వడం నాకు తెలిసినంతవరకూ జరగలేదు-బొత్స with TV5
   7.ఆఖరికి లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ చౌదరి కూడా బాబు వచ్చాక కుల రాజకీయాలు ఎకువయ్యాయి, అభివృద్ధి అంతా ఆ రెండు జిల్లాలకు పరిమితం చేయడం కరెక్టు కాదు అన్నారు
   అలాగే ఉండవల్లి అరుణ కుమార్ , విశాఖ రిటైర్డ్ IAS శర్మ గారు కూడా ఇంచుమించి ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు
   8.సొంత కులస్థుల కోసమే రాజధాని -టైమ్స్ కథనం
   Vijayawada-Guntur may be Naidu’s choice for capital
   -May 18,2014, Times.
   [It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
   The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].
   9..బాబు ఏది చేసినా అవినీతి కులప్రయోజనాలు ఉంటాయి
   -లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali పరిశోధన

 7. Veera

  ఖజానాకు కనక వర్షం -ఆంధ్రభూమి ,Oct 26
  [బీద అరుపులు ఆపు బాబూ!!! AP ఆదాయం బాగా పెరిగింది
  గత ఏడాది తో పోలిస్తే ఈ 6 నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ) పన్నుల ద్వారా 3600 కోట్లు ఆదాయం పెరిగింది
  అంటే సంవత్సరానికి సుమరుగా 7 -8 వేల కోట్ల ఆదాయం పెరుగుతోంది కాని బాబు మాత్రం డబ్బుల్లేవ్ నేను కాబట్టి నడుపుతున్నాను అని కలర్ ఇస్తున్నాడు

  విభజన తరువత మొదటి సంవత్సరం మాత్రమే లోటు అని ఆర్ధిక నిపుణులు చెప్పారు తరువాత సంవత్సరం ఉండదు(ఎందుకంటే పన్నులు హైదరబాద్ లో కాకుండా AP లో కడతారు కాబట్టి. 5 కోట్ల మంది AP ప్రజల ఆదాయం/పన్నులు అన్నీ AP ఖాతాలోకి పోతాయి ,మునుపటిలా హైదరబాద్ ఖాతాలోకి పోవు అందువలన తెలంగాణా ఆదాయం తగ్గిపోతుంది, AP ఆదాయం పెరుగుతోంది)]
  http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=3972582

 8. Veera

  విశాఖ పై సవతి ప్రేమ చూపుతున్న బాబు
  హుదూద్ ఖర్చు వచ్చేదెన్నడు!
  ధ్వంసమైన డ్రెయిన్లు, గెడ్డలతో పాటు రహదార్లను తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు అప్పటికప్పుడు జివిఎంసి రూ.66 కోట్లను వెచ్చించింది. తక్షణమే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరిగి వస్తాయని భావించిన జివిఎంసి ఏడాది గడచినా నిధుల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. హుదూద్ ఖర్చులో రూ.7 కోట్లను మాత్రమే తిరిగి చెల్లించిన ప్రభుత్వం మిగిలిన రూ.59 కోట్ల ఊసెత్తట్లేదు.
  నష్ట నివేదికపై నోరు విప్పని ప్రభుత్వం
  హుదూద్ కారణంగా జివిఎంసి పరిధిలో రహదార్లు, గెడ్డలు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, పార్కులు, మంచినీటి పథకాలు సహా పలు విభాగాలకు రూ.1270 కోట్లు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనావేశారు. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు.
  http://andhrabhoomi.net/content/hudood-2

 9. Veera

  క్రైమ్ ను బిజినెస్ చేసావు కదరా -పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ తో పోలీస్ కమీషనర్
  కరప్షన్ డబ్బుతో అభివృద్ధి చేస్తా-TDP MLA JC ప్రభాకర్ రెడ్డి
  కరప్షన్ ను లీగలైస్ చేసాడు బాబు -NTV లో కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి యాదవ్

