పర్యావరణ నివేదిక తప్పుల తడక

– అమరావతి వ్యవహారం
– పొంతనలేని అంకెలతో వింతలు
– కాలుష్య నివారణ మండలికి ఫిర్యాదు
ప్రజాశక్తి, హైదరాబాద్‌ బ్యూరో
అమరావతి శంకుస్థాపన కోసం సిఆర్‌డిఎ హడావుడిగా సంపాదించిన పర్యావరణ క్లియరెన్స్‌ (ఇసి) తప్పుల తడకగా రూపొందించారని పర్యావరణ నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ నివేదికపై ఎపి కాలుష్య నివారణ మండలికి, కేంద్ర పర్యా వరణ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు వెళుతున్నాయి. సింగపూ ర్‌ సురాబనా రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ డాక్యుమెంట్‌లో అడవులు, వాటర్‌ బాడీస్‌కు సంబంధించి పొందుపరచిన వైశాల్యాలు, విస్తీర్ణాలకు, ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్సుల్లో చూపిన అంకెలకు పొంతన లేదని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ ప్రభావ అంచనా (ఇఐఎ) ప్రక్రియనే తలకిందులు చేసినట్లు పేర్కొంటున్నారు. ఇసి ఇచ్చేందుకు సమావేశం జరిపిన స్టేట్‌ ఎన్విరాన్‌మెంట్‌ అసెస్‌మెంట్‌ కమిటీ సమావేశం మినిట్స్‌ కాపీని పరిశీలిస్తే కొన్ని వింతలు కనిపిస్తాయి. పర్యావరణ క్లియరెన్స్‌ ఇచ్చే సందర్భంగా విధించిన షరతులలో ఒక దానికి డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ అనే శీర్షికతో సూచనలు చేశారు. రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతం భూకంపాలు వచ్చే జోన్‌లో ఉందని, ఎన్‌జిఆర్‌ఐ వంటి సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా పలువురు నిపుణులు ఎప్పుడో హెచ్చరికలు చేశా రు. కొండవీటి వాగు, కృష్ణా నది వరదలతో రాజధాని ప్రాంతం మునిగే ప్రమాదం ఉందనీ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో ప్రకృతి వైపరీత్యాలను మేనేజ్‌ చేయాలనే షరతుతో పర్యావరణ క్లియరెన్స్‌ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్‌ శర్మ ఎపి కాలుష్య నివారణ మండలికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ అనే క్యామిక్‌ టైటిల్‌ను కమిటీ మినిట్స్‌ లో ఉపయోగించడాన్ని ఆయన అధిక్షేపించారు.

