కరువు కోతలు

అమరావతి, పుష్కరాలు, సింగపూర్‌, జపాన్‌ ప్రచారార్భాటంలో పడి చంద్రబాబు ప్రభుత్వం కరువును విస్మరించడం ఘోర అపరాధం కాగా ఆలస్యంగా ప్రకటించిన కరువు మండలాల్లోనూ పిసినారి తనానికి పాల్పడటం మరీ దుర్మార్గం. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా దుర్భిక్షం అలముకోగా ఆర్చుకొని తీర్చుకొని సీజను ముగిసిన నెల రోజులకు వెల్లడించిన కరువు మండలాల విషయం కూడా ఎంతో లోపభూయిష్టంగా, ఆశాస్త్రీయంగా ఉంది. పదమూడు జిల్లాల్లో 670 మండలాలుండగా మీనమేషాలు లెక్కించి గుర్తించినవి ఏడు జిల్లాల్లో 196 మండలాలు. కరువు కోరల్లో చిక్కుకొని రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే కరువు గుర్తింపులో కూడా వడపోతలకు ఒడిగట్టడమే కాకుండా కఠిన షరతులు విధించడం దారుణం. జూన్‌- సెప్టెంబర్‌ సాధారణంగా ఖరీఫ్‌ కాలం. వ్యవసాయశాఖ మంత్రి ఆగస్టు మూడో వారంలో ప్రెస్‌మీట్‌ పెట్టి 325 మండలాల్లో తీవ్ర వర్షాభావం ఉందని పేర్కొని, త్వరలో ఆ మండలాల్లో కరువు ప్రకటిస్తామన్నారు. రెండు మాసాల కసరత్తు అనంతరం కరువును 196 మండలాలకు సర్కారు ఎందుకు కుదించిందో అర్థం కాదు.

ఈ వ్యవధిలో రాష్ట్రంలో వరదలు పోటెత్తింది లేదు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి జలాశయాల్లోకి నీరు పరవళ్లు తొక్కిందీ లేదు. రాయలసీమ, ప్రకాశం, ఇతర మెట్ట ప్రాంతాల్లో కరువు ప్రకటించాలని కలెక్టర్లు పంపిన నివేదికలను ప్రభుత్వం బుట్టదాఖలు చేయడం ఘోరం. క్షేత్ర స్థాయి రిపోర్టులను కాకుండా హైదరాబాద్‌లో కూర్చొని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసులను తూచ శిరసావహించడం కరువు ప్రజలపై సర్కారు చిన్నచూపే. ప్రభుత్వ ఆదేశాలతోనే కరువును కమిటీ తగ్గించినట్లు కనబడుతోంది.

హుదూద్‌ ప్రచండ తుపానప్పుడూ విశాఖ వద్ద తీరం దాటుతుందని రెండు మూడు రోజుల ముందే మెటరాలజీ శాఖ పేర్కొంది. ముందు అప్రమత్తం కాకుండా తీరా తుపాను వెలిశాక విశాఖలో సిఎం స్వయంగా తిష్ట వేసి అక్కడా ప్రచార కోణాన్నే ఆశ్రయించారు. ముందే మేల్కొంటే యభై మరణాలు సంభవించేవి కాదుగా?

పట్టిసీమతో నదుల అనుసంధానం అంటూ రూ. వందల కోట్లు తగలేసి రాయలసీమకు చుక్క నీరివ్వలేదు. పైగా ఎన్నడూ లేని విధంగా కృష్ణా డెల్టానూ ఎండబెట్టి ధాన్యాగారంలో పంట సెలవులకు పాదుకొల్పారు

రైతులు పంటలేసుకోవాలంటే కొత్త అప్పులివ్వాలి. రుణ మాఫీ పేరుతో రీషెడ్యూల్‌కు ఎగనామం పెట్టడం ఆందోళనకరం. నిరుడు హుదూద్‌, కరువు రైతులకు రీషెడ్యూల్‌ చేయకుండా దగా చేసింది.
http://www.prajasakti.com/EditorialPage/1705966

7 Comments

Filed under Uncategorized

7 responses to “కరువు కోతలు

 1. Veera

  HC Slaps Notice on Sujana Chowdary in Loan Repayment Case
  HYDERABAD: The Hyderabad High court on Friday issued notices to the board of directors of Sujana Universal Industries Limited, including Union minister Y Sujana Chowdary, in a contempt petition filed by the Mauritius Commercial Bank alleging that the company has defaulted on re-payment of a ‘106 crore loan. The minister is now a non-executive director of the company.

