అవినీతి రాజ్..!

‘బాబు జ‌మానా- అవినీతి ఖ‌జానా’ అన్న‌ది ఒక‌నాటి బాబు పాల‌న‌లో సాగిన అవినీతిపై అప్ప‌ట్లో మార్క్సిస్టులు ముద్రించిన పుస్త‌కం. అంతేకాదు చంద్ర‌బాబు అవినీతి భాగోతాల‌పై అప్ప‌ట్లో బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న బండారు దత్తాత్రేయ ‘శ‌త లేఖాస్త్రం’ సంధించారు. వాటిని ముద్రించిన ఆపార్టీ ఊరూవాడం పంచింది. బీజేపీ అధికారంలోకి వ‌స్తే చంద్ర‌బాబు జైలుకి వెళ‌తార‌ని వెంక‌య్య స‌హా నేత‌లంద‌రూ మాట్లాడారు. అదంతా చ‌రిత్ర‌..ఇక వ‌ర్త‌మానంలోకి వ‌స్తే ఇప్పుడు కూడా చంద్ర‌బాబు పాల‌న‌పై ‘అవినీతి రాజ్’ అంటూ అంద‌రూ గొంతెత్తుతున్నారు. మిత్ర‌ప‌క్షం బీజేపీ నేత‌లు కూడా మాట్లాడుతున్నారు. ఇసుక ర్యాంపుల్లో సాగుతున్న వ్య‌వ‌హారంలో ప్ర‌తీ లోడు చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే సాగుతుంద‌ని బీజేపీ ఎంపీ గోక‌రాజు ఆరోపించారు. ఇక కావూరి, కన్నా లాంటి వార‌యితే అనేక ఆరోప‌ణ‌లు సంధించారు.

వైఎస్సార్సీపీ, క‌మ్యూనిస్టులు, రాజ‌కీయాల‌తో సంబంధం లేని ప‌లువురు నేత‌లు, మాజీ ఐఏఎస్ అధికారులు సైతం ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శ‌ర్మ చంద్ర‌బాబు ప్ర‌భుత్వ భూకేటాయింపుల‌పై హైకోర్టుకి వెళ్లారు. అడ్డ‌గోలుగా అత్యంత ఖ‌రీదైన ప్ర‌భుత్వ భూముల‌ను బంధువుల‌కు క‌ట్ట‌బెడుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి భాగోతాలు అడ్డుకోవాల‌ని ఆయ‌న కోర్టును వేడుకున్నారు. ఇక ఉండ‌వ‌ల్లి అరుణ్ క‌మార్ లాంటి వాళ్ల‌యితే ప‌ట్టిసీమ ప్రాజెక్ట్ అస‌లు గుట్టుర‌ట్టు చేస్తామంటూ స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం సాయంతో ముందుకెళుతున్నారు. మొత్తంగా ఎటుచూసినా అవినీతి భాగోతాల ప‌రంప‌రం నిత్యం వెలుగులోకి వ‌స్తోంది. అంద‌రినీ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

వీట‌న్నంటికీ మించి భూసేక‌ర‌ణ పేరుతో, మైనింగ్ భాగోతంలో సాగుతున్న భారీ వ్య‌వ‌హారాలు కూడా దుమారం రేపుతున్నాయి. ర‌స్ ఆల్ ఖైమా కోసం గిరిజ‌నుల జీవితాలు బ‌లిపెడుతూ బాక్సైట్ త‌వ్వ‌కాల‌కు అనుమ‌తిచ్చిన‌తీరును ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అభ్యంత‌రం చెప్పడం గ‌మ‌నార్హం. గిరిజ‌నుల‌ను నిరాశ్ర‌యులు చేయ‌డం త‌గ‌దంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు బాక్సైట్ త‌వ్వ‌కాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించిన చంద్ర‌బాబు ఇప్పుడే అదే బాక్సైట్ కోసం ముందుకెళ్ల‌డం వెనుక భారీ కార్పోరేట్ వ్య‌వ‌హారం ఉంద‌న్న అనుమానాలు వ‌స్తున్నాయి. ప‌లువురు బ‌హిరంగంగానే చంద్ర‌బాబు అవినీతే దానికి మూలం అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అది కాకుండా తూర్పు గోదావ‌రి జిల్లా వంతాడ‌లో సాగుత‌న్న మైనింగ్ పై ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. మైనింగ్ వ‌ద్ద‌కు వెళ్లి మ‌రీ వాటిని అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు నిర‌భ్యంత‌రంగా ఆ వ్య‌వ‌హారం సాగిపోతుండ‌డం వెనుక అస‌లు వ్య‌వ‌హార చేతులు మారిని అవినీతే అన్న‌ది అంద‌రూ అంగీక‌రిస్తున్న స‌త్యం. ఇక ఇసుక ఎన్నివేల కోట్ల మాఫియాగా మారిందో లెక్క‌లు కూడా క‌ష్ట‌మే. ఒక ప‌శ్చిమ గోదావ‌రి జి్ల్లా నుంచే రోజుకి కోటి రూపాయ‌లు చొప్పున ఓ బాబుగారు వ‌సూల్ చేస్తుండ‌డం దానికి అద్దంప‌డుతుంది. కోర్టులు క‌న్నెర్ర చేసినా ఆగ‌ని తంతు ఇసుక రేవుల్లో అధికారుల‌పై దాడుల‌కు దిగి మ‌రీ సాగిస్తున్నారు.

