డీజీపీ ప‌ద‌వీకాలం పొడిగింపు..!?

డిజిపి జెవి రాముడు ప‌ద‌వీ కాలాన్ని పొడింగించ‌బోతున్నట్టు స‌మాచారం. రిటైర్మెంట్‌కు అతి సమీపంలో ఉన్న ఆయన్ని చంద్రబాబు సర్కారు విభజనాంతర ఏపీకి తొలి డిజిపిగా గతేడాది నియమించింది. డిజిపిగా నియమితులైన అధికారి వాస్తవ రిటైర్మెంట్‌తో సంబంధం లేకుండా నియమించిన తేదీ నుంచి రెండేళ్లు ఆ స్థానంలో కొనసాగాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆ వెసులుబాటుతో రాముడు 2016 జులై వరకు డిజిపిగా కొనసాగే అవకాశముంది ఆ తర్వాత కూడా మరో ఏడాది రాముడిని డిజిపిగా కొనసాగించేందుకు సర్కారు సూచనపాయంగా సమ్మతి తెలిపినట్లు సమాచారం.

ముఖ్యమంత్రికి ఉన్న విశేషాధికారాలతో రాముడి పదవి కాలాన్ని ఇంకో ఏడాది పొడగించనున్నట్లు పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి. పదవీకాలం పొడిగిస్తే 2017 జులై వరకు రాముడే డిజిపిగా కొనసాగుతారు. ఆయన నియామక సమయంలోనే సీనియర్‌ అధికారుల్లో అసంతృప్తి వెల్లడైంది. రాముడు 1981 ఐపిఎస్‌ బ్యాచికి చెందిన వారు కాగా ఆయన కంటే ముందు 1979 ఐపిఎస్‌ బ్యాచికి చెందిన అశోక్‌ ప్రసాద్‌, ఎస్‌ఎ హుదా ఇంకా సర్వీసులో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం మాత్రం రాముడి వైపే మొగ్గు చూపింది.

హోంశాఖ ముఖ్యకార్యదర్శి పోస్టు భ‌ర్తీని కూడా సిఎం పెండింగ్‌లో పెట్టారు. ఐఎఎస్‌ అయిన పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ మన్మో హన్‌సింగ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎపి కేడర్‌లో డిజిపి హోదా కలిగిన అధికారుల్లో అశోక్‌ ప్రసాద్‌ను మినహాయిస్తే హుదా, ఎస్‌వి రమణ మూర్తి ఇద్దరే ఉన్నారు. వీరిలో ఒకరిని హోం ముఖ్య కార్యదర్శిగా నియమించడానికి అవకాశం ఉన్నా సిఎం ఆ వైపు ఆలోచించలేదు.

రాముడి తర్వాత రమణమూర్తి, ప్రస్తుతం అదనపు డిజిపిగా ఉన్న ఆర్టీసి ఎమ్‌డి ఎన్‌ సాంబశివరావు డిజిపి రేసులో ఉన్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం, ఇద్దరూ సిఎంకు సన్నిహితులు కావడంతో ఎవరినీ హోం ముఖ్యకార్యదర్శిగా నియమించకుండా వేచి చూసే ధోరణిలో సిఎం ఉన్నట్లు చెబుతున్నారు. డీజీపీ ప‌ద‌వీకాలం పొడిగింపు నిర్ణ‌యం వెలువ‌డిన త‌ర్వాత హాం శాఖ కార్య‌ద‌ర్శిపై దృష్టిపెట్టే అవకాశ‌ముందంటున్నారు.

http://updateap.com/ap-dgp-ramudu-will-continue-for-another-one-year/

8 Comments

Filed under Uncategorized

8 responses to “డీజీపీ ప‌ద‌వీకాలం పొడిగింపు..!?