ట్రిబ్యునల్‌ ఆదేశాలతోనే వెబ్‌సైట్‌లో వివరాలు
కన్స్‌ల్టెంట్‌ రూపొందించిన పర్యావరణ ప్రభావ నివేదిక (ఇఐఎ)ను సిఆర్‌డిఎ వెబ్‌సైట్‌లో ముందుగా ఉంచలేదు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకే వెబ్‌సైట్‌లో ఉంచారు. నివేదికను ప్రజలకు బహిర్గత పరిచిన తర్వాతే పర్యావరణ క్లియరెన్స్‌ అమలులోకి వస్తుందని చట్టం చెబుతోంది. ఈ వ్యవహారం సమాచార హక్కు పరిధిలోకి వచ్చే అంశం అయినప్పటికీ సిఆర్‌డి ఎ లేదా ప్రభుత్వం వాస్తవాలు బహిర్గత పరచడం లేదు. తప్పుడు సమాచారంతో పొందిన ఇసి రద్దవుతుందనేది దాన్ని జారీ చేసేటప్పుడు పెట్టే షరతు. ఈ లెక్కన ఇసి తక్షణం రద్దు కావలసి ఉంది. ఇసి మూడో పేజీలో భూమి వినియోగ పొందికకు సంబంధించి ఇచ్చిన లెక్కలు గందరగోళంగా ఉన్నాయని కాలుష్య నివారణ మండలికి చేసిన ఫిర్యాదులో శర్మ నిరూపించారు. ఇసి 3 పేజీలో వాటర్‌ బాడీస్‌ విస్తీర్ణాన్ని 278 హెక్టార్లుగా చూపారు. నదులు, వాగులు వంకలను 2965 హెక్టార్లుగా లెక్కించారు. అడవులు, పొదలను 4.54 హెకార్లుగా పేర్కొన్నారు. ఈ అంకెలు బహుశా ప్రజలకు బహిర్గతం చేయని కన్సల్టెంట్ల నివేదిక నుంచి తీసుకున్నట్లు కనిపిస్తుందని శర్మ అభిప్రాయపడుతున్నారు. సింగపూర్‌కు చెందిన సురాబనా రూపొందించిన సిటీ మాస్టర్‌ ప్లాన్‌ (పార్ట్‌2లో) నదుల కింద ఉన్న భూ విస్తీర్ణాన్ని 1277.7 హెక్టార్లుగా చెప్పారు. వాటర్‌ బాడీస్‌ను 497.5 హెక్టార్లుగా లెక్కించారు. అడవుల విస్తీర్ణాన్ని అసలు చెప్పలేదు. ఈ మాస్టర్‌ ప్లాన్‌ సమాచారానికి, ఇసి సమాచారానికి పొంతన కుదరడంలేదు. అంటే సిఆర్‌డిఎ ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఇసి తయారైందన్నమాట. ఈ ఒక్క కారణంతోనే ఇసి దానంతట అది రద్దవుతుందని నిపుణులు చెపుతున్నారు. ఇసిలో కూడా డొంక తిరుగుడు లెక్కలు ఉన్నట్లు నిపుణులు పసిగట్టారు. ఇసిలోని 3వ పేజీలో అడవులను 4.54 హెక్టార్లుగా చూపారు. తీరా 15వ పేజీలోని 11 ఐటమ్‌కి వచ్చేసరికి 251.814హెక్టార్లు చేశారు. అదే పేజీలోని 7వ ఐటంలో వాటర్‌ బాడీస్‌ కింద 4815హెక్టార్లు చూపారు. ఇసిలోని 3వపేజీ అంకెలకు మాస్టర్‌ ప్లాన్‌ లోని పట్టిక 2.1కి పొంతన లేదు. దీన్ని చూస్తే స్టేట్‌ ఎన్విరాన్‌మెంట్‌ అసెస్‌మెంట్‌ అథారిటీకి ఎపి సిఆర్‌డిఎ అడవులు, వాటర్‌ బాడీస్‌ కు సంబంధించి ఊహాజనితమైన లెక్కలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇసి 3 పేజీలోని భూ వినియోగ పొందికకు సంబంధించిన అంశంలో ఆర్కియాలజికల్‌ సైట్లకు సంబంధించిన ప్రస్తావన తప్ప వివరాలు లేవు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌ గురించి చెప్పే సందర్భంలో మెరక పూడ్చడానికి యురేనియం, థోరియం వంటి రేడియో యాక్టివ్‌ ధూళి కలిగిన ఫ్లైయాష్‌ను ఉపయోగించాలని స్టేట్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ అథారిటీ సూచనను నిపుణులు తప్పుబడుతున్నారు. సామాజిక ఆర్థిక సర్వేలో సవివరమైన సామాజిక ఆర్థిక కోణాన్ని అసలు పట్టించుకోలేదని పర్యావరణ నిపుణుడు ఐఐసిటి రిటైర్డ్‌ సైంటిస్ట్‌ బాబూరావు చెప్పారు.

http://www.prajasakti.com/Content/1710062

23 Comments

Filed under Uncategorized

23 responses to “పర్యావరణ నివేదిక తప్పుల తడక

 1. Veera

  అవును తెలుగుదేశం జాతీయ పార్టీ కదా.. మొన్నీ అండమాన్ లో కూడా పోటీ చేసింది కదా … బీహార్ లో పోటీ చేసిందా ?? ఎన్ని సీట్లు వచ్చాయి ???
  -FB Post

 2. Veera

  నితీష్ మగాడురా బుజ్జీ-వరుసగా మూడోసారి గెలుపు
  మన బాబూ ఉన్నాడు మొదటిసారి 1999 లో BJP పుణ్యమా అని రెండవసారి 2014 లో మోడీ, పవన్,రుణమాఫీ అని చెప్పి కేవలం 1% వోట్లతో గెలిచాడు
  కాని వరుసగా 2004,2009 లో గెలిచింది YS మాత్రమే!!!.