ఇక పోర్టులు, ఎయిర్ పోర్టులు, రాజ‌ధాని పేర‌టి సాగుతున్న భూసేక‌ర‌ణ వెనుక కూడా పెద్ద అవినీతి వ్య‌వ‌హార‌మే ఉంద‌న్న‌ది ప్ర‌తిప‌క్షాలు నిత్యం చేస్తున్న ఆరోప‌ణలు. అందుకు త‌గ్గ‌ట్టుగానే అధికర పార్టీ అత్యంత గోప్యంగా ఈ వ్య‌వ‌హారాలు సాగించ‌డం ఆ అనుమానాలను బ‌ల‌ప‌రుస్తోంది. సింగ‌పూర్ ప్ర‌భుత్వంతో చంద్ర‌బాబు చేసుకున్న ఎంవోయూ ఇప్ప‌టికీ బ‌హిరంగప‌ర‌చ‌క‌పోవ‌డం ఏవిధంగా ప్ర‌జాస్వామ్యం అంటే స‌మాధానం లేని ప‌రిస్థితి ఉంది. ఇలాంటి అనేక వ్య‌వ‌హారాలు ఇప్పుడు ఏపీలో ద‌ర్జాగా సాగిపోతున్నాయి.చంద్ర‌బాబు పాల‌న‌లో అవినీతి అడ్డూ అదుపులేకుండా సాగుతుంద‌న్న ఆరోప‌ణ‌ల‌ను నిజం చేస్తున్నాయి. గ‌ల్లా కుటుంబానికి పంపిణీ చేసిన భూముల నుంచి త‌న సామాజిక‌వ‌ర్గానికే చెందిన విశ్వేశ్వ‌రావు న‌వ‌యుగ కంపెనీకి బంద‌రు పోర్టును, సోమా కంపెనీకి బెజ‌వాడ ఫ్లై ఓవ‌ర్ ను క‌ట్ట‌బెట్ట‌డంలో కూడా ప్ర‌భుత్వం సంత‌ర్ప‌ణ సాగిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంద‌న్న‌ది ప‌లువురి వాద‌న‌. మొత్తంగా ఏపీలో ఇప్పుడు సాగుతున్న వ్య‌వ‌హారాలు మ‌ళ్లీ పాత‌ రోజులను గుర్తుచేస్తున్నాయి. చంద్ర‌బాబు పాల‌న‌లో ఏవిధ‌మైన మార్పులు లేవ‌న్న సంకేతాలిస్తోంది.

http://updateap.com/corruption-in-ap-government-is-very-high/

14 Comments

Filed under Uncategorized

14 responses to “అవినీతి రాజ్..!

 1. Veera

  చూడప్పా సిద్దప్పా.. ఉంటే రాజకీయాల్లో ఉండు, లేకపోతే సినిమాలు చేసుకో
  గబ్బర్‌ సింగ్‌ లా బయలుదేరి సిద్దప్పలా వెనక్కి వస్తున్నావు
  రాజకీయ నాయకులపై ప్రజలకు ఉన్న చులకనభావాన్ని పవన్‌కల్యాణ్ మరింత పెంచుతున్నారు
  ఆయన ఎవరి తరఫున ప్రశ్నిస్తున్నాడో అర్ధం కాకుండా ఉందన్నారు. ప్రశ్నించడమంటే చంద్రబాబునాయుడు చెప్పిన జవాబులు బయట చెబితే ఉపయోగమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబుకు గెస్ట్‌గా ఉండకూడదని, గెస్టు ఆర్టిస్టులా అప్పుడప్పుడు కనిపించి ఏవో డైలాగులు చెబితే ఏమి లాభమని, ప్రజలను తప్పుతోవ పట్టించడమేనని ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులపై ప్రజలకు ఉన్న చులకనభావాన్ని పవన్‌కల్యాణ్ మరింత పెంచుతున్నార‌న్నారు. .

  ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ లేదు, ఇవ్వకపోతే చూద్దాం అంటున్నారని , ఇప్పటికే మూడోవంతు పాలన కాలం ముగిసి పొయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప‌వ‌న్ లో మార్పురాక‌పోతే జ‌న‌మే మారుస్తారంటూ వ్యాఖ్య‌లు చేశారు.

  చంద్రబాబునాయుడు రాయలసీమకు వెళ్లి తాను రాయలసీమ బిడ్డనని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. అమరావతి చుట్టూ 21 నగరాలు నిర్మిస్తామని చెబుతున్నారని, అసలు అమరావతి పట్టణాన్ని ఇంతవరకూ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఆయన కట్టబోయే రాజధాని స్టేట్ స్పాన్సర్డ్ సింగపూర్ వెంచర్ అని రవి ఎద్దేవా చేశారు.

  -ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి

 2. Veera

  ముద్రగడ ఉద్యమానికి పెరుగుతున్న కాపుల మద్దతు
  తీవ్ర అసంత్రుప్తిలో కాపు ఉద్యోగులు, ప్రభుత్వం లో వివక్ష అని ఆవేదన
  [ముద్రగడ ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు
  క్యూ కడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు
  జనవరి 31న భారీ బహిరంగ సభకు సన్నాహాలు
  రాజమండ్రి, నవంబర్ 14: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్టుగా కాపులను బిసిల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఆందోళనకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి కాపు సామాజికవర్గం నుండి తిరుగులేని మద్దతు లభించటం ఒకఎత్తయితే, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల నుండి లభిస్తున్న మద్దతు మరొక ఎత్తుగా కనిపిస్తోం ది.
  2004కు ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తమ పరిస్థితి ఎలా ఉందో, ఇపుడు మళ్లీ అలాంటి పరిస్థితిని కార్యాలయాల్లో ఎదుర్కొంటున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్న కాపు సామాజికవర్గానికి చెందిన ఉద్యోగులు, అధికారులు ముద్రగడ చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు.
  రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుండి ప్రతి రోజు అధిక సంఖ్యలో కాపు సామాజికవర్గానికి చెందిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికొచ్చి మద్దతు తెలుపుతున్న సంగతి విదితమే. అయితే ఇపుడు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు వివిధ జిల్లాల నుండి సామాన్య వ్యక్తులు మాదిరిగా వచ్చి ముద్రగడను కలిసి తమ మద్దతు తెలుపుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా వివిధ జిల్లాల నుండి వచ్చి ముద్రగడను కలిసి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
  మరోపక్క అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ముద్రగడకు మద్దతు పలుకుతున్నారు. వైసిపి, కాంగ్రెస్ పార్టీల్లోని కార్యకర్తలు, నాయకులు ముద్రగడను కలిసి మద్దతును తెలుపుతుంటే, ‘దేశం’ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మద్దతు తెలుపుతున్నారు.
  వైసిపి ముఖ్యనాయకుడు అంబ టి రాంబాబు కిర్లంపూడి వెళ్లి ముద్రగడతో ప్రత్యేకంగా సమావేశమైన అనంతరం ఆ పార్టీకి చెందిన కాపు సామాజికవర్గం నాయకులు, కార్యకర్తలు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు.
  జనవరి 31న
  బహిరంగ సభకు సన్నాహాలు
  కాపులను బిసిల్లో చేర్చాలన్న నినాదంతో జనవరి 31న తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం-తుని మధ్యలో నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు ఇప్పటి నుండే కాపు సంఘాలు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఇంతకు ముందు అంచనా ప్రకారం 5లక్షల మంది సభకు హాజరవుతారని కాపు సంఘాలు అంచనావేసినప్పటికీ, పరిస్థితి చూస్తుంటే 10 లక్షలు దాటిపోయేలా ఉంది. దాంతో వంద ఎకరాల్లో సభను నిర్వహించాలని ముద్రగడతోపాటు, కాపు సంఘాల నాయకులు నిర్ణయించారు. ఇప్పటికే బహిరంగ సభకు అవసరమైన వంద ఎకరాల స్థలాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. అన్ని జిల్లాల నుండి అధిక సంఖ్యలో జనాన్ని సమీకరించటం ద్వారా సభను విజయవంతం చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని కాపు సంఘాలు ఏకమవుతున్నాయి.
  http://www.andhrabhoomi.net/content/mudragada ]