  The Mauritius Bank has filed a contempt case against the directors of the company alleging that they have wilfully chosen to avoid complying with the order passed by a city civil court despite the High Court dismissing their revision petition. All this was done to scuttle the administration of justice, it contended.

  The bank submitted that the civil court had ordered the company to disclose the details of all its assets, including the bank accounts, through an affidavit. Initially, they chose not to mention any bank accounts and later filed an affidavit mentioning a few bank accounts outside the jurisdiction of the court in Hyderabad, it pointed out.

  It alleged that this was done as a deliberate attempt to defeat the legitimate claim of the bank that is pursuing the execution of an order issued by a United Kingdom High Court against Sujana Industries. The bank approached the civil court for recovery of `106 crores.

  http://www.newindianexpress.com/cities/hyderabad/HC-Slaps-Notice-on-Sujana-Chowdary-in-Loan-Repayment-Case/2015/10/31/article3106618.ece

 2. Veera

  కులం.. కులం.. కులం..!!
  ఏపీలో స‌హ‌జంగానే కులాల ప్రాధాన్య‌త ఎక్కువ‌. అందుకే కుల ఆధారిత రాజ‌కీయాల‌కు పెద్ద పీట వేస్తారు. అందులోనూ అభివృద్ధి చెందుతున్న వ‌ర్గాల్లో కూడా కులం అన‌గానే కుర్చీ వేస్తారు. ఏపీ రాజ‌కీయాల్లో కులం ఇప్పుడు రాజ్య‌మేలుతోంది. అందులోనూ అధికార ప‌క్ష కుల‌మే అన్నింటా పెత్త‌నం చేస్తోంది అన్ని రంగాల్లోనూ ఆ ప్ర‌భావం క‌నిపిస్తోంది. గ‌తంలో కూడా ఇలానే కొన‌సాగిన‌ప్ప‌టికీ అప్ప‌టి ప్ర‌భుత్వ పెద్ద‌ల అనుభ‌వంతో ఈనాటి పాల‌కులు మ‌రింత‌గా రెచ్చిపోతున్నారు. ఒక సామాజిక‌వ‌ర్గానికే పెత్తనం అప్ప‌గిస్తున్నారు.

  రాజ‌ధాని ఎంపిక నుంచి అన్ని అంశాల్లోనూ ఇది స్ప‌ష్ట‌మ‌వుతుంది. మంత్రులకు శాఖ‌ల కేటాయింపులో కూడా అదే విష‌యం స్ప‌ష్ట‌మ‌య్యింది. అధికారాల అప్ప‌గింత‌లోనూ అదే తీరు సాగుతోంది. డీజీపీ నుంచి అనేక నియామ‌కాల్లోనూ అదే రుజువ‌వుతోంది. తాజాగా ఏపీపీఎస్సీ చైర్మ‌న్ ని కూడా అదే కులానికి చెందిన వ్య‌క్తిని ఎంపిక చేయ‌డం ద్వారా ఇక విద్యా, వైద్య రంగాల్లో కూడా ఆ కులానికే ప్రాధాన్య‌త‌న్న విష‌యం రూఢీ అవుతోంది. త్వ‌ర‌లో రిటైర్ కాబోతున్న చీఫ్ సెక్ర‌ట‌రీ స్థానంలో కూడా అదే కులానికి చెందిన ఐఏఎస్ అధికారిని ఆ స్థానంలో నియ‌మించాల‌న్న నిర్ణ‌యానికి దాదాపుగా వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద ప‌నిచేస్తున్న ఓ అధికారి ఆ రేసులో ఉన్న‌ట్టు కూడా ప్ర‌చారం సాగుతోంది.

