అమరావతి భవిష్యత్తు ఏమిటి?

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విజయదశమి తర్వా త లబ్దిచేకూరేది తెలుగుదేశం పార్టీని, ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, కొత్త గా పార్టీలో చక్రం తిప్పటం ప్రారంభించిన కొడుకు లోకేష్‌ని ఆశ్రయించి వున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే. చంద్రబాబును అంటిపెట్టుకొని వుండే ఆయన సామాజిక వర్గానికి తప్పించి మరెవరికీ అమరావతి ఫలాలు దక్కనీయకుండా చక్కని కాపలాలను ఏర్పాటుచేశారు. గుట్టుచప్పుడు కాకుండా అమరావతి రాజధాని ప్రాంతం చుట్టూవున్న కీలక ప్రాంతాలను సొంతం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ‘జయభేరు’లు అప్పుడే మోగాయి కూడా. ఒక్కొక్క రాజకీయ నాయకుడు తన వాటామీద వ్యాపారం ప్రారంభించి, తాము తీసుకున్న భూములచుట్టూ కంచె నిర్మించి కోట్లను దండుకుంటున్నప్పుడు కానీ స్థానికులకు తెలియదు తాము ఎటువంటి ఊబిలోకి నెట్టివేతకు గురయందీ.

ఆంధ్రప్రదేశ్‌కి కావాల్సినవి ఏమిటో కేంద్రంనుండి రాబట్టాల్సింది ఏమిటో చం ద్రబాబుకు తెలుసా? అనేది సందేహం. ప్రజలను మభ్యపెట్టి భూములను తీసుకొనటంలో పన్నుతున్న కుయుక్తులను నరేంద్రమోదీ దగ్గర పన్నలేక పోతున్నారు చంద్రబాబు. ప్రత్యేక హోదా ఇస్తామన్న నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ వాగ్దానాల్ని కనీసం సభాముఖంగా గుర్తుచేయలేకపోయిన బలహీన ముఖ్యమంత్రి చంద్రబాబు. మిగిలిన రాష్ట్రాలు మాకు రావాల్సినవి ఇస్తావా! లేదా! అని ప్రధాని మోదీని నిలదీసి అడుగుతుంటే ఆయన ప్రభుత్వంలో భాగస్వా మ్యం కలిగిన టి.డి.పి. అధ్యక్షుడిగా నరేంద్రమోదీని ‘సార్ సర్…సర్’ అంటూ వంగి వంగి దండాలు పెడుతున్న చంద్రబాబు వైఖరి వెనకున్నదేమిటి?
చంద్రబాబు గత చరిత్ర, ప్రస్తుతం చేసిన ‘ఓటుకు నోటు’ వివరాలు నరేంద్రమోదీ దగ్గర భారీ సాక్ష్యాలుగా వున్నాయా? చంద్రబాబు లక్ష్యం ఆ కేసులనుండి బయటపడటమా?

రాష్ట్రం విడిపోయి ఆంధ్రులు వీధిన పడితే మనకు కొత్తగా నిర్మాణ, ఉత్పత్తి వ్యాపారాలు చేసుకునేందుకు అమరావతి పరిసరాలలో చక్కని అవకాశం దొరికిందికదా అని సంతోషిస్తున్నారు. పారిశ్రామికవేత్తలుగా వుండి ఎం.పి.లుగా ఎన్నికైన టి.డి.పి.వారు. వారివారి విస్తరణ పథకాలు వారికున్నాయి. అమరావతిలో ఎవరి మూల ఎవరిదో వారు ఇప్పటికే పంచుకున్నారు. ఇక కావాల్సింది అధికారిక పచ్చజెండా ఊ పటం ఆపైన సింగపూర్, హాంకాంగ్, జపాన్, మారిషస్‌లలోని తమ బినామి కంపెనీలను రంగంలోకి దించటమే మిగిలింది.

జీతాలు ఇవ్వటానికి నిధులు లేవు, కేంద్రమే కాపాడాలి అంటూ బీద అరుపులు అరిచే చంద్రబాబు ఇంతటి భారీస్థాయిలో 400కోట్లు ఖర్చుపెట్టి ఈ ఉత్సవం ఎలా నిర్వహించారు? ఈ విషయం ఆయనకు బాకాఊదే మీడియా ప్రశ్నించదు. ఆ మీడియా బాకాలకు చంద్రబాబుకు వున్న అవినాభావ సంబంధం లోకానికంతటికి తెలిసిందే. ఆ మీడియా మిత్రులే రాజకీయ దళారీలుగా మారారు, రాయబారులుగా నిలుస్తారు. వారివల్ల చంద్రబాబు ఎటువంటి కేసులనుండైనా బయటపడగలడు.