  1. Veera

    నిప్పు పాలనలో 845 చీకటి జీవోలు-దోచుకో సింగపూర్ లో దాచుకో !!!
    [చీక‌టి జీవోలు
    – రాష్ట్రంలో ‘రహస్య’ పాలన
    – పదిహేడు నెలల్లో 845 కాన్ఫిడెన్షియల్‌ జీవోలు
    – సిఎం పర్యవేక్షణలోని జిఎడి టాప్‌
    – తర్వాత రెవెన్యూ, హోం, ఫైనాన్స్‌ తదితరాలు
    – పారదర్శకతకు పాతర
    – బాక్సైట్‌ నేపథ్యంలో చర్చ
    ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
    ఆంధ్రప్రదేశ్‌లో ‘రహస్య’ పాలన సాగుతోంది. పారదర్శకంగా ఉండాల్సిన సర్కారు ఉత్తర్వులు ‘రహస్య’ జాబితాలో చేరి పోతున్నాయి. ప్రభుత్వ సమాచారం, జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆన్‌లైన్‌లో జీవోలు పెట్టాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. కొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి జారీ చేశామంటున్న జీవోల పక్కన ‘కాన్ఫిడెన్షియల్‌’ అని కనబడుతుంది. ఫైల్‌పై క్లిక్‌ చేస్తే తెల్లగా ఉంటుంది తప్ప వివరాలుండవు. జీవో నెంబర్‌, జారీ చేసిన తేదీ మాత్రం ఉంటుంది. పారదర్శకతకు మారు పేరుగా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో తనకు సాటి రాగలవారెవరూ లేరని తరుచు ప్రకటించే చంద్రబాబు సర్కారులోనే ‘కాన్ఫిడెన్షియల్‌’ జీవోలు పెద్ద సంఖ్యలో వెలువడుతున్నాయి. గవర్నమెంట్‌ ఆర్డర్ల దాపరికంపై అనుమానాలు రేకేత్తు తున్నాయి. చాటు మాటున ప్రభుత్వ వ్యవహారాలు చక్కబెట్టేందుకే పారదర్శకతకు పాతరేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.

    రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం సర్కారు ఎపిలో అధికారంలోకొచ్చిన 2014 జూన్‌ 2 నుండి 2015 నవంబర్‌ 18 సాయంత్రం ఐదు గంటల మధ్య మొత్తంగా 31,477 జీవోలు జారీ కాగా వాటిలో 845 కాన్ఫిడెన్షియల్‌. సుమారు పదిహేడు మాసాల పాలనలో వందల సంఖ్యలో ‘రహస్య’ జీవోలొచ్చాయి.

    సచివాలయంలో జీవోలు వెలువరిస్తున్న మొత్తం ప్రభుత్వ విభాగాలు 39 కాగా అందులో 14 శాఖల నుంచి కాన్ఫిడెన్షియల్‌ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అత్యధిక రహస్య జీవోలిస్తున్నది సాధారణ పరిపాలన శాఖ (జిఎడి). ఆ శాఖ ఇప్పటి వరకు 552 కాన్ఫిడెన్షియల్‌ జీవోలిచ్చి అగ్ర స్థానంలో ఉంది. విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ ఇటీవల వెలువరించిన జీవోపై గిరిజనులతో పాటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచే కాకుండా స్వపక్షం నుంచీ నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. వెనక్కు తగ్గిన ముఖ్యమంత్రి ఆ జీవో తనకు, సంబంధిత మంత్రికి తెలీకుండా వచ్చిందన్నారు. కొంత మంది మంత్రులు సైతం సిఎం పాటకు పల్లవి పాడారు. అధికారులే జీవో ఇచ్చేశారని చేతులు దులుపుకున్నారు. కాగా ‘రహస్య’ జీవోలివ్వడంలో మొదటి స్థానంలో ఉన్న జిఎడి స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే ఉంటుంది. చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న విభాగం నుంచే ఇబ్బడిముబ్బడిగా కాన్షిడెన్షియల్‌ జీవోలు వస్తున్నాయి. జిఎడి తర్వాత రెండో స్థానంలో రెవెన్యూ శాఖ ఉంది. ఆ విభాగం నుంచి ఇప్పటి వరకు 104 ‘రహస్య’ ఉత్తర్వులొచ్చాయి. రెవెన్యూలో అవినీతి, అలసత్వం పెరిగిపోయిందని, ప్రక్షాళన చేయాలని సిఎం చెబుతున్నారు. కాన్ఫిడెన్షియల్‌ జీవోలివ్వడంలో రెవెన్యూ కంటే సిఎం పర్యవేక్షణలోని జిఎడి ఎంతో ముందుంది. వరుసగా హోం, ఆర్థిక, వ్యవసాయ, పంచాయితీరాజ్‌ శాఖలు రెండంకెల్లో ‘రహస్య’ ఆర్డర్లు ఇచ్చాయి