 10. Veera

  రేవంత్ రెడ్డి ఓ ఐటెం గర్ల్-ఎర్ర బెల్లి
  నిజమే, కాకపోతే పగలు బాబుతో రాత్రి కెసిఆర్ తో ఉండే మిమ్మల్ని ఏమనాలి ఎర్ర బెల్లి ?
  గతంలో ఎర్ర బెల్లి పగలు బాబు దగ్గర రాత్రి YS దగ్గర ఉండేవాడు అని టాక్

  ఎప్పుడో చెప్పా రవంత రెడ్డి కి ఎగెరెగిరి పడకు అని, ఇప్పుడు చూడు నిప్పు వెళ్లి కాళ్ళు పట్టుకున్నాడు.వాళ్ళు వాళ్ళు ఒక్కటైపోయారు మద్యలో బకరా అయింది రవ్వంత రెడ్డి, తగిన శాస్తి జరిగింది!
  నీతి :పులి ని నమ్ముకో కాని నక్కను కాదు

 11. Veera

  మోడీ కి బాబు అంటే అసూయ కుళ్ళు. కెసిఆర్ కు బాబుకు రాజీ కుదిరింది, కేసుల్లేవ్
  – A(C)BN అధిపతి రాదక్రిష్ణ చౌదరి (చెత్త ) కొత్త పలుకు “సంరంభం ముగిసింది… ఆరంభం మిగిలింది” నుంచి, Oct 25,2015
  1.ప్రధానమంత్రి ప్యాకేజీ ప్రకటిస్తారని కేంద్ర ప్రభుత్వంగానీ, బీజేపీగానీ ఎక్కడా ప్రకటించలేదు. ఇందుకు సంబంధించి మీడియాలో జరిగిన ప్రచారంతో ఏపీ ప్రజలు ఆశలు పెంచుకున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు కూడా ప్రజల్లో ఆశలు పెరిగేలా మాట్లాడారు.

  2.శంకుస్థాపన కార్యక్రమాన్ని వీక్షించినవారిలో చాలామంది- చంద్రబాబు మరీ అంతగా ప్రాధేయపడటం ఎందుకని భావించిన మాట వాస్తవం.
  అయితే వారికి మోదీ మనస్తత్వం గురించి తెలియదు. చంద్రబాబు విషయంలో నరేంద్ర మోదీకి కొంత అసూయ ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతుంటాయి. తనకంటే ఎవరైనా ఎదగడానికి ప్రయత్నించడాన్ని మోదీ సహించలేరు. చంద్రబాబు తన అలవాటు ప్రకారం దేశవిదేశాల రాజకీయ నాయకులను, పారిశ్రామికవేత్తలను పెట్టుబడుల కోసం కలుస్తుంటారు. దీంతో ఆయనకు జాతీయస్థాయి నాయకుడిగా గుర్తింపు వచ్చింది. అదే సమయంలో కేంద్రంలో ఒకప్పుడు యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ప్రధానమంత్రులుగా ఎవరుండాలన్నది ఆయనే నిర్ణయించేవారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎత్తుగడలపై నరేంద్ర మోదీకి సహజంగానే అనుమానం ఉంటుంది. శంకుస్థాపన కార్యక్రమానికి విదేశీ మంత్రులను ఆహ్వానించడం కూడా ప్రధానికి రుచించలేదని చెబుతున్నారు. బహుశా ఈ కారణంగానే కాబోలు మొదట్లో ఆర్భాటంగా ప్రారంభించిన ఏర్పాట్లను చంద్రబాబు చివరకు పొదుపుతో ముగించారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ మనస్తత్వాన్ని స్టడీ చేసిన చంద్రబాబునాయుడు పలు సందర్భాలలో ప్రధానిని కలిసినప్పుడు తనకు రాజకీయంగా ఇంకా ఎదగాలన్న ఆశలేదని చెప్పుకున్నారు.ప్రస్తుత పరిస్థితులలో నరేంద్ర మోదీతో పెట్టుకుంటే ఏమి జరుగుతుందో చంద్రబాబుకు తెలుసు కనుక వినయంగా ఉంటున్నారు.

