– రాష్ట్రంలో ‘రహస్య’ పాలన
– పదిహేడు నెలల్లో 845 కాన్ఫిడెన్షియల్ జీవోలు
– సిఎం పర్యవేక్షణలోని జిఎడి టాప్
– తర్వాత రెవెన్యూ, హోం, ఫైనాన్స్ తదితరాలు
– పారదర్శకతకు పాతర
– బాక్సైట్ నేపథ్యంలో చర్చ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌లో ‘రహస్య’ పాలన సాగుతోంది. పారదర్శకంగా ఉండాల్సిన సర్కారు ఉత్తర్వులు ‘రహస్య’ జాబితాలో చేరి పోతున్నాయి. ప్రభుత్వ సమాచారం, జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆన్లైన్లో జీవోలు పెట్టాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. కొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి జారీ చేశామంటున్న జీవోల పక్కన ‘కాన్ఫిడెన్షియల్’ అని కనబడుతుంది. ఫైల్‌పై క్లిక్ చేస్తే తెల్లగా ఉంటుంది తప్ప వివరాలుండవు. జీవో నెంబర్, జారీ చేసిన తేదీ మాత్రం ఉంటుంది. పారదర్శకతకు మారు పేరుగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తనకు సాటి రాగలవారెవరూ లేరని తరుచు ప్రకటించే చంద్రబాబు సర్కారులోనే ‘కాన్ఫిడెన్షియల్’ జీవోలు పెద్ద సంఖ్యలో వెలువడుతున్నాయి. గవర్నమెంట్ ఆర్డర్ల దాపరికంపై అనుమానాలు రేకేత్తు తున్నాయి. చాటు మాటున ప్రభుత్వ వ్యవహారాలు చక్కబెట్టేందుకే పారదర్శకతకు పాతరేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం సర్కారు ఎపిలో అధికారంలోకొచ్చిన 2014 జూన్ 2 నుండి 2015 నవంబర్ 18 సాయంత్రం ఐదు గంటల మధ్య మొత్తంగా 31,477 జీవోలు జారీ కాగా వాటిలో 845 కాన్ఫిడెన్షియల్. సుమారు పదిహేడు మాసాల పాలనలో వందల సంఖ్యలో ‘రహస్య’ జీవోలొచ్చాయి.
సచివాలయంలో జీవోలు వెలువరిస్తున్న మొత్తం ప్రభుత్వ విభాగాలు 39 కాగా అందులో 14 శాఖల నుంచి కాన్ఫిడెన్షియల్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అత్యధిక రహస్య జీవోలిస్తున్నది సాధారణ పరిపాలన శాఖ (జిఎడి). ఆ శాఖ ఇప్పటి వరకు 552 కాన్ఫిడెన్షియల్ జీవోలిచ్చి అగ్ర స్థానంలో ఉంది. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ఇటీవల వెలువరించిన జీవోపై గిరిజనులతో పాటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచే కాకుండా స్వపక్షం నుంచీ నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. వెనక్కు తగ్గిన ముఖ్యమంత్రి ఆ జీవో తనకు, సంబంధిత మంత్రికి తెలీకుండా వచ్చిందన్నారు. కొంత మంది మంత్రులు సైతం సిఎం పాటకు పల్లవి పాడారు. అధికారులే జీవో ఇచ్చేశారని చేతులు దులుపుకున్నారు. కాగా ‘రహస్య’ జీవోలివ్వడంలో మొదటి స్థానంలో ఉన్న జిఎడి స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే ఉంటుంది. చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న విభాగం నుంచే ఇబ్బడిముబ్బడిగా కాన్షిడెన్షియల్ జీవోలు వస్తున్నాయి. జిఎడి తర్వాత రెండో స్థానంలో రెవెన్యూ శాఖ ఉంది. ఆ విభాగం నుంచి ఇప్పటి వరకు 104 ‘రహస్య’ ఉత్తర్వులొచ్చాయి. రెవెన్యూలో అవినీతి, అలసత్వం పెరిగిపోయిందని, ప్రక్షాళన చేయాలని సిఎం చెబుతున్నారు. కాన్ఫిడెన్షియల్ జీవోలివ్వడంలో రెవెన్యూ కంటే సిఎం పర్యవేక్షణలోని జిఎడి ఎంతో ముందుంది. వరుసగా హోం, ఆర్థిక, వ్యవసాయ, పంచాయితీరాజ్ శాఖలు రెండంకెల్లో ‘రహస్య’ ఆర్డర్లు ఇచ్చాయి
http://www.prajasakti.com/Content/1715664
Kula …..Mathalaku athitham ga ….
Alupergani…….Praja poratam .
The Fight against all odds to restore human, ethical & democratic values ..
Only some Brave Hearts can do it.
మోహన్ బాబు చంద్రబాబు ఇద్దరూ చిత్తూర్ నాయుల్లె!!!