    http://www.prajasakti.com/Content/1715664%5D

  2. Veera

    కోర్టులో బాబుకు న‌ల్ల‌మొఖం
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమ‌రావ‌తి పేరుతో ఊహాలోకంలో ఊరిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు షాక్ త‌గిలింది. అమ‌రావ‌తి నిర్మాణం పేరుతో అద‌ర‌గొడుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) స్ప‌ష్టం చేసింది. ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేకున్నా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు త‌మ‌కే అబ‌ద్దం చెపుతారా అంటూ ట్రిబ్యున‌ల్ మండిప‌డింది. బాబు స‌ర్కారు త‌న‌ నంగ‌నాచి త‌నంతో కోర్టు సాక్షిగా మ‌రో మారు అబ‌ద్దంలో దొరికిపోవ‌డం గ‌మ‌నార్హం.

    అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సంద‌ర్భంగా అనుమ‌తులు రాకున్నా హ‌డావుడిగా శంకుస్థాప‌నకు సిద్ధ‌ప‌డారు. ఈ మేర‌కు ప‌లువురు రైతులు, ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. దీనిపై గ‌తంలో ఒక ద‌ఫా వాయిదాలు విని కోర్టు దిక్కార‌ణ కింద ఏపీ స‌ర్కారుకు అక్షింత‌లు వేసి వివ‌రాలు తేవాల‌ని ట్రిబ్యున‌ల్ ఆదేశాలు ఇచ్చింది. ఏపీ ప్ర‌భుత్వం త‌న‌ వాద‌నను చెప్పే అవ‌కాశం ఇవ్వ‌గా గతంలో ఎన్జీటీ జారీ చేసిన కోర్టు ధిక్కారణ నోటీసులపై ఏపీ ప్రభుత్వం, సీఆర్ డీఏ, పర్యావరణశాఖ స్పందించాయి. రైతుల కోరిక మేరకే భూమి చదును, పంటల తొలగింపు కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారని ఈ కౌంటర్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. పర్యావరణ అనుమతులు ఉన్నాయని గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు తెలిపింది.

    అయితే ఏపీ ప్ర‌భుత్వ అడ్డ‌గోలు అబ‌ద్దాల‌పై ట్రిబ్యున‌ల్ నిప్పులు చెరిగింది. అనుమ‌తులు లేనిదే ప‌నులు ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నించింది. రైతులు అంగీక‌రించ‌లేద‌నే విష‌యం త‌మ‌కు తెలుస‌ని స్ప‌ష్టం చేసింది. ఈక్ర‌మంలోనూ ఏపీ స‌ర్కారు అబ‌ద్దం ఆడింది. అమ‌రావ‌తి ప్ర‌స్తుత ప‌రిస్థితి నిర్మాణం కిందికి రాదని కేవలం శంకుస్థాపన మాత్రమే జరిగిందని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పూర్తిస్థాయి ఆర్డర్‌ కాపీ లేనందున పర్యావరణ అనుమతులు ఉన్నట్లు అక్టోబర్‌9న కోర్టుకు తెలపలేకపోయామని ఏపీ సర్కార్‌ తెలిపింది. ప్ర‌తి ద‌శ‌లోనూ ఇదే మాట చెప్తున్నార‌ని మండిప‌డిన ట్రిబ్యున‌ల్ పూర్తి వివ‌రాల‌తో రావాల‌ని పేర్కొంటూ విచారణ డిసెంబర్‌ 9కి వాయిదా వేసింది.
    http://madeintg.com/bad-experiance-in-court-babu/