  3.ఓటుకు నోటు, టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసులలో చివరకు ఏమీ జరగదని, ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని రెండు నెలల క్రితమే నేను స్పష్టం చేశాను. ఇప్పుడు అదే రుజువయ్యింది.

  గమనిక: పబ్లిక్కా పట్టుబడినా కేసులు లేకుండా మేనేజ్ చేసుకున్న మా వాడె నిప్పు

 12. Veera

  బీహార్ లో వెనకపడిన BJP , ముందంజలో నితీష్
  [2 Bad Phases on, BJP Raises Guard
  http://www.newindianexpress.com/nation/2-Bad-Phases-on-BJP-Raises-Guard/2015/10/25/article3096190.ece ]

 13. Veera

  రాజధానిలో చల్లారని భూసేక’రణం’
  – భూసమీకరణకు ఇవ్వని భూముల్లో రోడ్లు తొలగిస్తున్న రైతులు
  ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
  రాష్ట్ర రాజధాని అమరావతిలో భూపోరాటం కొనసాగుతూనేవుంది. ఒక వైపు రాజధానికి భూమివ్వని రైతుల పొలాలు అనుమానస్పద రీతిలో తగులబడుతుండగా మరోవైపు కొత్తగా వేసిన రోడ్లను రైతులు తొలగిస్తున్నారు. శంకుస్థాపన సందర్భంగా ఉద్దండరాయునిపాలెంకు కొత్తగా రోడ్లు వేసిన సంగతి తెలిసిందే. భూసమీకరణలో భూములివ్వని రైతుల పొలాల్లోనూ ఈ రోడ్లు వేశారు. శంకుస్థాపన వరకు వేచిచూసిన రైతులు ఇప్పుడు వాటిని పనిలో నిమగమయ్యారు.
  రాజధానికి భూ సమీకరణ చేపట్టినప్పుడు పెనుమాక గ్రామానికి చెందిన రైతు కోటిరెడ్డి భూమి ఇవ్వలేదు. ఆయన పొలంలోనూ రోడ్డు వేశారు. శంకుస్థాపన మహోత్సవం ముగిసిన తర్వాత శనివారం నాడు కోటిరెడ్డి తన పొలంలో వేసిన రోడ్డును కూలీలతో తొలగింప జేశారు.
  http://www.prajasakti.com/Content/1703786

 14. Veera

  బాబు పై నిప్పులు చెరిగిన JP
  http://www.expresstv.in/chandrababus-advertising-hip-jp-27203.aspx

 15. Please spare sometime and email the BJP top brass …
  They need to know how Venukayya chowdary, Haribabu chowdary (BJP state president) and CBN are working together to stop BJP from growing in AP in the best interest of KDP.
  These unethical fanatics should be exposed to the rest of the world.

  http://www.bjp.org/organisation/office-bearers

 16. Veera

  కాపు కాసిన కాపులు షాకిస్తారా..!?
  ఏపీలో సుదీర్ఘ విరామం త‌ర్వాత చంద్ర‌బాబు గ‌ద్దెనెక్క‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన సామాజిక వర్గం కాపుల‌న్న విష‌యాన్ని చాలామంది గుర్తిస్తారు. ముఖ్యంగా గోదావ‌రి జిల్లాల్లో ఫ‌లితాలు చూసిన చాలామంది దాన్ని అంగీక‌రిస్తారు. చంద్ర‌బాబు హామీలు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చారం క‌లిసి అప్ప‌ట్లో సానుకూల‌త ఏర్ప‌రిచాయ‌న్న‌ది విశ్లేష‌కుల అందరి అభిప్రాయం