 3. Veera

  బాబు వస్తే జాబు ఎక్కడ ?TDP యువత రాష్ట్ర అధ్యక్షులు బీద రవిచంద్ర యాదవ్‌
  -వర్గీకరణ ఎప్పుడు?
  -మేధోమథనంలో నిలదీత
  -సిఎం అసహనం
  -చిత్తూరు ఎంపి అసంతృప్తి
  ‘బాబు వస్తే జాబ్‌ గ్యారంటీ అనే నినాదంతో యువతను ఆకట్టుకున్నాం.. వారి వద్ద ఓట్లు వేయిం చుకున్నాం.. తీరా అధికారంలోకి వచ్చాక ఉపాధి చూపలేదన్న అసంతృప్తి నిరుద్యోగుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి’ అంటూ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు బీద రవిచంద్ర యాదవ్‌ ముఖ్యమంత్రిని నిలదీశారు.
  దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు ‘మీతో వచ్చింది ఇదే.. చేసింది చెప్పండి.. చెయ్యంది చేస్తామని చెప్పండి.. అంతేగాని మీరే ఇలా మాట్లాడితే ప్రజల్లో అసంతృప్తి రాదా’ అంటూ అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

  http://www.prajasakti.com/Content/1713386

 4. Veera

  తుగ్లక్ బాబు పాలన పై అశోక్ గజపతి రాజు ….
  [బాబుకి షాకిచ్చిన కేంధ్ర‌మంత్రి
  చంద్ర‌బాబుకి కేంధ్ర‌మంతి అశోక్ గ‌జ‌ప‌తిరాజు షాకిచ్చారు. జిల్లాకో విమ‌నాశ్ర‌యం ఒట్టి దండ‌గేన‌ని తేల్చేశారు. ఇప్ప‌టికే ఉన్న ఎయిర్ పోర్టుల‌కే ప్ర‌యాణీకులు లేక వెల‌వెల‌బోతుంటే కొత్త‌వి అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించారు. ప్రజల డబ్బును ఎయిర్‌పోర్టు పేరుతో దుర్వినియోగం చేయడం త‌గ‌ద‌న్నారు. అలాంటి ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని ప్ర‌భుత్వానికి నేరుగా సూచించ‌డం విశేషం.

  తిరుపతి మేధోమథన సదస్సు సంద‌ర్భంగా మీడి యాతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. తిరుపతికి అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయి లేదని, ప్రయాణికులు లేక వెలవెలబోతోం దన్నారు. చెన్నై నుంచి తిరుపతికి రావాల్సిన ప్రయాణికుడు ఎయిర్‌పోర్టుకు వెళ్లి లగేజి చెక్‌చేసుకుని ప్రయాణిస్తే మూడు గంటల సమయం పడుతుందని, కారులో రెండు గంటల సమయంలో తిరుపతికి చేరుకోవచ్చని అన్నారు. కడపలో నిర్మించిన విమానాశ్రయం వృథాగా ఉందన్నారు. కుప్పంలో ప్రకటించిన విమానాశ్రయం వ‌ల్ల ‘ప్రజాధనం వృథాయే తప్ప ప్రయోజనం లేదు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

  http://updateap.com/shok-gajapathi-raju-opposed-chandrababu-airport-proposals/ ]

 5. Veera

  గ్రంథాలయ సంస్థ స్థల వ్యవహారంపై విశాఖలో సిఎంకు భారీ కటౌట్‌ లేఖ
  – ప్రముఖుల సంతకాల సేకరణ
  ప్రజాశక్తి – విశాఖపట్నం ప్రతినిధి
  మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ‘ప్రత్యూష’ సంస్థతో కుదిరిన ఒప్పందం రద్దయినప్పటికీ, నేటికీ ఆ స్థలాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థకు అప్పగించకపోవడాన్ని నిరసిస్తూ శనివారం విశాఖలో పౌరగ్రంథాలయ సేవా సమితి ఆధ్వర్యాన ముఖ్యమంత్రికి బహిరంగ భారీ కటౌట్‌ లేఖ విడుదల చేశారు. కటౌట్‌ లేఖపై ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు, ఎయు మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కెవి రమణ, ప్రొఫెసర్‌ కెఎస్‌ చలం, ప్రజాస్పందన నేత సిఎస్‌ రావు, పౌర గ్రంథాలయ సేవా సమితి నాయకులు బిఎల్‌ నారాయణ, పీపుల్‌ ఫర్‌ ఇండియా నేత బిబి గణేష్‌, నగర ప్రముఖులు బహిరంగ లేఖపై సంతకాలు చేశారు. ప్రత్యూష సంస్థతో చేసుకున్న ఒప్పందం అనైతికతను వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌. నర్సింగరావు ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

  http://www.prajasakti.com/Content/1713349

 6. Religious and Caste fanatism is evil and will only result in destruction or fellow human beings …..

  http://www.dailymail.co.uk/news/article-3317776/Paris-attack-sees-150-dead-Eagles-Death-Metal-concert-hostages-killed.html

  Those crooks who talk only about caste in AP ………will they support this massacre ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s