  3. Veera

    బాబు మొఖంపై మోడీ మట్టి కొట్టారు.బాబు,పవన్ నాటకాలు ఆడుతున్నారు.
    ఆపరేషన్ సక్సెస్ ,పేషెంట్ డైడ్ అన్న చందంగా రాజదానిపై బాబు పని తీరు ఉంది.ప్రత్యేక హోదా విషయంలో బిజెపి నేరుగా మోసం చేస్తుంటే, చంద్రబాబు పరోక్షంగా మోసం చేస్తున్నారు
    -CPI నారాయణ చౌదరి

    ప్యాకేజీల్లో కమీషన్లకు బాబు ఆసక్తి : లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు సురేంద్రశ్రీవాత్సవ
    ప్రత్యేక హోదా సాధించాలనే చిత్తశుద్ధి సిఎంకు లేదని, ప్యాకేజీలు తీసుకుని అందులో కమీషన్లు దండుకునేందుకు సిఎం ఆసక్తి చూపుతున్నారని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు సురేంద్రశ్రీవాత్సవ విమర్శించారు
    సిఎం రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా తన కుమారుడు లోకేష్‌ వృద్ధి కోసం కష్టపడుతున్నారని విమర్శించారు
    రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కొరవడిందని, లిక్కర్‌, ఇసుక, ల్యాండ్‌ మాఫియా అధికారం చెలాయిస్తోందన్నారు.

  4. Veera

    లెగ్గు బాబూ లెగ్గు!!! ధర్మవరపు సుబ్రహమణ్యం డైలాగ్
    అవును ఆయనే రావాలి (మొన్నటిదాకా అనావృష్టి నేడు అతివృష్టి)
    వర్షాలకు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం

    [గోరుచుట్టుపై రోకటి పోటులా నిన్నటివరకు అనావృష్టితో బాధపడిన రాష్ట్ర్ర ప్రజలకు నేడు అతివృష్టి దెబ్బతీసింది. అల్పపీడనం ప్రభావం వల్ల గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ఈ వర్షాలు ఆపార నష్టాన్ని కలిగించాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఊరు యేరూ ఏకమయ్యాయి. స్వర్ణముఖి, కాళంగి, కైవల్య, పంబలేరు కట్టలు తెంచుకు ప్రవహించడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వందలాది గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. చెరువులకు గండ్లు, రోడ్లు, రైలు మార్గాలు కోతకు గురికావడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వర్ష బీభత్సాలకి ఇంతవరకు 13 మంది చనిపోయారు.

    నాలుగు లక్షలకుపైగా హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మొన్నటివరకు అనావృష్టి, ఇప్పుడీ అతి వృష్టి రాయలసీమ రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. వేలాది ఎకరాల్లో వరి, మొక్క జోన్న, పత్తి, పెసర, టమాటో, ఉల్లి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

    ఉభయగోదావది జిల్లాల్లోనూ వరి పంట నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు కూడు, గూడు కరువై నానా అవస్థలు పడుతున్నారు. ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. పరిస్థితి తీవ్రతకు తగినట్టుగా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లేదు. అల్ప పీడనం తీవ్రత గురించి వాతావరణ పరిశోధన కేంద్రం ముందుగానే హెచ్చరించినా నష్ట నివారణ చర్యలు సరిగా చేపట్టలేదు. ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి వుంటే నష్టం ఇంతగా వుండేది కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ప్రభుత్వానికి అలవాటైపోయింది.
    http://www.prajasakti.com/EditorialPage/1714957 ]

  5. This is very well organised yellow Mafia that came up with the plan of opening as many news channels as possible before the last elections and flooding the Public with false information.
    All these discussions happen in the caste fanatic garden parties.

    How are these people different from ISIS ?
    ISIS don’t rob people .

    One thing for sure is that they will rot in hell for their sins.