  • YS Fan

   మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ bjp lost ఎన్నికలు in బీహార్.so we are ఇక్కడ celebrating

 3. Veera

  అమరావతి చుట్టూ పక్కల భూములు TDP వాళ్ళు కొన్నవే, ఆ భూములకు రెట్లు రావాలనే హడావిడిగా మమ్మల్ని విజయవాడ వెల్లమంటున్నారు-AP సచివాలయం ఉద్యోగులు
  [Andhra Pradesh staff see conspiracy in shifting
  HYDERABAD: AP government employees working in Hyderabad now see a larger conspiracy behind the hurried decision to shift offices to Vijayawada. They allege that the real estate lobby is pressuring the government to shift 20,000 employees in one go to boost land prices in and around Vijayawada and Guntur. They also allege that the took the decision under pressure from real estate companies and a few influential leaders of the ruling party. Incidentally, some ruling party leaders own large tracts of land in and around Amaravati.

  “If 20,000 employees along with their families move to Vijayawada, the city will get an additional one lakh people. This will push the demand for housing. High rental will push land prices which will benefit real estate companies that own land around Vijayawada,” pointed out an office-bearer of AP revenue employees’ association. Earlier, the state government had asked the employees to shift to new capital before the next academic year.

  http://timesofindia.indiatimes.com/city/hyderabad/Andhra-Pradesh-staff-see-conspiracy-in-shifting/articleshow/49707203.cms ]

 4. Veera

  గిల్లితే గిల్లించుకోవాలి,అరవకూడదు-పోకిరి సినిమాలో మాఫియ డాన్ ప్రకాష్ రాజ్
  కొడితే కొట్టించుకోవాలి కాని ఏడవకూడదు,కంప్లైంట్ చేయకూడదు
  -TDP MLA ,విప్ చింతమనేని ప్రభాకర్‌ చౌదరి
  నా దరి రహదారి ‘కాదు’ అడ్డదారి అంటున్న చౌదరి

  చౌదరి గారి చేపల చెరువు కోసం అడవిలో అడ్డ రోడ్డు, వద్దన్న ఆటవీశాఖ
  మొన్న ఇసుక మాఫియా ను అడ్డు కుంటావా అని ఈడ్చుకొంటూ కొట్టుకొంటూ వెళ్ళిన చింతమనేని అనుచరులు. మా కమ్మని రాజ్యం లో మాకు అడ్దేంది అంటున్న ….వర్గీయులు

  [చింతమనేని అడ్డదారి !
  -కొల్లేరు అభయారణ్యంలో అనుమతుల్లేకుండా రోడ్డు నిర్మాణం
  -ప్రజల కోరిక పేరిట తన చేపల చెరువులకు దారి
  -ముసునూరు ఘటన మరువక ముందే మరో వివాదం
  -పోలీసులకు ఫిర్యాదుచేసిన అటవీశాఖ అధికారులు
  ‘చట్టాలతో పని లేదు.. ఇది నా సామ్రాజ్యం.. నేను చేసిందే శాసనం…’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టిడిపి ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విఫ్‌ చింతమనేని ప్రభాకర్‌ కార్యనిర్వాహక శాఖలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. నిన్న ముసునూరు మండలం బలివే క్వారీలో ఇసుక తరలింపుపై తహశీల్దార్‌ వనజాక్షిపై దాడి చేయడం ద్వారా రెవెన్యూ శాఖకు సవాల్‌ విసిరారు. రెవెన్యూ ఉద్యోగులు, వివిధ పార్టీల నేతల నుండి తీవ్ర విమర్శలు వచ్చినా ఆయనను ఏమీ అనకపోగా పాలకులు సమర్థించారు. అంతేగాక తప్పంతా వనజాక్షిదే అన్నట్లుగా వ్యవహరించారు. కమిటీ వేసి తూతూ మంత్రం చేశారు. దీంతో చింతమనేని మరోసారి రెచ్చిపోయారు. తాజాగా కైకలూరు మండలం కోమటిలంకకు అనధికార రహదారి నిర్మిస్తూ అటవీశాఖ అధికారులకు షాక్‌ ఇచ్చారు. ‘ప్రభుత్వ నిబంధనలతో నాకు సంబంధం లేదు.. చేతనైతే పోలీస్‌ కేసులు పెట్టుకోండి..’ అంటూ తెగేసి చెప్పడంతో అటవీశాఖ సిబ్బంది కంగుతన్నారు. ఉన్నతాధికారుల సూచనతో అసిస్టెంట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఈశ్వరరావు కైకలూరు పోలీస్‌ స్టేషన్‌లో చింతమనేని తీరుపై శనివారం ఫిర్యాదు చేశారు.

  పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల సరిహద్దుల్లో కోమటిలంక గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా వైపున చింతమనేనికి చేపల చెరువులున్నాయి. కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ఆటపాక నుండి కోమటిలంకకు చేరుకోవడం తేలిక. ఈ ప్రాంతానికి రహదారి సౌకర్యం లేదు. ఇది పూర్తిగా అభయారణ్యంలో ఉండడంతో రహదారులు, కట్టడాలు నిర్మించాలంటే అటవీ శాఖ నుండి అనుమతులు పొందాల్సి ఉంటుంది

  తక్కువ సమయంలో చేపల చెరువులకు చేరుకోవచ్చన్న ఉద్దేశంతో చింతమనేని ఆ రహదారి నిర్మాణానికి పూనుకున్నారు. కోమటిలంక ప్రజల కోసం రహదారి వేస్తున్నానంటూ పైకి బిల్డప్‌ ఇస్తున్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన అటవీశాఖ సిబ్బందిపై దాడికి దిగడం వివాదాస్పదమైంది. చింతమనేని ప్రభాకర్‌ యంత్రాలను ఉపయోగించి ఆటపాక నుండి కోమటిలంకకు రహదారి నిర్మిస్తున్నట్లు ఫారెస్టు సిబ్బందికి ఉప్పందింది. శనివారం ఉదయం రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆయన, ‘నేను ప్రజల మనిషిని.. గ్రామానికి రోడ్డు వేస్తుంటే అడ్డుకుంటారా..’ అంటూ రంకెలు వేశారు. ‘రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటే సహించేది లేదు, మీకు చేతనైతే పోలీస్‌ కేసులు పెట్టుకోండి’ అని తెగేసి చెప్పడంతో సిబ్బంది కంగుతిన్నారు. చింతమనేనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న విషయం మాట్లాడటానికి ఇటు అటవీశాఖ, అటు పోలీస్‌ అధికారులు సుముఖంగా లేకపోవడం గమనార్హం. అయితే జిల్లా ఎస్‌పి విజరుకుమార్‌తో అటవీశాఖ ఉన్నతాధికారులు శనివారం రాత్రి వరకూ మంతనాలు జరిపారు. సిఎం నారా చంద్రబాబునాయుడు అండతోనే విప్‌ పదవిలో ఉన్న చింతమనేని ఇలా చెలరేగిపోతున్నారని వివిధ రాజకీయ పార్టీల నాయకులు వ్యాఖ్యానించారు.
  http://www.prajasakti.com/Content/1710572 ]

 5. Veera

  బెదిరింపులతోనే భూ సమీకరణ
  – 4,572 ఎకరాలకు చెక్కుల నిరాకరణ
  – ప్లాట్లు ఎక్కడిస్తారో తెలపాలని డిమాండ్‌
  – మళ్లీ సాగు దిశగా రాజధాని రైతులు
  – ఇవ్వకుంటే ‘సేకరణే’ అంటున్న అధికారులు
  http://www.prajasakti.com/Content/1710270

 6. Veera

  బా బొచ్చే జా బొచ్చే!!!
  బాబు వస్తే జాబు వస్తుందని వోట్లు వేయించుకొని ఇప్పుడు జాబులు ఇవ్వకపోతే ఎలా? షుమారుగా లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉన్న బాబు భర్తీ చేయడం లేదు
  -TDP MLA R క్రిష్నయ్య