బాబును పిలవని నితీష్, తన మనుషుల ద్వారా ప్రయత్నించినా ఫలితం లేదు
(నాకు CM తెలుసు గవర్నర్ తెలుసు-మోహన్ బాబు డైలాగ్
సినిమా చివర్లో మోహన్ బాబు అను అరెస్ట్ చేయడానికి పోలీస్ వస్తే మోహన్ బాబు అసిస్టెంట్ అంటాడు “సర్ మీకు CM, గవర్నర్ తెలుసు కదా వాళ్ళకు ఫోన్ చేసి అరెస్ట్ నుంచి తప్పించుకోండి” అని అంటాడు
మోహన్ బాబు అంటాడు నాకు వాళ్ళు తెలుసు కాని వాళ్లకు నేను తెలీదు అని)
నేను బిల్ గేట్స్ ను తెచ్చా, బిల్ క్లింటన్ ను తెచ్చా-బాబు
మరి ఇండియా వచ్చిన ఒబామా ఎందుకు కలువలేదు? నితీష్ ఎందుకు పిలవలేదు? నో సౌండ్ ప్లీజ్!
మోహన్ బాబు చంద్రబాబు ఇద్దరూ చిత్తూర్ నాయుల్లె కదా !!!
అది నోరా రమేష్ !!!
ఇక్కడ వరదలు వస్తే జగన్ వరంగల్ లో ఏమి చేస్తున్నాడు? TDP MP CM రమేష్
పాపం మీకు ఈ మద్య కెసిఆర్ మీద లవ్ పెరిగింది(వోటు కు కోట్లు ఎఫెక్ట్)
ఇంతకుముందు AP లో జగన్ పర్యటిస్తే ఎక్కడ శవాలు దొరుకుతాయా అక్కడ వాలి పొదామా అని జగన్ చూస్తుంటాడు అని అన్నది కూడా TDP పార్టీనే. ఇప్పుడు రాలేదు అనేది కూడా TDP నే.
రేపో ఎల్లుండో వరద ప్రాంతాల్లో పర్యతిస్తాను అని జగన్ ప్రకటించాక కూడా ఇలా అంటున్నారంటే ఏమి అనికోవాలి ?
తెలుగు డ్రామా పార్టీ లో అంతా నటులే.
నాకంటే గొప్ప నటుడు బాబు అని ఎన్టీఆర్ ఊరికే అన్నారా?
రేపు వరంగల్ లో ఉప ఎన్నిక-2014 లో వరంగల్ పార్లమెంటు ఫలితాలు
మొత్తం వోటర్లు 15,09,671
వోటింగ్ శాతం 78.54%
TRS మెజారిటీ 3.92 లక్షలు(56.33%)
కాంగ్రెస్ కు వచ్చిన వోట్లు – 22.91%
BJP +TDP కి వచ్చిన వోట్లు -15.93%
సోర్స్-డెక్కన్ క్రానికల్
కెసిఆర్ బాబు మ్యాచ్ ఫిక్సింగ్ కు ఆధారాలు
1.వరంగల్ ఎన్నికలు 4 రోజులు ఉందనగా వెంకయ్య నాయుడు హడావిడిగా AP కి లక్ష 90 వేల ఇల్లు తెలంగాణాకు 10 వేల ఇల్లు కేటాయించాడు.ఇది సహజంగా తెలంగాణా వాళ్ళకు BJP మీద పగ వ్యతిరేకత పెంచుతోంది.అప్పుడు చూస్తూ చూస్తూ BJP కి వోట్లు వేయరు.ఇది కెసిఆర్ కు చేసిన హెల్ప్
4 రోజులాగితే ఎన్నికలు అయిపోతాయి అప్పుడు ఇవ్వచ్చుగా ఈ ఇల్లు?
2.వరంగల్ లో BJP అభ్యర్ధి పోటీ చేస్తున్నా వెంకయ్య నాయుడు ప్రచారానికి వెళ్ళలేదు వెళితే కెసిఆర్ ను తిట్టాలి.అలాగే బాబు కూడా వరంగల్ ప్రచారానికి వెలలేదు, పైగా కెసిఆర్ ను ఏమీ అనవద్దు అని బాబు TDP నాయకులకు చెప్పాడని అన్ని ఇంగ్లీష్ పతికల్లో వచ్చింది కూడా.
3.మొన్న వరంగల్ మీటింగ్ లో కెసిఆర్ జైపాల్ రెడ్డి, జానా రెడ్డి, కిషన రెడ్డి లను తిట్టాడు కాని బాబు ను పల్లెత్తు మాట అనలేదు
4.అసలు వోటుకు కోట్లు కేసు ఏమయింది ఒక చిన్న మాట కూడా వినపడటం లేదు, ఇంత పబ్లిక్కా ఆడియో వీడియో లతో బాబు దొరికినా కెసిఆర్ ఎందుకు వదిలేసాడు?
రామోజీ, వెంకయ్య నాయుడు ,కేంద్రం కలిసి కేసును వదిలేయమని చెప్పింది కెసిఆర్ కు ప్రతిగా బాబు విజయవాడ వెళ్ళిపోతాడు తెలంగాణా లో వేలు పెట్టడు అనేది డీల్!!!
అందుకే బాబు అను ‘కుల’ మీడియా ABN, TV9, TV5, NTV, MahaTV, 6TV, ExpressTV,.. పొరపాటున కూడా బాబు వరంగల్ ఎందుకు వెళ్ళలేదు అని చర్చ పెట్టరు ,పైగా జగన్ వరంగల్ లో ఎందుకు పోటీ చేస్తున్నాడు అని చర్చ పెడతాయి ?
ఒక రాజకీయ పార్టీ పోటీ చేయకపోతే తప్పుకాని పోటీ చేస్తే తప్పేంటి? ?
దొంగే దొంగా దొంగా అని అరవడం అంటే ఇదే !!!