  ముఖ్యంగా ఇటీవ‌ల ఆ సామాజిక‌వ‌ర్గ ప్ర‌తినిధుల నుంచి వ‌స్తున్న ప్ర‌తిఘ‌ట‌న స్వ‌రాలు వింంటే అదే నిజ‌మ‌నిపిస్తోంది. ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం మొద‌లుకుని ప‌లువురు కాపు నేత‌లు గొంతు విప్పుతున్నారు. చంద్ర‌బాబుపై నిప్పులు చెరుగుతున్నారు.
  గంగాభ‌వానీ వంటి కాపు ప్ర‌తినిధుల‌యితే క‌మ్మ రాజ్యం కోస‌మే చంద్ర‌బాబు ప‌నిచేస్తున్నాడ‌ని ఘాటు వ్యాఖ్య‌లు కూడా చేశారు. గుంటూరు,, కృష్ణా జిల్లాల్లో అభివృధ్దిని కేంధ్రీక‌రించ‌డం ద్వారా త‌న సామాజిక‌వ‌ర్గ ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కే చంద్ర‌బాబు పెద్ద‌పీట వేస్తున్నార‌న్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి ప్ర‌స్తుతం క‌నిపిస్తోంది.

  దానికితోడు భోగాపురం ఎయిర్ పోర్ట్ ల్యాండ్స్ భూసేక‌ర‌ణ‌తో ఉత్త‌రాంధ్ర‌లో బ‌ల‌మ‌యిన తూర్పు కాపుల్లో కాక రేగింది. టీడీపీ అంటే మండిప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది.
  దాంతో ఇప్ప‌టికే అనేక సామాజిక‌వ‌ర్గాల్లో ప‌ట్టు కోల్పోయిన టీడీపీ ఇప్పుడు కాపుల్లో కూడా క‌ష్టకాలం ఎదుర్కోక‌త‌ప్ప‌ని స్థితికి చేరుతున్న‌ట్టుంది. రిజ‌ర్వేష‌న్లు, ప్ర‌త్యేక బోర్డు ఏర్పాటు వంటి అనేక హామీల‌న్నీ అమ‌లులో జ‌రుగుతున్న జాప్యం టీడీపీని బోనులో నిల‌బెడుతోంది ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఈ ప‌రిస్థితిని ఎలా ఎద‌ర్కుంటారో చూడాలి.
  http://updateap.com/chandrababu-facing-problems-from-kapu-caste/

 17. Veera

  1.పన్ను రాయతీలు రాజధాని ప్రాంతానికే అడుగుతున్నాడు బాబు
  అలా కాకుండా వెనకపడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర కు రాయతీలు అడిగితె లాభం
  హోదా వలన పన్ను రాయతీలు లభించి పరిశ్రమలు వస్తాయి
  2.3 నెలలు పుష్కరాలు , 2 నెలలు పట్టిసీమ, తరువాత అమరావతి అని కాలం వెళ్ళబుచ్చుతున్నాడు
  3.ప్రత్యెక హోదా 10,15 సం కావాలని అడిగిన BJP-TDP లు ఇప్పుడు మాట మార్చుతున్నాయి
  4.రాజధాని అంటే కార్యాలయాలు,లంచాలు పైరవీలు.
  దానికి మట్టి నీరు అని ఇంత పవిత్రత ఆపాదించడం అవసరమా?
  5.మామూలుగా ప్రభుత్వం చేసే పనులను గొప్ప పనులుగా వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకోవడం అవసరమా?
  -లోక్ సత్తా JP చౌదరి

 18. Veera

  అదిరిందయ్యా చంద్రం-జాతి మీడియా
  బెడిసిందయ్యా చంద్రం-జాతీయ మీడియా

 19. Veera

  మోడీగారు మట్టి,నీరు ఇచ్చారు గానీ ఇటుక ఇవ్వడం మర్చిపోయారంట మేష్టారు…దాని కోసం మళ్లీ ఇంకో సారి శంకుస్థాపన చేద్దామా మేష్టారు…
  ఎలాగో మనది ‘చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ’ బాపతే కదా…
  -Vijay Ram Naidu

 20. Veera

  చంద్రం దసరా కానుక!!!
  పది రూపాయలకే పెగ్గు- ఎస్ఎంఎస్ కొట్టు మందు పట్టు

 21. Veera

  గుప్పెడు మట్టి… చెంబుడు నీళ్లు- మోడీ, బాబు లపై సోషల్‌ మీడియాలో ఛలోక్తులు
  http://www.prajasakti.com/Content/1703325

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s