 7. An act of defiance …
  It takes One Man to stand up against evil …no matter what the outcome is.
  80 years later ….
  World remembers Hitler as a Villain
  World hails Landmesser as a Hero .

  http://uk.businessinsider.com/the-lone-german-man-who-refused-to-give-hitler-the-nazi-salute-2015-6?r=US&IR=T

 8. Kula picchi tho kondharu ……..Rastranni
  Matham musugulo kondharu …..Desam ni brastupattisthunnaru.

  http://www.ndtv.com/delhi-news/anupam-khers-march-for-india-today-against-intolerance-protests-1241047?pfrom=home-lateststories

  Fanatism is evil and will ultimately destroy the state and the country.

 9. Veera

  రాయలసీమకు శ్రీబాగ్ ఒప్పందం నాటి నుంచి కూడా అన్యాయం జరుగుతోందని అన్నారు. ప్రత్యేకించి నీటి విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. అనంతపురంలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని కేంద్రం చెబితే దానిని మంగళగిరికి ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు వ్యవసాయం విశ్వ విద్యాలయం కూడా గుంటూరు జిల్లాలోనే ఏర్పాటు చేస్తున్నారని ఆయన అన్నారు.నవ నగరాలు అంటూ అన్నీ గుంటురు జిల్లాలోనే పెడితే మిగిలిన జిల్లాల పరిస్థితి ఏమిటి?
  -మైసూరా రెడ్డి

 10. Veera

  12 కోట్ల కర్నూల్ ప్రాజెక్ట్ ని 110 కోట్లకుTDP MP CM రమేష్ కు ఇచ్చిన నిప్పు బాస్
  గాలేరు నగరి ప్రాజెక్టుకు సంబందించి ఇరవైతొమ్మిదో ప్యాకేజీని టిడిపి ఎమ్.పి సి.ఎమ్.రమేష్ కు అప్పగించిన తీరు, దాని విలువ పెంచిన తీరు పై వస్తున్న కధనాలు ఆశ్చర్యంగానే ఉన్నాయి.

  కర్నూలు జిల్లాలోని గోరకల్లు రిజర్వాయిర్ నుంచి అవుకు రిజర్వాయిర్ వరకు మిగిలిన పోయిన పనుల విలువ పన్నెండు కోట్లు అయితే ,ఏకంగా 110 కోట్లకు టెండర్ పిలిచారట. దీనికి పరిపాలన అనుమతి కూడా లేదని చెబుతున్నారు. ఆ తర్వాత రెండు విడతల బిల్లు కూడా ముప్పై ఐదు కోట్ల మేర చెల్లించారట. ఇదంతా టిడిపి రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్. రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్టుకు దక్కిందని కధనాలు వస్తున్నాయి. దీనిపై మంత్రి దేవినేని ఉమ తనకు తెలియదని అంటున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.
  http://kommineni.info/articles/dailyarticles/content_20151107_26.php?p=1446881304603