  ఇప్ప‌టికే రాజ‌కీయ‌రంగంలో ఆ కులానికే ప్రాధాన్య‌త ఇవ్వ‌డం చాలామందిని ఇబ్బంది పెడుతోంది. కొంద‌రు నేత‌ల‌యితే బ‌హిరంగంగానే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇందుకు ప్ర‌ధాన కారణంగా కూడా చిన‌బాబు వైఖ‌రే అంటున్న‌వాళ్లు కూడా లేక‌పోలేదు. గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న‌లో ఇలాంటి తీవ్ర‌స్థాయి లేద‌ని ఇప్పుడు మ‌రీ బ‌రితెగించి కాంట్రాక్టుల్లో స‌హా అన్ని నియామ‌కాల్లోనూ కులం చూసే ప‌రిస్థితి రావ‌డం వెనుక ఆయ‌నే కార‌ణ‌మ‌ని అంటున్నారు. అయితే నిజానికి అర్హ‌త‌లున్న‌ప్పుడు ఏ కులానికి చెందిన వ్య‌క్తిని నియ‌మించినా అందులో అభ్యంత‌రం పెట్టాల్సింది ఉండదు. అంద‌రూ స‌మాన‌మే అయిన‌ప్పుడు స‌మ ప్రాధాన్య‌త అవ‌స‌రం. కానీ కేవ‌లం కులం గీటారాయిగా మార్చుకుని అయిన‌వాళ్ల‌కు ఆకుల్లో..కాని వారికి కంచాల్లో పెట్ట‌డ‌మే చాలామందికి అస‌హ‌నం క‌లిగిస్తోంది. అన్నింటిలోనూ ఒకే కులం అన‌గానే అలాంటి అనుమానాలే అంద‌రిలో క‌లుగుతుండ‌డం విశేషం. ఏమైన‌ప్ప‌టికీ మ‌రి అతి స‌ర్వ‌త్రా వ‌ర్జ‌యేత్ అన్న నానుడి మ‌రిచిపోతే ఎవ‌రికైనా ప్ర‌మాద‌మే..!

  http://updateap.com/kamma-caste-leading-all-ascpects/

  • Manam …..Dhanam……Kulam……..Jeevitham
   Kamma ti Jeevithalu ……Viluvalu leni Brathukulu .
   Manushulaki ……Cheeda purugulaki theda ledha ??
   Rastranni brastu pattisthunna ..Gajji dongalanu bhayatapettandi.
   Please use the Social media to name and shame the unethical fanatics.

 3. Veera

  కేంద్ర పధకం 24 గంటల విద్యుత్ వల్లనే AP లో నిరంతర విద్యుత్.
  లేకపోతె ఇంతకుముందు బాబు CM గా ఉన్న 9 సం కాలములో విద్యుత్ కోతలు ఎందుకు ఉండేవి? BJP MLC సోము వీర్రాజు
  మీ మాటల్లో కొంత నిజముంది వీర్రాజు గారూ!!!
  కాకపోతే రాష్ట్ర విభజన వలన అత్యధికంగా (ఉమ్మడి రాష్ట్రం లో 30% విద్యుత్) విద్యుత్ వినియోగించే హైదరబాద్ రంగారెడి జిల్లాలు తెలంగాణా కు పోవడం , అనేక విద్యుత్ ప్లాంట్లు AP లో ఉండడం కూడా కారణమే

  కాకపోతే కుల మీడియా అండతో బాబు అది తన ఘనత అని డప్పు కొట్టు కుంటాడు
  మీ వెనకయ్య నాయుడు హరిబాబు లు కూడా నోరు తెరిచి నిజాలు చెప్పరు , బాబు ను ఇబ్బంది పెట్టారు మరి!!!

 4. Veera

  ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఓడిపోయే వరంగల్ సీట్ BJP కి ఇవ్వండి సర్ ?ఎర్రబెల్లి
  మాకొద్దు మీరే పోటీ చేయండి అని TDP ని అడుగుతున్న BJP
  [BJP-TDP still undecided over fielding candidate
  Who should put up a candidate in the Warangal bypolls, the BJP or the TDP this has been the million dollar question which could not be resolved so far. While the BJP wanted the TDP to field a candidate since it has strong cadre in Warangal, the TDP asked BJP to contest the seat saying that the BJP candidate had secured half the votes by which Kadiyam Srihari of TRS had won

  The TDP initially showed interest to contest the seat since the party floor leader in State Assembly E Dayakar Rao holds considerable influence in good number of assembly constituencies under Warangal Lok Sabha.

  However, he is learnt to have pleaded with the party leadership to leave the seat to BJP as he does not want to get a bad name of losing the election.

  Hence, he made it clear to the BJP that his party would support any candidate chosen by the BJP

  http://www.thehansindia.com/posts/index/2015-10-30/BJP-TDP-still-undecided-over-fielding-candidate-183351 ]

 5. Veera

  బీహార్ లో BJP ఓడిపోతే పాకిస్తాన్ లో టపాసులు కాలుస్తారు-BJP అద్యక్షుడు అమిత్ షా
  పక్క ‘దేశం’ సంగతి ఎందుకు గాని మీ పార్టనర్ తెలుగు ‘దేశం’ మాత్రం పండుగ చేసుకుంటుంది.
  అందుకే గా బాబు అను కుల భజన మేధావులు ఆంద్ర మేధావి సంఘం అద్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి, కామెడీ నటుడు శివాజీ చౌదరి, మానసిక విశ్లేషకులు C నరసింహారావు చౌదరి మరియు బాబు సొంత మనిషి కారెం శివాజీ లు మోడీ ,జగన్ ల మీద రాళ్ళు విసురుతూ బాబు ను పూలతో కొడుతుంటారు

  ఇంకా కుల చానళ్ళు మేధావుల ముసుగులో అనేకమంది బాబు అను ‘కుల’ మనుషులను TV చర్చల్లో కూర్చోపెడుతోంది.