    The 95% Public in AP need to be woken up soon.

  6. Veera

    బాబు అను కుల పచ్చ పాత చానళ్ళకు సూటి ప్రశ్న
    వరంగల్ ప్రచారానికి బాబు ఎందుకు వెళ్ళడం లేదు అని చర్చ ఎందుకు పెట్టరు?
    ప్రచారానికి రమ్మని తెలంగాణా TDP నాయకులు అడిగితె నేను రాను ,కెసిఆర్ తో మంచిగా ఉండండి అని చెప్పినట్టుగా అన్నిఇంగ్లీష్ పత్రికల్లో వచ్చింది కాని అను కుల మీడియా ఈనాడు జ్యోతి లోమాత్రం వార్త రాదు, ABN, TV9, TV5, NTV, MahaTV, …. లో చర్చ పెట్టరు.

    వోటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ బాబు కెసిఆర్ కాళ్ళు పట్టుకొని నేను ఇక తెలంగాణా లో వేలు పెట్టను, నన్ను వదిలేయ్ అన్న ఒప్పందం లో భాగంగా వెళ్ళడం లేదు కదా !!!

    పైగా జగన్ పోటీ చేయకూడదు, ప్రతిపక్షాల వోట్లు చీలుతాయి అని చర్చ పెడతారు
    ప్రజాస్వామ్యం లో ఒక రాజకీయ పార్టీ పోటీ చేయడం తప్పా? మరి మిగితా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్ధిని పెట్టి YCP మద్దతు అడిగి ఉంటె బాగుండేది కదా!!

    ఏదో విధంగా బాబు తప్పులు కప్పి పుచ్చటం, జగన్ మీద మసిగుడ్డ వేయడం, అది తుడుచుకోనేలోపు ఇంకో మసి గుడ్డ వేయడం ఇదీ అను కుల మీడియా పన్నాగం

    చర్చల్లో కూడా బాబు కులానికే చెందిన వ్యక్తులను మేధావులు అని పేరు పెట్టి పిలవడం వారి చేత సన్నగా కనపడీ కనపడకుండా బాబు భజన చేయించడం ఒక ఎత్తు ,జర్నలిస్టుల్లో కూడా కొంచెం బాబు పట్ల మెత్తగా ఉండే వారిని పిలవడం కమ్మని కుట్ర లో భగంగా జరుగుతున్నవే!!!

    Source: kammas World.

    Telugu TV Channels own and run by Kammas
    1) ETV – Cherukuri Ramoji Rao
    2) Gemini – Akkineni Manohara Prasad (Founder and stake holder)
    3) MAA – (MAA – Music, MAA Movies) Nimmagadda Prasad, Akkineni Nagarjuna (Majority stake holders)
    4) TV9 – Velicheti Ravi Prakash
    5) ETV2 – Cherukuri Ramoji Rao
    6) TV 5 – Bollineni Rajagopala Naidu
    7) NTV – Tummala Narendranath chowdary
    8) Studio N – Jr.NTR (Narne Srinivasa Rao)
    9) Mahaa TV – Inaganti Venkatarao now taken over by Sujana Chowdary
    10) I News – Tummala Narendra and Sabbineni Surendra (sold to Kiran Kumar Reddy)
    11) ABN Andhra Jyothi – Radhakrishna Vemuri
    12) Bhakti – Tummala Narendranath Chowdary
    13) Vanitha – Tummala Narendranath Chowdary
    14) ATV – Anil Sunkara
    15) CVR News – Chalasani Venkateswara Rao
    16) CVR Health – Chalasani Venkateswara Rao
    17) Om TV – Chalasani Venkateswara Rao
    18) TV6 – Nara Lokesh
    19) YTV – Yalamanchili Venkateswara Rao (Aired from Vizag)
    20) Express TV – Chigurupati Jairam
    21) 10 TV – Fundeded by CPM workers and promoted by Tammineni Veerabhadram
    22) Captain TV (Tamil) – Lingutla Kannaiah Sudhish (LK Sudhish)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s