— అడుసుమిల్లి జయప్రకాష్ సెల్: 98481-28844 28/10/2015

http://www.andhrabhoomi.net/content/editorial-242

10 Comments

Filed under Uncategorized

10 responses to “అమరావతి భవిష్యత్తు ఏమిటి?

 1. Veera

  కేంద్ర పధకం 24 గంటల విద్యుత్ వల్లనే AP లో నిరంతర విద్యుత్.
  లేకపోతె ఇంతకుముందు బాబు CM గా ఉన్న 9 సం కాలములో విద్యుత్ కోతలు ఎందుకు ఉండేవి? BJP MLC సోము వీర్రాజు
  మీ మాటల్లో కొంత నిజముంది వీర్రాజు గారూ!!!
  కాకపోతే రాష్ట్ర విభజన వలన అత్యధికంగా (ఉమ్మడి రాష్ట్రం లో 30% విద్యుత్) విద్యుత్ వినియోగించే హైదరబాద్ రంగారెడి జిల్లాలు తెలంగాణా కు పోవడం , అనేక విద్యుత్ ప్లాంట్లు AP లో ఉండడం కూడా కారణమే

  కాకపోతే కుల మీడియా అండతో బాబు అది తన ఘనత అని డప్పు కొట్టు కుంటాడు
  మీ వెనకయ్య నాయుడు హరిబాబు లు కూడా నోరు తెరిచి నిజాలు చెప్పరు , బాబు ను ఇబ్బంది పెట్టారు మరి!!!

 2. Vema Reddy

  I am in north India (NCR), here people liking to CBN 10 out of 10.

  • Rajasekhara

   Vema Reddy,

   .I observe this trend from long .. North Indians view South Indian politicians who are famous at current only CBN .
   As per my understanding TDP Govt spend enough campaign’s to get good mileage .
   During AP bifurcations Process CBN lost his credibility in big way .
   Vote note & Amarathi slowly National Media give bad Light for CBN .
   KCR now credit for all Hyderabad related works. so going forward its not that easy for CBN to keep his credit .
   As per my view I like CBN way uses his community in big way no other people used it so far to promote himself. Chiru,Jagan did some extend .

   • Veera

    Thanks for your valuable info Mr Vema Reddy.
    ఇక్కడ ఎన్టీఆర్ CM గా ఉన్నప్పుడు కర్ణాటక లో రామకృష్ణ హెగ్డే CM గ ఉండేవాడు అప్పట్లో రాజీవ్ గాంధీ తరువాత ప్రధాని పదవికి అర్హులు జాబితాలో రామక్రిషణ్ హెగ్డే ఉండేవారు జాతీయ మీడియా ప్రకారం

    ఒక రోజు నేను బస్సులో నా పక్కన కర్ణాటక లో ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్ ఉన్నాడు ,నేను అతన్ని అడిగా అక్కడ రామకృష్ణ హెగ్డే పాలన బాగా ఉందట, మరల CM అవుతాడా అని.ఆటను లేదు ఓడిపోతాడు అని చెప్పాడు
    ఆటను నన్ను అడిగాడు ఇకక్డ ఎన్టీఆర్ బాగా పలిస్తున్నాడట కదా మరలా అతనే CM అట కదా అన్నాడు నేను ఎన్టీఆర్ ఓడిపోతాడు ,మరలా గెలవదు అని చెప్పా
    ఎన్నికల్లో ఎన్టీఆర్ రామకృష్ణ హెగ్డే ఓడిపోయారు

    నీతి:దూరపు కొండలు నునుపు

 3. One more wicket down in T for the wicked KDP ….
  KCR’s gift to Babu for inviting him to Brmaravathi ?

  http://www.sakshi.com/news/district/mp-gundu-sudha-rani-suspends-from-tdp-party-287298?pfrom=home-top-story

 4. Veera

  కేసు వాపసు తీసుకో, 500 కోట్లు తీసుకో లేకపోతె చంపేస్తాం అని ఒక మంత్రి బెదిరించాడు
  -నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసిన శ్రీమన్నారాయణ
  కేసు వేసిన వ్యక్తికే 500 కోట్లు ఇస్తాము అన్నారంటే కనీసం 2 లక్షల కోట్ల లాభం ఉండదా బాబుకు?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s