 6. Veera

  వీణా – వాణీలను వదల్లేదు-ABN/ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ చౌదరి కుంభకోణం
  వీణా వాణి లకు దాతలు ఇచ్చిన పది లక్షలు కొట్టేసిన ABN ఛానల్
  కుటుంబం ఇబ్బందుల్లో ఉందని ,దాతలు ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని వేడుకున్నా పట్టిచుకొని రాధాకృష్ణ

  రెండు తలలు అతుక్కుని జన్మించిన కవల పిల్లలు వీణా వాణి ల కుటుంభానికి అందజేస్తామని చెప్పి ఆరు సంవత్సరాల క్రితం ఏ బీ ఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో దాతల నుంచి వసూలు చేసిన సుమారు 10 లక్షల రూపాయలను రాధాకృష్ణ కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది . అప్పట్లో ఆ కవల పిల్లలతో పాటు వారి తండ్రి మురళి గారిని ఏ బీ ఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కు పిలిపించి వారికి సహాయం చేస్తామని చెప్పి టీ వీ లైవ్ ప్రోగ్రాం లో దాతల నుండి సుమారు పది లక్షల రూపాయలు సేకరించారని మురళి చెబుతున్నారు . ఆంధ్రజ్యోతి ఎక్కౌంట్ లో జమ చేయించుకున్నారని తమకు ఒక్క పైస కూడా ఇవ్వలేదని మురళి ఆవేదన వ్యక్తం చేసారు .

  తమకు వీణా వాణి లతో పాటు మరో ఇద్దరు కూతుర్లు ఉన్నారని కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని దాతలు ఇచ్చిన డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని ప్రాదేయపడినా రాధాకృష్ణ పట్టించుకోలేదు . పైగా ఎక్కువగా మాట్లాడుతున్నవనే తరహాలో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వీణా వాణి ల తండ్రి మురళి తన బాధను వ్యక్తం చేసారు .

  తెలంగాణా ప్రభుత్వం స్వంత ఖర్చుతో నిమ్స్ ఆస్పత్రి పర్యవేక్షణలో వీణా వాణి ను కంటికి రెప్పలా చూసుకుంటున్నది . ఈ కవలల ఆపరేషన్ సక్సెస్ పై విదేశీ వైద్యులు సైతం భరోసా ఇవ్వలేని పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ఆచి తూచి అడుగులు వేస్తున్నది . ఖర్చు గురించి ఆలోచించవద్దని , డిల్లీ ఎయిమ్స్ లో ఆపరేషన్ సాద్యా సాద్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్ వైద్యులను ఆదేశించారు .
  ఇక రాధాకృష్ణ కుంభకోణం లోకి వస్తే ఇంతకు ఎంత మంది దాతలు ఎన్ని డబ్బులు ఇచ్చారనే విషయాన్ని ఏ బీ ఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ గానీ పత్రిక గానీ వివరాలు ప్రకటించలేదు సరికదా కనీసం మురళి కి సమాచారం ఇవ్వలేదు . కనీసం ఆ డబ్బుల మీద వచ్చిన వడ్డీ అయినా వీణా వాణి లకు అందజేయ్యాలన్న మానవత్వాన్ని రాధాకృష్ణ ప్రదర్శించలేదు . ఆంధ్రజ్యోతి ఛానల్ తెలంగాణా లో ఇలాంటి వ్యవహారాల్లో ఎంత మంది దగ్గర డబ్బులు వసూలు చేసిందనే దాని మీద సీ ఐ డి విచారణ జరిపించాలని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిని కోరుతున్నారు . ప్రతి రోజు తన పత్రికలో నీతులు చెబుతూ ఇలా పేద వాళ్ళ నోటి కాడి కూడు లాగేసుకుంటున్న రాధాకృష్ణ ను తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది .

  మరి ఈ లెక్కన ఆంధ్రా రాజధాని కోసం అంటూ .. తెలంగాణలో ఆత్మహత్యల కోసం అంటూ రాధాకృష్ణ వసూలు చేస్తున్న సొమ్ములు జేబుఖర్చుల కింద జమచేసుకుంటాడేమో ..
  http://madeintg.com/veena-vani/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s