 11. Veera

  వెయ్యిస్తున్నాం… వందివ్వలేరా???
  తెలుగు తమ్ముళ్ల ‘రాజధాని’ దందా..!
  – పింఛనుదారుల నుంచి రూ. 100 చొప్పున వసూలు
  – ఏలూరు నియోజకవర్గంలోనే రూ. 27 లక్షలు
  – స్కూళ్లూ, కాలేజీల విదార్థులపెనా ఒత్తిడి
  ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గానికి చెందిన పిట్టా సీతమ్మకు పిల్లలు లేరు. వృద్ధాప్యంతో వేరే పని చేయలేదు. వచ్చే వెయ్యి రూపాయల పింఛనుతోనే నెలంతా గడవాలి. అటువంటిది షెడ్డు నిర్మాణం, రాజధాని పేరుతో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొందరు బలవంతంగా ఆమె నుండి మొత్తం రూ. 200 లాగేసుకున్నారు. ఇదేమని అడిగితే ‘రూ. వెయ్యి పింఛన్‌ ఇస్తున్నాం. రాజధాని ఫండ్‌కు రూ. 100 ఇవ్వలేరా’ అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. మరో వృద్ధురాలు భవిరెడ్డి చిన్నమ్మ పరిస్థితీ అంతే. ఆదుకోవాల్సిన వారే నిలువుదోపిడీ చేస్తుండడంతో వారు ఎవరికి చెప్పుకోవాలో తెలీక కన్నీరుమున్నీరవుతున్నా రు. రాజధాని ఫండ్‌ పేరుతో పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి నాయకులు పెద్ద ఎత్తున దందాకు తెరలేపిన ఫలితమిది. ఒక్క ఏలూరు నియోజకవర్గంలోనే పింఛనుదారుల నుంచి సుమారు రూ. 27 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.
  పింఛను డబ్బులతో బతికే వృద్ధులను, వికలాంగులను, చివరికి విద్యార్థులను సైతం వదిలిపెట్టడం లేదు. ఫండ్‌ పేరిట వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఏలూరు నియోజకవర్గంలో 26,968 మంది వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు పంపిణీ జరుగుతోంది. పింఛన్లు బట్వాడా చేసే ప్రాంతానికి స్థానిక టిడిపి నాయకులు వెళ్లి కూర్చుంటున్నారు. పింఛనుదారులు డబ్బు అందుకోగానే అందులోంచి రూ. వంద తీసేసుకుంటున్నారు. ఇదేమని అడిగితే ‘రూ. వెయ్యి పింఛన్‌ ఇస్తున్నాం. రాజధాని ఫండ్‌కు రూ. 100 ఇవ్వలేరా’ అంటూ ఎదురుదాడికి దిగుతున్నారని, గట్టిగా మాట్లాడితే వచ్చేనెల నుంచి పింఛను రాదని బెదిరిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నియోజకవర్గంలో ఇప్పటికే కొనసాగుతున్న ఈ వసూళ్ల పర్వాన్ని వచ్చే నెల నుంచీ జిల్లావ్యాప్తంగా అమలు చేయాలని టిడిపి నాయకులు యోచిస్తున్నట్లు సమాచారం. ఒకపక్క రాజధాని నిర్మాణం పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మరోపక్క పింఛనుదారుల నుంచి రాజధాని ఫండ్‌ వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
  http://www.prajasakti.com/Content/1709978

 12. Veera

  బాబు పాలనలో మిగితా కులాలు, ప్రాంతాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి
  అన్నీ విజయవాడ లో పెట్టడం , ఒక వర్గానికే అధిక ప్రాదాన్యత వలన ఇలాంటి విద్వేషాలు వస్తున్నాయి-APCC చీఫ్ రఘువీరారెడ్డి యాదవ్
  రాయలసీమ, ఉత్తరాంధ్ర కు తీరని అన్యాయం చేస్తున్న బాబు-C రామచంద్రయ్య
  అభివృద్ధి అంతా అమరావతి లో పెట్టడం తప్పు, సీమ, ఉత్తరాంధ్ర కు న్యాయం చేయాలి.బాబు వచ్చాక కుల రాజకేయలు ఎక్కువయ్యాయి -లోక్ సత్తా JP

 13. Veera

  సోము వీర్రాజు ఒక ఏక లింగం ,కేంద్రం ఇచ్చే డబ్బులకు రాష్ట్రం లెక్కలు చెప్పక్కర్లేదు
  -TDP విజయవాడ MLA బోండా ఉమా
  లెక్కలు చెబితే మనం ఎంత నొక్కింది తెలిసిపోతుంది కదా!!!
  (నీవు ఎంత రెచ్చిపోయినా కాపు కోటాలో నీకు మంత్రి పదవి రాదు ఉమా.
  నీలాగే ఎగెరిగిరిపడ్డ రవ్వంత రెడ్డి పరిస్థితి చూడు ముందు
  కాపు నాయకుడు వీర్రాజు ని తిట్టడానికి ఇంకో కాపు నాయకుణ్ణి ఉపయోగించుకునే బాబు గురించి తెలుసుకో )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s